ఢిల్లీ దర్బారు/అయిదవ ప్రకరణము
ఢిల్లీ ద ర్బారు.
బరోడా రాష్ట్రము.
బరో ము. And - బాం రాడన్నూరు మహీకాంత అహమ్మదాబాదుజల్లా లా కాథియుండ సువర్లమతి, 60.0 రేవ era సూరత ఉంగులు కాంబె బూడి పశ్చిమ సముద
FU4 అమలు తంగులు కాంబె బూడి బాడి | ato పశ్చిమ సముద్రము 0త ము. 2. బ cato •తము. మే లీ ప్రాంతము. 4. నవరి ప్రాంతము. 8. అమే Cra
బొంబాయి - ప్రస్తుతపు గాయిక వాడగు -
7 శ్రీసయాజారావు బహదూరు.
అయిదవ ప్రకరణము.
బరోడా రాష్ట్ర ము.
ఆంగ్లేయ ప్రభుత్వమునకు లోఁబడియుండు స్వదేశ సం స్థానము లన్నిటిలో నర్వాచీన పద్ధతుల నవలంబించుటయందు ప్రాముఖ్యతఁగాంచి కొన్ని విషయముల గురువును మించిన శిష్యుఁడుంబో లె సామ్రాజ్య ప్రభుత్వము వారికి మార్గదర్శకమై వారివలన హైదరాబాదునకు రెండవదిగ పరిగణింపఁ బడుచు నలరారు బరోడా సంస్థాన మతివర్ణ నీయము.
ప్రదేశములు.
ఈ సంస్థాన మొక్క ముక్క గనుండు భూప్రదేశము గాదు. బొంబాయి రాజధాని లోని గుజరాతీ సీమలో మూఁడు భాగముల యందును కాథియవాడ ద్వీపకల్పమున రెండుభా గముల యందును ఈరాజ్యమునకుఁ జేరిన భూభాగమున్నది. ఇట్లచ్చటచ్చట ముక్కలు ముక్కలుగ ఆంగ్లేయ పరిపాలిత భూస్థలితో కలిసి యుండుటంబట్టి ఈ సంస్థానపు పిల్లలు పటము సాహాయ్యమున నే గాని విశద పడఁజాలవు. గుజరాతీ ప్రదే
శమునందు(1) కాడీ ప్రాంతము (2) బరోడా ప్రాంతము(3)న వ్సారీ ప్రాంతమునని పటము పైఁ జూపఁబడిన ప్రాంతములు (అనఁగా మనజిల్లాలఁ బోలు ఖండములు) గలవు. కాథియవాడ యందలి రెండు భాగములలోని భూప్రదేశమునకును అమేలి ప్రాంతము అని పేరు.
ఈ ప్రాంతములకు నెల్లలు వేరు వేరుగఁ దెలిపినచో నొకకొంత సహకారిగ నుండును. అన్నిటికంటే నుత్తరమున నుండు కాడీ ప్రాంతమునకు ఉత్తరమునను పశ్చిమోత్తరమునను పాలంపూరు రాధంపూరు సంస్థానములున్నవి. దక్షిణ భాగ మునను గొంతపడమటను బొంబాయి రాజధానికిఁ జేరిన అహ మదాబాదు కేయిరా జిల్లాలుగలవు. తూర్పున మహీకాంత సంస్థానముగలదు. బరోడా ప్రాంతమునకు ఉత్తరమున కేయిరా జల్లాయును; పశ్చిమమున కేయిరా కాంబే బ్రోచి జిల్లాలు ను; దక్షిణమున నర్మదానదియును, బ్రోచి జిల్లాయును, రివా కాంత సంస్థానములును; తూర్పున వాకాంత సంస్థానమును పంచమహాలు జిల్లా యును గలవు. నవ్సారిప్రాంతమును సూరతు జిల్లా ఉత్తరమునుండి దక్షీణమునకు రెండు భాగములుగ విభ జించుచున్నది. దీనిని మనస్సున నుంచుకొని మొత్తముమీఁద నీప్రాంతమునకు నుత్తరమున బ్రోచి జిల్లా యును రివాకాంత సంస్థానమును పశ్చిమమున సూరతుజిల్లాయును పశ్చిమ సము ద్రమును, దక్షిణమున సూరతుజిల్లాయును బానస్ డా సంస్థా
నమును డాంగులును, తూర్పున ఖాండేషు జిల్లాయును ఎల్లలని
చెప్పవచ్చును. ఇఁక కాథియవాడలోని అమేలి ప్రాంతము
భిన్న భిన్న ముగ నున్నది. జునగడు మున్నగు కాథియవాడ సంష్ణా
నములు అందలి ముఖ్యభాగమును జుట్టుకొని యున్నవి. మఱి
యొక భాగమగు ఓఖాముండలము పశ్చిమసముద్ర తీరమునను
కచ్చిఖాడీ తీరమునను వ్యాపించి భూపార్శ్వమున నవానగరసం
స్థానము చేఁ జుట్టఁబడియున్నది. ఇందే ద్వారకా నగరముగలదు.
నైసర్గిక స్వరూపము.
ఈ సంస్థానపు విస్తీర్ణము 8099 చదరపుమైళ్లు. జన సంఖ్య 19,52,692. ఈ సంస్థానమున ఎత్తగుపర్వత పంక్తులు గాని విస్తారమగు నడవులు గాని లేవు. అమేలి ప్రాంతము నందలి 'గిర్' అడవి మాత్రము గుజరాతు దేశపు సింహమున కింకను ఆటపట్టగుటం జేసి కొంచెము ప్రసిద్ధిఁ జెందియున్నది. ఈ సంస్థానమునఁ బ్రవహించు నదులలో ముఖ్యమయినవి సబర్మతి, మాహి, నర్మదా తపతులు. ఇవియైనను బరోడా ప్రాంతమున ఒక కొంత భాగమునకే ఉపయోగకారులు. ఇవి కాక చిన్న చిన్న ఏళ్ల నేకములుగలవు. 'చెఱువులు బావులును మెండుగనున్న వి. ఖండములు ఖండములుగ నుండుటంబట్టి బరో డాసంస్థానపు భూసారమును మొత్తముగ వర్ణింప నలవిగాదు. ! కొంతభాగము నల్ల రేగడి భూమిగను మఱికొంత ఎఱ్ఱమట్టి ప్రదేశముగను వేరొకకొంత సముద్రతీరమయి ఇసుక నేలగను
ఇంకొకకొంత : పచ్చిక బయళ్లుగను నున్నది. ఆ సంస్థానవర్ణన ' నింతటితో 'నాపి చరిత్రకుఁ దరలుదము.
నామప్రశంస.
ఈ సంస్థానమునకు బరోడా యను పేరు వచ్చుట దీని రాజధాని నామమువలననే. రాజధానికి ఆ పేరు మాత్రమే కాక నీర క్షేత్రము లేక వీరవాటి యనియును, చందనవతి యనియును నామములుం డెడివి. ప్రేమానందుఁడను పదు నేడ వశతాబ్దపు, గుజరాతి కవి వీర వాటియను పేరుతోఁగూడ వడో దరొయను పదమును వాడియున్నాఁడు. అయినను ఏ పేరు ఎప్పుడు వచ్చినదియును మనము నిర్థారణగఁ జెప్పఁజాలము, ఆంగ్లేయ ప్రవాసికులును వర్తకులును మాత్రము మొదటి నుండియు దీనిని జోడీగా అనియే పిలుచుచున్నారు. కావున బరోడా నామమనే మనము గ్రహింతము. . ఇది 'వటోదర ' యొక్క వికారనబు చెప్పవలసి యున్నది. దీని వలన నీ నగరము వటవృక్షముల ,మధ్యనుండుటం జేసి ఇద్దానికా పేరు సిద్ధించిన దని ఏర్పడుచున్నది. ఈయుత్పత్తియే సరియైన దనుటకు బరో డా నగరమును జుట్టుకొని యుండు మహావటవృక్షము లేసాక్షి. ఇట్టి పవిత్ర వృక్షములవలన, నామముగాంచిన ఈపవిత్ర సం స్థాన చరిత్రము పదు నెనిమిదవ శతాబ్దారంభమునఁ బ్రారంభ మగుచున్నది .
గుజరాతు సీనుకు ... మొదట 'మహారాష్ట్రులు 1705 వ సంవత్సరమున దండెత్తివచ్చిరి. 1712 న సంవత్సరమున నట ఖండే రావను మహారాష్ట్ర నాయకుఁడు . ప్రబలుఁడయి' "కాన్పిం చెను. అతని యనుమతి లేనిది . గుజరాతుఁజొచ్చు ప్రవాసికుల సొత్తునందు నాలవవంతు నతఁడు."లాగుకొన మొదలిడియెను. మహారాష్ట్రులకును' మహామ్మదీయ చక్రవర్తి ప్రతినిధులకును జరుగు చుండిన విగ్రహమున దీక్ష తోఁ బనిచేసి మహారాష్ట్రుల లోఁ బుట్టిన అంతః కలహములలో ‘సాహోజి' పక్షమగుట వలన నతఁడు సాహోజిచే సేనాపతిగ నియమింపఁబడెను. (1716) నాలుగు సంవత్సరములకుఁ దరువాత ఢిల్లీ పాదుషాహగారగు మహామ్మదుషాహ మహారాష్ట్రులకు గుజరాతునందు చౌతు పన్నును*[1] వసూలు చేసికొనుట కు తరువిచ్చెను. సతారారాజు ప్రతినిధిగ సేనాపతియయిన ఈ ఖండే రావె గుజరాతునందు కార్యమునకు నేర్పఱుపఁ బడెను. ఇట్లుండ 1720న సంవత్సర ప్రాంతమున స్వాతంత్ర్యము నెఱపం బ్రారంభించి యుండిన నైజాముల్ ముల్కునకును దక్కనునకు ప్రతినిధిగ బాదుషాహ గారిచేఁ బంపఁబడియుండిన ఆలింఆలీకును బాలాపురము వద్ద యుద్ధము జరిగెను. అప్పుడాలిం ఆలీకి సాహాయ్యలుగ ననేక మహారాష్ట్ర ప్రభువు లేగియుండిరి. అందును ఖండేరావు సైన్య ములు మహా ధైర్యసాహసములతోఁ బోరెను. ఆతరుణమున నే .........................................................................................
-
అతని క్రింది యధికారులలో నొక్కండగు దామాజిగాయిక వాడు తన ప్రావీణ్యముచేఁ బ్రాముఖ్యము నంది షంషర్ బహ దూరు అనుబిరుదమునం దెను. ఆపట్టము నేఁటికిని గైకవారుసుత తివారు వాడుకొనుచున్నారు. 1721వసంవత్సరమున ఖండే రావును దామాజియును నిద్దఱును బరలోక ప్రాప్తి జెందిరి. ఖండేరావునకు త్రయంబక రావను నతఁడు కుమారుఁడు గలఁడు. 'దామాజిపేరు నిలుపుట కతని సోదరుని కుమారుఁడగు 'పిలాజీ చాలియుండెను.
పీ లా జి (1721-1732).
ఇతఁడే బరోడా సంస్థానమునకు మూలస్థాపకుడు. గాయిక వాడులకు పునహామండలము లోని ధావడి మొదటి నివాసస్థానము. కాని వారు సేనాపతికడ నధికార స్థానమున కేర్ప డిన పిదప నాగ్రామము వదలవలసినవారైరి. ప్రారంభమున గాయికవాడులు సేనాపతికి వేగులవారుగ నుపచరించుచుండి రను కథయొకటిక లదు. అయినఁ దరువాతి వృత్తాంతముల నను సరించి చూడఁగ. వీరు సేనాపతి క్రింద గౌరవనీయమగునధికారము లలోనే చాల కాలముండిన ట్లగుపించుచున్నది. పీలాజీగాయిక వాడు మొదట ప్రస్తుతపు ఖాండేషు జిల్లాలోని నవాపురమందు ఏబది స్వారులకు నాయకుఁడుగ నగుపడుచున్నాఁడు. కార్యసా ధనాశ క్తివలన నీతఁడు రెండుమూఁడు వందలస్వారులకు నాయ కత్వమున కెక్కి సూరతు పట్టణమును గొనుటలో విజయుఁడయి ఒక ' పాగా'కు, అనఁగా నొక సైన్యమునకు, నధి కారిగ నియ మింపఁబడెను. నాఁటినుండియు నతఁడు గుజరాతు పై కెత్తి పోవుటయం దుద్యుక్తుఁడయి వాసిఁగాం చెను. రమారమి ఆసమ యముననె అంతః కలహముల వలన నతఁడు తన నివాసస్థాన మును నవాపురమునుండి 'సోనఘడు' నకు మార్చి అచ్చటి నుండి కార్యములు నడుప వలసిన వాఁడయ్యెను. కావున “సోనఘుడు' గాయిక వాడులను బోషించిన దాదియనుటలోఁ దప్పుండదు. ఇంతియ కాక 1776 వఱకు బహుకాలము వారికదియె రాజధానిగ నుపచరించు చుండెను.
కొన్ని సంవత్సరముల కాలము ‘పీలాజి. ఇతర మహా రాష్ట్ర నాయకులను తోడు చేసికొని ‘సూరతు అట్టావీసి అనఁగా సూరతునకుఁ జేరిన ఇరువది యెనిమిది చిన్న భాగ ములను దాఁకి కప్పమును సంపాదించుకొనుచుండి 1728 వ సంవత్సరమున సూరతు నగరము నే ముట్టడించి అచ్చటి పరి పాలకుని బరాజితు నొనర్చి గుజరాతునుండి క్రమముగ కప్ప మునదిమి పుచ్చుకొనఁ జొచ్చెను. పాడ్రా, భాని, భాయాలీ గ్రామముల దేశాయీల సాయమున నతఁడు మాహీ నదివఱ కును గుజరాతును గొల్లం గొట్టెను. 1725 వ సంవత్సరమున కృతయు నితఁడు బరోడా, నాందోడు, చాంపనీరు, బ్రోచి, సూరతు మండలములకు హక్కు స్థాపించుకొని “సోనఘడు, వచ్చి చే రెను. ఆ సంవత్సరమున నే సేనాపతీయును ' పీలాజి' స్వాధీ
నములో నుండిన ' ధాబాయి' యను గ్రామమునకు దరలివచ్చి
దానినే రాజధానిగ నేర్పఱచుకొనెను.
తరువాతఁ గొంతకాలమువఱకును మపారా ష్ట్రుల కపజయముపయి నపజయము సంభవించెను. “పీలాజి' మొదట కాంబే'కును - పిదప సూరతు నకును బారిపో వలసిన వాడయ్యెను. కాని మహమ్మదీయ ప్రతినిధియగు సర్బులందుభానునకు ఢిల్లీ నుండి సాయము రానందున మఱల మహా రాష్ట్రులు విజృంభించుట కనుకూల మయ్యెను. మా హీనదికి దక్షిణ తీరముననుండు జిల్లాలలోని ,పన్నులలో నొక్క భాగమునకు ' పీలాజి కి అర్హతగలదని అతఁడొప్పుకొనియెను. కాని మహారాష్ట్రులలోనే పీష్వాకును సేనాపతికిని విరో ధము ప్రారంభమయి యుండెను. కావున పీష్వాపరముగ “పొ న్వారు' ( పీలాజిని' ఎదురింప నియమింపఁబడియెను. ఇంతేకాక పీష్వా బాజీరావునకును సర్బులందుఖానునకును మైత్రి జరుగుట వలన పీష్వా సర్బులందుఖానునకు ' పీలాజి ' నణఁచుటలో దోడ్పడినచో నతనికి చౌతుపన్నును దానితో గూడ సర్ - దేష్ - ముఖిపన్నును (అనఁగా పన్ను నందు మఱియొక , పదియవ వంతును) అందునట్లు సంధిజరిగెను. కాని ‘ పీలాజి' కదృష్ట సమ యముగ నుండుట వలన నతఁడు 'దాభాయి' ' బరోడా' పట్టణ ములను స్వాధీనము చేసి కొనెను. దీనికిఁ దోడుగ సర్బులందు ఖాను పీష్వాతోఁ జేసికొనిన సంధి ఢిల్లీ బాదుషాహగారి వలన నంగీకరింపఁ బడక పోవుటచే నతని స్థానమునఁ బ్రతినిధిగ 1730లో జోధపురమునకు 'రాజుగనుండిన అభయసింగు నేమింప బడెను.
