దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/దక్షిణాఫ్రికాకు భారతీయుల రాక

వికీసోర్స్ నుండి

ఎక్కువ ప్రాధాన్యం యిచ్చారు. ఆ విధంగా తమకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని దక్షిణాఫ్రికా రాజకీయ అనుభవజ్ఞులు ఏకగ్రీవంగా అంగీకరించడమే గాక బ్రిటిష్ పార్లమెంటు చేత కూడా అంగీకరింపచేసుకున్నారు

దక్షిణాఫ్రికా చరిత్రను అతిక్లుప్తంగా పాఠకులకు తెలియజేయుటకు యిక్కడ ప్రయత్నించాను యీ వివరం తెలుపకపోతే యికముందు జరుగనున్న సత్యాగ్రహ మహాసంగ్రామ రహస్యం తెలియచేయడం కష్టమవుతుంది అసలు విషయానికి వెళ్లక పూర్వం భారతీయులు దక్షిణాఫ్రికాకు ఎలా వచ్చారో, సత్యాగ్రహం ప్రారంభం కావడానికి పూర్వం వాళ్లు ఏఏ కష్టాలు పడ్డారో, మనం తెలుసుకోవడం అవసరం




3

దక్షిణాఫ్రికాకు భారతీయుల రాక

ఆంగ్లేయులు నేటాలు చేరి అక్కడ వారు. జూలూల దగ్గర కొన్ని సదుపాయాలు అధికారాలు పొందారు. నేటాలులో చెరకు, కాఫీ, తేయాకు బాగా పండించవచ్చునని అనుభవం మీద వాళ్లు గ్రహించారు. పెద్దస్థాయిలో వీటిని పండించాలంటే వేలాది మంది కార్మిక జనం అవసరం నూరు నూటయాభై ఇంగ్లీషు కుటుంబాల వాళ్లు యీ పంటలు పండించడం సాధ్యంకాని పని అందువల్ల వాళ్లు హబ్షీలను ప్రోత్సహించారు భయపెట్టారు కూడా అక్కడ బానిస చట్టం రద్దయింది అందువల్ల హబ్షీలపై వత్తిడి తెచ్చి వాళ్లను అంగీకరింపచేయలేక పోయారు హబ్షీలకు ఎక్కువగా కాయకష్టంచేసే ఆలవాటు లేదు ఆరు నెలలు శ్రమపడి, వచ్చిన ఆదాయంతో సంవత్సరమంతా గడుపుతూ వుంటారు. అటువంటి స్థితిలో మరో యజమానులతో ఏండ్ల తరబడి ఒప్పందం చేసుకొని కాయకష్టం చేయుటకు వాళ్లు ఎందుకు సిద్దపడతారు? దానితో వాళ్లపై గల ఆశవదులు కొని మరొకరెవరైనా దొరుకుతారేమోనని ఆంగ్లేయులు యోచించారు. వారి దృష్టి భారతీయుల మీద పడింది. వెంటనే వాళ్లు భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించారు. భారత ప్రభుత్వం అందుకు అనుకూలంగా స్పందించింది తత్పలితంగా ది 16 నవంబరు 1860 నాడు భారతీయ కార్మికుల మొదటి జట్టు ఓడ ద్వారా నేటాలు చేరుకున్నది

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో యీ తేదీకి ప్రముఖ స్థానం లబించింది ఆ తేదీ నాడు ఆ ఘట్టం జరిగి యుండక పోతే భారతీయులు దక్షిణాఫ్రికాలో ఆడుగు పెట్టేవారు కాదు. సత్యాగ్రహ సమరం జరిగి యుండేది కాదు యీ దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర వ్రాయవలసిన అవసరం ఏర్పడి యుండేది కాదు

