దివ్యదేశ వైభవ ప్రకాశికా/పౌరాణిక క్షేత్రములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పౌరాణిక క్షేత్రములు

శ్లో. అథ పౌరాణికై ర్గీతా దివ్యదేశా శ్రియ:ఎతే:|యద్వద్రి పూర్వా వర్ణ్యంతే యతీశ్వర కటాక్షత:|

1. బృన్దావనమ్‌

శ్లో. శ్రీ వత్సాప హరాఖ్య తీర్థ రుచిరే బృందావనాఖ్యే పురే
   రాధా వల్లభ నాయకో విజయతే రాధా రమా సంయుత:|
   రాధాయా నయన ద్వయా తిథి వపు: ప్రాగాస్య సంస్థానగో
   దివ్యై ర్మంగళ చేష్టితై ర్గుణ గణై రామోద ముత్పాదయన్||

వివ: రాధా వల్లభ పెరుమాళ్; రాధాదేవి; వత్సాపహార తీర్థము; యమునా నది; తూర్పు తిరిముఖ మండలము; నిన్ఱతిరుక్కోలము;రాధాదేవికి ప్రత్యక్షము. ఈ సన్నిధి కాళీయ మర్దన ఘట్టమునకు సమీపమున గలదు.

విశే: శ్రీకృష్ణ భగవానుడు యాదవ ప్రముఖులతో నివసించిన ప్రదేశము బృందావనము. ఇచట ప్రధానముగా సేవింపదగినవి యమునానదీ తీరమున గల ముప్పది రెండు స్నానఘట్టములు; కాళీయమడుగు; కదంబ వృక్షము; వస్త్రాపహార ఘట్టము అతిసుందరముగా మలచబడిన క్షీరఘాట్; కేశఘాట్; బిలవవనము(లక్ష్మీనిలయం) రాధా నివాసమైన మధువనము.

ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్య స్వామి వారిచే నిర్మింపబడిన శ్రీరంగమందిరము కలదు. ఇది శ్రీరంగమువలె సప్త ప్రాకారములతో దాక్షిణాత్య సంప్రదాయమున పాంచరాత్రగ మోక్త ప్రకారముగా నిర్వహింపబడు చున్నధి. ఇచట సేవార్థులకు సర్వసౌకర్యములు కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును.

ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు గోపాలవింశతిని అనుగ్రహించిరి.

పా. పట్టిమేయ్‌న్దోర్ కారేఱు; పలదేవఱ్కోర్ క్కీழ்కన్ఱాయ్;
   ఇట్టీరిట్టు విళైయాడు; యిజ్గేపోదక్కణ్డీరే?|;
   ఇట్టమాన పశుక్కళై; యినిదుమఱిత్తు నీరూట్టి;
   విట్టుక్కొణ్డు విళైయాడు విరున్దావనత్తే కణ్డోమే.

పా. మాదవ నెన్ మణియినై వలైయిల్ పిழைత్త పన్ఱిపోల్
   ఏదుమొన్ఱుం కొళత్తారా వీశన్ఱన్నై క్కణ్డీరే!
   పీదగవాడై యుడై తాழ ప్పెరుజ్గూర్ మేగక్కన్ఱేపోల్
   వీదియార వరువానై విరున్దావనత్తే కణ్డోమే!!.
         ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 14-1,5

                   143 

2. శ్రీ ముష్ణమ్‌

శ్లో. శ్రీ ముష్ణే పురి నిత్యపుష్కరిణికా సంశోభితే వామనం
   వైమానం సమధిశ్రితోంబు జలతా వాధోంబు రాద్ది జ్ముఖ:|
   శ్రీమాసాది వరాహనామ విదితో హ్యశ్వత్థనారాయణ:
   ప్రత్యక్షో భువి రాజతే నవరతం సత్సజ్గ కల్పద్రుమ:||

వివ: ఆది వరాహపెరుమాళ్-అంబుజవల్లి నాచ్చియార్; వామన(వేద)విమానము; నిత్యపుష్కరిణి; తూర్పు తిరుముఖ మండము; నిలచున్నసేవ; అశ్వత్థ నారాయణునకు ప్రత్యక్షము.

