దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/బోయర్‌ యుద్ధం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మరియు భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ మెంబర్లతో సంబంధం పెట్టుకొని వున్నారు. వారు భారత సివిల్ సర్వీస్‌కు సంబంధించి రిటైరైన ఆధికారి భారత మంత్రి కార్యాలయం అధినివేశమంత్రి కార్యాలయంతో కూడా మంచి సంబంధం పెట్టుకొని పని చేశారు. తాను వెళ్ల గలగినంత దూరం వెళ్లి భారతీయుల కోసం ఇంగ్లాండులో అవిరళకృషి చేశారు. తత్ఫలితంగా, దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితి గతుల వ్యవహారం బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో ప్రథమ స్థానం ఆక్రమించింది. దానివల్ల మంచిలేక చెడు ప్రభావం మిగతా అధినివేశరాజ్యాల మీద పడింది ఏ ఏ అధినివేశ రాజ్యాల్లో భారతీయులు నివసించి యున్నారో వారందరిలో చైతన్యం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ఆయా రాజ్యల యందలి శ్వేత జూతీయులు భారతీయులు తమ రాజ్యాలలో ఏఏ ప్రమాదాలు తమకు కలిగించగలరోనని జాగ్రత్త పడ్డారు.9

బోయర్ యుద్ధం

గత ప్రకరణాలు శ్రద్దగా చదివిన పాఠకులకు బోయర్ యుద్ధం జరిగినప్పుడు భారతీయుల స్థితిగతులు దక్షిణాఫ్రికాలో ఎలా వున్నాయో బోధపడియుండవచ్చు. తమ స్థితిని సరిదిద్దుకునేందుకై వారు చేసిన ప్రయత్నాలు కూడా బోధపడివుంటాయి

డా॥ జెమిసస్ బంగారు గనుల యజమానులతో జరిపిన చర్చల తరుపాత ఆ ప్రకారం అతడు 1899లో జోహన్స్‌బర్గ్ మీద దాడి చేశాడు. జోహన్స్‌బర్గు మీద అధికారం పొందిన తరువాతనే బోయర్ ప్రభుత్వానికి దాడి విషయం బోధపడుతుందని భావించాడు. అలా అనుకొని డా॥ జెమిసస్. అతని అనుచరులు చాలా పొరపాటు చేశారు. మరో తప్పు కూడా వాళ్లు చేశారు మన కుట్ర బయటపడినప్పటికీ రోడేషియాలో శిక్షణ పొందిన గురికాండ్ల ఎదుట అనుభవంలేని బోయర్ రైతులు ఏమీ చేయలేరని అనుకున్నారు జోహన్సుబర్గునందలి ఎక్కువ మంది ప్రజలు తమకు స్వాగతం పలుకుతారని భావించి మూడో తప్పు చేశారు. వాళ్ల ఆశలేమీ ఫలించలేదు. ప్రెసిడెంట్ క్రూగరుకు జరుగుతున్న కుట్ర అంతా తెలిసిపోయింది. కడు రహస్యంగా జాగ్రత్తగా లోలోపల ఆతడు సైన్యాన్ని అప్రమత్తం చేసి సిద్ధంగా వుంచాడు యీ కుట్రలో పాల్గొన్న వాళ్లందరినీ నిర్బంధించుటకు కూడా ఏర్పాట్లన్నీ చేసి వుంచాడు డా. జెమిసన్ మనుష్యులు జోహన్సుబర్గు చేరేలోపునే తుపాకులతో క్రూగర్ సైనికులు వాళ్లను ఎదుర్కొన్నారు. అంత సైన్యం ఎదుట డా॥ జెమిసస్ దళం నిలవలేకపోయింది. జోహన్సు బర్గులో ఎవ్వరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వీలులేకుండా కూడా క్రూగర్ ఏర్పాట్లు చేశాడు. అందువల్ల ఒక్కడు కూడా ఎదుర్కొడానికి సాహసించలేదు క్రూగర్ చేసిన ఏర్పాట్లు చూచి జోహన్స్‌బర్గ్ నందలి కోటీశ్వరులంతా నివ్వెరబోయారు యీ కారణాన్నంటివల్ల తిరుగుబాటును విఫలం చేయుటకు అధికంగా ధనం ఖర్చు చేయవలసిన అవసరం కలుగలేదు ప్రాణనష్టం కూడా బహుతక్కువగా జరిగింది.

డా॥ జెమిసస్, అతని మిత్రులు, గనుల యజమానులు కొందరు నిర్బంధించబడ్డారు. కేసులు నడిచాయి. కొందరికి ఉరిశిక్షలు పడ్డాయి. అపరాధుల్లో ఎక్కువ మంది కోటీశ్వరులే అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఏ విధమైన సహాయం చేయలేక పోయింది పట్టపగలు వాళ్లు తిరుగుబాటుకు పూనుకోవడమే అందుకు కారణం దానితో ప్రెసిడెంట్ క్రూగర్ పేరు ప్రతిష్ఠలు పెరిగిపోయాయి. అధినివేశాల రాజ్యాల మంత్రి శ్రీ ఛేంబర్లేన్ దీనాతిదీనంగా ఒక తంతిక్రూగరుకు పంపాడు. శ్రీ క్రూగర్ యొక్క దయాగుణాన్ని ప్రశంసించి, బ్రిటిష్ కోటీశ్వరులను రక్షించమని ప్రార్థించాడు పందెం వేయడంలో క్రూగర్ ప్రజ్ఞాశాలి దక్షిణాఫ్రికాయందలి ఏ పక్షమూ తన ఆధికారం కాజేయలేదనే విశ్వాసం బాగా అతడి మనస్సులో నాటుకుంది డా॥ జెమిసస్ అతడి మిత్రులు గొప్ప పని చేశామని భావించారే కాని సరిగా వ్యవహరించక పోవడం వల్ల గట్టి దెబ్బతిన్నారు. ఈ వ్యవహారంలో క్రూగర్ తెలివిగా వ్యవహరించడమే గాక చేంబర్లేన్ కోరికను మన్నించి కోటీశ్వరులందరికీ ఉరిశిక్ష రద్దుచేయడమే గాక వారందరినీ క్షమించి వదిలివేశాడు

