దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/కష్టాల సింహావలోకనం-2
5
కష్టాల సింహావలోకనం -2
ట్రాన్స్‌వాల్ మరియు ఇతర అధినవేశ రాజ్యాలు
1880 కి పూర్వం నుంచే నేటాలు వలెనే, దక్షిణాఫ్రికా యందలి యితర అధినివేశరాజ్యాల్లో కూడా భారతీయులంటే తెల్లవారికి ఏవగింపు బాగా పెరిగింది. కేప్ కాలనీని మినహాయించి మిగతా రాజ్యాల తెల్లవారి హృదయాలలో గిర్‌మిట్ కార్మికుల రూపంలో భారతీయులు మంచివాళ్లేనని, కాని స్వతంత్ర పౌరులుగా మాత్రం భారతీయుల వల్ల దక్షిణాఫ్రికాకు ఎంతో నష్టం కలుగుతుందని భావం గట్టిగా నాటుకుపోయింది. ట్రాన్స్‌వాల్ ప్రజాతంత్ర రాజ్యం అక్కడి ప్రెసిడెంటు దగ్గరికి వెళ్లి మేమూ బ్రిటిష్ సామ్రాజ్య పౌరులమేనని చెప్పుకోవడం హాస్యాస్పదమై పోయింది భారతీయులు చెప్పుకోవలసిందేమైనా వుంటే ప్రిటోరియాలో గల బ్రిటిష్ రాజమాత (ఏజంట్) దగ్గరకు వెళ్లి చెప్పుకోవాలి అయినా మరో విచిత్రం జరిగింది. ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్నుంచి పూర్తిగా విడిపోయిన తరువాత బ్రిటిష్ రాజదూత భారతీయులకు సహాయపడే వాడు కాని ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ సామ్రాజ్యంలో చేరిపోయిన తరువాత ఆ స్థితి మారిపోయింది లార్డ్ మోర్లే భారత మంత్రిగా వున్నప్పుడు ట్రాన్స్‌వాల్ నందలి భారతీయుల తరుపున వాదించుటకు ఒక ప్రతినిధి బృందం వెళ్లి ఆయనను కలుసుకున్నది. అప్పుడు లార్డ్ మోర్లే ఆప్రతినిధి బృంద సభ్యులకు ఒక్క విషయం స్పష్టంగా చెబుతూ జహబు దారీ ప్రభుత్వాలు ఏర్పడ్డ అధినివేశ రాజ్యాలపై బ్రిటీష్ (సామ్రాజ్య) ప్రభుత్వ నియంత్రణ బహుస్వల్పంగా వుంటుంది. అవి స్వతంత్ర రాజ్యాలు వాటిని యుద్ధానికి ఆహ్వానించగలము యుద్ధం చేస్తామని బెదిరించగలము యుద్ధం కూడా ప్రకటించగలము కాని వాటితో సలహా సంప్రదింపులు మాత్రమే చేయగలము బ్రిటిష్ సామ్రాజ్యానికి, అధినివేశ రాజ్యాలకు మధ్యన గల సంబంధం పట్టుదారంతో కట్టబడివున్నది. ఆహారం బహుసున్నితం కొద్దిగా లాగినా ఆదారం తెగిపోతుంది. వాటిపై బలాన్ని ప్రయోగించుటకు అవకాశంలేదు. అయితే (యుక్తిగా) రేపటినుంచి చేయగలిగినంత చేయుటకు ప్రయత్నిస్తాను. నమ్మండి" అని చెప్పి వేశాడు. ట్రాన్స్‌వాల్ మీద యుద్ధ భేరీ మ్రోగించినప్పుడు లార్డ్ లెన్స్డ్ డౌన్, లార్డ్ సెల్‌బోర్న్ మొదలగు బ్రిటిష్ అధికారులు, యుద్ధానికి గల అనేక కారణాలలో ట్రాన్స్‌వాల్ నందలి భారతీయుల దుస్థితిని నివారించడం కూడా ఒకటి అని ప్రకటించారు. ఇక ట్రాన్స్‌వాల్‌లో గల భారతీయుల స్థితిగతులను పరిశీలిద్దాం. 