ఇది అష్టస్వయంవ్యక్త క్షేత్రములలో నొకటి. ఉత్సవరులకు యజ్ఞ వరాహన్ అనిపేరు. హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని యుద్ధరించి అర్చామూర్తిగా అవతరించుటచే ఆదివరాహమనిపేరు. ఇచట తాయార్లకు చెలికత్తెలుగా నలుగురు కన్యలుగలరు.

కమఠన్, ఠుల్లికా; సుద్యుమ్న; భూదేవి, సుధర్ములకు ప్రత్యక్షము.

మార్గము:- చిదంబరం నుండి 25 కి.మీ. వృద్ధాచలం నుండి కూడ బస్ వసతి కలదు.

DivyaDesaPrakasika.djvu

భూ వరాహస్వామి

BHOORAHA SWAMY

3. పాప వినాశనమ్‌

శ్లో. శ్రీ మత్పాప వినాశ నామని పురే శ్రీ పుండరీ కాఖ్య స
   త్తీర్థే పాప వినాశ మధ్య నిలయ: ప్రాచీముఖ స్సంస్థిత:|
   ప్రత్యక్షో జయ చోళనామ సృపతే శ్శ్రీ పాపనాశ ప్రభు
   ర్దేవ్యా పంకజ వల్లికాహ్వయ యుజా సంశోభితే సంతత:||

విశే: పాపవినాశ పెరుమాళ్; పంకజవల్లి తాయార్; పాపవినాశ విమానము; పుండరీక పుష్కరిణి; తూర్పుముఖ మండలము; నిలచున్నసేవ; జయచోళునకు ప్రత్యక్షము.

మార్గము: ఈ క్షేత్రము తంజావూరునకు 24 కి.మీ. దూరమున గలదు. సమస్త సౌకర్యములు గలవు. కుంభకోణము నుండి టౌన్‌బస్ కలదు. ఈ క్షేత్రమునకు 3 కి.మీ. దూరమున కపిస్థలమను దివ్యదేశము కలదు.


మంచిమాట

భగవంతునకు భక్తునకు మధ్య భేదము చూపరాదు. భాగవతోత్తముల యందు భగవదనుగ్రహము కలదని భావింపవలెను. భగవంతుని శ్రీపాదములను ఆశ్రయించినట్లుగనే భక్తులను కూడా ఆశ్రయింపవలెను. వారివద్ద తీర్థ స్వీకారము చేయునపుడు తమ ఆచార్యులను స్మరింపవలెను. తాను ఇతరులకు తీర్థమును ప్రసాదించునపుడు తమ ఆచార్యుని స్మరించుచు ద్వయమంత్రాను సంధానము చేయవలెను. ఇట్లుచేయుట తీర్థమిచ్చువారికిని తీసుకొనువారికిని స్వరూపానురూపమై యుండును. ఈ విధముగా కాక అర్ధ కామ పరవశులైనచో స్వరూపహాని సంభవించును.

"యామునమునులు"

145

4. తిరునారాయణపురమ్‌ (మేల్‌కోట్టై)

శ్లో. కల్యాణీ సరసా పరాశర దనుష్కోట్యాఖ్య వై కుంఠకై:
   తీర్థె: యాదవ లోకపావన ముఖై: పుణ్యై స్సదా శోభితే
   శ్రీమద్యాదన భూదరేంద్ర శిఖరే నారాయణాఖ్యే పురే
   శ్రీనారాయణ నామకో విజయతే సంపత్కుమారో హరి:||

   యదుగిరి పదపూర్వాం నాయకీ మీక్ష మాణ:
   స్థితియుగృ భుదిగా స్యో వంత వైమాన మాప్త:|
   మణిమకుట నిమిత్తం పక్షిరాజాక్షి సేవ్యో
   యతిపతి కరుణాత్తో రక్షితో రాజరాజ:||

వివ: తిరునారాయణన్-ఉత్సవరులకు శెల్వప్పిళ్లై, సంపత్కుమారన్, శ్రీరామప్రియర్ అను తిరునామములు కలవు. తాయార్ యదుగిరి నాచ్చియార్ పెరుమాళ్ల శ్రీపాదములలో భూదేవి వేంచేసి యున్నారు.