ఉబ్బరం చేసిన ఉదరంలో తిన్నతిండి ఎంతసేపు యిముడుతుంది ? కక్కు ద్వారా బయటికి పోవలసిందే కదా డా॥ జెమిసన్ వ్యవహారాన్ని చక్కదిద్దినా యిది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే, కాని దీని వెనుక తన ఎడ అసంతృప్తి అధికంగా ఉన్నదని క్రూగరుకు తెలుసు జోహన్స్‌బర్గు కోటీశ్వరులు తాత్కాలికంగా దెబ్బతిన్నా వూరుకోరని, సమయం చిక్కినప్పుడు చావు దెబ్బ తీస్తారని అతడికి తెలుసు డా జెమిసన్ ఏ సంస్కరణలకోసం యింత పనిచేశాడో వాటిలో ఒక్కటికూడా అమలు కాలేదు. కనుక కోటీశ్వరులు శాంతి పహించడం సాధ్యమా? అదీగాక వాళ్ల కోరికలు నెరవేరాలనిజోహన్స్‌బర్గులో గల బ్రిటిష్ హైకమీషనరు డాల్డ్‌మిల్సిర్ కోరుతున్నాడు. చేంబర్లెస్ డా॥జెమిసస్ మరియు బ్రిటిష్ కోటీశ్వరుల యెడ క్రూగర్ చేసిన మేలును ప్రశంసిస్తూనే వాళ్లు కోరిన సంస్కరణలు అమలు చేయడం అవసరమని కూడా ప్రకటించారు. యుద్ధం తప్ప యీ సమస్యను పరిష్కరించుటకు మరో మార్గం లేదని అందరూ అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కోటీశ్వరుల కోరికలు నెరవేరిస్తే ట్రాన్స్‌వాల్‌నందలి బోయర్ల ప్రభుత్వం తొలిగిపోకతప్పదు. దీనికి పరిష్కారం యుద్ధమే గనుక రెండు పక్షాలు యుద్ధానికి సిద్ధపడి పని ప్రారంభించాయి. రెండు పక్షాల శబ్ద యుద్ధం బ్రహ్మాండంగా జరగసాగింది. క్రూగరు యుద్ధ సామగ్రి తెప్పించగానే బ్రిటిష్ హైకమిషనరు ఆ ప్రయత్నాన్ని ఖండించి, బ్రిటీష్ ప్రభుత్వం కూడా యిట్టి పనిచేస్తుందని హెచ్చరిస్తూండేవాడు ఈ విధంగా యిద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభమైందనే చెప్పవచ్చు

ఇక క్రూగర్ ఆగలేకపోయాడు ఆగితే శతృవుల వలలో బడినట్లేనని భావించాడు. బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర సైన్యం బలం, అర్ధబలం అన్నీ వున్నాయి. అది క్రూగరును మాటిమాటికీ హెచ్చరిస్తూ బ్రిటిష్ కోటీశ్వరులకోరికలను నెరవేర్చమని ప్రకటిస్తూ, క్రూగరు లక్ష్యం చేయడంలేదనే భావం ప్రపంచ ప్రజలకు కలిగేలా చేసి చివరికి యుద్ధం ప్రకటిస్తుందని క్రూగరు గ్రహించాడు. తమ బలం అధికం కనుక క్రూగరు తలవంచి తీరతాడని బ్రిటిష్ వాళ్లకు తెలుసు అయితే బోయర్లు కూడా సామాన్యులుకారు 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ప్రతి బోయర్ పురుషుడు యుద్ధం చేయగలడు బోయర్ స్త్రీలు కూడా నిర్ణయానికి వస్తే యుద్ధంలో పాల్గొని పోరాటం సాగించగలరు. అక్కడి ప్రజల దృష్టిలో జాతీయ స్వాతంత్ర్యం ఒక మత స్వాతంత్ర్యమే అట్టిబోయర్లు బ్రిటిష్ సామ్రాజ్యం ముందు తలవంచుతారా? ఇదీ అక్కడి పరిస్థితి

ఆరెంజ్‌ఫ్రీస్టేట్స్ ప్రెసిడెంట్ క్రూగర్ ఆదివరకే రాజీపడ్డాడు. ఈ రెండు బోయర్ ప్రభుత్వాల విధానం ఒక్కటే బ్రిటిష్ వారికోరికల్ని గని యజమానులైన బ్రిటిష్ కోటీశ్వరుల కోరికల్ని పూర్తిగా అంగీకరించడం ప్రెసిడెంట్ క్రూగరుకు యిష్టంలేదు. కనుక యుద్ధం తప్పదు. అయితే సమయం గడిచిన కొద్దీ బ్రిటిష్ సామ్రాజ్యానికి బలం పెరిగిపోతుంది కనుక అతడు తన అభిప్రాయాన్ని బ్రిటిష్ హైకమీషనరుకు తెలిపి ట్రాన్స్‌వాల్, ఫ్రీస్టేట్‌ల సరిహద్దుల దగ్గర సైన్యాన్ని మొహరించాడు. ఇక యుద్ధం తప్ప మరోమార్గం లేని స్థితి ఏర్పడింది. ఇట్టి బెదిరింపుకు బ్రిటిష్ సామ్రాజ్యం తలవంచడమా? క్రూగర్ అల్టిమేటమ్ గడువు పూర్తి కాగానే అతడి సైన్యాలు ముందుకు సాగాయి. లేడీస్మిధ్, కింబర్లీ, మెఫేకింగ్‌లను చుట్టుముట్టాయి. ఈ విధంగా 1899లో యుద్ధం ప్రారంభమైంది. బోయర్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోరికల్లో ఒకటి అక్కడ నివసిస్తున్న భారతీయుల స్థితిలో మార్పు అవసరమనునదీ ముఖ్యమైనదే