ఈ అభయసింగుతోఁగూడ పీష్వా ' పీలాజి' కవ్యతి రేక ముగ మైత్రి చేసికొని ఏలాగైనను ఇతనిని బరోజు నుండి వెడలఁ గొట్ట వలయునను పట్టుపట్టెను. 1781 వ సంవత్సరమున నీ ప్రయత్నమున బయలు దేరుటతో నే నైజాముల్ , ముల్కు తన పైకి దాడి వెడలనున్నాఁడను నార్త వచ్చుటవలన పీష్వా మరలి పోయెను. అట్లు పోవుచుండ మార్గమున. నతని సైన్యములకు గాయిక వాడ్ సేనాపతుల దండు లెదురుపడెను. యుద్ధము ప్రారంభమాయెను. అందు సేనాపతి మడిసె. గాయక వాడునకు గాయము తగిలె. వారి సై న్యములు అపజయమందెను. ఇదియే ప్రసిద్ధి చెందిన భీలా పుర యుద్ధము.
ఈ యుద్ధమునకు యుద్దమునకు దరువాత. “ పీలాజి' మఱల 'సోన ఘడు బరువెత్తిపోయెను. కాని పీష్వా కాని పీష్వా తక్కిన మహారాష్ట్ర నాయకులను నశింపఁ జేయు నుద్దేశము లేని వాఁడగుట మడసిన సేనాపతి కుమారుఁడగు జస్వంత రావు నకు సేనాపతిత్వమును * పీలాజి ' కి ' ముతాలికత్వము'ను అనఁగా ప్రత్యధి కారమును (Deputy) ఇచ్చి ' పీలాజి' కి సేనా ఖాస్ "ఖేల్ " అనుబిరుదము నెసం గెను. “ము తొలికుఁ , డైనం దున ' పీలాజికి' సేనాపతికిఁ గల సర్వాధికారమును దొర కెను,
దానితో నతఁడు అభయసింగును రూపుమాప గడంగెను కాని మాయోపాయమున వీఁ డె యతనినిజంపిం చెను. అయిన నాహం తకునకుఁ దగినశత్రువు గాయిక వాడులలో లేక పోలేదు.
దామాజి II (1732-1768).
పీలాజికునూరుఁడు అగు దామాజి II తండ్రి ప్రయత్న ములను సార్థకపఱచి గొప్ప రాజ్యమును సంపాదింప నుండెను. .
- పీలాజి' మరణముతో మహారాష్ట్రులు సరియగు నాయకుఁడు
లేమిచే చెల్లా చెదరయి యుందురను నమ్మకముతో నభయసింగు బరోడా నగరము పై దండెత్తి ఆపట్టణమును కోటను బట్టుకోని యెను.దామాజి దాయికిఁ దరలిపోయి అటనుండి అహమ్మ దాబాదుమార్గమున నే త్తిపోయి ప్రతీకార మొనర్ప సిద్ధపడ మొదలిడెను. “ పీలాజి' కిఁ బూర్వ స్నేహితుఁడగు పాడ్రాగ్రామపు దేశాయి బిల్లు లనుకోలులను మహమ్మదీయుల మీఁదికిఁ బురి కొల్పి యల్లరులు జరిగించెను. గాయిక వాడు కుటుంబపు బలము లు 'సోనమడు' నందు వచ్చిచేరెను. పీలాజితో వీరస్వర్గమందిన సేనాపతి భార్య 'ఉమాబాయి' గాయిక వాడులకు సాహాయ్య ముచేయ , నే తెంచెను. ఇట్టి సన్నాహములతోఁ బనికిఁ బూనిన 'దామాజి' కి విజయమగుట కేమి సందియము ? అహమదా బాదునందుఁ గొంచెము గెలుపు గలిగిన దే గాక బరోడా మఱల నతని వశమయి పోయెను. నాఁటినుండి నేటివఱకా నగరము గాయిక వాడుల ఆధీనమందే యుండియున్నది. బరోడా వచ్చి .
చేరిన పిదప “దామాజి' స్వయముగ బయలు వెడలి అభయ సింగు రాజ్యమును అనఁగా జోధపుర ప్రదేశమును ఆక్రమించి కొల్లగొట్ట నారంభించెను. దీనికి జడిసి అతఁడు గుజరాతువదలి తన రాజ్యమును గా పాడుకొనుటకై పోయి చేరెను. అంతట. అభయసింగు స్థానమున ‘మోమినాను' అను నతఁడు బాదు షాహగారి ప్రతినిధిగఁ బంపఁబడెను.
అతఁడు అహమదాబాదునందలి మార్వాడీల తొంద రలకు, దాళ లేక 'దామాజీ'కి సేనానాయకుఁడగు రంగోజి యొక్క సాహాయ్యమును గోరి దాని కుపకృతీగ గాయిక వాడునకు గుజరాతు పన్ను లో నించుమించుగ సాబాలు నిచ్చి వేసెను. అట్లగుట 'దామాజి' కిని ఈ బాదుషాహ ప్రతినిధికిని 1742 లో“ దామాజి ' మృతినొందువఱకును స్నేహము వర్ధిల్లెను. రమారమి 'దొమాజ'కిని 'మోమిం ఖాను' నకును మైత్రిసమకూరు కాలమున నె గుజరాతునం దును కాథియవాడునందును గాయిక వాడు నధి కారము ప్రబలు ముగాఁ జొచ్చెను. బాన్నా పట్టువడుటయును నైజాము నౌకరుచే పాలితంబగుచుండిన బ్రోచిపట్టణమున వసూలగు సుంకముతోసర్థ భాగ మితనికిఁ జెందుటయును దీనికి నిదర్శన ములని చెప్పనొప్పును. ఇంతియగాదు. సేనాపతిగ నేర్పఱుసం బడిన జస్వంతరావు అసమర్థుఁడయినందున నితఁడే ఉమా ' బాయికీ ముఖ్యమంత్రియయి కార్యములు నడుపు చుండెను. కావున
సేనాపతి శక్తియంతయును నీతని యంద "నిలిచియుండె. ఇట్లు
సర్వవిధముల - బలమెక్కుచుండిన సమయమున 'దామాజి'
మాళవముమీఁదికి నెత్తిపోయియుండెను.. అంతలో మోమిను
ఖాను పరలోకమున కరుగ నతని తావున ఫయా-ఉద్దీను నియ
మింపఁబడి యుండెను. అతఁడు మహారాష్ట్రుల యెడ విరోధ
భానము వహించి రంగోజి నెదిర్చి యోడించెను. కాని
దామాజి, మాళవమునుండి నచ్చిన తోడనే మహారాష్ట్రులకు
మంచి యదృష్టము పట్టెను. ఫయా-ఉద్దీను దేశ భ్రష్టుడై- పరు
గెత్తవల సె. “ పెట్లాడు. రంగోజీవశమయిపోయె. అహమ్మదా
బాదు నగరమున గాయకవాడులకు ఒక భాగము దామాజి
సోదరుఁడగు ఖండేరావుచే సంపాదింపఁ బడియె. సూరతు పట్ట
ణము విషయమున ననేకములగు నంతః కలహములు ప్రా
ప్తించుచుండి నందున “దామాజికీ' 1751 వ సంవత్సరమున నా
నగరపు వరుంబడిలోఁ గొంత భాగము ఇయ్యఁబడునట్లేర్పడెను.
రాజా 'సాగోజి' మరణముతో మహా రాష్ట్రమున శక్తి యంతయును పీష్వా “బాలాజి' చేతులలోనికిఁ బోయెను. పునహా మహా రాష్ట్ర సామ్రాజ్యమునకు రాజధాని యయ్యెను. రాణీ సావిత్రీబాయికిని ' బాలాజి' కిని బద్ధవైరము. ఆమె కొల్హా పురపు రాజుగ నుండిన ‘సాంభాజి' కి మహారాష్ట్ర సామ్రాజ్యాధిపత్యమును ఇప్పించ వలెనని ప్రయత్నించి అందుకు ,సాహాయ్యముగ 'దామాజి' ని రమ్మని వేడెను. 1751వ
సంవత్సరములో సేనాపతి యశ్వంత రావు యొక్క ప్రతినిధి యగుటవలన , ' పీష్వా ఇతనిని గుజరాతునం దర్థ భాగ మియ్యవలసినదని కోరెను. ఆయుత్తరువు - నీతఁడు. దిరస్కరించెను. ఆ సంవత్సరమే తారాబాయ శివాజి సంతతి వాఁడును దన మనుమఁడును నగు సతారారాజును మహారాష్ట్ర దేశముతోఁ గూడ పేష్వాల చేజనుండి తప్పించ వలసినదని ఇతనికి నుత్తరు విచ్చెను. ఆముడల ననుసరించి ఇతఁడు 15,000 సైన్యముతో 'సోనఘడును' వదలి పయనమయి మార్గమున నెదురువడిన గొప్పదండు నొక దానీని ఓడించెను. కానిపీష్వా బలములతోఁ బోరుసమయమున నీతఁడు వానిచేఁ బూ ర్తిగఁ జుట్టఁబడుట వలన సంధిఁ జేసికొన నిష్టము సూ పెను. పీష్వాఆలోచన సల్పుచుండినట్లు నటించి మోసపుచ్చి ఇతనిని బట్టుకొని పునహా నగరమునఁ గారాగృహ మందుం చెను. అటు తరువాత పీష్వా గుజరాతును మొగలాయీలనుం డియు దామాజిపక్షము వారినుండియు లాగుకొనఁ జూచెనుగాని అతనికది సాధ్యము కాదయ్యె. కావున నతఁడు దామాజితో స్నే హపుమాటల నడ పెను. చేయునది లేక దామాజి పీష్వాకు గుజ రాతునందు సగపాటు నిచ్చి వేయునట్లును ముందు తాను జయించు భూభాగములలోగూడ నర్థభాగము పీష్వాకు . చెందునట్లును, నిబంధ నలొనర్చు కొనెను. ఇంతియ కాక వలసినప్పుడు పీష్వాకు ' ' సాహాయ్య మనుషఁ దాను 10,000 సైన్యమును సిద్ధముగ నెల్లపు
డుంచు కొనుననియును కప్పము క్రింద 5 లక్షల 25 వేల రూప్య
ములు పీష్వాకుఁ గట్టుననియును గూడ నితఁ డొప్పుకొనియెను.
1758 వ సంవత్సరమున దామాజియు నితర మహారాష్ట్ర
నాయకులును జేరి అహమ్మదాబాదు పై కెత్తిపోయి మహా
ధైర్య సాహసములతో డీకొని పోరాడిన జవాన్ మరద్
ఖాన్ బాబిని పరాజితుఁ జేసి ఆనగరమును స్వాధీన పఱచుకొని
నాఁటినుండి గుజరాతునందు మొగలాయీల యధికారము
నడుగంటఁ జేసిరి. క్షీణింపఁ జొచ్చిన మొగలాయీల నుండి
క్రమక్రమముగఁ దీసికొనఁబడు చుండిన భూభాగము పైనుద
హరించిన సంధి వలన గాయిక వాడునకును పీష్వాకును సమభా
గములుగఁ జేరుచుండెను.
ఇట్లు పీష్వాతో స్నేహము చేసికొనుట నలన నాతని తో బోరాటముదక్కి దామాజి దినదిన ప్రవర్ధమానమగు శక్తిని సంపాదించుకొనెను. 1761న సంవత్సరమున మహా రాష్ట్ర సామ్రాజ్యము సంతరింపఁ జేయుట కేర్పడిన మృత్యు ముఖమో నా సంఘటించిన మూఁడన పానిపట్టు (కురుక్షేత్ర ఘోరయుద్ధమున నిలచి సంగర మొనర్చిన వీరులలో నీ దామా జియు నుండె. తనసాధ్యమగు వఱకు సదాశివరావుభావుకు సాహాయ్య మొనర్చి కార్యముతప్పుట దోఁచిన పిదప నితఁడు అదృష్టవశమున నెట్లో తప్పించుకొని గుజరాతువచ్చి చేరెను. అచ్చట మహమ్మదీయు లదియే సమయ మనుకొని మహా
రాష్ట్ర బలంబుల నణంపఁ బ్రయత్నించు చుండుటం గాంచి ఈతఁడు తరుగని సాహసమున పెనఁగి ఏకమగు చుండిన మహమ్మదీయ శక్తుల నడచినై చెను. దీనికిఁ దరువాత బహు స్వల్ప కాలములో నే ఇతఁడు దన రాజధానిని సోనఘడు నుండి “పట్టను' నకు (అనఁగా ప్రాచీన అవొల్వాడకు) మార్చుకొ నెను. 1768 మొదలు 1766 లోనితఁడు మహమ్మదీయుల నుండి ప్రస్తు తపు 'కాడీ' ప్రాంతమునంతయు సంపాదించి 'కాథియవాడ యందుంగూడ విస్తారమగు భూభాగమును గడించెను.
ఈ విజయముల వలన నితని బొక్క.సమునకును మిక్కుట మగు ద్రన్యము చేరెను. ఈడా, రాజపిప్పలా సంస్థానములును గప్పములుగట్టువారైరి. ఇట్లుండ పానిపట్టు యుద్ధమునకు వెనుక అచిర కాలములోనే వీష్వా బాలాజీ పరమ పదమందెను. పసివా డగు మాధవ రావు పీష్వాపదమునకు వచ్చెను. అతనికాతని పిన తండ్రి రఘోబావలననె చిక్కులు తటస్థించెను. బాలాజి మృతి నొందు వఱకు దామాజి పన్నులలో నాతనికిఁ జేరవలసిన భాగ మును గ్రమముగ నిచ్చుచుండినను లేకున్నను ఆతని విషయ మునఁ గుట్రలుపన్నుటకు మాత్రము సాహసించి యుండ లేదు. కాని అతని తరువాత పీష్వాపదమున కై మాధవరావునకును, రఘోబాకును పెనఁగులాటలు దటస్థించి నప్పుడు పీష్వా యొక్క దుర్భర యాజమాన్యమును దప్పించుకొను నుద్దేశము తో దామాజి రఘోబాతోఁ జేరికొనెను. వీరిరువురకును గలి
గిన' స్నేహమువలన గాయకవాడులకుఁ గట్టకడపట నష్టము వాటిల్లెను. మొట్ట మొదట దామాజి రఘోబాకు సాహాయ్యుఁ డయి పీష్వాగారి సైన్యముల నోడించుచు వచ్చెనుగాని 1768 వ సంవత్సరమున మాధన రావు ' ధోడపు' వద్ద రఘునాధ రావును దామాజ కుమారుఁడగు గోవిందరావుతోఁ గూడఁ బట్టుకొనెను. దామాజి సంవత్సరమునకు 5,25,000 లు కప్పము పీష్వాకు కట్టుటకును శాంతిసమయముల 3000 స్వారులను యుద్ధ సమయ ముల 4900లను ఆతనికయి సిద్ధపఱచి యుంచుటకును పీష్వా మరలించుట 'కియ్య కొనిన కొన్ని జిల్లాలకు గాను రు 2, 54,000లు ఇచ్చునట్లును ఒడంబడిక చేసికొనెను. ఈ యుద్ధమునకుఁ బిదప బహు' స్వల్ప కాలములోనే దామాజి పరలోకమున కేగుట వలన గాయిక వాడుల స్థితి మిక్కిలి హైన్యము చెందిన దయ్యెను.
