దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/యుద్ధం తరువాత

వికీసోర్స్ నుండి

పని డర్బన్ సగర్ మేయరుకు అప్పగించబడింది. అతడు డర్బన్ నగర మందలి టౌన్ హాలు కౌన్సిల్ చేంబరులో బహిరంగ సభ జరిపి పరభుసింగ్‌కు ఆ అంగరఖాను కానుకగా సమర్పించాడు యీ ఘట్టం వల్ల ఏమనిషిని తేలికగా చూడకూడదు తుచ్చుడని భావించ కూడదు మరియు ఎంత పిరికిపంద అయినా అవసరం వచ్చినప్పుడు వీరుడైపోగలడు' అను రెండు విషయాలు మనకు బోధపడతాయి




10

యుద్ధం తరువాత

1900 నాటికి బోయర్ యుద్ధం ముగిసింది లేడీస్మిధ్, కింబర్లీ, మెఫేకింగ్‌కీలను బోయర్ సైన్యాల చేతుల నుంచి బ్రిటిష్‌వాళ్ళు విడిపించారు జనరల్ క్రోన్జే పారడీబర్గ్‌లో ఓడిపోయాడు బోయర్లు జయించిన బ్రిటిష్‌వారి భూభాగమంతా తిరిగి బ్రిటిష్ సామ్రాజ్యం క్రిందకు వచ్చింది. లార్డ్‌కిచనర్ ట్రాన్స్‌వాల్ ఫ్రీస్టేట్‌లను కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నాడు. యిక గొరిల్లా పోరాటాలు మాత్రమే మిగిలాయి

దక్షిణాఫ్రికాలో నా పనిపూర్తి అయిందనే నిర్ణయానికి వచ్చాను ఒకనెల రోజులు వుండాలని వెళ్లిన నేను ఆరుసంవత్సరాలు అక్కడ వుండిపోయాను కార్యక్రమ రూపురేఖలు స్థిరపడ్డాయి. అక్కడి ప్రజల అంగీకారం లేకుండానే నేను భారతావనికి తిరిగి రావడం కష్టమైపోయింది. నేను భారతదేశం వెళ్లి అక్కడ ప్రజానీకానికి సేవ చేస్తానని అనుచరులకు తెలియజేశాను దక్షిణాఫ్రికాలో నేను స్వార్థంవదిలి సేవాధర్మాన్ని నేర్చుకున్నాను. సేవాధర్మంయెడ నాకుగల మక్కువ బాగా పెరిగింది. శ్రీమనసుఖలాల్‌నాజర్ దక్షిణాఫ్రికాలో వున్నారు శ్రీ ఖాన్‌కూడా అక్కడ వున్నారు. దక్షిణాఫ్రికానుంచి కొద్ది మంది యువకులు ఇంగ్లాండు వెళ్లి బారిష్టరుపట్టా పుచ్చుకొని వచ్చారు. అట్టి స్థితిలో నేను అక్కడి నుంచి భారతీయులు ఒక్క షరతు పై భారతదేశానికి వెళ్లవచ్చునని చెప్పారు. అనుకోళుండా భారతజాతి ఆపదలో చిక్కుకుంటే మేము తెలియజేస్తాము అప్పుడు మీరు వెంటనే దక్షిణాఫ్రికా వచ్చితీరాలి అట్టి షరతుపైమీరు భారతావని వెళ్లవచ్చుననీ వారంతా చెప్పారు. ఓడ యాత్రకు అయ్యేఖర్చు, నాకుటుంబానికి అయ్యేఖర్చు భారతజాతి భరిస్తుందని వాళ్లు మాట యిచ్చారు. వారి షరతును అంగీకరించి నేను ఇండియాకు తిరిగివచ్చాను

బొంబాయిలో బారిస్టరీ ప్రారంభించాలని అనుకున్నాను కీ॥శే॥ గోఖలేగారి సలహా, సంప్రదింపులతో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది అందుకుగల ఒకకారణం జీవన నిర్వహణ రెండవ కారణం అందుకై బొంబాయిలో నేను కొద్ది గదులు అద్దెకు తీసుకున్నాను నావకాల్తా కూడా కొద్దిగా పుంజుకున్నది. దక్షిణాఫ్రికా యందలి భారతీయులతో నాకు విడదీయరాని సంబంధం ఏర్పడి పోయింది. అందువల్ల అక్కడి నుంచి భారతావనికి తిరిగివచ్చిన మిత్రులే అమితంగా కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించారు. వారివల్ల జీవన నిర్వహణకు తేలికగా ఏర్పాటు జరిగిపోయింది కాని నా జీవితంలో శాంతిసౌఖ్యాలు వ్రాసి లేవు మూడునాలుగు మాసాలు బొంబాయిలో గడిపానోలేదో, యింతలో దక్షిణాఫ్రికా నుంచి “ఇక్కడి పరిస్థితి తీవ్రంగా వున్నది శ్రీ ఛేంబర్లేన్ కొద్ది రోజుల్లో వస్తున్నారు. మీరు యిక్కడ వుండటం అవసరం' అని తంతి వచ్చింది

వెంటనే నేను బొంబాయి యందలి ఆఫీసును, నివాసాన్ని పదిలివేశాను దక్షిణాఫ్రికాకు బయలుదేరాను. 1902వ సంవత్సరం గడిచిపోతున్నది. 1901 చివరి రోజుల్లోబొంబాయిలో ఆఫీసు తెరిచాను తంతిద్వారా అక్కడి వాస్తవ పరిస్థితిని నేను గ్రహించలేకపోయాను ట్రాన్స్‌వాల్‌లోనే ఏదో విపత్కర స్థితి ఏర్పడి వుంటుందని ఊహించాను కుటుంబాన్ని ఇండియాలోనే వుంచాను మూడు నాలుగుమాసాల్లో తిరిగి రావచ్చని అనుకోవడమే అందుకు కారణం కాని డర్బన్ చేరిన తరువాత అక్కడి సంగతులు విని నివ్వెరబోయాను బోయర్ యుద్ధం తరువాత దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితిగతుల్లో ఎంతో మార్పు వస్తుందని అంతా భావించాము ముఖ్యంగా ట్రాన్స్‌వాల్, ఆరంజ్‌ఫ్రీస్టేట్‌లో ఏ విధమైన ఆపదరాదని భావించాము. బోయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు లార్డ్ లెన్స్ డౌనన్, లార్డ్ సెల్‌బర్న్. బ్రిటిన్‌కు చెందిన ఉన్నతాధికారులు యీ యుద్ధానికి గల కారణాల్లో బోయర్లు భారతీయులయెడ ప్రవర్తిస్తున్న చెడ్డతీరు కూడా ఒకటని ప్రకటించారు ప్రిటోరియా యందలి బ్రిటిష్ ఏజంటు కూడా నాతో అనేక సార్లు ట్రాన్స్‌వాల్ బ్రిటీష్ సామ్రాజ్యంలో అధినివేశ రాజ్యంగా మారితే అక్కడి భారతీయుల స్థితిగతులన్నీ మారిపోతాయని చెప్పాడు. తెల్లవారుకూడా రాజ్యవ్యవస్థ మారగానే ట్రాన్స్‌వాల్ యందలి పాత ప్రభుత్వం భారతీయులపై పెట్టిన ఆంక్షలు, చట్టాలు అన్నీ రద్దు అయి పోతాయని భామించారు. నిజానికి కొంత మంచి మార్పుకూడా కనబడింది. భూముల్ని వేలంవేసే అధికారులు బోయర్ యుద్దానికి పూర్వం భారతీయులు పాడిన పాటను అంగీకరించేవారుకాదు అట్టి వాళ్లు యిప్పుడు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. చాలా మంది భారతీయులు వేలంపాటలో భూముల్ని కొన్నారు కూడా పాటల్ని అంగీకరించిన తరువాత భూముల్ని రిజిష్టరు చేయించుకుందామని ఆఫీసులకి వెళ్లితే 1885 నాటిచట్ట మందలి 3వ నిబంధన ప్రకారం రిజిష్టరీ చేయుటకు నిరాకరించారు. డర్బన్ హార్బరులో దిగగానేయీ విషయం తెలిసింది మీరుట్రాన్స్‌వాల్ వెళ్లడం అవసరమని భారతీయ నాయకులు నాకు చెప్పారు. అయితే మి॥ ఛేంబర్లెస్ మొదట డర్బన్ వస్తాడని, యిక్కడి (నేటాల్) భారతీయుల స్థితిని గురించి వారికి చెప్పాలని, యిక్కడ పని పూర్తికాగానే ఆయనతో బాటు ట్రాన్స్‌వాల్ మీరు వెళ్ళమనికూడా వాళ్లు చెప్పారు

