Jump to content

ఢిల్లీ దర్బారు/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఢిల్లీ ద ర్బారు.

3. హైదరాబాదు సంస్థానము.

.

నాలుగవ ప్రకరణము

.

హైదరాబాదు సంస్థానము

నై స ర్గిక స్వరూపము.

భరతవర్ష మున నాంగ్లేయ ప్రభుత్వమునకుఁ లోఁబడి యుండు సామంత సంస్థానములలో నైజాముగారి హైదరాబాదు సంస్థానము విస్తీర్ణమున నేమి, జనసంఖ్యయం డేమి, ఆదాయంబు న నేమి, చారిత్రిక ప్రాముఖ్యమున నేమి మొదటిదిగ గణింపఁ బడు చున్నది. దర్బారు లన్నిటియందును భారతీయ సామంతులలో మొదటి స్థానము నైజాముగారిదిగ నే యంగీకరింపఁ బడుచున్నది. కావున నీసంస్థానచరిత్రమును మునున్న లిఖంపఁ గడఁగితిమి. దక్క ఉచ్చ భూప్రదేశమున నెక్కుడుభాగ ఈ హైదరా బాదు సంస్థానము. దీని కుత్తరమున విహారము, మధ్యపరగణా లును, వాయవ్యమున బొంబాయి రాజధానిలోని ఖాండేష్ జిల్లాయును, దక్షిణమున కృష్ణా తుంగభద్రా నదులును, పశ్చి మమున బొంబాయి రాజధానిలోని అహమదునగరము పోలా

పురము, బీజపురము, ధార్వారు, జిల్లాలును తూర్పున కృష్ణా జిల్లా యును, వరదా గోదావరీ నదులును ఎల్లలు. దీని వై శాల్య ము 82, 698 చదరపు మైళ్లు. ఈ సంస్థానమును భూసారమున నేమి జన విశేషమున నేమి రెండు సమభాగములుగ భాగింప వచ్చును. " గోదావరీ, మంజీరా నదు లీ రెండు భాగములకును సరిహద్దులు. ఈ సరిహద్దుల కుత్తర భాగము నల్ల రేగడి భూమి' గోధుమలును ప్రత్తియు నట పండును. మహారాష్ట్రము కన్న డము భాషలు. ఈసరిహద్దులకు దక్షిణ భాగము తెలుఁగు దేశము. భూమి గులుక రాతితో మిశ్రమము. నేలలో నీళ్లు ఇంకుటకు వీలు లేదు. కావున నే యీ భాగమున చెరువులు మున్నగు జలాశయములు మెండు. వరిపంట సామాన్యము. బాలఘాటు కొండలు, సహ్యాద్రులు, జాల్నా గుట్టలు ఈ సంస్థానమున ముఖ్య పర్వత పంక్తులు.గోదావరి కృష్ణ, తుంగభద్ర, పూర్ణ, మంజీర, భీమ, వైన గంగ, మానేరు ముఖ్య నదులు. మూసి, వింది, ము నేరు మొదలగు కొన్ని ఉపనదులును గలవు. ఈసం స్థాన భూగర్భమున వజ్రములు, బంగారు, రాక్షసబొగ్గు బయలు వెడలి నవి. మించి ఇనుముకూడఁ గాన్పించు చున్నది. ఈసీమలో దట్ట మగు నడవులును న నేకములు గలవు. పులులు ఏనుఁగులు ము న్నగు మృగములును చిత్రవిచిత్ర వర్ణములతో మెప్పు పశు లును లెక్కకు మీరి యీయడవుల నల కరించు చుండును.

ఈరీతి నీ సంస్థానమున నుత్తమ సంపదకు వలయు విష యము లెల్ల యు గలవు. కావున నె నీసంస్థానముచే నాక్రమింపఁ బడియుండు - భూభాగము బహుకాలముగఁ జరిత్ర యందు ప్రఖ్యాతి గాంచుచు వచ్చుచున్నది. దీని తూర్పుదక్షిణ భాగ ములు నిశ్చయమగు చరిత్ర ప్రారంభ మగుటకు మున్ను ద్రావిడజాతులవారి స్వాధీనమున నుండెను. - ద్రావిడ భాషలు మాటలాడు జాతులలో నాంధ్రజాతి యిప్పటికిని తక్కినజాతుల కంటే నెక్కుడు జనసంఖ్య గలదయి యున్నది. ఈ సంస్థానము నందు మధ్య భాగమగు దక్షణా పథమును (దక్కను) రామాయణ మహాభారత కర్తలు పేర్కొని యున్నారు.. శ్రీరాముని కిష్కిం ధానగరము ఆనెగొంది. విజయనగరము లనుట ఇప్పుడందఱ కును దెలిసిన సంగతి యేగదా! ఆర్యులు దక్షిణాపథము నెప్పుడు లోఁ బఱచుకొని నదియు నిష్కర్షగఁ జెప్పుటకు వీలు లేదు గాని, క్రీ. పూ. 272_281 వఱకును నేలిన యశోకుని కాలమున నా తని రాజ్యము మాత్రము విహారమును, ఈ సంస్థానములోని పూర్వోత్తర భాగములను గూడ నావరించి యుండెను. ఔరంగా బాదు జిల్లాలో గోదావరీ తీరముననుండు పైఠణు సీమయందలి పి టెనికులు అశోకుని చే జయింపఁబడిన జాతులలో 'నెక్కరని యాతని శాసనముల వలనఁ గానవచ్చుచున్నది. [1]బౌద్ధరాజులకు దరువాత నీసంస్థాన భూభాగము పై నధికారము వహించిన వా

....................................................................................

1.

గను రాంధ్రులు. అశోకుని శాసనములలో వీరి పేరు గానవచ్చు చున్నధి.1[2] గాని వీరుబలవంతులయినది క్రీII పూ!! 220 వ సంవ త్సర ప్రాంతములనె. కృష్ణా డెల్టాలో నుండి తమ యధికారము ను క్రమక్రమముగ వర్తింపఁ జేయుచు వీరుదమసామ్రాజ్యమును నాసికము వఱకును వ్యాపింపఁ జేసిరి. క్రీస్తుశకము మొదటి శతాబ్దమునకు వీరు శాక్యులకును, పల్లవులకును,మాళవఘూర్జర ములలో నివసించుచుండిన యవనులకును, బ్రతిస్పర్థులుగను పించుచున్నారు. క్రీ! శ॥ 188 లో రెండవ పులమాయి రాజ్య మునకు వచ్చెను. అతఁడు పశ్చిమ క్షేత్రపుఁడగు రుద్రదమనుని బిడ్డను పెండ్లాడెను. మామగారితో పోరుటలో రెండవపులు మాయి తన రాజ్యములోఁ బశ్చిమభాగమును 'గోలుపోయెను. మఱియొక శతాబ్దములోపల నాంధ్రసంతతియే యంతరించెను. అందులకుఁ గారణము బహుశః పల్లవరాజుల ప్రవృద్ధియే యై యుండును. వీరు మొదట కృష్ణా నదికి దక్షిణ భాగమున రాజ్య మేలుచుండి, మెల్లమెల్లగ హైదరాబాదు ప్రాంతముల వఱకును వ్యాపించిరి. ఆంధ్రులకు తరువాత హైదరాబాదు సంస్థాన ముండు భూప్రదేశము నేలిననారిలో సుప్రసిద్ధులు చాళుక్యులు. వీరు క్రీ. శ. 550 ప్రాంతమున విజాపురము జిల్లాలోఁ గాను పించి, పూర్వ పశ్చిమ దిగ్భాగములకుఁ దమ యధికారమును వ్యాపింప జేసి, కల్యాణి రాజధాని చేసికొని రాజ్యమును

......................................................................................

1.

స్థాపించిరి. క్రీ|| శ | 608 మొదలు 642 వఱకును రెండవ పులి కేశి యనువాడు ఇంచుమించుగ నర్మదానదికి దక్షిణమున నుండు ద్వీపకల్పమునంతయు 'నేలెను. ఈపగిది మహాబలవంతు- లయి చాళుక్యులు రాజ్య మేలి నంతకాలమును వారికిని పల్లవు లకును, నిడువరాని యుద్ధము జరుగుచు నేయుండెను. కావున చాళుక్యులు దక్షిణహిందూస్థానములో విశేషభాగ మేలు చుండినను వారి రాజ్య పరిమితి మాత్రము క్షణకుణమును మారుచుండెను. చాళుక్యులను గొంతకాలమునకుఁ దరువాత రాష్ట్రకూటులు లోబఱు చుకొనిరి గాని, మఱల చాళుక్యులు క్రీ! శ|| 978 లో నధికారమునకు వచ్చి రెండు శతాబ్దములు చోళ రాజులతోడను, ద్వార సముద్ర రాజులతోడను హో రా హెరిగఁ బోరుచుఁ దమపదవిని నిలుపుకొనిరి. 1189 వ సంన త్సరప్రాంతమున చాళుక్య బల మస్తమించెను. యాదవులును హెూయిసలలును బ్రభుత్వమున కెక్కి డి.యాదవుల రాజధాని దేవగిరి యయ్యెను. దక్కనున నధికారము వహించిన హిందూ వంశములలో యాదవవంశము కడపటిది. విజయనగర సామ్రా జ్యము దరువాత ప్రతి స్థాపింపఁ బడెనుగాని దాని యధికార మంతయు కృష్ణకు దక్షిణ భాగమున నె వ్యాపించి యుండుటం బట్టి దక్కనున గడపటి హిందూ సంతతి రాజులు యాదవు లే

యనుటలో నేమియు దప్పుండదు.
దే వ గి రి దుర్గము.



"దక్షిణాపథము మీదికి దృష్టి సారించిన మహమ్మదీయ ప్రభువులలో మొదటివాఁడు అల్లాయుద్దీను. అతఁడు 1295 వ సంవత్సరమున, ఫెరిస్తావ్రాతల ననుసరించి, యాప్రదేశమున కంతయు. రాజయి పరిపాలించుచుండిన యాదవవంశజుఁడగు రామ దేవుని పైకి దాడి వెడలెను.ఇతని రాజధాని దేవగిరి. అల్లా యుద్దీను దేవగిరినిగొల్లకొట్టెను. ఇట్లు ప్రారంభమయిన మహమ్మదీయ దిగ్విజయము దేవగిరిలో నిలువ లేదు. క్రమక్రమముగ దక్షిణాత్య రాజు లెల్రును మహమ్మదీయులకు లోఁబడవలసిన వా రైరి 1325 లో మహమదు తుగ్లకు నధి కారము క్రిందికి దక్ష్ ణాపధమంతయు వచ్చి చేరి యుండెను. కాని యతని క్రౌర్యము వలన యాతని సామ్రాజ్యమునకు ముప్పువాటిల్లెను. అతఁడు . .

ఘూర్జరమును (Gujerat.)జయించి లోబఱచు కొనఁగా నప్పు డచ్చటి ప్రజల నేకులు దక్షిణాపధమునకు వచ్చి నిలచి యుండిన మొగలాయీల యండఁ జేరి. అది చూచి యోర్వలేక తుగ్లకు, శరణనిన వారికి శరణమిచ్చిన తన సామంతులనే చెజ వెట్టెను. ఇంతియేకాక, ఢిల్లీ నుండి తన రాజధానిని తాను దౌల తాబాదని . పేరిడిన " దేవగిరికి మా ర్చెను. జనులందఱును మొఱ పెట్ట సాగిరి. అప్పుడితఁడు మిక్కిలి క్రూర కార్యములకుఁ గడం గెను. ఒక పర్యాయము రాజధాని మార్చుటతోఁ దృప్తినొం దక' పౌరు లెల్ల యు దేవగిరి చేరిన తరువాత మరల' వారిని ఢిల్లీకి నడువుఁడనియెను. ఈ కారణములఁబట్టి తిరుగు బాటులు పుట్టెను. చక్రవర్తి సేనలొక రిద్దఱి నాపఁ గల్లెను గాని యల్లరు లెక్కు డయి హునేను భానుఁడను ప్రబలవిరోధి యెదుర్కొ-ను నప్పటి కివి విరిసిపోయెను. సై న్యాధిపతి యోడిపోయి నిహతుఁడ య్యెను. అంత హుసేనుఖాను “సుల్తాన్ అల్లాఉద్దీన్ హ నేనుఖాన్ గంగోబహమని” యను బిరుదులతో బహమనీ రాజ్య మును 1347 లో స్థాపించెను

బహమనీ రాజ్యములు.

గుల్బర్గ మీ రాజ్యమునకు మొదట రాజధాని. 1434 లో అహమదా బాదు రాజధానియాయెను. రానురాను బహమనీ రాజసంతతి వారు బలహీనులుగాఁ జొచ్చిరి. వారి పటుత్వము తప్పినందున వారికి లోఁబడి ప్రవర్తించి శక్తిగాంచిన బలవంతు .

లగు ప్రభువు లచ్చటచ్చట స్వాతంత్ర్యము ప్రకటించిరి. అట్ల గుట 1512 వ సంవత్సరము లోపల నైదుస్వతంత్ర సంస్థానము లేర్పడెను. అందు గోలకొండ కడపటిది.

దీనికి మొదటి రాజు కుతుబ్ షాహ. ఇతని సంతతి వారిలో మెక్కఁడగు మహమ్మదుకులి గోలకొండయందు నీటివసతి లేక పోవుటచే హైదరాబాదు గట్టించెను. దీనికి మొదటఁ దనప్రియు రాలి పేరు పెట్టఁదలఁచి భాగ్యనగరమని నామకరణము చేసెను. ఆమె మరణానంతరము దన కుమారుని పేరు సనుకరించి హైదరా బాదని మార్చెను. ఈ సంస్థానముతో సమానముగఁ దులఁదూ గినవి విజాపురము, అహమ్మదు నగరము. కావున నీమూఁడు సం స్థానములకును నంతఃకలహములు విడువక నడచుచుండెడివి. ఈ యంతఃకలహము లే వీరి నాశనమునకుఁ గడపటఁ గారణమయ్యె ను. మహారాష్ట్రుల విజృంభణంబునకును నిదియే హేతువు. 1586 లో అక్బరు, తరువాత షాజహాను, పిమ్మట నౌరంగ జేబు ఈ సంస్థానములను లోఁబజచుకొనిరి. అహమ్మదు నగరమునను విజాపురమునను మహారాష్ట్రులు ప్రవృద్ధిగాంచిరి. గోలకొండ యం దక్కన్న మాదన్నలను ఆంధ్రులు సచివత్వమున ప్రసిద్ధి గాంచిరి. శ్రీశివాజి శక్తియుక్తులవలన మహారాష్ట్రులు మొగ లాయి చక్రవర్తులింకను బలవంతులయి యుండఁగ నే సామ్రా జ్యము సంపాదింపఁ గలిగిరి. అక్కన్న మాదన్నల యన్నత్య మును సహింపలేని యొక తురుష్క నాయకుని విశ్వాసఘాతు

కము వలనను, స్వామిద్రోహమువలనను, వీరు "మొగలాయీల చేతులలోఁ జిక్కి మరణమందిరి.

ఇవ్విధమున చెదరిపోయిన బహమనీ రాజ్య ముండిన యెడములో మహారాష్ట్ర సామ్రూజ్యమును మొగలాయీల రాజ్య ఖండమును నుండుట దటస్థించెను. 1683 వ సంవత్సర మున నౌరంగజేబు రెండవమారు దక్షిణాపథము పై దండయాత్ర వెడలునప్పటికి, శిజాజి పరలోకమున కేగి యుండెను. అతని కుమారుఁడు సాంబాజీ దైర్యము దప్ప దక్కిన తండ్రి సుగుణము లెవ్వియును గలవాఁడు గాఁడు. మహారాష్ట్ర సైన్యము గూడ జిందర వందరు యుండెను. కావున వీరు విజాపురమును గోలకొండయును మొగలాయీలనుండి కాపాడలేక పోయిరి. సాంబాజి పట్టువడి ఖయిదీయయి చంపఁబడియెను. " కాని దీని వలన మహారాష్ట్రులు పోరాటమును విడువ రైరి. వారి పితూ రీలకు నిలువ లేక ఔరంగ జేబు 1706 వ సంవత్సరమున అహమదు నగరమునకుఁ బారిపోవలసి వచ్చెను. అతఁడు శత్రు వులచేఁ జిక్కి చచ్చునంతటి తరుణ మొక్కటి గూడ తటస్థిం చెను. గాని యాతని యదృష్టవశమునఁ దప్పించుకొనెను. మరుసటి సంవత్సరముననే యితఁడు 89 ఏండ్ల ప్రాయమున మృతి మొందెను. ఇతని మరణానంతర మీతని పుత్రులు సింహా ససమునకయి పెనఁగులాడఁ జొచ్చిరి. ఇతని కాలమున నీతని కాపవర్గములో నొక్కఁడనఁదగు గాజరుద్దీనను సుబేదారు.


అతఁడు" బీరారు "ఎలిచ్ పురముల కధిపతి. తన యజమాని కుమారులు గద్దెకయి పడు వివాదములలో నితఁడే పక్షమును' నవలంబింపఁ డయ్యెను. ఇతని కుమారుఁడు చిన్ కిలీచ్ ఖాన్ మాత్రము అజీమునకు సాయపడనియ్యకొని, యాతనితో, గొంత కాలము గడ పెను. 'కాని యతని నడ వడి సరిపడనందున ననేకులగు నితర నాయకులతోఁ గూడ చిన్ కిలీచ్ ఖాన్ . అతనిని వదలి సంగతుల గమనించుచు మిన్న కుండెను. ఔరంగ జేబు పెద్ద కొమారుఁడగు బహదూరుషా తన తమ్ము డగు అజీము నోడించి గద్దియ నెక్కెను. అప్పుడతఁడు చిన్ కిలీచ్ ఖానుని అయోధ్యకు సు బేదారుగను, లక్నోకు ఫోజు దారుగను, నియమించెను. ఆపదమందును నితఁడు బహుకాల ముండఁడయ్యెను. బహదూరుషాహ .వృధాడంబరుఁడును నసమర్థుఁడును నగుట యతని చుట్టుంగలవారు పోరాని పోక లఁ బోవుటయుఁ జూచి సహింపక యితఁడు దనయుద్యోగములను మానుకొని జరుగనున్న కార్యములను జాగరూకుఁడయి కని పట్టి యుండెను. 1712 వ సంవత్సరమున బహదూరుపాహ మృతినొందెను. 'సింహాసనమున కయి మరల పోట్లాటలు ప్రా రంభమాయెను. 'బహదూరుషాహకు జహందరుషా అనువాఁ డును, అజీముషాహకు ఫరూకుసయ్యరు అనువాఁడును, కొడుకులు.జహందరుషాహ, తండ్రి పరలోకమున కేగిన తోడ నే, వీఠమునాక్రమించుకొని రాజసంతతి వారి నంతయుఁ జంపిం


చెను. కాని ఫరూకుసయ్యరు బంగాళమున నుండుటచే నతఁ డీతనికి దొరక లేదు. కావున వీరిరువురకును యుద్ధము దప్పినది గాదు. "జహందరుపాహ యుద్ధమున నిహతుఁడయ్యెను. . అతని మిత్రుఁడును, బహదూరుషాహ కాలమున హైదరాబాదునందు రాజప్రతినిధిగ రాజ్య మేలినవాఁడును నైస జుల్ ఫికర్ ఖానుఁడు- గూడ మడ సెను. ఫరూకుసయ్యరు సింహాసనము నధిష్ఠించుట తోడనే సమయము వేచియుండి విజయమునందిన పక్షమును చేరిన వాఁడగుటచే చిన్ కిలీచ్ ఖానుఁడు ఆసఫ్జా నై జూము-అల్- ముల్క్ అనుబిరుదుతో దక్షిణాపథమునకు "" రాజప్రతినిధి యయ్యెను.

నైజాముఅల్ ముల్క్.

ఇతఁడే ప్రస్తుతపు హైదరాబాదు సంస్థానమునకు "స్తాపకుఁడు. ఇతఁ డెట్లు స్వతంత్రుఁడయినదియు మనము దెలిసి కొన వలసియున్నది. ఫరూకు సయ్యరు వలనఁ బ్రతినిధిగ నేమిం పఁబడి యితఁడు హైదరాబాదుకు వచ్చి చేరెను. . అచ్చట యితఁడు గాంచిన రాజ్యవ్యవస్థ యెట్టిది? బహదూరుషాహ కాలమున దక్షిణాపథమునఁ బ్రతినిధిగ నుండిన దావూదుఖా నుఁడు సాంభాజికుమారుఁ డయిన సాహూతో సంథి చేసి, కొని మహారాష్ట్రుల పోరునుండి 'మహమ్మదీయ రాజ్యమును దప్పించి యుండెను. కాని దావూదుఖాను ప్రతినిధి పదము నుండి వదలిపోయిన తరువాత ' నాప్రదేశమంతయు " నరాజక:

మయి యుండెను. మహారాష్ట్రులు మరల మొగలాయీల రాష్ట్రమును గొల్ల గొట్టుచుండిరి. ఆసఫ్ జాకు వారి నణ చుటకు శ క్తిచాలకపోయినను ఎక్కుడు బుద్ధి కౌశల్యము గల వాఁడు గావున మహా రాష్ట్రులలో నంతఃకలహములు పుట్టించి గొందఱను ఢిల్లీ పాదుషాహ పక్షము .పూనునట్లొన ర్చెను. ఈపగిది భేదోపాయముచే నొక్క సంనత్సరములోపలఁ దన రాజ్యమును మహారాష్ట్రుల బారినుండి తప్పించినదే గాక యితఁడు కర్నాటకము పై దండెత్తుటకుఁ గూడ సన్నద్ధుఁ డయ్యెను. కాని యీలోపల నితనిని బాదుషాహగారు ఢిల్లీకి రానలసినదని యాజ్ఞాపించిరి. కారణము ఢిల్లీలో ముఖ్యమంత్రిగ నుండిన హుసేనాలీ ఖానునకును బాదుషాహ కును సరిపడక పోయినందున హుసేనాలీని దక్షిణాపథమునకుఁ బంపి వేయవలయునను తలఁపు బాదుషాహకు బుట్టుటయె. సాహూ దెబ్బకుఁ దాళ లేక యతనితో మైత్రిచేసుకొని హుసే నాలి 1718 వ సంవత్సరమునఁ దన యజమాని మీఁదికి దండె త్తి వెడలి ఢిల్లీ చేరెను. అచ్చట జరిగిన ఘోరయుద్ధమున ఫరూకుసయ్యరుని చంపి మహమదుషాహను సింహాసన మె క్కించిరి. ఆసఫ్ జాకు దక్షిణాపథ రాజప్రతినిధిత్వము మరల దొరకుట కష్టమయ్యెను. 1720 లో నితఁడు దగిన ఏర్పాటు లెల్ల యు ముందే చేసి యుంచుకొని ఢిల్లీ వదలి హైదరాబాదు పోయి చేరెను. స్వాతంత్ర్యము ప్రకటించుటకు ఆసఫ్ జా


యంతకంటె విశేష మేమియుఁ జేయవలసిన పని లేదు గదా.! హు సేనాలితోఁ గూడ చేరుకొని మహమ్మదు బాదుషాహ స్వయముగ దక్షిణమునకు దండు వెడలి వచ్చెను. మార్గమున శత్రువుల వ లన హుసేనాలి చంపఁబడుటయు, ఢిల్లీ నగరమున వైరులు మఱియొక చక్రవర్తిని నేమించుకొనుటయు సంభవించుట చే మహమదుషాహ వచ్చినం దారిఁ బట్టి తిరిగి ఢిల్లీ - జేరవలసిన వాఁడాయెను. గద్దెను శత్రుబలములనుండి దక్కిం చుకొనుటలో నితఁడు జయమం దెను. అప్పుడు మరల నాసఫ్. జాను ముఖ్యమంత్రి పదమున కితఁడు నియమించెను.కాని ఆసఫ్జా మాత్రము హైదరాబాదునందుఁ దనశక్తి స్థిరముగ నుండుటకు వలయు నుపాయము . లన్నిటిని వెదకి పన్ని ఢిల్లీకి - బయలు దేరి పోయెను. అచ్చట రాజ్యభారము నిర్వహించు టకు ఆసఫ్ జాకు సమ్మతము కాలేదు. సారము చెడి బెండువడి కుచ్చి తాత్ముల కాక రమయి యవగుణండగు మహమ్మదుషాహ చే సదష్టింపఁబడిన కొలువుకూట మెక్కడ? కార్యదక్షతకుఁ "బేరు గాంచిన యూరంగ జేబు కాలమునఁ బరిశ్రమచేసి బుద్ధి బలముల గడించిన ఆసఫ్ జా యెక్కడ ? కావున నె యీతఁడు గొంత కాల, ము ఢిల్లీలోనుండి యచట వర్ణింపనలవి కాని పెక్కు పాట్లు పడి కట్టకడపట 1724 వ సంవత్సరమున మరల హైదరాబాదు నకుఁ బయనమై పోయెను. అప్పుడు బాదుపాహ ఇతని కెదురుపడి కీడు చేయ మససురాక ఇతనిని జంపి వేయవలసినదని స్థానిక పరిపాలకున కుత్తరువిచ్చెను. వాడును నట్లే చేయఁ బ్రయ త్నించియు ఆసఫ్ జా చేతిలోఁ జిక్కీ- మృతుఁడయ్యెను. ఆసఫ్ జా బాదుషాహగారి కీవిషయ మేమియుఁ దెలియదని నమ్మినట్లే నటిం చుచు నాపరిపాలకుని శిరస్సును వారికిఁ బంపి బాదుషాహగారి పై తిరుగుబాటు చేయ నెంచిన ద్రోహిని తాను దునుమాడిన టులఁ దెలియ చేసెను. ఇప్పగిది నామమాత్రమునకుఁ దాను 'బా దుషాహగారి ప్రతినిధియనియే యొప్పుకొనుచు నిజమునకు ఆస ఫ్ జా సర్వస్వాతంత్ర్యములును గలవాఁడయి నైజాము సంస్థాన మును స్థాపించెను..[3]

సింహాసనమున కై కలహములు.