గో విందరావు (మొదటిసారి). (1768-1771)
దామాజికి నాల్గురు పుత్రులు. అంచు సయాజిరావు అను ప్రథమపుత్రుఁడు వెర్రివాఁడు. రెండవ వాఁడగు గోవిందరావు పున హాయందు ఖయిదీ పోలెనుండె. వీరిరువురును ఇద్దరు భార్యల బిడ్డలు. దామాజిరావునకు మూఁడవ భార్యవలన మరి మువ్వురు కొడుకులుండిరి. పీలాజి, మానాజి, మురారిరావులని వారికి పేళ్లు. "వీరుగాక 'దామాజికీ - రెండవ భార్యవలననో మూఁడవ భార్యవలననో గలిగిన వాఁడు ఫతేసింగను 'నాఱవ : కుమారుఁ'
డునుగలఁడు. ఈతఁడు మహా సమర్థుఁడు. తండ్రి చనిపోయిన తోడనే ఇతఁడు తమ యన్నలలో నెల్ల పెద్దయయి వెజ్జియగు సాయాజి పరమునఁ బని సేయఁజొచ్చెను.
ఇట్లు ద్వితీయ పుత్రుఁడగు గోవిందరావునకును బ్రథమ పుత్రుని మిష పెట్టుకొని ప్రయత్నములు సలుపు నాఱవపుత్రుఁ డగు ఫ తేసింగునకును గాయిక వాడు పదమునకయి వివాదములు ప్రారంభమయ్యెను. పీష్వాకింతియ చాలునుగదా! తనకుఁ బ్రతి స్పర్థిగఁ గార్యములకుఁ బూను చుండిన గాయికవాడు కుటుంబము- నందు కలహములు వచ్చుటయు నవ్వానిని దీర్చుటకుఁ దా నేర్ప, డుటయుఁ దనకు శుభ సూచక ములుగ గ్రహించి గోవిందరావు ఫతేసింగుల వివాదములను బెంచుటకుఁ దోడ్ప డెను. గోవింద రావు దన నగరముననే యుండుటవలన నతనినుండి గొప్ప నజరు గైకొని దామాజివలనఁ జేసికొనఁ బడిన యెడంబడిక కతని సమ్మతిందీసికొని యాతనిసి గాయిక వాడు పదమునకు నేమించి పంపెను. ఈలోపుగ ఫతేసింగు సయాజీరావు పరమున బరోడా నగరమును స్వాధీనము చేసికొని యుండెను.
సయాజారావు I. (1771.1778)
1771 వ సంవత్సరమున నితఁడు పునహాకుఁ దరలిపోయి అచ్చట పలుకుఁబడి సంపాదించికొని గోవిందరావుకంటె నెక్కు డుగ వాగ్దానములు చేసి పీష్వాగా రదివజకు నిర్ణయించి యుండిన ఏర్పాటులను రద్దుపఱచు నట్లొనర్చి సయజిరావు సేనాఖాన్ బేలు
గను దానతని ముతాలికుఁడుగను నుండు లాగున ననుజ్ఞఁగొనెను. ఈవిషయము : లింకను 'జరుగుచుండఁ గనె పీలాజి మూఁడవ కుమారుఁడును "కాడి జహగీరుదారుఁడును నగు ఖండేరావు స్వప్ర యోజనమునకయి . దామాజిపుత్రుల - వివాదములలో జోక్య ముకలుగఁ జేసికొని యొక పర్యాయ మొక్కనికిని మఱియొక పర్యాయము మఱియొక్కనికి సాయము చేయుచు దేశక్షోభము కలుగఁ జేయఁజొచ్చెను. ఇట్టిదురవస్థల కాలమున గుజరాతును సంపూర్ణ ముగ పీష్వా మ్రింగి వేయఁగలఁడను జ్ఞానము మంద బుద్ధిగాని ఫతేసేంగుకుఁ గలిగెను. కావున నతఁడు పునహానుండి మహాతృప్తుడు వోలె బరోడా వచ్చి చేరి అటనుండి బొంబాయి యందలి ' ఆంగ్లేయవ ర్తక సంఘము వారితో మైత్రి సంపా దింపఁ బ్రయత్నించెను. అప్పటికది కుదిరినది గాదు. గాని 1778వ సంవత్సరమున బ్రోచి నవాబుతోఁ బోరాడి ఆంగ్లేయు లద్దానిని దీసికొనిన తోడనె వారు ఫతేసింగుతో నాపట్టణమును గుించి సంధి చేసికొనవలసిన వారయిరి. అదివఱకు నవాబు స్వాధీనమున నుండఁగా దాని వరుంబడి యందు గాయిక వాడున కోక భాగము చెందుచుండెడిది. పట్టణము ఆంగ్లేయుల వశమయిన తరువాత గూడ నట్లే జరగవలసినదని ఫతేసింగున కును ఆంగ్లేయవ ర్తక సంఘము వారికిని జరిగిన సంధివలనఁ దీర్మా నింపఁబడెను. దీనికి ఫైఁబడి ఆంగ్లేయులు. ఇతని విషయములలో
గలుగఁ జేసికొననందున నితఁడును గోవిందరావును గొంతకా లము . ఒక్కరితో నెక్కరు ఒంటరిగ పెనఁగులాడు చుండిరి. ఇట్లుండ పుసహాయందు నవీనములగు విశేషములు చూప ట్టెను.పీష్వామాధవరావు 1772 వ సం|| ననంబరు నెలలో మృతుఁ డయి యుండెను. ఆతనిసోదరుఁడు నారాయణరావు 1773 లోఁ జంపఁబడెను. ఈయల్లకల్లోలములలో రఘునాథరావు గద్దెనాక్ర మించుకొనియె. అతఁడు 1778వ సంవత్సరాంతమున సయాజిరా వును సేనాఖాన్ ఖేల్ పట్టమునుండి తొలగించి తనకుఁ బూర్వ స్నేహితుఁడగు గోవిందరావు కద్దానిని మఱలించెను. గోవిందరావిట్లు పీష్యాగారియను గ్రహమువడసి వెడలివచ్చి 'సోనఘడును" ముట్టడించి స్వాధీన పజచుకొనెను. ఈలోపుగ మృతినొందిన మాధనరావున కొక చిన్ని కుమారుఁడు 'పుట్టుటయు పునహా యందు రెండుకక్ష లేర్పడెను. రఘునాధరావాచిన్ని కుమారుని సింహాసనార్హుఁడుగ నంగీకరింపనందున నానాఫడ్నవీసు ముఖ్యుఁ డుగ మంత్రు లెల్లరును రఘునాథరావుపై వైరమూని అతనిని పున హానుండి వెడలఁ గొట్టిరి. అతఁడు బొంబాయిలోని ఆంగ్లేయ ప్రభు త్వము వారిని సాయము చేసికొని నానాఫడ్న వీనుతోఁ బెనఁగ సమక ట్టెను. గోవిందరావు ఫతేసింగు లిరువురును అతనికి సాహా య్యమువత్తురను వార్తయుండెనుగాని తుట్టతుదకు గోవింద రావుమాత్ర మతనింజేరెను. గోవిందరావు రఘునాధ రావులు ఫ తేసింగును బరోడాయందుముట్ట డించిరిగాని పునహానుండి యత
నికి సాహాయ్యము వచ్చినందున విఫలమనోరధులయి వదలిచనిరి.. నాఁటినుండి ఫతేసింగు పునహామంత్రుల పరమున సంగరరంగమున మహాశూరుఁడయి తన యావచ్ఛక్తినిజూపదొడఁగెను. పునహా బలము లాంగ్లేయులకు నిలువ లేక అనేక పర్యాయములు విజయ మందకపోవుట సత్యమేకాని ఆంగ్లేయ సైన్యములు మాత్రము రఘునాథరావు యొక్కయు గోవిందరావు యొక్కయు పిచ్చిపటా లములు బరువై వ్రేగుటవలన గొప్పనష్టముల నందెను. గుజరాతు నందు జరుగుచుండిన విగ్రహము 1775 సంవత్సరము మే నెల కడ పటి దినములలో సమాప్తి నొందెనని చెప్పవచ్చును. అప్పటికి ఫతే సింగు బరోడాయుదు సర్వస్వామిగనుండె. గోవిందరావు ఆంగ్లే యగుకర్నల్ - కీటింగుతోఁగూడ దురవస్థ లందుచుండెను. అట్టి య సేనాని సమయమున గోవిందరావు కర్నలు కీటింగును బరోడా ముట్టడించి తనవశము చేయవలసినదని యడిగెను. అయిన ఫతేసిం గు చాతుర్యము లేనివాడు కానందున నాతఁడు శత్రుగణము లోని వాడయినను అదివఱకె ఆంగ్లేయులతో మైత్రి గడింపఁ బ్రయ త్నించుచుండెను.
ముట్టడించి బరోడాను గొనవలసిన గోవింద రావునకుఁ దోడ్పడుట కంటె బరోడాను సర్వస్వాధీనమున నుంచుకొనిన ఫతేసింగుతో స్నేహము కుదుర్చుకొనుట దుర్దశల పాలగుచుం డిన రఘునాథ రావునకును కర్నలు కీటింగునకును లాభకారిగఁ దోఁచెను. కావున వారు గోవిందరావు నట్టెవదలి ఫ తేసింగుతో
సంధివాక్యములకుఁ బ్రారంభించి జూలై నెల 8 వ తేది యొడం బడిక చేసికొనిరి. దానివలన సయాజి రావు పరముగ ఫతేసింగు రఘునాథ రావునకు సంవత్సరమునకు 8 లక్షలరూపాయి లిచ్చు నట్లును, వలసినప్పుడు మూఁడు వేల సైన్యములు సాహాయ్య మంపునట్లును, ఆంగ్లేయులకు, పీష్యాకును వారికిని జరిగిన సంధి ననుసరించి, బ్రోచి పట్టణపు వరుంబడియును మఱికొన్ని పరగణా లును ఇచ్చునట్లును గోవిందరావుకు ఫతేసింగు సయాజిరావు లేమియు నియ్యనక్కర లేనట్లును ఏర్పడెను. ఇంతేకాక ఫతే సింగు రఘునాధరావునకు రు 26 లక్షలు నరువది దినములలో నిచ్చుట కంగీక రించెను. ఈ మొత్తము కర్నలు కీటింగునకు సైన్య ముల జీతము బత్తెములకు గావలసి వచ్చినందున నతఁడు ఫతేసిం గును అదలించి బెదరించి చాలభాగము వసూలు చేసికొనెను. ఈలోపుగ బొంబాయి ప్రభుత్వము వారు రఘునాథరావుతో జేసికొనిన సంధిని కలకత్తాలోని యాజమాన్య ప్రభుత్వమువారు రద్దు చేయుట సంభవించెను. ద్రవ్యము లాగుటకయి ఈవిషయ మునుగూడ కొంత కాలము గప్పి పుచ్చి కర్నలు కీటింగు ఫతేసిం గునుండి 20 లక్షల వఱకును రాఁబట్టెను. కాని వానలు నిలచి పోయిన తోడనే యాజమాన్య ప్రభుత్వము వారి యుత్తరువు ననుసరించి కర్నలు కీటింగు బరోడా ప్రాంతమువదలి చనెను. రఘునాథరావును అతని వెంబడి నియరిగె. కావున గోవింద రావు ఫతేసింగులు మఱల నొక్కరొక్కరుఁడుగనె పోరాడ .
మొదలిడిరి. ఫ తేసింగు గోవిందరావునకు అప్పటి బరోడా సంస్థ
నమున మూడవవంతు నిచ్చెదనని యొక పర్యాయమును నంత
కంటే నెక్కుడిత్తునని మఱియొక పర్యాయమును, వార్త
బంపెను. కాని దుర్బోధనల వలన గోవింద రావు వీనికన్నిటికిని
పెడచెవి నిడియెను. తరువాత జరిగిన విశేషము లెవ్వి యోమన
మెఱుంగము గాని 1778 వసంవత్సరమున ఫతేసింగు బహుస్వ
ల్ప ద్రవ్యమును వెచ్చించి పీష్వానుండి సేనాఖాన్ 'ఖేల్ పట్టము
నందెను. గోవిందరావు నాఁటినుండి రెండు లక్షల రూపాయిల
జహగీరుతోఁ దృప్తిఁ జెందవలసిన వాఁడయ్యెను.
ఫత్తే సి 0 గు (1778-1789).
ఇట్లు ఫతేసింగు గాయిక వాడు పదమున స్థిరపడియెను. ఇతఁడు సింహాసనమునకు వచ్చిన ప్రథమ దినములలో పురందరు సంధివలన మహా రాష్ట్రులచే నాంగ్లేయులకు స్వాధీన పఱుపఁబడి యుండిన బ్రోచి నగరమును మఱల సంపాదించుటకయి విశ్వ ప్రయత్నములు చేసెను. ఆపట్టణము గాయిక వాడునకుఁ జేరిన దగుటచే అతని యుత్తరువు గాని సమ్మతిగాని లేనిది ఇతర మహా రాష్ట్రు లద్దాని నిచ్చకు వచ్చిన ట్లిచ్చి వేయుట న్యాయము గాదని వాదించి దానిని రాబట్టుకొనఁ జూచెను. తనయొద్దనుండి కర్న లు కీటింగు తీసికొనిన ద్రవ్యము విషయమునను గూడ .. నాంగ్లేయులతోఁ గొంత పెనఁగులాడెను. కాని ఫల మేమియు లంభిచినదిగాదు. 1779వ సంవత్సరమున పునహామహారాష్ట్రుల
కును ననఁగా పీష్వాకును ఆంగ్లేయులకును మఱల విగ్రహము ప్రారంభమయ్యెను. అందు గాయిక వాడు మహారాష్ట్రులఁ జేరు వాఁడేగాని కర్న లుగా డ్డార్డు గాయిక వాడు రాజ్యమును ఆధార భూమి (base of operation) గఁ జేసికొనుట యావశ్యకమని తలంచి బొంబాయిలోని సైన్యములను జేర్చుకొని యక స్మాత్తుగ దాభాయిని గొని బరోడాకుఁ బోయి చేరుటవలన గాయిక వాడు నానాఫడ్నవీసు పలు తెఱంగుల వేడుచున్న ను నాతనివిడిచి ఆంగ్లే యులకు సాహాయ్యుఁడు గావలసివచ్చెను. 1780 వ సంవత్సరము జనవరి నెల 26వ తేది ఫతేసింగునకును ఆంగ్లేయనర్తక సంఘము వారికిని కండీలాగ్రామమునద్ద సంధి జరిగెను.;
ఈసంధివలన పీష్వాకు గుజరాతు నందుండిన భాగము ఆంగ్లేయులకుఁ జేరిపోయెను. గాయిక వాడు గుజరాతు నందు దన భాగమున స్వతం పరి పాలకుఁ డయ్యెను. . ఇట్లు. పంచుకొనుటలో సౌకర్యముకోఆకుఁ గొన్ని ప్రదేశములు మార్చుకొనఁబడెను. అందుచే ఫతేసింగు నకు అహమ్మదా బాదు మున్నగునవి దొరకెను. ఆంగ్లేయులకు మాహికి దక్షిణ మందుండిన పీష్వా యొక్క భూభాగము చెందెను. గాయిక వాడు పీష్వాకు చెల్లించు చుండిన కప్పమియ్యక తిరస్కరించు టలో నాంగ్లేయులు దోడ్పడ నొప్పుకోనినందున వారీ కాతఁడు జిన్నూరు జిల్లాయును బ్రోచికి సంబంధించిన మఱికొన్ని గ్రామ ములును శాశ్వతముగ దానము చేసెను. వారును అతఁడును
పరస్పరము సాహాయ్యము చేసికొన నియమించుకొనిరి. ఈసంధి కిఁ దరువాత సింధియా ఫతేసింగును పీష్వా ప్రక్కకు లాగుకొనుట కెన్నియో ప్రయత్నములొనర్చెనుగాని అవి యెవ్వియును గాయిక వాడును గదలింప లేకపోయెను.