ఇక దక్షిణాఫ్రికా యందలి భారతీయులు మనం ఏం చేయాలనే సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది బోయర్ పురుషులంతా సంగ్రామంలో పొల్గొనుటకు వెళ్లిపోయారు. వకీళ్లు వకీలు వృత్తిమానివేశారు. రైతులు వ్యవసాయం మానివేశారు. వ్యాపారులు వ్యాపారం మాని వేశారు. నౌకర్లు నౌకరీ వదిలివేశారు. ఇంగ్లీషు వాళ్ల పక్షాన అంతమంది లేకపోయినా కేప్ కాలనీ, నేటాలు, రొడీషియాలలో గల సైన్యంలో చేరని ప్రజలు పెద్ద సంఖ్యలో వాలంటీర్లుగా చేరారు నేను పని చేసే కోర్టులో వకీళ్లు బాగా తగ్గిపోయారు. ఆంగ్లబారిష్టర్లు, వకీళ్లు, వ్యాపారస్తులు అంతా వాలంటీర్లుగా చేరారు. భారతీయుల్ని గురించి ఆంగ్లేయులు ఆక్షేపించడం ప్రారంభించారు "వీళ్లు కేవలం డబ్బుకోసమే వున్నారు. మనకు వాళ్లు బరువు చేటు కర్రకు చెదపట్టిదాన్ని బెండుగా చేసినట్లు యీ భారతీయులు యిక్కడ మనల్ని పట్టి పిప్పిచేస్తున్నారు. మనకు కష్టం వస్తే వీళ్లు పట్టించుకోవడం లేదు. ప్రమాద సమయంలో మనల్ని మనం రక్షించుకోవలసి రాపడమే గాక, యీ భారతీయుల్ని కూడా రక్షించవలసి వస్తున్నది. "యిదీ భారతీయుల్ని గురించి ఆంగ్లేయులు చేసిన తీవ్రమైన ఆరోపణ దీన్ని గురించి భారతీయులు చర్చించాము. యిది సరికాదని నిరూపిద్దామనే నిర్ణయానికి చాలా మందిమివచ్చాము అయితే కొందరు క్రింది అభిప్రాయాల్ని కూడా వెల్లడించారు

ఇంగ్లీషు వాళ్లు, బోయర్లు యిద్దరూ మనల్ని సమానంగా పీడిస్తున్నారు హింసిస్తున్నారు. ఒక్క ట్రాన్స్‌వాల్‌లోనే గాక, నేటాలులోను, కేప్ కాలనీలో కూడా యమయాతనలు పడవలసి వస్తున్నది పరిమాణంలో తేడా తప్ప కష్టాలు అమితంగా పడుతున్నాము మనదిభానిస జాతి అని అంతా భావిస్తున్నారు. బోయర్లవంటి చిన్నజాతి, తమ అస్తిత్వాన్ని రక్షించుకోవడం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతున్న విషయం నిజమే యిది తెలిసిన తరువాత కూడా మనం దాని నాశనానికి కారణం కావడం సబబా బోయర్లు యుద్ధంలో ఓడిపోతారని చెప్పలేము వాళ్లు గెలిస్తే మనల్ని వదులుతారా"

ఈ వాదనను సమర్థవంతంగా మా ముందు వుంచగలిగిన దళం ఏర్పడింది. నాకు యీ వాదననచ్చింది. దాన్ని సమర్ధించాలని భావించాసు కాని చివరికి యిది సరికాదనే నిర్ణయానికి వచ్చాను నేను యీ వాదనను వ్యతిరేకించాను

“డక్షిణాఫ్రికాలో మనం బ్రిటిష్ ప్రజలంగా వుంటున్నాము ఏ అర్జీపంపినా అందు బ్రిటిష్ ప్రజలంగా మనల్ని గురించి మనం వ్రాసుకొని అధికారాలు కోరుతున్నాము. బ్రిటిష్ ప్రజలరూపంలో గౌరవం మాకు కలదని ప్రపంచానికి తెలిసేలా చేసుకున్నాము. బ్రిటిష్ ప్రజలంగా భావించి ప్రభుత్వం మనల్ని ఆదరించింది యిప్పుడు వాళ్ల యిళ్లు వాకిళ్లు ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది మనం చేతులు కట్టుకు కూర్చుంటే తమాషా చూస్తూ కూర్చుంటే మన మానవత్వానికే కళంకం యిట్టి ప్రవృత్తి మన కష్టాల్ని యింకా పెంచుతుంది మన మీద వారేమోమో ఆరోపణలు చేస్తున్నారని మనం భావిస్తున్నాం ఆంగ్లేయులు చేస్తున్న ఆరోపణలు తప్పని రుజూ చేసే సదవకాశం యిప్పుడు మనకు లభించింది. మనం యిప్పుడు ఏమీ చేయకపోతే వాళ్ల ఆరోపణలు నిజమేనని మనమే రుజూ చేసినవారమవుతాం తరువాత మన కష్టాలు పెరగవచ్చు. ఆంగ్లేయులు గట్టిగా మనల్ని ఆక్షేపించవచ్చు. మనం బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు బానిసలంగా వున్నాము ఆ బానిస శృంఖలాల్ని తెగ గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం భారత దేశనాయకులు కూడా అందుకే కృషి చేస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్య పౌరులంగా అధికారాలు మనం కోరుతూ వుంటే, యీ యుద్ధ సమయంలో వాళ్లకు సంపూర్తిగా మనం సహకరించడం అవసరం బోయర్లది న్యాయ పక్షమని చాలా వరకు అంగీకరించినా, ఒక రాజ్య వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ, ఆవ్యవస్థను వ్యతిరేకించడం మంచిది కాదు ఆరాజ్యవ్యవస్థ అమలు పరిచే కార్యక్రమాలన్నీ సరియైనవేనని అనడానికి వీలులేదు. అయినా ఏరాజ్యవ్యవస్థలో వుంటామో, ఆ రాజ్యానికి ముప్పు వచ్చినప్పుడు దానికి సాయంచేయడం అవసరం అదీగాక రాజ్యవ్యవస్థ యొక్క కొన్ని చర్యలు ధర్మ బద్ధంకాక పోతే, వారికి పలు విధాల వ్యతిరేకతను తెలియజెప్పాలి మనం భారతీయులం అట్టి పని ఏమీ చేయలేదు. అటువంటి ధర్మ సంకటం యింతవరకు మనకు ఏర్పడ లేదు అందువల్ల మేము యీ యుద్ధంలో సహాయం చేయము అని చెప్పే పరిస్థితి యిప్పుడు లేదు. సామ్రాజ్య పౌరులంగా యీ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా నిలబడి మనం పని చేయాలి యిది మన కర్తవ్యం యుద్ధంలో ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడతారు అని యోచించవలసిన అవసరం లేదు అలా అనుకోవడం మొదలు పెడితే పాయ్యి నుంచి బయటపడి గాడిపొయ్యిలో పడినట్లవుతుంది. బోయర్లు గెలిస్తే మనల్ని గట్టి దెబ్బతీస్తారని అనుకోవడం కూడా వారికి అన్యాయం చేయడమే. మనకు మనం అన్యాయం చేసుకోవడమే. అలా యోచించడం పిరికి వారి లక్షణం మన నిజాయితీకి కళంకం ఆంగ్లేయులు ఓడిపోతే, తమ గతి ఏమైవుతుందోనని ఒక్క తెల్లవాడైనా యోచిస్తున్నాడా? యుద్దంలోకి దిగిన తరువాత యీ విధంగా ఎవ్వడూ ఆలోచించడు

