దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/కష్టాల సింహావలోకనం-1

వికీసోర్స్ నుండి

వాళ్లు భారతీయవ్యాపారులతో వ్యాపారం సాగించుటకు వారికి యిబ్బంది ఏమీ లేదని భారతీయులు తెలుసుకున్నారు. దానితోకొంత మంది భారతీయవ్యాయపారులు ట్రాన్స్‌వాల్, ఫ్రీస్టేట్‌లకు ప్రాకారు అక్కడ దుకాణాలు తెరిచారు. అప్పుడు అక్కడ రైలు ప్రయాణసౌకర్యం లేదు. అందువల్ల వ్యాపారంలో లాభాలు బాగా గడించవచ్చన్న భారతీయుల ఆలోచనలు సత్యమని తేలాయి బోయర్లు, హబ్షీలు వారి దగ్గర వస్తువులు విపరీతంగా కొనడం ప్రారంభించారు. యిక మిగిలింది ఒక్క కేప్‌కాలనీ మాత్రమే అక్కడికి కూడా కొందరు భారతీయ వ్యాపారులు చేరారు. సంపాదన బాగా రాసాగింది యీ విధంగా కొద్ది సంఖ్యలోనైనా సరే భారతీయులు దక్షిణాఫ్రికా యొక్క నాలుగు రాజ్యాలలో ప్రవేశించారు

అప్పుడు పూర్ణ స్వతంత్రులైన భారతీయుల సంఖ్య 40 మరియు 50వేల మధ్య, గిర్‌మిట్ ముక్త భారతీయుల సంఖ్య, వాళ్ల సంతతితో కలుపుకొని ఒక లక్ష వరకు ఉన్నది




4

కష్టాల సింహావలోకనం -1

నేటాలు

నేటాలునందలి తెల్లదొరలకు బానిసలు అవసరమైనారు. గిర్‌మిట్ గడువుపూర్తికాగానే స్వతంత్రులయ్యేవాళ్లు, ఏ విధంగానైనా తమతో సమంగా వుండగలిగినవాళ్లు తెల్లవారికి అక్కరలేదు. భారతదేశంలో వ్యవసాయం సరిగ్గాసాగక, రాబడి బాలక చాలామంది భారతీయులు గిర్‌మిట్లుగా నేటాల్ వెళ్లారు. అయితే వాళ్లకు వ్యవసాయం అంటే ఏమిటో, పొలం అంటే ఏమిటో బాగా తెలుసు నేటాలువచ్చి అక్కడిభూములు చూచిన తరువాత కాయకూరలు పండించుకొని ఎంతో ధనం సంపాదించుకోవచ్చునని వాళ్లు గ్రహించారు. ఏ కొంచెం పొలం సంపాదించుకున్నా బాగా పంటలు పండించుకోవచ్చని తెలుసుకున్నారు. అందువల్ల చాలామంది గిర్‌మిటియాలు గడువు తీరిపోగానే ముక్తులై వేరే వృత్తులు ప్రారంభించారు. దీనివల్ల నేటాలు ప్రజలకు ప్రయోజనమే కలిగింది. మంచి రైతులు లేనందున గతంలో అందని కూరగాయలు జనానికి బాగా అందసాగాయి. అందువల్ల కూరగాయల ధరలు బాగా తగ్గిపోయాయి. ఈ వ్యవహారం డబ్బుగలతెల్ల దొరలకు నచ్చలేదు. తమ ఒక్కరి పెత్తనమే సాగుతున్నదనుకున్న చోట మరొకరు ప్రవేశించేసరికి తెల్లవాళ్లు మండిపడ్డారు దానితో యిట్టి గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులకు వ్యతిరేకంగా నేటాలులో ఒక ఉద్యమం ప్రారంభమైంది పాఠకులు గమనించవలసిన విషయం ఒకటున్నది. తెల్లవాళ్లు బానిసలుగా పనిచేయుటకు భారతీయ కార్మికులు కావాలని ఒక వైపున కోరుతూ, గిర్‌మిట్ ప్రధనుంచి విముక్తి పొందిన భారతీయులపై ఆంక్షలు విధించాలని మరొకవైపున ఉద్యమం సాగించారు. భారతదేశం నుంచి వచ్చే గిర్‌మిటియాలంతా నేటాలుకే సరిపోతూ వుండేవారు తెలివిగల భారతీయులు చేసిన కాయకష్టానికి తెల్లవాళ్లవల్ల లభించిన ప్రతిఫలం యిదే