1784 వ సంవత్సరమున ఆసఫ్ జా గతించి పోయెను. అప్పటికి హైదరాబాదు సంస్థానము నేఁడెంతగలదో యంతకంటే 'నెక్కు డుం డెనని చెప్పవచ్చును. నైజముల్ -ముల్ కు-ఆసఫ్ జూ చచ్చినతోడనె యధికారమునకై యతనికుమారులలో సంతః కలహములు పుట్టెను. మొదటికుమారుఁడు ఢిల్లీ నగరమున నుండి పోయెను. హైదరాబాదులోఁ దుడ్రి మరణకాలమున సిద్ధముగ నుండిన నాజర్ జంగ్ సైన్యముయొక్క- సాహాయ్యమువలన బొక్కసమును స్వాధీనపఱచుకొని రాజ్యమునకు వచ్చెను. ఆ సఫ్ జాకు మిక్కిలి ప్రియమైన కూతు రొక్కర్తె యుండెను. ..........................................................................................

1, -

ఆమె పుత్రుఁడు ముజఫర్ జంగు. ఇతఁడు దనతాత తనకు హైద రాబాదు సుబేదారీ నిచ్చిపోయెనని నుడివి తనహక్కు- స్థాపిం చుకొనఁ జూచెను. అప్పటికి దక్షిణ హిందూస్థానమున ఫ్రెంచి వారును నాంగ్లేయులును వ్యాపారవిషయములఁ బ్రతిస్పర్థులయి నెగడియుండిరి. ఇంతియెగాక' ఎవరికి వా రీదేశ మునఁ బలుకుబడి సంపాదించవలెననియు ప్రయత్నించు చుండిరి. కావున నాజర్ జంగు ముజఫర్ జంగులకు వరుసగ నా గ్లేయులును ఫ్రెంచి వారును దోడ్పడనియ్యకొనిరి. మొదట నాజరుజం గే విజయుఁ డయ్యెను గాని యతని ప్రజలే యతనిని జంపినందున ముజఫర్ జంగు 1750 లో సుబేదారుఁడయ్యెను. ఇతఁడును దమకు సరి " యయిన బహుమానము దొరక లేదని కోపము 'వహించిన పఠాను సైనికులచే నిహతుఁడయ్యెను (1751). ఇట్లు నాజర్ జంగు ముజఫన్ జంగు లిద్దఱును గతించిన తరువాత ప్రెంచివారు ఆసఫ్ జా మూఁడవపుత్రుఁడగు సలబత్ జంగును గద్దెపై నునిచిరి..

సలబత్ జంగు.

సలబత్ జంగు గద్దె నాక్రమించిన తరుణమున ఆసఫ్ జా మొదటి కుమారుఁడు గాజీ ఉద్దీన్ ఢిల్లీ నుండి వచ్చి తన హక్కును స్థాపించుకొనఁ జొచ్చెను.కానీ యద డక స్మాత్తుగ మృతి నందెను. సలబత్ జంగు' తల్లి విషము పెట్టి చంపి వేసెనని యొక చరిత్రకారుఁడు వ్రాయుచు న్నాఁడు. గాజి-ఉద్దీనుకు సాహాయ్యులుగ నే తెంచిన మహా

రాష్ట్రులకు . లంచమిచ్చి సలబత్ జంగు వారినుండి తప్పించు కొనెను. ఈరీతి నితఁడు దక్కుకొని ఫ్రెంచి వారి మాటే యధి కారముగఁ బరిపాలించు చుండెను.కాని ఫ్రెంచివారి కిని ఆంగ్లేయులకును దక్ష్మిణ హిందూస్థానములో జరిగిన పోరాటములో ఫ్రెంచివా రపజయమునందుచు వచ్చినం దున . వారు హైదరాబాదునుండి తమబలముల మరలించు కొను వారయిరి. సలబత్ జంగున కీసాయము పోవుటొక్కటి యెగాక - మఱియొక కష్టము చూపట్టెను. (ఫ్రెంచివారు వల దను చుండినను గూడ తాను రాజధానియందు లేనితటి తన తమ్ము డయిన నైజామలీకి సధికార మిచ్చుచుండెడు వాఁడు. దానివలన సతఁడు బలవంతుఁ డై తన్ను పదభ్రష్టుం జేయ సమ యము వేచియుండుట సలబత్ జంగుకు విశదమయ్యెను. కావున సతఁడు 1759వ సంవత్సరము మే నెలలో నాంగ్లేయులతో సంధి చేసికొనెను. దానినలన నైజాము చుట్టుంగల ఎనిమిది జిల్లా లతోఁగూడ మచిలీపట్టణ సీమయు, నిజాము పట్టణ సీమయు కొండవీడు వకలమన్నూరు జిల్లాలును, నాంగ్లేయవ ర్తక సంఘ మువారికి ఇనాముగా నిచ్చి వేసెను. ఫ్రెంచివారిని దన దేశము నుండి వెడలఁగొట్టెదనని వాగ్దానము చేయుటయే గాక ఆంగ్లే యుల శత్రువులకు శరణమిచ్చుటగాని 'సాయముచేయుటగాని లేదని యొప్పుకోనెను. ఆంగ్లేయవర్తక సంఘమువారును .

నైజాముగారి శత్రువులకు శరణమిచ్చుటగాని వారికి సాయ
పూర్వకాలపు మచిలీపట్టణము . )

. - 'మొనర్చుటగాని లేదని వాగ్దానము చేసిరి. ఇట్టి సంధి చేసికొని నను గూడ సలబత్ జంగునకు పదవి దక్కి నదిగాదు. 1761వ సంవత్సరమున నైజామలీ యితనిని రాజ్యభ్రష్టుని జేసి. సుబే దారీ నాక్రమించు కొనియెను.

నై జా మ లీ. (1761_1799.

హైదరాబాదు సుబేదారుకు లో బడి దక్షిణమున నిద్దఱు నవాబులుం డెడివారు. ఉత్తర సర్కారుల నవాబును, కర్నాటకపు నవాబును దమతమ మండలములలో దాము సర్వాధికారులే యైనను సామ్రాజ్య సమిష్టిలో మాత్రము హైదరాబాదు సుబాకు నుత్తరవాదులు. కాని యివి రాను రాను హైదరాబాదు నధికారము, నుండి తప్పించుకొన జూచెను. కావున నైజామలీ సుబేదారుఁడయిన తోడ

నే తనయన్నను జంపించి రాజధానియందుఁ దన యధి కార మును స్థిరపఱచుకొని కర్నాటకపు నవాబు దన్ను యజ మానిగ నొప్పుకోనునట్లు చేయును ద్దేశముతోఁ దీక్షణగతిఁ గర్ణాటకము పయికి దాడి వెడలెను. అయినఁ గర్నాటక మప్పుడు ఆంగ్లేయుల సంరక్షణ యందుండుట వలన వారితని నెదుర్ప సమ కట్టిరి. దాని నెఱింగి యితఁడు అప్పటికిఁ దనబలము చాలనం దున మరలి పోయి హైదరాబాదు చేరెను. రెండవమారు దండు వెడలుటకు నాఁటినుండి ఉపకరణములు సమకూర్ప మొదలిడెను. ఈసంగతివిని యాంగ్లేయు లప్పటికే యిక్కట్టు లో నుండిన వారుగాన బలవంతుఁడగు నైజాముతోఁ ద్వేషము గట్టుకో నొల్లక తమ ప్రతినిధి నొకని నైజామలీ వద్దకు సంధి చేసికొని రాఁ బనిచిరి.

1766 సంవత్సరపు సంధి.

1766 వ సంవత్సరము నవంబరు నెల 12 వ తేది నాఁడు స్నేహసంధి తీర్మానమాయెను. దీనివలన నాంగ్లేయ వర్తక సంఘమువారు వైజాము వద్దనుండి ఏలూరు, శ్రీకా కుళము, రాజమహేంద్రవరము, ముస్తఫానగరము, మూర్తి జూనగరము (గుంటూరు) అనుమండలములనుధృవ కౌ లుకుబుచ్చుకొని నై జూముకు వలయునప్పుడు దండును సిద్ధపఱచి యిచ్చుటకును అట్టి దండు అవసరముగాని సంవత్స రములలో గుత్త పైకముగ తొమ్మిదిలక్షల రూపాయీలు అత

నికి చెల్లించునట్లును ఏర్పఱచుకొనిరి. ఇందులో మూ ర్తిజూ నగ రము (గుంటూరు) మాత్రము నైజామువలన నతని తమ్ముడగు బజల తుజంగుకు జహగీరుగా నియ్యఁబడి యున్నందున నది యాతని జీవ మున్నంత కాలము ఆంగ్లేయ వర్తక సంఘము వారికిఁ జేరుట లేదనియు మూర్తిజూ నగరము కర్నాటకపు సరిహద్దు లలో నుండుటంబట్టియు, గర్నాటక మాంగ్లేయుల సంరక్షణ లో నుండుటంబట్టియు, బజలతుజంగుచే గర్నాటకములో నేమైన అల్లరులు జరుపఁ బడినచో మూర్తిజా నగరమును స్వాధీ నము చేసికొనుట కాంగ్లేయుల కధికార మున్నదనియుఁ దీర్మా నింపఁబడెను. వీరు గట్టదగిన తొమ్మిదిలక్షులకు లెక్క లెట్లు తేలవ లెనన్న వీరు నైజాముకొఱకా యత్తపఱచి పంపు దండు లకుగాను సెలవగు మొత్తము ఈ మొత్తమునకు లోఁబడినదైన చో మిగత బాకీ వీరు నైజాముగారి బొక్క సములోనికిఁ జెల్లించ వలసిన దే. తోమిదిలక్షలకు మిం చెనేని వీరే పెట్టుకొనవలెను. ఇదేసంధినిబట్టి కొండపల్లి దుర్గములో నాంగ్లేయుల సైన్యములు మాత్ర ముండవలసినదనియు నైజాముగారి పక్షమున వారి కిల్లా దారుఁడు (అనఁగా కోటకథిపతి) నేమింపఁ బడవలసినదనియు నొడంబడిక జరిగెను. ఆంగ్లేయులకు ధృవ కౌలున కీయఁబడిన మండలములోని వజ్రపు గనులును, ఆ గనులుగల గ్రామము

లును నైజూము గారికే చెందవలసినది. ఆంగ్లేయులును నైజా


ముగారును మెండొరుల మిత్రులను శత్రువులను దమమిత్రు లుగను శత్రువులుగను భావింప నియ్యకొనిరి.

హైదరాలీప్రత్యక్షము.

పై సంధి జరుగునప్పటికి నై జామునకుఁ క్రొత్తవైరి యొ కఁడు చూపట్ట మొదలిడెను. మైసూరునందు హైదరాలిక్రమ క్రమముగ బలవంతుఁ డగుచుండెను. అతని నెదుర్కొనుటకు నైజామునకు నాంగ్లేయుల సాయము కావలసి వచ్చెను. ఇంతియె గాక నైజాము పైఁ గర్నాటకమునందలి పాళేగారులు కొందఱు తిరుగఁబడిరి.. వారినణఁచుట యందును నతఁడాంగ్లేయుల నుప యోగించుకొన వలసినవాఁడె యాయెను. ఇట్లు వారిని దోడుఁ జేసికొని యతఁడు దనపాళేగారులను సాధించినదేగాక. హైదా రాలీకి లోబడిపోయి యుండిన బెంగుళూరు కోటను గూడ స్వాధీన పఱచుకొన గలిగెను. కాని యీలోపుగ హైదరు నైజా మల్లని దనవలలోఁ జిక్కించుకొని ఆతనిని ఆంగ్లేయులనుండి విడదీసి వారిని ఈ దేశమునుండి సంపూర్ణముగఁ బారదోలుటకుఁ బ్రయత్నములు సల్పెను. ఇప్పగిది "మొదటికే మోసము వచ్చి నందున నాంగ్లేయులు దమ యింటిని దాము కాచుకొన వలసి వచ్చెను. -హైదరు మహారాష్ట్రులతోడను నైజాముతోడను జేరి వీరిని సమయింపఁ జూచెను. హైదరు నైజాముల సైన్య ములు కర్నాటక ముపయి దండెత్తివచ్చి ఆంగ్లేయులు నై'జాము సాహాయ్యముగఁ బంపుచుండిన బలమును దాఁకెను. మొదట నాంగ్లేయులు వెనుదీయవలసిన వారైనను దరువాత వీరి యుద్ధ భటుల శక్తి ప్రదర్శనమువలనను వీరికి గవర్నరు జనరులుగ నుండిన హేస్టింగ్సు యొక్క చాతుర్యమువలనను, నైజా: పోరాటము తగదని తెలిసికొని మరల వీరిపక్షమును జేరెను.

ఆంగ్లేయులతో సంధి. (1768),

అప్పుడు 1768వ సంవత్సరమున నాంగ్లేయులకును నై జామలీకిని రెండవసంధి జరిగెను. దీనివలన నైజాము చే

హైదరున కియ్యఁబడిన సన్నదులన్నియు రద్దు చేయఁబడెను. అది వఱకు హైదరు చేతులలో దొరకియుండిన కర్నాటక భాగమంత యను నాంగ్లేయులకు స్వాధీనమాయెను. అచ్చట నైజూముగారి గౌరవమును నిలుపుటకై ఆ భాగమునకు గాను అతనికి నాంగే యులు ఏడులక్షల పన్నును గట్ట నొప్పుకొనిరి. కొండపల్లి దుర్గ మచ్చటి జహగీరుతోఁ గూడ సంపూర్ణముగ వీరిదే యయ్యెను. మొదటిసంధి వలన వీరికి ధృవ కౌలు కియ్యబడిన యైదుమం డలముల గుత్త కొంత కాలము మూఁడులక్షలును తరువాత నేడులక్షులును ఇచ్చులాగున నేర్పడెను. ఆంగ్లేయులు నైజాము హైదరుతోఁ జేరిన "కాలమున నాక్రమించిన కమ్మంమెట్టు వరం గల్' సీమ లతనికి మరల్చఁబడెను. మొదటి సంధిననుసరించి ఆంగ్లేయులు నైజామునకు వలసినప్పుడు దంకుడుల నాయ త్తపఱచి యియ్యవలసిన వారయి యుండిరి. కాని యీసంయం దది మారిపోయెను. వారు దమకు నైజాము నెడఁగల ప్రేమను జూపుట కై సిపాయీల పటాలములు రెంటిని ఆరుఫిరంగులను ఐరోపియనుల యధికారము క్రిందఁ గావలసి వచ్చినప్పుడు పంపనియ్యకొనిరి. కాని వానికగు వ్యయము నైజామే భరింప వలసెను. కర్నాటకపు నవాబు పై ఇతనికి నధికారము ఈసంధి వలనఁ దప్పిపోయెను. సమయాచిత్యము గణింపక హైదరాలీ తో జేరినందులకు నైజామిన్ని విధముల నాంగ్లేయ వర్తక సం ఘమువారి పయిఁ దన కదివఱకుండిన పట్టును బోఁగొట్టుకొనెను.

బజలు 1779వ సంవత్సరమున మరల నైజామలికొక చిక్కుతట. స్థించెను. ఉత్తర సర్కారులకుఁ జేరిన గుంటూరు అతని తమ్ము డగు బజలత్ జంగునకు జహగీరుగా నియ్యఁబడెననియు నది సం ధుల ప్రకారము కొన్ని షరత్తులతో అతని మరణానంతర మాం గేయులకుఁ జేరనలసినదిగా నుండెననియు మాచదువరు లిది వటికే యెఱింగియున్నారు. 1774 వ సంవత్సరమున బజలత్ జంగు కొందఱు 'ఫ్లెచి సైనికులను తనకొలువులోనికి తీసి, కొనెను. 'ఆతనికి యజమానిగ నుండిన నైజామలీ ఆంగ్లేయుల తోఁ జేసికొనిన యొడంబడికల ననుసరించి ఫ్రెంచివారిని దీసి వేయుమని తనతమ్మునకు వ్రాయవలసిన వాఁడయ్యెను. బజల త్ జంగీ యుత్తరువును లక్ష్యపెట్టిన వాఁడు గాఁడు. కాని యైదు సంవత్సరములకుఁ దరువాత ననఁగా 1779 వ సంవ త్సరమున హైదరాలీ దెబ్బకుఁ దాళజూలక బజలత్ జంగు ఫ్రెంచివారిని దన సేననుండి తొలఁగించి వైచి యాంగ్లే యులతో సంధి చేసికొని వీరి పటాలములను దనజహ గీరులో నుంచుకొనెను. ఇంతటితో నిలువక యతఁ డాంగ్లేయు లకు గుంటూరు జిల్లాను కౌలున కిచ్చుటఁగూడఁ దటస్థించెను. 1768 వ సంవత్సరపు సంధి ననుసరించి బజలత్ జంగు మరణా నంతరమో లేక నైజాముగారి యుత్తరవు మీఁదనో గుంటూ రాం గ్లేయులకుఁ జెందవలసి యుండ వారీరీతి నైజామునకుఁ

గొంచెమైనను దెలుపక యే జజలత్ జంగు యొద్దనుండి యా "జిల్లాను గైకొనుట నైజామునకు నాగ్రహము పుట్టించుటకు గారణమయ్యెను. ఇట్టి సందర్భముల నతని కోపముగూడ న్యాయమయినదే. అతని కప్పుడు జరిగినది గొప్ప యన్యాయమ నుట నాగ్లేయ ప్రభుత్వమువారే తరువాత సిద్ధాంతీకరించి యక్కాలమున మద్రాసు గవర్నరుగా నుండిన సర్ థామస్ రంబోల్టు అను నతనిని పదవినుండి తొలఁగించుటయే గాక యతనితోఁ జేరియుండిన కొందఱు సభ్యులనుగూడ నదేవిధ మున శిక్షించిరి. ఇదంతయు నప్పటికప్పుడు జరిగినది కాదు. అల్లకల్లోలము లయిన తరువాత నింగ్లాండునందలి యధికారులు రహస్యసభ ఒక దాని నేర్పరచి ఆసభవారీ దేశమునకు వచ్చి జాగరూకతతో నన్ని విషయములను జర్చించి యనేకులగు సాక్షులను విచారించి తమ యభిప్రాయములను, "దెలిపినమీ దట నైజూము నెడ మద్రాసు ప్రభుత్వమునా రపరాధము చేసి రనుట తేలెను. కాని యీలోపుగ నైజామున కేలాటి సమా ధాసమును నీయఁబడ లేదు. కావున నతఁడు గోపోద్దీపితుఁడయి మరల, హైదరాలీతోఁ జేరుకొని ఆంగ్లేయులతోడి స్నేహము మాని వారిని బారదోల వలసినదని బజలత్ జంగుకు తెలియఁ జేయుచు, నతఁడట్లు చేయనియెడల దానతనిని మర్దించెద నని "కూడ జంకిం చెను. ఇంతలో గుంటూరు జిల్లాను గుఱించి మద్రా సు ప్రభుత్వము వారు చేసికొనిన ఏర్పాటులు బంగాళాలోని

గవర్నరు జనరల్ గా రొప్పుకొనక పోవుటచే "నాజిల్లా మరల నైజాము స్వాధీనము చేయఁబడియెను. ఇంతియెగాక యితనిని సనూధానపఱచుట కాంగ్లేయులు మిక్కిలి పరిశ్రమఁ జేసిరి. వారి స్థితి యప్పు డంత బాగుగ నుండ లేదు. కావున నైజాము నకు దగినంత హితోపదేశమునకు వీరు పూనుకొనవలసి వచ్చెను. వీరి ప్రయత్నములు వృధకాలేదు. 'హైదరు 'ఆంగ్లే యులతో గడపటి యుద్ధము చేసినపుడు నైజా మతనితో గలియ లేదు. 1782 వ సంవత్సరమున బజలత్ జంగు మరణ మందెను. వెటనే గుంటూరు జిల్లా యాంగ్లేయుల స్వాధీ నము చేయఁబడి యుండవలెను. కాని నైజాము దానిని తానే యుంచుకొనెను. 1784 వ సంవత్సరమున నాంగ్లేయవర్తక సం ఘమువారు 'జాన్ సన్ అను నతనిని నైజాము వద్దనుండి గుంటూరు జిల్లాను రాఁబట్టుట కనిపిరి. అప్పుడు నైజాము 1768వ సంవత్సరపు సంధి ననుసరించి యాంగ్లేయులకుఁ జెందిపో యిన ఉత్తర సర్కారులను వారు మరలఁ దన కియ్య వలసిన దనియు దానికై యప్పటివఱకు వారు దన కప్పుపడిన గుత్త మొత్తమును వదలి వేయుటయేగాక యొక కోటి రూపాయిలు బహుమతిగా నిత్తుననియు ఒక క్రొత్త బేరమునకు మొదలిడెను. పాపమాజాన్ సన్ దానినంతయును నామోదించుచు డైరెక్ట. రుల సమ్మతికయి 'యనిపెను. వారది గనినతోడనె మండిపడి జాక్ సన్ ను దీవ్రగతిఁ దూలనాడి పనినుండి తీసివై చిరి. అప్పటి నుండి కొంత కాల ముత్తర సర్కారుల మాట యె యెత్తుకొన లేదు. నైజామునకును నాంగ్లేయులకును నిశ్చయసం బంధ ముండినది గాదు. 1788 న సంవత్సరమున గుంటూరు జిల్లా ప్రశ్న మ ఱల బయలు దేరెను. గవర్నరు జనరలుగారు యుద్ధము చేసి యైనను సాధింప నాయత్తపడిరి. అంతట నైజాము పోరు' నొల్ల నివాఁడయినందుననాంగ్లేయవ ర్తక సంఘము వారి కా జిల్లానిచ్చి లెక్కలు చూచుకొని తీర్మానము చేసికొనెను.

మూఁడవ మైసూరు యుద్ధము,

ఈ తరుణమున 3 1768 వ సంవత్సరపు సంధిని గుఱించి. దాని విషయములు బోధపడఱచుచు గనర్నరు జనరలుగా నుండిన ' లార్డుకారన్ వాలీసు నైజామున కొక యుత్తరము వ్రాసెను. అదియు నైజూమునకును నా గ్లేయులకును జరిగిన సంధి పత్రము లలో నొక్కటిగ నెన్నఁబడుచున్నది. దాని వలన కారణ వా లీసు నైజూమును జాలవరకుఁ దృప్తి పనిచె ననుటకు సంది యము లేదు. ఇంతియెగాదు. ఈతరుణమున నే ఆంగ్లేయులు దము రెసి డెంటు హైదరాబాదున నుండునట్లును నేర్పరుచుకొనిరి.1789-న సంవత్సరమున 'హైదరు కుమారుఁడగు టిప్పూసుల్తానుతో నా గ్లేయులకు విగ్రహము గలిగెను. వైజా మేదో యొక పక్షముఁ జేరి తీరవలసి వచ్చెను. టిప్పూపక్షమున నుండుట కతనికి టిప్పూపై నమ్మకము చాలకపోయెను. వాఁడు జయిం చినచోఁ దప్పక తన్నుఁగూడ మ్రింగి వేయ నుంకించునను సంశ యమితనికిఁ బుట్టెను. వాఁడువిజయుఁ డగుటయు సందేహాస్పద ముగ నుండెను.ఇంతియేగాక లార్డు కారన్ వాలీ సితనిని బహువిధ ముల రమ్మని చీరి టిప్పూనోడించుటవలనఁ గలుగులాభములలో మంచి భాగమిత్తునని వాగ్దానము సేయుచుండెను. కావున నేవిధ మునఁ జూచినను నాంగ్లేయులతో నేకమయి టిప్పూ నెదురించు టయె యితనికి లాభ కారిగఁ గాంపించెను. "పేష్వాయును వీరితో జేర నియ్యకొనెను. కావున నీ మూఁడు కక్షుల వారికిని 1790 వ సువత్సరమున సంధిజి ఱగెను. దీనివలన నీమూఁడు కక్షులవా రును టిప్పూసుల్తానుతో విగ్రహము పట్టుదలతో నడుప నియ్యకొనిరి. అతనితోడి సంబంథములు దామెల్లరును గలిసియే చేసికొన నెప్పుకొనిరి. జయము గలిగినచో దానివలన నగు లాభములను సమభాగములుగ బుచ్చుకొన నియమించుకొని.. ఈసంథికిఁ దరువాత దీనిని నడుపుటకోఱకే నైజామునకును నాంగ్లేయులకును మఱియొక యొడంబడిక నడిచెను. నైజాము గారి సాహాయ్యర్థము బంగాళమునుండి గనర్న రుజనరలుగారు నాలుగు మొదలు ఆరుపటాలముల వఱకును బంప నొప్పుకొనిరి. ఈదండునకగు వ్యయమంతయు నైజాము అచ్చుకోవలసిన దే గాని నగదుగా నియ్య వలసిన పని లేదు. విగ్రహము ముగిసిన మీఁదట టిప్పూనుండి తీసికొనఁబడు సొమ్ములో నైజాము భాగమునుండి అప్పటివరకగు మొత్తమాంగ్లేయులు దీసికొన .

వచ్చును. లేదా ఆ ఫసలీకి నైజామునకు వీరియ్యవలసిన పేష్ కష్ నుండి తగ్గించుకొనవచ్చును. ఇట్టి నిబంధనలతో టిప్పూసుల్తా నుతో విగ్రహము ప్రారంభమాయెను. ' కాని యది బహుకా లము నడచినదికాదు. 1792లో టిప్పూసుల్తాన్ సంధి చేసు కొనవలసిన వాఁడయ్యెను. అప్పుడతఁడు దన రాజ్యములో సగ మువంతు శత్రువులకప్పగించి వేసెను. దానిలో నై జామునకు చెందిన భాగము నంవత్సరమునకురు 52, 64, 000 ఆదాయము నిచ్చునదయి యుండెను.

మహారాష్ట్రులు డీకొనుట.