1881లో భారతీయులు మొదటిసారి ట్రాన్స్‌వాల్‌లో అడుగుపెట్టారు. కీ. శే. సేఠ్ అబూబకర్ ట్రాన్స్‌వాల్ రాజధాని యగు ప్రిటోరియాలో దుకాణం ప్రారంభించాడు. అక్కడి ఒక ముఖ్యమైన చోట నివేశన స్థలం కొన్నాడు తరువాత అనేక మంది భారతీయ వ్యాపారులు కూడా ఒకరి తరువాత మరొకరు అక్కడికి చేరుకున్నారు. వాళ్ల వ్యాపారం బాగా సాగడం చూచి తెల్లవాళ్ల కడుపు తరుక్కుపోయింది. పత్రికల్లో భారతీయులకు వ్యతిరేకంగా జాబులు, వ్యాసాలు వ్రాయడం ప్రారంభించారు. అక్కడి అసెంబ్లీలో కూడా భారతీయుల్ని ట్రాన్స్‌వాల్ నుంచి వెళ్లగొట్టండి వాళ్లను వ్యాపారం చేసుకోనీయవద్దు" అని ప్రసంగాలు జరిగాయి. అర్జీలు కూడా దాఖలు చేశారు. ట్రాన్స్‌వాల్ వంటి క్రొత్త దేశంలో బ్రిటిష్ వారి ధనతృష్ణకు అంతు లేకుండా పోయింది నీతికి అవినీతికి మధ్య గల తేడా వాళ్లకు తెలియదు అసెంబ్లీకి దాఖలు చేసిన ఆర్జీలలో “వీళ్లు (భారతీయ వ్యాపారులు) మానవ సభ్యత అంటే ఏమిటో ఎరుగరు. చెడునడత వల్ల సంక్రమించే రోగాలతో కుళ్లిపోతున్నారు. ప్రతి ఆడదాన్ని తమ వేట జంతువని భావిస్తున్నారు. ఆడవాళ్లకు ఆత్మ లేదని వాళ్లు భావిస్తున్నారు" అని కూడా వ్రాశారు. యీ నాలుగు వాక్యాలలో నాలుగు అబద్దాలు వున్నాయి. యిటువంటి ఉదాహరణలు ఎన్నో యివ్వవచ్చు. అక్కడి అసెంబ్లీ మెంబర్లు కూడా యిలా వ్రాసిన తెల్ల వారి వంటిరకమే తమకు వ్యతిరేకంగా అసహ్యకరమైన వ్యతిరేక ఉద్యమం సాగుతున్నదని భారతీయ వ్యాపారులు గ్రహించలేదు. వాళ్లు పత్రికలు చదివే వారు కాదు. తెల్లవాళ్ల పత్రికల ప్రభావం, అసెంబ్లీకి దాఖలు చేసిన తెల్లవారి అర్జీల ప్రభావం బాగా పని చేసింది. తత్ఫలితంగా అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టబడించి యీ విషయం అక్కడి భారతీయ పెద్దలకు తెలిసింది ఉలిక్కిపడ్డారు. వాళ్లు కీ. శే. ప్రెసిడెంట్ క్రూగర్ దగ్గరికి వెళ్లారు ప్రెసిడెంటు భారతీయ నాయకుల్ని తన ఇంటిలోనికి రానీయలేదు. ఇంటి ముంగిలిలో నేవాళ్లను నిలబెట్టాడు. వాళ్ల మాటలు కొద్దిగా విని "మీరు ఇస్మాయిల్ సంతతివాళ్లు అందువల్ల మీరు ఈసా సంతతికి బానిసత్వం చేయుటకే పుట్టారు. మేము ఈసో సంతతి వాళ్లం అందువల్ల మీకు మాతో సరిసమానమైన అధికారాలు యివ్వడానికి వీలులేదు మేమిచ్చిన అధికారాలతో మీరు తృప్తిపడక తప్పదు" అని చెప్పి వేశాడు. అతడి మాటల్లో రోషం, కోపం లేవని చెప్పలేము కాని అతనికి అది చిన్నప్పటి నుంచి లభించిన విద్య బాల్యం నుంచి అతడికి బైబిలునందలి పాత టెస్టొమెంట్ బోధించబడింది దాన్నే అతడు నమ్మాడన్నమాట తన విశ్వాసాన్ని బట్టి, శుద్ధ మనస్సుతో ప్రెసిడెంటు చెప్పాడు. కనుక యిందు అతని దోషం ఏముంది? అయితే యింతటి అజ్ఞానంతో కూడిన మాటల ప్రభావం కూడా పడుతుంది కదా 1885 లో తొందర తొందరగా అసెంబ్లీలో ఒక కఠోరమైన బిల్లును ప్యాసు చేశారు. వేలాది భారతీయులు ట్రాన్స్‌వాలును దోపిడీ చేయుటకు సిద్ధంగా వున్నారను భావం ఆ బిల్లులో తొంగిచూచింది. భారతీయ నాయకుల ప్రేరణవల్ల బ్రిటిష్ రాజమాత ఆచట్టాన్ని వ్యతిరేకించవలసి వచ్చింది యీ వ్యవహారం అధినివేశ విభాగం మంత్రి దాకా వెళ్ళింది. యీ చట్టం ప్రకారం ట్రాన్సువాల్‌లో వ్యాపారం చేసుకునేందుకై వచ్చి నివసించిన భారతీయుడు 25 పౌండ్లు చెల్లించి తన పేరు నమోదు చేయించుకోవాలి ఏ భారతీయుడు ట్రాన్స్‌వాలు నందు. ఒక్క అంగుళం భూమికూడా కొనడానికి వీలు లేదు ఓటింగు హక్కు అతడికి లేనేలేదు యిది అనుచితం అన్యాయం కనుక ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం యీ వాదనను సమర్థించుకోలేకపోయింది. చివరికి ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒక సంధి కుదిరింది దాన్ని లండన్ కన్వెన్షన్ అని అన్నారు అందలి 14వనింబంధన బ్రిటిష్ ప్రజల అధికారాలను రక్షించుటకు సంబంధించినది ఆ నిబంధన ప్రకారం పెద్ద (సామ్రాజ్యం) ప్రభుత్వం, యీ చట్టాన్ని వ్యతిరేకించింది. దాని మీద ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం "తాము అంగీకరించిన చట్టానికి పెద్ద ప్రభుత్వమే ముందునుంచి స్పష్టంగా రహస్యంగా అంగీకరించింది" అని ప్రకటించింది.
ఈ విధంగా యిరుపక్షాలకు అభిప్రాయభేదం వచ్చినందున మధ్యవర్తుల ముందు యీ విషయాన్ని ప్రవేశపెట్టారు. మధ్యవర్తుల నిర్ణయం తటపటాయింపులతో నిండిపోయింది. వాళ్లు రెండు ప్రభుత్వాలను తృప్తి పరుచుటకు ప్రయత్నించారు. దానివల్ల నష్టపడింది భారతీయులే దాన్ని లాభం అని అనుకుంటే ఎక్కువ నష్టానికి బదులు తక్కువ నష్టం కలగడమే కలిగిన లాభం అని భావించాలి మధ్యవర్తుల నిర్ణయ ప్రకారం బిల్లు నందు 1886 లో మార్పులు జరిగాయి. 25 పౌండ్లకు బదులు 3 పౌండ్లుగా నిర్ణయం జరిగింది. భూమి కొనుక్కునే విషయంలో కూడా మార్పు జరిగింది ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం నిర్ణయించిన చోటనే భారతీయులు భూమి కొనుక్కొనుటకు వీలు కల్పించబడింది యీ నిబంధనను అమలు బరుచునప్పుడు కూడా వక్రత వారి మనస్సుల్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వం నిర్ధారించిన వాడల్లో సైతం కొనుక్కున్న చోటు మీద కూడా భారతీయులకు స్థిరంగా హక్కు యివ్వలేదు. పట్టణాలకు దూరుగా మురికి చోట్ల భారతీయులకు వాడలు నిర్ధారించారు. నీటికొరత, కరెంట్ కొరత, పాయిఖానాల శుభ్రత కొరత వున్న ప్రదేశాల్లో భారతీయులు వుండాలని తెల్లవాళ్ల నిర్ణయం యీ విధంగా ట్రాన్స్‌వాల్లో భారతీయులు పంచమజాతి వాళ్లుగా పరిగణించబడ్డారు. మనదేశంలో గల అస్పృశ్యుల గూడెముల మాదిరి స్థితిలో ట్రాన్స్‌వాల్ గూడెములు వెలిశాయన్న మాట. భారతదేశంలో పాకీవాళ్లకు, మాలమాదిగల ప్రక్కన వున్నాలేక వారిని ముట్టుకున్నా తాము అపవిత్రమై పోతామని హిందువులు భావిస్తున్నట్లే ట్రాన్స్‌వాల్ యందలి తెల్లవాళ్లు భారతీయుల ప్రక్కన వుంటే తాము అపవిత్రులమై పోతామని భావించారు 1985 నాటి చట్టమునందలి 3వ నిబుధనకు, వేరే అర్థం తీసి అక్కడి ప్రభుత్వం భారతీయ వ్యాపారులు, ఆవాడల్లోనే ఆ లొకేషన్లలోనే వ్యాపారం చేసుకోవచ్చునని నిర్ణయించారు. యీ నిర్ణయం సరియైనదా కాదా అని నిర్ణయించు అధికారం కోర్టులకు ప్రభుత్వం అప్పగించింది. దానితో భారతీయులకు ట్రాన్స్‌వాల్‌లో అధోగతి సంప్రాప్తించింది. అయినా భారతీయ వ్యాపారులు ఏదోవిధంగా చర్చల ద్వారానో, సలహా సంప్రదింపుల ద్వారానో, కోర్టులకెక్కో తమ స్థితిని రక్షించుకోసాగారు బోయర్ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి అక్కడి భారతీయుల పరిస్థితి ఎంతో నాసిగాను అనిశ్చితంగాను వున్నది.
