Jump to content

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/భారతీయులు ఏం చేశారు?-3

వికీసోర్స్ నుండి

నిర్ణయం మీద స్థిరంగా వుండగలిగితే అట్టి జాబు వ్రాసి. నాకు యివ్వండి ఒక్క విషయం మాత్రం స్పష్టగా చెబుతున్నాను మీ మీద దాడిచేసినవారి మీద కేసు నడపడం యిష్టం లేదని మీరు మీ బుద్ధిపూర్వకంగా వ్రాసి యివ్వాలి అందుకు బాధ్యత మీరే వహించాలి. అప్పుడే నేను మీ జాబును ఉపయోగించగలుగుతాను "

"మీరు యీ విషయం మాట్లాడుటకు పిలిపించారని నేను ఊహించలేదు ఈ విషయమై ఎవ్వరితోను నేను చర్చించలేదు. చర్చించాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను శ్రీ లాటిన్‌గారి వెంట బయలు దేరి ఓడదిగి ముందుకు సాగినప్పుడే తెల్లవారు ఎంతటి కష్టం కలిగించినా వారిని తప్పుపట్టను అని మనస్సులో నిర్ణయించుకున్నాను. అందువల్ల నా మీద దాడిచేసినవారి మీద కేసు పెట్టడానికి ఆస్కారమే లేదు. నా మనస్సులో ఒక ధార్మిక ప్రశ్న బయలుదేరింది. మీరు అన్న ప్రకారం నా యీ సంయమంవలన నాజాతితోబాటు నాకుకూడాలాభం కలుగుతుందని భావిస్తున్నాను అందువల్ల బాధ్యతంతా నా నెత్తిన వేసుకొని యిప్పుడే మీరు కోరిన పత్రం వ్రాసి యివ్వదలిచాను" అని చెప్పాను

నేను శ్రీ ఎస్కంబ్‌గారిని ఒక తెల్ల కాగితం అడిగి తీసుకొని, అక్కడే వ్రాసి, వారికి ఆ పత్రం యిచ్చివేశాను


8

భారతీయులు ఏంచేశారు? -3

ఇంగ్లాండులో చేసిన పనులు

గతప్రకరణాల్లో భారతీయులు తమస్థితిగతులయందు మార్పులు తెచ్చుటకు చేసిన ప్రయత్నాలను గురించి, ప్రతిష్ఠను పెంచుకొన్న పద్ధతిని గురించి పాఠకులు తెలుసుకున్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల సర్వాంగీణ వికాసానికి ఇంగ్లాండు నుంచి లభించ గలిగినంత సాయం పొందడానికి అవిరళకృషి చేశారు. భారతీయులు జరిపిన ప్రయత్నాల్ని గతంలో వివరించాను యిక ఇంగ్లాండులో సాయం కోసం చేసిన కృషిని వివరిస్తాను జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీలో సంబంధం పెట్టుకోవలసిన అవసరం ఏర్పడింది. అందునిమిత్తం భారతావనికి చెందిన శ్రీ దాదాభాయి నౌరోజీ గారికి, బ్రిటిష్ కమిటీ అధ్యక్షులు సర్ విలియం బెడర్ బర్న్ గారికి జరుగుతున్న ఘట్టాల వివరమంతా వారం వారం వ్రాసి పంపసాగాము అర్జీలు పంపుటకు పోస్టల్ ఖర్చులు పెట్టుటకు కనీసం 10 పౌండ్లు పంపుతూ వుండేవారం.

ఇక్కడ దాదాభాయి నౌరోజీగారిని గురించిన పవిత్ర సంస్మరణను వివరిస్తాను. దాదాభాయిగారు బ్రిటిష్ కమిటీకి అధ్యక్షులు కారు. అయినా ఖర్చుల నిమిత్తం సామ్ము వారికి వంపి, వారి ద్వారా బ్రిటిష్ కమిటీకి పంపే ఏర్పాటు చేయడం మంచిదని భావించాము ఆ విధంగా పంపిన సొమ్ము వాపసు చేసి, యీ సొమ్ము మీరు సర్ విలియం బెడ్ బర్న్ గారికే పంపండని మాకు తెలియజేశారు. వారు మాకు సహాయం చేస్తూ వుండేవారు. కాని బెడ్ బర్న్ గారి ద్వారా పని చేయిస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని వారి అభిప్రాయం అంత పెద్దవారై యుండి కూడా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఎంతో మెలకుప వహించి యుండేవారు వివరాలు వ్రాయడానికి ఏమీ లేకపోతే బాబు అందిందని తెలిపి, ప్రోత్సహిస్తూ ఒక వాక్యం వ్రాసేవారు. అట్టి బాబులు వారే వ్రాసేవారు. ఆ జాబుల వివరం ఇష్యూబుక్కులో వ్రాసివుంచేవారు