1899లో యీ విధంగా భారతీయులకు చెప్పాను యీనాడు కూడా ఆ నా మాటల్లో మార్పు అవసరమని నేను భావించడం లేదు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యమంటే నాకు గల మోహం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య పౌరులంగా వుంటూ స్వాతంత్ర్యం పొందాలనే నా కోరిక యీనాడూ వుండివుంటే యిప్పుడు కూడా అలాగే చెప్పి వుండే వాణ్ణి నా యీ వాదనకు వ్యతిరేకంగా బ్రిటన్‌లోను, దక్షిణాఫ్రికాలోను జరిగిన విమర్శలను నేను విన్నాను. అయినా నా అభిప్రాయాల్ని మార్చు కోవలసిన అవసరం నాకు కలగలేదు. యీనాటి నా భావాలకు, ఆనాడు దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ వ్యవహారానికి ఏమీ సంబంధం లేదు. అయినా రెండు బలవత్తరమైన కారణాల వల్ల యీ విషయం వ్రాశాను. ఈ పుస్తకాన్ని త్వరత్వరగా చదివి ముగించాలని భావించే పాఠకులు ఓపికతో, శ్రద్ధతో చదివి అర్థం చేసుకుంటారనే ఆశ నాకు లేదు. యిట్టి పాఠకులు యీనాటి నా పనులకు, ఆనాటి నా భావాలకు పొంతన కుదుర్చుకోలేరు యిది మొదటి కారణం ఆ నాభావనాసరళి కూడా సత్యం మీదనే ఆధారపడియున్నది. మనస్సు లోపల ఒకటి, బయట మరొకటి వుండకూడదని, లోపల, బయట ఒకే విధంగా వుండి వ్యవహారించాలని, యిది ధార్మిక విధానానికి మొదటి మెట్టేనని, చివరిమెట్టు కాదని, యిట్టి పునాది లేనిదే ధార్మిక జీవన భవన నిర్మాణం చేయడం సాధ్యంకాదని నా నిర్ణయం యిది రెందవ కారణం

ఇక మనం మన చరిత్రవైపుకు మళ్లుదాం

నా వాదన చాలా మందికి నచ్చింది. అయితే యిది నా ఒక్కడి వాదనయేనని పాఠకులు గ్రహించకుందురు గాక. ముందు నుంచే చాలా మంది యీ అభిప్రాయాన్ని ప్రకటించారు. అయితే యింతటి భయంకరమైన యుద్ధ ఫెళఫెళార్పటుల మధ్య భారతీయుల హీనస్వరం ఎవరికి వినపడుతుంది అని వాళ్లు అనుకున్నారు. అసలు మనమాటకు విలువయిస్తారా? అదీగాక మనం భారతీయులం ఎన్నడూ యుద్ధంలో పాల్గొన లేదు. తుపాకీ చేత బట్టలేదు అని అంతా సందేహించారు. అయితే ఆయుధాలు చేపట్టకపోయినా, యుద్ధ రంగంలో చేయవలసిన పనులు యింకా చాలా వుంటాయి. వాటికి కూడా శిక్షణ అవసరం అడుగులో అడుగు వేస్తూ కదంత్రొక్కుతూ ఒక్క వరుసలో నడవడం కూడా మన వాళ్లకు తెలియదు. అంతేగాక సైనికులతో బాటు. పెద్ద మజిలీలు దాటడం, ఎవరి సామాను వాళ్లు మోసుకొని నడవటం కూడా మనకు కష్టమైన పనియే యింతే గాక తెల్లవాళ్లు మనల్ని 'కూలీ' అని పిలుస్తారు. అవమానిస్తారు. మనల్ని హీనంగా చూస్తారు. యిదంతా ఎలా సహించగలం? సైన్యంలో చేరతామని మనం కోరితే దాన్ని అంగీకరించేలా చేయడం సాధ్యమా? యీ పశ్నలన్నింటిని గురించి దీర్ఘంగా చర్చించి, ఏది ఏమైనా మన కృషి మనం తప్పక చేయవలసిందే అనునిర్ణయానికి వచ్చాము పనిచేయడం ప్రారంభిస్తే అదే యింకా పని చేయడాన్ని నేర్పుతుంది. మనకు సేవ చేయాలనే కోరిక వుంటే భగవంతుడే ఆ పని చేసే శక్తి ప్రసాదిస్తాడు లభించినపని ఎలా పూర్తి చేయగలం అని ఆలోచించ కూడదు. శక్తిని బట్టి శిక్షణ పొందాలి సేవాకార్యానికి పూనుకున్న తరువాత మానావమానాల్ని గురించి మనం పట్టించుకోకూడదు అవమానించిన వారికి కూడా మనం సేవ చేయవలసిందేనని అంతా నిర్ణయానికి వచ్చాం

