పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది




గీ॥ జెవులు చిల్లులువోఁ బారసీక యవన
   ఖాండహారిస్పహాను బాగ్దాదు మొగలు
   గజ్నిపతులు మిడుతదండు క్రమ్మినట్లు
   దాడి వెడలిరి తండోప తండములుగ.15
   
గీ॥ ఎనిమిదవ శతాబ్దారంభమునఁ గవీపు
   'వాలీదు' తొలుత ఖాసిముఁబంపె నతఁడు
    సింధుదేశమ్ము దాటి కాశీపురంబు
    వఱకుఁ గలసీమ లన్నియుఁ బాడుచేసె.16
    
మ॥ ఒకబాగ్దాదు నరేంద్రచంద్రుఁడు కలీప్ 'ఓమార్ అబుల్ హాసు సే
    న కధీశున్ బొనరించి హైందవముపైనన్ బంపఁగా దూరమెం
    చకయే యామడ యడ్గుగా నడిచి రాజస్థానమున్ జేరి భూ
    ప కులారణ్యములన్ దహించె నతఁడున్ వైశ్వానరప్రక్రియన్ /ప్రాయుఁడై. 17
    
గీ॥ అతని నజమీరు 'తారాగృహా'ధిపతియు
   దొడరిమడిసె దూలారావు కొడుకుసప్త
    వర్షముల లాటుడరి డరిగూల్చి వానివెంట
    నరిగె నభిమన్యుపై చేయి యన జగంబు
    
  
సీ॥ [1]లాటసింహుఁడు మహోగ్రాటోపనిధియంచు
            నజరామరంబైన యశముఁ గాంచెఁ
    జోహణు లాబాల శూరుని విగ్రహం
            బులు రచింపించి దేవుని విధానఁ
    బ్రతివత్సరము భక్తివఱల జ్యేష్ఠద్వాద
            శీ దినమందుఁ బూజించు చుందు
     రాలాటుఁ డనిచేయు నపుడున్న కాలి గ
            జ్జెల నెల్ల జనులు దర్శించి పోదు;

<poem>

 

గజినీ మహమ్మదు దండయాత్ర


 
ఆ॥ వె॥ రాదినంబు నుండి యీదినంబునకుఁ జో
    హణ కులంబు వారలాత్మజులకుఁ
    గాలి గజ్జియలను గట్టరు లాటుని
    యెడల వారి భక్తి యెట్టి దొక్కొ
       
సీ॥ భాగ్య సౌభాగ్య సంభావ్యముల్ సింధు ఘూ
           ర్జర దేశములను వర్తకముఁబెంప
   ‘టైగ్రిస్' నదీ కృపీట పవిత్రమైన 'య
           రాబియా'పాలించు రాజలోక
    మణి కలీప్ ఉస్మాను మఱి కలీప్ ఆలి యే
           జీదు ఖొరాసాను క్షితిపమౌళి
    యబ్దుల్ మలీకు సైన్య సముద్రములను బొం
           గించి హైందవమును ముంచి తేల్చి

గీ॥ రటుపయిని హరూన్ ఆల్రాశ్చిదను కలీప్ అ
   రాబియా మొదల్ కాశి పర్యంత మేలె
   నవ్వల సెబాక్టజిన్ వచ్చె నతఁడు ప్రళయ
   భైరవుని మహమ్మదుఁ దెచ్చే వానికొడుకు.21
   
మ॥ తడ వింతేనియు లేక వీరభట సంతానంబు తన్గొల్చి వెం
    బడిరా సింధునదీన్ దరించుచు మహమ్మద్ గజ్ని గజ్నీ విభుం
    డడవుల్ గాల్చుచు భస్మమున్ సలుపుదావాగ్నిన్ [2] క్రియన్ బొంగుచున్
    దుడిచెన్ భారత దేశ పట్టణము లందున్ గల్గు సర్వస్వమున్ 22
    
మ॥ కడుసౌభాగ్యము గల్గు రాష్ట్రముల వంకన్ సుంత కన్నెత్తి చూ
    డఁడు బంగారము పండు నేలలను జూడండట్టె పేర్వాసిఁగాం
    

  1. లాటుఁడుత్తమ గుణాలయుఁ డమానుష వీర
                పురుషమూర్తి యని యందఱకుఁదోఁచెఁ -1958 ప్రతిలో ఈ విధముగా నున్నది
  2. బలెన్(1958)