ఆ ఉద్యమం అనేక రూపాలు దాల్చింది. తెల్లవాళ్లు క్రొత్తపాట మొదలుపెట్టారు. వాళ్లకు కావలసింది భారతీయగిర్‌మిటియాలు వాళ్లు స్వతంత్రులు కావడం తెల్లవాళ్లకు యిష్టం లేదు. కావున క్రొత్త వాదన ప్రారంభించారు. భారతదేశాన్నుంచి గిర్‌మిటియాలు నేటాలులో గడువుతీరిన తరువాత స్వతంత్రులుగా వుండకూడదని, వాళ్లు భారతదేశం తిరిగి వెళ్లిపోవాలని, నేటాలులో వుండదలుచుకుంటే తిరిగి గిర్‌మిటియాలుగానే వుండాలని అట్టి నిబంధనలు క్రొత్త ఎగ్రిమెంట్లో చేర్చాలనే ప్రచారం ప్రారంభించారు. ఏది ఏమైనాగిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు స్వతంత్రంగా నేటలులో వుండకూడదు. ఇదీ వాళ్ల వాదన ఇందుకోసం ఉద్రిక్తంగా ఉద్యమం నడిపించారు. చివరికినేటాలు ప్రభుత్వం దీనిమీద ఒక కమిషన్‌ను నియమించింది. రెండువర్గాలవారి వాదనలు సరిగా లేవు అసలు గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయుల పల్ల నేటాల్ ప్రజలకు మేలు జరిగింది. అందువల్ల కమిషన్ ముందు సాక్ష్యాలు యిచ్చినవారంతా రెండు వర్గాల తెల్లవాళ్లకు వ్యతిరేకంగా వాజ్మూలం యిచ్చారు. చివరకు తెల్లవాళ్ల వాదనకు అనుకూలంగా కమిషన్ నిర్ణయం చేయలేకపోయింది. నిప్పు ఆరిపోయినా యింకా వేడి తగ్గనట్లు నేటాల్ ప్రభుత్వం మీద తెల్లవాళ్ల ఉద్యమ ప్రభావం బాగా పడిందని చెప్పవచ్చు. అక్కడి ప్రభుత్వం తెల్లవాళ్లది కనుకవాళ్లు తెల్లవాళ్లకు ప్రతికూలంగా ఎందుకు చర్య తీసుకుంటారు? అక్కడి తెల్ల ప్రభుత్వం వారు రెండు వర్గాల వాదల్ని భారతప్రభుత్వానికి పంపించారు. భారత ప్రభుత్వం మాత్రం భారతీయులుచిరకాలం గిర్‌మిటియాలుగానే వుండిపోవాలనే నిర్ణయం ఎలా చేస్తుంది. అసలు గిర్‌మిటియాలుగా పంపుతూ భారత ప్రభుత్వం చేసిన వాదన ఏమిటి? ప్రారంభంలో కొంత కాలంపాటు భారతీయులు గిర్మటియాలుగావుండి పనిచేస్తారని, ఆ తరువాత స్వతంత్రులై జీవన భృతికోసం వృత్తులు సొంతంగా ప్రారంభించుకుంటారని మొదటవారు అన్నారు. అప్పుడు నేటాలు క్రౌన్ కాలనీగా వున్నది. అందువల్ల కలోనియల్ ఆఫీసు అక్కడి పూర్తి బాధ్యత వహిస్తుందని భావిస్తూ వుండేవారు నేటాలు తెల్లవాళ్లకు ఆ ఆఫీసువల్ల తమ అన్యాయపు కోర్కెలు తీర్చుకోగలమని ఆశకలుగలేదు. అందువల్ల, అటువంటివే మరికొన్ని కారణాలవల్ల నేటాలులో జవాబుదారీ ప్రభుత్వం ఏర్పడాలని మరో ఉద్యమం ప్రారంభించారు. 1893లో అట్టి జవాబుదారీ ప్రభుత్వ నిర్మాణం అక్కడ జరిగింది. దానితో నేటాలు ప్రభుత్వం తమ శక్తిని గుర్తించింది. కలోనియల్ ఆఫీసు కూడా నేటాల్ తెల్లవాళ్ల కోరికల్ని తీర్చుటకు సిద్ధపడింది దానితో నేటాలు ప్రభుత్వం. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపటం కోసం ప్రతినిధి బృందాన్ని భారతావనికి పంపించింది. గిర్‌మిట్‌ప్రధనుంచి ముక్తి పొంది నేటాలులో నివసించతలచిన ప్రతి భారతీయుడు 35 పౌండ్లు అనగా 375 రూపాయలు ప్రతి సంవత్సరం తల పన్ను చెల్లించాలని ప్రతినిధిబృందం భారతప్రభుత్వాన్ని కోరింది అంత భారీ పన్ను ఏ భారతీయుడూ చెల్లించగల స్థితిలో లేడు. అందువల్ల స్వతంత్ర పౌరులుగా నేటాల్‌లో వుండలేరు. ఆనాటి భారతవైస్రాయిగా వున్న లార్డ్ ఎల్గిస్‌కు 35 పౌండ్లు ఎక్కువ అని అనిపించింది. అందువల్ల 3కు తగ్గించాడు. ఈ పన్ను ఒక్క పురుషుడేగాక అతడి భార్యకు 3 పౌండ్లు. 13 ఏండ్ల వయస్సు గల కుమార్తె 3 పౌండ్లు, 16 ఏండ్ల కొడుకు వుంటే అతడు 3 పౌండ్ల తల పన్ను కట్టాలని కఠోర నిర్ణయం తెల్ల ప్రభుత్వం వారు గైకొన్నారు. ఇదిఎంత బరువైనదో భారతీయులు గ్రహించవచ్చు. ఒక కుటుంబం 12 పౌండ్లుపన్నుగా చెల్లించాలన్న మాట అనుభవించినవారికే ఆ బాధ తెలుస్తుంది వాళ్ల కష్టాలు ఎలాంటివో కండ్లారా చూచిన వారికి బోధపడుతుంది. నేటాలు ప్రభుత్వం వారి యీ నిర్ణయాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. కాని వినేనాధుడెవరు ? చివరికి 25 పౌండ్లు తగ్గి 3 పౌండ్లు అయ్యాయి. గిర్‌మిటియాలు ఏం చేయగలరు. అయితే భారతీయ వ్యాపారులు మాత్రం దేశభక్తితోను, పారిమార్ధిక భావంతోసు ఉద్యమం నడిపించారు. తెల్లవాళ్లు గిర్‌మిటియా కార్మికుల విషయంలో వ్యవహరించినట్లు గానే స్వతంత్ర భారతీయుల విషయంలో కూడా వ్యవహరించారు. నేటాలులో గల స్వతంత్ర భారతపౌరులకు వ్యతిరేకంగా పైన చెప్పిన ఉద్దేశ్యాలతోనే మరో ఉద్యమం ప్రారంభించారు భారతీయ వ్యాపారులు నేటాలులో బాగా పాతుకుపోయారు వాళ్లు నగరంలో ముఖ్యమైన చోట్ల భూములు కూడా కొన్నారు. గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి పొందిన స్వతంత్ర భారతీయుల సంఖ్య బాగా పెరిగిపోయింది. అవసరమైన వస్తువులకు గిరాకీ కూడా పెరిగింది వేలాది బస్తాల బియ్యం భారతదేశాన్నుంచి దిగుమతి కాసాగింది. వాటి అమ్మకం వల్ల భారతీయ వ్యాపారులకు మంచి లాభాలు రాసాగాయి హాబ్షీలతో జరిగే ప్యాపారంలో కూడా వారికి లాభాలు బాగా రాసాగాయి. దీన్ని చిన్న వ్యాపారస్తులైన తెల్లవాళ్లు సహించలేకపోయారు భారతీయ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి, చట్టరీత్యా మీకు కూడా నేటాలు అసెంబ్లీ సభ్యులుగా ఎన్నుకోబడుటకు అర్హులు అని ఇంగ్లీషు వాళ్లే చెప్పారు దానితో కొంతమంది భారతీయ వ్యాపారస్తులు తమ పేర్లు కూడా ఓటర్ల లిస్టులో చేర్పించుకున్నారు. ధీన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. యీ విధంగా భారతీయులస్థాయినేటాలులో పెరిగిపోతే వాళ్ల ముందు ఇంగ్లీషు వాళ్లు నిలవలేరనే నిర్ణయానికి వాళ్లు వచ్చారు. అందువల్ల అక్కడ ఏర్పడిన జవాబుదారీ ప్రభుత్వం భారతీయుడెవ్వడికీ ఓటింగు హక్కు లేకుండా చేయుటకు పూనుకున్నది. 