Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/అభిమాన దివ్య స్థలములు

వికీసోర్స్ నుండి

అభిమాన దివ్య స్థలములు

మధురాన్తకమ్‌ - 1

కరుణాకరప్పెరుమాళ్(ఏరికాత్తరామన్)-జనకజవల్లి త్తాయార్-తూర్పు ముఖము-నిలచున్నసేవ-పెరియనంబిగారు(మహాపూర్ణులు) భగవద్రామానుజులకు పంచ సంస్కారములు గావించిన ప్రదేశము. విశే: ఈ ఊరిలోని పెద్దచెఱువు పొంగివచ్చుచుండగా స్వామి రామలక్ష్మణులుగా కావలి కాయుటచే స్వామికి ఏరికాత్తరామన్ అనిపేరు వచ్చెను. మార్గము: మద్రాసు విళ్లుపురమ్‌ బస్, రైలు మార్గం చెంగల్పట్టు నుండి విళ్లుపురం మార్గంలో సుమారు 25 కి.మీ.

కురుగైక్కవలప్పన్ సన్నిధి - 2

శ్రీమన్నాథమునుల శిష్యులగు కురుగై క్కావలప్పన్ అవతరించిన స్థలము. వీరు యోగనిష్ఠులగుటచే యోగ దశలో పెరుమాళ్లను సేవించెడివారు. నాథమునుల నుండి యోగరహస్యములను గ్రహించిరి. వానిని యామునమునులకు ఉపదేశింప నియమనము పొందిరి. కానీ కారణాంతరముల వలన యామునులు ఆ రహస్యములును పొందలేకపోయిరి. మార్గము: శ్రీముష్ణమునకు 12 కి.మీ.

గుణశీలమ్‌ - 3

శ్రీనివాస పెరుమాళ్-పద్మావతీ దేవిత్తాయార్-నిలచున్నసేవ-తూర్పుముఖము-ఈస్వామి వరప్రసాది. తిరుమలలో వలెనే ఇచటను జనసందోహము మెండుగా కలదు. మార్గము: శ్రీరంగము నుండి పోయి సేవింపవచ్చును. 25 కి.మీ.

మణ్ణంగుడి - 4

ఇది తొండరడిప్పొడి యాళ్వార్ల అవతార స్థలము. కుంభకోణము నుండి పోయి సేవింపవచ్చును.

వడువూర్ - 5

కోదండరామస్వామి-జనకజవల్లి తాయార్-నిన్నతిరుక్కోలము-తూర్పుముఖము-ఇచటస్వామి "పుంసాంమోహనరూపాయ" అనునట్లు వేంచేసి యుందురు. మార్గము: రాజమన్నార్ గుడి నుండి 10 కి.మీ.

152

పచైప్పెరుమాళ్ కోయిల్ (పేట్టై) - 6

పచ్చైవణ్ణ పెరుమాళ్-హారీతవారణ పెరుమాళ్-అమృతవల్లి త్తాయార్-దాశరథి అనే ముదలియాండాన్ అవతారస్థలము. వీరు భగవద్రామానుజులకు భాగివేయులు మరియు పాదుకాస్థానీయులు. మార్గము: మద్రాసు-కాంచీపురము మార్గంలో పూన్దమల్లికి సమీపమున గలదు.

కూరమ్‌ - 7

స్వామి యెంబెరుమానార్ల శ్రీపాదములాశ్రయించిన వారిలో ప్రథానులగు కూరత్తాళ్వాన్ అవతరించిన దివ్యదేశము.

పూన్దమల్లి (పూనమల్లి) - 8

వరదరాజప్పెరుమాళ్-పెరుందేవిత్తాయార్-శ్రీనివాస పెరుమాళ్-పుష్పకవల్లి త్తాయార్-తిరుక్కచ్చినంబిగారి అవతారస్థలం. మార్గము: మద్రాసులోని ఆవడికి 10 కి.మీ. ఇచట నుండిపోయి పచ్చైపెరుమాళ్ కోయిల్ సేవించవచ్చును.

మధుర మంగలమ్‌ - 9

ఆదికేశవప్పెరుమాళ్ సన్నిధి. గోవిందభట్టర్ అనే ఎంబార్ అవతార స్థలము. వీరు భగవద్రామానుజులకు పినతల్లి కుమారులు. భగవద్రామానుజుల తర్వాత వీరు దర్శన స్థాపకులుగా వేంచేసియుండిరి. మార్గము: శ్రీ పెరుంబుదూరు-కాంచీపురము మార్గములో సుంకువారి చావడికి 12 కి.మీ.