టిప్పూసుల్తానులో, విగ్రహము ప్రారంబ మగు నప్పుడే నైజామలీకిని మహా రాష్ట్రులకును సంబంధము మై త్రిగలదిగ నుండ లేదు. కావున మహారాష్ట్రులు దన తో డను ఆంగ్లేయులతోడను జేరినట్లు చేరి తాను టిప్పూసుల్తా నుతోఁ బోరాడుచుండఁ దన దేశమును గొల్లకొట్టుదురేమో యని నైజాము భయపడి అట్టి దేమియు జరుగకుండ అభయమిమ్మని లార్డు కారన్ వాలీసును వేడెను. 'కాని యతఁ డదాని కంగీకరింపఁడయ్యెను. టిప్పూతోఁ బోరాటము ముగిసి ముగియక మున్నె నైజాము మసస్సున భయరూపముగనుండిన మహా రాష్ట్రుల దాడి నిజమయ్యెను. వీరికిని అతనికిని గొంతలావా దేవీలు నడచుచుండెడివి. అందులో నితఁడు వారికి బాకీపడుట తటస్థించెను. కావున వారు దమహక్కును సాధించుకొన నీతని .

పైనె త్తినచ్చిరి. అప్పుడితఁడు గవర్నరు జనరలుగారిని సాయ మడిగెను. మహారాష్ట్రులును ఆంగ్లేయులకు మిత్రులేయయి యుండినందున నతఁడు సైన్యముల యుద్ధభూమికిఁ బంపడయ్యెను. దానినలన నైజామునకుఁ గోపమువచ్చి ఆంగ్లేయులు దనకితర వేళల సాహాయ్యర్ధమయి తన వద్ద నుంచిన రెండుపటా లములను తిరుగఁగొట్టి తనతమ్ముడు బజలత్ జంగునుండి సంపాదించిన ఫ్రెంచి పటాలములకు నింకను గొందఱును జేర్చికొని " రేయిమండు' అను ఫ్రెంచి నాయకు నొక్కరుని నియమించి మహా రాష్ట్రుల నెది ర్చెను. ఇట్లు చేయుటలో తానుఆంగ్లేయుల సాయ మిఁకెప్పు డును గోరక స్వతంత్రుఁడుగా నుండవలె ననుటయే యాతని యభి ప్రాయము.

నైజాముయొక్క యీయభిలాష నెర వేరియుండినచో హైదరాబాదు చరిత్రమే మారిపోయి యుండును. కాని తిరుగఁ గొట్టఁబడిన ఆంగ్లేయపటాలములు దారిఁ బట్టిపట్టకమునుపె నైజా మలీ కుమారుఁడు ఆలీజా తండ్రిపై తిరుగుబాటొనర్చెను. పాపమతఁడు దండ్రి చచ్చునఱకు వేచియుండ లేక పోయెను గాఁబోలు. తండ్రి బుద్ధి కడపటి కెట్లు పరిణమించునోయని సందియ పడియెఁ గాఁబోలు. లేదేని తనతండ్రి యన్నను జంపి రాజ్యము నకు వచ్చెఁగావునఁ దానును దన తండ్రి మార్గము నవలంబింపు కున్నఁ దనకును రాజ్యము రాదని తలంచె నేమొ? ఏయూహతో నైన నేమి? అతఁడు దండ్రిని సమయించి సింహాసనము నాక్రమింప

సమకట్టెను. కాని యతనికి బుద్ధి బలము దక్కువ కావున దండ్రిచే నతనినిబట్ట నియోగింపఁబడిన ఫ్రెంచివారలకు లోబడి పోయె. ఇట్టి సందర్భములఁ దనకు సాహాయ్య కారులుగ నుండి తాను దనసీమనువదలి దండులతోఁగూడ బయట యుద్ధముల యందు నిమగ్నుఁడయి యుండఁ దనరాజ్యములో నల్ల కల్లోల ములు జరుగకుండఁ గాచుటకు సిద్ధమయియున్న ఆంగ్లేయుల పటాలములను దిరుగఁగొట్టుట తగదని తలంచి కాఁబోలు వై జాము వారిని మరల రప్పించెను. వారును ఆలీజా లోఁబడునంతలో వచ్చి చేరిరి. ఆలీజాను ముఖ్యమంత్రి యవమాన పెట్టి నందున నతఁడు విషము దీసికొని మృతినొందెను.

నైజాము తాను చేర్చిన ఫ్రెంచి సైన్యములతో మహా రాష్ట్రుల నెదిర్చెను. 'రేయిమండు సిద్ధపజచిన పటాలము లప్పటి కాలమునకు మిక్కిలి బలవంతములు. భరత వర్షము నందు మఱి యే స్వదేశాధీశుని యెడను నట్టిబలము లుండ లేదనిన వానియుత్కృష్టత బయల్పడఁగలదు, నైజామునకును మహా రాష్ట్రులకును జరిగిన యుద్ధమునందు నైజామును అతని పనికిమాలిన పటాలములును వెనుకంజ వైచి పారిపోవకున్నచో రేయిమండు సంపూర్ణ జయమంది యుండును. కాని నైజామే అప్పటి విజయమును జెడిపికొనెను. మహారాష్ట్రులతనిని కర్ డ్లా దుర్గమునఁ జుట్టు కొనిరి, ఆతఁడు సంవత్సరమునకు ముప్పదియైదు లక్షలా అదాయమునీను భూభాగమును నాలుగున్నర కోటి

రూపాయిల ద్రవ్యమును మహా రాష్ట్రుల కచ్చుకొని తన ముఖ్య మంత్రిని ( hostage.) ప్రతిభునిగా నిచ్చి వారినుండి తప్పించు కొనవలసిన వాఁడాయెను.

ఇట్లపజయముంది రాజధాని వచ్చి చేరెను. ఫ్రెంచిపటా లము లొక వైపునను ఆంగ్లేయపటాలములు.మఱియొక వైపునను ఇతనిని గొలుచుచుండెను. భరతవర్షమున పెంచివారి యౌన్న త్యము 1757వ సంవత్సరముతోడనె నశించిపోయి యుండెను. కావున "ఫెంచిదొరతనమువారికి సేవకులుగ నది వఱకుండినవా రచ్చటచ్చట స్వదేశీయ ప్రభువుల దగ్గఱచేరి పొట్టఁబోసికొను చుండిరి. అట్టివారలలో నిప్పుడు నైజాము కడనుండిన రేయిమం డొక్కరుఁడు.

రేయిమండు.*[4]

ఇతఁ డసామాన్య శక్తియుతుఁ డనుటకు సందియ ము లేదు. ఇతఁడు ఫ్రాంసు దేశమున 'గాస్కనీ' పరగణాలో ' సెరిన్యాక్ ' అను గ్రామములో ' 1755 వ సంవత్సరమున జననమందెను. ఇరువది సంవత్సరముల ప్రాయ మప్పుడు హైదరాలీకిఁ దోడయివచ్చిన " షెవలియర్' డిలాషి' యొక్క పటాలములో " నెక - చిన్న' యధికారిగఁ జేరెను. అనేక పర్యాయము లితడు ధైర్యసాహసములు ' సూపుటనలన నధి .....................................................................................................

కారు' లితని పైఁ బ్రేమగొనఁ జొచ్చిరి. 'కావున నితఁడు త్వర లోనే నాయకత్వమున కర్హతనం దెను. 1788న సంవత్సరమున నాంగ్లేయుల నెదుర్చుటలోఁ దోడ్పడ 'బుస్సీ' యేతించినపు డాతఁడితనిని దనపార్శ్వవ ర్తిగ నేమించుకొనెను. బుస్సీమరణా సంతరము 1786వ సంవత్సరమున నప్పటి పుదుచ్చేరి గవర్నరు గా రితనిని నైజామునకు మిక్కిలి నమ్మకమగు సేవకుఁడు గాఁగ లఁడని సిఫార్సు చేసిరి. నైజామును నితనికి మాసమునకు నైదువే లరూపాయిలు జీతమిచ్చి కాల్బలపుఁ బల మొక్కటిని పఱుప నియోగించెను.

ఇతఁడు చేర్చిన పటాలము నైజామదివరకును జూడ నైనఁ జూడనంతటి బలవంతమయినదయి కనుపట్టినందునఁ గ్రమ క్రమముగఁ బదునాల్గుపటాలములఁ జేర్చవలసినదని యితనికి నుత్తరువాయెను. ఇతఁడు బలములఁ జేర్చినదియు, మహా రాష్ట్రులతోఁ బోరినదియు, నైజాము యొక్క బలహీనతవలన విజయమును సంపాదింప లేకపోయినదియు సంతకుము న్నై వ్రాసితిమి.

ఇట్టి ప్రచండుఁడగు ఫ్రెంచి నాయకుని యాధిపత్యము క్రింద దినదిన ప్రవర్ధమానమగు సైన్యముండుటయు, నది నైజాము నకు దోడుగ నుండుటయు, నతనివద్ద చేరుకొని యాతనితో సంబం సములు గల్పించుకొనుచుండిన యాంగ్లేయులకు గిట్టినదిగాదు.

మార్క్విసు అఫ్ వెల్లెస్లీ ఆంగ్లేయులకు గవర్నరు జనరలుగా వచ్చునప్పటికి రేయిమండు పటాలములు నిండుస్థితి యందుండెను.

సంధికిఁగారణములు.

టిప్పూసుల్తానుతో మరల విగ్రహము తటస్థించునట్లుం డె ను. మహా బలశాలియగు టిప్పుసుల్తానుతోఁ జంచల చిత్తులయిన వైజాము మహా రాష్ట్రులను దోడు చేసికొని పోరఁగడఁగు నాం గ్లేయులకు, నైజాముయొక్క బలవంతమగు ప్రెంచి సైన్యమును దమదండులో నొక్కయంగముగ స్వీకరించుట కుక్కతోఁక పట్టుకొని గోదావరియీద సాహసించుటయె యయియుండును గదా. కావున మార్క్విసుఆఫ్ వెల్లస్లీ నైజామును ఫ్రెంచి సైన్య ములఁ బగులఁగొట్టుమని వేధింపఁజొచ్చెను. కాని నైజామునకు మాత్రము దన బలమును దగ్గించుకొనుట కేనూత్రమును ఇష్ట ము లేకుండెను. అట్టిసందర్భముల నొకటి రెండువిషయములు తటస్థింపకున్నచో నైజామునకును నాంగ్లేయులకును నంతత్వరగ స్నేహము గుదిరియుండదు. కాలపరిపక్వమహిమవలన నప్పుడే రేయిమండక సాత్తుగఁ జచ్చుట దటస్థించెను. అతఁడు విషము చేతఁ జచ్చెనను వదంతిగలదని యొక చరిత్రకారుఁడు వ్రాయు చున్నాఁడు. '[5] నైజామునకు ముఖ్యమంత్రిగ నుండి యతని క్షేమ మునకయి (hostage) ప్రతిభుఁడుగ మహా రాష్ట్రుల వద్ద బహుకా లము ఖైదీ వలెనుండిన ఆజమ్ - ఉల్ - ఉమ్రా మిక్కిలిచాతు .....................................................................................

ర్యముతోఁ బని చేసి కర్ డ్లా సంధినలన నైజాము పోగొట్టుకొనిన సర్వసంపత్తును మహారాష్ట్రులనుండి వైజామునకు మరల్చు' టకుఁ దగిన ఏర్పాటులన్నియుఁబన్ని ,తన్ను వారువదలి పెట్టునట్లు వారితో స్నేహభావముగలించుకొని హైదరాబాదువచ్చిచే రెను. ఇతఁడాంగ్లేయుల పయిభ క్తియు వారియెడ ప్రేమయుఁ గల వాఁడు. కావున నైజామున కితఁడు నచ్చఁ జెప్పి రెండవమారు తిరు గఁ గొట్టఁబడనుండిన యాంగ్లేయ సైన్యములను హైదరాబాదు నందు నిలిపెను. రెసిడెంటుగా నుండిన కిర్కు పాట్రికు నైజాము నకునప్పటికాలమున ఫ్రాంసులో జరుగుచుండిన విప్లవమును గుఱిం చియు నట ప్రభువులు పడుచుండిన గొప్పదురవస్థలను గుఱించి యు ఫ్రెచి వారికి ప్రజాస్వాతంత్ర్యము నెడఁ గల యాపేక్షులను గుఱించియు సమయము దొరకనపు డెల్లా పెంచి చెప్పుచు వారియెడ నతని కసూయఁగలిగింపఁ బ్రయత్నించుచుండెను. నైజాము నకుఁగూడ ఫ్రెంచివారు రాజును విధ్వంసము చేసినది చూడ విస్మ యకరముగనె యుండెను. ఇంతియగాక 1796న సంవత్సరమున నైజాము మిక్కిలి జబ్బుపడి లేచి నాఁటినుండియు బలహీనుఁ డగుచు నేయుం డెను.

ఆంగ్లేయులతో సంధి (1798.)

ఇప్పగి దన్ని విషయములును నాంగ్లేయులకు సహ కారులుగనే కాన్పించెను. కావున గవర్నరుజనరలుగారు ఫ్రెంచి పటాలములను బగులఁగొట్టవలసినదని నొక్కి చెప్ప నారంభిం

చిరి. నైజామునకును నాంగ్లేయులకును 1798 న సంవత్సరము మఱియొక సంధి జరిగెను. దానివలన నైజామునకు నాంగ్లేయులు రెండుపటాలములకు బదులు ఆరుపటాలములు సాహాయ్య మియ్య నంగీకరించిరి. నైజాము దన క్రింద జీతగాండ్రుగ నుండిన ఫ్రెంచివారల నందఱను పనులనుండి తొలఁగించి ఆంగ్లేయుల స్వాధీనము చేయ నొప్పుకొ నెను. ఆరుపటాలములకు నగు వ్యయ యము సంవత్సరమునకు రు 24, 17, 100లు. నైజాముగారి బొక్క సమునుండి నాలుగు కి స్తీలుగ నిచ్చునట్లేరుపరుపఁబడెను. మహా రాష్ట్రులకును నైజాముగారికిని మరల నే వేని భేదములు గలిగినచో నాంగ్లేయులు మధ్యవర్తులుగ నుండ నియమింపఁబ డిరి. ఆంగ్లేయులనుదక్క దక్కిన యైరోపియనులను నైజామగారి రాజ్యమునుండి వెడలగొట్టు విషయమున 1798వ సంవత్సరము నష్టంబరు నెల 1 వ తేది ప్రత్యేక మొక యొడంబడిక జరిగెను. దానిననుసరించి నైజాము రెసిడెంటుగారి యేర్పాటులకు నియ్య కొన నంగీకరిం చెను.

ఫ్రెంచివారి పలుకుబడికి భంగము.

అక్టోబరు నెల తొమ్మిదవ తేది నైజామున కెక్కుడుగ నాంగ్లేయు లియ్యదలఁచికొనిన నాలుగుపటాలములును హైద రాబాదు' వచ్చి చేరెను. రెసిడెంటుగారు సంధి ప్రకారము ఫ్రెంచిబలములను జెదరఁగొట్టవలసినదని - వేడిరి. కొన్ని దినములకాల మేమియు నడచినదిగాదు.ఫ్రెంచిపటాలముల

విషయమున నడచినయెడంబడికను పూర్తి సేయకుండుటకు వలయు ప్రయత్నములు దోచెను. అంతట రెసిడెంటు తన సైన్యములను ఫ్రెంచి వారి పై విడియింప వలసివచ్చునని తెలిపి తనదండును ఆపనికయి యాయత్త పఱచుచుండినట్లు తోఁపింపఁ జేసెను. అంతట నైజాము గారు ఫ్రెంచియధికారు లను దమ సేవనుండి దప్పించిరనియు (ఫ్రెంచిపటాలములు విడి పోవలసినదనియు నుత్తరువుపంపిరి. ఈయుత్తరు వయినతోడనె ఫ్రెంచి సైన్యములలోఁ దిరుగుబాటులు చూపట్టెను. ఆతిరుగు బాటే కారణముగ వానిని జెదరఁగొట్టుట సులభమాయెను. ఫ్రెంచిపటాలము లుండిన నగర భాగము నాంగ్లేయ సైన్యములు చుట్టుకొనెను. ఇదిచూచి 'ఫ్రెంచి సైనికులు జడిసిపోయిరి. లో బడినచో నభయమిత్తుమని యాంగ్లేయులు చాటుటతోడనె ఫ్రెంచిభటులు 15, 000 జనులు గిక్కు మిక్కు మనక ఒకరి వెంబ డిగ నొకరు ఆంగ్లేయుల శరణుఁజొచ్చిరి. హైదరాబాదునం దీరీ తిని ఫెంచివారి పలుకుబడిని నశింపఁ జేసి తమబలములను సం స్థాపించుకొనుటలో నాంగ్లేయులు వడసిన విజయము భరతఖం డచరిత్రమున కంతకును ముఖ్యాంశమని చెప్ప మెప్పును.

టిప్పూ ప్రయత్నములు పతనము.

టిప్పుసుల్లా నాగ్లేయుల నెదుర్చుటకొఱకు మిక్కిలి బల మగుకక్షను సంస్థాపించుటకుఁ బడరాని పాట్లెల్లయును బనుచుం డెను. అతఁడు నైజాముతోడను ఫ్రెంచివారితోడను సంబంధ

ములు గల్పించుకొని వారినిగూడ నాంగ్లేయులకు విరోధులుగఁ జేర్చుకొనఁ జూచుచుండుటయే గాక అరేబియా పరిపాలకుఁడు మున్నగు మహ్మదీయ ప్రభువుల నందఱును 'సాయము చేసికొని స్వమతావలంబకులకు మతాభిమానమును బురికొల్పి యపరిమిత సైన్యములఁ బ్రోగుచేసి యాంగ్లేయులను మొదలంటఁ భారఁ దోలఁ బ్రయత్నించుచుండెను. హైదరాబాదునందు పైనివర్ణి చిన విజయమునకు మూలకారకుఁడగు లార్డు వెల్లస్లీ గవర్నరు జనరలయి ఈ దేశమునఁగాలిడి యిడకమున్నె యీవిషయమును జక్కగ గ్రహించి తన పై యధికారులకుఁ దెలిపి టిప్పూకార్య ములకు భంగముగూర్చుటకు వలయు సాధనములు వెదకుట- యందు మిక్కిలిశ్రద్ధ వహిం చెను. హైదరాబాదునందలి ప్రెంచి బలమును విచ్ఛిన్నముచేసి ఆసంస్థానాధీశ్వరుని యొద్ద తమ శక్తిని దృఢపజచుకొని, వెంటనే అకస్మాత్తుగ దండునాయ త్త పఱచి టిప్పూసుల్తాను పై కనిపెను. ఇచ్చట నాల్గవ మైసూరు- విగ్రహము వర్ణించు టవసరముగాదు. దానియందు టిప్పూ యోడిపోయి ప్రాణము లర్పించెనని నుడివిన చాలును. అతని మరణానంతరమా రాజ్య మంతయును నాంగ్లేయులయు నైజాముయొక్కయుఁ జేతులలోఁబడెను. దానిని వీరలు బంచు. కొనుటకై 1799వ సంవత్సరమున మైసూరుసంధి జరిగెను.

మైసూరునంధి' (1799)

మైసూరనఁబడుభాగమును విభజించి యుండినచో నై జూము కు మిక్కిలి బలమగు దుర్గములు చేజిక్కి యుండును. అప్పటి కట్టి యవకాశమునైజామున కిచ్చటతగదని లార్డు వెల్లస్లీ కి దోఁచెను.*[6] దానివలన మైసూరు విభజింపఁబడక మొత్తముగఁబూర్వపు రాజుల 'సంతతివాఁడగు కృష్ణ రాజ ఒడయరు బహదూరుగారి కియ్యబడె ను. అతని సాహాయ్యర్థ మా రాజ్యములో నాంగ్లేయ పటాలము లు నిలుపఁబడెను. వానికగు న్యయమునకై యితఁడు సంవత్సరము నకు ఏడులక్షల వరహా లియ్య నియ్యకొనెను. ఇట్లు పూర్వపురాజ సంతతివారికి మైసూరునిచ్చి టిప్పుసుల్తాను గడించియుండిన తక్కి న దేశమును ఆంగ్లేయవర్తక సంఘమువారును, నైజామును, మహా రాష్ట్రులును బంచుకొనునట్లేర్పఱుపఁబడెను. మహారాష్ట్రులు టిప్పుతోఁ బోరాడుటలో కలిసి పని సేయకున్నను వారిని గూడ నీసంధిలోఁ జేర్చుకొని వారికొక కొన్ని జిల్లాలనిచ్చుటకు పేష్వారావు పండిత ప్రధాన్ గారికిని, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియాకం పెనీ బహదూరుగారికిని, ఘనత వహించిన 'నవాబు నైజాము - ఉద్ - దౌలా ఆసఫ్ జా బహదూరుగారికిని, మహా రాజ మైసూరు కృష్ణరా రాజ బహదూరుగారికిని గల స్నేహ మును రాజకీయసహవాసమును నిలుపుటకై" యని నుడువఁబడి ...................................................................................................

నది. ది. 1 [7]పేష్వా యీసంధికి నొప్పుకొనిన వాఁడు గాఁడు. కావున నతని కయి వేరుచేసి పెట్టిన భాగమునందు మూడింట రెండనవంతు నైజామున కియ్యఁబడెను. "మొత్తముమీఁద నతనికి మైసూరు సంధివలనను 1792 లో టిప్పుతో జరిగిన సంధివలనను సంవత్సర మునకు కోటిరూపాయ లాదాయము రాఁగల దేశము చెందెను. కాని బహు కాల మిది యితని స్వాధీనమున నుండినది కాదు.

ఆంగ్లేయులతో సంధి. (1800.)

టిప్పూసుల్తానును తుదముట్టించుటను జూచి మహా రాష్ట్రు లు అసూయాపరనశులై యుండిరి. వారు రానురాను ఆంగ్లే యులయెడవిరోధభావము సభివృద్ధిఁ జేయుచుండుట విశదమయ్యె ను. కావున నాంగ్లేయులు నైజాముతోడి సంబంధము నింకను బలము చేసికొనఁ బ్రయత్నింప వలసి వచ్చెను. ఇదివఱి కతనికిని దమకునుగల పరస్పర సమానమిత్రభావము గష్టసమయములఁ “బనికి రాక పోవచ్చునని యెంచి తామతనికి సంరక్షుకులయి తమ సలహాల కతఁడు ఎదురు చెప్ప లేకుండునట్లు నియమించు. కొన వలెనని వీరికిఁ దోఁచెను. ఇంతియగాక, ఆతని దేశము మహారా ష్ట్రుల దేశవు సరిహద్దులలో నుండుటవలన - నాతని దేశమునందుఁ దమబలములు వలసినంత. యంచుటగూడ లాభ కారియేయని .........................................................................................

I

వారుదలంచి యుందురు. కావున 1800 వ సంవత్సరమున నైజామునకును ఆంగ్లేయులకును మఱియొక సంధి జరిగెను. ఈ సంధి ప్రకారము నైజాముగారి రాజ్యములో నాంగ్లే యులచే నుంచఁబడిన సాహాయ్య సైన్యము(Subsidiary force) స్థిరపఱుపఁబడి సంఖ్యయందును హెచ్చు చేయఁబడెను. రెండు ప టాలములు సీపాయిలును, ఒక్క పటాలము ఆశ్విక సైన్యమును, వీనికిఁదగిన ఫిరంగులు మందుగుండులతోడను, సిబ్బందితోడను, మున్నున్న ఆరుపటాలముల సీపాయిలకును ఒక్క పటాలము ఆ శ్విక సైన్యమునకును జేర్చఁబడెను. మొ త్తముమీఁద ఆ గ్లేయ వర్తకసంఘమువారు నైజాముగారికి సాహాయ్య సైన్యముగ స్థిర పజచినది ఎనిమిదిపటాలముల సీపాయిలును(అనఁగా 8000లు తు పాకి నుపయోగించు భటులు) రెండుపటాలములు ఆశ్విక సైన్య మును(అనఁగా 1000 మంది రౌతులు) వీనికవసరమగు ఫిరంగులు, ఐరోపియనుల సిబ్బంది, లాస్కారులు, మందుగుండులు మున్నగు నవి. వీనికన్ని టికగు వ్యయమున కై నైజాము టిప్పూసుల్తాను రాజ్యము నుండి శ్రీరంగపట్న ము (1792), మైసూరు సంధులవలన గడించిన సంవత్సరమునకు 'కోటిరూపాయ లీను దేశ భాగమును ఆంగ్లేయుల కియ్య నొప్పుకొనెను. యుద్ధసమయముల నాంగ్లే యుల సాహాయ్యర్థమయి ఈ పటాలములలో రెండు దక్క దక్కినవానిని దన స్వంత సైన్యములోని ఆరు వేల కాల్బలము తోడను, తొమ్మిది వేల ఆశ్విక భటులతోడను, బంపుటకు నైజా

ము సమ్మతించెను. ఈసంధివలన నైజామును ఆంగ్లేయులును రాజు కీయ కార్యముల కై క్యతనొందుట నిర్వచింపఁ బడినందున నైజా ము పరరాష్ట్రములతో నాంగ్లేయులకుఁ దెలియకుండ నుత్తర ప్రత్యుత్తరములు సలుపుట లేదనియుఁ, బర రాష్ట్రము వారిలో బోరునకు దాను పోవుట లేదనియు, ఒక వేళఁ బర రాష్ట్రపు వారితోఁ దనకు వివాదములు గలిగినప్పు డాంగ్లేయ వర్తక సంఘము వారు న్యాయము విచారించి తీర్మానము చేసిన విధమున నడచుకొను ననియును కూడ యొడంబడిక చేసికోనెను. ఆంగ్లే య నర్తక సంఘమువాగు నైజాము పై నకారణముగ దండె త్తివచ్చు శత్రువుల నణచుభారము నంగీకరించుటయే గాక నై జామునకు సర్వవిధముల సాయపడఁదలంచికొని యుండుటను సూచించిరి.“ నిజమునకు (నైజామును ఆంగ్లేయ సంఘము వారును) ఒక్క టేయయి యైక్యమయినందున" ననుపదములు ఈసంధి పత్రమున భూమిక (Preamble) యందును షరతుల యందును గూడఁ 'గాననచ్చుట వలన నైజాము గొంచెము లోతుగఁ బరిశీలించిన పూర్ణాశ్రయతను 'బయల్పఱచునట్టి ఆత్మ గౌణసామ్యమును(Self subordinating equality)దప్పక వచ్చి సందువలన నాంగ్లేయుల యెడ నంగీక రించెనని చెప్పవచ్చును అని యొక చరిత్రకారుఁడు వ్రాయుచున్నాఁడు 1 [8]ఇప్పగిది రాజ కీయ విషయములలో నైజాముతో దిట్టమగు నేర్పాటులు గా

I

వించుకొని యాంగ్లేయులు 1802 వ సంవత్సరమున నతనితో వర్తక సంధి ఒక్కటిని గుదుర్చుకొనిరి. దానివలన వర్తకులకు మున్నుండిన గష్టము లనేకములు దీరిపోయెను. ఒకరి రాష్ట్ర మునుండి మఱియొకరి. రాష్ట్రమునకు దిగునుతి కాఁగల సరకుల పై నూటి కైదువంతున సుంకముగట్టుట నిర్ణయింపఁబడెను. కొన్ని మార్పులతో ఆ పద్ధతియే నేటికిని సాగుచున్న ది.

