దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/వక్ర రాజనీతి లేక క్షణిక సంతోషం

వికీసోర్స్ నుండి

15

వక్ర రాజనీతి లేక క్షణిక సంతోషం

ఓడ నుంచి కేప్‌టౌన్‌లో దిగిన తరువాత. జోహన్స్ బర్గ్ చేరిన పిమ్మట మదీరాలో అందిన తంతికి నిజానికి మేమూహించినంత విలువలేదని తేలింది. యిందులో తంతిపంపిన శ్రీ రిచ్ దోషం ఏమీ లేదు ఏషియాటిక్ అక్టును నిరాకరించే విషయమై తనకు తెలిసిన వివరం అతడు తంతిద్వారా మాకు తెలియజేశాడు. 1906లో ట్రాన్స్‌వాల్ ఒక చక్రవర్తి అధీనంలో వున్న అధినివేశరాజ్యం అని ముందే వ్రాశాను ఇటువంటి రాజ్యాల రాయబారులు ఆధినివేశరాజ్యాల మంత్రికి తమతమ రాజ్యాల హితానికి సంబంధించిన వివరాలు తెలియజేయుటకు ఎప్పుడూ ఇంగ్లాండులోనే వుంటా ఉండేవారు. ట్రాన్స్‌వాల్ రాయబారి సర్‌రిచర్డ్స్ సాల్‌మన్ దక్షిణాఫ్రికాకు చెందిన ప్రసిద్ధ వకీలు అతడు లార్డ్ ఎల్గిన్, ట్రాన్స్‌వాల్ రాయబారియగు సాల్‌మాన్‌తో చర్చించిన తరువాతనే రక్తపు చట్టాన్ని నిరాకరిస్తూ నిర్ణయించాడు. 1907 జనవరి 1వ తేదీ నుంచి ట్రాన్స్‌వాల్‌లో జవాబు ధారీ ప్రభుత్వం ఏర్పడ నున్నది. అందువల్ల లార్డ్ ఎల్గిన్ ట్రాన్స్‌వాల్ రాయబారితో “జవాబు దారీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత యీ చట్టాన్ని అక్కడి అసెంబ్లీలో ప్యాసు చేయండి. అప్పుడు పెద్ద ప్రభుత్వం దాన్ని నిరాకరించదు. ఇప్పుడున్న స్థాయిలో మీ రాజ్యం వున్నంతవరకు మీరు చేసే చట్టాలకు పెద్ద ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వుంటుంది పెద్ద ప్రభుత్వం రంగుభేదం లాంటి జాతీయ భేద భావాలకు సంబంధించిన రాజనీతిని అంగీకరించదు అందువల్ల ప్రస్తుతం నేను చక్రవర్తికి యీ రక్తపు చట్టాన్ని నిరాకరించాలని సలహా పంపుతాను" అని చెప్పాడు