ఇక మనం ఫ్రీస్టేట్‌లో భారతీయుల స్థితి ఎలా వున్నదో చూద్దాం అతికష్టం మీద 10 లేక 11 దుకాణాలు భారతీయులు అక్కడ ప్రారంభించేసరికి వారికి వ్యతిరేకంగా తెల్లవాళ్లు ఉద్యమంలేవతీశారు. అక్కడి అసెంబ్లీ పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించి భారతీయుల ఉనికినే దెబ్బతీశారు. ఒక కఠోరమైన చట్టం ప్యాసు చేసి తద్వారా భారతీయ వ్యాపారులకు పేరుకు నష్ట పరిహారం చెల్లించి వాళ్లను వెళ్లగొట్టివేశారు. ఏ భారతీయుడు వారి చట్ట ప్రకారం భూమిని కొనకూడదు. రైతుగా ఫ్రీస్టేట్‌లో వుండకూడదు. ఓటింగు హక్కు అనేది లేనేలేదు. ప్రత్యేక అనుమతి పొంది భారతీయులు కార్మికుని రూపంలోనో, లేక హోటలు వైటరు రూపంలోనో అక్కడ వుండవచ్చు. అట్టి అనుమతి అందరికీ లభించదు. తత్ఫలితంగా ప్రముఖ భారతీయులు సైతం ప్రత్యేక అనుమతి పొంది ఫ్రీస్టేట్‌లో రెండు మూడు రోజుల కంటే మించి వుండటకు వీలు లేదు. బోయర్ యుద్ధం నాటికి అక్కడ అంతా కలిపి 40 మంది భారతీయులు హోటళ్లలో వైటర్లుగా పని చేస్తూ వున్నారు
కేప్ కాలనీలో కూడా భారతీయులకు వ్యతిరేకంగా ఉద్యమం కొద్దోగొప్పో సాగుతూనే వున్నది. భారతీయ పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరకూడదు అక్కడి హోటళ్లలో భారతీయ యాత్రికులు వుండకూడదు. అతికష్టంమీద చోటు దొరికితే పుండవచ్చు. యీ విధంగా కాలనీలో కూడా భారతీయులకు అవమానం జరుగుతూ వున్నది. అయితే వ్యాపారం చేసుకొనుటకు, భూమి మీద హక్కు పొందుటకు చాలా కాలం వరకు వాళ్లకు యిబ్బంది కలుగలేదు. కేప్ కాలనీలో ఆ స్థితి ఎందుకు వున్నదో కొంచెం చెప్పడం అవసరం. ముఖ్యంగా కేప్ టౌనులోను, కేప్ కాలనీలోను మలై ప్రజల ఆధిక్యం వున్నది. మలై ప్రజలు మహమ్మదీయులు. అందువల్ల భారతీయ మహమ్మదీయులతో వారికి త్వరగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భారతీయ మహమ్మదీయుల ద్వారా, మిగతా భారతీయుల సంబంధం కూడా మలై వాసులతో మెరుగుపడిందని చెప్పవచ్చు. భారతీయ మహమ్మదీయులు చాలా మంది మలై ముస్లింస్త్రీలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు మలై ప్రజలకు వ్యతిరేకంగా కేప్ కాలనీ ప్రభుత్వం చర్యలు తీసుకునే స్థితిలో లేనేలేదు. కేప్ కాలనీ వాళ్లకు అది జన్మభూమి వాళ్లది డచ్‌భాష, డచ్‌వాళ్లతో మొదటి నుంచి కలిసి మెలిసి వుండటం వల్ల మలై ప్రజలు చాలా వరకు డచ్ ప్రజలను అనుసరించారు. అందువల్ల అక్కడ రంగు భేదం అతి తక్కువగా వున్నది