నైజామలీ చివరదినములు.

తనతదనంతరము దన రాజ్యమును నైజామలీ కుమా రులు మువ్వురకునుఁ బంచి పెట్టవ లెనను ఉద్దేశము దనకుఁగలదని కనుపఱచి దాని కై మహారాష్ట్రులయు నాంగ్లేయులయు సమ్మతిఁ బడయనుండెను. ఇట ఢిల్లీ చక్రవర్తిగారి యనుమతిమాటయే దలపట్టకుంట మనము గమనింపవలెను. ఈలోపుగ 1797 న సంవత్సరమున నైజామలీ మిక్కిలి జబ్బుపడెను. అప్పుడాతని పెద్దకుమారుఁడు గొంతకస్టముమీఁదఁ దండ్రికిఁ బ్రతినిధిగ రాజకీయ కార్యములు నెరవేర్ప నేమింఁబడెను. 1799 లో నైజామునకు వ్యాధి ప్రబలి మృత్యువును దెచ్చి పెట్టు నేమో యను స్థితినిగలిగించెను. ఆతరుణమున గవర్నరుజనరలుగారు రెసి డెంటునకొక యుత్తరము వ్రాసిరి. అందులో నాంగ్లేయులు సికందరుజాకు నైజూమలీ మరణానంతరము సాయము చేయ వలసినచో నతఁడీయకొనవలసిన షరతులు లిఖింపఁబడెను. నానికన్నిటికిని అతఁడొప్పుకొనెను. నైజామలీ కుత్తుక నుండి యూపిరి వెడలుటె యాలస్యముగ సికందరుజాను సింహాసనము పై కెక్కించుటకు సర్వసన్నాహములును జేయఁబడియుండెను. కాని నైజామలీ మరల బ్రతుకుటవలన నవెల్లయుఁ బనికి రాకపోయెను, అయిన నప్పుడు సికందరుజాకొసఁగిన షరత్తులే 1800 సంవత్సరపు సంధిలో నైజూ మలీకిని నొసంగఁబడి యతనిచే నంగీకరింపఁ బడెను. ఇట్లదివఱకె యాంగ్లేయుల సంరక్షణకు లోఁబడియుండ నెంచి కొనిన సికందరుజా1808వ సంవత్సరమున నై జామలీఖానుఁడు మరణించఁగ నే అల్లరులును గడబిడలును నేమియు లేక. నైజాముపదమున కెక్కెను.

సికందరుజా (1808_1829).

సింహాసనము నెక్కినపుడితని వయస్సుముప్పది నాలుగు సంవత్సరములు. ఇతఁడు .సౌలభ్యమును సుఖమును అపే క్షించి ప్రజల కష్టసుఖములను గమనింపఁ డయ్యెను. ఇతఁడు సింహాసనమునకు నచ్చునప్పటికి సిందియా హెల్కారుల పరస్పర సంఘట్టనమువలన రేగిన ప్రథమ మహా రాష్ట్ర యుద్ధము జరుగుచుండెను. 1808 వ సంవత్సరము అక్టోబరు నెల 25 వ తేది పునహాయొద్ద యుద్ధములో సింధియాయును నతనికి సహ కారిగఁ బోరుచుండిన పేష్వాయును హెల్కారుచే నోడింప బడిరి. పేష్వా, సంపూర్ణమగు నాశమును దప్పించుకొనుటకయి యాంగ్లేయులతో సహవాసము గోరెను. కావున నాతనికిని వీరికిని నైజామునకును వీరికి నిం బలె అదేషరత్తులతో సంధి.

జరిగెను. 1805వ సంవత్సరమున సింధియు గనిన యపజయము వలన ప్రథమ మహారాష్ట్ర విగ్రహము ముగిసెను. ఈవిగ్రహ మున సికందరుజా. ఆంగ్లేయుల కేమాత్రమును సాహాయ్యము చేసియుండ లేదు. అట్లుండియు శత్రువుల నుండి పట్టునడిన దేశ ములోఁగొంత భాగము నైజామున కీయఁబడెను. దీనివలన నితని రాజ్యము ఉత్తరమున వింధ్యాద్రులవఱకును వరదానదినఱకును వ్యాపించెను. ఈతరుణమున - బీరారు (Perar) పూర్తిగ నైజామునకుఁ జేరెను. 1804 న సంవత్సరమున నైజామలికి ముఖ్యమంత్రిగనుండి ప్రఖ్యాతి వడసిన ఆజమ్-ఉల్-ఉమ్రా పరలోక ప్రాప్తిఁ జెందెను. అతనిస్థానమున మీర్ ఆలంను నేమిం పవలసినదని రెసిడెంటుగారు సలహానిచ్చిరి. ఇతఁడు ఆజీమ్ - ఉల్-ఉమ్రా ముఖ్యమంత్రిపదము నందుండినపు డాతని కాప్తు డుగ కార్య భాగమును సహించిన వారలలో ముఖ్యుడు . అంతియ గాక ఆంగ్లేయుల యెడ నెక్కుడు భ క్తిగలవాడు, సంస్థానము పయి యనురాగము గలవాఁడు. కాని ఇతఁ డాంగ్లేయ ప్రతినిధి వలన నిర్వచింప బడుటం జేసి ముఖ్యముగ వారి వాఁడుగనే ఉండు నని తలంచి కాఁబోలు సికందరుజూ ఇతనిని నియమించుటకు మొట్ట 'మొదట ఇష్టపడ లేదు. అయినఁ దప్పదని రెసిడెంటు బలవంత పెట్టిన మీఁదట నైజూ మీతనికిఁ బూర్వపు ముఖ్యమంత్రికిఁ గల శక్తులలో ఒక కొన్నిటిని తగ్గించి - ఇతనిని ఆపదమున ముండనిచ్చెను. మీర్ -ఆలమ్ యుక్తిమంతుఁడు గావున నైజా

ముగారి మనసున కెక్కునట్లు ప్రవర్తించి యతని 'మన్న నవడసి ప్రతి రాజ్యాంగమందును (Department) వలయు సంస్కార ములన నేకముల నుపక్రమిం చెను.

మహీపుత్ర రాముఁడు.

బీరారునకుఁ బరిపాలకుఁడుగ నుండిన రాజా మహీ పుత్ర రాముఁడు 1805 సంనత్సరమున హైదరాబాదునకువచ్చి నైజాము స్నేహితులగు ఇ స్మేల్ - యాన్ - జంగు మున్నగు వారి ద్వారా అతనివద్ద పలుకుబడి సంపాదించుచుండెను. మహీపుత్రుఁ డెప్పగిది నైన - మీర్ - ఆలమ్ ను పదచ్యుతుని జేసి తానా స్థానము నాక్రమించుకొనఁ బ్రయత్నింప మొద లిడెను. మీర్ , ఆలమ్ కును ఆంగ్లేయాధికారియగు రెసి డెంటుకును గల యన్యోన్యమును బెంచి చెప్పి నైజామునకు సూర్ -ఆలమ్ పై నుదాసీన భావముఁ బుట్టింప మహీపుత్రుని పక్షమువారు పూనుకొనిరి. ముఖ్యమంత్రి పై వీరు బన్న మొద లిడిన కుట్రలను నైజామెఱింగియు నెఱుఁగని వానివలె నుండ నియ్యకొనెను. ఇట్టి సందర్భములలో రెసిడెంటు చర్చఁబుచ్చు కొని తీరవలసిన వాఁడాయెను. అతని నిర్బంధమువలన మహీ పుత్రుఁడు బీరారుఁ దన స్థానమునకు నెడలిపోవలసినదని యుత్తరువాయెను. కాని యిది నామకార్థము పుట్టిన యుత్తరువె. మహీపుత్రుఁడింకను నైజాముతో నాలోచనలు సేయుచు 'సింధియా హెల్కారులను దోడు చేసికొని మీర్ ఆలమ్ ను

మార్గమునుండి తొలఁగించి ఆంగ్లేయ సంబంధమును మాన్పింపఁ బ్రయత్నించుచుండుటయుఁ దెల్ల మయ్యెను. దీనిపై గవర్నరు జనరలుగారి యుత్తరువు ననుసరించి రెసిడెంటు మహీపుత్రుని అతని సాహాయ్యులను నెంటనే తొలఁగించ వలసినదని నైజా మునకు దృఢముగఁ దెలియఁ జేసెను. అతఁడును నా ప్రకారమే చేయవలసిన వాఁడయ్యెను. ఇంతవఱకును దన కేమైనఁ గీడుకలు గు నేమోయని జంకి రెసిడెంటుగారి తోటయందొక భవనమున దాఁగియుండిన మీర్ - ఆలమ్ నగరుఁజొచ్చి మరల దనధర్మము నెర వేర్పఁ బారంభిచెను. నైజామును అతనిని గౌరవించి సమ్మానించెను. మహీపుత్రుని అతని పరిజనమును దొలఁగిం చుటవలన నిలువయున్న యుద్యోగములకు మీర్ - ఆలమ్ పక్షమువారు నేమింపఁబడిరి. అందుభీరారునకు రాజా చందూ లాల్ సోదరుఁడగు గరుడబక్షీ పరిపాలకుఁడుగ నేమింపఁబడెను. అతని సాయముస కైఁ గొంత యాంగ్లేయ సైన్యముగూడ బంపఁబడెను. దానిని జూ చినతోడని మహీ పుత్రుఁడు పోలాపుర మునకుఁ బారిపోయి యటనుండి కొంత కాలము నైజముగారి యెడ శత్రుత్వము పూని పోరి కట్టకడపట హెల్కారు శరణుఁ జొచ్చి యతనివలనఁ జుంపబడెను.

నైజాము స్థితి.

1808 వ సంవత్సరము వఱకును నైజామునకును ఆంగ్లే యులకును గల సంబంధమున విశేషాంశము లేవియు నుండ లేదు.

ఆసంవత్సరమున మీర్ . ఆలమ్ మరణమందుట తోడనె మరల నైజూమునకును రెసిడెంటునకును ముఖ్యమంత్రిపదమున కెవ్వ రిని నియమించవలె ననుట వాదము ప్రారంభమాయెను. 1800 సంవత్సరమున జరిగిన సంధి ప్రకారము నైజాము దన స్వంత సైన్యమును అవసరమగుడు ఆంగ్లేయుల సాహాయ్యర్థము పంపవలసిన వాఁడయియుండెను. మహారాష్ట్ర యుద్ధమున నిట్టి సైన్యమును దగినంతను దగినస్థితిలో బంపకపోవుటయేగాక తరు వాతఁ బలుమారు హెచ్చరింపఁ బడినను సరియగు సైన్యమును చేర్చుటకూడ మాని వేసెనఁట. సికందరుజా మహారాష్ట్రుల యెడ పక్ష పాతము గనుపఱచు చుండినందున సతఁడు ఆంగ్లేయులకు విరోధియని ప్రకటించిన బాగుగనుండునాయని మార్విసు వెల్లస్లీ మొదటి మహా రాష్ట్ర విగ్రహమునకుఁ బ్రారంభమున యోజించినట్లు గూడఁ దెలియవచ్చుచున్నది.[9] మీర్ ఆలమ్ ను ముఖ్యమంత్రిగ నేర్పఱచు కొనుట కితఁడెన్ని విధములఁ బెనగు లాడినదియును రెసిడెంటుగారికిఁ దెలిసియే యుండెను. ఇట్టి దర్భముల నీతని ముఖ్యమంత్రి స్థానమున దనచే నియమింపఁబడి తన పై ఆధారపడియుండు వాఁ డుండుట యావశ్యకమని రెసిడెంటుకుఁ దోఁచెనని వేరుగ వ్రాయఁబని లేదు. కావున నతఁ డు దన యిస్ట ప్రకారమే ముఖ్యమంత్రిని నియమింప వలసిన దని నైజామును నిర్బంధ పెట్టెను.దాని పై నిరువురకును గొంతతీక్ష్ణ, .............................................................................

1

మగు వివాదము జరిగెను. “సర్వాధికారియగు సంరక్షుకుడును మూర్ఖుఁడగు సంరక్షితుఁడును బెనఁగులాడిన సర్వసామాన్యముగ నెట్టి ఫలము గలుగున దియు మన మెఱింగిన విషయమేగదా. నై జాము దనసంరక్షుకులకు ముత్తెముల నిచ్చి చిప్పను దానుంచు కొనెను. మూనిన్ -ఉల్-ముల్క్ అను నైజాముగారి మను ష్యుఁడు నామకార్థము ముఖ్యమంత్రిగి సేమింపఁ బడియెను. ఆంగ్లేయులకు మిత్రుఁడగు రాజాచందూలాల్ అను హిందువు పేరునకు పేష్కా రేయయినను నిజమునకు పేష్కారుదివానుల[10] శక్తుల రెంటిని గలవాఁడుగ నొనర్పఁబడెను. "2 [11]ఇతఁడు 1832 వ సంవత్సరమున మూనిక్-ఉల్-ముల్క్ చనిపోవుట తోడనే దివానుపట్టమును గూడ ధరించెను.

చందూలాల్ ముఖ్య మంత్రిత్వము.

మొదట నితఁడు సుంకమువసూలు చేయు శాఖలో సర్కారు నౌకరుగఁ జేరిన వాడు. 1804 న సంవత్సరమున మీర్ ఆలమ్ ముఖ్యమంత్రి యగుటతోడన్ అతఁ డీతనిని తన వద్ద కార్యనిర్వాహకుఁడుగ నుంచుకొనెను. అతఁ డాంగ్లేయులకు మిత్రుఁడై వారిపక్షము సవలంబించుచు వచ్చినందున నితనికిని ఆంగ్లేయులయెడ స్నేహభావము పెరుగుచు నే వచ్చెను. దాని వలన నితనికిఁ గలిగిన లాభము మాచదువరులిదిఱకే వినియు

............................................................................................ 1 2

న్నారు. కావున నిఁక రోజు చందూలాల్ రెసిడెంటు గారె ట్లునడపిన నట్లు నడచెననినచో నతిశయోక్తిగ నుండఁజాలదు. రెసిడెంటును దరుణము చూచుకొని నైజాము స్వంత సైన్య' ములను సంస్కరించి విడిచెను. వాని పై నాంగ్లేయాధికారులు నియమింపఁబడిరి. ఆంగ్లేయుల ప్రతినిధియగు మంత్రి చేతులలో సర్వశక్తుల నిడుకొనుటవలన హైదరాబాదునకును ఆంగ్లేయ రాజ్య మండలములకును విశేష భేదము లేక పోయెనని తెలియఁ జేయు నంశములలో నిదియొకటని మాక్ ఔలిఫ్ అను చరిత్ర కారుఁడు వ్రాయుచున్నాఁడు. 1871 వ సంవత్సరమున పిండారీలతోఁ జేరుకొనిన మహారాష్ట్రులకును ఆంగ్లేయులకును మరల . విగ్రహము ప్రారంభమాయెను. దానిలో సంస్కారమందిన నైజూము. దండులు దీర్చినపనివలన వానిబల మిట్టిదిగదా యని బయ ల్ప డెను. ఆవిగ్రహము ముగిసి నాగ పురాధిపతియు హెూల్కా, రును పేష్వా బాజీరావును ' ఓడింపఁబడిన తరువాత 1822 న సంనత్సరమున హైదరాబాదు నైజామునకును నాంగ్లేయుల కును 'మఱియొక సంధిజిరిగెను. ఆంగ్లేయ ప్రభుత్వము వారు పేష్వాను జయించి యతని స్థానము నాక్రమించుటవలన నత నికి నై జూము గట్టుచుండిన చౌతుకప్పమును వీరికిని గట్టనలసిన వాఁడై నను ఈసంధివలన నది త్రోసి వేయఁ బడెను. ఇంకను మహారాష్ట్రులు నైజాము పై మోపుచుండిన మామూలు

భారము లెవ్వియును దాము మోపుట లేదని కూడ వాగ్దానము' చేసిరి. నైజామునకు సంవత్సరమునకు 6,26,375 రూపాయలు ఆదాయము నిచ్చ భూ భాగము ఈసంధివలనఁ జేరెను. రాజా చందూలాల్ గట్టివాఁడేగాని యతని రాజ్యాంగ పద్ధతులు మాత్రము పురాతనములు. జనులపై వేయఁబడిన పన్ను తప్పక బొక్కసము చేరుటయే పరమావధిగఁ గల "వాఁడు గావున నతఁడు ఏలములు వైచి ఈయీభాగమున కి తింతయని నిర్ణయించుకొని ఆయా భాగములలోఁ బన్ను నసూలు చేసికొనుటకు కౌలుదారులను వదలుచువచ్చెను. యజమాని కియ్యవలసినది పోఁగా ఎంతదొరికిన నంత రాబట్టుకొనుట కౌలుదారుని పని కావున నీపద్ధతి బహుస్వల్ప కాలములోనె యసంతుష్టిని గలిగించి దుగ్గతులను దెచ్చి పెట్టెను. పన్ను లిచ్చు ప్రజలు కౌలుదారుల యధికారుల యొక్క దురాగతములకు నిలువ లేక త్రోవదోపుడులకును దిరుగుబాటులకును మొద లిడిరి.అన్యాయవర్తులగు కౌలుదారుల పక్షమువహించి దుర దృష్టులును . సుస్వభావులును నగుఁ బౌరుల పైకి దాడి వెడలి సై న్యాధికారులయిన ఆంగ్లేయులు వారల నన్యాయముగ నురుమాడవలసిన వారైరి.

రాజ్యాంగ సంస్కారము.

ఇట్లు చందూలాల్ రాజనీతివలస దేశమునందు దుస్థితి ప్రబలుట సహింపలేక 1820వ సంవత్సరమున సర్ చార్లస్ 'మెట్ . .

కాఫ్ ను ఆంగ్లేయ ప్రభుత్వమువారు రెసిడెంటుగాఁ బంపిరి. అతఁ డాంగ్లేయాధికారులను జిల్లాల కధిపతులను జేసి, ఆయామం డలముల యందు మండలాధి కారులును గ్రామాధికారులును రైతులనుండి వసూలు చేసికొనవలసిన మొత్తములను నియ మించి న్యాయమగు కౌలులనియ్య నేర్పఱచెను. ఆంగ్లేయ మం డలాధికారులు గడచిన ఫలములను బట్టియు సాగగుచుండిన ప్రదేశమును బట్టియు 'సాగుకాఁగల భూభాగమును బట్టియు బన్నులను దీర్మానము చేసిరి. వీరుపక్రమించిన సంస్కారము లైదుసంవత్సరముల కాలము పరీక్షింపఁబడెను. వానివలన కౌ లుదారులకును రైతులకును నిరంతర మగుచుండిన కలహము లణఁగిపోయెను. పన్ను వసూలు చేయుటకై దండుల విడియించు నాచారము దప్పిపోయెను. " దేశము శాంతిమై వృద్ధిపొంద మొదలిడెను. రాజ్యాంగము పై ప్రతిసంవత్సరము రగులుకో నుచుండిన యసంతుష్టి పోయి యనురాగ ముత్పన్నము కాజొ చ్చెను.

ఋణవిమోచనము.

ఈసంస్కారములతో గూడ రెసిడెంటు హైదరాబాదు నైజాముగారి యప్పుల విషయమునందు శ్రద్ధఁ జేసి రాజ్యాంగ మునకు భరింపరాని ఋణముల బాధనుండి విమోచన మొసం గవలసివచ్చెను. బహుకాలముగ హైదరాబాదునందు స్థాపిత మయి యుండిన పాల్మరు కం పెనీ వారు నైజామునకు సంవత్స

రమునకు 45 లక్షలవంతున నూటికి 25 వడ్డీ చొప్పున నప్పిచ్చ చువచ్చి యుండిరి. ఈయ ప్పేల చేయఁబడెనో "కారణము విశద ముగఁ గానరాదు. నైజామును మోసపుచ్చు నుద్దేశముతో చం దూలాలు చేసినపనియని మాత్రము గనుపట్టుచున్నది. ఎట్లై ననేమి? దీనివలన నాకం పెనీవారు దక్షిణాపథమున నైజామున కంటెను ఆంగ్లేయులకం టెను బలవంతులయు యుండిరి. ఇదేవిధ మున పురాన్ మల్ అనువాఁడు బీరారును గుత్తకు తీసికొని యచ్చట ప్రాముఖ్యత గాంచియుండెను. రెసిడెంటు మెట్ "కాఫ్ గారాకం పెనీని, ఈ పురాన్ మల్ ను నైజాముగారి సంబంధము నుండి తొలఁగించెను. నైజాము ఆంగ్లేయ వర్తక సంఘమువారికి గూడ నప్పుపడియుండెను. ఈఋణములన్ని యును దీర్చుటకు సాంగ్లేయ ప్రభుత్వమువారు నైజాము నకు ఉ తరసర్కారుల కై గట్టుచుండిన పేష్కష్ ను విడిపించుకొని రొక్కము కోటి అరు పదియారులక్షల అరువదియారువేల ఆరువందల అరునదియా' రు రూపాయల నిచ్చిరి.

నాజిక్ ఉగ్లైలా (1829-1857),

సికందరుజా రాజ్యాంగ విషయములలో బహు కాలము వి శేషము జోక్యముపుచ్చకొనుట మాసి వేసి మౌనమున కాల ముగడపుచునుండి 1829 వ సంవత్సరము 'మే నెల 24 న తేది పర లోకప్రాప్తిఁ బెందెను. అతనికిఁ దరువాత నాతనిపుత్రుఁడు నాజర్ ఉద్దౌలా సింహాసనమునకు వచ్చెను. ఆంగ్లేయ ప్రభుత్వము వారతనిని నైజామని ప్రకటించిరి. ఆప్రకటనాసమయమున జరి గిన రెండువిశేషములుమాత్రము గమనింపవలెను. అదివఱకును గవర్నరుజనరలు నైజాముగారికి వ్రాయుటలోఁ దన్ను “నాయజ్ మద్' అనఁగా 'కడు పేద' అను తక్కువను' నిరూ పించు పదములతో వర్ణించుకొనుచుండెడివాఁడు. 'నైజాము గారు గవర్నరుజనరలునకు వ్రాయు నెడ 'మాబు దౌలత్ ' అనఁ గా “ప్రభువులమగుమేము" అను గౌరవపదముల నుపయోగించు చుండును. ఆయలవాటును మావ్పించుటకును గవర్నరుజనర లును నైజామును బరస్పర సామ్యము నెఱుక పఱచు - మాటల నుపయోగించుటకును దగిన ఏర్పాటు చేయఁబడెను.


రెండవవిశేషము. ఆంగ్లేయ ప్రభుత్వము వారు నాజిర్ - ఉద్దౌలాను “ పట్టభద్రుఁడవగు నెడ' నీకు స్వాగతమనుటలో నిత రసామంతప్రభువుల కేరికిని యుపయోగింపని “ పట్టభద్రత్వము నుపయోగించుట.

తిరిగి చందూలాల్ దుష్పరిపాలన.

నాజిర్ -ఉద్దౌలా గద్దెనెక్కుట తోడనే తన రాజ్యము లోపలి రాజ్యాంగ నిర్వహణమునంతయును దానె చేసికొనెదన నియు మెట్ కాఫ్ వలన నియమింపఁబడిన ఆంగ్లేయ మండలాధి పతులను దీసి వేయ వలసినదనియు గవర్నరుజనరలుగారికిఁ దెలి యఁ జేసెను. - ఆంగ్లేయ ప్రభుత్వము వారును దానికి వల్లెయని

యంగీకరించిరి. మెట్ కాఫ్ చే నియోగింపఁబడిన ఆంగ్లేయాధి కారులు దొలఁగింపఁబడిరి. నైజామునకు అంతఃపరి పాలనయందు సంపూర్ణ స్వాతంత్య మియఁబడెను. ఇట్టి స్వాతంత్యమును గోరుటకు నై'జామును బురికొల్పినవాఁడు అతని ముఖ్యమంత్రి యగు రాజాచందూలాలని తోచుచున్నది. అతఁడు మొదట సర్వస్వతంత్రుఁడై రాజ్యభారము నిర్వహించుచుండి మధ్య కాల మున మెట్ కాఫ్ ఏర్పాటునలనఁ గొం చెము శ క్తిహీనత నంది యుండెను. కావున మొదటి స్వాతంత్యమును సంపాదించుకొ నుటకు చందూలాలే నైజాము చేత నాంగ్లేయ ప్రభుత్వము వారిని ఆంగ్లేయాధి కారులఁ దీసివై చునదని యడిగిం చెనని కొందఱభి ప్రాయపడియున్నారు. ఎట్లైన నేమి ఆంగ్లేయాఛిధికారులు దమయా ధీనముననుండిన జిల్లాలను ముఖ్యమంత్రి కప్పగించి వెడలిపో యిరి. చందూలాల్ మరలఁ దన మొదటి యాచారములను విడు వక రాజ్యమును నడుప మొదలిడెను. మరల మునుపటి విధము ననెకస్టములు చూపట్టఁ దొడంగెను. గొప్ప గొప్ప జమీందారు లుగ నున్న వారి చర్యలుగూడ నా క్షేపణీయమయ్యెను. పన్ను వసూలు తగాదాలు మిక్కుటముగాఁ జొచ్చెను. 1835 న సంవ త్సరమున ఆంగ్లేయనర్తక సంఘపు డైరక్టర్లు గవర్నగుజనరలు గారికి “(నైజాము) రాజ్యములో బహు కాలముగ నెలకొనివచ్చు చున్న అల్లరులను, అరాజకమును దాము ఉదాసీనభావమునఁ

జూచుచుండ లేమనియు అప్పటి ముఖ్యమంత్రి న్యాయమై దిట్టమగు పరిపాలనకుఁ దగినఏర్పాటుల నొనర్పఁడేని అమంత్రినిమార్చి. యవసరమగు నితర కార్యముల నెర వేర్చనలసియుండునని నైజా మును ఆంగ్లేయ ప్రభుత్వమువారు నిర్బంధ పెట్టవలసిన వా రగుదుర నియు నైజామునకుఁ దెలియఁ జేయ వలసినదని యుత్తరువుఁ బంపిరి.