నేటాలులో భారతీయ ప్రతినిధి బృందం శ్రీ ఛేంబర్లేను కలిసింది. బృంద సభ్యులు చెప్పిందంతా శాంతితోను, సహనంతోను విని ఛేంబర్లేను నేటాల్ మంత్రి మండలి సభ్యులతో మాట్లాడతానని మాట యిచ్చాడు. బోయర్ యుద్దానికి పూర్వం భారతీయులకు వ్యతిరేకంగా నేటాల్‌లో జరిగిన చట్టాల్లో వెంటనే మార్పు వస్తుందని నేను ఆశించలేదు. అచట్టాల్ని గురించి గత ప్రకరణాల్లో నేను వివరించాను

బోయర్ యుద్ధానికి పూర్వం ఏభారతీయుడైనా, ఎప్పుడైనా ట్రాన్స్‌వాల్‌కు వెళ్లవచ్చు కాని యిప్పుడు ఆస్థితి మారిపోయిందని గ్రహించాను. అప్పుడు ఆంక్షలు తెల్లవారికి, భారతీయులకి ఒకేవిధంగా లేవు ఎక్కువమంది జనం ప్రవేశిస్తే వారికి ఆహారపానీయాలు కూడా లభించే పరిస్థితి యిప్పుడు అక్కడ లేదు. యుద్ధం అయిపోయిన తరువాత కూడా అక్కడి దుకాణాలు పూర్తిగా తెరుపబడకపోవడమే అందుకు కారణం దుకాణాల్లో గల సామగ్రిని బోయర్ ప్రభుత్వం కాజేసింది. అందువల్ల కొంత కాలం యీ ఆంక్ష వుంటే నష్టం లేదని అనుకున్నాను. అయితే ట్రాన్స్‌వాల్ ప్రవేశించే తెల్లవారికి, భారతీయులకు గల నిబంధనల్లో చాలా మార్పులు చేశారు. అనుమతి పత్రం యిచ్చేవిధానం మారింది. ఈ మార్పు సందేహాలకు, భయానికి తావు యిచ్చింది. అనుమతిపత్రాలు యిచ్చే ఆఫీసులు హార్బర్ల దగ్గర ఏర్పాటు అయ్యాయి. ఇంగ్లీషువాళ్లకు అడగగానే ఆ ఆఫీసుల్లో అనుమతి పత్రాలు యిస్తున్నారు. కాని భారతీయుల కోసం వేరే ఏషియాటిక్ శాఖను ప్రారంభించారు

ఈ విధంగా వేరే శాఖను మొదటిసారి ప్రారంభించారన్నమాట ఆ ఆఫీసుల్లో భారతీయులు అర్జీ పెట్టుకోవాలి ఆ అర్జీ మంజూరు కాగానే డర్బన్‌లేక, మిగతా హార్బర్లలో సామాన్యంగా అనుమతి పత్రాలు లభిస్తూవుంటాయి. నేను కూడా అనుమతి పత్రంతీసుకోవాలంటే, శ్రీ ఛేంబర్లెన్ ట్రాన్స్‌వాల్‌ను వదిలివెళ్లేంత వరకూ వేచివుండవలసిన స్థితి ఏర్పడింది ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు అటువంటి పత్రం నాకోసం సంపాదించలేకపోయారు. యిదివారిశక్తికి మించిన పని అయిపోయింది నాకు యిచ్చే అనుమతి పత్రానికి ఆధారం డర్బన్‌తో గల నా పరిచయమే పత్రం యిచ్చే అధికారిని నేను ఎరుగను. కాని డర్బన్ యందలి పోలీసు సూపరింటెండెంటును ఎరుగుదును అందువల్ల వారిని వెంటబెట్టుకొని వెళ్లి, ఆ అధికారికి నన్ను పరిచయంచేసుకొన్నాను. 1893లో నేను ఒక సంవత్సరం ట్రాన్స్‌వాల్‌లో వున్నానని చెప్పి అనుమతి పత్రం తీసుకున్నాను ప్రిటోరియా చేరాను

ప్రిటోరియాలో మరో వాతావరణం కనబడింది. ఏషియాటిక్ శాఖ భయంకరమైనదని, భారతీయుల్ని అణిచివేసేందుకే అశాఖ తెరవబడిందనీ అర్థం చేసుకున్నాను. ఆశాఖలో పనిచేస్తున్న ఆఫీసర్లంతా బోయర్ యుద్ధ సమయంలో సైన్యంతో బాటు భారతావని నుంచి దక్షిణాఫ్రికాకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావించి అక్కడ వుండిపోయిన వాళ్లే వారిలో కొందరు లంచాలు తినేరకం అట్టి యిద్దరు అధికారులపై లంచాలు అన్నారని కోర్టులో కేసులు కూడా నడిచాయి జడ్జీలు యిద్దరినీ నిర్దోషులని ప్రకటించి వదిలివేశారు. కాని లంచాలు తిన్నారని స్పష్టంగా బయట పడినందున ఆయిద్దరినీ ఉద్యోగాలనుంచి తొలగించివేశారు పక్షపాతానికి అక్కడ అంతే లేదు. ఎక్కడైనా సరే కొత్త విభాగాన్ని ప్రారంభిస్తే, అది అమల్లోవున్న అధికారాల్ని తగ్గించడంకోసమే కొత్త కొత్త అంక్లల్ని యోచించడం మొదలు పెడుతుంది. ఏషియాటిక్ విభాగం కూడా యిటువంటి రకమే