కల్యాణి, వైకుంఠ, పరాశర, మైత్రేయ, ధనుష్కోటి, యాదవ, లోకపావన పాండవ తీర్థములు. తూర్పుముఖ మండలము; నిలచున్నసేవ; వేదపుష్కరిణి, శ్రీరామతీర్థము, నారాయణ తీర్థము, గరుత్మంతునకు వైరముడి నిమిత్తము ప్రత్యక్షము. ప్రతినిత్యము అనుసంధానముచేయు శ్రీరంగాది క్షేత్రములలో తిరునారాయణపురము నాల్గవది. ఈక్షేత్రమునకు జ్ఞానమండపమనిపేరు.

విశే: కృతయుగమున సనత్కుమారులు సత్యలోకమునుండి ఆనందమయ విమానముతో తీసికొనివచ్చి ఇచ్చట శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠించుటచే నీక్షేత్రమునకు నారాయణాద్రియని పేరు. త్రేతాయుగమున దత్తాత్రేయుడు నల్గురు వేదపురుషులతో వేద పుష్కరిణి సమీపమున సదా వేదాద్యయనము చేయుటచే వేదాద్రియనియు, ద్వాపరయుగమున నమ్బిమూత్తపిరాన్ అనువారు; యదు శేఖరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆరాదించుటచే యాదవాద్రి యనియు; కలియుగమున యతి శేఖరులైన భగవద్రామానుజులు వేంచేసి జీర్ణోద్దారణ చేయుటచే "యతిశైల" మనియు పేరువచ్చెను. దక్షిణ బదరికాశ్రమమనియు తిరునామము కలదు.

భగవద్రామానుజులు చోళోపద్రవకాలమున ఈక్షేత్రమునకు వేంచేసి ఈ ప్రాంతమును పాలించుచున్న రాజును కటాక్షించి వానికి విష్ణువర్థనుడని దాస్యనామముంచిరి. మరియు భూమియందు నిక్షిప్తమై యున్న ఈ క్షేత్రమును స్వామి ఆజ్ఞ ప్రకారము పునరుద్ధరణగావించిరి. ఇచట వేంచేసియున్న ఉత్సవమూర్తి ఆనాడు డిల్లీ పాదుషా అంత:పురము నందుండుటచే భగవద్రామానుజులు డిల్లీచేరి పాదుషాచే

146
DivyaDesaPrakasika.djvu

తిరునారాయణన్-తిరునారాయణపురం.

Tirunarayanana-Melkottai.

యాదుగిరి నాచ్చియార్-తిరునారాయణపురం.

yadugiri naachiyaar-Melkottai.
DivyaDesaPrakasika.djvu

రాజగోపాలన్-మన్నార్‌గుడి.

Rajagopalan-mannargudi

రాజగోపాలన్-కాట్టుమన్నార్‌కోయిల్.

Rajagopalan-kattumannar koil సత్కతులై అంత:పురమందలి శ్రీరామప్రియలను సేవింపగానే వారు ఆశ్రిత వాత్సల్యముతో వచ్చి ఉడయవరుల ఒడిలో కూర్చుండ ఉడయవరులు ఆనందముతో "ఎన్నుడైయ శెల్వప్పిళ్ళయో" ఆని పలుకుటచే తదాదిగా వారికి శెల్వపిళ్ళైయను తిరునామమేర్పడినది.

స్వామి యెంబెరుమానారులు తిరువాయిమొழிని పెంచిన తల్లియగుటచే నాల్గవ దశకమున మొదటి తిరువాయిమొழிయగు "ఒరునాయకమాయ్" అను దశకమును ఈక్షేత్రస్వామి విషయముగా సమర్పించిరి.