కేప్ కాలనీ అత్యంత ప్రాచీన అధినివేశ రాజ్యం దక్షిణాఫ్రికాకు చెందిన శిక్షణా సాంస్కృతిక కేంద్రం కూడా అందువల్ల ఉదార హృదయులు, వినయ సంపన్నులు, విద్యావంతులు అయిన ఆంగ్లేయులు అక్కడ జన్మించారు ప్రపంచంలో ఏమారుమూలనైనా సరే అనుకూల వాతావరణం వుండి, మంచి శిక్షణకు సంస్కారాల బోధనకు అవకాశం ఏర్పడితే అక్కడి వారు అత్యుత్తమమైన మానవ లక్షణాలు కలిగి వుంటారనీ ఎంతో అందమైన మానవ పుష్పాలు వికసించి తీరుతాయని నా ప్రగాఢ విశ్వాసం అదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా యందలి పలుచోట్ల నేను అట్టి ఉత్తమ మానవుల్ని దర్శించాను. అయితే కేప్ కాలనీలో యిట్టివారి సంఖ్య అధికంగా వున్నది వారిలో గొప్ప ప్రసిద్ధులు శ్రీ మేరిమెన్ వారంటే అక్కడి జనానికి అమిత గౌరవం 1872లో కప్ కొలనీలో జవాబుదారీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి వారు మంత్రివర్గ సభ్యుడుగా వున్నారు. 1910లో దక్షిణాఫ్రికా యూనియన్ ఏర్పడినప్పుడు వారి దాని చివరి మంత్రివర్గానికి ప్రధాన మంత్రిగా వున్నారు. సంపూర్ణ శ్రాయినర్ కుటుంబం, మరియు మోల్టినో కుటుంబమని అక్కడి రెండుకుటుంబాల వారు వున్నారు. యీ రెండు కుటుంబాలు శ్రీ మేరిమెన్ స్థాయిలో కాకపోయినా, రెండో స్థానంలో వున్నాయి. సర్‌జాన్ మోల్టినో 1872లో ప్రథమ మంత్రిమండలికి ప్రధానమంత్రిగా పని చేశారు. శ్రీ డబ్ల్యు. పి. శ్రాయినర్ ప్రసిద్ధ అడ్వొకేట్. కొంతకాలం పాటువారు అటార్నీ జనరల్ గా వున్నారు తరువాత మంత్రి మండలిలో ప్రధానమంత్రిగా కూడా పని చేశారు ప్రసిద్ధికెక్కిన ప్రతిభావంతురాలగు వారి సోదరి ఆఁలిప్ శ్రాయినర్ దక్షిణాఫ్రికాలో అమితంగా ప్రజాదరణ పొందిన మహిళ ఇంగ్లీషు మాట్లాడబడే ప్రాంతాలన్నిటి యందు ఆమె విదుషీమణిగా ప్రఖ్యాతి గడించింది. మనుష్యుల యెడ అమెకు గల ప్రేము అపారం ఎప్పుడు చూచినా ఆమె కండ్ల నుంచి ప్రేమ వర్షిస్తూ వుంటుంది. ఆమె డ్రీమ్స్ అను పుస్తకం వ్రాసింది. అప్పటినుంచి అమె డ్రీమ్స్ రచయిత్రిగా పేరుపొందింది. ఆమె నిరాండబరత్వం అమోఘం ఇంట్లో గిన్నెలు సైతం ఆమెయే తోముకుంటుంది అది ఆమె గొప్పతనం ఈ మూడు కుటుంబాల వారు మొదటి నుంచి హబ్షీల పక్షం వహించారు తెల్లవాళ్లు హబ్షీల అధికారాల్ని తగ్గించుటకు ప్రయత్నించినప్పుడు యీ ముగ్గురు ప్రముఖులు ఆ ప్రయత్నాలను వ్యతిరేకించారు. వాళ్ల యీ ప్రేమ భారతీయులపైకి కూడా మళ్ళింది. అయితే ఆ ముగ్గురూ హబ్షీలు భారతీయులు యిరువురి మధ్య తేడాను పాటించే వారు. వాళ్ల తర్కం ఒక్కటి ఇంగ్లీషు వాళ్లు రాక పూర్వమే యిక్కడ నివసించిన వాళ్లు హబ్షీలు వారు యిక్కడి మూలవాసులని అందువల్ల తెల్లవాళ్లు హబ్షీల సహజ హక్కుల్ని హరించుటకు వీలు లేదు. భారతీయుల విషయంలో పోటీ పడతారనే భావంతో వారికి వ్యతిరేకంగా చేయబడుతున్న నిర్ణయాలలో సారళ్యం రావాలి అది న్యాయ సమ్మతం అని వారి అభిప్రాయం అయినా వారు భారతీయుల యెడ ఎంతో సానుభూతిగా