ఇక నాకార్యక్రమం మొదటి నుంచి ప్రారంభించక తప్పదనే నిర్ణయానికి వచ్చాను నేను ట్రాన్స్‌వాల్‌లోకి ఎలా ప్రవేశించానో ఏషియాటిక్ విభాగానికి బోధపడలేదు నన్ను తిన్నగా అడగడానికి అక్కడి వాళ్లకు ధైర్యం చాలలేదు అయితే నేను దొంగతనంగా ప్రవేశించే వ్యక్తిని కాదని వాళ్లకు తెలుసు నాకు ప్రవేశపత్రం ఎలా అందిందో వాళ్లు తెలుసుకున్నారు. ప్రిటోరియాలో భారతీయుల ప్రతినిధి బృందం కూడా శ్రీ ఛేంబర్లేనును కలుసుకునేందుకు సిద్ధపడింది. వారికి అందజేయవలసిన ఆర్జీని నేను తయారు చేశాను అయితే ఏషియాటిక్ విభాగం వాళ్లు నన్ను శ్రీ ఛేంబర్లేను కలుసుకోనీయలేదు అట్టి స్థితిలో తాముకూడా శ్రీ ఛేంబర్లేను కలుసుకో కూడదనే నిర్ణయానికి ప్రతినిది బృందసభ్యులు వచ్చారు. కానినేను అందుకు అంగీకరించలేదు నాకు జరిగిన అవమానాన్ని నేను మింగుతాను. మీరు లెక్కచేయవద్దని వారికి నచ్చ చెప్పాను ఆర్జీసిద్ధంగావున్నది. దాన్ని శ్రీ ఛేంబర్లేనుకు వినిపించడం అవసరం భారతీయ బారిష్టరు శ్రీ జార్జ్‌గాడ్ర్‌ఫ్రే అక్కడ వున్నారు. శ్రీ ఛేంబర్లేనుకు అర్జీ వినిపించుటకు వారిని సిద్ధంచేశాను. భారతీయ ప్రతినిధి బృందం ఛేంబర్లేనును కలిసింది. అక్కడ నా విషయం వచ్చింది "నేను డర్బన్‌లో మిష్టర్ గాంధీని కలిశాను. అందువల్ల యిక్కడ వారిని కలవనని చెప్పాను ట్రాన్స్‌వాల్ విషయం ట్రాన్స్‌వాల్‌వారి ముఖత: వినాలని నేను భావించాను" అని చేంబర్లెన్ వారికి చెప్పాడు ఆయన చెప్పిన యీ మాటలు అగ్నిలో ఆద్యంపోసినట్లైంది. మీ. ఛేంబర్లేన్ ఏషియాటిక్ విభాగం చెప్పిన చిలకపలుకుల్ని వినిపించాడన్న మాట భారతదేశంలో వ్యాప్తమైయున్న గాలినే ఏషియయాటిక్ విభాగం వాళ్లు ట్రాన్స్‌వాల్‌లోవ్యాప్తం చేశారు గుజరాతీ (లేక భారతీయులు! వాళ్లకు తెలుసు ఇండియా యందు బొంబాయిలో వుండేవారిని ఆంగ్ల అధికారులు చంపారన్‌లో పరదేశీయులుగా భావిస్తూవుంటారు. ఆసూత్రం ప్రకారం ఏషియాటిక్ శాఖ వాళ్లు డర్బన్‌లో వుండేవాడికి ట్రాన్స్‌వాల్‌లో వుండే భారతీయుల్ని గురించి ఏమీ తెలియదని ఛేంబర్లేనుకు నూరిపోశారన్నమాట నాకు అక్కడి విషయాలు క్షుణ్ణంగా తెలుసునని ఏషియాటిక్ శాఖవారికి తెలిసియుండకపోవచ్చు. అసలు ట్రాన్స్‌వాల్ పరిస్థితులు ఎవరికి ఎక్కువగా తెలుసు అని అడిగితే అక్కడి భారతీయులు నన్ను అక్కడికి పిలిపించి ఒక విధంగా సమాధానం ఇచ్చివేశారు. అధికారం చలాయిస్తున్న వారికి బుద్ధికి సంబంధించిన వాదనలు సరిపోవు అను విషయం క్రొత్తదేమీకాదు. మి॥ ఛేలబర్లెన్ ఆప్పుడు అక్కడి ఆంగ్లేయుల ప్రభావంలో బాగా పడిపోవడమేగాక వాళ్లను తృప్తిపరచాలనే భావంతో వాళ్లు ఏంచెబితే అలా చేశారని స్పష్టంగా తేలిపోయింది యిక న్యాయం ఎలా చేస్తాడు. అయినా మిగిలియున్న ఒక్క మార్గాన్ని త్రోసి వేయకూడదనే భావంతో అక్కడి భారతీయ బృందం సభ్యులు వెళ్లి అతణ్ణి కలిశారు

నాకు 1894 నాటికంటే యిప్పుడు గడ్డుపరిస్థితి ఏర్పడింది. ఛేంబర్లేన్ దక్షిణాఫ్రికానుంచి వెళ్లిపోగానే, నేను దక్షిణాఫ్రికా వదిలి ఇండియా వెళ్లవచ్చునని భావించాను. కాని దక్షిణాఫ్రికాలో సేవాధర్మం అంటే ఏమిటో తెలుసుకున్న నేను అక్కడి భారతీయుల్ని వదలి ఇండియాకు వెళ్లి అక్కడి జనావళికి సేవచేస్తానని చెప్పడం ధర్మంకాదని అనిపించింది. యిక ఏదిఏమైనా ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులపై విరుచుకు పడుతున్న పిడుగుల్ని అపివేయుటకు నేను యిక్కడ వుండి తీరాలనే నిర్ణయానికి వచ్చాను అందుకు యావజ్జీవితం దక్షిణాఫ్రికాలో వుండవలసి వచ్చినా వుండి తీరాలని కూడా అనుకున్నాను. ఈ విషయం జాతి సోదరులకు చెప్పాను. 1894లో వలెనే యీసారి కూడా అక్కడ వుండుటకు నా జీవన నిర్వహణను గురించి కూడా వారికి చెప్పాను అక్కడి వారంతా వెంటనే ఆనందంతో అంగీకరించారు