పెరుమాళ్ళ ఆజ్ఞచే గరుడాల్వారు శ్వేతదీపమందలి "మృత్తికను" తీసుకొనివచ్చి ఈ క్షేత్రమునందుంచుటచే నిచటి తిరుమణి ప్రభావ సంపన్నమైనది. ఇచట ఉడయవరులు పండ్రెండు సంవత్సరములు వేంచేసియుండిరి. ఆకాలముననే వారి తిరుమేని(అర్చా విగ్రహమును) భక్తులు ప్రతిష్టించిరి.

ఇచటి కొండమీద నరసింహస్వామి, ఉడయవర్, వేదాన్త దేశికులు సన్నిధులు గలవు. శ్రీపరాశర భట్టారకుల శిష్యులగు నంజీయరు అనువారు ఇచటనే అవతరించిరి.

మార్గము: బెంగుళూరునకు 60 కి.మీ. మేల్కొట్టె యనియే చెప్పాలి.

శ్లో. ఆరుహ్యామల యాదవాద్రి శిఖరం కల్యాణ తీర్థే తత:
   స్నాత్వా లక్ష్మణయోగిన: పదయుగం సత్వాతు గత్వాతత:
   శ్రీనారాయణ మేత్య తత్ర ధరణీ పద్మాలయా మధ్యగం
   వశ్యేయం యది కిన్త స:ఫల మతస్సంపత్కుమారం హరిమ్‌||

పా. ఒరునాయకమా యోడ పులగుడవాణ్డవర్
   కరువాయ్ కవర్‌న్ద కాలర్ శిదైగియ పావైయర్
   పెరునాడుకాణ విమ్మైయిలే పిచ్చైత్తామ్‌ కొళ్వర్
   తిరువారణన్ఱాళ్ కాలమ్బెఱ చ్చిన్దిత్తుయ్‌మినో
         నమ్మాళ్వార్లు-తిరువాయిమొழி 4-1-1


మంచిమాట

ఎంబెరుమాన్ తాకితొழுవార్ ఎప్పొழுదుమ్‌ ఎన్‌మనత్తే ఇఱిక్కిన్ఱారే

"శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరించువారు ఎల్లప్పుడు నామనస్సులో నిలచియుందురు". అను తిరుమంగై యాళ్వార్ల శ్రీ సూక్తిని మరువక స్మరింపుడు. భాగవత అభిమానమే ఉత్తారకము.

"ఆళవందారులు"

147

5. రాజమన్నార్ కోయిల్

శ్లో. దివ్యే హరిద్రాఖ్య తరంగవత్యా:
   స్థితేతుమన్నార్ నగరే ప్రతీరే
   శ్రీ శంఖ చక్రాఖ్య గజేంద్ర కృష్ణ
   ముఖైస్సు తీర్థే రపి శోభమానే||

   రమ్యాబ్జవల్లీ ప్రియయాసమేత:
   ప్రాచీముఖో గోబిల యోగిదృష్ట:
   శ్రీరాజగోపాల విభు స్స్వయంభూ
   వైమాన సంస్థానయుతో విభాతి||

వివ:- రాజగోపాలన్-రమ్యాబ్జ(హేమాబ్జ)వల్లితాయార్-హరిద్రానది-స్వయంభూ విమానము-శంఖ, చక్ర, గజేంద్ర, కృష్ణ మున్నగు తీర్థములు-తూర్పుముఖము-నిలచున్నసేవ-గోబిలమునికి ప్రత్యక్షము.