నేటాల్‌లో నివసించే ఆంగ్లేయుల కోరికను అంగీకరించినప్పుడు భారత ప్రభుత్వం యీ విషయాన్ని నిశితంగా పరిశీలించలేదని నా అభిప్రాయం భారత దేశంలో పరిపాలన సాగిస్తున్న కొందరు ఆంగ్లేయులు నేటాలులో నివసిస్తున్న తమ ఆంగ్లేయుల పక్షం వహించారు. అయితే కాగితాల మీద జరిగిన ఒప్పందంలో భారత దేశకార్మికుల రక్షణను గురించి షరతులు ఎక్కువగా చేర్చడమే గాక, వారి ఆహార పానీయాల విషయంలో కూడా ఎక్కువ షరతులు చేర్చడం జరిగిన మాట వాస్తవమే అయితే యింత దూరాన్నుంచి అక్కడికి వెళ్ళిన భారతీయులపై కష్టాలు, ఆపదలు, చిక్కులు విరుచుకు పడితే వాటి పరిష్కారం ఎలా చేయాలి అనువిషయాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. భారతీయుల మత రక్షణ ఎలా జరుగుతుందో, వారు తమ రీతుల్ని నీతుల్ని ఎలా రక్షించుకోగలలో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. చట్ట రీత్యా బానిస వృత్తి రద్దయిందేగాని, యజమానుల హృదయాలనుంచి ఆ ప్రవృత్తి తొలగలేదను విషయం కూడా భారత ప్రభుత్వంలో వున్న ఆంగ్ల అధికారులు పట్టించుకోలేదు. అక్షరం జ్ఞానంలేని భారతీయ కార్మికులు అమితదూరాన వున్న పరాయి దేశానికి వెళ్లి నిర్దారించబడిన గడువు దాకా బానిసలైపోతారను విషయం వాళ్ళు గమనించలేదు. సర్ విలియం విల్సన్ హంటర్ అను మహాశయుడు యీ కార్మికులు స్థితిగతులను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అక్కడి వారి పరిస్థితిని గురించి వర్ణిస్తూ, రెండు శబ్దాల్ని లేక రెండు శబ్దాల సముదాయాన్ని ప్రయోగించాడు. నేటాలునందలి భారతీయ కార్మికులు అర్ద బానిసలుగా వున్నారు అని మొదటిసారి వ్రాశాడు. రెండోసారి వ్రాసిన జాబులో నేటాలు నందలి భారతీయ కార్మికులు సంపూర్ణ బానిసత్వంలో పడిపోయారు అని వ్రాశాడు నేటాలులో ఏర్పడ్డ ఒక పెద్ద కమీషన్ ఎదుట సాక్ష్యం చెబుతూ గొప్ప యూరోపియన్ కీ. శే. శ్రీ ఎస్కంబ్ కూడా యిదే విషయం చెప్పాడు యిలాంటి అనేక ఉదాహరణలు నేటాలు నందు నివశించే ప్రముఖ ఆంగ్లేయుల వాజ్మూలలనుంచి పేర్కొనవచ్చు యిలాంటి విషయాలు అర్జీల రూపంలో భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది. కాని జరగవలసిందేదో జరిగి పోయింది ఏ ఓడ అయితే భారతదేశ కార్మికుల జట్టును నేటాలుకు చేర్చిందో ఆ ఓడయే కూలీలతో బాటు సత్యాగ్రహమనే మహావృక్షపు విత్తనాల్ని కూడా నేటాలుకు చేర్చినట్లయింది

ఈ కార్మికుల్ని నేటాలుకు సంబంధించిన భారతీయ దళారులు ఎలా మోసగించారో, దళారుల మాటలు నమ్మి మనకార్మికులు నేటాలు ఎలా వెళ్లారో, నేటాలు చేరిన పిమ్మట వారి కండ్లు ఎలా తెరుపుడు పడ్డాయో, కండ్లు తెరుపుడు పడ్డా వీళ్లు నేటాలులోనే ఎందుకు వున్నారో. తరువాత కూడా భారతీయులు అక్కడికి ఎందుకు వెళ్లారో అక్కడకు వెళ్ళి నీతిమత వ్యవహారాల్ని బంధనాల్ని ఎలా తెంచి వేసుకున్నారో, లేక ఆ బంధనాలు ఎలా తెగిపోయాయో, నిర్భాగ్యులైన భారతీయ కార్మికుల పెండ్లి అయిన భార్యలకు వేశ్యలకు మధ్యన గల వ్యత్యాసం ఎలా తొలగిపోయిందో ఆ కధంతా యీ చిన్ని గ్రంధంలో వ్రాయడం సాధ్యం కాని పని