మయూరపురి (మైలాపూర్) - 10

ఇది మద్రాసులోని ఒక భాగము. మైలాపూర్ అని వ్యవహరింపబడు చున్నది. ఆదికేశవప్పెరుమాళ్-మాధవప్పెరుమాళ్ సన్నిధులు కలవు. కైరవిణిపుష్కరిణి-ముదలాళ్వార్లలో చివరివారైన పేయాళ్వార్లు అవతరించిన స్థలము. వీరు ఈసన్నిథిలోని మణికై రవమనెడి బావియందు అవతరించిరి. కేశవప్పెరుమాళ్ సన్నిధిలో సుదర్శనాళ్వార్ సన్నిథి కలదు. వీరు మిక్కిలి ప్రభావసంపన్నులు. ఈ సన్నిధి సమీపమునందే శ్రీనివాస పెరుమాళ్ సన్నిథి కలదు. ఇచట హయగ్రీవర్, నరసింహస్వామి వేంచేసియున్నారు. పెరుమాళ్లు సౌందర్యాతి శయముతో వేంచేసియుందురు.

                                         153 

శింగర్ కోయిల్ - 11

ఇచట నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించురీతిని వేంచేసియుందురు. మిక్కిలి ప్రభావముగల సన్నిధి. మార్గము: తిరువహీన్ద్ర పురమును సేవించునపుడు పోయి సేవింపవచ్చును. కడలూర్‌కు 25 కి.మీ.

తిరుమழிశై - 12

జగన్నాథపెరుమాళ్-తిరుమంగవల్లి తాయార్-తూర్పుముఖము-నిలచున్నసేవ-తిరుమళిశై ఆళ్వార్ అవతారస్థలం. మార్గము: మద్రాసు-పూన్దమల్లి-తిరువళ్లూరు మార్గంలో పూన్దమల్లికి సమీపంలో కలదు.

హంపి - 13

సీతారాముల సన్నిధి, నరసింహస్వామి సన్నిధి కలవు-ఋష్యమూక పర్వతము-పంపాసరోవరము-శబరి ఆశ్రమము సేవింపదగినవి. శ్రీరామచంద్రుడు ఇచటనే సుగ్రీవుని ద్వారా వానరసైన్యమును సీతాన్వేషణకై సమావేశపరచినాడు. మార్గము: బెంగుళూరు నుండి హుబ్లీ పోవు మార్గములో హోస్పేట స్టేషన్ నుండి 12 కి.మీ.

154

10. వరాహలక్ష్మీ నరసింహర్-సింహాచలం.

Varahalakshmi Narasimhar-simhachalam

శ్రీకూర్మనాథస్వామి-శ్రికూర్మము.

Srikurmanadhan-Srikurmam.

శ్రీ రంగపట్టణము -14

శ్రీరంగనాథస్వామి-శ్రీరంగనాయకి-శయనించినసేవ-కావేరినది. ఈక్షేత్రము శ్రీరంగమువలె కావేరి మధ్య భాగమునందు కలదు. మధ్యరంగమనిపేరు. ఆదిరంగం-శ్రీరంగం-మధ్యరంగం-శ్రీరంగపట్టణం-అంత్యరంగం-పినాకినీ తీరమున గల తల్పగిరి శ్రీరంగనాథులు(నెల్లూరు)

మార్గము: మైసూరు నుండి 15 కి.మీ.

శింజన్‌కోట -15

శ్రీరామచంద్రులు-సీతాదేవి-సీతాదేవి స్నాన ఘట్టము.

మార్గము: శ్రీరంగపట్టణం నుండి 40 కి.మీ.(ఇలివాలా మార్గంలో)

మిధున సాలగ్రామం -16

నరసింహస్వామి సన్నిధి కలదు. భగవద్రామానుజుల శ్రీపాద తీర్థము గల నడబావిని భక్తులు తప్పక సేవింపవలెను.

మార్గము: ఎడత్తురై నుండి 12 కి.మీ.