మా కోరికను అంగీకరింప చేయుటకు అపరిమితంగా కష్టాలు పడవలసి వచ్చింది. అది ఒకరసవత్తరమైన గాధ కాని యిక్కడ ఆ గాధ వివరాలు వ్రాయడం లేదు. మేము కొందరం యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడాన్ని గురించిన శిక్షణ పొందాము మా శారీరిక శక్తికి సంబంధించిన సర్టిఫికెట్లు డాక్టర్ల దగ్గర తీసుకున్నాము ఆ తరువాత యుద్ధ రంగంలోకి వెళ్లడానికి అనుమతి యిమ్మని ప్రభుత్వానికి జాబు పంపాము మా జాబు యొక్క ప్రభావం మంచిగా పడింది. ప్రభుత్వం మాకు కృతజ్ఞత తెలుపుతూ, ప్రస్తుతం మీ కోరికను అంగీకరిరంచడం లేదని జాబు పంపింది యీ లోపున బోయర్ల శక్తి పెరిగిపోయింది. వాళ్ల దాడిభయంకరంగా సాగింది. వరదలా ముందుకు ఉరికి వాళ్ల సైన్యాలు నేటాల్ రాజధానీ నగరంలోకి ప్రవేశించనున్నాయనే భయం ప్రభుత్వాన్ని పట్టుకున్నది. గాయపడిన వారి దేహాలు చచ్చిపోయినవారి శవాలు కుప్పతిప్పలుగా పడి వున్నాయి. మా కోరికను అంగీకరించమని అప్పటికీ మా ప్రయత్నం సాగుతూనే వున్నది చివరికి అంబులెన్స్‌కోర్ (గాయపడ్డవాళ్లను ఎత్తుకు రావరం, వాళ్లకు సేవ చేయడం పనిగాగలదళం) రూపంలో మాకు అనుమతి లభించింది. మా జాబులో ఆసుపత్రుల యందలి పాయిఖానా దొడ్లను శుభ్రం చేస్తామని ఆసుప్రతుల్ని ఊడ్చి, కడిగి శుభ్రం చేస్తామని కూడా వ్రాశాము అందువల్ల అంబులెన్స్‌కోర్ మాకు వచ్చింది. స్వతంత్ర భారతీయులు, గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు అందు చేరతామని జాబులో వ్రాశాము దానితో పాటు గిర్‌మిటియా కార్మికులను కూడా చేర్చుకొనుటకు అనుమతించమని కోరాము అప్పుడు ప్రభుత్వానికి ఎక్కువమంది జనం అవసరమైనారు కనుక ప్రభుత్వాధికారులు వెంటనే గిర్‌మిటియా కార్మికులు చాకిరీ చేస్తున్న తెల్లవారి భవనాలకు వెళ్లి గిర్‌మిటియా కూలీలను అప్పగించమని ప్రార్థించారు దానితో 1100 మంది భారతీయుల అంబులెన్స్ కోర్ ఏర్పడింది. యుద్ధరంగానికి దర్జాగా బయలు దేరి వెళ్లాము వెళ్లేముందు పాఠకులకు పరిచితుడైన, నేటాలు యందలి తెల్లజాతి వాలంటీర్ల దళానికి నాయకుడైన శ్రీ ఎస్కంబ్ గారిని కలిసి వారి ఆశీస్సులు పొందాము కృతజ్ఞతలు కూడా వారు మాకు తెలియజేశారు. ఆంగ్ల భాషా పత్రికల బుర్ర తిరిగిపోయింది. యిది వాటికి గొప్ప చమత్కారమనిపించింది భారతీయులు యీ యుద్ధంలో పాల్గొంటారని వాళ్లు ఊహించలేదు

ఒక ఆంగ్లేయుడు భారతీయుల్ని ప్రశంసిస్తూ ఒక కవితకూడా ఘనంగా వ్రాసి పత్రికలో ప్రచురించారు. “చివరికి మనమంతా ఒక సామ్రాజ్యం బాలకులమే" అనునది అతడి కవిత యొక్క పల్లవిభావం

ఈ దళంలో 300 లేక 400 మంది గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు వున్నారు. వీరంతా స్వతంత్ర భారతీయుల కృషివల్ల వచ్చి చేరారు. అందు 37 మంది నాయకులు వున్నారు. వారి సంతకాలతోనే ప్రభుత్వానికి అనుమతి నొసంగమని జాబు వెళ్లింది. యితర జనాన్ని ప్రోగుచేసింది కూడా వారే యీ నాయకుల్లో బారిస్టర్లు వున్నారు. గుమాస్తాలు కూడా వున్నారు. మిగతా వారిలో తాపీ పనివాళ్లు. నేతపని వాళ్లు, తదితర చేతివృత్తుల వాళ్లువున్నారు. వారిలో హిందువులు మహమ్మదీయులు, మద్రాసీలు, ఉత్తర ప్రదేశ్ వాసులు, అన్ని మతాలవాళ్లు, అన్ని ప్రాంతాల వాళ్లు వున్నారు. అయితే భారతీయ వ్యాపారస్థులు మాత్రం ఎవ్వరూ అందులో చేరలేదు. కాని వారు ధనసహాయం బాగా చేశారు

