పుట:హరవిలాసము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

పీఠిక

టచేఁ బ్రతిమనుజునకుఁ దొలుదొలుత సామాన్యముగా వానియందుఁ బవృత్తిగలుగుట దుర్లభము. కాఁబట్టియే ప్రాచీనులగుమహర్షులసంప్రదాయము నెఱింగినవారు గావున నర్వాచీను లగుకాళిదాసాదిమహాకవులు సయితము రామాయణాది కావ్యరత్నంబుల వెలుంగుదివ్యకవితారసంబుఁ గ్రోలిక్రోలి మహానందంబునొందుచుఁ దనివిసనక, యందఱు నిట్టికావ్యానందంబు ననుభవింతురు గాత మని దయాపరవశులై సులభముగ నామహర్షి కృతిరత్నంబుల రసానుభవంబుఁ జేయఁదగిన యోగ్యత నలవఱుచునవియు నించుమించుగఁ బ్రాచీనర్షికృతుల ననుకరించు రఘువంశశాకుంతలకాదంబర్యాదిప్రబంధంబుల లోకోపకారకంబులుగ రచించి కవితారసమాధుర్యం బేకాంతంబున ననుభవించి నిత్యతృప్తహృదయులై కీర్తిశేషు లైరి.

సంస్కృత భాషావిలాస మిట్లుండ సంస్కృతజన్యము లగుకర్ణాట ద్రావిడాది వైకృతదేశభాషలలోపల “దేశభాషలందుఁ దెలుఁగు లెస్స” యను పండిత వచనానుసరణిగ నుత్తమభాష నాఁబడు నాంధ్రభాషయందుఁగూడ ననేకులు నన్నయభట్ట తిక్కనాది మహాకవిసార్వభౌములు కావ్యరత్నంబుల లోకంబున వెలయించి యభిరూపశిఖామణులహృదయంబుల నలరించి కీర్తిశేషులై నెలకొనియున్నారు. కాఁబట్టి యిట్టియాంధ్రభాషాకవుల దివ్యచారిత్రసుధారసమును గ్రోలి యానందానుభవము సేయుట యవశ్యకర్తవ్యమయినందునఁ బ్రకృత మీహరవిలాసప్రబంధనిర్మాత యగుమనశ్రీనాథునిచారిత్రామృత మించుక చవి చూతము.

శ్రీనాథుఁడు

అనవద్యహృద్యకావ్యకల్పనాధురీణుం డగుమహాకవిసార్వభౌమ్యుడు. ఈమహాకవి జన్మస్థానమునుగుఱించి కాశీఖండములో.

సీ. "చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర
    నూనూఁగుమీసాలనూత్నయౌవనమున శాలివాహనసప్తశతి నొడివితి
    సంకరించితి నిండుజవ్వనంబునయందు హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
    భ్రౌడనిర్భరవయఃపరిపాకమునఁ గొని యాడితి భీమనాయకుని మహిమఁ