డేంకిణికోట -17

శ్లో. శ్రీ శైలాద్రివరా త్సమేత్య మునినా కణ్వేవ సంప్రార్థిత:
   జిత్వా తత్పరసంధినం మునికృతం విర్వర్తయన్ సంయమం
   ఆస్తే డేంకిణి నామకే పురవరే పశ్చాద్దమర్బూభృత;
   దేవోనశ్శుభ మాతనోతు నితరాం శ్రీ బేటనాథో హరి:

వివ: బేటరాయస్వామి-సౌందర్యవల్లిత్తాయార్-ఆనందయోగ విమానము-చక్రతీర్థము-నృసింహగిరి-కణ్వమహర్షికి ప్రత్యక్షము. తిరునారాయణపురం అయి అని ప్రసిద్ధులైన అనన్యాచార్యుల వారి మంగళాశాసనం గల దివ్యస్థలము. ఇచట శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి కూడా కలదు.

మార్గము: ధర్మపురి జిల్లా హోసూరుకు సమీపమున గలదు.


మంచిమాట

శ్రీరంగనాథుని ఆపాద చూడము సేవించుచు ఆయన చరణార విందముల యందు వీణాపాణియై నోరార కీర్తించుచుండు తిరుప్పాణి ఆళ్వారులను సేవించుచు జీవితమును ధన్యమును చేసికొనుడు.

155

తొండనూరు - 18

నంబినారాయణ్ పెరుమాళ్-పార్థసారది-అరవిందవల్లి త్తాయార్-రుక్మిణీదేవి-తూర్పుముఖము-నిలచున్నసేవ-భాష్యకారర్‌నది మిట్టపై నరసింహస్వామి సన్నిధి కలదు.

విష్ణువర్థన మహారాజు కుమార్తెకు పట్టిన బ్రహ్మరక్షస్సును భగవద్రామానుజులు పోగొట్టిన స్థలము.

మార్గము: ప్రెంబి రాక్స్ నుండి 6 కి.మీ. మేల్కోట్టె నుండి 30 కి.మీ.

సింహాచలము - 19

శ్లో. త్రాహితి వ్యాహరంతం త్రిదశరిపు సుతం త్రాతుకామోరహస్యే
   విస్రప్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేవ గృహ్ణన్
   వేగశ్రాంతం వితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ
   సింహాద్రౌ శ్రీఘ్రపాత క్షితిపిహితవద: పాతుమాం నారసింహ:||

వివ: వరాహ లక్ష్మీ నరసింహస్వామి-వక్షస్థలమున లక్ష్మీ-లక్ష్మీతీర్థం-నృసింహదార-తార్ష్యాద్రి విమానము-ప్రహ్లాదునకు, వురూరవ చక్రవర్తికి, దేవతలకు, సనకాదులకు ప్రత్యక్షము.

ప్రతి సంవత్సరం వైశాఖశుద్ద తదియనాడు జరుగు చందనోత్సవము సేవింపవలెను. ఆరోజున స్వామి నిజరూపముతో దర్శనమిత్తురు. మిగిలిన దినములలో స్వామి చందనక్కాప్పుతో వేంచేసియుందురు. ఇచట కృష్ణమాచార్యులు అను భక్తులు స్వామికి అంతరంగికులుగా నుండెడివారు.

భగవద్రామానుజులు ఈక్షేత్రమునకు వేంచేసి మంగళా శాసనం కృపచేసిరి.

మార్గము: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి 10 కి.మీ.

శ్రీ కూర్మము - 20

కూర్మనాథస్వామి-కూర్మనాయకి-కూర్మవిమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-చక్రతీర్థము-లాంగలతీర్థము-వంశధారానది-శ్వేతమహారాజునకు, తిలోత్తమ, వక్రాంక మహర్షులకు ప్రత్యక్షము. శ్వేతభూమి భగవద్రామానుజులు ఇచటకు వేంచేసి శ్వేత మృత్తికను స్వీకరించినారు.

మార్గము: శ్రీకాకుళం స్టేషన్ రోడ్డు నుండి 25 కి.మీ. శ్రీకాకుళం నుండి బస్ వసతి గలదు.

156

అభినవ భూతపురి (నరసాపురము) - 21

శ్లో. శ్రీ కేశవం కరతలోద్ధృత రమ్య పద్మం
   చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం
   మార్తాండకోటి రుచిరోజ్జ్వల చక్రరాజం
   వందే గదాధర మహం సురబృందవంధ్యమ్‌.
   శ్రీమతేవాప్త కామాయ కల్యాణగుణ సింధవే
   బంధనే సర్వలోకానం కేశవాయ నమో నమ:.