మేము మా సంస్థకు కాంగ్రెస్ అని పేరు పెట్టామే కాని మా సమస్యలను మరో పార్టీ సమస్యలుగా చేయడం మా కోరిక కాదని గతంలో పేర్కొన్నాను అందువల్ల దాదాబాయి నౌరోజీ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లే మిగతా పార్టీల వారితో కూడా జరుపుతూ వున్నాము వారిలో యిద్దరు ప్రముఖులపేర్లు పేర్కొనడం అవసరం ఒకరు సర్ మంచర్జీ భావనగరీ, రెండవ వారు సర్ విలియం విల్సన్ హంటర్ సర్‌మంచర్జీ భావనగరీ అప్పుడు బ్రిటిష్ పార్లమెంటు మెంబరుగా వుండేవారు. వారి వల్ల మాకు మంచి సాయం లభిస్తూ వుండేది. మాకు ఎన్నో అమూల్యమైన సూచనలు యిస్తూ వుండేవారు దక్షిణాఫ్రికా యందలి భారతీయుల సమస్యల్ని అర్థం చేసుకొని, అందుకు అవసరమైన సలహాలు సర్ విలియం ఎల్సన్ హంటర్ యిస్తూ వుండేవారు వారు "టైమ్సు" యందలి భారతీయ విభాగానికి సంపాదకులు మేము వారికి దక్షిణాఫ్రికా భారతీయుల స్థితిగతులను గురించి బాబు వ్రాశాము అప్పటినుంచి వారు టైమ్సు పత్రికలో భారతీయుల విషయమై శ్రద్ద వహించి వ్రాయడం ఆరంభించారు. మా కోరికల్ని తాము సమర్థించడమే గాక అనేక మంది పెద్దల అభిప్రాయాలు కూడా ప్రకటించి మా కృషికి సాయం చేశారు. మహత్తరమైన విషయాలపై ప్రతివారం వారి జాబు మాకు అందుతూ వుండేది వారు తమ మొదటి జూబులో "మీరు మీ స్థితిని గురించి వ్రాసిన విషయాలు చదివి నాకు దుఃఖం కలిగింది. మీరు వినమ్రతతో, శాంతిగా అతిశయోక్తులు లేకుండా పోరాటం జరుపుతున్నారు యీ విషయంలో నా సంపూర్ణ సానుభూతి మీ యెడ వున్నది. మీకు న్యాయం జరగాలి అందుకొసం నేను వ్యక్తి గతంగానేగాక. బహిరంగంగా కూడా చేయువలసిందంతా చేస్తాను యీ విషయంలో మనం ఒక అంగుళమైనా వెనుకంజవేయుటకు వీలు లేదు. తటస్థంగా వుండే ఏ వ్యక్తి యీ విషయంలో తగ్గమని చెప్పుడు చెప్పలేడు" అని వ్రాశారు. టైమ్సులో ప్రచురించిన తన వ్యాసంలో కూడా దరిదాపుగా పై విషమేవారు వ్రాశారు చివరి వరకు వారు మా విషయంలో అలాగే వ్యవహరించారు. లేడీ హంటర్ వ్రాసిన ఒక జాబులో "తన మృత్యు సమయానికి పూర్వమే, దక్షిణాఫ్రికా భారతీయుల విషయంలో వ్రాయదలచుకున్న వ్యాసాల రూపురేఖలు తయారు చేశానని" పేర్కొన్నారు.

శ్రీమాన్ నాజర్‌గారి పేరు గత ప్రకరణంలో పేర్కొన్నాను భారతీయుల అభిప్రాయాల్ని చక్కగా నివేదించుటకు వారిని దక్షిణాఫ్రికా భారతీయులందరి పక్షాన ఇంగ్లాండుకు పంపించాము వివిధ పార్టీల వారందరితో సంబంధం పెట్టుకొని యీ పని చేయమని వారికి చెప్పాము వారు ఇంగ్లాండులో వున్నంతకాలం కీ॥శే॥ సర్ విలయం విల్సన్ హంటర్, సర్‌మంచర్జీ భావనగరీ, మరియు భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ మెంబర్లతో సంబంధం పెట్టుకొని వున్నారు. వారు భారత సివిల్ సర్వీస్‌కు సంబంధించి రిటైరైన ఆధికారి భారత మంత్రి కార్యాలయం అధినివేశమంత్రి కార్యాలయంతో కూడా మంచి సంబంధం పెట్టుకొని పని చేశారు. తాను వెళ్ల గలగినంత దూరం వెళ్లి భారతీయుల కోసం ఇంగ్లాండులో అవిరళకృషి చేశారు. తత్ఫలితంగా, దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితి గతుల వ్యవహారం బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో ప్రథమ స్థానం ఆక్రమించింది. దానివల్ల మంచిలేక చెడు ప్రభావం మిగతా అధినివేశరాజ్యాల మీద పడింది ఏ ఏ అధినివేశ రాజ్యాల్లో భారతీయులు నివసించి యున్నారో వారందరిలో చైతన్యం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ఆయా రాజ్యల యందలి శ్వేత జూతీయులు భారతీయులు తమ రాజ్యాలలో ఏఏ ప్రమాదాలు తమకు కలిగించగలరోనని జాగ్రత్త పడ్డారు.



9

బోయర్ యుద్ధం

గత ప్రకరణాలు శ్రద్దగా చదివిన పాఠకులకు బోయర్ యుద్ధం జరిగినప్పుడు భారతీయుల స్థితిగతులు దక్షిణాఫ్రికాలో ఎలా వున్నాయో బోధపడియుండవచ్చు. తమ స్థితిని సరిదిద్దుకునేందుకై వారు చేసిన ప్రయత్నాలు కూడా బోధపడివుంటాయి

డా॥ జెమిసస్ బంగారు గనుల యజమానులతో జరిపిన చర్చల తరుపాత ఆ ప్రకారం అతడు 1899లో జోహన్స్‌బర్గ్ మీద దాడి చేశాడు. జోహన్స్‌బర్గు మీద అధికారం పొందిన తరువాతనే బోయర్ ప్రభుత్వానికి దాడి విషయం బోధపడుతుందని భావించాడు. అలా అనుకొని డా॥ జెమిసస్. అతని అనుచరులు చాలా పొరపాటు చేశారు. మరో తప్పు కూడా వాళ్లు చేశారు మన కుట్ర బయటపడినప్పటికీ రోడేషియాలో శిక్షణ పొందిన గురికాండ్ల