పుట చర్చ:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/46

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఈ ప్రతిలో లేని పద్యములు - 1958 ప్రతిలొ ఉన్నవి:[మార్చు]

మ॥ ప్రళయాంభోధరపంక్తి చందమున గర్జల్ సేసి తచ్ఛైన్యముల్
    దళమై యా యజమీరుపై నడిచె దూలారావు తౌరుష్క యో
    ధులు మూన్నాళ్లు బడల్ పడన్ మెలఁగి శ్రాంతుండై యబుల్హాసు ను
    జ్వల హేతి ప్రహతిన్ దెగెన్ రిపుజనోత్సాహంబు రెట్టింపఁగన్ 18 Ramesam54 (చర్చ) 01:17, 6 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]


సీ॥ తత్పరిసర సైకతస్థలిపైఁదోడి
            బాలురతో నంతవఱకు నాడు
    కొనెడు దూలారావు కొమరుఁ డేడేండ్ల లా
            టుఁడు తండ్రియు శిరంబు డుల్లి ధాత్రి లఁ
    బడుటఁ గన్గొని రక్త ముడుకెత్తి చేరువ
            భటుచేతఁగల పెద్ద బారుటీటె
    గుంజుకొం చరిగె చెంగున దాట్లిడుచు నబుల్
            హాసు గుండియ లవియంగఁదాఁకె
            
గీ॥ నిరువురును బోరి రొండొరు నిచ్చమెచ్చ
   కంత లాటుఁ డరిన్ గూల్చి యతనివెంట
   నరిగె దివికి హితాహితులంద "ఱీతఁ
   డౌర యభిమన్యు పైచేయి" యని నుతింప.19