ఇట్టి దళంలో చేరిన వారికి భత్తాలు లభిస్తాయి. అయితే యితర అవసరాలు వాళ్లకు చాలా వుంటాయి అ అవసరాలు కూడా తీరితే కఠోరంగా సాగే క్యాంపు జీవితంలో కొద్ది సదుపాయాలు లభిస్తాయన్నమాట ఆ అవసరాలు తీర్చడానికి భారత వ్యాపారస్థులు పూనుకున్నారు. గాయపడిన సైనికులకు మిరాయిలు, సిగరెట్లు వగైరా మేము యివ్వవలసివుంటుంది ఆ బాధ్యత కూడా వ్యాపారస్థులు వహించారు. పట్టణాల దగ్గర మాదళ సభ్యులు డేరాలు వేసుకొనవలసి వచ్చినప్పుడు అక్కడి భారత వ్యాపారులు తమ సహాయ సహకారాలు అందజేస్తూ వున్నారు. ఈ అంబులెన్స్ కోర్‌లో గిర్‌మిటియా కార్మికులు కూడా చేరారని తెలియజేశాను కదా వారి పనులు సరిచూచేందుకై వారితోబాటు వారి తెల్లజాతి సర్దార్లు కూడా వచ్చారు. అయితే చేయవలసిన పని అందరికీ సమానంగానే నిర్ణయించారు. అందరూ కలిసి మెలిసి వుండాలి గిర్‌మిటియా కార్మికులు మమ్మల్ని చూచి ఆనందపడిపోయారు. మొత్తం దళ వ్యవస్థ మాచేతికి వచ్చింది. అందువల్ల యీ అంబులెన్స్ దళం భారతజాతి కంతటికి ప్రతీకయని అందరూ భావించారు. వారి సేవాకార్యక్రమం వల్ల భారతజాతి గౌరవం ఇనుమడించింది కూడా అయితే నిజానికి గిర్‌మిటియా కార్మికుల చేరికకు సంబంధించిన గౌరవం భారత జాతికి లభించుటకు వీలులేదు. ఆ గౌరవం ఆ యా కార్మికులు పనిచేస్తున్న స్థావరాల యజమానులగు ఆంగ్లేయులకే దక్కాలి అయితే దళం తయారై కార్యరంగంలోకి దూకిన తరువాత దాని సువ్యవస్థిత సేవాకార్యక్రమం వల్ల ఎంతో గౌరవం భారతజాతికే లభించింది. యీ విషయాన్ని జనరల్ బులర్ తన పత్రాల్లో పేర్కొన్నాడు

జబ్బు పడ్డవాళ్లకు, గాయపడిన వాళ్లకు ఎలా సేవచేయాలో నేర్పిన డా॥ బూధ్ కూడా మెడికల్ సూపరింటెండెంటుగా మా దళం వెంటవున్నారు. వారు సహృదయులు మంచిపాదరీ వారు భారతీయ క్రైస్తవులతో బాటు పనిచేస్తూ వుండేవారు. అందరితో కలిసిమెలిసి వుండేవారు. నేను చెప్పిన 37 మంది భారతీయ నాయకుల్లో చాలా మంది వీరి శిష్యులే భారతీయుల అంబులెన్స్ దళం మాదిరిగా యూరోపియన్ల అంబులెన్స్ దళం కూడా తయారై కార్యరంగంలోకి దిగింది. రెండుదళాల కార్యక్రమం ఒకే చోట సాగింది

యుద్ధంలో సాయం చేస్తామని పంపిన మా పత్రంలో షరతులేమీ పెట్టలేదు. అయితే మా అనుమతి పత్రంలో ప్రభుత్వం, మీ దళంఫిరంగుల తుపాకుల గుండ్లు తగిలే స్థావరంలో పని చేయనక్కర లేదని పేర్కొన్నది అంటే అట్టి స్థావరంలో గాయపడి, పడిపోయిన సైనికుల శరీరాల్ని అక్కడ వుండి పనిచేసే అంబులెన్స్ దళం సభ్యులు వెంటనే ఎత్తుకొని కొంత దూరం వచ్చి వదిలి వెళితే మేము యిక ఆ శరీరాలను గురించి శ్రద్ధ వహిస్తామన్న మాట తాత్కాలికంగా ఏర్పడిన భారతీయులదళం, యూరోపియన్ల దళం రెండిటి సహకారం ప్రభుత్వానికి ఎందుకు అవసరమైందో తరువాత తెలిసింది లేడీస్మిథ్‌లో జరుగుతున్న సంగ్రామంలో జనరల్ హ్వైట్ చిక్కుకు పోయాడు అతణ్ణి రక్షించడానికి జనరల్ బులర్ పెద్ద ప్రయత్నం చేయవలసి వచ్చింది ఆ పోరులో యుద్ధస్థావరంలో పనిచేసే అంబులెన్స్ దళ సభ్యుల శక్తికి మించిన సైనికులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. యుద్ధం జరుగుతున్న చోటుకు, ఆసుపత్రికి మధ్యన రోడ్లు కూడా లేవు. దూరం కూడా ఎక్కువ గాయపడ్డ వాళ్లను గుర్రం బండ్ల మీద తీసుకుపోవడం అసంభవమై పోయింది. పెద్ద ఆసుపత్రులు రైలు స్టేషను దగ్గర, యుద్ధస్థావరానికి 8 నుంచి 25 మైళ్ల దూరాన ఉంటాయి. మేము వెంటనే పనికి దిగవలసి వచ్చింది అది మేము ఊహించిన దానికంటే కష్టమైన పని గాయపడ్డ సైనికుల శరీరాల్ని ఎత్తుకొని 7 లేక 8 మైళ్ల దూరం నడిచివెళ్లడానికి మేము అలవాటు పడ్డాం కాని ప్రమాదకరంగా గాయపడ్డ సైనికులను ఆఫీసర్లను మోసుకొని 25 మైళ్ల దూరం నడవవలసిన పరిస్థితి ఏర్పడింది. త్రోవలో వాళ్లకు మందులు యివ్వాలి మా పని ఉదయం 8 గంటల నుంచి సాయం కాలం 5 గంటల దాకా సాగుతుంది. అప్పటికి ఆసుపత్రికి మేము చేరి తీరాలి యిది చాలా కష్టమైనపని ఒక రోజున మేము యీ విధంగా 25 మైళ్ల దూరం నడవవలసి వచ్చింది. అదీగాక యుద్ధ ప్రారంభంలో ఓటములను బ్రిటిష్ వాళ్లు చవిచూడవలసి వచ్చింది పెద్ద సంఖ్యలో తెల్లజాతి సైనికులు గాయపడ్డారు. అందువల్ల తుపాకీ ఫిరంగుల గుండ్లు వర్షించే చోట మమ్మల్ని వెళ్లవద్దని విధించిన తమ షరతును ఉపసంహరించుకోవలసి వచ్చింది. అయితే ఒక్క విషయం వ్రాయడం అవసరం అట్టిస్థితి వచ్చినప్పుడు మీకిచ్చిన అనుమతి పత్రం ప్రకారం మిమ్మల్ని ప్రమాదకరమైన స్థావరానికి పంపుటకు వీలులేదు గుండ్ల వర్షం కురిసే చోటుకు మీరు వెళ్లడానికి యిష్టపడకపోతే జనరల్ బులర్ మిమ్మల్ని బలవంత పెట్టరు. కాని మీరు స్వేచ్చగా అందుకు అంగీకరిస్తే ప్రభుత్వం మీ ఉపకారాన్ని మరిచిపోలేదు" అని మాకు చెప్పారు. మేము ప్రమాదాలకు సిద్ధపడే వున్నాం. ప్రమాద స్థావరానికి దూరంగా వుండాలనే కోరిక మాకు లేదు. అందువల్ల మేమంతా అందుకు సిద్ధపడ్డాం వెళ్లాం కాని మాకెవ్వరికీ ఒక్క గుండు తగలలేదు. చిన్న దెబ్బకూడా తగలలేదు