దీనిపై చందూలాల్ ఏవోయొక కొన్ని మార్పు లాం గ్లేయ ప్రభుత్వము వారు జోక్యముకలుగఁ జేసికొని చేసిన బాగుం డునని నుడివెను. కాని దానికి నైజా మియ్యకొనఁడయ్యెను. *[12] అప్పుడు తాలూకుదారులు మున్నగు క్రింది యుద్యోగస్తులు దురా గతములకుఁ బోకుండఁ గని పెట్టుటకు అమీను లనువారు నేమిం పఁబడిరి. కాని వీరును విద్య లేని హీనజను లేగావున నీఏర్పా, టువలన నదివఱకుండిన దుర్మార్గుల సంఖ్యకు నింకను గొందఱు- చేర్చఁ బడిరి. ఇట్లగుట కొలఁది కాలములో నే నైజాము రాజ్యాంగ ము దురవస్థలయందు సంపూర్ణముగ మునిగిపోయెను. అప్పు లు రానురాను మెండయ్యెను. ఆదాయము లేదాయెను. చందూ లాల్ కొంత కాలము తనచాకచక్యమువలన రాజ్యభారము నిర్వహించెను. కాని హైదరాబాదునందలి సాహు కారుల కత ని పై నమ్మక ముదప్పి తమ బాకీలు దమకిచ్చి వేయ వలసినదని తొం

......................................................................................

దర పెట్టఁ బ్రారంభించుట తోడ నె యతనికూపిరి త్రిప్పుకొన వీలు లేకపోయెను. కావున నతఁడు నైజాములకు రాజీనామా నిచ్చి 1848 వ సంనత్సరము సెప్టంబరు నెల 6 వ తేది పదవిని వదిలి పెట్టెను.

ఆంగ్లేయుల పై కుట్ర.

ఈ లోపుగజరిగిన సంగతి నొక్కటి నిట వ్రాయవలసి యున్న ది. 1839న సునత్సరమున ఒక పెద్ద కుట్ర యొకటి బయ ల్పడెను. ఉదయగిరి నవాబు ముఖ్యుముగ భరతవర్ష మునం దలి ప్రభువుల నేకులు చేరి ఆంగ్లేయులను బారదోలుట కొక విస్తారమగు కుట్రఁ బన్ను చుండుటను అప్పుడు నెల్లూరు నందు దండవిథాయకుఁడగు (magistrate) నుండినస్టోను హౌసు అను నతఁడు గనిపట్టెను. ఆకుట్రయందు నైజముగారి సోదరుఁడగు ము బారిజ్ -- ఉద్ దౌలా , గూడ కలఁడను హేతువు చే హైదరాబాదునందు రెసిడెంటుగారి యాధి పత్య ము క్రింద ఐరోపియనులును ఉత్తమస్వ దేశీయులును పంచా యతిగఁ జేరి యాకుట్రను గుఱించి గొప్ప విచారణ జరిపిరి. పదిమాసములు వ్యాయోగము నడచిన తరువాత ముబారిజ్ - ఉద్ - దౌలాయును నతని మిత్రుల నేకులును ఉదయగిరి నవా బుతో నుత్తరప్రత్యుత్తరములు సలిపి, మతా వేశ పరవశులగు వహబీల కుద్రేకమును బుట్టించి, చూగ్లేయులను భార దోలు నుద్దేశముతోఁ గుట్రపన్ని ఆంగ్లేయ ప్రభుత్వమునకును

హైదరాబాదు ప్రభుత్వమునకును విరోధమగు విధమునఁ బ్రవ ర్తించిరని పంచాయతీదారులు అభిప్రాయపడిరి. వీరి నేర్పఱ చిన యధికారులీ యభిప్రాయముతో నేకీభవించిరి. కావున ముబారీజ్ - ఉద్ - దౌలాను అతని మిత్రులను ప్రభుత్వమువా రవసరమని తలఁచినంత కాలమును చెఱయందిడుట నిర్ణయింపఁ బడెను. అతఁడు గోలకొండయందుఁ గారాగృహమున నుండ గనె మృతి మొందెను.

అల్లరులు— కారణములు

.

1841-42 సంవత్సరములలో నైజాముగారి దేశమం దంతటను అల్లరులు మిక్కుటముగ నుండెను. వీనినణఁచు టకు తాలూకుదారుల సిబ్బందీ లేమియుఁ బనికి రాకుండెను. దీనివలన నీయల్లరులు బలవంతమైనవని తలఁపరాదు. పరి శ్రమఁ జేసిన సైనికు లొక కొందఱు ఈయల్లరుల కన్నిటికిని చాలియుండి రనిన నైజాముగారి మాండలిక సిబ్బందు లేగతి యందుండినదియును విశదముగాఁగలదు. చందూలాల్ మంత్రి యగుటతోడనే రెసిడెంటు జోక్యముక లుగఁ జేసికొని సంస్క . రించి పెట్టిన సైన్యముదప్పుఁ దక్కిన రాజ్యాంగము లన్నిటి యం దును శైథిల్యము ప్రతిదినమును హెచ్చుచుండెను. కావున నల్లరి గాండ్రకు సమయము మిక్కి.లిచక్కనిదిగ నుండెను. ఈ యల్లరు లెట్లు పుట్టు చుండెనో వీనికిఁగారకు లెవ్వరో నిర్ణయించుట గస్టము. దక్షిణాపథముదలి మహారాష్ట్ర ప్రభువు లివ్వానికి


జనకులనుటకు గొన్ని కారణములు గలవు. (1) హైదరాబాదు నందీయల్లరి కాండ్ర ప్రతినిధులు మహారాష్ట్ర బ్రాహణు లుగ నుండుట (2) మూకలనాయకులు పదభ్రష్టుఁడయి యుండిన నాగపురపు రాజగు అప్పాసా హేబ్ పేరుఁ బెట్టుకొని వెలఁగుచుండుట(3)దక్ష్మిణమహారాష్ట్ర దేశమున నైజామునకుఁ జేరిన బాదామికోట ఒకమహారాష్ట్రుడే పట్టుకొనుట. కొన్ని యల్లరులకు ముఖ్యమంత్రిగారో లేకున్న తప్పక వారిపుత్రుఁడో ఉత్తరవాదులని యొక చరిత్రకారుఁడు వ్రాయుచున్నాఁడు.[13] *

ఆంగ్లేయుల అభిప్రాయములు.

1848 వ సంవత్సరమున రాజచందూలాల్ రాజీ నామానిచ్చి పనినుండి తోలఁగిపోయిన తరువాత నైజాము రాజ్య కార్యములను స్వయముగ నడుపఁబూనుకొనెను. అంతకుఁ గొంచెము మునువు చందూలాల్' ఆంగ్లేయధి కారులను మరల నేమించుట కొప్పుకొనినను, నైజా మంగీకరింపఁడయ్యెను. ఆ సమయమునం దాంగ్లేయవర్తక సంఘమువారి డైరక్టరులు గవ ర్నరు జనరలు గారి కీ క్రింది విధమున వ్రాసి:-

“(నైజాముగారి) రాజ్యాంగమునందు మనము దగిన సంస్కారములు చేయ మూకు శక్తినిచ్చుటకుఁ గావలసినది నైజాముగారు రాజ్యాంగ విషయములలో మాత్రము జోక్య ము కలుగచేసికొనుట లేదను దృడవాగ్దానమే. ఇదివటికే .........................................................................

అతఁడు విశేషము జోక్యము కలుగఁ జేసికొను చుండుట లేదు. (పై వాగ్దానము చేసినచో) ముఖ్యమంత్రి సాహాయ్యర్థ మెప్పు డును రెసి డెంటుగారి వంకకే తిరుగఁగలఁడు. నైజాముగారు తమ ముఖ్యమంత్రిపై నేలాటి యధికారమును చెల్లించకుందు నను వాగ్దానము చేయుటకుఁ దగిన కాలము రాజ్యాంగ నిర్వ హణ కార్యముల కష్టమునలన నిప్పటికే వచ్చినది. రాకున్న నదియెంతో దూరము లేదు. అట్టి ఏర్పాటువలన మనకుఁగల యుద్దేశము లుచితరీతి నీడేరగలవు. ఆఏర్పాటులలోను నైజాము గారు కర్చులుపోఁగా నిలువ యుండు నాదాయమును గొనుచు రెసిడెంటుగారి బోధల ననుసరించియు నతనియనుమతిమీఁదను ముఖ్యమంత్రి యుపక్రమించు సంస్కారముల కడ్డుపడక ఆర్థిక విషయమున దేశము బాగుపడుటను గని పెట్టియుండురీతి నొక నిబంధన నిర్మింపఁబడిన విశేష లాభ కారిగ నుండును” దీనింబట్టి నైజాముగారు స్వయముగఁ బరిపాలింపఁ జూ చుట వారి కెంత సమతముగ నుండెనో మనమెఱుంగఁ గలము. చందూలాల్ రాజీనానూకు నంగీకారమిచ్చు నెడ నైజూము మఱియొక మంత్రిని శీఘ్రకాలములోనే ఏర్పఱతునని నుడివి యుండెను. నైజాము స్వంతముగ రాజ్యాంగము నడపుటలో నతనికిఁ సాయము చేయ నీడగువారు గూడ నెవ్వరును లేరైరి. కావున నతఁడొక్కరుఁ డెంతపాటువడినను చందూలాల్ కాల

మున చెల్లా చెదరై చెడిపోయిన రాజ్యాంగ విషయములు త్వరితగతి కుదురుపడనయ్యెను.


నైజముగారి సైన్యమునకయి నైజాము ఆంగ్లేయులకుఁ బ్రతిసంవత్సర మియ్యవలసిన పైకము బాకీపడియెను. రెసిడెం టుగా నుండిన జనరల్ ( ఫేజరు ఆంగ్లేయ వర్తక సంఘమువారి బొక్క సమునుండి యియ్యదొడంగి గవర్న రుజనరలుగా రి కాసం గతిం దెలుపుచు దాను భూమిని జామీనడుగ లేదని వ్రాసి ముందు మరల నీరీతి సందర్భము లే సంఘటిల్లిన నేమి సేయ వ లెనని యడిగెను. దానిపై గవర్నరు జనరలు దమబొక్క సమునుండి యిచ్చచుండవలసినదని యుఁ దగిన కాలము లో నీ యప్పులు దిర్చక పోయిన చో నైజాము గొంత భూభాగమును దమస్వాధీనము చేయు నట్లేర్పఱచ వలసిస దనియుఁ బ్రత్యుత్తర మిచ్చెను. రెసిరెంటుగారికిఁ దెలియఁ జేసిన యీసంగతులు నైజాముగారికిఁ గూడఁ దెలుపఁబడెను.

నైజామొంటరిగ బహు కాలము మరి శ్రమ చేసి చేసి కట్ట కడపట 1846 వ సంవత్సరము నవంబరు నెల 7 న తేది సురాజ్ -ఉల్-ముల్క్ ను ముఖ్యమంత్రిగా నేమించుకొనెను. ఇత నికినీ నైజామునకును సరి పడినదిగారు. రెసిడెంటున కితని పై నెక్కుడభిమానము. ఇతనిని నైజాము తీసి వేయ నుద్యుక్తు డయ్యెను. ఆవిషయమున నతనికిని ఆంగ్లేయ ప్రభుత్వము వారికిని బహుదూరము చర్చ జరిగెను. తుట్టతుదకు సురాజు

ఉల్-ముల్క్ పనినుండి తీసి వేయఁబడియెను. ఇతని స్థానమునఁ దత్కాలమునకు ఆమ్మద్ ఉల్ ఉముల్ కును దరువాత షంష్ - ఉల్ - ఉమ్రాయును "నేమింపఁబడిరి.

పంష్-ఉల్-ఉమ్రా మంత్రిత్వము వహించిన దైదుమా సము లే గాని ఆపదవి నున్నంత కాల మతని ధరర్మముల నతఁడు చక్కఁగ నెర వేర్చెను. అతఁడు ఆంగ్లేయులకు నైజామియ్యవల సిన యప్పు పైనగు వడ్డీ నెల నెలకును ఇచ్చి వేయఁబడుననియు అస లు వాయిదాలమీఁద సంవత్సరమున కైదులక్షలు దీర్పఁబడు ననియు రెసిడెంటు ద్వారా గనర్నరుజనరలుకు వ్రాయించెను. గవర్నరు జనరలుగారు నైజామునకుఁ దాము ద్రవ్యమిచ్చినది స్నేహభావమున నిచ్చిరనియుఁ గావున నంతయునొక్కమారి చ్చుట కేర్పాటులు చేయవలసినదనియు, బ్రత్యుత్తరమిచ్చిరి. సంష్-ఉల్-ఉమ్రా ముత్రిగనున్నంత కాలము నెల నెలకగు నడ్డీ మొత్తము మాత్రముదప్పక దీర్చఁబడుచుండెను. అయిన నతఁడు నైజాము వ్యయపరుడై నందునఁ దన కేమియుఁ జేయవీలు లేక పోయెనని విసుగుకొని తనపదవికీ - 1849 వ సంవత్సరము మేనెలలో రాజీనామా నిచ్చెను. షంష్-ఉల్-ఉం రా. ముఖ్య మంత్రిగానుండి యన్ని కష్టములకు నోర్చుకొని తన ధర్మమును నిరాతంకముగ నెర వేర్చినందులకు గవర్నరుజనరలుగారు తమ సంతసమును దెలిపిరి.

సైన్య సమ స్య

ఆంగ్లేయులకు నైజామప్పువడుటకు ముఖ్య కారణము నైజాము సైన్య మేయనుట మాచదువరు లిదివఱ కే గ్రహించి యుందురు. సాహాయ్య సైన్యమను నదొక్కటేర్పడుటయు అది మొదట మొదట నైజామునకు వలసినప్పుడు పంపఁబడు చుండుటయు దానికగున్యయమునకు గాను ప్రారంభమున ఉత్తర సర్కారుల గుత్తలోనుండి కొంత భాగము చెల్లువడు చుండుటయు తరువాత ఉత్తరసర్కారులును దత్త మండ లములును 1[14] ఆంగ్లేయులకు సంపూర్ణముగ నియ్యఁబడుటయు మున్నగు విషయము లెల్లయు నిదివఱకే వ్రాయఁబడియున్నవి. ఆ నైజాము సైన్యమునకును ఈసాహాయ్య సైన్యమునకును సంబంధము లేదనుట ముఖ్యముగ జ్ఞాపక ముంచుకొనవలెను. సాహాయ్య, సైన్యము మొదటినుండియు సర్వమా గ్లేయుల దే. ఈనైజాము సైన్యపుఁ జరిత్ర వేరు.

ఇది ప్రారంభమున బహుకాలము వఱకును వైజాము గారి దే. దీనికి సాహాయ్యముగ నాంగ్లేయుల స్నేహమునలన 1766వ సంవత్సరమున సాహాయ్య సైన్య మేర్పడెను. సాహాయ్య సైన్యమే సంధివలన నేర్పరుపఁ బడెనో ఆసంధివలననే ఆంగ్లే యుల కవసరమగు నప్పుడు ఈ నైజాము సన్యమున నిర్ణీత .................................................................................

1

మయిన కొంత భాగము పంపఁబడవలసి నట్లేర్పఱుపఁబడెను. ఈయొడంబడిక కనుకూలముగ నైజాము ఎల్లప్పుడును నడుచు కొన లేనందునను నైజాము సైన్యము ఆతని యధి కారుల ఆధీనమునం దున్నంత కాలము అంగ సంపూర్ణత నందకుండు టను బట్టియు ఆంగ్లేయపక్ష పాతి యగు చందూలాల్ ముఖ్య మంత్రి యయిన తరుణమున నాంగ్లేయ రెసిడెంటు ఈనై జాము సైన్యమును సంస్కరించి దాని పై ఆంగ్లేయాధికారుల నియో గించెను..[15] నాఁటనుండి ఆ సైన్యము నందుండు ప్రతి సైనికు నకును అధికారికిని జీతమునకై ఒకవిధముగ రెసిడెంటు ఉత్తర వాది యాయెను. దానివలన నైజాము ఈ సైన్యములకు ఇయ్య వలయు జీతముబత్తెముల నియ్య జాలని తరుణములలో ఆంగ్లేయ వర్తక సంఘము వారు తమబొక్క సమునుండి యియ్యం దొర 'కొని ఆ మొత్తమును నైజాము లెక్కల కెక్కించుచు వచ్చిరి. ఇట్లేర్పడిన ఈసాహాయ్య సైన్యము నైజాము సైస్యము లేగాక వైజామున కితరడండులు గూడ చిల్లరచిల్లరగ నుండెడివి. వెనుక రెయిమండను ఫ్రెంచినాయకుని గూర్చియు అత నిచే నైజాముగారి యుత్తరువుమీఁద గూర్పఁబడిన దండును ..........................................................................................

1

గుజించియు ఆంగ్లేయులకును ఫెంచి వారికిని వచ్చిన సంఘర్ష ణముల వలన నది బ్రద్దలగుటను గూర్చియు వర్ణింపఁ బడియెను, ఆదండులకు సమకాలికముగను తరువాతను నైజాము వద్ద పేరువడసిన యరబ్బీలు, సవాళులు, మక్సబు దారులు, రోహలా లు, సీక్కులు, తుర్కీ- వారు మొదలగుబుటులు ఏబది వేల కుం, డెడివారు. వీరందఱును నైజాము స్వంత సిబ్బందీలో చేరిన వారు. వీరికతఁడె జీతముబ త్తెముల నిచ్చుచుండెడి వాడు. ప్రప్రథ మముస వీరుపయోగ కారులుగనుండుచు యుద్ధములలోఁ దమ యజమానునికి మహోపకారులుగ నుండిరి.. కాని సాహాయ్య సైన్యమును నైజాము సైన్యమును జక్కఁగ నేర్పడిన తరువాత వీరికంత అనుభవానుకూలములు లేకపోవుట వలన వీరురాను రాను పొగరుబోతు లై నైజామునకే అపకారులగు సంత స్థితికి వచ్చియుండిరి. కాని వీరలకియ్య వలసిన వేతనములు మాత్ర ము నైజామున కియ్యక దీరకుండెడిది. ఇట్లు వర్ణితమగు నీసం దర్భములను బట్టియు నటనట సూచింపఁ బడిన ఇతర కారణ ములను బట్టియు నైజాము నార్థిక స్థితి (Financial condition, పలుమారు అతనికి వ్యసములు దెచ్చి పెట్టు చుండెను.

ఋణ ప్రదాతలయెత్తిడి.

నైజాము ఆంగ్లేయ వర్తక సంఘము వారికి అప్పుపడి యుండిన మొత్తము 1850 వ సంవత్సరము డిసెంబరు 31 న తేదీకి లోపుగ నియ్యవలసినదనియు అట్లు చేయని .

యెడల గవర్నరుజనరలు ఆంగ్లేయవర్తక సంఘము వారికి న్యా యమునడపుటకు వలసిన కార్యములకుఁ బూనవలసిన వార గుదురనియు రెసి డెంటు నైజామునకుఁ దెలియఁ జేసెను. 1850 న సంవత్సరము ఫిబ్రవరి మాసము వరకును కాలము గడచి పోయెను. అప్పటికిని నైజాము రాజ్యాంగ వ్యవహారములయందు తగిననూర్పులు గనుపించ లేదు. కావున బహుకాలముగ నైజా మునడవడిని గని పెట్టియుండిన రెసిడెంటు ఫ్రేజరు బీరారునం దలి స్థితిగతులను గుఱించి వ్రాయుచు “ఏమంత్రి ఏర్పఱుప బడినను అతఁడు రాజ్యాంగ కార్యములను నెరవేర్చుటకు సంపూర్ణ స్వాతంత్యము గలవాడుగ నొనర్పఁబడ వలె”నని నైజామునకుఁ దెలియఁ జేయుట ముఖ్యతమమనియెను. ఈవిష యమున జనరల్ ప్లేజరు నైజాముతోఁ గలిసి మాట్లాడుటకు నుత్తరువుగొనెను. తాను సింహాసనారూఢుఁడయి నపుడు మంత్రుల నేరుకొను స్వాతంత్యము తనకు గలదని అప్పటి రెసిడెంటు నుడివి యుండుటను నైజామా సందర్భమున జ్ఞాపక , పరిచెను. దీనికి జనరల్ ఫ్రేజర్ , వల్లెయని అప్పుడు పేష్కా రుగానుండి దివానుపనులను గూడ అసమర్ధతతోఁ జూచుకొను చుండిన రాజారాం బక్షి గారిని దీసి వేసినను దీసివేయుననియు లేకున్న వేరొక్కరుని దివానుపనికిమాత్రము "నేమించుననియుఁ దలంచి తన సంభాషణమును ముగిం చెనఁట.

1851 వ సంవత్సరము ప్రారంభమాయెను. నైజామున కాంగ్లేయుల ఋణమును దీర్ప నియమితమయి యుండిన గడువు మారిపోయెను. కావున రెసిడెంటు నైజామును జూచి యతనికి గవర్నరు జనరలుగారి యసంతుష్టిని తెలియఁ జేసెను. ముఖ్య మంత్రిపదవికిఁ దగువాఁడు ఏర్పడకుండుటనలన రాజ్యమరాజక ముగ నున్నదనియు నట్టియ రాజక పుస్థితికి తాముమిక్కిలి వగచు చుంటిమనియు కూడ జనరల్ ఫ్రేజర్ ముఖమున గవర్నరు జన రలుగారు తెలియఁ జేసిరి. నైజాము రాజ్యములో కొంత భాగ మునుస్వాధీనము చేసికొని పరిపాలించి దానిమూలమునఁ దమ కతఁడు బాకీపకిన ధనము రాఁబట్టు కొనవలసిన దేగాని యితర విధములఁ తీరదని రెసిడెంటు తెలియచే సెను. దానిని గవర్నరు జనరలును ఒప్పుకొనెను. కాని ఆ ఏప్రిల్ మాసమునందే గణేశ రావు దివానుగ నియమింపఁబడెను. ఇతఁడసమర్థుఁడనుట బహు స్వల్ప కాలములో నే విశదమయ్యెను. ఆ గ్లేయ ప్రభుత్వము వారికి రావలసిన పైకము ఇతని శక్తి వలన వచ్చుటకల్లయని తెల్ల మయ్యెను. అందువలన గవర్నరుజనరలుగానుండిన లార్డుడాల్ హూసీ నైజాము బాకీపడిన మొత్తము తీరుటకై అతని రాజ్య . మునఁ జేరిన బీరారును, అచ్చటినుండి పోలాపురము వఱకుం గల భూభాగమును, కృష్ణా తుంగభద్రల మధ్యప్రదేశ మగు రాయచూరు మండలమును, సర్వాధికారములతోఁ దమకు నిచ్చి వేయవలసినదని నైజామునకు వ్రాసెను. సాధ్యమయినంత

దనుక పరిశ్రమఁ జేసి యీయవస్థ మూడకుండునట్లు చేసికోన నిచ్ఛగలవాఁడయి నైజూము 1851వ సంవత్సరము జూన్ మాస ములో సురాజ్-ఉల్ ముల్క్ ను రెండవమారు ముఖ్యమంత్రిగ నేర్పఱచికొని రెసిడెంటుతో ఋణమున నర్థభాగము వెంటనె తీర్పఁబడుననియుఁ దరువాత నక్టోబరు మాసాంతమునకుఁ దక్కిన యర్థభాగము దీర్పఁబడుననియు నొక్కి చెప్పెను. తన సైన్య మునకు నగు వ్యయములను గ్రమముగ నిచ్చుటకొఱకు కొన్ని తాలూకాల వసూలును ప్రత్యేకించి పెట్టితినని కూడ నుడి వెను. దీనినంతయునువిని 'రెసిడెంటు మనస్సమాధానమునంది కొంత కాలము వేచియుండ నియ్యకొనియెను. ఆగస్టు 15వ తేది నైజాము దన వాగ్దానము ననుసరించి మొదటి కిస్తీని గట్టి వేసెను. 1[16] అప్పటికి రు 32, 97, 702,లు బాకీయుండెను. ఆ మొత్తమును దీర్చుట కేర్పడిన వాయిదా గడచి పోవుటతోడనే రెసిడెంటు ఆసంగతిని గవర్నరు జనర లునకుఁ దెలియఁ జేసెను. నైజాము అప్పంతయుఁ దీరువవలయునను దీక్షతోనున్న వాఁడను నమ్మ కము దట్టినందున గవర్నరు జనరలు నైజాము చేసిన నాగ్దాన ములకు సమ్మతించుచు కిస్తీలమీఁద పైకమును దీసికొనుట కంగీ కరించెను. కాని కొంత భామీయఁబడినందునఁ దక్కిన భాగ మీయకున్నను తొందర లేదని నైజాము దలంపకుండును గాత .............................................................................

1.

