దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుప్పేర్ నగర్
8. తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్)
(లాల్గుడి 10 కి.మీ)(కోవిలడి)
శ్లో. ఇంద్రాఖ్యాయుత తీర్థ శోభిత తలే శ్రీ మత్తిరుప్పేర్ పురే
పశ్చాద్వక్త్ర యుతో భుజంగ శయనోహీంద్రాఖ్య వైమాసగ: |
ఆలింగన్ కమలోప పూర్వ లతికా మప్పక్కుడుత్తాన్ విభు :
దృశ్యశ్చోపమనో : పరాశరమునే ర్విభ్రాజతే సర్వదా ||
శ్లో. భక్తిసార శఠారాతి కలిజిత్ రథయోగిభి:|
సంస్తుత:కుంభ సంరాజ ద్వామేతర కరాంబుజ:||
వివరణ: అప్పక్కుడుత్తాన్-కమలవల్లి తాయార్-ఇంద్ర తీర్థము-ఇంద్ర విమానము-పశ్చిమ ముఖము-భుజంగ శయనము-ఉపమన్యువునకు పరాశర మహర్షికి ప్రత్యక్షము. కుడిచేతి క్రింద కుంభము-తిరుమழிశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.
విశేషము: ఈ దివ్య దేశమునకు పెరునగర్ (పెద్ద నగరము) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్లు తిరువాయిమొழி (10వ శతకం 9వ తిరువాయిమొழி) తిరుమాలిరుంశోలై మలై అను దశకములో "తిరుమాల్‌వన్దెన్నెంజు నిఱైయ పుకున్దాన్." (ఆ సర్వేశ్వరుడే వచ్చి నా హృదయము నిండునట్లు)అని పెరుమాళ్ల యొక్క స్వామిత్వమును ప్రకాశింపచేసిరి.
మార్గము: "కోవిలడి" అనియే చెప్పవలెను. అన్బిల్ కొల్లడం ఎడమవైపు దాటిన ఈక్షేత్రమును చేరవచ్చును. తిరుచ్చి నుండి బస్ మార్గం 24 కి.మీ. లాల్గుడి నుండి 10 కి.మీ. కుంభకోణం నుండి-తిరుక్కాట్టుపళ్లి-తిరువైయ్యారు బస్ మార్గమున "కల్లణై" పోవు బస్‌లోను పోవచ్చును.
తిరుమాలిరుఇజోమలై యెన్ఱేనెన్న
తిరుమాల్ వన్దెన్నెంజు నిఱై యప్పుగున్దాన్
కురుమామణియున్దు పునల్ పొన్నిత్తెన్ పాల్
తిరుమాల్ శెన్ఱు శేర్విడం తెన్ తిరుప్పేరే.
నమ్మాళ్వార్ తిరువాయిమొழி 10-8-1
9. తిరువాదనూర్
(స్వామిమలై 3 కి.మీ)
శ్లో. ఆదమర్ నగరే దివ్యే సూర్య పుష్కరిణీయుతే
శ్రీ రజ్గనాయకీ నాథ: ప్రణవాఖ్య విమానగ:
శ్లో. ఆండళక్కుం మెయ్యవాఖ్య: ప్రాజ్ముఖో భుజగేశయు|
రాజతే కామధేన్వక్షి గోచరో కలిజిన్నుత: ||
వివరణ: ఆండళక్కుం మెయ్యన్-శ్రీరంగ నాయకి-ప్రణవాకార విమానము-సూర్యపుష్కరిణి-తూర్పు ముఖము-భుజంగ శయనము-కామధేనువునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.
మార్గము: స్వామిమలై నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.
విశేషములు: కామ ధేనువుకు ప్రత్యక్షమగుటచే ఆదనూర్ అనిపేరు వచ్చెను. ఈ సన్నిధి అహోబిల మఠ నిర్వహణలో నున్నది. పెరుమాళ్ల శ్రీపాదములలో తిరుమంగై ఆళ్వారు కామధేనువు కలరు.
అన్నవనై ఆదనూర్ అణ్ణళక్కుమైయనై
నెన్నలై యిన్ఱినై నాళైయై-నీర్మలమేల్
తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమడల్ 130
నవవిధ సంబంధములు
మంచిమాట
పరమాత్మకు జీవాత్మకు మద్యన గల సంబంధములు తొమ్మిది.అవి.
పరమాత్మ______________జీవాత్మ_________సంబంధము
1. పిత_________________పుత్ర___________కార్యకారణ సంబంధము
2. రక్షకుడు______________రక్ష్యుడు________రక్ష్య రక్షక సంబంధము
3. శేషి_________________శేషుడు_________శేష శేషి సంబంధము
4. భర్త_________________భార్య___________భర్తృ భార్య సంబంధము
5. జ్ఞేయ________________జ్ఞాత___________జ్ఞాతృ జ్ఞేయ సంబంధము
6. స్వామి_______________దాసుడు_________స్వస్వామి సంబంధము
7. ఆధారము_____________ఆధేయము_______ఆధార ఆధేయ సంబంధము
8. ఆత్మా________________శరీరము_________శరీరాత్మ సంబంధము
9. భోక్త_________________భోగ్యము_________భోకృభోగ్య సంబంధము