వున్నారు. శ్రీగోపాలకృష్ణ గోఖలే మొదటిసారి దక్షిణ ఆఫ్రికా విచ్చేసినప్పుడు వారి సమ్మానార్ధం మొదటి సభ కేప్ టౌన్‌యందలి టౌన్‌హాలులో జరిగింది. దానికి శ్రీ శాయినర్ అధ్యక్షత వహించారు. శ్రీ మేరిమెన్‌కూడా గోఖలే గారితో తీయగా ప్రేమగా మాట్లాడారు. భారతీయుల ఎడ తమ సానుభూతిని ప్రకటించారు. కేప్ టౌస్ నుంచి వెలువడే పత్రికలు కూడా యితర రాజ్యా ల పత్రికల కంటే పక్షపాత రహితంగా వుంటాయి. అవి భారతీయులకు పూర్తి వ్యతిరేకం కాదు
శ్రీ మేరిమెన్, శ్రీ కశాయినర్‌గారలను గురించి నేను పైన వ్రాసినట్లు యింకా అనేక మంది ఆంగ్లేయుల్ని గురించి వ్రాయవచ్చు. యిక్కడ నేను కేవలం ఉదాహరణకు మాత్రమే వారి పేర్లు వాళ్ల ప్రఖ్యాతిని గురించి పేర్కొన్నాను. మిగతా మూడు రాజ్యాలకంటే కేప్ కాలనీలో రంగుద్వేషం, మరియు భారతీయుల యెడ వ్యతిరేకత తీవ్రంగా లేకపోయినప్పటికీ, మిగతా ప్రాంతాల ప్రభావం పడకుండా వుండటం సాధ్యం కాదుగదా | అందువల్ల అక్కడ కూడా నేటాలు వలెనే భారతీయుల ప్రవేశం, వ్యాపారం మీద ఆంక్షలు విధిస్తూ ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్ ఆక్టు, మరియు డీలర్స్ లైసెన్సు ఆక్టు ప్యాసయ్యాయి
మొత్తం మీద దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం తెరిచియున్న ద్వారాలు బోయర్ యుద్ధం నాటికి పూర్తిగా మూసుకున్నాయని చెప్పవచ్చు ట్రాన్స్‌వాల్‌లో భారతీయుల ప్రవేశం పై విధించబడిన 3 పౌన్ల ఫీజు తప్ప మరే ఆంక్షలేదు కాని నేటాలు, కేప్ కాలనీల హార్బర్లు భారతీయులకు ప్రవేశాన్ని నిషేధించాయి యిక ట్రాన్స్‌వాల్ చేరాలంటే భారతదేశాన్నుంచి వెళ్లే భారతీయులు ఎక్కడా దిగడానికి వీలులేదు. ఒక్కమార్గం వున్నది. పోర్చుగీసు వారి హార్బరు డేలాగోవావేలో దిగి ట్రాన్స్‌వాల్ చేరవచ్చు. అయితే అక్కడ కూడా తెల్లవారి రాజ్యాల వలెనే కొద్దో గొప్పో భారతీయులకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించబడ్డాయి. యీ పరిస్థితుల్లో కొద్ది మంది భారతీయులు మాత్రమే పలుకష్టాలు సహించి, లంచాలు యిచ్చి నేటాలు. మరియు డేలో గోవావే, హార్బర్లలో దిగి ట్రాన్స్‌వాల్‌కు చేరుతూవుండేవారు
6
భారతీయులు ఏం చేశారు? -1
గత ప్రకరణాల్లో తమ మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ భారతీయులు గైకొన్న చర్యలను గురించి కొంత తెలుసుకున్నాము అయితే సత్యాగ్రహప్రారంభాన్ని గురించి బాగా తెలుసుకొనుటకు, భారతీయుల రక్షణ కోసం చేసిన ప్రయత్నాలను గురించి వ్రాయడం అవసరమని భావిస్తున్నాను.
1893 వరకు దక్షిణాఫ్రికాలో స్వతంత్ర భారతీయుల్లో భారతదేశప్రజల హితాన్ని రక్షించగల చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా వున్నది