భారతీయ కార్మికులు. ఎగ్రిమెంటు ప్రకారం నేటాలు వెళ్లిన భారతీయులుగా నమోదయ్యారు. దానితో భారతీయులు తాము గిరీమిటియాలమని (ఒప్పందంకుదుర్చుకొని వచ్చిన బానిస కార్మికులు) చెప్పుకోవడం ప్రారంభించారు. అందువల్ల యిక ముందు ఎగ్రిమెంటును గిర్‌మిట్ అని అంటాను దాని ఆధారంగా వెళ్లిన కార్మికులను గిర్‌మిటియాలని అంటాను భారత దేశాన్నుంచి గిర్‌మిటియాలు నేటాలు చేరారనే వార్తలు మారిషస్ దేశం చేరాయి. అట్టి భారతీయులతో సంబంధాలు గల భారత వ్యాపారులు నేటాలు వెళ్లుటకు ఉవ్విళ్లూరారు మారిషస్ దేశం భారత దేశానికి దక్షిణాఫ్రికాకు మధ్యన వున్నది. మారిషస్ ద్వీపంలో వేలాదిమంది భారతవ్యాపారులు. కార్మికులు ఉంటున్నారు. వారిలో ఒక వ్యాపారి పేరు కీ. శే. అబూబకర్ అమద్ అతడు నేటాలులో తనవృత్తి ప్రారంభించాలని భావించాడు. భారత వ్యాపారులు ఏమేమి చేయగల శక్తివంతులో ఇంగ్లీషు వాళ్లకు తెలియదు వాళ్లంటే లెక్కకూడాలేదు. భారతీయ కార్మికుల సహాయంతో ఆంగ్లేయులు నేటాలులో చెరుకు, తేయాకు, కాఫీ బాగా పండించడమేగాక బాగాలాభాలు గడించసాగారు. కొద్ది సమయంలోనే యీ వస్తువుల్ని దక్షిణాఫ్రికా కంతటికీ సప్లై చేయసాగారు బాగా ధనం సంపాదించి త్వరత్వరగా విశాలమైన భవనాలు నిర్మాణం చేసుకున్నారు. అడవిలో వైకుంఠాన్ని స్థాపించారు. అట్టి వాతావరణంలో సేఠ్ అబూబకర్ వంటి సామాన్యుడు, నమ్మకస్తుడు, తెలివిగల వ్యాపారి తమ మధ్య నివసించడం వారికి యిష్టం కాలేదు ఒక ఇంగ్లీషు వాడు కూడా భాగస్వామిగా ఆబూబకర్‌తో కలిసి వ్యాపారం చేయసాగారు సేఠ్ అబూబకర్ వ్యాపారం ప్రారంభించి పొలం కొన్నాడు. అతడు బాగా డబ్బు సంపాదించాడనే వార్తలు భారత దేశం ముఖ్యంగా అతని జన్మస్థలి యగు గుజరాత్ యందలి పోర్‌బందర్ వంటి చోట్లకు చేరాయి. దానితో యితరమహమ్మదీయులు కూడా నేటాలు చేరారు. వారితోబాటు సూరత్‌కు చెందిన బాహరాలు కూడా అక్కడికి చేరారు యీ వ్యాపారులకు గుమాస్తాలు అవసరమైనారు. దానితో గుజరాత్, కారియావాడ్ (సౌరాష్ట్ర) కు చెందిన హిందూ గుమాస్తాలు కూడా నేటాలు చేరుకున్నారు