1894లో యిటువంటి లక్ష్యంగల ఒక బిల్లు నేటాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. భారతీయులకు ఓటింగు హక్కు నిరాకరిస్తూ యీ బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని తెల్ల వాళ్ళంతా అంగీకరించారు రంగు భేదాన్ని పురస్కరించుకొని భారతీయులకు వ్యతిరేకంగా ప్యాసైన మొదటి చట్టం యిదే భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. రాత్రికి రాత్రి ఒక అర్జీ తయారైంది. దానిమీద 400 మంది సంతకాలుచేశారు. యీ అర్జీ చేరగానే నేటాలు అసెంబ్లీ అదిరి పోయింది. అయితే బిల్లు ప్యాపైంది కదా అప్పుడు లార్డ్ రిప్పన్ అనువాడు అధినివేశ దేశాలకు సంబంధించిన మంత్రిగా వున్నాడు. అతడి దగ్గరికి 10 వేల మంది భారతీయుల సంతకాలతో మరో అర్జీ చేరింది. 10 వేల మంది సంతకాలంటే నేటాలు నందు నివసిస్తున్న స్వతంత్ర భారతీయులందరూ దాని మీద సంతకాలు చేసినట్లే. దానితో లార్డ్ రిప్పన్ ప్రభువు నేటాల్ అసెంబ్లీ అంగీకరించిన బిల్లును నిరాకరించి వేశాడు బ్రిటిష్ సామ్రాజ్యం, చట్టప్రకారం రంగు భేదాన్ని అంగీకరించదు అని ప్రకటించాడు. భారతీయులు సాధించిన యీ విజయం ఎంత ఘనమైనదో పాఠకులకు తరువాత బోధపడుతుంది. అందుకు సమాధానంగా నేటాలు ప్రభుత్వం అసెంబ్లీలో మరో బిల్లు ప్రవేశపెట్టింది. అందులో రంగు భేదాన్ని తొలగించారు. కాని పరోక్షంగా భారతీయుల్ని దెబ్బకొట్టే ప్రయత్నమే ఆబిల్లులో జరిగింది. భారతజాతి ఆ బిల్లును కూడా వ్యతిరేకించిందికాని విజయం సాధించలేకపోయింది. యీ క్రొత్తబిల్లు రెండు అర్థాలు కలది భారతజాతి తలుచుకుంటే కోర్టుల్లో ఆ బిల్లును ఛాలెంజి చేసి వుంటే బాగుండేది. ప్రీవీ కౌన్సిల్‌కు వెళ్లవలసి వచ్చినా సిద్ధపడవలసిందే కాని అలా జరగలేదు అయితే ప్రీవీ కౌన్సిలుకు పోకపోవడం సరియైన పని అని నా అభిప్రాయం, బిల్లులో రంగు భేదం అనుమాటకు తావులేకుండా జాగ్రత్తపడ్డారు. ఇంత చేసినా నేటాలు తెల్ల దొరలకు, అక్కడి తెల్లవారి ప్రభుత్వానికి తృప్తి కలగలేదు. భారతీయులు రాజకీయంగా నేటాలులో బలపడకుండా వుండటం వాళ్లకు ఆవసరం దానితోపాటు భారతీయుల వ్యాపారాన్ని నేటాలులో దెబ్బతీయడం, స్వతంత్ర భారతీయుల్ని నేటాలులో నిలవనీయకుండా చేయడం వాళ్ల లక్ష్యం 30 కోట్ల మంది భారతీయులు నేటాలు మీద విరుచుకుపడితే అక్కడి కొద్దిమంది తెల్లవార్ల గతి ఏమి కాను? సముద్రంలో దూకడమే కదా వారికి గల మార్గం క యీ భయమే అక్కడి తెల్ల వాళ్లను పట్టుకుంది. అప్పుడు నేటాల్ యందుగల జనాభా వివరాలు క్రింది విధంగా వున్నాయి. హబ్షీల సంఖ్య 4 లక్షలు తెల్లవారి సంఖ్య 40 వేలు గిర్‌మిటియా కార్మికుల సంఖ్య 60 వేలు గిర్‌మిట్ ప్రధ నుంచి ముక్తి పొందిన వారి సంఖ్య 10 వేలు స్వతంత్ర భారతీయుల సంఖ్య 10 వేలు నిజానికి నేటాల్‌లో గల తెల్లదొరలు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాని వాళ్లకు నచ్చ చెప్పడం సాధ్యం కాని పని భారత దేశపు దయనీయస్థితిని గురించి వాళ్ల ఆచార వ్యవహారాలను గురించి అక్కడి తెల్ల వాళ్లకు తెలియదు. తమ మాదిరిగానే భారతీయులు కూడా శౌర్యవంతులు సాహసవంతులు అయి వుంటారని వాళ్లభావం జనాభాను పరిగణనకు తీసుకోవడంలో వారి దోషం కూడా ఏమీ లేదు. భారతీయుల జనాభా ముందు తమ జనాభాను పోల్చి చూచుకొని వాళ్లు భయపడ్డారు. ఏదిఏమైనా అందుకు మంచి పరిణామమే కలిగింది. ఆ తరువాత నేటాల్ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారు. వాటిలో ఎక్కడా రంగు భేదాన్ని గురించి పేర్కొన లేదు యిది భారతీయులు సాధించిన ఘనవిజయ ఫలితమేనని చెప్పవచ్చు వాళ్లు ఆ బిల్లులో ఉపయోగించిన భాష విషయమై ఎంతో జాగ్రత్త వహించారు. దీనివల్ల భారతీయుల గౌరము పెరిగిందని చెప్పవచ్చు యీ సారి కూడా భారతీయులు వ్యతిరేకించారు. కాని రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించబడ్డాయి. అవి చట్టాలు అయ్యాయి. ఒక చట్టప్రకారం భారతీయ ప్యాపారస్తుల మీద ఆంక్షలు విధించబడ్డాయి. రెండో చట్టంద్వారా నేటాలులో భారతీయులు ప్రవేశించకుండా ఆంక్షలు విధించబడ్డాయి. మొదటిచట్టం ద్వారా నియమింప బడిన అధికారి యొక్క అనుమతిలేనిదే ఎవ్వరికీ వ్యాపారం చేసుకొనుటకు ఆర్డరు యివ్వడం జరగదు. ఆంగ్ల వ్యాపారస్తులు తిన్నగా ఆ అధికారి దగ్గరకు వెళ్ళి ఆర్డరు తెచ్చుకున్నారు. కాని భారతీయులు మాత్రం ఎన్నో అవరోధాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతి కష్టం మీద వారికి ఆర్డరు లభించ సాగింది. యిందుకోసం భారతీయులు వకీళ్లను నియమించుకోవలసి రావడమే కాక డబ్బు కూడా అమితంగా ఖర్చు చేయవలసి వచ్చింది. సామాన్యులైన భారతీయులు ఆర్డరు లేకుండానే వుండసాగారు. ఒక విచిత్రమైన నిబంధన కూడా అందుచేర్చారు. భారతీయులు నేటాలులో ప్రవేశించదలిస్తే యూరప్‌కు చెందిన ఏదేని ఒక భాష అతడికి తెలిసి యుండలి ఆ భాషలో ఆర్జీ దాఖలు చేసుకోవాలి యీ నిబంధన ద్వారా భారతీయులకు నేటాల్ తలుపులు పూర్తిగా మూసివేసినట్లే తెలిసోతెలియకో నేను నేటాల్ ప్రభుత్వానికి అన్యాయం చేయకూడదనే ఉద్దేశ్యంతో పాఠకులకు ఒక్క విషయం తెలుపుతున్నాను. యీ చట్టం అంగీకరించబడక పూర్వం మూడు సంవత్సరాల నుంచి నేటాలులో ఏ భారతీయుడైనా ఉండివుంటే అతడు నేటాలు నుంచి భారత దేశంలోని మరే దేశంగాని వెళ్లవచ్చు. నేటాలుకు తిరిగి రావచ్చు. అతడు యూరప్ భాషనేర్వనక్కరలేదు. అతడు తన భార్య, మైనరు తీరని బిడ్డలతో పాటు నేటోలులో ప్రవేశించవచ్చు.

ఇదేగాక నేటాలులో వుండే గిర్‌మిట్ భారతీయుల మీద, స్వతంత్ర భారతీయుల మీద చట్టబద్ధమైన చట్ట బద్దంకాని పలు ఆంక్షలు విధించారు వాటన్నింటిలోకి పాఠకుల్ని దింపడం నాకు యిష్టం లేదు యీ పుస్తక మందలి విషయాన్ని తెలుసుకునేందుకు అవసరమైన వివరాలనే యిక్కడ పేర్కొంటేచాలని నా అభిప్రాయం దక్షిణాఫ్రికాయందలి అధినివేశరాజ్యాలలో నివశించే భారతీయుల చరిత్రను విస్తారంగా వివరించవచ్చుకాని అందుకు నేను పూనుకోవడంలేదు. అది యీ పుస్తకం ఉద్దేశ్యం కాదు