ఆదికేశవప్పెరుమాళ్-యతిరాజనాథవల్లి త్తాయార్-అనంతపుష్కరిణీ-అనంతవిమానము -నిలచున్నసేవ-తూర్పుముఖము-వసిష్ఠగోదావరి. భగవద్రామానుజుల సౌందర్యము వర్ణనాతీతము. వీరు శ్రీ పెరుంబూదూరులో ప్రతిష్ఠింపబడి అచటస్వామితో ఏకాసవాసీనులై ఆరుమాసములు అర్చనాదులు స్వీకరించి అచటనుండి నరసాపురము వేంచేసిరి. అట్లు వేంచేయునపుడు స్వామితోపాటు అచటవేంచేసియున్న ముదలియాండాన్(పాదుకలు) కూడా ఇచటకు వేంచేసిరి.

ఇచటగల సన్నిధి పెరుమాళ్లు ఉత్సవాదులు అన్నియు శ్రీ పెరుంబుదూరు సన్నిధిని పోలియుండుటచే దీనికి "అభినవభూతపురి" యనిపేరు వచ్చెను. మేషమాసములో శ్రవణం తీర్థోత్సవముగా తొమ్మిది దినములు బ్రహ్మోత్సవము; మేషం ఆర్ద్రానక్షత్రం తిరినక్షత్రోత్సవంగా పదిదినములు ఉడయవరుల తిరునక్షత్రోత్సవములు అతివైభవముగా జరుగును. ఈ సమయములో వచ్చు భక్తులకు తదీయారాధన సౌకర్యము కూడకలదు.

నూరుసంవత్సరములకు పూర్వము నూజివీడు సంస్థాన ఆస్థాన మహావిద్వాన్ ఉ.వే.శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్యస్వామి వారు ఈసన్నిధి వైభవమును ఉత్సవములను కావ్యముగా రచించుటయేగాక ఉత్సవములను వైభవముగా జరిపించి తదీయారాదనాధుల నేర్పాటుచేసిరి. అదినేటికిని జరుగుచుండుట ముదావహము. ఇచట నుండి పోయి అంతర్వేది సేవింపవచ్చును.

మార్గము: ఇది పశ్చిమగోదావరి జిల్లాలో కలదు. విజయవాడ, రాజమండ్రి మొదలగు చోటనుండి బస్ రైలు వసతులు కలవు.

పా. కేశవన్ తమర్‌కీழ் మేలెమ రేழெழுపిఱప్పుమ్‌
   మాశదిరు పెత్‌త్తు నమ్ముడైయ వాழ்వు వాయ్‌క్కిన్ఱవా
   ఈశనెన్ కరుమాణిక్క మెన్ శెజ్కోలక్కణ్ణన్ విణ్ణోర్
   నాయకన్ ఎమ్బిరానెమ్మాన్ నారాయణనాలే.
          నమ్మాళ్వారు తిరువాయిమొழி 2-7-1

157

పూరీ జగన్నాథము - 22

నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌||

జగన్నాథస్వామి-సుభద్రాదేవి-బలరాముడు-నిలచున్నసేవ-తూర్పుముఖము-ఇంద్రవిమానము-; స్థలవృక్షము మఱ్ఱిచెట్టు. మార్కండేయ, వరుణ, రోహిణులకు, ఇంధ్రద్యుమ్న మహారాజునకు ప్రత్యక్షము. ప్రసాదపావనమూర్తి, ఇచట ప్రసాదమును స్పర్శదోషము పాటింపక అతిపావనముగా భావించి స్వీకరింతురు. దానిని బట్టియే సర్వం జగన్నాథం అను సామెతపుట్టినది. ఆషాడ శుద్ధ పాడ్యమినాడు జరుగు రథోత్సవము జగత్ర్పసిద్దము. ఈ స్వామి భారతదేశము యొక్క తూర్పుతీరమున వేంచేసి సర్వులను రక్షించుచున్నాడు. ఈ క్షేత్రమునకు నీలాచలమనిపేరు.

ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తిముక్తి ప్రదాయకం

మార్గము: ఇది ఒరిస్సా రాష్ట్రములోనిది.