ఈ విధంగా నేటాలులో రెండురకాల భారతీయులు చేరారు. 1 స్వతంత్ర వ్యాపారులు, వారి స్వతంత్ర నౌకర్లు 2 భారతీయ గిర్‌మిటియాలు. త్వరలోనే గిర్‌మిటియాలకు పిల్ల పాపలు పుట్టారు. గిర్‌మిట్ విధానం ప్రకారం అట్టి సంతతిపై బానిసత్వపు చట్టం అమలు కాక పోయినా, ఆచరలో అమలు కాకతప్పలేదు. ఆచట్టనిబంధనలు అంతకఠినంగా వుండటమే అందుకు కారణం బానిసత్వపు మచ్చబానిసల సంతానానికి సైతం అంటకుండా ఎలా పుంటుంది? యీ విధంగా అక్కడికి వెళ్లే భారతీయ కార్మికులు అయిదు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకొని నేటాలు వెళ్లేవారు అయిదు సంవత్సరాలు గడిచాక వారు స్వతంత్రులే అప్పుడు వారు స్వతంత్రంగా బ్రతకవచ్చు. వ్యాపారం గాని, వృత్తిగాని చేసుకోవచ్చు. అక్కడ వుండాలని ఆనుకుంటే వుండవచ్చు. కొందరు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడవుండి పోయారు. కొందరు భారతావనికి తిరిగి వచ్చివేశారు. ఆ విధంగా నేటాల్లో వుండిపోయిన భారతీయుల్ని ఫ్రీ ఇండియన్స్ అని అనేవారు. నేను వారిని గిర్‌మిట్ ముక్తులు లేకముక్తి పొందిన భారతీయులు అని అంటాను యీ బేధాన్ని తెలుసుకోవడం చాలా అవసరం యిక్కడే మెలికవున్నది పూర్తి స్వతంత్రులైన భారతీయులకు గల అధికారాలకు, గిర్‌మిట్ ప్రధ నుంచి ముక్తులైన భారతీయులకు లేవు ఉదాహరణకు యిట్టివారు. ఒక చోటు నుంచి మరో చోటుకి నివాసం మార్చదలుచుకుంటే అందుకు ఆర్డరు తీసుకోవాలి యిదీ నియమం వాళ్లు వివాహం చేసుకోవచ్చు. అయితే చట్టరీత్యా వివాహం చెల్లుతుందని ధృవీకరింపచేసుకోవడానికి, వారు గిర్‌మిటియాల రక్షణ కోసం నియమింపబడిన అధికారి కార్యాలయానికి వెళ్ళి సమోదు చేయించుకోవాలి యిదే కాక యిటు వంటి కఠోరమైన అంకుశాలు వాళ్ల మీద చాలా వుండేవి

1980-1990లో ట్రాన్సవాల్ మరియు ఫ్రీస్టేటు నందు బోయర్ల ప్రజాతంత్ర రాజ్యాలు వున్నాయి. ప్రజాతంత్ర రాజ్యమంటే ఏమిటో యిక్కడ చెప్పడం అవసరం యిక్కడ ప్రజాతంత్ర రాజ్యం అంటే తెల్ల ప్రజాతంత్రాధిక్యత కలిగిన రాజ్యం అని అర్ధం హబ్షీ వాళ్లకు దానితో సంబంధమేమీ లేదు

భారతీయ వ్యాపారులు తాము కేవలం గిర్‌మిట్ భారతీయులతోనేగాక హబ్షీలతో కూడా వ్యాపారాలు చేయవచ్చునని గ్రహించారు. భారతీయ వ్యాపారులు హబ్షీలకు బాగా అందుబాటులో వుండేవారు. ఇంగ్లీషు వ్యాపారులంటే హబ్షీలు భయపడుతూ వుండేవారు. ఇంగ్లీషు వ్యాపారులు హబ్షీలతో వ్యాపారు సాగించాలని భావించేవారే, కాని హబ్షీలతో మంచిగా మాట్లాడటం వారికి సాధ్యపడలేదు. హబ్షీలు వెళ్లి ఆంగ్లవ్యాపారులకు సొమ్ము చెల్లించి అందుకు రావలసిన వస్తువులు పూర్తిగా పొందలేక పాయేవారు. అలాలభిస్తే గొప్ప అదృష్టంగా భావించేవారు. ఉదాహరణకు ఒక హబ్షీ గ్రాహకుడు నాలుగు షిల్లింగుల ధరలుగల వస్తువుకోసం ఒక్కపౌండు యిస్తే మిగతా పదహారు షిల్లింగులు తిరిగి యివ్యకుండా తెల్లవ్యాపారి నాలుగు పిల్లింగులే యిస్తాడు. ఒక్కొక్కప్పుడు అవికూడా యివ్వడు. మిగిలిన డబ్బులు యిమ్మని అడిగితే తిట్లు వినపలసి వచ్చేది అప్పుడప్పుడు తన్నులు తినవలసివచ్చేది. తెల్లవ్యాపారులంతా హబ్షీలతో యిలా వ్యవహరించేవారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు కాని యిలాంటి ఉదాహరణలు విపరీతంగా వుండేవి భారతీయ వ్యాపారితియ్యగా మాట్లాడటమె కాక, హబ్షీలతో సర్దాగా కూడా మాట్లాడుతూ వుండేవాడు. హబ్షీలు అమాయకులు దుకాణానికి వచ్చి వస్తువుల్ని చేతితో తాకి చూస్తూవుండేవారు. భారతీయ వ్యాపారి యిదంతా సహించేవాడు. అతడు పారమార్ధిక భావంతోకాక, స్వార్ధంతోనే అలా చేసేవాడు. అవకాశం చిక్కితే భారతీయ వ్యాపారి హబ్షీవాళ్లను మోసం చేయడానికి వెనుకాడేవాడు కాడు. అయినా హబ్షీవాళ్లు భారతీయ వ్యాపారులదగ్గరకు వాళ్లమాటల యందలి తీయదనంవల్ల ఆకర్షితులై వెళ్లుతూవుండేవారు. అంతేగాక హబ్షీలు భారతీయులంటే భయపడేవారుకాదు అప్పుడప్పుడు భారతీయ వ్యాపారులు తమను మోసగించారని తెలిస్తే హబ్షీవాళ్లు తిన్నగా వచ్చి తమను మోసం చేసినవాళ్లను తన్నేవారు వాళ్ల చేత తిట్లు కూడా భారతీయ వ్యాపారులు తినేవాళ్లు యీ విధంగా హబ్షీలంటే భారతీయులే భయపడుతూవుండేవారు. దానితో హబ్షీలవల్ల భారతీయుల వ్యాపారం బాగా పెరిగిపోయింది. హబ్షీలు దక్షిణాఫ్రికా యందంతట వ్యాప్తమై యుండటం అక్కడి విశేషం