ఈ విధంగా పేరుకు మాత్రం నిరాకరించినా, తెల్లవారి కోరిక నేరవేరితే చాలు రిచర్డ్స్ సాల్‌మన్‌కు అభ్యంతరం లేదు. ఎందుకుంటుంది. ఈ రాజనీతిని నేను “వక్రం" అని అన్నాను ఇంత కంటే కటువైన విశేషణం ప్రయోగించినా యిటు వంటి వక్రకుటిల రాజకీయజ్ఞులకు ఏ మాత్రం సరిపోదని నా విశ్వాసం చక్రవర్తి అధీనంలో వున్న అధినివేశరాజ్యాల పూర్తిబాధ్యత సామాజ్ర్య ప్రభుత్వానిదే దాని రాజ్యాంగంలో రంగు భేదానికి మరియు జాతి భేదానికి తావులేదు. ఈ రెండు అందమైన మాటలు జవాబుదారీ ప్రభుత్వం చేసే చట్టాలను సామ్రాజ్య ప్రభుత్వం రద్దు చేయజాలదు అనునది కూడా అర్థమయ్యే విషయమే కాని అట్టి రాజ్యాల రాయబారుల్ని పిలిచి రహస్య చర్చలు జరపడం రాజ్యాంగానికి విరుద్ధంగా పుండే చట్టాల్ని ఫలానా పద్దతిన నిరాకరిస్తామని చెప్పడం ఎవరి ఆధికారాలు హరిస్తున్నారో వారిని మోసం చేసి, వారికి తీరని అన్యాయం చేసినట్లు కాదా" నిజానికి లార్డ్ ఎల్గిన్ ఈ విధంగా వాగ్దానం చేసి ట్రాన్స్‌వాల్ యందలి శ్వేత జాతీయులను భారతీయులకు వ్యతిరేకంగా ఉద్యమం నడుపమని ప్రోత్సహించాడు. ఈవిధంగా తాను చేయతలిచాడు కనుక, ఆ విషయం తనను కలసిన భారతీయుల ప్రతినిధి బృంద సభ్యులకు చెప్పవచ్చుగదా! ఎవరు ఏమి చెప్పినా తన అధీనంలోగల రాజ్యాలకు సామ్రాజ్య ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బ్రిటిష్ రాజ్యాంగ మందలి మూల సిద్ధాంతాల్ని జావాబుదారీ ప్రభుత్వాలు గల అధినివేశ రాజ్యాలు కూడా అంగీకరించవలసిందే ఉదాహరణకు జవాబుదారీ ప్రభుత్వం గల ఏ అధినివేశరాజ్యం కూడా చట్టబద్ధంగా బానిస విధానాన్ని అమలు చేయుటకు వీలు లేదు. కనుక లార్డ్ ఎల్గిన్ రక్తపు చట్టం అనుచితమైనదని నిజంగా భావించి నిరాకరించియుంటే, రిచర్డ్స్ సాల్‌మన్‌ను ఒంటరిగా పిలిచి జావాబుదారీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా యిట్టి చట్టం చేయవద్దని చెప్పి యుండవలసింది. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం అట్టి చట్టం చేయదలుచుకుంటే, జవాబుదారీ ప్రభుత్వ స్థాపన అక్కడ జరపాలా లేదా అని సామ్రాజ్య ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి యుండవలసింది భారతీయుల అధికారాలను . సంపూర్తిగా రక్షిస్తామనే మాట తీసుకొని ట్రాన్స్‌వాల్‌లో జవాబుదారీ ప్రభుత్వ స్థాపన జరిపి యుండవలసింది. అలా చేయకుండా లార్డ్ ఎల్గిన్ బయటికి భారతీయుల యెడ సానుభూతి వున్నట్లు మొసలి కన్నీరు కార్చి. లోలోపున ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడు. తాను ఆంగీకరించని చట్టాన్ని ప్యాసుచేసి అమలు చేయమని వారిని ప్రోత్సహించాడు. ఇటువంటి వక్ర రాజనీతికి సంబంధించిన ఉదాహరణ యిది ఒక్కటే కాదు. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రను చదివిన సామాన్య పాఠకుడు సైతం ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. జోహన్స్‌బర్గ్ చేరగానే లార్జ్ ఎల్గిన్ మరియు సామ్రాజ్య ప్రభుత్వాధినేతలు మమ్మల్ని మోసంచేశారని విన్నాము మదీనాలో మాకు ఎంత సంతోషం కలిగిందో దక్షిణాఫ్రికాలో అంత నిరాశకలిగింది. ఇట్టి వక్రరాజనీతి వల్ల భారతీయుల్లో ఆవేశం పెల్లుబికింది. "ఇకమనకు చింత ఎందుకు? ఏ సామ్రాజ్య ప్రభుత్వం సహాయం చేస్తుందని మనం పోరాడుతాం? ఇక మన బలం మీదనే, ప్రతిజ్ఞచేసిన ఈశ్వరుని బలం మీదనే ఆధారపడి పోరాడదాం మనం సత్యం మీద నిలబడితే వక్ర రాజనీతి కూడా తిన్నగా మారి సక్రమంగా నడుస్తుంది" అని అంతా అన్నారు