మని, దృఢముగ రెసి డెంటు నైజూమున కెఱుక పరచి యుం డుట దనకు సమ్మత మేయని తెలిపెను. తరువాత గొంతకా లము వఱకును వివరింపవలసిన విశేషము లేమియు లేవు. 1852వ సంవత్సరము నవంబరు నెలలో రెసిడెంటు ఫ్రేజరు రాజీనామా నిచ్చెను. కర్నల్ లో అతని స్థానమున విచ్చే సెను. ఇతఁడు నైజాము సైన్యమునకుఁ బ్రతిమాసమును ఆంగ్లేయ ప్రభు త్వము వారిబొక్క సమునుండి యేజీతములిచ్చి. తీరవలసివచ్చెను. మూఁడు నెలలలో 1858వ సంవత్సరము మార్చిలోపల నైజూము గారి యప్పుమరల నలువదియైదులక్షలయి యుండెను. గవర్నరు జనరలుగారు : రెసిడెంటు నకు నైజూము యొక్క యంగీ కార మును స్వీకరించుటకయి క్రొత్తసంధినొకదానిని చిత్తువ్రాసి యంపిరి. కర్నల్ లో నైజామున కద్దానిని వినిపించి యతనితో జర్చింప నేర్పఱచు కొనెను. ఈసందర్భమున నైజామునకును అతనికిని కొంచెము కఠినమగు సంభాషణలును ఉత్తర ప్రత్యుత్త రములును నడవవలసివచ్చెను.

అప్పుడు రెసిడెంటు తెలియపఱచిన సంధిషరత్తులలో బీరారుమున్నగు ప్రదేశమును శాశ్వతముగ నాంగ్లేయ ప్రభు త్వమువారికి నైజాము ఇచ్చి వేయ వలయు ననునది యొక టి. రాజ్యములో "నేమాత్రమైనను ఇతరుల కిచ్చుటగాని ఒకప్పుడు తనకయి ధైర్యముతోఁ బోరాడిన బంటులను దనసామీప్యము నుండి తొలఁగించుటగాని ఱేనికి మహావమానకర కార్యములని

నై జూముగారి గట్టినమ్మకము. కావున నీ రెంటికిని తానియ్యకొనఁ జాలనని నైజాము రెసిడెంటుతో నీసంధివిషయమయి చర్చిం చుటలోఁ బలుమారు తీవ్రముగ నుడివెను. ఈచర్చ కయి రెసి డెంటు నైజాములును, రెండు పక్షముల ప్రతినిధులును అనేక సర్యాయములు గలసి సౌమ్యముగను ఆగ్రహముగను, తిన్న గను గట్టిగను, భూషించుకొను చును ధిక్కరించి కొనుచును సంభాషించి. నైజాము ఆసుభాషణ యందు మహారాష్ట్రు లును టిప్పూ సుల్తానును లోబడి పోవుటతోడనె తన సైన్యమున కవసరము దీరిపోయెనని యొక పర్యాయమును, దన కా సైన్యము ప్రస్తుత ముండవలసిన దే యని మఱియొక తరుణమునను,, ఆంగ్లేయులు డబ్బు సంపాదించుటకుఁ బ్రయ శ్నించువారే యని యొక వేళను, దనకు సామంతుఁడుగ నుండిన కర్నాటకపు , నవాబునుండి ఆ ప్రదేశము , లాగు కొనఁబడినపుడు తన భాగము దనకియ్యం బడ లేదని మయొక వేళను, నిలువయుండిన అప్పులకుఁ దన మంత్రులేగాని తా నుత్తరవాది కాఁ జాలనని యొకమారును, నాలుగుమాసముల వ్యవధినిచ్చిన తాను భారము పై మోపికొని అప్పటికి బాకీప డుమొ త్తమును దప్పక ఇత్తునని మఱియొక తూరియు, నిప్పగిది బహుభంగుల డోలాయమాన మానసుఁడై నుడివి కట్టకడప టికి " ఆంగ్లేయ ప్రభుత్వము వారడిగిన ప్రదేశమును ఆంగ్లేయుల కునుఁ దనకుమున్ను మంత్రిత్వము సలిపిన షంష్-ఉల్- ఉమ్రా


కును గొంచీగా అనుభవమున కిచ్చెదనని యుపక్రమించెను. అదియు కుదిరినది కాదు. తుట్టతుదకు 1858వ సంవత్సరమున కొద్దిమార్పులతో రెసిడెంటు'లో' మొదటఁ దెచ్చి యిచ్చిన చిత్తు ననుసరించియే సందిజరి గెను.

తీర్మానపుసంధి (1838).

ఈసంధివలన నైజాము సైన్యము సంపూర్ణముగ నాంగ్లే యుల యధీనము క్రింది కే పోయెను. దానికి ' హైదరాబాదు కంటింజెంటు సైన్యము' అను పేరిడఁబడెను. దానికగు వ్యయమున కయ్యును, అప్పుపై వడ్డి కొఱకును, కొన్ని ఇతర కర్చులకును నైజాము ఆంగ్లేయ ప్రభుత్వము వారికి బీరారు మున్నగు ప్రదేశములను సర్వస్వతంత్రములతోఁ బరిపాలింప నిచ్చెను. కాని వారుమాత్రము ప్రతి సంవత్సరమును అతనికి దానిని గుఱించి న్యాయమగు లెక్కలనుజూపి కర్చులు పోఁగా మిగత పైకమును అతని బొక్క సములోనికిఁ గట్టునట్లే ర్పటుపఁ బడెను. 1800 సంవత్సరపు సంధిననుసరించి నైజాము ఆంగ్లే యుల సాహాయ్యర్థమయి యుద్ధ సమయములఁ గొంత సైన్య మును బంపవలసి యుండెనుగదా!! హైదరాబాదు కంటింజెంటు సైన్యము" ఏర్పడి ఎల్లప్పుడును సిద్ధముగ నుండునట్లు స్థిరపడి నందున ఈషరత్తు రద్దుచేయఁ బడెను. .


ఈసంధిజరిగిన తరువాత నాఱుదినములకు దీనికె మిక్కిలి పాటుపడిన నైజాముగారి మంత్రియగు సురాజ్ - ఉల్ - ముల్క్ పరలోకప్రాప్తి జెందెను. నైజామప్పుడు ‘మహాసర్ సాలార్ జంగు' అను బిరుదు పేరుగల మీద్ - తురాబ్ -ఆలీ అను సురాజ్-ఉల్ముల్కు అన్న కుమారుని, మంత్రిగా నియమించెను


సక్ సాలార్ జంగు 1828 సంవత్సరము జనవరి నెల 2 వ జన్మమందెను. 1847 వ సంవత్సరమున అనఁగా పందొమ్మి డేండ్ల ప్రాయముననే యితఁడు కమ్మం మెట్టుకు తాలూకు దారుగ నేమింపఁబడెను. ఎనిమిది నెలల కాలము లోపల నాపనికివలసిన జ్ఞానమునుసంపూర్ణముగ సంపాదించెను. 1853వ సంవత్సరమున పినతండ్రి మరణానంతరము ముఖ్యమంత్రిగ నాజర్ -ఉద్-దౌలా వలన నేమింపఁబడినతరువాత నితఁడు గనుపఱచిన రాజ్యభార నిర్వహణశక్తినలన నీతని పేరాచుంద్రతారార్క-ముగ హైదరా బాదు చరిత్రమునందు వెలయుచున్న ది.

రా జ్య స్థితి.

సాలార్జంగు సచివత్వమునకుఁ బూనునప్పటికి నైజాము రాజ్యము మహాదుర్దశలలో మునిఁగి యుండెనని చెప్పుటకు 1858 వ సంవత్సరపు సంధికం టెను వేరొండు నిదర్శన మవసర ము లేదు. ఆంగ్లేయు ప్రభుత్వము వారి కియ్యవలసియుండిన ఋణ మాసంధివలన రద్దుపడియుండినను చిల్లర సైన్యములకు బహు

కాలముగ జీతము అప్పుపడుచునే వచ్చియుండెను. స్థానిక వణిక్కులకు నైజాము ప్రభుత్వము వారు బాకీయైన మొ త్తము మిక్కిలి గొప్పదిగనుండెను. మన్ సబ్ దారులకును జీతముబత్తె. ములనిచ్చుటకు పన్ను లువచ్చు మార్గములు విశేషము గన్పించి నవి కావు. చిల్లర సైన్యముల ప్రతినిధులగు ఆరబ్బీ జమేదారు లును సాహుకారులును అప్పటి కాలమునకు హైదరాబాదు నందు ప్రముఖులుగ నుండిరి. పన్ను లును బలములును జమే దారుల చేతులలోను వైజాము రాజ్య నిర్వహణమునకు ముఖ్య మగు నార్థికశక్తి సాహుకారుల చేతులలోను జిక్కి యుండెను.

ఆర్థిక సంస్కారములు.

సాలార్ జంగ్ తనసత్యసంధత చేతను కార్యదీక్ష చేతను జమేదారులను,సాహు కారులను ముందు లోబరచు కొనెను. ఆధికారమునకు నచ్చిన కొన్ని నాళ్లలోపుగ నె నైజాముగారి బంధువులకును చిల్లర సేనలకును సేవకులకును నెలజీతముల నిచ్చుటయు, తాలూకుదారులను నియోగించు టయుఁ దొలఁగించుటయు, లెక్కలను బరీక్షించుటయు, వేతన ములను దగ్గించుటయు, అవసరమగునెడల క్రొ త్తగ దండుల నేమించుటయు, మున్నగు కార్యములు చేయుటకు స్వాతం త్ర్యమును ఇతఁడు నైజామునుండి సంపాదించుకొనెను. అవిధే యత సూపినచో సర్కారు వారికి అనఁగా నైజాము “నకు చేరిన దివానీశాఖ లోని వారినిగాని సైనికశాఖలోని . వారినిగాని శిక్షించుటకుఁ గూడ నితనికి అధికారమియ్యంబు డెను. అరబ్బీలబలమును స్వాధీనము చేసికొనుట సాలార్ జంగ్ యుషక్రమించిన మొట్ట మొదటి సంస్కారమ'. రాజ్యాంగపు శక్తిని నిర్మూలము సేయుచుండిన దండుగ దండులను బగులఁ

మహాసర్ సాలారుజంగు.


గొట్టుటకుఁ గూడ, బ్రయత్నములు ప్రారంభింపఁ బడెను. తాలూకుదారులందఱును దమతమ ఇలాఖాలోని అరబ్బీలను, రోహిలాలను, పఠానులను వారివారికి చెందవలసిన ద్రవ్యము . "నిచ్చి వైచి తఱుమవలసినదని యుత్తరువాయెను. అయిన నీయుత్త రువులు మొదట మొదట బహుస్వల్పముగ చెల్లించఁబడెననినచో నొకయాశ్చర్యముగాదు. సర్ సాలార్ జంగు మఱి యొక ఏర్పా టునుగూడఁ జేసెను. అరబ్బీలకును రాజ్యములోని యితరప్రజ లకునుగల లావా దేవీ లెక్కలను జనులకు నన్యాయము జరుగ కుండఁ దీర్చుటకుఁ దన నగరునం దే యొక క్రొత్త న్యాయస్థానము నేర్పఱచెను. ఈ న్యాయస్థానము ఆరంభమునుండియు మిక్కిలి యుపయోగకారి యయ్యెను. దీనివలన నియ్యఁబడిన తీర్పు లన్ని యు నక్కాలమున ప్రముఖులుగా నుండిన ఇద్దజు జమేదా రులున్యాయమని యొప్పుకొనుచు వచ్చిరి. దుర్మార్గులయి తిరుగఁ బడిన ఆరబ్బీలను బందీకరించుటకు (arresting) ఈజమేదారు ముఖ్యమంత్రిగా రధికార మిచ్చిరి. అట్లు బందీకరించుటలో నవసరమని తోఁచినయెడల నీ జమేదారు లెంతటి పనియైనను జేయవచ్చునని యాజ్ఞ. కావున వారు సర్ సాలారుజంగునకుఁ జేసిన సాయము అంతింతయని చెప్పనవసరము లేదు. ఇట్లు అరబ్బీ లపై సర్వాధికారులగు జమేదారులను దోడు చేసికొని సర్ సా లారుజంగు అదివరకు అరబ్బీల చేతులలోనికిఁ బోయియుండిన జమానులను మెల్ల మెల్లఁగ రాఁబట్ట మొదలిడెను. ఇందుఁ గొన్ని వేరు వేరు వ్యక్తులవలన కుదువ పెట్టఁబడినవి. మఱికొన్ని సర్ సాలారునకుఁ బూర్వముండిన మంత్రులచే అరబ్బీలకు సర్కారు రియ్యవలసియుండిన అప్పుల కై యిచ్చి వేయఁబడినవి. వీనిని మరల సంపాదించుటకై సర్ సాలారుజం గుపయోగించిన పద్ధ తిలో నేమాత్రము న్యాయవిరోధము లేదు. ఆతఁడు సర్కారు బొక్క సమునుండి యియ్యఁగలిగి నంత పైకమును అరబ్బీల బాకీల కిచ్చి వేయుచు నిలువయుండిన మొత్తములకు సాహు కారులనుజూమీను.ఇచ్చుచువచ్చెను. ఈసంస్కారముల నుపక్ర మించుటలో సర్ సాలారుజంగు పడిన కష్టములపరిమితి నిట వర్ణిం చుట అనవసరము, అయిన నితనియోరుపువల్లను కార్యసాధనా శక్తినలనను అవన్ని'యును సూర్యునియెదుట నంధ కారములు వలె నదృశ్యములాయెను. 1856 న సంవ్సరమున నతఁడు. హైద రాబాదు సంస్థానమునందు జరుగుచుండిన బానిసవ్యాపార మును చట్టము చే నిలిపి వేసెను.

ఆఫ్ జుల్ - ఉద్ - దౌలా (1857-1869).

పైనిఁ బేర్కొనిన సంస్కారములు గాక సర్ సాలారు అంతఃపరిపాలనయం దింకను విశేషమగు గొప్ప మార్పులు చేయవలసిన వాఁడై ఆ ప్రయత్నములయం దుద్యు క్తుఁడయి యుండెను. ఇట్లుండ 1857 వ సంవత్సరపు మహావిష్ణ వము తటస్థించెను. ఉత్తర హిందూస్థాన మంతయును ఆవిప్లవ దవానలంబునం బడి. మండుచుండెను. దాని యుష్ణము దక్షిణమునకు బ్రాకి హైదరాబాదును నావరించుకొని నైజామునుగూడఁ దనపక్షమునఁ జేర్చుకొనినచో నంతయుఁ బోయిన దనుకొనవలసిన దేయని హైదరా బాదునందు రెసిడెం


టుగానుండిన కర్నల్ డేవిడుసన్ అనునతఁడు గనర్నరుజనరలు గారికి వ్రాసెను. ఈగడబిడలు జరుగుచుండఁగ నే నైజాము నాజర్ ఉన్ రౌలా మృతి నొందెను. అతనికుమాఁగుడగు అఫ్ జుల్ . ఉద్ దౌలా నై జూముపట్టమునకు వచ్చెను.

మహావిప్లవవిచ్ఛేదనము.

అఫ్ జుల్ - ఉద్ధాలా సింహాసన మెక్కునప్పటికి దేశమంత యును ఆంగ్లేయుల పై తిరుగుబాటులతోడను తిరుగు బాటుల వార్తలతోడనునిండియుండుట ఇదివఱకు వ్రాయఁబడిన అంశము లను బట్టియే విశదముగాఁ గలదు. . క్రొత్తనై జాము గద్దెనెక్కిన కొన్ని గంటలలో ఢిల్లీ నగరము తిరుగుబాటు సేనలచేఁ జిక్కె ననువార్తనచ్చెను. హైద్రాబాదు నందును తిరుగుబాటుపరమున నుత్సాహము మెండుగ నుండెడిది. ఔరంగా బాదునుండి హైద రాబాదునకు వచ్చి చేరియుండిన యిద్దరు తిరుగుబాటు సైని కులను సర్ సాలారుజంగు బందీక రించి ఆంగ్లేయులకు ఒప్ప గించినందున అచ్చట నల్లకల్లోలము ప్రారంభమాయెను. తుదకు రెసిడెంటుగా రుండు ప్రదేశము తిరుగుబాటు లచే ముట్టడింపఁబడెను. కాని ముఖ్యమంత్రిగారి దూర దృష్టి వలన నిట్టి యుత్పాతముల నణఁచి వేయుట కదివఱ కే ఏర్పాటులు జరిగియుండెను. కావున తిరుగుబాటు హైద రాబాదునందు కొంచెమైనను .బలముతో నిలిచినది కాదు. దానికి ముఖ్య కారకులగు నిద్దఱును . పట్టువడిరి. . పారిపోవఁ

బ్రయత్నించుటలో నొక్కఁడు కాల్చి వేయఁబడెను. రెండవ వాడు ద్వీపాంతర వాసశిక్షనం దెను. ఇప్పగిది. బహుజాగ రూకతతో సర్ సాలార్ జంగ్ హైదరాబాదునందు తిరుగుబా టులు లేకుండునట్లు కాచి విప్ల వదుఃఖము విశేషము దటస్థిం పకుండున ట్లోనర్చెను. నైజాముగారి ముఖ్యమంత్రి నైజాము నకును ఆంగ్లేయులకును గల మైత్రిని దలంచి ఇంత పరిశ్రమ చేయుచుండినను నైజామును మాత్రము ఆంగ్లేయులు బహు జాగరూకులయి కనిపట్టియుండిరి,

విప్ల వపక్షమున నుండినట్లెన్నఁబడిన ఒక ఖైదీ మైసూరు నందు కమిషనరు గారి ఎదుట వాంగ్మూలములోఁ గొన్ని సంగ తులు నుడి వెనఁట. వాని మాటలలో గొన్నింటిని ఆంగ్లేయ ప్రభు త్వము వారు హైదరాబాదు రెసిడెంటునకు వ్రాసి పంపి నైజా మునకు తిరుగుబాటునకగు నూహలు లేవాయని పరిశీలింపమనిరి. దానిపై రెసిడెంటు తాను నైజామేమాత్రమును సందేహ పడుటకు వీలు లేనంతటి సూక్ష్మ మగు విధమున నతని చర్యలను జక్కఁగ పరిశోధింపించె ననియు, అతనియొద్దకు విప్లవపక్షులగు వారు వచ్చి తమ యుదంతము నంతయును జెప్పుకొనిరనియు, అద్దానినంతయును విని అతఁడు ఆంగ్లేయ ప్రభుత్వము వారికి వి రోధమగు నేకార్యమునందును జొరనియ్యకొన లేదనియుఁ బ్ర త్ళు త్తరము వ్రాసెను..[17] ...............................................................................

I.

ఈసందర్భమున రెసిడెంటునైజాము సైన్యమును గూడ మిక్కిలి చాతుర్యముతో నుపయోగించుకొనెను. హైదరాబా దునందా సైన్యమును నిలువనిచ్చినచో నుద్యోగ రాహిత్యమున నది ఏవేనియల్లరులకు మూలము గావచ్చనని తలంచి యద్దానిని ఉత్తర హిందూస్థానమున విప్లవకారుల నణచుటకై ఆయత్త పఱచి పంపి వేసెను. అచ్చట నీ సైన్యము ఆంగ్లేయులకు మ హూ' పకార మొనర్పఁగలిగెను. ఈ ప్రకారము ప్రాణము దీసెదమని ప్రతిపక్షులు పలుమారు జంకించుచుండినను వెనుదీనుక వైజా ముగారును నైజాముగారి ముఖ్యమంత్రియును, మహావిప్లవము జరుగుచుండు నెడకుఁ దరలి పోయి యుద్ధరంగమున నెనుకంజ వేయక నిలిచి నైజాముగారి సైనికులును, ఈవిపత్సమయమున నాంగ్లేయ ప్రభుత్వము వారికి ఉత్కృష్ట సాహాయ్యం బొనర్చిరి.

ఏప్లవ విచ్ఛేదనా ఫలితములు.

ఇట్లు సాలార్జంగు కలహ కారుల నిర్మూలించుట నలన గొందరికి కష్టముగా నుండెను గాబోలు. దీనివలననె తిరుగుబాటంతయు నణఁగిపోయిన తరువాత 1858న సంవత్సర మున ఒక విప్లవపక్ష పాతి సర్ సాలారు జంగును రెసిడెం టును గలిసిపోవుచుండ వారిరువురి పై గుండు పాఱించెను. దైవవశమునసది వీరికి తాకినది కాదు. హత్యను ప్రయత్నిం చిన ఆదురాగతుఁ డచ్చటనే మంత్రి యనుచరులచే ఖండిం పఁబడెను. 1861 వ సంవత్సరమున నైజముయొక్క యు సర్ సా

లారుజంగుయొక్కయు స్నేహమును ప్రేమను భ క్తిని అంగీకరిం చుచు వారికి గవర్న రుజనరలుగారు బహుమతులనంపిరి. ఆప్పు డు చేతికిచ్చిన బహుమతుల వెల ఇంచుమించుగ లక్ష రూపా యీలు. అదివఱకు నైజాము ఆంగ్లేయులకప్పుపడిన ఏబదిలక్షులు రూపాయలును రద్దుచేయఁబడియెను. ఇంతియేగాక నైజాము చే నా గ్లేయుల కదివఱకియ్యఁబడియుండిన రాయచూరు నల్దుర్గము ధారసియో జిల్లాలు తిరిగి అతనికి మరల్చఁబడెను. తిరుగుబాటు చేసిన వారలలో నెక్కఁడగు పోలాపూరు రాజుగారి సంస్థానము గూడ నైజామున కప్పగింపఁబడెను. నైజామునకు నైట్ గ్రాం డుకమాండర్ ఆఫ్ దిస్టారు ఆఫ్ ఇండియా' యను బిరుదొసంగఁ బడెను. సర్ సాలారుజంగునకును ఉచితరీతిసి బహుమానము లర్పింపఁబడెను.[18]

గ్రిబ్బిల్ అభిప్రాయములు.

ఈ బహుమానములను గుఱించి జె. డి. బి. గ్రిబ్బిల్ అను చరిత్రకారుఁ డీ క్రింది విధమున వ్రాయుచున్నాఁడు: ---

"1858 న సంవత్సరమున మనకు దత్తమయిన రాయచూరు మండలమును దిరిగియిచ్చితిమి. ఇదిమన యౌ దార్యమువలన నై నదనుట సమంజసముగా నుండదు. నై జాము సైన్యమునకగు వ్యయమున కై ఆప్రదేశము ఇయ్యఁబడి ............................................................................................. 1.


యుండెను. బీరారుమండలముయొక్క యాదాయముమాత్రమె అవ్యయమునకు వలసిన ద్రవ్యమును సమకూర్చు టేగాక ఇంకను ఎక్కుడుధనము నిచ్చుచుండెను. భారతవర్ష మునందు (స్వదేశ ప్రభువుల చే నాంగ్లేయులకు) ఒప్పగింతలు చేయఁబడిన ప్రతి మండల విషయమునను ఒప్పగించు నెడ వేయంబడు వరుంబడి లెక్కలు మిక్కిలితక్కువగ వేయఁబడుటయు, ఒప్పగింత జరిగిన నెంటనే సర్వే సెటల్ మెంటులు నడుపఁగాఁ దన్మూలమున ఛపా వణిసాగు విశేషము బయల్పడుటయు సర్వసాధారణములు, కాఁబట్టి రాయచూరు ముడలము 1858 వ సంవత్సరపు సంధి. షరత్తుల పూరీకరణమునకు అనవసరమయియుండెను. అందుచే నాస్వల్ప భూభాగమును నైజామునకు మరల్చట న్యాయాను కూలము. మాత్రమె.

““ 1853 వ సంవత్సరపు సంధి ననుసరించి మనకు నొప్పగింపఁబడిన సీమలవరుంబడిలో ప్రతి సంవత్సరమును నిలు వకాఁ గలుగు ద్రవ్యమును ఏయప్పుదీర్ప వినియోగింపవల . సినదని నిర్ణయింపఁ బడియుండెనో ఆ ఏబదిలక్షలఋణమును మన్నించి రద్దుపఱచితిమి. ఈ కార్యముమనము నైజామున కౌదా ర్యము సూపితిమని దక్పక తోపింపఁ జేయుచున్నది. కాని కొన్ని విషయములను మనము మఱువక జ్ఞాపకమునకు దెచ్చుకొనవ లె ను.మనకొప్ప గించబడిన సీమలుమన పారిపాలన క్రింది వచ్చియుం డిన ఏడుసంవత్సరములుగ, సంధి ననుసరించి ప్రతి సంవత్సరమును..

నైజామునకు మనము లెక్కలు చూపవలసినవారమే యైయుండి యు, ఆసీమల ఆదాయవ్యయ పట్టికలమాటయె ఎత్తికొని యుం డ లేదు. 1860 న సంవత్సరమున రాయచూరుమండలము నైజా ము సైన్యవ్యయములకయి. అవసరముగాదని మనమంగీకరించి యేయుంటిమి. కావున నంతకుఁ బూర్వము గొన్ని సంవత్సరము లు రాయచూరు మండలా దాయము (సుమారిరువదిలక్షలరూ పాయిలు మనచేతులలో నుండిపోవుటవలన నీఏబదిలక్షలురూ పాయిల ఋణమునందెక్కుడు భాగము తీరిపోయి యుం డెనని యే చెప్పమెప్పును. ఇంతమాత్రమే కాదు. హైదరాబాదు సంస్థా నమువారు మనకు గోదావరీతీరమునఁ గొన్ని తాలూకా లిచ్చె దమని యంగీకరించిరి. వానినుండి సంవత్సరాదాయము రెండు మూఁడులక్షలు.1[19].. ఇది నూటికి నాల్గువంతున వడ్డీయని యెన్ను కొనినచో నట్లయ్యఁబడిన తాలూకాలే పూర్ణ ఋణమును దీర్పఁ గల్గినవి

“మనము ఇచ్చిన మఱియొక వరమేమన హైదరాబాదుకు షోలాపూర సంస్థానమును వశపఱచుట. షోలాపురము హైద రాబాదుకు లోఁబడియుండిన ఒక చిన్న సంస్థానము. దానిరాజు

1.

1857 న సువత్సరపుఁ దిరుగుబాటు నందుఁ గలిసికొనెను. దాని వలన షోలాపురమును సాధించుటకు మన సైన్యములు వెడల వలసి వచ్చెను. అతఁడోడింపఁబడిన మీఁదట అతని రాజ్యము మన స్వాధీనమయ్యెను. అతనికి నైజాము యజమానుఁడై నందున ఆతని తిరుగుబాటు మన యెడల నెంతయే నైజాము నెడలను సంత యె. ఏదెట్లున్నను తిరుగు బాటునకుఁ బూర్వము షోలాపురము వలన మనకు నేలాటి ఆదాయమును ఉండినదిగాదు. నైజా ము మనకు సహాయుడుగ నుండినందున అతని సామంతుని దయిన పోలాపురమును మన మాక్రమించుకొనుట కేలాటి న్యాయాధారమును ఉండియుండదు.