ఇట్లాంగ్లేయుల యెడ సంపూర్ణ విశ్వాసము గలిగి ఫతే సింగు వారికిఁ దోడ్పడు చుండెను. కాని ఈలోపుగ నైజా మును 'హైదరాలియును మహారాష్ట్రులును నైక్యమగుదురను పెద్ద 'భయ మొక్కటి చూపట్టినందున యాజమాన్య ప్రభుత్వము వారు పీష్వాసంధి వాక్యములకుఁ జేవియిచ్చి లోఁబడిరి. అందు వలన సాల బేసంధి 1782 లో జరిగెను. దాని నిబంధనల ననుస రించి గాయిక వాడు మఱల పూర్వపు స్థితికే వచ్చి చేరెను. అతని బొక్క సమునందలి ద్రవ్యము వ్యయమయి యుండుటయు నతని బలములు దగ్గి యుండుటయుఁ దప్ప అతని కేలాటి లాభ మును గలిగినదిగాదు. ఎప్పటివలె పీష్వాకుఁ గప్పము గట్టుట గూడ మఱల నాతనికి సంభవించెను. 1789 వ సంవత్సరము డిశెంబరు నెల 21 వ తేది నతఁడు నగరు మేడ పైనుండి యక సాత్తుగఁబడి మృతి నొందెను.
మానాజి (1789-1793).
ఫతేసింగు చచ్చినతోడనే అతనితోఁగూడ యుద్ధము లలోఁ బని సేయుచుండిన మానాజియనుసోదరుఁడు గోవిందరా వొకమూలనుండి యాక్షేపించుచుండఁగ నె పీష్వాకుఁ దగినంత
నజరునిచ్చి ఫ తేసిం గప్పువడిన 36లక్షల కప్పముగట్ట వాగ్దానము ' చేసి సయాజిరావు . పేరుమీఁద గాయిక వాఁడు పదమును బట్టు కొనెను. అయిన సింధియా గోవిందరావు పరమయినందున నతనికిని మానాజికిని పరస్పర కలహములు 1798 లో మానాజి పైలోకమున కేగువఱకును జరుగుచుండెను. వెర్రి సయాజి 1792 లోనే యుసురులు దొరగియుండె. కావున మానాజీ పితృగణములఁ జేరుట తడవుగ గోవిందరావు గాయికవాడు పట్టమునకు సిద్ధమయ్యెను. అయిన నానాఫడ్న వీసునకు బరోడా సంస్థానము నెట్లైన రూపు మాపనలయునను పట్టుదల యంకు రించి యుండె. కావున నాతఁడు గోవిందరావు నుండి నజరుగ నేమి, ఫ తేసింగు చేసిన బాకీదీర్చుటకనియేమి, సేనాఖాన్ ఖేల్ బిరుదమున కయియనియేమి,గాయిక వాడులు చేర్చుటకు సాధ్య ముగాని మొ త్తమును రాఁబట్టఁజూ చెను. సాల బే సంధివలన గా యిక వాడు రాజ్యమునశింపరాదని నిర్ధారణ సేయఁబడి యున్నం దున నాంగ్లేయు లీతరుణమున గోవిందరావు పక్షము వహించి నానాఫడ్నవీసునకు బుద్ధి చెప్పు వారయిరి.
గోవిందరావు (రెండవసారి 1798-1800).
1798 వ సంవత్సరము డిశెంబరు నెల 19 వ తేది గోవింద రావు సేనాఖాస్ ఖేల్ గ నియమింపఁ బడెను. అయిన నింకొకపో రాటము లేక అతఁను ముఖ్య పట్టణమును ప్రవేశింప లేఁ డయ్యెను..
“అతని యధర్మ పుత్రుఁడగు కన్హోజి సింధియా యొక్క ప్రోత్సాహ ముచే బరోడాయందు నిలచి తండ్రి నెది ర్చెను. కాని అతని సైన్య ము లేయతనిని బట్టి యిచ్చినందున గోవిందరావు సులభముగ ముఖ్యపట్టణమును జొచ్చి కుమారుని చెఱవెట్టెను. వాఁడును మాయోపాయమునఁ దప్పించుకొని పోయి, కాడి ప్రాంతమున 'జమీందారుగ నుండెనని ఇదివఱకు పేర్కొనఁబడిన ఖండేరావు "నకుఁ గుమారుఁడయి తండ్రి కనంతరము జమీను ననుభవించు చుండిన మల్హర రావుతోఁ జేరుకొని గోవిందరావు నెదుర్ప సమకట్టెను. యుక్తిచే గోవిందరావు వారిరువురకును భేదములు పుట్టించి కష్టోజిని మరలఁ బట్టుకొని కారాగృహమునఁ బడవై చెను. మల్హరిరావు చేయునది లేక గోవిందరావుతో నొడం బడిక చేసికొనియెను. గోవిందరావు కాలమున జరిగిన విషయ ములలో నింకొక్కటియె ముఖ్యముగ నర్ణింపఁబడవలసి యున్నది. నానాఫడ్న వీనునకుఁ బ్రతినిధిగ ఆబా షెలూకరు అహమ్మదా బాదున సుబేదారుగ నుం డెడివాఁడు. నానాఫడ్నవీసు సింధియా చేతులలోఁ జిక్కు పడినప్పుడు గోవిందరావు అహమ్మదా బాదు ను బట్టుకొన వలసినదని యుత్తరువాయెను. అయిన నితనికి ఆబా షెలూకరు నెడ మంచి యభిప్రాయముండుటంబట్టి ఈతని మంత్రియగు రాష్ట్రీ' అప్పాజి పదిలక్షుల ద్రవ్యము గొని అహమ్మ దా బాదును ఆబాకు వదలి పెట్టఁ దీర్మానము చేసికొనెను.
కాని ఆ పైకము నిచ్చు విషయములోఁ బోట్లాటలు ప్రారంభ 235 "నాఫడ్నవీసు.
మయినందునను, రావ్జీఅప్పాజీని ఆ బాతిరస్కరించి మాటలాడి నందునను, అంతటితో సిలువక ఆబా బరోడాగోసాయిల 'మొక కొందఱిని దోచుకోని నందునను, గోవింద రావు ఆబా షెలూకరు పై విగ్రహమునకుఁ బూనెను. ఇది జరుగుచుండఁగనె 1800లో నానాపడ్నవీసు పరలోక ప్రాప్తిఁ జెందెను. పీష్వా బాజీరావున కతని మరణమువలన బరువు దగ్గిపోవ నాతని షక్షము వాఁడగు ఆబాను విడువక తరిమి దీనునిఁ జేయవలసినదని అతఁడు గోవిం దరావునకు వార్త పంపెను. నాలుగు నెలలు పోరాటము జరిగిన పిదప ఆబా షెలూకరును అతని సైనికులే మోసపుచ్చు టవలన నతఁడు గోవిందరావు చేతఁ జిక్కి ఖయిదీ యయి పోయెను. దీని వెనుక గోవిందరావున కధర్మ పుత్రుఁడయ్యును నాతనికిఁ బ్రియుండగు భగవంత రావునకు సంవత్సరమున కైదు లక్షలరూపాయి లిచ్చ నిబంధనతో నామకార్థము అహమ్మదా బాదు గుత్త కీయఁబడెను. రాద్దీ అప్పాజి మిక్కిలి బలవంతుఁడ యియుండి నందున ఆతని కింకను శక్తి నీమెల్లక భగవంతరావు ప్రతినిధిగ సింధియా మంత్రి తమ్ముడగు యాదవరావును అహ మదాబాదునకుఁ బంపుటకు గోవింద రావు ప్రయత్నము సేయు చుండెను. ఇట్లుండఁగ నె అతఁడు 1600 సం|| సెప్టెంబరు నెలలో మృతి నం దెను. అతని భార్య సహగమనమున కుంకించెను. కాని రావ్జీ అప్పాజి తమ్ముఁడు బాబాజియును, మీర్ -కమార్ -ఉద్దీ నును మంగల్ సాముల్ పారక్ అను సైన్యములకు వేతన ముల నిచ్చు సాహుకారులును, ఆమెను వారించి ఆమెకుమారుఁ డగు ఆనందరావును గాయిక వాడు పదము నధిష్టింపఁ జేసిరి:
ఆనందరావు (1800-1818).
రావ్జీ అహన్ముదా బాదునుండి తీవ్రగతి నేతెంచి రాజ్య భారము నిర్వహింప మొదలిడెను. అయినఁ దండ్రియుండఁగనె రాజ్యమునకై ప్రయత్నించిన కన్ హోజి మిన్నకుండువాడే? అతడుఁ రహస్యమగ బరోడా ప్రవేశించి సోదరునికడ కేగి అతనికి బోధ లొనర్చి యల్ల నల్లన నున్నతోద్యోగములను సంపాదించుకొనెను. అటనుండి సైన్యముల లోఁబఱచుకొనియె. తన్మూలమున రాజ్య శక్తులన్ని యు నాతని చేతనుండిపోయె. వానిని జాగరూకుఁడై యుపయోగించి యుండిన బాగుండి యుండునుగాని స్పల్పబుద్ధు లకు దూరాలోచన యుండదుగదా! కన్ హోజి కైశ్వర్యము గన్ను లఁగప్పి వేసెను. ఆనంద రావు నెడను, రాణిగారియెడను, ప్రభువుల యెడను, సైన్యముల యెడను, జనుల యెడను నతఁడు కాఠిన్యము సూపనారంభించె. అంతటితో నాతని సామర్ధ్యము నశించె. ఒక్క నాటి రేయి అరబ్బీ సైన్యములతని నగరుం జుట్టికొని యత నినిఁబట్టి ఆనందరావున కప్పగించెను. వెంటనే యానందరా నతనిని కారాగృహము పాలు చేసెను.
ఇట్లు కన్ హోజి . రంగమునుండి యదృశ్యుఁడయిన పిదప రావ్జీఅప్పాజి మఱల ప్రముఖుఁడయ్యెను. కాని ' అతని చేత నె పెంచఁబడిన అరబ్బీ సైన్యము లతని కె మ్రింగరానికడియై పరిణ
మించియుండె. కావున నాతఁడు ఆంగ్లేయులు - సాయము వేడ నుద్యుక్తుఁడయ్యెను. దానినోర్వక యరబ్బీ లొక్క తఱి యాతనిం జంప నెంచియాతని. పల్లకిపై గుండ్లు పర పిరి గాని దానివలన నాతనిబోయీలు మాత్రము మడసిరి. ఈలోపుగ కన్ హోజి తల్లి వలన రేపెట్టఁబడి కాడీజహగీరుదారగు మల్హారి రావును ఆనంద రావున కధర్మసోదరుఁడగు ముకుంద రావును రావ్జీయనంద రావుల పయినెత్తిరా నిర్ణయించుకొని బొంబాయిలోని యాం గ్లేయ ప్రభుత్వము వారి సాయము గోరిరి.. ఇట్లరువాగులవారును దము నాశ్రయించుటవలన నేపక్ష మవలంబించుటకును నిష్టము లేనివారయి యాంగ్లేయులు దమ ప్రతినిధి నొక్కరుని బరోడా కనిపి మధ్యవర్తిత్వము .సలుపుమనిరి. మేజర్ వాకరు 1802 వ సంవత్సరము జనవరి 29వ తేది ఆనగరము చేరి సంగతుల విచా రించెను. అతని తీర్మానములు మల్హరిరావునకు వ్యతి రేకము లయ్యెను. వానికి మల్హరిరావు అంగీకరింపఁడయ్యె. కావున నాం గ్లేయులు ఆనందరావు పక్షమయి 'కాడీజహగీరుదారు తో విగ్రహము వడపిరి. మల్హరిరావు ఓడింపఁబడియె. ఆతనికి 1 1/4 లక్షల విలువగల ఆ స్తినుండనిచ్చి తక్కిన దంతయును ఆనంద రావు నధి కారము క్రిందికి తేఁబడెను. మల్హరిరావు " కనోజియును పలు మారు తిరుగఁబడిరి. అందు.చేత కన్ హోజి 1812లో మద్రాసునకు బ్రవాసమునకుఁ బంపి వేయఁబడెను. మల్హరిరావు బొంబాయి చెఱ సాలయందుంచఁబడగ నచ్చటనే మృతిచెందెను.
మల్హరిరావుతో విగ్రహము ప్రారంభమగుటకు ముందు రావ్జీ అప్పాజి ఆంగ్లేయులతోఁ జేసికొనిన యొడంబడిక 1802 వ సంవత్సరము జూలై నెల 20 వ తేది గాయిక వాడువలన వ్రాత మూలకముగ స్థిరపఱుపఁబడెను. దానివలన విగ్రహమున కయిన కర్చెల్లయును ఆనందరావే భరింప నియ్యకొనెను. అరబ్బీల సైన్య మును దగ్గించుటకును మఱి యితర కార్యములకును గాయిక వాడు సీమలో నొక సాహాయ్య సైన్యముంచఁ బడు నట్లేర్ప, డెను. దానికగు వ్యయము నెలకు రు 65, 000లని లెక్కించి అంత ఆదాయముగల 'భూభాగము ఆంగ్లేయుల కప్పగింప వలసినదని దీర్మానింపఁ బడెను. చౌరసి పరగణాయును సూరుతునగరమున గాయిక వాడునకు ' వసూలగు చౌతుపన్నును వారి కర్పింపఁ బడెను. ఇంతియగాక ఆనందరావు దన కాం గ్లేయు లొనర్చిన మాహూపకారమునకుఁ గృతజ్ఞత సూపుటకయి చిక్లీ పరగణాను వారి కినాముగ నిచ్చి వేసెను. గాయిక వాడు బొక్క సమున ద్రవ్యము నుండక పోవుటవలనను భూము లదివఱకే అడుమాన ములు పడియుండుట వలనను ఈసంధివలన నానందరావు, ఆంగ్లేయ ప్రభుత్వము వారికి ఇయ్యవలసివచ్చిన భూములను గుఱించియు చెల్లించవలసిన పైకమును గుఱించియు మఱికొన్ని యొడంబడికలు జరిగెను.దాని విస్తర మిటయనవసరము.. ఇట్లు సైన్యవిషయములను ద్రవ్యాదుల విషయములను కట్టు దిట్టములొనర్చు కొనుటయే గాక యీసంధివలన' నానందరావు
తన రాజ్యమున దుర్మార్గము సేయువారి నెల్లరను అందునఁ దా నొక్కఁడగుట తటస్థించినచోఁ దన్నుగూడ శిక్షింప ఆంగ్లే యుల కధికార మిచ్చి వేసెను. మేజరువాకరు రెసిడెం టయ్యెను. అరబ్బీలు సర్వస్వతంత్రులుగ నుండినందున బరో డా యందప్పటికి రాజ్యాంగమే యుండ లేదని చెప్పవచ్చనని యొక చరిత్ర కారుఁడు వ్రాయుచున్నాఁడు. ఎట్లైన నేమి. ఆంగ్లే యబలములు బరోడా చొచ్చి అరబ్బీలను వశపరచుకొని వారికి గాయిక వాడు వలన నష్టముగలుగకుండునని యభయమిచ్చి వారి పటాలములను దగ్గించి ఆనంద రావును గద్దె పై స్థిరముగ "నిలుపనలసియుండె. అరబ్బీ సైన్యములకు సంవత్సరమునకు రు 3,00,000 లు అగుచుండెను. ఆంగ్లేయులు బరోడా ప్రవేశించు సప్పటికి ఆరబ్బీలకు రు 20,00,000 అప్పు నిలచియుండె. అసంవ త్సరపు పన్నులును ఆయకమయి పోయియుండెను. కావున అర బ్బీల యప్పులు దీర్చుట కాంగ్లేయ ప్రభుత్వమువారు జమీను జామీనుగఁ బెట్టుకొని ద్రవ్యము నిచ్చిరి. కొంతరక్తము ప్రవ హించిన తరువాత నరబ్బీదండులు విడిసిపోయె. సాహాయ్య సైన్యములు బరోడాయందు నెలకొల్పఁబడెను. 1805వ సం త్సరమున నదివఱకు నాంగ్లేయులకును గాయిక వాడునకును జరిగి యుండిన సంధులలోను ఒడంబడికలలోను వివరించిన విషయ ములను ఒక్కెడఁ జేర్చుటకు మఱియొక నూతన సంధినడి చెను.
దీనియం దొక్కటి మాత్రము విశేషాంశము గన్పట్టు చున్నది. అంతక మున్ను ఆనంద రావు సాహాయ్య సైన్యము రెండు వేలుండున ట్లేర్పఱచికొని యుండెను. "కాని ఈ సంధి ననుసరించి అదిమూఁడు వేలొనర్పఁబడెను. ఈ సైన్యపుఁగర్చులకయి గాయిక వాడు సంవత్సరమునకు రు 11, 70, 000ల నీను భూభాగమును ఆంగ్లేయులకు నిచ్చి వేసెను. ఇంతియగాక విగ్రహమున కయిన వ్యయమున కయ్యును . అరబ్బీలకియ్యవలసిన యప్పులఁదీర్చుట కయ్యును ఆంగ్లేయులును సాహుకారులును ఆనందరావునకు బదులిచ్చియుండిన రు 41, 38, 782-2-6 లకు గాను కొన్ని పరగ ణాల వరుంబడి ఆ మొత్తము దీరువఱకును ఆంగ్లేయులకును సాహు కారులకును జేరవలసినట్లు నిర్ణయింపఁబడెను. ఆనంద రావు ఆంగ్లేయ ప్రభుత్వము - నాట " యనుమతి లేనిది ఇతర రాష్ట్రములతో విగ్రహము ప్రారంభింప కుండుటకును " ఐరోపి యనుల నైనను అమెరికా వారినై నను. బ్రిటిషువారి ప్రజ లోని స్వదేశీయుల నైనను వారి యుత్తరువు లేనిది తనయెద్ద నౌకరులుగ నుంచుకొన కుండుటకును నిర్ణ యించుకొనెను. నాటినుండి రెసిడెంటు వాకరు మంత్రుల సాహాయ్య మున బరోడా సంస్థాన రాజ్యాంగమును సంస్కరింప మొద లిడెను, 1803 నందె రాంజీ అప్పాజి పరలోకమున కేగి. యుండెను. అతని పదమున కాతని పెంపుడు కుమారుఁడు శీతా రాము నియమింపఁబడెను. కాని ఈశీతారాము వట్టిదుర్మా
గ్గుఁడై నందున సంస్కారములఁ దోడ్పడుటకు . బదులు కుట్ర
లాలోచించి స్వామి ద్రోహము సేయఁ బూనుకొనెను. అందు
నలన .నతఁడు తుట్టతుదకు (1808) అవమానము చెందెను.
అతఁడింకను దివానుగ నుండునపుడు దన పినతండ్రియగు బాబాజీ
అప్పాజిని , దనకు సాహాయ్యము పిలుపించుకొని యుండెను.
ఇంతేకాక శీతారాముయొక్క శక్తిని దగ్గించుటకయి ఆనంద
రావు తమ్ముడగు ఫతేసింగు. బాబాజీ తోఁ గూడ రాజ ప్రతి
నిధగ నేమింపఁబడి యుండెను. ఇట్లు బరోడా సంస్థానము రెసి
డెంటుగారి బోధలననుసరించి దివాను, రాజప్రతినిధి మఱి
ఇతరమంత్రులు మున్నగువారలతోఁ ' జేరిన సభవలన పరిపా
లింపఁబడఁ జొచ్చెను. ఈ సభకే కమిష నని పేరు. దీని కల
యుటలకే దర్బారులని నామము. మొదటి దర్బారు 1807 న
సంవత్సరము : ఫిబ్రవరి నెల 8 వ తేది నాఁడు జరిగెను. నాటి
నుండి బాబాజి ముఖ్య కార్యనిర్వాహకుఁడయి రాజ్యాంగమును
నడపెను. ఇట నక్కాలమునందు ఆ సంస్థానమున రాజ్య
వ్యవస్థ యెట్లుండినదియు వాకరు వలన నయ్య దెట్లుపయో
గించు కొనఁబడినదియును సంక్షేపముగ వర్ణించవలసియున్నది.
అప్పులు విశేషముగ రాజ్యాంగముపయి నిలచియుండె నని పైనివ్రాయఁబడియెను. ఆదాయమార్గములలో ముఖ్యతమ మగునది యే రాష్ట్రమునందును భూమి పన్నే గదా! దానిని వసూలు చేయు పద్ధతులు బరోడాయందు పూర్వ రాజ్యము
లలో, న నేకములందుం బలెఁ బెక్కు కష్టములను గలిగించి యుండెను. మండలములు. మండలములు .గుత్తల కియ్యఁబడుట వలనగుత్తలకుఁ గొనువారొక్కరి నొక్కరు మించు నభిప్రా యముతో నత్యధికముగ లంచము లిచ్చుటయుఁ దమకయిన కర్చులను రాఁబట్టుకొనుట కై రైతులను బీడించుటయు సంభ వించియుండెనని విశేషాంశముగఁ జెప్పఁ బని లేదు. అయిన నింతకంటె నెక్కుడు దురదృష్ట మేనున గుత్తకుఁ బుచ్చుకొనిన వారు బలవంతు లయిన తోడనే స్వామిసొమ్మును చెల్లించుటయే యరుదయి పోఁజొచ్చెను. తప్పుడు. లెక్కలఁ బెట్టి రాజ్యాంగ ద్రవ్యమును హరించు వారనేకు లేర్పడియుండిరి. రాజ్యాంగపుఁ బేరున దుర్వ్యయము లనేకములు చేయఁబడుచుండె. ఇట్లు సూచింపఁబడిన మహా లోపముల నాశ్రయించి స్వల్పలోపము ల నేకములు చూపట్టి తండోప తండములయి పెరిగి రాజ్యాంగపు జీవరసమును చీల్చి వేయుచుండెను. వీనినన్ని టిని.మాన్పుట కొక్క నికి సులభ సాధ్యమగునా! అయిన రెసిడెంటు వాకరు సంస్కార ములఁ జేయుటకు గంకణము గట్టిదనమనోరధమును గొంతవఱకుఁ దీర్చుకొనెను. మండలములను గుత్తలకిచ్చు పద్ధతిని మాన్ప లే డయ్యెను గాని గుత్తగాండ్లను ధగిన వారిని నేరుటయందు మా త్రము మిక్కిలి పరిశ్రమఁ జేసి మోసగాండ్ర నుండి పైకము రాఁ బట్టుటకును లేనిచో వారిని దండించుటకును న్యాయస్థానము నేర్పఱచెను.
బరోడా సంస్థానమునకు వరుంబడికి మఱియొక మార్గ ముండెడిది. కాథియ వాడు నందును ఇతర ప్రదేశములందును గల చిన్న చిన్న సంస్థానములనుండి ప్రతి సంవత్సరమును గప్పములు చెల్లుచుండెడివి. వీనిని కప్పములనియుఁ జెప్పుటకు వీలు లేదు. మహా రాష్ట్రులు గొంత రాజ్యము నేలుచు. మఱికొంత రాజ్యము మీఁదికి దండులతోఁ గూడ నెత్తి పోయి ఏటేట చేతికి దొరకిన ద్రవ్యమును . దెచ్చుకొనుచుండుట యాచారము. ఆ యా చిన్న సంస్థానము వద్దకు నీమహా రాష్ట్ర నాయకులు పోవుటతోడనె అచ్చటి పాలకులు గాని" పాలకులు లేనిచో బుర వాసులుగాని ముందు సంవత్సరమునఁ దామిచ్చిన మొత్త మును మఱలఁ జేర్చి దండెత్తివచ్చిన ప్రభువునకు ఊరిబయటి తెచ్చియిత్తురు. ఆ మొత్తము వచ్చిన నింక నెక్కుడు కా వలయుననియుఁ బ్రభువులు కోరుట కలదు. వీరి దాడికి ఓర్వ లేక ఆయా స్వల్ప సంఘముల వారు. వీరి కోరిక ననుసరించి ఇచ్చుటయు గలదు. ఇట్టి కప్పములను వసూలు చేయు కార్యక్రమమునకు ‘ములుక్ గిరి' అని పేరు. గాయిక వాడులు పీష్వాగారితో గూడ నిట్టి ములుక్ గిరి' స్వాతంత్ర్యమును సంపాదించుకొని యుండిరి. వాకరు రెసిడెంటు అయినతరువాత నతఁడు కాథియవాడు, లోనికిఁబోయి అదివఱకు. నాంతరంగిక దుఃఖము వలన గాయిక వాడులు. వసూలు చేయని ములుక్ గిరి పన్ను నంతయును లెక్క లు వేసి సామంతులకు నంతకుఁ బూర్వము నందుంబో లె నన్యా
యములు జరుగకుండ నేర్పాటులొనర్చి 'ములుక్ గిరి' ని నిశ్చ యమయిన కప్పములలోనికి మార్చి వేసెను. ఇట్లు వరుంబడి విషయమున ' పరిశ్రమచేసి మహాకష్ట ముతో సిబ్బందిని ' దనకు సాధ్య మయినంత తగ్గించి వేసెను. రాజ్యాంగముల నొక్కొక్క దానికిని సంవత్సరమున కింత కంటే నెక్కుడు వ్యయము కాకూడదని నిర్ధారణము చేసి ఆ మొత్తమును మించకుండ - నేర్పఱచెను. మహా రాజుగారి - స్వంత వ్యయము విషయమునఁ గూడ హద్దులనునిచెను.
ఈ కార్యములనెల్ల బహు సమర్థతతో నెరవేర్చుచు రెసిడెంటునకు ముఖ్యసాహాయ్యుం డయియుండిన బాబాజీ అప్పాజీ 1810న సంనత్సరము 'నవంబరు నెలలోఁ జనిపోయెను. అతనికుమారుఁడు విఠలరావు భావు ఆతని స్థానమున ‘ ఖాస్గి పాలా' (కార్యనిర్వాహకుఁడు) ఆయెను. 1813 లో నితఁడు కా థియవాడునకు సర్ సూబాగా[2] వెడలిన పిదప సుప్రసిద్ధుఁడగు గంగాధర శాస్త్రి దివాను పట్టమునకు వచ్చెను. 1810 లోనే వాకరు స్వదేశమునకు వెడలిపోయి యుండెను. అతని పదమున కాప్టెన్ (తరువాత 'మేజరు జన రల్) సర్ జేమ్సు కార్నకు నియమింపఁ బడియుండెను. ఈయి రువురు రెసిడెంటుల యధికారముక్రింద బాబాజీ, విఠలరావు, గంగాధర శాస్త్రి వీరల సామర్థ్యము వలన బరోడా సంస్థా
1. .
నము ఆంగ్లేయులకు బాకీపడియుండిన మొత్తము నంతయును 1812 న సంవత్సరము " లోపలఁ దీర్చి వేసియుండెను. కావున నాంగ్లేయులు బరోడా, రాజ్యమునందు విశేషము జోక్యము పుచ్చుకొను. 'ఆచారము మాని వేయ వలయునను ఉద్దేశము గల వారయిరి.