పూరీ జగన్నాధ స్వామి

POORI JAGANNADHA SWAMY

పురుషోత్తమము - 23

సప్త సప్తమ లోకేషు లోకా లోకేచర చరే|
వాప్తి వాప్తి సమం క్షేత్రం ఉత్తమం పురుషోత్తమం

పురుషోత్తమన్ - శ్రీకృష్ణ బలరాములు - మార్కండేయ మహర్షికి ప్రత్యక్షము - వరుణినిచే ప్రతిష్టించబడిన దివ్యస్థలము. నాధమునులు భగవద్రా మానుజులు ఈక్షేత్రమునకు వేంచేసి మంగళాశాసనం కృషిచేసిరి.

మార్గము పూరీ జన్నాధ క్షేత్రమునకు మిక్కిలి సమీపములో కలదు.

158

13. రంగనాధన్-నెల్లూరు.

Ranganadhan-nellore

14.వేణుగోపాలన్-మంగళంపాడు.

venugopalan-mangalampadu

పెంచలకోన - 27

నరసింహస్వామి - ఆదిలక్ష్మితాయార్-కూర్చున్నసేవ-తూర్పుముఖము వివ:-ఈక్షేత్రమునకు చత్రవటియనిపేరు. ప్రహ్లాదవరదుడగు నృసింహస్వామి వేంచేసియున్నాడు. నవనారసింహములలో పెంచలకోన యొకటి.ఇది నెల్లూరుకు 80 కి.మీ. దూరమున రావూరు మండలమున కలదు.

పెంచల కోన

PENCHALA CONA

    శ్రీమన్నఋసింహ విభవే గరుడ ధ్వజాయ
    తాపత్రయోప శమనాయ భవేషధాయ
    తృష్ణారి వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ
    క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు

160

పెంటపాడు - 28

బాల వేంకటేశ్వరస్వామి-ఆనందవిమానము-స్వామిపుష్కరిణి-తూర్పుముఖము-నిలచున్నసేవ.

వివ: ఈస్వామివరప్రదుడు. ఈఅగ్రహారము ఒకప్పుడు శ్రీవైష్ణవమత ప్రచారమునకు ప్రముఖస్థానమై విరాజిల్లినది. ఈస్వామి సన్నిధానములో జరిగిన ఉభయ వేదాంత సభలలో ప్రసిద్దులైన పండితులు పలువురు పాల్గొనెడివారు. శ్రీవైష్ణవపత్రిక ఇచట నుండియే వెలువడుచుండినది. ఇటీవల "శ్రీమత్పరమహంసేత్యాది" శ్రీశ్రీశ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో "ఉభయవేదాన్త సభ స్థాపింపబడి" ఉభయవేదాన్త సభలను నిర్వహించుచు, "భక్తామృతమను" పత్రికను సంప్రదాయమునకు సంబంధించిన పుస్తక ప్రచురణమును చేపట్టినది. ఆకృషి పలితమే ఈదివ్యదేశ వైభవ ప్రకాశిక.

మార్గము: మద్రాసు-కలకత్తా రైలుమార్గములో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు (పశ్చిమగోదావరిజిల్లా) 4 కి.మీ.



161

పండరీపురము - 29

ఇది ప్రసిద్ద పుణ్యక్షేత్రము-ఇచట స్వామిపేరు పాండురంగ విఠలుడు. రుక్మిణీదేవి-చంద్రభాగానది-భీమతీర్థం-శ్రీకృష్ణతీర్థం-జ్ఞానానందవిమానం-నిలచున్నసేవ-తూర్పుముఖము-పుండరీక మహర్షికి ప్రత్యక్షము.

ఇచట స్వామి ఒక యిటుక రాతిమీద వేంచేసియుందురు. భక్తులు శ్రీస్వామివారి పాదములను స్పృశించి సేవింపవచ్చును. సన్నిధి చంద్రభాగానది యొడ్డున కలదు. నదియొడ్డున గల "రామ్‌బాగ్" వసతిగృహము వసతికి అనుకూలముగా నుండును.

మార్గము: ఇది మహారాష్ట్ర లోనిది-షోలాపూర్ నుండి బస్‌లో వెళ్లవచ్చును. {{center|

నాసిక్ - పంచవటి - 30

శ్రీరాములవారి సన్నిధి-సీతాదేవి-గోదావరినది.