"నైజాముగారు మన యెడల గనుపఱిచిన విశేషభక్తిని మెచ్చుకొనుచు 1860 వ సంనత్సరమున మనమతనికి నిచ్చిన బహుమానముల 1[20]నిట్లు విమర్శించి పరిశీలించినచో మనమాదా ర్యము సూపితిమని డంబము చెప్పికొన వీలు లేదు. హైదరా బాదు సంస్థానమునకు మొదట స్వంతములయియుండిన వానిని మనము మరలనిచ్చితిమి." .............................................................................................

1.

ఈ బహుమానములు సర్ సాలారుజంగు సంస్కార ములను నిరభ్యంతరముగ నెరవేర్చుటకుఁ దోడ్ప డెననుట నిర్వివాదాంశము.సర్' సొలారుజంగు ఉపక్రమించిన సం స్కారము లొక ' కొన్ని ఇదివరకే వ్రాయఁబడియెను. అవి యన్నియు నార్థిక సంస్కారములనియును దెలుపఁబడియె. అంతఃపరిపాలనా విషయమున సాలారుజంగ్ చేసిన మార్పులె నేఁటికిని మన్నింప బడుచున్నవి. హైదరాబాదు సంస్థాన మంతయును. పదునారు జిల్లాలుగ విభజింపఁబడెను. నాలుగు జిల్లాలు చేరి ఒకసుబాయని యేర్పరుపఁబడెను. ప్రతి సుబా కును నొక సుబేదారుఁడు సేమింపఁబడెను. 'అతని క్రింద జిల్లా పై అధికారియగు తాలూక్ దారుఁడు నియమింపఁబడెను. అతని సాహాయ్యు లే రెండవ మూఁడవ నాల్గవ తాలూక్ దారులని పిలువఁబడుచున్నారు. ప్రతి తాలూకాయందును తహశీల్ దారు లేర్పఱుపఁబడిరి. తహశిల్ దారు పదము వివరించుటనవసరము. జిల్లాయధి కారులే న్యాయాధిపతులుగ నుపకరింపవలసినదని తీరానింపఁబడెను. ఇది అనానుకూలమును అనర్ధదాయకమును నగు తీర్మానమే యని యొప్పుకొనక తీరదు. ఇందు విషయమై హైదరాబాదు సంస్థానమున సంస్కారము జరుగ వలసియే యున్నది. కాని సర్ సాలారుజంగ్ ఈఏర్పాటు చేయుటయం దొక విషయము మనస్సున నుంచి కొనిన వాఁడు. న్యాయ తీర్మానము - బీదలసాదలకు విశేషము వ్యయము లేకుండజరుగ

వ లెనని అతని మతము, న్యాయవిచారణ ఆంగ్లేయ పరిపాలిత దేశముల జనులకు మిక్కిలి వ్యయమును గలుగఁ జేయు చున్నదనుటకు సందియము లేదు.ఈవిషయమును సర్ సాలారు కొన్ని తరుణముల స్పష్టముగఁ జెప్పియున్నాఁడు. ఇట్లు గుర్తెతిఁగిన వాడు గావుననే తన సంస్థానమందు స్టాంపు ఆక్టును బహుచులకన చేసి వదలి పెట్టెను. కాని దానివలనను అనర్థములు కలుగక పోలేదు. ద్రవ్య వంతులగు వారు న్యాయ ముగఁ గట్టఁదగు పన్నులను దప్పించు కొనుటయు దరిద్రులకు సరియగు న్యాయము గలుగకుండుటయు దటస్థించుచున్నది. కావున నొక కొంతనంస్కారము గర్తవ్యము. నేటికిని లంచ ములు దీయుట అచ్చటచ్చట లోలోపల జరుగుచున్నను మొత్త ముమీఁద సర్ సాలారుజంగ్ సంస్కారముల వలన అదివఱకు బాహాటముగ నడచు చుండిన ఈదురాగతము అడుగంటినదని యే చెప్పనొప్పును. హైదరాబాదు సంస్థానమున చేతిపనుల నభివృద్ధిపఱచు నభిప్రాయముతో నతఁడు వస్తు ప్రదర్శనోత్సవము లనుగూడ నడిపెను. ఇప్పగిది అన్ని విధములఁ బరిశ్రమచేసి అతడు హైదరాబాదునకు నెమ్మదియు నైజామునకు ఇరువది సంవత్సరములలో మున్నున్న దాని మూఁడు రెట్ల ఆదాయ మును సమకూర్చెను. ( ఆదాయమునకు మించిన వ్యయము లేదాయెను. సర్కారునకుండిన యప్పులన్నియును దీర్చఁబడుటయేగాక కు


దువ యుంచఁబడియుండిన నగలన్నియును విడిపింపఁబడెను. ఇట్టి పరిపాలనా ఫలములు దృష్టి గోచరములగుచుండ భరత ఖండము గొప్ప పరిపాలకులను ఉత్తమరాజనీతి విదులను నీన జాలదని యెవ్వండనసాహసింపగలఁడు? (భారతపుత్రులకు) వలసినది (తమశక్తులఁ బ్రదర్శింపుటకు) అవకాశముమాత్రమే” యని సర్ సాలారుజంగును గుఱించి వ్రాయుచు ఒక చరిత్ర కారుఁడు లిఖంచుచున్నాఁడు.1[21]

సాలారుజంగు పై కుట్రలు.

సమర్థతగలవానికి విరోధములు పుట్టుట సహజము. సర్ సాలారుజంగునకును నైజామునకును గలహము పెట్టి ఏవిధ మున నైనను సర్ సాలారును బదభ్రష్టుని జేయించవలెనని స్వలాభాపేక్షుకులయిన కొందఱు అవినీతులు కుట్రలఁబన్నిరి. సర్ సాలారు నెడ రెసి డెంటున కప్రియము గావున నతనిని దీసి వేయవ లెనని నైజామునకును నైజామునక ప్రియుఁడు గావున అతఁడు దీసి వేయఁబడ నున్నా డని రెసిడెంటునకును ఒకరివిష యము మఱొక్కడికి దెలియకుండు పగిది కుట్రకారులు కార్య ములు నడిపిరి. కాని ఆకుట్రలు నిలిచినవు కావు. రెసిడెంటునకును నైజామునకును ఇరువురకును సర్ సాలారుజంగనిన మహాదరము. అందునలన . నిరువురును ముఖాముఖిఁ 'దర్కించుకొనుటయు సత్యము బయల్ప డెను. ఇట్టితరుణములు 1861లో నొకటియు

................................................................................... I.

1862లో నొకటియుఁ దటస్థించెను. రెంటను సర్ సాలారు విజ యుఁడయ్యెను. అయినను అతని పై వ్యతి రేక భావమును బుట్టించు ప్రయత్న ములంతటితో పోలేదు. నైజాము పూర్వాచారపరా యణుఁడు. సంస్కారముల ననుమానముతోఁ జూచువాఁడు. సర్ సాలారుజంగన్ననో సంపూర్ణసంస్కార పరుఁడు. నవీన పద్ధతుల నుపక్రమించువాఁడు. కావున వీరిరువురకును ఎంత యన్యోన్య ముండినను వైషమ్యము గలిగించుట దుష్టబుద్ధులకుఁగష్టము కాదు. అందువలననే మరల మరల నైజామునకుఁ దనముఖ్యముత్రి పై సందేహముగలుగుచుం డెడిది. 1861వ సంవత్సరముననే సర్ సాలారు ఆంగ్లేయపక్ష పాతియనియు నైజామును ముంచి వేయ నున్నాఁడనియు నాంగ్లేయ వర్తక సంఘమువారి దయను సంపా దింప సమకట్టినాఁడనియు సర్ సాలారును దూలనాడుచు పత్రికలు వ్రాసి నైజాముగారి నగరులోను మసీదులలోను వంతెనల మీఁదను నగరద్వారమునను అతికించియుంచి రనిన సాలారు జంగు సంస్కారముల వలన దమ దుర్గాములు నెఱ వేరక పోవుట చేనతనికి శత్రువులయిన దుష్టులు మొదటినుండియు నతనిమీఁదఁ బ్రయోగింపఁ దొరకొనిన సాధనములిట్టిపని తెల్లముగాఁ గలదు. 1869వ సంవత్సరమున సర్ సాలారు నైజాము గారికొలువు కూటమున కేగు చుండగా దారిలో నాతనిని - జంపి వేయుటకుఁ గొందఱు ధూర్తులు ప్రయత్నించిరి. కాని లోక పరిణామ ప్ర వాహమునకు సోలారు జంగింకనుగొంత దోడ్పడవలసిన వాడ

గుటవలనఁ బరమాత్ముడతని కేమియు నపాయము గలుగ కుండు నట్లు పన్ని వేసెను. హత్య కుపక్రమించిన దుర్మార్గుని ఉరిదీయ వలసినదని నైజాముత్తరు విచ్చెను. ఆయుత్తరువును మరలించి వానిని ద్వీపాంతరవాస శిక్షతో వదలి పెట్టించవ లెననీ సర్ సాలా రెంతగా ప్రయత్నించెననిన అతని కరుణార్ద్ర హృదయ ము వెల్లడి కాగలదు!

నైజామున కపనమ్మకము.

సర్ సాలారు. అనేక విషయముల ఆంగ్లేయులసాయమును 'పొందినది నిజమే. అయిన నతడట్టి సాహాయ్యమును పొందిన దెల్లయు నైజాము నకు లాభమగు కార్యముల నొనర్చుట కే కాని మఱి యేటికినిగాదు. మాతృభూమియగు హైదరాబాదుసంస్థా నము పయి నతనికిఁగల అభిమానము ఇంకను విస్పష్టముగ ముందు దెలియఁగలదు. దాని మూలముననే అతని అద్వితీయ ధర్మబుద్ధి వెలువడఁగలదు. కాని మహాకార్యముల సాధించు వారి కనేకవిధములగు నాటంకములు రాకమానవు. ఈ విధికి. సర్ సాలారుజంగును దలయొగ్గవలసిన వాఁడె గదా, అతనిపై నైజామునకు విరోధభావ మెక్కుడగుచువచ్చి 1867వ సంవత్సర మున నతఁడు రాజీనామానియ్య సన్నద్ధుఁడు గావలసివచ్చెను.

టెంపిలు వాక్యములు.

ఆసంవత్సరము ఏప్రిల్ మాసమున హైదరాబాదునకు

'రెసిడెంటుగాపోయిన సర్ రిచ్చర్డు టెంపిలు నైజాము సర్ సాలా రుజంగు నిడిన యవస్థలనిట్లు వర్ణించు చున్నాఁడు.

‘‘నైజామువలన నాతఁడు (సర్ సాలారు) 'బానిస స్థితి యం దుంచఁబడి యుండెను. అతఁడు తన ఇల్లు విడువ గూడని ఖయిదీయన వచ్చును. తనయజమానుని ఆజ్ఞ లేని దతఁడు దన యావరణమును విడిచి చన లేకుం డెను. నగరమునకు వెలుపల నుండు తన వసంతభవనమున విందు జరుపవ లెననినను, ఆంగ్లే య సైనికుల బారుదీర్చి పరీక్షింపవలెననినను, 'రేసి డెంటుతో 'మాటలాడవ లెననినను, అతఁడు ఉత్తరవు పొందనలసినదే. ఆఉత్తరవు పొందుట నామకార్థమని యనుకొనబోకుఁడి. ఉత్త రవు దొరకినను దొరకును, లేకున్న లేదు. ఒక వేళ ఉత్తరువియ్యఁ బడినను నై జాముగారి మనస్సంతోషముతో నియ్యఁబడుచుండు ట లేదు. నాకు అతనితో (సాలారుజంగుతో) వి శేషము పని యుండెడిది. ఆపని దీర్చుకొనుట మిక్కిలి కష్టముగ నుండెడిది. “అతనిని పలుమారు చూతమాయనిన దానివలన నైజామున కీర్ష్యయెడమును. లేక కాగితములుపంపి' పనిచేసికొందమా యనిన నదియును నైజామునకుఁ దెలుపఁబడుచుండుటవలన ' ఆక్షేపణీయమే. ఇట్లుండియు సాలార్ జంగు దీనినంతయును గష్టముగ గణించిన వాఁడు గాఁడు. దేశము నందలి అతని సోదరు లెల్లరుంబలె నతఁడును తనయజమానుని గౌరవించు చుండెను. నైజాముసన్నిధి కతఁడు పలుమారు విడువఁబడుచుండ లేదు.

విడువఁబడిన వేళలనో అతనికి మనోవ్యాకులమువలన ముఖమం తయును దెల్ల బడిపోవుచుండెడిది. అతఁడు మరలఁ దనయజ మానుని దనయెడ సుముఖుని .. జేసీకొన లేనని కొంచెమించు మించుగ నిరాశఁ జెందియుండినను ప్రభుభక్తియం దేమాత్ర మును గొఱఁతవడనివాఁడై తన ప్రభువున కుపయోగమగు విషయ మేమిచేయవలసినచ్చినను సిద్ధముగనుండెను.” నైజామునకు సాలారు నెడ ఇంతమనోగతమగు విము ఖత్వముండియు నతఁడు మహా సమర్థుండగుటం జేసి యతనిని దొలఁగింపక సమానింప దొడఁగెను.

సూరుమహబూబు అలీఖాన్ (1889-1911).

1869 సంవత్సరము ఫిబ్రవరి మాసములో నైజాము అఫజల్ ఉద్ దౌలామృతుఁ డయ్యెను. అతనికి రెండు సంవత్సర ముల వయస్సుగల కుమారుఁడుండెను. ఆకుమారుఁడేసూర్ మహబూబ్ ఆలీఖాన్, తండ్రిమరణ మందిన నాఁటిరాత్రియె ఇతఁడు నైజాముగఁ బ్రకటింపఁబడెను. ఈతఁడు ఉచిత వయ స్కుఁడయి రాజ్యభారము నిర్వహించుకొనుటకు శక్తిగల వాఁడగు వఱకును నవాబు నర్ సాలార్ జంగును నవాబుషంష్ ఉల్ ఉమ్రాయును. సహపాలకులుగ (Co-regents) నేమింపఁ బడిరి. ఇంత కాలము నైజాము కట్టుబడికిలోనై తనకు నుత్తమ ములని ..తోచిన నంస్కారముల నెల్లయును - జేయ లేకుండిన సర్ సాలారునకు నవీన స్వాతంత్ర్యము గొంత యలవడెను..

నైజాముగారి నిర్బంధమువలన ఇల్లు విడచి కదలలేకుండిన ఇత నికిఁ జక్కగ బ్రయాణములు సల్పి తన రాజ్యమున క్రింది అధి కా రు లెట్లు పనులు దీర్చు చుండుటయుఁ బరిశీలించుటయేగాక పర "రాష్ట్రములకుఁ బోయి నైజామునకు లాభకరములని తాను దలఁ చిన కార్యముల కై పాటుపడుటకును అచ్చటచ్చటి ఉత్తమ సాంఘిక 'రాజకీయా చారములను ఎరింగికొనుటకును వీలుకలి గెను. ఇట్టి నూతన స్వేచ్ఛ దొరకినందున సర్ సాలారు హృద యమం దడఁగియుండిన దేశభక్తి ' బయలునడి పొంగిపొరల మొదలిడెను. తన యజమానియగు నైజముపో నడచికొనిన బంగారు పుటల నీను బీరారు నె ట్లైనను మరల సంపాదింపవ లె నను ఆశ అతని డెందమున గాఢముగ నెలకొని యుండెను. 1860 న సంవత్సరపు సంధి ప్రకారము నైజాము బీరారుమండలమును గుఱించిన లెక్కలడుగు హక్కునుగూడ వదలు కొనియుండెను. ఆ ముండలనున కగువ్యయములు పోను నిలువ ఏమయిననున్న చో నా గ్లేయు లియ్యనియ్యకొని యుండిరి. ఇదియంతయు 'సర్ సాలారునకు సమ్మతము గాదని వేరుగనుడువ బని లేదు.

సాలార్జంగు. ప్రవర్తన.

ఇట నీ సమయమున సర్ సాలారుజంగు ప్రవర్తనను గుఱించి మాక్ ఔలిఫ్ అనుచరిత్రకారుఁడు వ్రాయునంశములు నుదాహరింప వలసియున్నది.


" అతఁడు ప్రారంభమున (అనఁగా సహపాలకుఁ డవుట తోడ నె) నడచి ననడక 'లాక్షేపణీయములు, ' నైజాము సం స్థానపు స్వాతంత్ర్యమును బ్రకటింపవలె ననుట ఆతని కాదర్శ మయ్యెను. సమాన రాష్ట్రములకు బరస్పరము మాననీయమగు చట్టముల నుపయోగింప నైజాముసం స్థానమున కర్హతగలదను 'మిషఁగల్పించుకొని ఆంగ్లేయ రాజ్యము యొక్క సార్వభౌమత్వ మును చల్లంగ నిరాకరింప నుద్యుక్తుఁడయ్యెను. అతని పినతండ్రి ముఖ్యమంత్రిగ నుండు నెడ తిరిగి యియ్యఁబడ వలయునను షరత్తు తో ఆంగ్లేయుల కీయ్య, బడిన బీరారుమండలమును మరల సంపా దింప వలెనని యతఁడు మిక్కిలి యుత్సాహము 'గలవాఁ డయ్యెను. ...... నేను బీరారును మరల్చకొన నై నను మర ల్చుకోనవలెను, లేక దానిని (ఆంగ్లేయులు) నిలుపుకొనుటకుఁ దగిన కారణములున్న వని నామనస్సునకు నిశ్చయముగఁదోఁచ నైనను దోఁచవలెను, లేక నేను చావ నైనను చావవ లెను' అని లార్డునార్తు బ్రూకునకు వ్రాసిన వాక్యములవలన నాతని యభి ప్రాయము వెల్లడియగుచున్నది.

"ఈ యాశ చేనతఁడు ఆ క్షేపణీయములగుఁ బనులఁ జేయ . మొదలిడెను. ' నైజాము సైన్యము' నకవసరము లేదని చూపి ఆంగ్లేయులు బీరారు నుంచుకొనుటకుఁ గారణము లేదని సిద్ధాంతీకరించు నభిప్రాయముతో ' సైజాము సైన్యము' మాదిరి ననుసరించి 'సంస్కరింపఁబడిన సైన్యములు' అను పేరుతో,

దండులసమకూర్చెను... 1875వ సంత్సరము వేల్సు ప్రభువుగారి దర్శనమునకుఁ బోవనిస్టము లేమిని సూచించుటయు, యుద్దోపక రణములు రహస్యముగ చేయించుచుంట బయల్పడుటయు, తన సహ పాలకుఁడు మృతినొందగ మఱియొక సహపాలకుఁడు నేమిం పఁబడుట కూడదని పట్టుపట్టుటయు నతని మనోగతిని దెలియఁ బఱచు చున్నవి. ఫత్రికలమూలమున నేమి గొప్ప అధి కారులమూ లమున నేమి మఱియితరుల మూలమున నేమి భారతవర్ష ప్రభుత్వ మువారిని వంచింపఁ జేయఁబడిన ప్రయత్నము లతని యనుజ్ఞ మీఁదనడచెను. ఈ కారణములను బట్టియు మఱియితర కారణ ములను బట్టియు రాజప్రతినిధిగ, అనఁగా గవర్నరుజనరలుగా, నుండిన లార్డులిట్టను తన ప్రతినిధిత్వమున యుద్ధమున కంటెను క్షామమునకంటెను నెక్కు డపాయకరమగునది ఈమంత్రి యొక్క కుట్ర లేయని సంకోచింఫక నుడివియున్నాఁడు. ఈతన యభిప్రాయముల నెరవేర్చుకొను నుద్దేశముతో బీరారును మరల్పుఁడనియు నైజాము సైన్యమును బగులఁగొట్టుఁడనియు ఆంగ్లేయులతో నొక్కి చెప్పుటకొఱకు స్వంత సంతోషమున కై యని నిమిత్తముగల్పించుకొని సర్ సాలారుజంగు 1876 న సంవత్సరమున నింగ్లాండునకు బయనమయి పోయెను. హైద రాబాదు నెడల నాంగ్లేయ ప్రభుత్వమువారి చర్యలన్నిటిని ఖం డించుచు నతఁడు వ్రాసిన దానిని నార్తుటూబ్రూకు ప్రభువును ఇంగ్లాండు ప్రభుత్వము వారును చక్కఁగ విమర్శించిరి. ఇండియా

కార్యదర్శిగనుండిన సాలిన్ బరి ప్రభువు మిక్కిలి చాతుర్య ముగను దృఢముగను నైజాముగారు బాలుఁడుగనున్నంత కాలము ఆసంస్థానపు రాజకీయ సంబంధములు మార్చుటకు వీలు లేదనియు 1858, 1860లలో జరిగిన సంధుల ఔచిత్యా నౌచిత్యముల చర్చించుట తగదనియుఁ బ్రత్యుత్తరమిచ్చిరి.


" అయిన ఇంగ్లాండునకుఁ బోవుటకుఁ బూర్వమే ఆమంత్రి, అనఁగాసర్ సాలారు, ఆంగ్లేయ పత్రికల మూలమున దన మొర్రలు ప్రారంభింపించెను !*[22] ( అదివరకే బీరారును గుఱించి యితఁడు రెండవ మారు అర్జీ యిచ్చుకొనియున్నందున 1877 వ సంవత్సరమున జరుగనున్న చక్రవర్తిని దర్బారునకు ఆంగ్లేయ ప్రభుత్వము వారిసార్వభౌమత్వమును ఒప్పుకొనిననే తప్ప ఇతఁడు రాకూడ దని తెలుపఁ బడెను. ఆదర్బారున కభిముఖుఁడయి ఇతఁడట్టి 'సార్వభౌమత్వాంగీకార మెంత యవసరమయినదియు ఎంత యనివార్యమయినదియు ప్రకటించెను. అచిర కాలములోనే సాలిస్ బరి ప్రభువుగారు దన అర్జీ పైని చేసిన తీర్మానములను సంపూర్ణముగ నంగీకరించెను..... ...............................................................................................

" పిదప నతఁ డొనర్చిన సర్వకార్యములను గవర్నరు , జనరలుగారు 'విద్యావంతుడును అనుభవవంతుఁడునునగు ఆం గ్లేయ ప్రభుత్వపు మిత్రుడని' : వనివర్ణించియున్నారు.”

ఈ అను వాదమునందలి యొకటి రెండు విషయములను మాత్రము పూర్వ పక్షము చేయవలసియున్నది. సంస్కరింప బడిన సైన్యములను గుఱించి సర్ సాలార వ్వానిని దనసం స్థాన మునకు స్వాతంత్ర్యము సంపాదింప సమకట్టిచే ర్చెననుట మిక్కిలి 'పొరపాటు. '1857 వ సంవత్సరపు తిరుగుబాటు సమయమున నైజాము సైన్యము ఆంగ్లేయుల సాహాయ్యార్థమై ఉత్తర హిందూ 'స్థానమున కనుపఁబడియెను. అప్పుడు హైదరాబాదునందుండిన యల్లకల్లోలమిదివఱకే వర్ణింపఁబడియున్నది. అట్టి సందర్భము లలో సర్ సాలారు తగిన సైనిక సాహాయ్యము లేక కార్యములు గడుపశక్తుఁడయి యుండునా యనుట మనము యోజింపవలసి యున్నది. ఈ యోజన కొక్క ప్రత్యుత్తరమే సాధ్యము. సర్ సాలారు దన శక్తిలో గలవఱకు భటులను సిద్ధము చేసికొని తీరవల సినవాఁడయ్యెను. కావున నతఁ డాసమయమున హైదరాబాదు నందు చెల్లా చెదరయియుండిన బలములన్నిటిని సంస్కరించి “పటాలముగ నేర్పఱచుకొ నెను.పటాలమునకు అధిపతులుగ ఐరో పియనులు నేమింపఁబడిరి. అది యే 'సంస్కరింపఁబడిన సైన్యము 1 [23] - అనఁబరగునది. కావున నీ సైన్యమును సర్ సాలారు దురభి ..............................................................................

1.