ట్రాన్స్‌వాల్ మరియు ఫ్రీస్టేట్‌లో బోయర్లతో కూడా వ్యాపారం చేయవచ్చని భారతీయలు గ్రహించారు. బోయర్లు అమాయకులు, మంచి వాళ్లు భారతీయవ్యాపారులతో వ్యాపారం సాగించుటకు వారికి యిబ్బంది ఏమీ లేదని భారతీయులు తెలుసుకున్నారు. దానితోకొంత మంది భారతీయవ్యాయపారులు ట్రాన్స్‌వాల్, ఫ్రీస్టేట్‌లకు ప్రాకారు అక్కడ దుకాణాలు తెరిచారు. అప్పుడు అక్కడ రైలు ప్రయాణసౌకర్యం లేదు. అందువల్ల వ్యాపారంలో లాభాలు బాగా గడించవచ్చన్న భారతీయుల ఆలోచనలు సత్యమని తేలాయి బోయర్లు, హబ్షీలు వారి దగ్గర వస్తువులు విపరీతంగా కొనడం ప్రారంభించారు. యిక మిగిలింది ఒక్క కేప్‌కాలనీ మాత్రమే అక్కడికి కూడా కొందరు భారతీయ వ్యాపారులు చేరారు. సంపాదన బాగా రాసాగింది యీ విధంగా కొద్ది సంఖ్యలోనైనా సరే భారతీయులు దక్షిణాఫ్రికా యొక్క నాలుగు రాజ్యాలలో ప్రవేశించారు

అప్పుడు పూర్ణ స్వతంత్రులైన భారతీయుల సంఖ్య 40 మరియు 50వేల మధ్య, గిర్‌మిట్ ముక్త భారతీయుల సంఖ్య, వాళ్ల సంతతితో కలుపుకొని ఒక లక్ష వరకు ఉన్నది




4

కష్టాల సింహావలోకనం -1

నేటాలు

నేటాలునందలి తెల్లదొరలకు బానిసలు అవసరమైనారు. గిర్‌మిట్ గడువుపూర్తికాగానే స్వతంత్రులయ్యేవాళ్లు, ఏ విధంగానైనా తమతో సమంగా వుండగలిగినవాళ్లు తెల్లవారికి అక్కరలేదు. భారతదేశంలో వ్యవసాయం సరిగ్గాసాగక, రాబడి బాలక చాలామంది భారతీయులు గిర్‌మిట్లుగా నేటాల్ వెళ్లారు. అయితే వాళ్లకు వ్యవసాయం అంటే ఏమిటో, పొలం అంటే ఏమిటో బాగా తెలుసు నేటాలువచ్చి అక్కడిభూములు చూచిన తరువాత కాయకూరలు పండించుకొని ఎంతో ధనం సంపాదించుకోవచ్చునని వాళ్లు గ్రహించారు. ఏ కొంచెం పొలం సంపాదించుకున్నా బాగా పంటలు పండించుకోవచ్చని తెలుసుకున్నారు. అందువల్ల చాలామంది గిర్‌మిటియాలు గడువు తీరిపోగానే