నేను వెంటనే ట్రాన్స్‌వాల్‌లో వకీలు వృత్తి ప్రారంభించడానికి అనుమతికోరుతూ అర్జీ పెట్టుకున్నాను. నేటాలులో జరిగినట్లే యిక్కడి వకీళ్ల సంఘంకూడా నా అర్జీని వ్యతిరేకిస్తుందని భయపడ్డాను కాని అలా జరగలేదు. వకీలు వృత్తి సాగించుటకు అనుమతి పత్రం లభించింది జోహన్స్‌బర్గులో ఆఫీసు తెరిచాను ట్రాన్స్‌వాల్ రాజ్యమందలి జోహన్స్‌బర్గులో భారతీయులసంఖ్య అధికంగా వున్నది అందువల్ల వ్యక్తిగత ఆదాయం , ప్రజాసేవ రెండిటి దృష్ట్యా జోహన్స్‌బర్గుయే అనుకూలంగా వుంటుందని భావించాను ఏషియాటిక్ విభాగపు కుళ్లుకంపు, విజృంభించింది. వాళ్ల అవినీతికరమైన చర్యల చేదు అనుభవం అక్కడ రోజూ కలుగుతూవున్నది ట్రాన్స్‌వాల్ భారత మండలి ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ యొక్కశక్తి సామర్థ్యాలన్నీ ఆకుళ్లుకంపును ఆపుటకు సరిపోతున్నాయి. యిట్టి స్థితిలో 1885 నాటి చట్టమందలి 3వ నిబంధన వ్యవహారం మరుగున పడిపోసాగింది. ఏషియాటిక విభాగం రూపంలో ఉవ్వెత్తుగా ముంచుకొస్తున్న వరదతాకిడి నుంచి రక్షణ పొందడం మామొదటి లక్ష్యమైపోయింది భారతప్రతినిధి బృందం లార్డ్ మిల్నర్. అక్కడికి వచ్చిన లార్డ్ సెల్బర్న్, ట్రాన్స్‌వాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆర్థక్‌లాలీ. (వీరు ఆ తరువాత మద్రాసు గవర్నరుగా పనిచేశారు), వారిక్రింది అధికారులనందరినీ కలిసి జరుగుతున్న అన్యాయాల్ని ఏకరువుపెట్టి అర్జీలు దాఖలు చేసింది. నేను ప్రతిరోజూ చాలామందిని కలుస్తూనే వున్నాను అటనట కొద్దిగాఊపిరిపోసే మాటలు వినబడుతూ వుండేవి. అయితే అవన్నీ చిరిగినబట్టకు కుట్లు వేసినట్టుగా వుండేవి. దోపిడి దొంగలు యింట్లో జొరబడి మొత్తంకొల్లగొట్టి ఎత్తుకు పోతూ ఏడ్చి మొరపెట్టుకుంటే చివరికి దయతలిచి కొద్ది డబ్బు యజమాని ముఖానపారవేసి వెళ్లినట్లు, తెల్లదొరల వ్యవహారం వున్నది యిట్టి వ్యవహారాల వల్లనే గతంలో నేను వ్రాసిన యిద్దరు ఆఫీసర్ల మీద కోర్టులో కేసు నడిచింది. భారతీయుల ప్రవేశం విషయమై మొదట నేను వెల్లడించిన భయం నిజమేనని తేలింది. తెల్ల వాళ్ల ప్రవేశానికి అనుమతి పత్రం అవసరంలేదని, భారతీయులు మాత్రం అనుమతిపత్రం తీసుకోవడం అవసరమని నిర్ణయించారు. గతంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసిన చట్టం కఠోరంగా వున్నది. కాని దాన్ని అమలు చేసే విషయంలో మెత్తగా అధికారులు వ్యవహరించారు. అయితే అది బోయర్ ప్రభుత్వపు ఉదారతకు మంచితనానికి తార్కాణం కాదు. ఆ ప్రభుత్వ అధికారుల అలసత్వమే అందుకు కారణం అవిభాగంలో పని చేసే అధికారులు మంచివారే అయినా. తమమంచితనాన్ని ప్రదర్శించుటకు బోయర్ ప్రభుత్వ హయాంలో వాళ్లకు లభించినంత అవకాశం, బ్రిటిష్ ప్రభుత్వ హయాములో లభించలేదు బ్రిటిష్ ప్రభుత్వం పాతబడి రాటుతేలినందున, అందుపనిచేసే అధికారులు యంత్రంవలె పని చేయవలసి వచ్చింది. ఆ అధికారుల పనితీరుపై, ఒకటి తరువాత మరొకటి చొప్పున ఎగుడుదిగుడు అంకుశాలు అనేకం పనిచేస్తూ వుంటాయి. అందువల్ల బ్రిటిష్ రాజ్యాంగపు పరిపాలనా పద్ధతి ఉదారంగా వుంటే ప్రజలకు ఉదారంగా లాభం చేకూరుతుంది. కాని దాని పద్ధతి సంకుచితంగాను, దుర్మార్గంగాను వుంటే, దాని నియంత్రణ ఎక్కువై ప్రజలు అణిచివేతకు గురి అవుతారు. యిందుకు తలక్రిందులుగా ట్రాన్స్‌వాల్ యందలిగత ప్రభుత్వ పరిపాలనా పద్ధతి వుండేది. వాళ్ల పద్ధతి ప్రకారం ప్రజలకు చట్టాలవల్ల కలిగే ప్రయోజనాలన్నీ, ప్రభుత్వాధికారుల యిష్టం ప్రకారం లభిస్తూవుండేవి. యీ పద్ధతి ప్రకారం ట్రాన్స్‌వాల్‌లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారతీయులకు సంబంధించిన చట్టాలు కఠినంగా అమలులోకి రాసాగాయి మొదట చట్టాలనుంచి తప్పించుకునేందుకు అనేకమార్గాలు వుండేవి. అవన్నీ యిప్పుడు బందు అయ్యాయి ఏషియాటిక్ విభాగం వారు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. దానితో అసలు చట్టాల్ని రద్దుచేయిద్దామనే మా కృషి మరుగునపడి, వాటిని అమలుపరుస్తున్న కఠినవైఖరిని ఎలా సరిచేయడమా అనే తపన ఎక్కువై పోయింది

ఇక ఒక సిద్ధాంతాన్ని గురించి త్వరగానో లేక ఆలశ్యంగానో యోచించడం అవసరం దానివల్ల భారతీయుల దృక్పధాన్ని, ఆతరువాత కలిగిన పరిణామాల ఫలితాల పరిస్థితుల్ని తెలుసుకోవడం సులభమవుతుంది. ట్రాన్స్‌వాల్, మరియు అరంజ్‌ఫ్రీస్టేటుల్లో బ్రిటిష్ జండా ఎగరసాగింది, అప్పుడు లార్డ్ మిల్నర్ ఒక కమిటిని ఏర్పాటు చేశాడు. పాత చట్టాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం, వాటి పట్టికను తయారు చేయడం, ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అంకుశంగా పనిచేసే చట్టాల్ని, బ్రిటిష్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వున్న చట్టాల్ని గురించి యోచించి వివరాలు తెలుపడం ఆ కమిటీ పని యందు భారతీయుల స్వాతంత్ర్యాన్ని హరించివేస్తున్న చట్టాల్ని గురించికూడా చర్చించమని చెప్పి యుంటే బాగుండేది. కాని లార్డ్ మిల్నర్ భారతీయుల కష్టాల్ని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, తెల్లవారికష్టాల్ని తొలగించాలనే ఉద్దేశ్యంతోనే ఆకమెటీని నియమించాడు. తెల్లవారికి యిబ్బందులు కలిగిస్తున్న చట్టాల్ని త్వరగా రద్దుచేయడమే ఆయనలక్ష్యం త్వరత్వరగా ఆకమిటీ ఒక రిపోర్టు తయారు చేసింది. ఆంగ్లేయులకు ఇబ్బందులు కలిగించే చిన్న పెద్ద చట్టాలన్నీ ఆరిపోర్టు ప్రకారం వెంటనే రద్దు అయిపోయాయి. ఆకమెటీ భారతీయులకు వ్యతిరేకంగా వున్నచట్టాల లిస్టుకూడా తయారుచేసింది. యిట్టి చట్టాలన్నింటినీ ప్రోగుచేసి ఒక పుస్తక రూపంలో ఆకమిటీ ప్రకటింఛింది దానిలో ఏషియాటిక్ విభాగానికి సదవకాశం లభించినట్లయింది. ఆ చట్టాల్ని యిష్టం వచ్చినట్లు అమలుపరచేందుకు అవిభాగం పూనుకున్నది

భారతీయుల పేరు పెట్టి వారికి వ్యతిరేకంగా చట్టాలు చేయకుండా ఆ చట్టాలు అందరికీ వర్తిస్తాయి అని చెప్పియున్నా, వాటిని అమలు పరచడమా లేదా అను విషయం అధికారులకు వదిలి వేసియున్నా. సామూహికంగా సర్వులకు వర్తిస్తాయి అనే అర్ధం చెప్పియున్నా. తెల్లవాళ్లు మాత్రం వాటిని భారతీయులకే వర్తింపచేసి యుండేవాళ్లు అట్టి చట్టాలు చేసినవారి కోరిక సర్వుల కోసం అనే అర్థంతో నెరవేరియుండేది అందువల్ల ఎవ్వరికీ ప్రత్యేకించి అవమానం జరిగియుండేది కాదు కాలం గడిచినకొద్దీ వ్యతిరేకత తగ్గేది వాటిలో ఏమిమార్పులు చేయకుండానే. వాటిని ఉదారంగా అమలుపరచియుంటే, ఎవరిని అణిచివేయడానికి యిట్టి చట్టాలు చేశారో, వారికి కొంత ఊరట కలిగియుండేది. తరువాత చేసిన చట్టాల్ని సర్వులకోసం అని అన్నట్లుగానే. ఒక్కొ జాతిని దృష్టిలో పెట్టుకొని చేసిన వాటిని కూడా సర్వుల కోసం అనియుంటే బాగుండేది దక్షిణాఫ్రికాలో యీ చట్టాలు రంగుభేదచట్టాలని పేరు పొందాయి. నల్లరంగు, గోధుమ రంగు చర్మం కలవారిపై తెల్లరంగు చర్మంగలవారి పెత్తనం పెరగడమే అందుకు కారణం అందుకే వీటిని రంగు భేదచట్టాలు అని అన్నారు ఉదాహరణకు ప్రచలితమైన చట్టాలలో ఒకదాన్ని పరిశీలించి చూద్దాం పాఠకులకు తెలిసిన విషయమే నేటాలులో ఓటింగు హక్కును గురించి ఒక చట్టం ప్యాసు చేశారు. దాన్ని పెద్ద ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. భవిష్యత్తులో ఏ ఆసియావాసికీ ఓటింగు హక్కు ఉండదు అని అందులో ఒక నిబంధనలో వ్రాసి పెట్టారు. దాన్ని యిప్పుడు మార్చవలసివస్తే, ఆసియావాసుల సంఖ్యబాగా పెరగటమే కాక, వారు సుశిక్షితులై గొప్పచైతన్యం పొందికూడా వుండటం అవసరం అయి వుండేది అటువంటి సదవకాశం కలిగినప్పుడే యీ రంగు విచక్షణా చట్టాలు రద్దవుతాయి. కళంకం తొలిగిపోతుంది