లక్ష్మణస్వామి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన ప్రదేశము. శ్రీరామచంద్రుడు సీతాదేవితో విహరించిన పుణ్యస్థలము.-మారీచ వధ ఇక్కడనే జరిగినది. ఇచటగల శంకరమఠము వసతికి అనుకూలము. ఐదుమఱ్ఱి చెట్లు గుంపుగా నుండుటచే పంచవటియనిపేరు. వీని మధ్య సారంగము కలదు. ఖరదూషణ పద సమయమున శ్రీరాముడు సీతను ఈసారంగములో నుంచెనట.

మార్గము: ఇది మహారాష్ట్ర లోనిది. బొంబాయి నుండి-నాసిక్ రోడ్ స్టేషన్‌దిగి అచట నుండి 10 కి.మీ. బస్‌లో వెళ్లి ఈ క్షేత్రమును చేరవచ్చును.

162

గయాక్షేత్రము - 31

ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము-ఇచట వేంచేసియున్న స్వామిపేరు గదాధరుడు-వైకుంఠ విమానము-నిలచున్నసేవ-ఉత్తరముఖము-పల్గునీనది-గయాసురునకు ప్రత్యక్షము-విష్ణుపాదము-స్థలవృక్షము అక్షయ వటము.

ఇటగల శ్రీవిష్ణుపాదము; అక్షయవటము ప్రతిభారతీయునకు తప్పక సేవింపదగినవి.

శ్లో. జీవతో ద్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్
   గయాయాల పిండదావచ్చ త్రిభి: పుత్రస్యపుత్రతా||

అనిచెప్పినట్లు పుత్రకృత్యములలో గయా శ్రాద్ధమొకటి. ఈ గయా శ్రాద్ధమును అవశ్య కర్తవ్యంగా ధర్మశాస్త్రం బోదించింది. అంతేకాక మనగృహాదులలో శ్రాద్ధక్రియలు నిర్వహించేటప్పుడు ఈ గయా క్షేత్రాన్ని, ఇచటి అక్షయవటాన్ని స్మరించడం సంప్రదాయం. ఇట్టి ఈక్షేత్రాన్ని ప్రతిభారతీయుడు తప్పక సేవించాలి. దీనికి 10 కి.మీ.దూరములో చంపకరాణ్యం కలదు.

మార్గం: కాశీనుండి 320 కి.మీ. గయా రైల్వే స్టేషన్.


163

వారణాసి (కాశీ) - 32

మోక్షప్రద నగరము లేడింటిలో కాశియొకటి. ఇచటవేంచేసియున్న బిందుమాధవ స్వామి మోక్షప్రదాత. ఇచట శ్రీకేశవస్వామి ఆలయము ప్రాచీనమైనది. లక్ష్మీదేవి తాయార్-నిలచున్నసేవ-తూర్పుముఖము-చక్రతీర్థము-గంగానది-అవిముక్తవిమానము-పరమశివునకు ప్రత్యక్షము. ఇది ప్రసిద్ధ శివక్షేత్రము. అయినను విష్ణుమహిమలకు కొదువలేదు. ఈక్షేత్రమున చనిపోయినవారి చెవిలో పరమశివుడు రామతారక మంత్రమునుపదేశించునట. ఆమంత్ర ప్రభావము వలన మోక్షము లభించును. కావుననే ఇచట శవవాహకులు "రామనామ్‌సత్యహై" అని ఎలుగెత్తి చాటుతారు. ఇచటి గంగావది ప్రతిభారతీయులకు తప్పక సేవింపదగినది. "కజ్గై కజ్గై యెన్ఱు" గంగ గంగ అనుటతోడనే మన కల్మషములన్నియు తొలగిపోవును.

మార్గము: ప్రధాన నగరముల నుండి రైలు వసతి కలదు.

పుష్కరక్షేత్రము - 33

పరమ పురుషన్-పుండరీక వల్లి తాయార్-మంగళవిమానము-పద్మసరస్సు-నిలచున్నసేవ-తూర్పుముఖము-నృసింహ ఘట్టం-చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యక్షము.

ఇది అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో నొకటి. స్వామి నైమిశారణ్యములో వనరూపిగా నున్న విధమున, ఇచట తీర్థరూపముగా నున్నాడు. ఇచట తీర్థమాడుటయే (స్నానము చేయుట) ప్రధానము. ఇచట లక్ష్మీనరసింహస్వామి సన్నిధియు కలదు. ఉ.వే.శ్రీమాన్ ప్రతివాది భయంకరం ఆద్య అనంతాచార్యస్వామి వారి రంగాజీ మందిరం వసతికి అనుకూలము.