విశే:- ఈ క్షేత్రమునకు చంపకారణ్యక్షేత్రమనిపేరు. ఈ సన్నిధి శ్రీరంగమువలె ఏడు ప్రాకారములతో విలసిల్లు చున్నది. రాజగోపాలస్వామి ముగ్థమనోహరులై సేవించువారి హృదయములను అపహరింతురు. మూలవరులకు "వాసుదేవర్" అని తిరునామము. గోప్రళయమహర్షికి స్వామితన(కృష్ణ) లీలలను ఇచట అనుగ్రహించి నందున ఈ క్షేత్రమునకు దక్షిణద్వారకయని పేరువచ్చెను. మీనం మాసమున 18 రోజులు బ్రహ్మోత్సవం జరుగును. మిధునమాసములో 10 దినములు తెప్ప ఉత్సవము జరుగును.

మార్గము:- తంజావూరుకు 35 కి.మీ. కుంభకోణం నుండియు పోవచ్చును. ఈక్షేత్ర సమీపమున వడువూర్ అనుక్షేత్రము తప్పక సేవింపవలెను.

పా. ఉన్నిత్తు మత్‌తొరు తెయ్‌వ; వొழாళవనై యల్లాల్;
   మమ్మిచ్చై శొల్లి; మమ్‌తోళ్ కులైక్కప్పడు మన్నైమీర్;
   మన్నప్పడు మఱై వాణనై, వణ్డువరావతి
   మన్నవై, ఏత్తుమినేత్తుదలుమ్‌ తొழுదాడుమే|
          తిరువాయిమొழி 4-6-10

148

6. కాట్టుమన్నార్ కోయిల్

శ్లో. వేదపుష్కరిణీ తీరే విమానే పుణ్యనామకే
   వీరనారాయణోభాతి మన్యక్షేత్రే శ్రియాసహ||

వివ: వీరనారాయణప్పెరుమాళ్-మరకతవల్లి తాయార్-శెంగమలవల్లి తాయార్-వేదపుష్కరిణి-పుణ్యవిమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-కావేరినది-మతంగ మహర్షికి ప్రత్యక్షము-శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులగు శ్రీమన్నాథమునులు-ఆళవన్దారులు అవతరించిన స్థలము.

విశే: ఈక్షేత్రమునకు కాట్టుమన్నార్ కోయిల్ అనియు మన్యు క్షేత్రమనియు నామాంతరములు కలవు. వీరనారాయణప్పెరుమాళ్ వేంచేసియుండుటచే వీరనారాయణపురమనియు, మన్ననార్ (రాజగోపాలన్) వేంచేసియుండుటచే మన్నార్‌కోయిల్ అనియు పేర్లు కలవు. కాట్టుమ్ అనగా "చూపించునది" అని అర్థము. నమ్మాళ్వార్‌లయొక్క సంప్రదాయమును చూపుటచే కాట్టుమన్నార్ కోయిల్ అనిపేరువచ్చెను.

శ్రీమన్నాథమునులు ఆళ్వార్‌తిరునగరిలో నమ్మాళ్వార్‌లను సాక్షాత్కరింప చేసుకొని నాలాయిర దివ్య ప్రబంధమును పొందిరి. మన్ననార్ స్వామి నాథమునులకు స్వప్నమున సాక్షాత్కరించి దివ్యప్రబంధమును తమ సన్నిధిలో అనుసంధింపుడనికోరిరి. ఆళ్వార్‌లును, నాథమునులను అట్లే ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞా ప్రకారము నాథమునులు కాట్టుమన్నార్ కోయిల్‌కు వేంచేసి దివ్యప్రబంధమును విన్నవించిరి. ఈ విధముగా నాలాయిర దివ్య ప్రబంధము మొట్టమొదట ఈసన్నిధిలోనే అనుసంధానము చేయబడినది.

తిరునెడుందాండగం ప్రబంధములోని పొన్నానాయ్ అనుపాశురములోని కుణపాల మదయానాయ్ అనుదానిని పెరియవాచ్చాన్‌పిళ్లై గారు ఈ క్షేత్రస్వామి విషయముగా వ్యాఖ్యానించిరి.

మార్గము: విరుదాచలం నుండి, చిదంబరం నుండి 25 కి.మీ.