మా దళ సభ్యులకు ఎన్నో సుఖం కలిగించే అనుభవాలు కలిగాయి అయితే వాటన్నింటినీ యిక్కడ వివరించను గిర్‌మిటియా కార్మికులు కూడా గలమా అంబులెన్స్ దళ సభ్యులు, ఆంగ్లేయుల అంబులెన్స్ దళ సభ్యులు కలిసిమెలిసి పని చేయవలసిన అవసరం ఎన్నోసార్లు కలిగింది యుద్ధస్థావరంలో సైతం అంతా కలిసి మెలిసి పనిచేశాం ఒక్కచోట కూడా ఆంగ్లేయులు మమ్మల్ని అవమానించలేదు. హీనంగా చూడలేదు. ఎంతో సఖ్యతతో అందరం కలిసి పనిచేశాం ఆంగ్లేయుల తాత్కాలిక ఆంబులెన్స్ దళంలో చేరిన వారంతా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న వారే తాము ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కోపతాపాలు అసూయా ద్వేషాలు విస్మరించి భారతీయులు ప్రాణాలకు తెగించి తమ జాతికి చేస్తున్న సేవల్ని చూచి ఆ సమయంలో వాళ్లంతా ఆనందంతో పొంగిపోయారు. జనరల్ బులర్ పత్రాల్లో మా సేవల్ని ప్రశంసించిన విషయం ముందే వ్రాశాను. మా 37 మంది భారతీయ నాయకులకు పతకాలు కూడా బహూకరించారు

లేడీస్మిద్ యందలి ఆంగ్లేయుల పటాలాల్ని, బోయర్ల దాడి నుంచి రక్షించిన తరువాత జనరల్ బులర్ యుద్ధకార్యక్రమం ముగిసింది. అందుకు రెండునెలల సమయం పట్టింది. అప్పుడు మా దళం, ఆంగ్లేయుల దళం రెండిటికీ ముక్తి లభించింది. తరువాత కూడా యుద్దం చాలా కాలం సాగింది మళ్లీ వెళ్లడానికి మేమంతా సిద్ధంగా వున్నాం అంతపెద్ద యుద్ధం మళ్లీ జరిగితే మీ సహకారం ప్రభుత్వానికి అవసరం అప్పుడు కబురు పంపుతామని అధికారులు మాకు జాబు పంపారు

దక్షిణాఫ్రికాలో జరిగిన యుద్ధంలో భారతీయులు పాల్గొని చేసిన పని సామాన్యమైనదే ప్రాణనష్టం కూడా ఏమీ జరగలేదు. అయినా ప్రాణాలకు తెగించి చేసిన సేవా ప్రభావం మాత్రం అమితంగా తెల్ల వారి మీద పడిందని చెప్పవచ్చు. భారతీయులు యుద్ధంలో పాల్గొని ఆంగ్లేయులకు సహాయం చేస్తారని కలలో సైతం ఎవ్వరూ ఊహించని తరుణంలో, అలా జరగడం వల్ల మంచి ప్రభావం అమితంగా తెల్లవారి హృదయాలపై పడింది. దాని విలువ కూడా బాగా పెరిగింది. బోయర్ యుద్ధం ముగిసేంతవరకు తెల్లవారి హృదయాలలో భారతీయులయెడ కృతజ్ఞతాభావం నిండి యున్నదనుట యదార్ధం