మార్గము: ఈ క్షేత్రము అజ్మీర్‌కు 10 కి.మీ. దూరమున గలదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనిది.

గోవర్థనము - 34

గోకులనాథుడు-శ్రీహరినాథన్-రాదాదేవి-పర్వతవిమానము-మానసగంగ-బ్రహ్మతీర్థము-బ్రహ్మతీర్థము-రాధాతీర్థము-కాళిందిమడుగు-నిలచున్నసేవ-తూర్పుముఖము-బ్రహ్మకు, కాళీయునకు ప్రత్యక్షము. ఈగోవర్థన పర్వతమునే శ్రీకృష్ణుడు చిటికెన వ్రేలితో పైకి ఎత్తెను.

మార్గము: ఈక్షేత్రము బృందావనమునకు సమీపమున గలదు.

164

పళ్ళికొండ - 35

రంగనాథస్వామి-శ్రీరంగనాయకి-వ్యాసపుష్కరిణి-శేషశయనం-శయనించినమూర్తి-అంబరీష మహారాజునకు ప్రత్యక్షం.

మార్గము: తమిళనాడులో గుడియాత్తం స్టేషన్ నుండి 3 కి.మీ.

మీంజూర్ - 36

వరదరాజస్వామి-పెరుందేవిత్తాయార్-అనంతసరస్సు-రోమపాద మహర్షికి ప్రత్యక్షము.

మార్గము: మద్రాసుకు 30 కి.మీ.

పొన్నేరి - 37

హరికృష్ణ పెరుమాళ్-సుందరవల్లి త్తాయార్-సుందరపుష్కరిణి-సుందరవిమానము-అరణినది-భరద్వాజ మహర్షికి ప్రత్యక్షము.

మార్గము: పొన్నేరి స్టేషన్ నుండి 3 కి.మీ.

నాగలాపురం - 38

వేదనారాయణస్వామి-వేదవల్లిత్తాయార్-వేదవిమానము-మత్స్యతీర్థము.

విశే: ఫాల్గుణమాసములో మూడుదినములు సూర్యరశ్మి పెరుమాళ్లపై ప్రసరించును. మిగతాదినములలో ఈవిధముగా ప్రసరించదు.

మార్గము: తిరువళ్లూరు నుండి 25 కి.మీ.

పుష్పగిరి - 39

చెన్నకేశవస్వామి-రాఘవస్వామి-పెన్నానది.

విశే: పెన్నానదీ తీరమునగల పుణ్యక్షేత్రము. ఆది శంకరాచార్యుల మఠము కలదు.

మార్గము: కడపకు 15 కి.మీ.

కదిరి - 40

నరసింహస్వామి-లక్ష్మీత్తాయార్-కదిరివృక్షము.

విశే: ఇది మిక్కిలి ప్రాచీనమైన క్షేత్రము. పదకవితా పితామహుడగు అన్నమాచార్యుల వారు కీర్తించిన క్షేత్రరాజము.

మార్గము: ధర్మవరం-పాకాలలైనులో కదిరిస్టేషన్.

165

గూడూరు - 41

అళగనాథస్వామి-రాజ్యలక్ష్మీ త్తాయార్.

విశే: మిక్కిలి ప్రాచీనమైన సన్నిధి. పెరుమాళ్లు తిరుమాలిరుంశోలై పెరుమాళ్ల వలె వేంచేసియుందురు.

మార్గం: మద్రాసు-విజయవాడ మార్గములో గూడూరు స్టేషన్.

సింగరాయకొండ - 42

విజయవాడ-గూడూరు రైల్వేలైనులో సింగరాయకొండ రైల్వేస్టేషన్. స్టేషన్ నుండి 1 కి.మీ. దూరములో కొండగలదు. ఈకొండమీద వరాహలక్ష్మీ నరసింహస్వామి వేంచేసియున్నారు. చాలా ప్రాచీనమైన సన్నిధి. స్వామివరప్రదుడు.

కావలి - 43

ఇది మద్రాసు-విజయవాడ మార్గములో నెల్లూరు తర్వాత స్టేషన్. మిక్కిలి ప్రాచీనమైన లక్ష్మీకాంతస్వామి సన్నిధి గలదు. ఈసన్నిధిలో వేంచేసియున్న పెరుమాళ్ళు, ఉడయవరులు భక్తుల హృదయములను దోచుకొందురనుటలో అతిశయోక్తిలేదు.