ప్రాయముతోఁ జేర్చెననుట అతని పై అకారణముగ నిందమో పుటయే. ఇక నతఁడాంగ్లేయ ప్రభుత్వపు సార్వభౌమత్వమును నిరాకరింప నుద్యు క్తుఁడయ్యెననుటయు. నతనియెడ లేని భావము నతని కారోపించుటగనె కన్పట్టుచున్నది. పైనిరూపింపఁబడిన నూతన సైన్యములు దన చేతులోఁ బెట్టుకొని దేశమందంతటను ఆంగ్లేయ ప్రభుత్వము పై తిరుగుబాటులు ప్రబలియుండిన కాల మునఁ గొంచెమేనియుఁ జలింపక ఆంగ్లేయ ప్రభుత్వపకుమునఁ బరిశ్రమ చేసి అందలి ప్రముఖులగు నధికారులచేవారి రక్షకుఁ డుంబలె మన్న నలందుట అతనిమనమున నాంగ్లేయసార్వభౌమ త్వనిరాకరణముండి యుండినచోఁ దటస్థింప నేరదని ఎట్టివారికిని దోంచకమానదు. సర్ సాలారు మహా దేశభక్తుఁడును ప్రభు భక్తుఁడును గావున మాతృభూమి యగు హైదరాబాదునకును, యజమానియగు నైజామునకును బీరారు మండల నష్టమువలనను ఇతర విధములను గలిగిన హైన్యమును మాప నెంచి ప్రయత్న ములు చేయుటలో గొంచెముతీక్షణ ముగఁ బని చేసి, అట్టి హైన్యము నకుఁ గారకులయిన కొందఱకు విరోధియయ్యెననుటకు సందియ ము లేదు. వారు బలవంతులుగ నుండి నందునను ఇతర కారణ ముల కతని పై వైరమూనిన దురాత్ములు వారికి, సాయులగుటవల నను సర్ సాలారు గార్యములొక కొన్నిటికి అపార్థములు గల్పిత మయి అతఁ డెప్పుడును దలంప నై నఁదలంపని భావము లతనికా రోపింపఁ బడెను. ,

'పైయను వాదమునందె సర్ సాలారు ఇంగ్లాండునకు వెడలినట్టు వ్రాయఁబడియెనుగదా! అప్పు డతఁడచ్చట గనిన స్వాగత వైభవమే యతనికిని ఆంగ్లేయులకునుగల యన్యోన్య ప్రేమానురాగమును వెల్లడింపఁజాలియుండెను. ఇంగ్లండున ప్రతి నగరమువారును అతనిని రమ్మనిచీరుచు ఏదోయొక మహాచక్రవర్తి కింబలె అతనికి సంపూర్ణ గారవమును జూపిరి. అతనికారోగ్యము దప్పినందుననొకటి రెండు నగరముల కతఁడు దర్శనమిచ్చుటకుఁ గూడవీలు లేకపోయెను. అతనిని సమానముగ సన్మానించిన వారలలో ఇటలీ దేశోద్ధారకుఁడును 'రాజునుసగు విక్టరు ఇమా న్యుయెల్ ను, రోమునందలి మహామతాచార్యులును, ఆంగ్లేయ చక్రవర్తిత్వమునకర్హుడగు వేల్సు ప్రభువును నుండిరనిన సర్ సాలారునకు జరిగిన గౌరవాదరణలు విశదముగాఁ గలవు. అతఁడు నాలుగుమాసముల కాలమిట్టివిధమున యాత్రనడపి 1876 వ సంవత్సరము ఆగస్టు నెల 25 వ తేది హైదరాబాదు వచ్చి చే రెను. ఆడిశెంబరు నం దె 1877 వజన వరిలో జరుగనున్న చక్రవ ర్తిని దర్బారునకి భిముఖుఁడై నైజాముగారితోఁ గూడ ఢిల్లీ కే గెను. 1888వ సంవత్సరమున నైజూముగా రైరోపాకుయాత్ర వెడలుట నిశ్చయింపఁ బడెను. దానికై సర్ సాలారు ఉచిత మగు రీతిని ఏర్పాటులు చేయుచుండెను. ఫిబ్రవరి 5 వ తేది రాత్రి పండ్రెండు గంటల వఱకు అభ్యానరీతిని పనిచేసి పఱుం డెను. రెండు గంటలగునప్పటికి అకస్మాత్తుగ నతనికి కలరా దగిలెను.రాను

రాను ఆవ్యాధి తీవ్రమయి 8 వ తేదీ సాయంత్రము 5 గంటలకు ప్రజలను ప్రభువులను దుఃఖాబ్ధిలో ముంచి మహాసర్ సాలారును భరతవర్షపు నుత్తమ పుత్రులలో నగ్రగణ్యుని మ్రింగి వేసెను.

రెండవసాలార్జంగు.

అతనికి ఇద్దఱు పుత్రులును నిద్దఱు పుత్రికలును నుండిరి. అందు రెండవసాలారుజంగు "మొదటివాఁడు. తండ్రిమరణా నంతరమితఁడు రాజానరేంద్రప్రసాదుతో గూడ సహపాలకు డుగ నేమింపఁ బడెను. 1884వ సంవత్సరమున నైజాము మీరు మహబూబ్ ఆలీఖానుఁడు దీపక్ ప్రభువు చే సంపూర్ణ శక్తులతో బరిపాలకుఁడుగఁ బ్రకటింపఁ బగుట తోడనే రెండవ సాలారు ముఖ్యమంత్రిగ నియమింపఁబడెను.

మీర్ మహబూబ్ మంచి విద్యావంతుఁడు. అతని బాల్యమునందు మహాసర్ సాలారుజంగు అతనికి రాజ్యాంగ విషయములయందొ క్కొక్కటి ని జక్కఁగ నేర్పి విద్యా లయములయందును పరిశ్రమాగారముల యందును అభిమాన మును ' బుట్టించి యుండినందున నతఁడు రాజ్యభారమును నిర్వహించుటకుఁ దగిన శిక్షునంతయు గనియుండెను. కావున నతఁడు గద్దె నధిష్టించిన తరువాత హైదరాబాదు రాష్ట్ర మున సర్ సాలారుజంగు ప్రారంభించిన సంస్కారములు బాగుగ నభివృద్ధి చెందఁ జొచ్చెను. విద్యాలయములు గట్టింపఁబడెను. యంత్రశాలలు నిర్మింపఁ బడెను. గొప్ప సంతతులకుఁ జేరిన

బాలురు విదేశములకుఁ బోయి ఉన్నత విద్యనభ్యసించుటకు సదుపాయము , లేర్పఱుపబడెను. వైద్య శాస్త్రమును స్త్రీలకుఁ గఱపుటకును శాస్త్రీయమగు పద్ధతుల నవలంబించు దాదులను సిద్ధపఱచుటకును ఉచితమగు నేర్పాటు లొనర్పఁ బడెను. దేశ మంతటను వైద్యశాలలు నెలకొల్పఁబడెను.

సూరుమహబూబ్ ఆలీ సింహాసనమునకు నచ్చిన తోడనె రెండవ సాలారుజంగు మంత్రియయ్యెనని నుడివితిమి. వీరిరువు రకును యజమానియు సేవకుఁడుగ మైత్రికుదిరినదిగాదు. "కావు న సాలారుజంగు 1887 న సంవత్సరమున రాజీనామాని చ్చెను. నాఁటినుండి కొంత కాలము - నైజాము దనకుఁదానె మంత్రిగఁ గార్యముల నెర వేర్పదొడంగెను.

ఔదార్య కార్యము.

భరతవర్షమున ': కెప్పుడును పశ్చిమో త్తరపు సరిహద్దు వలన బాధ దప్పినదిగాదు.అందున నాంగ్లేయ ప్రభుత్వము స్థిరపడిన తరువాత నావైపునుండి రుష్యావారు దండెత్తివత్తు రేమో యను. భీతి 1 [24]కడుంగడు హెచ్చఁ జొచ్చెను. 1885 వ సంవత్సర మున రుష్యా సైన్యములు ఆఫ్ఘనిస్థానము మీఁదికి దాడి వెడల నుండెనను వార్తప్రబలెను. అట్టివార్త లె దినదినమును వ్యాపించు చుండినవి. కావున నవ్వానినన్నిటిని యోజించి నైజాము పశ్చి మోత్తరదిగ్భాగపు సరిహద్దునందు వలసినంత రక్షుక సైన్యముండ ........................................................................................ 1

వలెనని అభిప్రాయపడియెను. అందుచే నాసంవత్సరమున అట్టి రక్షక సైన్యమున కై అరువదిలక్షల రూపాయలు దానిత్తుననియు యుద్ధముదప్పక పోయినచోఁ దానె స్వయముగఁ గత్తికట్టుకొని బయలు దేరుదుననియు గవర్నరు .జనరలుగారికి 1887 లో, వ్రాసి ఆంగ్లేయ లోకమును భ్రమింపఁ జేసెను.

నైజాము కొంతకాలము రాజ్యభారమునంతయును తానే నిర్వహించి నవాబు బషీరుద్దాలా సర్ ఆసక్ జాబహదూ రును మంత్రిగా నియోగించుకొనెను. ఆరు సంవత్సరములు పని చేసి అతఁడును రాజీనామానిచ్చెను. సర్ విక్ర-ఉల్ - ఉమ్రా మంత్రి పదమునకు నియోగింపఁబడెను. అతనికిఁ దరువాతివాఁడె ప్రస్తుతపు ముఖ్యమంత్రియగు మహారాజు సర్ కిషన్ ప్రసాదు.

మహారాజా సర్ కిషన్ ప్రసాదు.

ఈ మంత్రి కాలమున నాంగ్లేయులకును నైజామునకును గల సంబంధములలో ఒక ముఖ్యమగు మార్పు కలిగెను. బీరారు విషయమున సర్ సాలారుజంగు పడిన పాట్లును వానివలన నతనికి వచ్చిన యపకీర్తి ఇదివరకే వర్ణింపఁబడెను. ఆబీరారు విష యమె ఈమంత్రి కాలమునఁ దీర్మానింపఁబడిన ముఖ్య విషయము. 1858వ సంవత్సరమున నైజాము బీరారును ఆంగ్లేయుల పరిపాలన క్రిందికి చేర్చినది మొదలు ప్రతి సంవత్సరమును కర్చులు పోఁగ మిగత యున్న ద్రవ్యము నైజామున కీయ్యఁబడవలసి యుండెను గదా! బీరారున నాంగ్లేయు లుపక్రమించిన పరిపాలనా పద్ధతి

మిక్కిలి వ్యయపరమని యెల్లరును అంగీకరించియే యున్నారు. కావున ప్రతి సంవత్సరమును నిలువ యుండుచు వచ్చిన ద్రవ్యము బహుస్వల్పము. 1887-88 లో మాత్రము బీరారుమండలాదా యమునుండి రు 19, 78,000లు నైజూమున కియ్యబడెను. మొత్తముమీఁద చూచినచో 1860- మొదలు 1900 వఱకుగల నలుబది సంవత్సరములకు నైజామునకు సంవత్సరమునకు 9 లక్షుల వంతున నియ్యఁబడెను. ఇదియైనను నైజామునకు మిగిలిన దాయనిన మిగిలినది కాదు. 1900 -01 వ క్షామములలో నైజామున కొక్కదమ్మిడియైనను రాక పోవుట యేగాక బీరారునఁ గలిగిన దుర్భిక్షమును దీర్చుటకుఁ జేయఁబడిన వ్యయముచే బీరారుమండలము ఆంగ్లేయ ప్రభుత్వము వారికి 1,40, 95,608లు అప్పుపడెను. సుభిక్షముగల సంవత్సరములలోని నిలువ దుర్భి క్షముల నపనయింప నుపయోగింప వలయునను ఆచారమును బట్టి ముందు సంవత్సరములలోని నామకార్థపు నిలువను అనుభవింపుచుండిన నైజామా నూటనలుబది చిల్లరలక్షలనిచ్చు కొనవలసిన 'వాఁడాయెను. ఇతియేగాక సర్ సాలార్ జంగం తటివాఁడు మఱియొక రుఁడు మంత్రి హైదరాబాదునకు దట స్థించనందున - పైఁగనిన క్షామములకయియే హైదరాబాదు సం స్థానము కురకు నాంగ్లేయులవద్దనుండి నైజాము రెండుకోట్ల రూపాయి లప్పు పుచ్చకొనవలసిన వాఁడయెను. కావున నైజాము

స్థితి మజల 'నొకటి రెండు క్షామములు దటస్థించినచో దుర్భర మగునట్లు గాన్పించెను.

లార్డు కర్జను.

ఈ సందర్భములలో 1902 వ సంవత్సరమున లార్డు కర్జను హైదరాబాదునకు దర్శన మీయఁబోయెను. అంతకు మున్నె యతఁడు నైజాముతో నుత్తరప్రత్యుత్తరములు జరుపు చుండెను. పై యప్పులలోఁ గొంత భాగము 1901 వ సంవ. త్సరమున దీర్పఁబడియుండెను. అయినను 1902వ సంవత్స రము లార్డుకర్జను నైజాముతోఁ గలిసినప్పుడు ముఖాముఖ సంభా షణము జరిగెను. సర్ సాలారుజంగునకు అతని కాలమున ఇండి యా సెక్రటరీగా నుండిన లార్డు సాలిస్బరీ యిచ్చిన ప్రత్యుత్తరము లోనప్పటికీ బాలుఁడుగా నుండిన మీర్ మహబూబ్ యౌవనత్వ మందిన తరువాత నతఁడిచ్చయించె నేని ఆంగ్లేయులకును నైజా మునకును గలపరస్పర సంబంధములు సంపూర్ణముగ నాం గ్లేయ ప్రభుత్వమువారు మఱల విమర్శింపగలరు' అని వ్రాసిన వ్రాత నాధారము చేసికొని లార్డుకర్జనీవిషయమున జోక్యముకలుగఁ జేసికొనెను. అదే లార్డు సాలిస్బరీ ఆప్రత్యుత్తరమున నే 1858వ సంవత్సరపు సంధిలో బీరా రిన్ని సంవత్సరము లాంగ్లేయు లను భవింపవలసినదని లేదు గావున నాంగ్లేయుల కామండలము శాశ్వతముగఁ బరిపాలన కియ్యఁబడినది అని నుడివియుండుట వలనను, సర్వ జనులకును సమాన్యుఁడై మహా నిపుణుఁడగు సర్

సాలారుజంగంతటి వాఁడే విశ్వప్రయత్నములు చేసి కట్టకడపట విఫల మనోరధుఁడయి యుండుటం బట్టియు, అమలులోనున్న, షరత్తులను బట్టి బీరారునుండి దనకగులాభ మేమియు గన్పిం పకుండుటం "ఇట్టియు, మీర్ మహబూబ్ ఆలీఖానుఁడు నిష్ఫల మగు ప్రాతపోరాటములకు నిష్టము లేనివాఁ డై ఉన్న దున్నంత వఱకు దిట్టము చేసికొన ప్రయత్నించి లార్డుకర్జనుతో 1902 వ సంవత్సరమున సంధి చేసికొని బీరారు విషయమును ఒక విధముగఁ దీర్మానము చేసికొనెను.

బీరారునుగూర్చినసంధి (1902),*

[25]

ఈ సంధినలన బీరారుమండలము నైజాము ప్రభుత్వము లోనిదే యనుట స్థిరాంగీకారమునం దెను. కాని ఆమండలము శాశ్వతముగా నాంగ్లేయులకు కౌలునకీయఁ బడెను. గుత్త 25 లక్షల రూపాయలని నిర్లయింపఁబడెను. లెక్కలు వేయఁగా తేలిన బీరారుమండల క్షామనివారణార్థ మయిన ఋణము 76 లక్షులును హైదరాబాదు సంస్థానమండల నివారణార్థ మయిన ఋణము 185 లక్షులును 30 సంవత్సరములలోఁ ఈగుత్త పైకముతో దీర్పఁబడు సట్లేర్పఱుపఁబడెను. ఇందునకు ప్రతిసం ......................................................................................................

వత్సరము నియ్యవలయు పదునైదులక్షలు . పోఁగా మిగత 10 - లక్షలు -నైజామున కిచ్చునట్లును ఈయప్పులు " దీరిపోయిన తరువాత సంవత్సరమునకు సంధి ప్రకారము 25 లక్ష లిచ్చునట్లును ఒడంబడిక చేసికొనఁ బడెను. బీరారుమండలమును పరిపాల నావసరముల కొఱకు ఆంగ్లేయ మండలములతోఁ జేర్చుకొనుట కాంగ్లేయ ప్రభుత్వము వారికి స్వాతంత్ర్య మీయఁబడెను. నైజాము సైన్యమును దగ్గించు కొనుటకుగాని మార్చుకొనుటకు గాని భరత వర్షపు సైన్యములలోఁ జేర్చుకొనుటకు గాని వారికి హక్కుగలి గెను. నైజాము స్వసంరకుణకుగాని ఆతని సంస్థానములోని యల్లరుల నణఁచుటకు గాని సైన్యముల ననుపుటకుమాత్రము వారు త్తర వాదులుగ నేర్పడిరి. నైజాము దన యొద్దనుండు చిల్లర సైన్యములను 12, 000ల వఱకును దగ్గింపనియ్య కోనెను. ఆంగ్లేయ . ప్రభుత్వమువారు నైజాముగారి సంస్థానమున నుంప నెంచిన తమ సైన్యమును తదనుగుణముగఁ దగ్గింతుమనిరి . బీరారుపై నైజామునకు గల ప్రభుత్వమును సూచించుటకు ప్రతి సంవత్సరమును అతని. జన్మ దినోత్సవమున బీరారు మండలపు రాజధానిలో ఆంగ్లేయుల పతాకముతో నతని పతాకమును గూడ ఎక్కించుట నిర్ణయింపఁబడెను.

దయామయత్వము.

1908వ వంవత్సరము సెప్టెంబరు 28వ తేది. ఆదివారము నాఁడు మూసీనది వరదలు ప్రచండమై అకస్మాత్తుగఁగన్పట్టి హైద

రాబాదు పట్టణము నందు విశేష భాగమునకుఁ బ్రళయముగఁ బరిణమించినదిప్పటికినిఁ దలఁచుకొనిన హృదయమునందు సంతా పముపుట్టక మానదు. ఆతరుణమున మీర్ మహబూబ్ ఖాను నాలుగు దివసములు నిద్రాహారములు మాని కన్నీళులు విడుచుచుఁ దన ప్రజకుఁ దటస్థించిన మహద్విపత్తును మాన్పుటకయి సర్వ విధములను జేసిన ప్రయత్నములు జ్ఞప్తికివచ్చిన నాతని దాతృ త్వమును కరుణాళుత్వమును స్ఫుటముగ మనోగోచరములగుచు న్నవి. దురదృష్టుల కష్టములఁ బాపుటకతఁడు రాష్ట్రపుబొక్కన మునుండి యిచ్చిన ద్రవ్యముతో సంతుష్టిఁ జెందక తన స్వంతధన మునుండి 4 1/2 లక్షల రూప్యములను ధారాళముగ నొసంగి కమీ టీల నేర్పఱచి భోజన పదార్థములును, స్త్రీలకు బాలురకు బాలి కలకు ఎల్లరకును దగినవస్త్రములును, దుప్పటులు గొంగళ్లు చొక్కాలు మున్నగు చలినాపు వ స్త్రవి శేషములును, ప్రతి గృహమునకుఁ జేర్పిం చెననిన మన మీరు మహాబూబ్ యొక్క ఉదార హృదయమును వర్ణించిన వారమగుదుము.

సూర్ మహబూబ్ ఆలీఖానుఁడు దన ప్రజలయెడఁజూపిన దొక్క యనురాగము మాత్రమె కాదు. వారియం దతనికి సం పూర్ణమగు నమ్మకముం డెడిది. ఈ విషయమును సిద్ధాంతీకరించు టకు నతఁడు మింటో ప్రభువునకు వ్రాసినయుత్తరమె చాలి యున్నది. గవర్నరు జనరలుగారు రాజద్రోహము విషయమై జాగ్రత్తగ నుండవలసినదని వ్రాయ దానికితఁడు దన రాజ్యమున

నట్టి నేరములుండుటకు వీలు లేదనియుఁ బ్రజలు మత భేదములు లేక పరిపాలింపఁబడుట చే సంపూర్ణముగ సంతుష్టులయి యున్నా రనియు వ్రాసి యతని కాశ్చర్యమును బుట్టించెను.

మిరుమహబూబ్ నిర్యాణము.

ఇట్లు ఇరునదియేడు సంవత్సరములు ప్రజారంజక ముగ రాజ్యము చేసి 1911 వ సంవత్సరము ఆగస్టు నెల 30 వ తేదిన 45 సంవత్సరముల వయసున హిజ్ హైనెస్ ఆసఫ్ జా ముజఫరుల్ ముమాలికు నైజాముల్ ముల్కు నైజా ముదౌలా నవాబు మీరుసర్ మహబూబు అలీఖాన్ బహ దూరు ఫత్తేజంగు జి. సి. ఎస్. ఐ. జి సి. బి. గారు అకసా తుగ మరణమం దెను. దయామయుఁ డై దీర్ఘ కోపమూను వాఁడు గాక ప్రజలయం దనురాగముగల్గి ఆడంబర మొక్కింత యేని దగ్గర రానీక జనులయందు సంపూర్ణ మగు నమ్మిక కలవాఁడై రాజ్యభారమును వహించి రాజ్య కార్యముల నిర్వహించిన ఈమహానీయు నెవ్వరు గౌరవింపరు? ఈలోకమాన్యుని మర ణమున కెవ్వరు వగవకుందురు ?

ఉస్మాన్ అలీఖాన్.

అతఁడు పరలోక ప్రాప్తిఁ జెందినతోడనే అతని కుమాఁ రుడగు ఉస్మాన్ అలీ ఖానుఁడు నైజాము పదమునకుఁ బ్రక టిం పబడెను. ఇతఁడు గద్దియ నెక్కుతరి “నాతండ్రిగారి వలెనే నేనును ప్రజకును దేశమునకును నావలన నైనంత మేలును

చేయుదుననియు - ఆంగ్లేయ, ప్రభుత్వమునకు భక్తిచూపెద ననియు వాగ్దానము సేయు చున్నాఁడ” నని నుడి వెను. ఇతఁడు గడచిన పట్టాభి షేకమ హోత్సవ సమయమున ఢిల్లీ కరిగి యచ్చటి సామంత ప్రభుసభ నలంకరించి చక్రవర్తిగారిచే మొట్ట మొదట సన్మానమందెను.

తండ్రిగారి పరిశ్రమవలన ' రాజ్యాంగ శాఖలన్ని యుఁ జక్కఁగఁ దీర్చఁబడిన స్థితిలో నితఁడు రాజ్యమునకు వచ్చియు న్నాఁడు. ఇప్పుడు హైదరాబాదు నందు ఆంగ్లేయ మండల ములందు వలెనే ముఖ్యమంత్రి అధికారము క్రింద మఱియార్గు రు మంత్రులతోఁ గూడిన రాజ్య కార్య నిర్వాహక సంఘమును (Executive Council) ఔద్యోగికా నౌద్యోగిక (Official & non-official.) సభ్యులతో గూడిన శాసననిర్మాణ సభయును గలవు. తదను గుణముగనే ఇతర రాజ్యాంగ శాఖలును సంస్క రింపఁ బడి యున్నవి. ఉత్తమన్యాయ స్థాన మొండు నెలకొల్పఁ బడియున్నది. విద్యాలయములును స్థాపింపఁ బడియున్న వి. వీని నన్నింటి నభివృద్ధిపఱతిచి, జాగరూకుఁడై మెలఁగి - ప్రజాక్షేమ మునకై పాటుపడి తండ్రిగారి కంటె నెక్కుడనిపించు కొనుటకీ 'నైజామునకు దైవము బుద్ధిబలంబుల నొసంగుగాక !

  1. అశోకుని శిలాశాసనము 5
  2. అశోకుని శిలాశాసనము. 18
  3. ఢిల్లీలో బాదుషాహ పేరు నశించువఱకును హైదరాబాదు సవా బులు తాముదక్కను సుబేదారులనే వ్యవహరించుచుండిరి.
  4. ఇతనిని ఇప్పటికిని హైదరాబాదు నందు గొప్పకుటుంబములవారు స్మరించుచున్నారు.
  5. 1 Malleson---Native States of India-
  6. ఈ యంశము వెల్లస్లీ గారి లేఖవలన దెలియుచున్నదని ఫ్రేజరను చరి త్రకారుఁడు వ్రాయుచున్నాఁడు.
  7. C. N. Atchinson's collection of treaties, En gage-ments & sannads. Vol. 5 Page. 9.
  8. Mac-auliffe-The Nizam.
  9. Wellington's despatches. .
  10. దివాను, ముఖ్యమంత్రి యనునవి పర్యాయ పదములనిగ్రహించునది..
  11. జి. బి. మాలిక.
  12. ఒక చరిత్రకారుఁడు నైజాము ఒప్పుకొనకుండునట్లు చేసినదికూడ చందులాలే యనుచు న్నాడు.
  13. BriggThe Nizam Vol. I P. II2
  14. కడప, బల్లారి, అనంతపురము, కర్నూలు, జిల్లాలకు ఈ పేరుపర్తిం చుచున్నది.
  15. బాఖిర్ జంగు 1902వ సంవత్సంము మార్చి నెలలో కర్జను ప్రభువుకు "వ్రాసిన యుత్తరములో నీ సైన్యము సంస్కరింపఁబడి స్థాపింపఁబడుట నైజా మున కెఱుకయే లేదనుచున్నాడు. పూర్ణముగ సిద్ధమైన తరువాత నతనిము ఖ్యమంత్రియు రెసిడెంటును దానివ్యయమును నైజాముపైఁ బెట్టిరనియు నుడు వుచున్నాఁడు.
  16. ఈ కిస్తీకి గాను సైజాము దన యాభరణములను ఇంగ్లాండున గుదువఁ బెట్టించెను.
  17. Frazer—the Nizam, Our Faithful Ally.
  18. ఈబహుమాన విషయములన్నియు 1860 వ సంవత్సరపు సంధి యందుఁ జేర్పఁబడినవి.
  19. ఈ భూభాగమునుండి వసూలగు పన్ను మొత్తము సంవత్సరమునకు రు 8,20, 888_13_5 అని 1860–61 సంగత్సరపు బీరారుమండలపు రిపోర్టులో వ్రాయఁబడినది. గ్రిబ్బిల్ కర్చులు దీసివేసి నికరాదాయమును లెక్కించిరని ఊహింపగలసియున్నది.
  20. లక్ష రూపాయిల పిలువగల వస్తువులు బహుమానము. లియ్యం 'బడెనని ముందు వ్రాయఁబడెను. వానికిఁ బ్రతిబహుమానములుగ రెసిడెంటు నకును ఇత రాధికారులకును నైజాము 90,000 రూప్యములు వెలగల ఆభరణ నిచ్చెనని ఫ్రేజరు వ్రాయుచున్నాడు
  21. J. D. B. Gribble.
  22. ఇచ్చట నీ చరిత్రకారుఁడు ఆంగ్లేయ పత్రికలు బహుతీవ్రముగ వ్రా సినవని నుడువుచు ఆతీవ్రతకు సర్ సాలారు' ఉత్తరవాది గాడను చున్నాఁడు.
  23. J. D. B. Gribble 'Tivo native states'.
  24. ఆది వట్టి భీతియనుట లోకమునకు విదితమయి' యున్న C.
  25. * బీరారును మరలించుకొనవ లెనను నాశయు, బీరారు మరల్చకుండుట నైజామున కన్యాయము సేయుట యనుతలంపును హైదరాబాదు సం స్థానమున ఈ సం= ఎనాఁటికి నిగలవనుటకు లార్డుకర్జను హైదారాబాదునకు దర్శనమియ్యం వెళ్లినప్పుడతనికి బాక రారు జంగు వ్రాసిన ప్రకటిత పత్రమేసాక్షి