పొన్నానాయ్ పొழிలేழுమ్‌ కావల్‌పూణ్డ,
      పుగழாనాయిగழ் వాయతొణ్డనేన్ నాన్;
ఎన్నానాయెన్నావా యెన్నిలల్లాల్
      ఎన్ఱఱివనే ழைయేన్, ఉలగమేత్తుమ్‌
తెన్నానాయ్ వడవానాయ్ కుడపాలానాయ్
     కుణపాల మదయానాయ్ ఇమై యెఱ్కెన్ఱుమ్‌
మున్నానాయ్; పిన్నానార్ వణ్జ్గుమ్‌శోది
     తిరుమూழிక్కళత్తానాయ్ ముదలానాయే
            తిరునెడున్దాణ్డగమ్‌-10

149

7. శ్రీ పెరుంబూదూరు

శ్లో. శ్రీ రామానుజ నామ పుష్కరిణికా తీరేస్థిత:ప్రాజ్ముఖ
   శ్శ్రీమద్భూతపురే యతీంద్ర కరుణా సంధుక్షిత శ్రీయుతే|
   నాయక్యా యతిరాజ వల్ల్యభిదయా శ్రీ కేశవార్యేక్షితో
   నిత్యం రాజతి చాదికేశవ విభు శ్శ్రీవైష్ణవేష్ట ప్రద:||

వివ: ఆదికేశవప్పెరుమాళ్-యతిరాజనాథవల్లి తాయార్-శ్రీరామానుజ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-భగవద్రామానుజులు అర్చారూపముగా తానభిమానించి వేంచేసిన దివ్యదేశము. శ్రీ కేశవార్యులకు ప్రత్యక్షము-భూతపురియను ప్రసిద్ధ తిరునామము.

విశే: విశిష్టాద్వైత సిద్ధాన్త ప్రవర్తకులగు భగవద్రామానుజులవారు అవతరించిన దివ్యదేశము - వారు అభిమానించి అనుగ్రహించిన అర్చామూర్తిని వారి అవతార కాలముననే సన్నిధిలో ప్రతిష్టించిరి. పూర్వాచార్యులందరు అభిమానించి సేవించిన దివ్యదేశము. ఇచట వేంచేసియున్న ఆదికేశవ ప్పెరుమాళ్ వరప్రసాది. వారి కటాక్షము వలన ఆ సూరికేశవాచార్యులు కాంతిమతీ దంపతులకు భగవద్రామానుజులు అవతరించిరి. శ్రీవైష్ణవులు తప్పక సేవింపవలసిన దివ్యదేశము.

మార్గము: మద్రాసు నుండి బెంగుళూరు పోవుమార్గములో మద్రాసు నుండి 30 కి.మీ.

పా. కేశవన్ తమర్ కీழ் మేలెమ రేழெழுపిఱప్పుమ్‌
   మాశదిరు పెత్‌త్తు వమ్ముడైయ వాழ்వు వాయ్‌క్కిన్ఱవా
   ఈశనెన్ కరుమాణిక్క మెన్ శెజ్కోలక్కణ్ణన్ విణ్ణోర్
   నాయకన్ ఎమ్బిరానెమ్మాన్ నారాయణనాలే.
           నమ్మాళ్వారు తిరువాయిమొழி 2-7-1

   పూమన్ఱు మాదుపొరున్దియమార్‌వన్; పుగழ்మలిన్ద
   పామన్ను మాఱనడిపణిన్దుయ్‌న్దవన్; పల్ కలై యోర్
   తామ్‌ మన్న వన్ద యిరామానుశన్ శరణారవిన్దమ్‌,
   నామ్‌మన్నివాழ, నెంజే! శొల్లువోం అవన్నా మజ్గళే
           ఇరామానుశమాత్ తన్దాది - 1

150
DivyaDesaPrakasika.djvu

ఆదికేశవ ప్పెరుమాళ్-శ్రీ పెరుంబూదూరు.

Adhikesavar-Sriperubudur.

ఏరికాత్తరామన్-మధురాంతకం.

Erikatta Raman-Madhurantakam.
DivyaDesaPrakasika.djvu

7. రామర్-వడవూర్-.