ఇది ఏకపక్షానికి వర్తించిన రంగుభేదానికి సంబంధించిన ఉదాహరణ నేటాలులో ప్యాసు చేయబడిన చట్టాన్ని నిరాకరించిన తరువాత మరో చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోను రంగుభేదం కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నది. అయినా అందలి రంగుభేదమనే తేలుకొండిని కొద్దిగా తుంపివేసినందున దాన్ని సర్వులకూ వర్తించే చట్టం అని అన్నారు. మరో చట్టం వున్నది. అందలి ఒక నిబంధనలో "ఏదేశంలో పార్లమెంటరీ ఎన్నికల విధానం అనగా బ్రిటిష్ లోకసభ సభ్యులను ఎన్నుకునే ఓటింగ్ హక్కువంటిది లేదో, ఆదేశ ప్రజలకు నేటాలులో ఓటింగ్ హక్కు పుండదు" అని వ్రాశారు ఈ నిబంధనలో భారతీయులు అని గాని ఆసియావాసులు అనిగాని ప్రత్యేకించి. పేర్కొనలేదు. భారతదేశంలో ఇంగ్లాండు వంటి ఓటింగు హక్కు విధానం వున్నదా లేదా అను విషయంపై లా నిపుణుల అభిప్రాయాలు వేరువేరుగా వుంటాయి. అయినా వాదన కోసం అప్పుడు అనగా 1894లో, భారతదేశంలో అట్టి ఓటింగు హక్కు లేదు. యిప్పటికి లేదు అని అంగీకరించినా, నేటాలునందలి ఓటింగ్ హక్కును అంగీకరించే అధికారి, భారతీయుల పేర్లుకూడా ఓటర్ల లిష్టులో నమోదుచేస్తే అతడు చట్టవిరుద్దంగా నిర్ణయంగైకొన్నాడని అనుటకు వీలులేదు. సామాన్యంగా ప్రజల అధికారాలకు అనుకూలంగా ప్రజాభిప్రాయం వుంటుంది. అందువల్ల ఆ అధికారి ఆ చట్టప్రకారం భారతీయులకు, తదితరులకు కూడా ఓటింగుహక్కు యివ్వవచ్చు. కాలంగడిచిన కొద్దీ నేటాల్ ప్రభుత్వానికి భారతీయుల యెడల తేలికభావం తగ్గిపోయిందనుకోండి, భారతీయుల్ని వ్యతిరేకించ వలసిన అవసరంలేదనుకోండి. అప్పుడు చట్టాల్లో ఎట్టి మార్పు చేయవలసిన అవసరం వుండదు. భారతీయుల పేర్లు ఓటర్ల లిస్టులో చేర్చవచ్చు సర్వులకు వర్తించే చట్టవిశేషం యిదే గతప్రకరణాల్లో నేను వివరించిన దక్షిణాఫ్రికాలో ప్యాసు చేయబడిన చట్టాల నుంచి కూడా యిట్టి ఉదాహరణులు యివ్వవచ్చు. అందువల్ల ఏ ప్రభుత్వమైనాసరే, ఒక పక్షానికి వర్తించేచట్టాలు చేయకుండా, సర్వులకూ వర్తించే విధంగా చట్టాలు చేయాలి అదే ఉత్తమ విధానం ఒకసారి చట్టాన్ని అంగీకరించిన తరువాత దాన్ని మార్చాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతాయి చైతన్యంతో కూడిన ప్రజాభిప్రాయం ఏర్పడినప్పుడే చేసిన చట్టాలు రద్దు చేయడమో. లేక అందుమార్పులుచేయడమో తేలిక అవుతుంది. ప్రజాస్వామ్యవ్యవస్థ ప్రకారం నడిచే పరిపాలనా విధానంలో మందు చీటికి మాటికి చట్టాలు రద్దుచేడం, లేక చేసిన చట్టాల్లో మార్పులు తేవడం మంచి పద్దతి కాదు. అది సువ్యవస్థకాదు

ఇక మనం ట్రాన్స్‌వాల్ నందలి ఏషియాటిక్ చట్టాల్లో నిండియున్న విషాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆచట్టాలన్నీ ఒక పక్షాన్ని దృష్టియందుంచుకొని చేసినవే ఆచట్టాల ప్రకారం ఆసియావాసులు అక్కడ ఓటు వేయడానికి వీలులేదు. ప్రభుత్వం ప్రత్యేకించి నిర్ణయించినచోటదప్ప, మరో చోట వాళ్లు నివేశన స్థలం కొనుక్కొనుటకు వీలులేదు. అట్టిచట్టాలు రద్దుకానంత వరకు అధికారులు భారతీయులకు ఏ సాయమూచేయలేరు అవి సర్వులకు వర్తించే చట్టాలు కావు కనుకనే లార్డ్‌మిల్నర్ నియమించిన కమిటీ అట్టి చట్టాల్ని వెంటనే విడగొట్టి, లిస్టుతయారు చేసింది ఆచట్టాలు ఒక పక్షానికి చెందియుండక సర్వులకూ వర్తించేవిగా వుండివుంటే, అవి ఒక పక్షానికి వర్తించినవే అయినా, తక్షణం రద్దు అయి వుండేవి “మేము ఏమీ చేయలేము. క్రొత్త అసెంబ్లీ వీటిని రద్దుచేయందే మేము అప్రకారం నడుచుకోవలసిందే అని చెప్పేంచుకు అధికారులకు అవకాశం లభించి యుండేది కాదు

ఇట్టి చట్టాలు ఏషియాటిక్ విభాగం చేతికి చిక్కాయి యిక వాళ్లు కఠినంగా వాటిని అమలుచేయడం ప్రారంభించారు. వారు అంతటితో ఆగలేదు. ఆచట్టాల్లో తమకు తోచిన లొసుగుల్ని కూడా బహిరంగంగా ఎకరువెపెట్టి, అట్టివాటిని సరిచేయాలని కూడా ప్రభుత్వానికి సూచించడం ప్రారంభించారు. వాళ్ల తర్కం కూడా సబబుగానే వున్నది. ఈ చట్టాలు మంచివి కావనుకుంటే వీటిని రద్దు చేయండి మంచివి అని అనుకుంటే అందలి లొసుగుల్ని, లోపాల్ని సరిచేయండి. వారి మాటలకు అర్ధం యిదే గదా! అయితే అక్కడి మంత్రిమండలి చట్టాల్ని అమలు చేయాలని నిర్ణయించింది. బోయర్ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్‌వారికి అండగా నిలచి ప్రాణాలకు తెగించి సాయంచేశారు. అయితే యిది మూడు సంవత్సరాల పూర్వం జరిగింది కనుక పాతపడిపోయింది. ట్రాన్స్‌వాల్‌లో వున్న బ్రిటిష్ ఏజంటు భారతీయులకు అధికారాలు యివ్వాలని ఉద్ఘోషించాడు. అయితే అది పాత ప్రభుత్వంలో జరిగిన విషయం బోయర్ యుద్ధకారణాల్లో వాళ్లు భారతీయులయెడ చూపుతున్న ద్వేషభావాన్ని తొలగించడం కూడా ఒకటి అని అప్పటి అనుభవంలేని తెల్లజాతి దొరలు ప్రకటించారు. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం ట్రాన్స్‌వాల్‌లో ఏర్పడిన తరువాత, బోయర్ ప్రభుత్వం భారతీయులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు సరిపోవని, వాటిలో మార్పులు తెచ్చి యింకా కఠినంగా వ్యవహరించాలనీ వాళ్లు తెలుసుకున్నారన్నమాట భారతీయులు ఎప్పుడుపడితే అప్పుడు ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించి, ఎక్కడ బడితే అక్కడ వ్యాపారం చేసుకోగలిగితే, బ్రిటిష్ వ్యాపారస్థులు దెబ్బతింటారని తెల్లవాళ్లు బాగా తెలుసుకున్నారు. ఇట్టి వాదనలు తెల్లజాతి మంత్రిమండలి సభ్యులపైన తెల్లజాతి జనంపైన బాగా పనిచేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే వాళ్ల లక్ష్యం యిందుకు భారతీయులు తోడైతే తమ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? చక్షిణాఫ్రికా యందలి మేధావులకు వ్యాపారం, ధన సంపాదన అంటే నచ్చదు. కనుక దీనితో బాటు కొంత తత్వజ్ఞానాన్ని కూడా వాళ్లు జోడించారు అన్యాయం చేయదలిచి, దానికి అనువైన వాదనలు కూడా వెతికి బయటికి తీశారు. జనరల్ స్మట్స్, తదితర తెల్లజాతి వారు పేర్కొన్నవాదనల సారాంశం యిక్కడ తెలుపుతున్నాను