ట్రాన్స్‌వాల్‌లో జవాబుదారీ ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో మొదటి చట్టం బడ్జెటుకు సంబంధించినది. రెండవది రక్తపు చట్టం (ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ ఆక్టు) మొదటసారి యీ ఆక్టును ఎలా ప్యాసుచేశారో యీసారికూడా అలాగే ప్యాసు చేశారు. ఒకటి రెండు శబ్దాలు మాత్రమే మార్చారు ఆ మార్పు ప్రకారం చట్ట నిబంధనలో యివ్వబడిన తేదీలో మార్పు చేశారు. అలా చేయక తప్పదు. 1907 మార్చి 21వ తేదీన ఒకే ఒక్క రోజున రక్తపుచట్టం ట్రాన్స్‌వాల్ అసెంబ్లీలో ప్యాసై పోయింది. పైన తెలిపిన మార్పుకు, చట్టమందలి కఠోరత్వానికి ఏ సంబంధంమూ లేదు అంటే గతంలో యిట్టి చట్టాన్ని నిరాకరిస్తున్నామని చేసిన తతంగమంతా ఒట్టి బూటకమని స్పష్టంగా తేలిపోయింది. భారతీయులు దానికి వ్యతిరేకంగా అర్జీలు పంపించారు కాని పట్టించుకునే నాథుడెవరు? 1907 జూలై 1వ తేదీ నుంచి చట్టం అమలులోకి వచ్చిందని ప్రకటించారు. జూలై 31వ తేదీలోపున భారతీయులందరు అనుమతి పత్రాలు తీసుకునేందుకు ఆర్జీలు దాఖలు చేయాలని ప్రకటన వెలువడింది. మధ్య యిన్ని రోజుల గడువు భారతీయులపై దయతో యివ్వబడలేదు. ఆచట్టానికి సామ్రాజ్య ప్రభుత్వ ముద్ర అవసరం అందుకు సమయం కావాలి గదా1 అంతేగాక అందు కోసం ఫారాలు, పుస్తకాలు, అనుమతి పత్రాలు తయారు చేయాలి వేరు వేరుచోట్ల ఆఫీసులు తెరవాలి. దానికోసం కొద్ది గడువు ఇచ్చారు



16

అహమద్ ముహమ్మద్ కాఛలియా

మా భారతీయుల ప్రతినిధి బృందం సభ్యులం ఇంగ్లాండు వెళ్లుటకు బయలు దేరాం అప్పుడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న ఒక ఆంగ్లేయ యాత్రీకుడు వచ్చి నన్ను కలిశాడు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం అమలు చేసిన ఖానీ చట్టాన్ని గురించి మా ఇంగ్లాండు ప్రయాణాన్ని గురించి నావల్ల తెలుసుకొని "అయితే మీరు కుక్కబెల్టు (డాగ్ కాలర్) ధరించడాని వ్యతిరేకిస్తున్నారన్నమాట" అని అన్నాడు. ఆ ఆంగ్లేయుడు ట్రాన్స్‌వాల్ ప్రభుత్వపు చట్టాన్ని కుక్కబెల్టుతో పోల్చాడన్నమాట అతడు ఆ మాట ఖూనీ చట్టాన్ని సమర్ధిస్తూ, భారతీయుల యెడ తనకు గల తిరస్కార భావాన్ని వెల్లడించడానికే అన్నాడో, లేక దక్షిణాఫ్రికా యందలి భారతీయుల విషయంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వాన్ని ఎమర్శిస్తూ, మా యెడ సానుభూతిని ప్రకటిస్తూ అన్నాడో అప్పుడు నేను నిర్ణయానికి రాలేకపోయాను ఇప్పుడూ రాలేకపోతున్నాను ఆయితే ఏ మనిషి మాట్లాడిన మాటకైనా అతడికి అన్యాయం జరిగేలా అర్థం తీయకూడదని నా అభిప్రాయం అట్టి నీతిసూత్రం ప్రకారం భారతీయుల యెడ సానుభూతిని ప్రకటించేందుకు వాస్తవ స్థితిని యీ మాటల్లో చిత్రించాడని భావిస్తున్నాను. ఒక వైపున ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం భారతీయులకు కుక్క బెల్టు కట్టుటకు ప్రయత్నిస్తూ వుంటే, మరో వైపున యీ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవడమా, బెల్టు ధరించకుండా ప్రభుత్వ వక్రనీతిని ఎలా