Ramar-vadavur.

8. ఆదికేశవర్-మయూరపురి.

Adhikaesavar-mayurapuri.

నిగమన శ్లోకాః

జయతు జయతు తుంగం మంగళం రంగ మస్మ
త్కుల ధన మథజీయాత్ రంగనాథాంఘ్రి యుగ్మమ్‌
శఠరిపు యతిరాజౌ సామ్యాజామాతృ యోగి
ప్రవర శుభ గుణాడ్యా స్సంతతం తేజయంతు ||

శుభగుణ పరివార: శేషదివ్యావతార:
సరస ఫణితిధార: కామకోపాలిదూర:
శ్రుతిపరిచితచార: కాంతిమత్యా: కుమార:
కలిబలవినికారస్సోవతాత్ భాష్యకార:||

ఆత్రేయాభిద వంశమౌక్తిక మణే: రామానుజార్యాద్గురో:
జాతస్తత్పదపద్మ సంశ్రయణలో లబ్దాత్మబోధోదయ:|
శ్రీ రామానుజ యోగిరాజ కరుణా సంవీక్షణా త్సన్ముదే
ప్రాతానీదితి దివ్యదేశ విభవం గోపాలకృష్ణ: కవి:||

-దివ్యదేశ వైభవ ప్రకాశికా సంపూర్ణా-

151

అభిమాన దివ్య స్థలములు

మధురాన్తకమ్‌ - 1

కరుణాకరప్పెరుమాళ్(ఏరికాత్తరామన్)-జనకజవల్లి త్తాయార్-తూర్పు ముఖము-నిలచున్నసేవ-పెరియనంబిగారు(మహాపూర్ణులు) భగవద్రామానుజులకు పంచ సంస్కారములు గావించిన ప్రదేశము. విశే: ఈ ఊరిలోని పెద్దచెఱువు పొంగివచ్చుచుండగా స్వామి రామలక్ష్మణులుగా కావలి కాయుటచే స్వామికి ఏరికాత్తరామన్ అనిపేరు వచ్చెను. మార్గము: మద్రాసు విళ్లుపురమ్‌ బస్, రైలు మార్గం చెంగల్పట్టు నుండి విళ్లుపురం మార్గంలో సుమారు 25 కి.మీ.

కురుగైక్కవలప్పన్ సన్నిధి - 2

శ్రీమన్నాథమునుల శిష్యులగు కురుగై క్కావలప్పన్ అవతరించిన స్థలము. వీరు యోగనిష్ఠులగుటచే యోగ దశలో పెరుమాళ్లను సేవించెడివారు. నాథమునుల నుండి యోగరహస్యములను గ్రహించిరి. వానిని యామునమునులకు ఉపదేశింప నియమనము పొందిరి. కానీ కారణాంతరముల వలన యామునులు ఆ రహస్యములును పొందలేకపోయిరి. మార్గము: శ్రీముష్ణమునకు 12 కి.మీ.

గుణశీలమ్‌ - 3

శ్రీనివాస పెరుమాళ్-పద్మావతీ దేవిత్తాయార్-నిలచున్నసేవ-తూర్పుముఖము-ఈస్వామి వరప్రసాది. తిరుమలలో వలెనే ఇచటను జనసందోహము మెండుగా కలదు. మార్గము: శ్రీరంగము నుండి పోయి సేవింపవచ్చును. 25 కి.మీ.

మణ్ణంగుడి - 4

ఇది తొండరడిప్పొడి యాళ్వార్ల అవతార స్థలము. కుంభకోణము నుండి పోయి సేవింపవచ్చును.

వడువూర్ - 5

కోదండరామస్వామి-జనకజవల్లి తాయార్-నిన్నతిరుక్కోలము-తూర్పుముఖము-ఇచటస్వామి "పుంసాంమోహనరూపాయ" అనునట్లు వేంచేసి యుందురు. మార్గము: రాజమన్నార్ గుడి నుండి 10 కి.మీ.

                          152