దక్షిణాఫ్రికా పాశ్యాత్య సభ్యతకు ప్రతినిధికేంద్రం భారతదేశం తూర్పు సభ్యతకు కేంద్రం. ఈ రెండు సభ్యతలకు సఖ్యత. కుదురుతుందని తత్వజ్ఞానులు కాని, యోచనా పరులు గానీ అంగీకరించరు. అందువల్ల రెండు విరుద్ద నాగకరికతల ప్రతినిధులు కొద్ది సంఖ్యలో కలిసినా ప్రమాదం తప్పదు. రెండింటికి సంఘర్షణ తప్పదు. పాశ్చాత్యదేశాలు నిరాడంబరతకు వ్యతిరేకం తూర్పుప్రజలు నిరాడంబరత్వానికి జీవితంలో ప్రాధాన్యం యిస్తారు అట్టిస్థితిలో యీరెండు నాగరికతలు కలవడం సాధ్యమా? అయితే యీరెండు నాగరికతల్లో ఏది శ్రేష్ఠమైనది అనువిషయం రాజకీయజ్ఞుల విషయం కాదు. పాశ్చాత్య సభ్యత శ్రేష్ఠమైనదా కాదా అని పాశ్చాత్యప్రజలు ఆలోచించడం లేదు. దాన్ని అనుసరించడమే మంచిదని వారందరి నిర్ణయం పాశ్చాత్య నాగకరికతను రక్షించుకోవడంకోసం పాశ్చాత్యులు ఎంతో కృషిచేశారు రక్తపుటేరులు పారించారు. ఎన్నో కష్టాలు సహించారు. అందువల్ల పాశ్చాత్యులకు మరోమార్గం కనబడటంలేదు. యీ దృష్ట్యా దక్షిణాఫ్రికాలో తెల్లవారికి, భారతీయులకు జరుగుతున్న ఘర్షణ వ్యాపారానికి, డబ్బు సంపాదనకు, రాగద్వేషాలకు సంబంధించినది కాదు రంగుభేదానికి సంబంధించింది అసలే కాదు. వాస్తవానికి యిది ఆత్మ రక్షణకోసం, నాగరికతా రక్షణ కోసం తమకు సహజంగా లభించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తమ కర్తవ్యపాలన కోసం జరుగుతున్న ఘర్షణ కొంతమంది వక్తలు భారతీయుల దోషాల్ని ఎత్తిచూపిస్తున్నారు. కొందరు భారతీయుల సుగుణాలే దక్షణిఫ్రికాలో దోషాలుగా భావించ బడుతున్నాయని అంటున్నారు. నిజానికి భారతీయులు నిరాడంబరత. ఎక్కువ కాలం కాయకష్టంచేయగలశక్తి సామర్థ్యాలు. మతవ్యయం, పారలౌకిక దృక్పధం, సహనశక్తి, మొదలుగా గల తమగుణాలవల్లనే అప్రియులై ద్వేషానికి గురి అయ్యారు. పాశ్చాత్యప్రజలు సాహసులు, జీవనానికి అవరసరమైన వాటిని పొందాలనే కోరిక కలవారు ఆహారపానీయాల యెడ మక్కువ కలవారు కాయకష్టం తగ్గించుకోవాలనే కోరిక కలవారు ఎగిరిపోవాలనే కాంక్ష కలవారు. అందువల్ల తూర్పు నాగరికతకు చెందిన జనం దక్షిణాఫ్రీఖాలో పెరిగిపోతే తాము యిక్కడి నుంచి పారిపోవలసి వస్తుందని భయడుతున్నారు. అది ఆత్మహత్యాసదృశం అందుకు పాశ్చాత్యులు ఎట్టిస్థితిలోను సిద్ధంగా లేరు. వారిని సమర్థించే నాయకులు, మేధావులు యిట్టి ప్రమాదంలో వారిని పడనీయరు "

పైన నేను తెలిపిన వివరం దక్షిణాఫ్రికాకుకు చెందిన తెల్ల జాతివారు, మంచివారు, మంచినడత కలవారు వెల్లడించిన అభిప్రాయాల సారమే వాళ్లు తెలిపిన యీ వాదనలు తత్వజ్ఞానంతో కలిసిన పాఖండత్వానికి నిదర్శనాలని నా అభిప్రాయం. అయితే వారి వాదనలో నిజంలేదని నేను అనను. వ్యావహారిక దృష్టితోను, తాత్కాలికమైన సంకుచిత స్వార్థదృష్టితోను అందు సత్యం వున్నది కాని తత్వజ్ఞానం దృష్ట్యా అంతా అబద్దం నాటకం తటస్థంగా పుండే ఏ బుద్ధిమంతుడూ తెల్లవాళ్లు తెలిపిన తర్కాన్ని అంగీకరించలేడని నాఅభిప్రాయం ఏయోచనా పరుడు తమ నాగరికతను యీ విధమైన విపత్కర పరిస్థితిలో వున్నట్లు చిత్రించడు నాకు తెలిసినంతవరకు పాశ్చాత్యదేశాలకు సంబంధించిన ఒక్క తత్వజ్ఞాని కూడా వాళ్ల తర్కాన్ని అంగీకరించడు. పాశ్చాత్య నాగిరకతననుసరించే ప్రజలు స్వేచ్ఛగా తూర్పు ప్రజలచేరువకు వస్తారనిగాని, అలస్వస్తే పాశ్చాత్య నాగరకతా వెల్లువలో తూర్పునాగరికత ఇసుకలా కరిగి కొట్టుకుపోతుందనిగాని తూర్పునాగరికతకు చెందిన ఏతత్వజ్ఞానీ భయపడడు తూర్పుసభ్యాతావిశేషాల్ని నేను గ్రహించాను ఆది పాశ్చాత్య సభ్యతకు స్వాగతం పలుకుతుంది పాశ్చాత్య సభ్యతవల్లతనకు ముప్పు కలుగుతుందని భయపడదు. యిందుకు విరుద్దంగా ఉదాహరణలు తూర్పుదేశాల్లో లభిస్తే, వాటివల్ల నేను తెలిపిన సిద్ధాంతానికి ఏమీ దెబ్బతగలదు. నా సిద్ధాంతాన్ని సమర్థించే ఉదాహరణలు ఎన్నో వున్నాయి ఏది ఏమైనా పాశ్చాత్య తత్వజ్ఞానుల ప్రకారం పాశ్చాత్య నాగరికతయొక్క మూలసిద్ధాంతం అపరిమితమైన పశుబలం మీద ఆధారపడి వున్నది అందువల్లనే. అసభ్యతను రక్షించదలచిన వాళ్లు పశుబలాన్ని ఉపయోగిస్తున్నారు. తమ అవసరాల్ని పెంచుకోని ప్రజలు చివరికి నాశనమైపోతారని కూడా వాళ్ల వాదన సాగుతున్నది. యీ సిద్ధాంతాలననుసరిస్తున్న తెల్లజాతి ప్రజలు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు తమ సభ్యతకంటే ప్రాచీన సభ్యతగల. తమకంటే ఎక్కువ సంఖ్యలోనున్న హబ్షీలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆట్టిస్థితిలో భారతదేశమందలి బీదప్రజలకు వాళ్లు భయపడతారా? నిజానికి తూర్పు ప్రజల నాగరికతకు వాళ్లు భయపటంలేదు అందుకు పెద్ద తార్కాణం ఒకటి వున్నది భారతీయులు గిర్‌మిట్ కార్మికులుగా ఎంతమంది దక్షిణాఫ్రికాకు వచ్చినా. తెల్లవాళ్లకు యిబ్బందిలేదు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించరు

అయితే వ్యతిరేకిస్తున్నది. ఎందుకు? వ్యాపారంలో పోటీ వుంటుందనే కదా? ధనార్జన తగ్గుతుందనేకదా! రంగు భేదమే కదా! భారతీయులే చేసే వ్యాపారం వల్ల చిన్న చిన్న తెల్లజాతివ్యాపారులు దెబ్బతింటున్నారనీ, గోధుమరంగు చర్మం గలవారిని చూస్తే చాలు తెల్లరంగు చర్మం కలవాళ్లు మండిపడుతున్నారని, వాళ్లంటే అసహ్యం ద్వేషం తెల్లవాళ్లకు అధికంగా వున్నదని చాలామంది తెల్లవాళ్లు పత్రికల్లో స్పష్టంగా ప్రకటించారు. అమెరికాలో గల చట్టాలలో పేరుకు మాత్రం అందరికీ సమానహక్కులు కలిగించారు. కాని అక్కడకూడా బూకర్‌టి వాషింగ్టన్ వంటి ఉన్నతపాశ్చాత్య శిక్షణ పొందిన, సచ్చరిత్రుడైన క్రైస్తవుడు బూకరిటి పాశ్చాత్య సభ్యతను సంపూర్తిగా అలవరుచుకున్న పురుషుడు ప్రెసిడెంట్ రూజ్‌వెల్డ్ దర్బారులో అడుగుపెట్టలేక పోయాడు యివాళకూడా పోలేడు. అమెరికా యందలి హబ్షీలు పాశ్చాత్య నాగరికతను స్వీకరించి క్రైస్తవులుగా మారిపోయారు. అయినా వాళ్ల చర్మవు నల్లరంగు వాళ్ల దోషంగా పరిగణింపబడుతూవున్నది. ఆమెరికావంటి దేశంలోనే సాంఘికపరంగా ద్వేషం జడలు విరబోసుకొని వుంటే దక్షిణాఫ్రికావంటి దేశంలో తెల్లజాతివాళ్లు అనుమానం కలిగితే చాలు మిగతారంగుల వాళ్లను బ్రతికివుండగానే కాల్చి వేయరా" దక్షిణాఫ్రికాలో ప్రబలిన యీ దండించే విధానానికి గలపేరు ఒకటి ఇంగ్లీషులో ప్రచారం పొందింది. దాన్ని లించ్‌లా ఆంటారు. లించ్‌లా అంటే శిక్లముందు విధిస్తారు. విచారణ తరువాత సాగిస్తారు అని అర్థం లించ్ అనే పేరుగల ఒక మనిషి పేరట యీ శబ్దం ప్రచారంలోకి వచ్చింది. ఈ రకమైన పద్దతిని అతడే ప్రారంభించాడు. కనుక వాడిపేరట దాన్ని లించ్‌లా అని అన్నారు

ఈవిధంగా పైన తెల్లవాళ్లు తెలిపిన తర్కంలో సారమేమీ లేదని పాఠకులు గ్రహించియే యుంటారు. అయితే విభిన్న అభిప్రాయాలుగల తెల్ల వారంతా యిటువంటి వాదనయే చేస్తున్నారని భావించకూడదు. తమ యీతర్కం కేవలం తాత్వికపరమైనదని వారిలో చాలామంది ప్రకటించారు వాళ్ల స్థితిలో మనం కూడా వుండివుంటే వాళ్లలాగానే మనం కూడా భావించి వుండేవాళ్లమేమో చెప్పలేము యిలాంటి కారణాలవల్లనే “బుద్ధి కర్మాను సారిణీ" అను సామెత ప్రచారంలోకి వచ్చింది. మనం మన అంతఃకరణంలో ఎలా భావిస్తామో, అలాంటి తర్కమే ప్రకటిస్తూ వుంటామని అందరికీ తెలిసు మన అట్టితర్కం యితరులు అంగీకరించపోతే మనం సహించలేము కోపం తెచ్చుకుంటాం

నేను కావాలనే యీ విషయాన్ని యింత వివరించి వ్రాశాను పాఠకులు విభిన్న దృక్పధాల్ని తెలుసుకోవాలని, యిప్పటివరకు ఆవిధంగా తెలుసుకోనివారు విభిన్న దృక్పధాల్ని తెలుసుకోవడమేగాక, వాటిని ఆచరించడం నేర్చుకోవాలని కోరుతున్నాను. సత్యాగ్రహం అంటే ఏమిటో తెలుసుకోవడానికి, దాన్ని ప్రయోగించడానికి ఉదారబుద్ధి, ఓర్పు చాల అవసరం యీగుణాలు లేకపోతే సత్యాగ్రహం సాధ్యంకాదు, యీ పుస్తకంలో, కేవలం వ్రాయాలని నేను యిదంతా వ్రాయడంలేదు. దక్షిణాఫ్రికా సత్యాతగ్రహ చరిత్రను భారతదేశ ప్రజలకు తెలియజేయుటకే యిదంతా వ్రాయడం లేదు. ఈ పుస్తకాన్ని వ్రాయడానికి నా అసలు లక్ష్యం ఒక్కటే ఏ సత్యాగ్రహం కోసం బ్రతుకుతున్నానొ, బ్రతకాలని కోరుకుంటున్నానో ఎ సత్యాగ్రహంకోసం చావుకు సైతం సిద్ధపడివున్నానో, ఆ సత్యాగ్రహం పుట్టుక ఎలాజరిగిందో ప్రధమంగా సామూహికంగా సత్యాగ్రహప్రయోగం ఎలా జరిగిందో, అవివరాలన్నీభారతదేశప్రజలు తెలుసుకోవాలి సాధ్యమైనంతవరకు ఆచరణలో పెట్టాలి ఈ లక్ష్యంతోనే యీ గ్రంధం వ్రాస్తున్నాను

ఇక మనం తిరిగి మన కథకు వద్దాం. క్రొత్త వాళ్లను లోనికి రానీయకూడదని, వున్నవాళ్లను నఖశిఖపర్యంతం బిగించి దేశం వదిలి పారిపోయేలా చేయాలని ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. భారతీయుల్ని మేము కట్టెలుకొట్టి బ్రతికేవారుగాను, కావళ్లు మోసేవాళ్లుగాను మాత్రమే దక్షిణాఫ్రికాలో వుండనిస్తామని కొమ్ములుతిరిగిన తెల్లవాళ్లు ప్రకటనలు చేశారు కూడా ఏషియాటిక్ విభాగంలో అక్కడి తెల్లవాళ్లతోబాటు, ఇండియాలో వుండి వచ్చిన శ్రీ లాయనల్ కర్జిస్ వంటి ప్రచారకులు కూడా వున్నారు. వీళ్లంతా 1905, 1906లో నవయువకులే లార్డ్ మిల్నరుకు నమ్మకస్తులే ప్రతిపని వైజ్ఞానిక దృక్పథంతో చేస్తున్నామని వారి వాదన పెద్దపెద్ద తప్పులు కూడా చేస్తూ వున్నారు. వాళ్లు పెద్ద తప్పుచేసి జోహన్స్‌బర్గ్ మునిసిపాలిటీకి ఎన్నో పౌండ్ల నష్టం కలిగించారు