ఒంగోలు - 44

ఇదిప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము. రంగమన్నార్-ఆండాళ్ సన్నిధి, చక్రవర్తి తిరుమగన్ సన్నిధి కలదు. శ్రీవైష్ణవ సంప్రదాయమునకు నిలయమై విరాజిల్లుచున్నది.


166

నడిగడ్డపాలెం - 45

సీతారామస్వామిసన్నిధి-శ్రీమత్పరమహంసేత్యాది శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారి సన్నిధి కలవు.

విశే: డ్రీమద్రామాయణ సుందరమును రచించిన పరమ భక్తాగ్రేసరులగు శ్రీవాసుదాస స్వామివారు నిర్మించుకొన్న ఆశ్రమం. ఇది శ్రీమత్పరమహంసేత్యాది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారికి సమర్పింపబడినది. వారిని తిరుప్పళ్లిచేర్చి అర్చారూపముగా వేంచేపు చేయుటచేత పవిత్రమైన స్థలము. ఆంధ్ర దేశమున శ్రీవైష్ణవ ప్రచారమునకై యావజ్జీవితము శ్రమించి అసంఖ్యాకులకు ఆచార్యులై శతాధిక గ్రంథకర్తలైన కులపతులు ఉ.వే.శ్రీమాన్ తె.కం. గోపాలాచార్యస్వామి వారు ఇటీవల వరకు నిర్వహించిన క్షేత్రరాజము.

మార్గము: గుంటూరు జిల్లా చుండూరు స్టేషన్‌కు 5 కి.మీ.

167

మంగళగిరి - 46

పానకాల నరసింహస్వామి-మహాలక్ష్మీ త్తాయార్-కల్యాణ తీర్థము.

విశే: ఇచట కొండపై నరసింహస్వామి సన్నిధి కలదు. వీరు పానకమును విశేషముగా ఆరగింతురు. భక్తులు సమర్పించిన పానకమును స్వామి సగము మాత్రము స్వీకరించి మిగిలిన దానిని భక్తులకు అనుగ్రహింతురు. కొండదిగువ సన్నిధిలో ఉత్సవమూర్తి వేంచేసియుందురు. ఇది మిక్కిలి ప్రాచీనమైన క్షేత్రము.

మార్గము:- విజయవాడ-గుంటూరు మధ్యగలదు.


168


సీతానగరం - 47

ఇది జగత్ ప్రసిద్ధులైన శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారి ప్రధాన ఆశ్రమము. శ్రీస్వామివారి తిరువారాధన చక్రవర్తి తిరుమగన్ వేంచేసిన పుణ్యస్థలము. "యంయం స్పృశ్యతి పాణిభ్యాం యంయంవశ్యతి చక్షుషా స్థావరాణ్యాపి ముచ్యంతే" అనువిధమున తమ శ్రీపాదస్పర్శచేతను; హస్తస్పర్శచేతను, దివ్యమందహాసాంచిత కృపాకటాక్షము చేతను, స్థావర జంగమాది భేదము లేక సర్వులను అనుగ్రహించి భగవత్కృపా పాత్రులను చేయు పరమోదారులు. అభినవ భగవద్రామానుజులైన శ్రీశ్రీశ్రీ జీయర్ స్వామివారి ఆశ్రమమును సేవించి ధన్యులగుట ప్రతి భక్తునకు ఆవశ్యకర్తవ్యము.

మార్గము: విజయవాడకు 5 కి.మీ.


169

భద్రాచలం - 48

ఆంధ్రదేశమునగల సుప్రసిద్ధక్షేత్రము. సీతారాముల సన్నిధి-గోదావరినది. భక్తరామదాసుచే అనేక విధముల అభివృద్ధి చేయబడినది. రామదాసు కీర్తనలచే స్తుతింపబడినది. ఇచట ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు జరుగు శ్రీసీతారామ కల్యాణము జగద్విఖ్యాతమైనది. ఈక్షేత్రమును తిరుమంగై ఆళ్వార్లు సేవించినట్లు పెద్దలు చెప్పుదురు.

మార్గము: ఇది ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పట్టణానికి 40 కి.మీ.


170