ఇదివఱకే వ్రాయఁబడిన తెఱంగున 'కన్ హోజి మజులఁ దిరుగఁబడి యల్లరులకుఁ బూనిసందునను ముందువర్ణితము గాఁబోవు ఇతర కష్టములు చూపట్టినందునను పై యుద్దే శము ఆంగ్లేయ ప్రభుత్వము వారికి నెఱ వేరినది గాదు. కవ్ హోజి మద్రాసునకుఁ బ్రవాసమునకుఁ బంపఁ బడకమున్నె పీష్వా గాయిక వాడు దనకు బాకీదారుఁడని గొప్ప లెక్కలను వేయ నారంభించెను. అహమ్మదాబాదు విషయమున నాతఁ డితని కిచ్చిన కౌలునకుఁ గూడ నాయువు నిండనుండె. వీరిరువురకును 'మైత్రియు సన్న గిలి పోవుచుండె. ' కావున నహమ్మదా బాదు మఱల గాయక వాడున కియ్యఁబడదనియు నతఁడు దీర్చ లేనం తటి యప్పుపద్దును పీష్వా : ప్రదర్శింపుననియును ఆరంగమున నుండిన . వారందఱకును గోచరముగాఁ జొచ్చెను. ఇంతీయ గాక పీష్వా చేసిన సంధివలనఁ దాను గాయిక వాడు పై నధికా రమును వదలుకోనుటకుఁ బశ్చాత్తాపము ' నంది మఱల "నేవిధ ముగ నైన దనయధికారమునకు మార్గ మేర్పఱచుకొనఁ బ్రయ త్నింపఁ గడఁగెను. ఇట బరోడాయందు దివాను పదమునుండి యవమానముతో దొలంగింపంబడి యుండిన శీతారాము దన విరోధులకుఁ బ్రతీకారము సేయ దారి యఱయుచుండెను: ఫతేసింగు గంగాధరశాస్త్రియందు నమ్మకమును ఆంగ్లేయ ప్రభు త్వము నెడ సంపూర్ణ విశ్వాసమును గలవాఁడయి . సమర్థతతో గార్యములు సాధింపనుం డెనుగాని ఆనంద రావు 'మిక్కిలి యస మర్థుఁ డగుటంబట్టియు నాంగ్లేయులు సంపూర్ణముగ సాయము సేయకపోవుట బట్టియు నతఁడు బలన త్తరమగు విరోధ శక్తుల నణంచుటలో మిక్కిలి కష్టపడవలసి వచ్చెను. అయినను శీతా, రాము పీష్వా యనుగ్రహమును బొంది మఱల స్వస్థానమును జేర వలయునను దలంపుతో రాష్ట్ర ద్రోహియయి మెలఁగుచుండుటఁ జక్క గ గుర్తించి యితఁడు వానినిబట్టి చెరసాల యందుంచెను. కొంతవాదము జరిగిన తరువాత గంగాధర శాస్త్రి . గాయికవాడు పరమున పీష్వాతో సంభాషించి వచ్చుటకు పునహాకు వెడలిపోయెను. అచ్చట పీష్వా బాజీరావు ఈతనితో మంచి మాటలాడి మాయోపాయములు పన్ని తన మరదలి సీతని కుమారునకు వివాహమున నిప్పిం చెదనని నుడివి పలు తెఱం గులనమ్మించి తుట్టతుదకు ఒక నాఁటిరాత్రి నిరాయుధుఁడును సాహాయ్య శూన్యుఁడును నయియుండ ట్రింబక్త్జి మూలమున హంతకుల నేమించి ఈతనిని జంపించెను. గంగాధర శాస్త్రులు పునహాకు నాంగ్లేయుల పూచీపయి పోయియుండెను. 'కాని ఆ గ్లేయు లాతని మరణమునకుఁ దగిన ' పూర్ణ ప్రతీకారము
సేయ సమయము కాదయ్యెను. బరోడాయందు ఫతేసింగు గూడ స్వాతంత్ర్యత సంపాదింపఁ బ్రయత్నించు చున్నట్లగుపడెను. కావున నాంగ్లేయ ప్రభుత్వము వారు పీష్వా బాజీరావును గొంత భయ పెట్టి ట్రింబక్టీని దమ స్వాధీనము చేసి వేయునట్లొనర్చి గాయిక వాడుకు సంబంధించిన విషయములను గుఱించి 1817న సంవత్సరములో సంధికియ్య కొనునట్లు" చేసిరి. ఆసంధినలన పీష్వా గాయిక వాడు పైఁ దనకుఁ గల సర్వాధికారములను మాను కొనియెను. ఆదివఱకు గాయికవాడుపై దనకుండిన హక్కులకు గాను సంవత్సరమునకు నాలుగులక్షల రూపాయీ లతోతృప్తి పొందనియ్యకొని అహమ్మదాబాదును గాయిక వాడునకు సంవత్సరమునకు 42 లక్షలకు గుత్తకునిచ్చెను. ఈ యొడంబడిక ననుసరించి గాయిక వాడునకును ఆంగ్లే యులకును మఱియొక సంధిజరిగెను, దానివలన గాయిక వాడు సాహాయ్య సైన్యముల సంఖ్య మునుపటికంటెను హెచ్చించ బడెను. ఆ హెచ్చు సంఖ్యను పోషించుటకొఱకు పీష్వాభాగము లను గుజరాతునందు గాయిక వాడు గుత్తకు తీసికొనుట వలన నాతనికి వచ్చుచుండిన వరుంబడి యంతయును నాంగ్లేయులకు మరల్పఁ బడెను. ఇంతియ కాక ,గాయిక వాడునకు ఆంగ్లేయుల కును ఎక్కుడు సౌకర్యముగ నుండునట్లు వారి రాష్ట్రములలోని కొన్ని కొన్ని భూఖండములను బరస్పరము మార్చుకొనిరి. .
గాయిక వాడు ఆంగ్లేయులకు సాహాయ్యము వలసి వచ్చినప్పుడు దన సైన్యములను 3000 స్వారులను బంప నంగీకరించెను. ఈ సంధిజరిగిన కొద్ది కాలమున కే మూఁడవ మహారాష్ట్ర విగ్రహము ప్రారంభమాయెను. ఆంగ్లేయులు పీష్వాతోడను నాగపురము రాజుతోడను సింధియా, హెల్కారులతోడను వారిపిండారీల తోడను బోర వలసిన వారైరి. అనేక యుద్ధ ములు జరిగి దేశమంతయును నల్లకల్లోలముతో. నిండియుం డెను. అట్టి సమయమున ఫతేసింగు గాయిక వాడు మహావిశ్వా సమున నాగ్లేయులకు. సాహాయ్యుడయి సాహసముతోఁ గార్యములు నెరవేర్చి ఆంగ్లేయుల విజయమునకు ముఖ్యము గఁదోడ్పడెను. ఇట్లు వారికయి యితఁడు పడినపాట్లవలన నతని బొక్కసము వట్టిదయి మఱల నప్పులు దలయెత్తెను. ఈవిగ్ర హము ముగిసి పీష్వాశక్తి మొదలంట నశించిన పిదప గాయిక వాడున కాంగ్లేయులు భూభాగము నేమియు నియ్య లేదు. అతఁ ను పీష్వాక దివఱకుఁ గట్టుచుండిన నాలుగులక్షలు మాత్ర మాతనికి లాభమయ్యెను. ఫతేసింగు 1818వ సంవత్సరము జూను మాసములోఁ బరలోక ప్రాప్తిఁ జెందెను.
అతని స్థానమునఁ బరిపాలకుడుగ నతని తమ్ముఁడు సయాజి రావు గాయిక వాడు నియమింపఁబడెను. ఆనందరావునకు; దరు వాతనితఁడే గాయిక. వాడు రాజ్యమునకుఁ బట్టము గట్టుకొనఁదగి యుండెను. కావున సీతని కధికారము రాకుండఁ జేయుట కొక
కొన్ని ప్రయత్నములు జరిగెను. కాని అవి సిద్ధించినవిగావు. ఇతఁ డు మనోపటుత్వము గలవాఁడే కాని మూర్ఖుఁడు. పట్టిన పట్టును సులభముగ వదలువాఁడు కాడు. మఱియొకరిని లక్ష్య పెట్టు వాడునుగాఁడు. తనకు వ్యతిరేకముగఁ బ్రవ ర్తించువారి యెడ బద్ధ నైరమూ నెడివాఁడు. కావున నీతనికిని బొంబాయి ప్రభుత్వము వారికిని ఎడ తెగ నివివాదములు జరుగుచు నేయుండెను. ఇతఁడు పరిపాలకుఁ డయిన వెంటనే ధాక్జి దాదాజ యనువాఁడు రెసిడెంటుగా నుండిన కా ప్టెన్ కార్నకు గారి సిఫార్సుమీదను సయాజీ యొక్క ఇష్టము మీఁదను దివానుగా నేమింపఁబడెను, కాని అతఁడు వి శేష ద్రవ్యమపహరించి సంస్థానమునకు నష్టము గలుగఁ జేసినందున "నాపదమునుండి తొలఁగింపఁబడెను. అతనికి లక్ష రూపాయిలు వేతన మేర్పఱుపఁ బడియుండెను. దానిలో ముప్పది వేలు మూఁడు ఇనాము గ్రామముల రూపముగ నియ్యం బడి యుండెను. తక్కిన పైకమిచ్చుటో లేకుండుటో నిర్ణ యించుటకు బొంబాయ గవర్నరుగానుండిన మౌంటు స్టూఆర్టు ఎల్ఫిన్ స్టన్ గారు బరోడాకుఁ బోవ నిశ్చయించిరి వారి రాక ఆ సంస్థానమున కితర విధముల గూడ నుపయోగ కారిగఁదోఁచెను.
పీష్వానామ మంతరించి పోవుటవలన ఇదివఱకు వ్రాయఃబడినరీతి గాయక వాడు ఆతని కచ్చుకొనవలసియుండిన నాలుగు లక్షలును .. దక్కించుకొని యుండెను. విగ్రహము ముగిసినతోడనే ఆంగ్లేయుల పక్షమున మాళవమున యుద్ధము
చేయుచుండిన గాయిక వాడు సైన్యము లిల్లు వచ్చి చేరెను. వాని వ్యయమువకు గాను ఆవిగ్రహకాలమున . 39 1/2 లక్షలు వెచ్చింపఁ బడియుండెను. గాయిక వాడు సాహాయ్యసైన్య ములు' గూడ సమర రంగమున నాంగ్లేయుల. శత్రువుల నెదుర్ప ననుపఁబడియుండెను. వాని కొఱకు రమారమి 48 లక్షలు న్యయమయియుండెను. ఈకర్చులన్ని టివలన నైన" కోటి నొక లక్ష, యప్పులలో గాయిక వాడు ఈఁదజలకుండెను [3]*అట్టి సమ యమున' సయజిరావు 1816వ సంనత్సరపు సంధిని దలంచుకొని అందొక నిబంధన మేరకు ఆంగ్లేయ ప్రభుత్వమువారు - దాము గాయిక వాడు సైన్యముల సాహాయ్యమున గెలిచిన భూభాగ మునం దాతనికిఁ గొంత భాగమిత్తుమని యొప్పుకొని యుండినం దున నద్దానిననుసరించి పీష్వానుండి వారు గొనిన దేశములో నొక ముక్క నిత్తురుగాకని . వేఁడెను. కాని వారు గాయిక వాడునకు నేమియు నిచ్చుట కిష్టము లేని వారయిరి. అందుచే సయాజికి ఆశాభంగమయి మిక్కిలి సంతాపము జనించెనను టకు సంధియము లేదు. 1819 వ సంవత్సరపు నక్టోబరు నెలలో ................................................................................................
-
ఆనందరావు మృతుఁడయ్యెను. నాఁడే సయాజిరావు (ద్వితీయ) గాయిక వాడు పట్టమునకు బ్రకటింపబడియెను.
'సయాజిరావు II (1818-1847).
బొంబాయి గనర్నరుగారు దర్శన మిచ్చునప్పటికి శీతా రాము మఱల బరోడా వచ్చి చేరి యుండెను. అతఁడు దివాను పదమున కాశించెనుగాని ఎల్ఫిన్ స్టన్ అంగీకరింపనందున మఱి యిద్దఱు దివాను 'లేర్పఱుపఁబడిరి. వారియందును నమ్మకము లేమిం జేసి సయాజి మీర్ -సక్ ఫరజ్ - ఆలీని వారింగ ని పెట్ట నియ మించెను. అది వఱకు బరోడా సంస్థానపు రాజ్య కార్యములను దీర్చుచుండిన కమీషను రద్దు చేయఁబడెను. సయాజికి అంతః పరిపాలనా విషయముల సంపూర్ణ స్వాతంత్ర్య మియ్యఁబడెను. 'అతఁడు ధనమునందుఁ బేరాసగలవాఁడయి స్వంత ధనము వేరు గను సంస్థానపు ద్రవ్యము వేరుగను జూచుకొన ప్రారంభించెను. రాజు ఇట్టి లో భియగుటవలన పన్ను వసూలు చేయువారును ఉద్యోగముల, నాశించు వారును . ' నజరానా' ల పేరిట గొప్ప గొప్ప లంచము లతనికమర్చ మొదలిడిరి. ఇట్టి పరిపాలనవలన నెట్టి నష్టములు గలుగుటయు విస్తరించి వ్రాయుటయే పని లేదు. రాజుగారి స్వంతధనాగారము' నిండుచు వచ్చెను. అనవ సరనుగు హెదాలును నౌకరీలును రాష్ట్రమునఁ బ్రబలఁ జొచ్చెను. దన్మూలమున నదివఱికె యప్పుల సంద్రమున మునిఁగి తేలుచుండిన సంస్థానము ఎక్కు-డార్థిక దుర నస్థలపాలయ్యెను.
రెసిడెంటు చేసిన బోధలన్ని టికిని సయాజిరావు పెడచెవిఁ బెట్టు టవలన రాను రాను రాజ్య వ్యవస్థ బొత్తుగఁ 'జెడిపోవుచుండెను.. కాని కొంత చర్చ జరిగిన తరువాత నొక కొన్ని మండలము లను ఘరానా మనుష్యులకు ఏడు సంవత్సరములకు మునిగుత్త కిచ్చి నై చి ఆంగ్లేయులు ' పూచీపడిన యప్పులు దీర్చున ట్లేర్ప. డెను. దీనికంగీకారము సయాజిరావిచ్చెను గాని ఏకారణము ననో ఈ ఏర్పాటునకుఁ గారకుఁడయిన మంత్రి నాతఁడు పని నుండి తొలగించెను. తరువాత సయాజీ రావు ఈ ఏడు సంవత్సర ముల కౌలుల విషయములోఁ గొన్ని' యక్రముల నడిపెను: ఈ లోపుగ ఎల్ఫిన్ స్టన్ బొంబాయి గవర్నరు పని చాలించు కోని స్వదేశమునకుఁ జనియుం డెను. అతని స్థానమును సర్ జాన్ మాకము అను నతఁ డధిష్ఠించె.
ఎల్ఫిన్ స్టన్ గాయిక వాడుతో బహు సామవాక్యములు పలికి మృదు మార్గముల నాతని నడవడిని సంస్కరింపఁ బ్రయత్నిం చువాఁడు. “మాకము' అట్టివాఁడు గాక కఠినుఁడయి కన్పట్టె. 1827న సంవత్సరము నవంబరు మాసములో సయాజి రావు తన స్వంత ద్రవ్యమునుండి యిచ్చి ఆంగ్లేయులు పూచీపడినయప్పునం తయును వెంట నేతీర్చి వేయ నుపక్రమించినను అది యేమిచిత్రమో మాకము అద్దాని కియ్యకొనఁడయ్యెను. అందుమీఁద సయాజి రావునకును ఆంగ్లేయ ప్రభుత్వము వారికిని విభేదములు హెచ్చ మొదలిడెను. 1828 లో మాకము బరోడా రాజ్యము లోని
కొన్ని జిల్లాలను తనయధీనము చేసికొని తన ప్రభుత్వము వారు పూచీపడిన యప్పులు దీరువఱకును ఆ సంస్థానము వారియధీన మున నే యుండునని తెలియపఱచెను. ఇతఁడు ఏడు సంవత్స రముల కౌలులను రద్దు చేసి, దానివలన గుత్తగాండ్ర కయిన' నష్టము గాయిక వాడు. అచ్చుకోనలసినదని యుత్తరవు చేసెను. సయాజి రావుచే దివాను పదమునుండి తొలఁగింపఁబడి దేశద్రో హియని యాతనిచే నెన్న బడుచుండిన మంత్రిపక్షము వహించి ఈగవర్నరు అతనికి హక్కులను స్థాపించి పెట్టెను. ఇంతటితో నిలువక 1880 వ సంవత్సరమున స్వయముగ బరోడాకుఁబోయి గాయికవాడు మహా రాజుగారితో సంభాషించుట ముగించు కొని గాయిక వాడు సైన్యములు 3000 తగిన స్థితియందు లేవని నిర్ణయించి రెసిడెంటున కవ్వానిని సంస్కరించుటకు నుత్తరు విచ్చి వానికగు. కర్చునకుఁగాను 10 లక్షల ఆదాయము నీను మఱికొన్ని మండలములను గాయికవాడు సంస్థానమునుండి స్వాధీనము చేసికొనెను. కాని - ఈ కార్యమును ఇంగ్లాండు నం దలి డైరక్టరులు ఖండించినందున నిది నిలచినదిగాదు. దీనికిందరువాత బరోడాయందు రెసిడెంటుండుటవలనను ఆతఁడు అంతః పరిపాలనా విషయమున జోక్యము వుచ్చుకొనుట వలనను లేనిపోని భేదములు పుట్టుచున్న వని దలంచి మాకము బరోడాయందు రెసిడెంటు పదమును దుడిచివైచి ఆయధికార ముననుండిన వానిని అహమ్మదాబాదు నందు రాజకీయ ప్రతినిధిగ
నేమించెను. అతఁడు గుజరాతునందును బరోడాయందును ఆంగ్లేయుల లాభనష్టములఁ గనిపట్టవలసిన వాఁడయ్యెను. అతఁడు బరోడా వదలుట తోడనే ఆంగ్లేయుల ఫూచీ పై గాయి కవాడునకు అప్పులిచ్చిన సాహు కారులును దమకుఁ దగిన గౌరవముగాని సంరక్షణగాని సయాజి రావు వద్ద జరుగదని గాఁబోలు బరోడాను వదలిరి.