దక్షిణాఫ్రికాలోకి క్రొత్త భారతీయులు ఎవ్వరూ రాకుండా ఆపాలంటే, తేలికమార్గం ఒక్కటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలోగల భారతీయుల అనుమతి పత్రాలన్నీ సువ్యవస్థితంగా తిరిగి రిజిష్టరు చేయించాలి అప్పుడు ఒకడికి బదులు మరొకడు దూరడానికి అవకాశం వుండదు. ఒకవేళ దూరినా తప్పక దొరికిపోతాడు. ట్రాన్స్‌వాల్‌లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారతీయులకు యిచ్చే అనుమతి పత్రాల మీద వాళ్ల సంతకాలు చేయించారు సంతకం చేయలేనివారి వేలిముద్రలు వేయించారు. తరువాత ఎవడో ఒక జంగ్ల అధికారి వాళ్ల ఫొటో కూడా వుంటే యిక తిరుగువుండదని సూచించాడు. దానితో ఫొటో, సంతకం, వేలిముద్రలు ప్రారంభమయ్యాయి ఇందుకు చట్టం అవసరమని వాళ్లు భావించలేదు. ఈ విషయం భారతీయనాయకులు కూడా గమనించలేదు. జాతి తరఫున ప్రభుత్వానికి అర్జీలు పంపారు ప్రతినిధి బృందాలు వెళ్లి కలిశాయి తెల్లజాతి అధికార్లు మాత్రం తమను కలిసిన వారందరికీ "ఎట్టి పరిస్థితుల్లోను, భారతీయులు ట్రాన్స్‌వాల్‌లోకి దూరడానికి వీలులేదు. అందుకు మేము అంగీకరించము అందువల్ల భారతీయులందరి దగ్గర ఒకే రకమైన అనుమతి పత్రాలు వుండాలి పత్రాలలో వున్న వివరాల ప్రకారం అట్టి పత్రం పొందిన అసలు సిసలు భారతీయుడే దక్షినాఫ్రికాలో ప్రవేశించాలి" అని స్పష్టంగా చెప్పారు

నేను భారతీయులకు ఒక సలహా యిచ్చాను. ఇటువంటి అనుమతి పత్రాలు తీసుకొని తీరాలి అనే చట్టం ఎమిలేదు కాని శాంతిరక్షణ చట్టం అమలులో వున్నంతకాలం అధికారులు మనల్ని ప్రవేశపత్రాలు చూపించమని అడుగవచ్చు. భారతదేశంలో భారతరక్షణ చట్టం (డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆక్టు) అమల్లో వున్నట్లే. దక్షిణాఫ్రికాలో శాంతి రక్షణ చట్టం వున్నది భారతదేశంలో శాంతి రక్షణ ఆక్టు ఎలా భారతీయుల్ని ఇక్కట్లపాలు చేయుటకు ఉపయోగపడుతున్నదో, దక్షిణాఫ్రికాలో కూడా అలాగే తెల్లవాళ్లకు ఉపయోగపడుతున్నది. ఈ చట్టం తెల్లవాళ్లకు వర్తించకపోవడం బహిరంగ రహస్యమే అనుమతి పత్రాలు తీసుకోవడం తప్పనిసరి అయితే, వాటి మీద సంతకం చేయాలని భారతీయులు వ్రేలిముద్రలు వేసితీరాల్సిందే ఇద్దరు మనుష్యుల చేత గుర్తులు, ముద్రలే ఒకే విధంగా వుండవని పోలీసుశాఖ వారు బహుతెలివిగా కనిపెట్టారు చేతి రేఖల ఆకారాల్ని ముద్రల వ్యత్యాసాల్ని విభజించారు. వేలిముద్రల నిపుణులు రెండు ముద్రల్నిపరిశీలించి చూచి క్షణంలో యివి ఒకడివా లేక వేరు వేరు మనుష్యులనా అను విషయం స్పష్టంగా చెప్పివేస్తారు. అయితే ఫొటో యిమ్మనడం నాకు నచ్చలేదు మహమ్మదీయులు మతరీత్యాకూడా ఫోటోయివ్వరు వారి దృష్టిలో అది చమత విరుద్ధం

ప్రభుత్వాధికారులు మరియు భారతజాతి ప్రతినిధులు కలిసి చర్చించారు తత్ఫలితంగా భారతీయులంతా తమ పాతపత్రాలను యిచ్చి క్రొత్త పత్రాల్ని తీసుకోవాలని, క్రొత్తగా వచ్చే భారతీయులు అనుమతి పత్రాలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి భారతీయులు ఆ విధంగా తీసుకోవలసిన అవసరం లేకపోయినా మళ్లీ క్రొత్త ఆంక్షలు ఎదుర్కోవలసిన అవసరం వస్తుందేమోనని ఊహించి పత్రాలు తీసుకొనుటకు అంగీకరించారు. క్రొత్తగా వచ్చే భారతీయులు దొంగచాటుగా ప్రవేశించకూడదని భారతజాతి కోరుతున్నదని కూడా స్పష్టపడుతుందని భావించారు. సుమారు భారతీయులు కొత్త అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఇది చిన్న విషయంకాదు. చట్టరీత్యా అనివార్యం కాకపోయినా, పూర్తి ఐకమత్యంతో భారతీయులంతా త్వరగా చేసి చూపించారు. ఇది భారతజాతియొక్క నిజాయితీకి. చాతుర్యానికి, తెలివితేటలకు, నమ్రతకు తార్కాణమని చెప్పవచ్చు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసే చట్టాల్ని ఉల్లంఘించడం భారతీయుల స్వభావలక్షణం కాదని కూడా రుజుచేశారు. ప్రభుత్వానికి యింతటి సుహృద్భావంతో సహకరిస్తున్న భారతీయుల విషయంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం కూడా సుహృద్భావంతో వ్యవహరించాలని భారతీయుల ఆశ, అభిలాష ఆ ప్రభుత్వం తమను గౌరవిస్తుందని, అధికారాలు కూడా యిస్తుందని ఆశించారు. అయితే ట్రాన్స్‌వాల్‌లో నెలకొన్న బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సజ్జనత్వానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నదొ తరువాతి ప్రకరణంలో తెలుసుకుందాం

11

సజ్జనత్వానికి ప్రతీకారం

ఖూనీ చట్టం

పాతకొత్త పత్రాల మార్పు జరిగింది. 1906వ సంవత్సరంలో అడుగుపెట్టాం నేను 1903లో ట్రాన్స్‌వాల్‌నందు రెండవసారి అడుగుపెట్టాను. ఆ ఏడాది జోహాన్స్‌బర్గులో ఆఫీసు తెరిచాను ఈ విధంగా నారెండు సంవత్సరాల కాలం ఏషియాటిక్ శాఖవారి ఆక్రమణల్నిఎదుర్కోవడానికి సరిపోయింది. పత్రాల మార్పు జరిగాక ప్రభుత్వం శాంతిస్తుందని. వ్యవహారం చక్కబడుతుందని అంతా అనుకున్నారు. కాని భారతజాతి ముఖాన శాంతిరాసి లేదు. గత ప్రకరణంలో నేను శ్రీ లైనల్ కర్టిస్‌ను పరిచయం చేశాను. భారతీయులు