ఈ ప్రకరణాన్ని ముగించే ముందు ఒక అవిస్మరణీయ ఘట్టాన్ని గురించి యిక్కడ చెప్పడం అవసరం లేడీస్మిద్ బోయర్ల చేతుల్లో చిక్కినప్పుడు ఇంగ్లీషు వాళ్లతో బాటు కొద్దిమంది భారతీయులు కూడా అక్కడ వున్నారు వారిలో కొందరు వ్యాపారులు, మిగతావారు గిర్‌మిటియా కార్మికులు. బట్టి కార్మికులు కొందరు రైల్వేలో పని చేస్తున్నారు. కొందరు ఆంగ్లేయుల యిండ్లలో నౌకర్లుగా వున్నారు. ఒక గిర్‌మిటియా కార్మికుని పేరు పరభుసింగ్ శతృసైన్యాల ముట్టడిలో చిక్కుకున్న ప్రతివాడికి సైనిక అధికారులు కొన్ని పనులు అప్పగించారు. అతి ప్రమాద కరము, అత్యంత సహాయకారి యగు పని పరభుసింగుకు అప్పగించారు. లేడీస్మిధ్‌కు బహుసమీపంలో గల ఒక ఎత్తైన కొండ మీద బోయర్లు పోంపోం అను పేరుగల పెద్ద ఫిరంగిని నిలిపి వుంచారు ఆ ఫిరంగి నుంచి వెలువడిన అనేక గుండ్లకు లేడీస్మిధ్ యందలి చాలా భవనాలు కూలిపోయాయి. చాలా మంది జనం ప్రాణాలు కూడా కోల్పోయారు. ఫిరంగి నుంచి గుండు బయటికి వెలువడి, గురి చూచిన చోట పదడానికి ఒకటి రెండు నిమిషాల సమయం పడుతుంది. గుండు వెలువడిందని తెలిస్తే ఆ కొద్ది సమయంలో అది పడే చోటున వున్న జనం రక్షణ స్థావరాలకు చేరి ప్రాణం కాపాడుకోవచ్చు. పరభుసింగుకు అత్యంత ప్రమాదకరమైన ఆ పని అప్పగించారు. అతడు ఫిరంగి పై దృష్టి నిలిపి ఒక్క చెట్టు క్రింద కూర్చొని వుండేవాడు. ఫిరంగి గుండు మ్రోగగానే పెద్ద గంట మ్రోగించమని అతడికి ఆదేశం యివ్వబడింది. ప్రాణాలకు ముప్పు కలిగించే ఫిరంగి గుండు వెలువడగానే హెచ్చరిక గంటగణగణ మ్రోగేది వెంటనే జనం తమ తమ రక్షణ కేంద్రాలకు పరుగిడి అక్కడ దాక్కొని ప్రాణాలు కాపాడుకునే వారు పిల్లిని చూడగానే ఎలుకలు తెగబడి అటోయిటో పరుగెత్తి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినట్లుగా అక్కడి జనం గంట మ్రోతవినపడగానే వ్యవహరిస్తూ వుండేవారు పరభుసింగ్ చేసిన యీ అత్యద్భుత సేవా కార్యాన్ని ప్రశంసిస్తూ, లేడీస్మిద్ యందలి సైనికాధికారి “పరభుసింగ్ నిష్ఠాగరిష్ఠుడు. ఒక్క సారైనా అతడు తన కర్తవ్య నిర్వహణలో ఏమరుపాటు చూపలేదు " అని పొగిడి ఆదరించాడు పరభుసింగ్ ప్రాణాలకు అక్కడ అసలు రక్షణ లేదు. అయినా ప్రాణాలకు తెగించి అతడు చేసిన యీ ఘనకార్య సమాచారం నేటాలునందేగాక, అనాటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ చెవులదాకా వెళ్లింది కర్జన్ పరభుసింగ్ గౌరవార్థం ఒక కాశ్మీరు అంగరఖా పంపించాడు పరభుసింగ్ సేవా కార్యాన్ని అత్యధికంగా ప్రచారం కావించి, కారణం ప్రకటించి, పరభుసింగకు యీ అంగరఖాను ప్రదానం చేయమని అంగరఖాతో బాటు పత్రం కూడా పంపించాడు. యీ పని డర్బన్ సగర్ మేయరుకు అప్పగించబడింది. అతడు డర్బన్ నగర మందలి టౌన్ హాలు కౌన్సిల్ చేంబరులో బహిరంగ సభ జరిపి పరభుసింగ్‌కు ఆ అంగరఖాను కానుకగా సమర్పించాడు యీ ఘట్టం వల్ల ఏమనిషిని తేలికగా చూడకూడదు తుచ్చుడని భావించ కూడదు మరియు ఎంత పిరికిపంద అయినా అవసరం వచ్చినప్పుడు వీరుడైపోగలడు' అను రెండు విషయాలు మనకు బోధపడతాయి
10

యుద్ధం తరువాత

1900 నాటికి బోయర్ యుద్ధం ముగిసింది లేడీస్మిధ్, కింబర్లీ, మెఫేకింగ్‌కీలను బోయర్ సైన్యాల చేతుల నుంచి బ్రిటిష్‌వాళ్ళు విడిపించారు జనరల్ క్రోన్జే పారడీబర్గ్‌లో ఓడిపోయాడు బోయర్లు జయించిన బ్రిటిష్‌వారి భూభాగమంతా తిరిగి బ్రిటిష్ సామ్రాజ్యం క్రిందకు వచ్చింది. లార్డ్‌కిచనర్ ట్రాన్స్‌వాల్ ఫ్రీస్టేట్‌లను కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నాడు. యిక గొరిల్లా పోరాటాలు మాత్రమే మిగిలాయి

దక్షిణాఫ్రికాలో నా పనిపూర్తి అయిందనే నిర్ణయానికి వచ్చాను ఒకనెల రోజులు వుండాలని వెళ్లిన నేను ఆరుసంవత్సరాలు అక్కడ వుండిపోయాను కార్యక్రమ రూపురేఖలు స్థిరపడ్డాయి. అక్కడి ప్రజల అంగీకారం లేకుండానే నేను భారతావనికి తిరిగి రావడం కష్టమైపోయింది. నేను భారతదేశం వెళ్లి అక్కడ ప్రజానీకానికి సేవ చేస్తానని అనుచరులకు తెలియజేశాను దక్షిణాఫ్రికాలో నేను స్వార్థంవదిలి సేవాధర్మాన్ని నేర్చుకున్నాను. సేవాధర్మంయెడ నాకుగల మక్కువ బాగా పెరిగింది. శ్రీమనసుఖలాల్‌నాజర్ దక్షిణాఫ్రికాలో వున్నారు శ్రీ ఖాన్‌కూడా అక్కడ వున్నారు. దక్షిణాఫ్రికానుంచి కొద్ది మంది యువకులు ఇంగ్లాండు వెళ్లి బారిష్టరుపట్టా పుచ్చుకొని వచ్చారు. అట్టి స్థితిలో నేను అక్కడి నుంచి భారతీయులు ఒక్క షరతు పై భారతదేశానికి వెళ్లవచ్చునని చెప్పారు. అనుకోళుండా భారతజాతి ఆపదలో చిక్కుకుంటే మేము