1831 వ సంవత్సరమున మాకము మారిపోయెను. బొంబాయి గవర్నరుగ లార్డు క్లేరు ఏ తెం చెను. అతఁడు మిక్కిలి మెత్తని గుం డెగలవాఁడు. కావున సయజిరావు మహారాజు నెడ సామవాక్యములు నెపం బ్రారంభించి మాకము కాఠిన్య మువలన నడచిన కార్యముల నన్నిటిని ఒక్కటొక్కటిగ రద్దు పఱచెను. ఆ గ్లేయు లాధీనము చేసికొని పరిపాలించుచుండిన మండలములు గాయిక వాడునకు మరల్చఁబడెను. -బరోడా యందు రద్దయిపోయి యుండిన రెసిడెంటు పదము పునరుజ్జీవి తము చేయంబడెను. సయాజి రావునకును సాహు కారులకును బరస్పర విశ్వాసము జనించుటం జేసి వారు బరోడాకు వచ్చి చేరి యెప్పటిన లెఁ దమ" 'తమ వృత్తులనుండ నిర్ణయించుకొనిరి సయాజిరావు తన స్వంత ద్రవ్యము నుండి ఇరువదియైదు లక్షలు కర్చు పెట్టి సాహుకారులఁ ధనియించెను. గాయిక వాడు, సైన్య ములకు సక్రమముగ జీతమిచ్చుటకు జామీనుగఁ, బదిలక్షల రూపాయిలు బొంబాయి ప్రభుత్వము వారి బొక్క సమున ధరా
వతు పెట్టెను. మాకము మహాకఠిన పద్ధతులవలన నెఱ వేర్చ లేని పనులను గొంతవఱి కీరీతిని క్లేరు ప్రభువు దీర్చఁగలిగెను. కాని ఇంకను దురవస్థలు సయాజిరావుకుఁ ! దప్పినవి కావు. ఆతనియొద్ద మంత్రి పదమున కెక్కిన వనిరాముఁడు అతి దుర్గారుఁడయి ఆతనికి గొప్ప దలవంపులును ఇక్కట్టులును దెచ్చి పెట్టెను. వాఁడు స్వలాభ మే ప్రధానముగఁ 'జూచుకొనుట వలనను సయాజి మహా రాజు వానినే సంపూర్ణముగ 'విశ్వసిం చుట వలనను రాజ్యమరాజకమయి పోయెను. దొంగతనం ములు, ఖూనీలు, త్రోవ దోపిడులు మున్నగునవి మెండయ్యెను, విచారణ యను మాటయే సున్న యయ్యె. ఘరానామనుష్యు లకుఁ బ్రతుకు తెరువే లేదయ్యె. గాయిక వాడు ప్రజలో నొక్క భాగమగు భిల్లులు కోలు లను వారు నిర్భయులయి గ్రామము తరువాత గ్రామమును దగులఁ బెట్టుచుఁ గొల్ల కొట్టుకొన సాగిరి. గాయిక వాడు సైన్యము చేత చెడి దుర్మార్గముల నవలంబింపు చుండె. ఆంగ్లేయ ప్రభుత్వపు వారి సంరక్షణయుఁ బూచీకత్తును గల సాహు కారులను వనిరాముఁడును అతని యజమానియు దోచుకొనఁ జొచ్చిరి. వీని ననన్ని టిం గుణించి బొంబాయి ప్రభు త్వమువారును బంగాళములోని యాజమాన్య ప్రభుత్వము వారును పలుమారు పయాజీరావును గట్టిగ హెచ్చరించినను గార్యము లేకపోయెను. దానివలన. నాంగ్లేయ ప్రభుత్వము వారు నవ్సారిమండలమును పెట్లాడు మండలమును స్వాధీనము
చేసికొని 1839 లో 6 గుజరాతు క్రమవిరహితాశ్వకు " (Gujarat Irregular Cavalry) లను పేరిట నూతనముగ నొకపటాలము నేర్పఱచిరి.
ఇంతపనిజరిగిన వెనుక 1839నవంబరులో సయాజి రావు ఆంగ్లేయులకు పూర్ణ విధేయుఁడుగ నుందునని వాగ్దానము సేయుచు వారి శరణ మడిగెను. 1840 వ సంవత్సరమున ఒక్కొక్క విషయమునను సయాజిరావుతో రెసిడెంటు ఏర్పాటులొనర్చుకొనెను. వనిరాము దివానుపదమునుండి తొలఁగింపఁబడెను. సయాజీరావు మంత్రి లేకయె రేసి డెంటు గారి సలహాలతో,దానే స్వయముగ రాజ్యము నడపుకొన నిశ్చ యించుకొనెను. కాథియ వాడునందు గాయిక వాడునకుఁ జేరిన భాగమునందు న్యాయ పరిపాలనమునకు సంస్కారము లొనర్పఁ బడెను. బరోడా ప్రజలచే నష్టములందిన వారందఱకును దత్త దనుగుణముగ ధనమియ్యఁ బడియెను. తక్కిన విషయముల యందునుఁ దగిన కట్టుదిట్టము లేర్పఱుపఁబడెను. ఆంగ్లేయులు స్వాధీనము చేసికొని యుండిన నవ్సారి పెట్లాడు మండలములు సయాజి రావునకు మరల్పఁబడెను. అతఁడు ప్రజలను న్యాయ మార్గమున సంరక్షింతునని వాగ్దానము చేసెను. క్రొత్తంగ నేర్పడిన గుజరాతు క్రమవిరహిత ఆశ్విక సైన్యమునకయి కాథియ వాడు వరుంబడినుండి మూఁడులక్షలు ప్రతి సంవత్సరమును దీసి యుంచునట్లు నియమింపఁ బడెను.
ఇట్లు సంస్కరింప బడినను బరోడాయందు దురభ్యా సములు పొడసూపుచునే యుండెను. రెసిడెంటు “కార్యస్థా నమునఁ గూడ నిట్టి లోపములుండెడివి. కుట్రలును మెండుగ జరుగుచు నేయుండె. వానినన్నిటి నిటవర్లింపఁ జాలము. 1847వ సంవత్సరము డిసెంబరు నెల 28న తేది సయా జిరావు ప్రాణములఁ దొరఁగె - అతని వుత్రుఁడు గణపతి రావు. గద్దెకువచ్చెను.
గణపతి రావు (1847–1856)
ఈతఁడు విద్యావిహీనుఁడు. మనోదార్డ్యము గలవాఁడును గాఁడు. అయిన నీతని యొద్ద ఒక్క సుగుణము మాత్రము డెడిది. దేశ క్షేమమున కయి ఇతరులు పక్రమించు కార్యము లకు సాయపడుచుండెడువాఁడు. కావున నీతనికాలమున భాగమందు . రెసి డెంటుగా నుండిన ఫ్రెంచి బోధల వలన నీతఁడు బాటల వేయించెను. వం తెనలఁ గట్టించెను. మార్గ ముల ప్రక్కన చెట్ల వరుసలు, నాటించెను. శిశుహత్యయు బిడ్డ లనము వ్యాపారమును దుడిచి నై చెను. తన రాష్ట్రమునందు జరిగిన దోపిడీలను విచారించి హక్కుగల వారలకు సొమ్ము నిప్పించెను. ఇట్లు పలు తెఱంగుల సభివృద్ధికిఁ దోడ్పడియెను. బొంబాయి గవర్నరుగారి కార్యస్థానమున దురాచాగము లెక్కుడయి బరోడా సంస్థానము నం దన్యాయములు జరుపుటకుఁ గొందఱకెక్కుడు వీలగుచున్న దనువా ర్తప్రబలి ఆ సంస్థాన
మునఁ గొంత కాలము రెసిడెంటుగా నుండిన కర్నల్ లెప్టి నంటు అవుట్రామువలన ఋజువు పఱచఁ బడినందున బరోడా పై బొంబాయి ప్రభుత్వము వారి కుండిన అధికారము రద్దయి ఆ సంస్థానము యాజమాన్య ప్రభుత్వమువారి విచారణలో నుంచఁబడెను. (1864). ఈ విషయమయి. పోట్లాడుటలో అవు ట్రాము దన పదమునుండి తొలఁగింపఁబడి నిజముబయట వచ్చి నందున మజిల రెసిడెంటు పదమున కనుపఁబడెను, కొందఱు దుర్బోధనలం జేసి గణపతి రావు అవుట్రాము రాకకుఁ గొంచె మెది ర్చెను గాని ఆయభ్యంతరములు నిలువ లేదు. అతఁడు రెసిడెంటయి తన కార్యస్థానములోని దురారులను తొలగిం చివై చెను. 1856వ సంవత్సరమున మహారాజా గణపతిరావు బొంబాయి బరోడా రైలుదారి వేయుటకు వలయు భూమిని మంజూరు చేసెను. అదే సంవత్సర మే అతఁడు స్నానము చేయు చుండ నాకస్మికముగ మృతినం దెను. అతనికి మొగబిడ్డలు లేనందున నాతని తమ్ములలోఁ బెద్ద వాఁడగు ఖండేరావు సింహా సనమునకు వచ్చెను.
ఖండేరావు (1856-1870)
ఇతఁడు దనకుముందుఁ జనిన గణపతి రావు నకును, వెనుక రానున్న మల్హర రావునకును, భిన్నుఁడుగఁ గాన్పించు చున్నాఁడు. ఇతఁ డెంతో విద్యావంతుఁడు గాఁడుగాని కొంత సమర్థతగల వాఁడనుటకు సందియము లేదు. దేహపటుత్వమున
నన్న నో ఈతనికి ఈడగువాఁడు దొరకుట దుర్లభము. కావున
నితనికి వేటయందును, ఆటలయందును వ్యాయామముల యం
దును నభిరుచి మెండు.
సింహాసనమునకు వచ్చిన వెంటనే బరోడాను ఆంగ్లేయ
పాలిత మండలముల కెనచేయఁదలఁచి ఈతఁడ నేక సంస్కా
రములు ప్రారంభింప వలసినదని యుత్తరువు లొసంగెను.
కొన్ని సంవత్సరములు మిక్కిలి పట్టుదలతోఁ బని గూడఁ
జేసెను. కాని రానురాను మృగయా వినోదములయం
దును, ఆభరణాడంబరముల యందును, వృధా వ్యయముల
యందును మనస్సు దగుల్చుటం జేసియుఁ దానుపక్రమించిన
సంస్కారముల యెడలఁ గ్రిందియధికారు లెట్లు ప్రవర్తించు
చుండినదియు గమనింపక పోవుటవలనను ఈతఁడు మొదలిడిన
పను లెవ్వియును దీరినవిగావు. క్రొత్తనీళ్ల తోబ్రాతనీళ్లును
గొట్టుకొని పోయెనన్నట్లు అదివఱకుండిన ఏర్పాటులు గూడ
నశించిపోయెను. అట్లగుట నీతఁడు మహెూత్సాహమునఁ
దల పెట్టిన తలంపులు దేశమునకుఁ గొంతవఱకనర్థదాయక
ములె యయ్యెను. కాని ఈతని కాలమునఁ గొన్ని సంవత్సర
ములు ప్రత్తిపంట' మిక్కిలి చక్కగఫలించి జనులు సుఖపడినం
దునఁ గాకతాళన్యాయమున నిప్పటికిని ఈతని పేరు ప్రజల త్యా
దరమున నుడువు చున్నారు. ఇట్లనుటచే నితఁడు చేసిన దేమియు
లేదనుట గాదు. ఈతని రాజ్య కాలమున ఒక రైలుదారి శాఖ వేయఁబడెను. రెవిన్యూ సర్వే ప్రారంభింపఁ బడెను. . 1857వ సంవత్సరపు గొప్ప తిరుగుబాటు ఈతని దినముల లోనె జరిగెను. అప్పుడు చుట్టు ముట్టుంగల దేశమంతయును అల్లకల్లోలమున మునుఁగుచుండ నీతఁడు మాత్ర మాంగ్లేయుల యందుఁ జలించని భక్తికలవాఁడయి ప్రవర్తించెను. తిరుగుబాట ణఁగి పోయిన తరువాత నాంగ్లేయ ప్రభుత్వమువా రీతని నడతకు సంతసించి గుజరాతు క్రమవిరహితాశ్విక ' సైన్యమునకయి గాయిక వాడు చెల్లించుచుండిన మూఁడులక్షల రూపాయిలను మన్నించి వేసి, జి. సి. ఐ. ఇ. బిరుదము మెసంగి దత్తు చేసి కొనుట కధికారముగూడనిచ్చిది. ఇతఁడు పదునాలుగు సంవత్సర ములు రాజ్యభారము నిర్వహించి 1870 లో హటాత్తుగ మరణ మందెను. కావువ నీతని తమ్ముఁడు గాయిక వాడుగఁ బ్రకటింపఁ బడెను.
మలారి రావు. (1870-1875)
ఇతని పూర్వచరిత్రగాని గాయిక వాడు పదమునకు వచ్చిన తరువాతి చరిత్రగాని ఈతనియందెట్టి సద్గుణములను బయలు పఱచుట లేదు. 1857వ సంవత్సరమున నాంగ్లేయ ప్రభుత్వమును బరోడా సంస్థానమున నశింపఁ జేయ వలయు నను నుద్దేశముతోఁ బన్నఁబడిన యొక కుట్రయం దీతఁడు ముఖ్యాంగముగ నుండెను. అప్పుడు రెసిడెంటుగా నుండిన
సర్. ఆర్. 'షేక్ స్పియరు యొక్క దయ చేఁ దప్పించుకొనెను. 1868 వ సంవత్సరమున ఖండేరావును జంపించుటకే మల్లారి రావు మఱలనొక కుట్రజరిపెను. అదియును బయటపడెను. అప్పుడే ఇతఁడు పరలోకమున కనుపఁబడియుండును గాని అప్పటి రెసిడెంటు ఈతని పరమయి కరుణ చూపినందున నితఁడు పాడ్రాయందుఁ .. జెరసాలలో నుంచఁబడెను. ఖండే రావు వైకుంఠము/ కేగినపిదప నాతనిస్థానమునకు వచ్చుటకు నితరు లెవ్వరును లేమిం జేసి ఈతఁడా కారాగృహము నుండియె తీసికొని రాఁబడెను.
ఇన్ని కష్టముల పాలయ్యును నితనికి బుద్ధిమాత్రము కుదిరినది కాదు. గాయిక వాడుపదమునకు వచ్చిన తోడనే మునుపటి గుణమును మానక దుష్కార్యములకుఁ బ్రారం భించెను. ఖండేరావువలన నేమింపఁ బడియుండిన నౌకరు లెల్లరును ఆయాపదములనుండి తోలఁగింపఁ బడిరి. ఆతని భార్య. జమ్నా బాయి గర్భవతి ఇతనికి జడిసిరెసిడెంటు గారి సంరక్షణ మందొక కొంతకాలముండి ఆడబిడ్డనుగని రు 36,000 ల పెన్ షను' [4]తో. మఱలబరోడా చూచుట తటస్థింప దనుకొనుచు పునహా పోయిచేరెను. మల్టర రావు
............................................................................................. 1. .
పనికిమాలిన మంత్రులను చేర్చుకొని అవాచ్యమగు నపరాధ ముల "నొనర్చుచు దుర్వ్యయము చేయ " నారంభించెను. ప్రజలు పన్నుల బరువునకుఁ దాళుట యసాధ్యమయ్యెను. రాజు కంటఁబడి స్త్రీలుమానమును దక్కించుకొనుట కష్ట మయి పోయెను. క్రౌర్యము - దలయె త్తికొని సంస్థానమున సంచరింప మొదలిడెను. ఇట్లుండ 1860 వ' సంవత్సరమున బరోడా సంస్థానము పై నధి కారము మఱల సంపాదించుకొని యుండిన బంబాయి ప్రభుత్వము వారు కర్న లు ఫేరెను రెసి డెంటుగాఁ బంపిరి. అతఁడు మల్హరిరావు లోపములను ' బూస గ్రుచ్చి న ట్లె త్తి చూప మొదలిడెను. వానిని విచారించుకొఱకు యాజమాన్య ప్రభుత్వము వారు 1878లో ఒక కమిషను నేర్ప కమీషను వారి యభిప్రాయము . ననుసరించి కూడ మల్హార రావు ప్రభుత్వము మిక్కిలి నింద్యముగాఁ దోఁచెను. కావున నతఁడు దన రాజ్యములోని దోషములను 1875 లోపుగ దిద్దుకొననలసిన - దని యుత్తరు . వాయెను. మలారి రావు మంత్రులు పనికిమాలిన వారని ఇదివఱకే - వ్రాయఁబడియెను గదా. వారిని దీసి వేయుట విషయములోను, గాయిక వాడు ప్రార్థన నంగీకరించి వచ్చియుండిన మన దాదాభాయి నౌరోజీ మొదలగు వారలకు. నిశ్చయమగు శ క్తులనిచ్చు విషయములో ను మల్హరిరావునకును ఫేరెకును భేదములు వచ్చినందున ఫేరె బరోడానుండి మారువఁ బడెను. కాని అతఁడు వెడలి .
పోవు నంతలో నాతనికి విసము పెట్టఁ బ్రయత్నములు సేయఁ బడెననువార్త బయలు దేరెను. అది యట్లుండనిచ్చి ఆతఁడు మాత్రము వెడలి పోయెను.
ఆతని స్థానమున “సర్ లూయి పెల్లి వచ్చి చే రెను. దాదాభాయి మెత్తగ రాజీనామానిచ్చెను. రాజ్య కార్య నిర్వహణ మంతయును “ పెల్లి' యె వహింహిచెను. ‘ ఫేరె' కు విషము పెట్టఁ బ్రయత్నించిన విషయము విచారణకు వచ్చెను. మువ్వురు ఆంగ్లేయులును మువ్వురు స్వదేశీయులును న్యాయాధి కారసభగ నియమింపఁబడిరి. మల్హరిరావు 1875 న సంనత్స రము జనవరి 18 వ తేదీ బంధీకరింపఁబడెను. ఆంగ్లేయ ప్రభు త్వము వారు రాణీ జమ్నా బాయి పరమున గాయిక వాడు రాజ్యమును పరిపాలింపఁ బ్రారంభించిరి .
“విఅహముఁ బెట్టఁ బ్రయత్నింపు' వ్యా యోగమున మువ్వు రు ఆంగ్లేయ న్యాయాధిపతులును మల్హరిరావు దోషి యనియే తీర్మానించిరి. తక్కిన మువ్వురును నాతనిపయి ఆ నేరము మోపు టకు వీలు లేదనిరి. ఇంగ్లాండునందలి సామ్రాజ్య ప్రభుత్వము వారు మఱియొక విధమునఁ దీర్మానించిరి. మల్హరిరావు పై దోషము సిద్ధపడినదని యొప్పుకోనమని నుడువుచు నతఁడు దుర్మార్గుడై దుష్కార్యములకుఁ బూని రాజ్యమ రాజకము చేసి యుండినందున రాజ్యమున కనర్హుఁడని నిర్ధారణ చేసిరి. కావున నాతఁడు మద్రాసునకుఁ బ్రవాసమున కనుపఁ బడెను. ఉచిత
రముల విధముగ నాతనికిని .ఆతని కుటుంబమునకు జీవనమార్గము గల్పింపఁబడెను.
1875వ సంవత్సారము. మే నెల 2వ, తేది జమ్నా బాయి బరోడాకు మగలివచ్చి ఆ నెల 27వ తేది పదుమూఁడు సంవత్స బాలుని దత్తు చేసికొనెను. ఆబాలుఁడే ప్రస్తుతము పరిపాలన 'మొనర్చుచున్న సయాజి రావు గాయికవాడు.
సయాజి రావు III. గాయికవాడు,
ఇతఁడు గాయికవాడు వంశములోని ముఖ్య శాఖలలో నొక్క దానికిఁ జేరిన వాఁడేగాని ఈతని తలిదండ్రులు మాత్రము బీదలు. రెండవ సయాజి గావు అన్న దమ్ము లందఱును మగబిడ్డలు లేక చనిపోవువఱకును ఈతని శాఖ నెవ్వరును దల పెట్ట లేదు. అయిన బరోడా రాజ్యపు మహదదృష్టమువలన జమ్నా బాయి ఈశాఖనుండి సయాజిరావును బుత్రుఁడుగ స్వీకరించెను. ఈ తఁడు దత్తు కుమారుఁడని ఏర్పడు సమయమున నే గాయిక వాడు సంస్థానమునకు సుప్రసిద్ధుఁడగు సర్. టి. మాధవరాయఁడు ముఖ్యమంత్రియయ్యెను. మాధవరాయని చరిత్రను సంక్షేప ముగ వర్ణింపవలసి యున్నది.
మాధవరాయఁడు మహారాష్ట్ర బ్రాహణుఁడు. 1828వ సం వత్సరమున జననమం దెను. ఇతఁడు మద్రాసు సర్వకళాభవన మున విద్య నభ్యసించి గణితశాస్త్రమున పట్టమందెను. కొంత కాల ముపాధ్యాయ పదముననుండి దానిని వదలి తన
తండ్రియుఁ బినతండ్రియు నెచ్చట దినానులుగఁ బని చేసి కీర్తి గాంచిరో ఆ తిరువాన్కూరు సంస్థానమునకు రాజకుమారు లిద్దఆకును విద్య నేర్పఁబోయెను. అచ్చట నె ముఖ్యమంత్రి సాహా య్యుఁడుగ నుండి తరువాత 1858లో ముఖ్యమంత్రి యయ్యెను. అప్పులలోఁబడి మతాచార్యుల చేతులఁ జిక్కి పోయియుండిన ఆసంస్థానమును జక్కగ సంస్కరించి వెట్టెను. 1878లో మహా రాజ హోల్కారు చే నాహూయమానుఁడయి యతనికి దివా నుగ నేగెను. అటనుండి బరోడా దుస్థితిందలంచి నాంగ్లేయ ప్రభుత్వము వారు పిలువ గాయిక వాడు సంస్థానమునకు ముఖ్య మంత్రిగా నుండి కార్యములు నడుపనంగీకరిం చెను
మలారి రావును గుఱించి వ్రాయు నెడ బరోడాయం దెట్టి యల్లకల్లోలము లుండినదియును వ్రాయఁబడియెనుగదా! ఆయ ల్లక కల్లోలములనణఁచి రాజ్య కార్యములను గ్రమమునకుఁ దెచ్చు. టలో నీమాధవరావు చేసిన కృషిని, పడిన పాట్లను, మాటలతో వర్ణించి మనసును సంతృప్తిపొందించుకొనుట దుర్లభము. మొట్ట మొదట నతఁడు రెవెన్యూ విషయములయందు సంస్కా రములకుఁ బూనెను. బరోడా సంస్థానము రెవెన్యూవసూలుకు గాను . ఖండములు ఖండములుగ కొన్ని సంవత్సరములకు గుత్తలకియ్యఁబడుచుండెనని ఇదివఱ కేనుడివితిమి. ఆగుత్తగాం డ్రకే సరదారులని పేరు. - వీరుమఱల సాహుకారులకు తమ ఇజారా ప్రదేశమును..చిన్న చిన్న భాగములుగ విభజించి యిచ్చు
చుండిరి. ఆసాహు కారులు సైనికుల సాహాయ్యము చేసికొని బీదలనక, ధనవంతులనక ప్రజల పై దౌర్జన్యము నడపుచుండిరి. సరదారుల యొద్దనుండి అది వఱకే ప్రభుత్వము వారు గొంత ద్రవ్యమును దీసికొని యున్నందున. పన్నులు నసూలు చేసికొను హక్కును మజల తమకే మార్చుకొనుటకు న్యాయముగాన . రాదయ్యెను. కావున సర్ మాధవరావు ఉచితమగు చట్టముల' నిర్మించి సర్దారులకుంగల పన్ను ససూలు చేసికొను హక్కులను వారు ఆమ్ముకొనవలసిన దని నిర్బంధ పెట్టెను. విశేషముగ మహా రాష్ట్రులగు నాసర్దారులు సులభమగ లోబడరయిరి.. వారికి న్యాయవాదులు సాయమయి సెక్రటరీ ఆఫ్ స్టేటు వఱకు అనఁగా ప్రీవీ కౌన్సిలు వజకు వ్యా జ్యెములు నముపఁబడునని జంకించిరి. కాని మాధవరావు పట్టినపట్టు వదలకఁ గొందఱను బ్రవాసము నకుఁ. బంపియుఁ గొంద జను మంచి మాటలతో లోబఱచు కొనియుఁ గార్యము నెర వేర్చుకొనెను.
ఇంతేగాక రాష్ట్రమున నీసర్దారుల హక్కులుగూడ విస్పష్టముగ నేర్పడియుండ లేదు. 'రాజడిగి నప్పుడు ద్రవ్యసాహా య్యముగాని సైన్యసాహాయ్యముగాని ఇచ్చుషరతు మీఁద వీరు భూభాగముల ననుభవించుచుండినందున వీటిని ఆయాజమీను నుండి విడదీయుటకూడఁ జట్టములకు విరుద్ధమయికన్పట్టెను. వీటికి జవానుల పై సర్వస్వాంతంత్ర్య, మెంత కాలముండునో అంతకాలమును న్యాయపరిపాలన కలలోనివా ర్తగనుం డెను.
కావున సర్ మాధవరావు న్యాయమునకును చట్టములకును వ్యతి రేకముగాని తెఱంగున వీరిని జమీనులనుండి విడదీయు మార్గమును ఆరయవలసిన వాఁడయ్యెను.
ముందు సంవత్సరములలో నీసర దారులు రాజుగార డిగి నప్పుడు ద్రవ్య సాహాయ్యము చేయక ఎగఁగొట్టఁ బ్రయత్నించి యుండిరి. ఆవిషయమును స్థిరపఱచు ప్రాత కాగితముల నన్ని టిని వెదికియుంచి అవ్వానింబట్టి వారు రాష్ట్రీయ ప్రభుత్వమునకు బాకీపడిన మొత్తములను దేల్చి వెంటనే ఆ మొ త్తములను పదు నేడు పదు నెనిమిది సంవత్సరముల వడ్డితోఁగూడ కట్టవలసినదని యత్తరువు చేసెను. వారుకట్ట లేక పోయినందున వారి హక్కులు రద్దు చేయఁబడెను. అందు గొందఱు తిరుగఁబడఁజొచ్చిరి. కాని వారి మాటలు మాధన రావు కడసాగినవి కావు. ఆతని యుత్త 'రువుల ననుసరించి వారందఱును వారణాసికిఁబ్రవాసమునకుఁ గొనిపోఁబడిరి.
పేరునకు సైనికులని పిలువఁబనుచుండిన కొందఱరబ్బీలు మున్నగువారు దమ యాయుధములతో బయలు వెడలి దేశ మున కుపద్రవముగలిగించుచుండిరి. వారి దౌర్జన్యముడుపుట గూడ సులభ సాధ్యముగాదయ్యెను. అయినను మాధన రావు చాతుర్యముగ వారికి దివానీ శాఖయందు నౌక రీల నిచ్చి ఒక్క డొక్కండుగ నా సైన్యమును దగ్గించి దాని పేరైనను లేకుండ జేసెను.
ఈ సంస్కారములతో పాటు మాధవరావు బరోడా' సంస్థానమున న్యాయ స్థానములును విద్యాలయములును బుస్తక భాండాగారములును, వైద్య శాలలును మున్నగు జనోపయోగ స్థాపనలను నెలకొల్పి పనికిమాలిన చిల్లరపన్ను లను రద్దుపఱచి బరోడా ' నగరమునందలి అనారోగ్యమయిన సందుగొందుల నిర్మూలము చేసి అట ప్రభుత్వమువారీ ద్రవ్యముతో బీదలకిండ్లు. గట్టించి యిచ్చి ప్రజారంజకుఁడయి వెలిగెను. ఆర్థిక దుర్దశ లోమునింగి యల్లకల్లోలముల పాలయి నశింపనున్న బరోడా' సంస్థానము - ఈతని రాక వలన ముందురాఁగల దుర్భిక్షాదుల నివారించుటకయి ఒకటిన్నర కోటి రూపాయిలు తన బొక్క సమున నిడుకొని కలకలలాడుచు సక్రమమగు రాజ్యాంగ పద్ధతిలో సంశోభిల్లఁ గలిగెను. ఇట్టి పుత్రులు భారతమాతగర్భమున నప్పు డప్పుడయినను జనించుచుండుట వలనఁగదా భారతీయుల కింకను గొంచెము గౌరవ మున్నది? ఇట్టివారి సంఖ్య క్రమక్రమముగ హెచ్చినం గదా మన కెప్పటి కైనను మోక్షము కలుగఁ గలదు? హేచ్చుచున్నదనుటకు మాధవరావుగారి శిష్యుండగు సయా జీరావే తార్కాణము.
ఇతఁడు. 1881 వ సంవత్సరము డిశంబరు నెల 28 వ తేది లార్డు రిపన్ ప్రభువు 'కాలమున సుపూర్ణ స్వాతంత్ర్యములతో బరోడా సంస్థానమును బాలింప నియోగింపఁబడెను. ఇతని విద్యాభ్యాస విషయమునందు ప్రసిద్ధుఁడయిన ఎలియట్ దొర
యును సర్. టి. మాధవరావును పరిశ్రమచేసి రాజ్యభార నిర్వ హణ కార్యములకు వలయు జ్ఞాన మితనికి నలవడఁ జేసియుండిరి. కావున నీతఁడు భరతవర్ష మునందలి స్వదేశ సంస్థానాధీశ్వరు లంద రిలో రాష్ట్ర పరిపాలనా సామర్థ్యమునకుఁ బేరువడసి మున్నె న్నడు నీ దేశమున నే ప్రభుత్వము వారి చేతను .నుపక్రమింపఁబడని ఉత్తమ రాజకీయ సంస్కారములను దైర్యముతోఁ బ్రారంభించి పొగడ్తగనియున్నాఁడు. ఇతఁడు పలుమారు 'విదేశములకు యాత్రనడపి అచ్చటచ్చటఁగల విశేషములు జాగరూకతతో 'విమర్శించి తన యనుభనములను రాష్త్రోప యోగమునకయి వినియోగించి యున్నాడు. అనేక సందర్భముల నీతఁడిచ్చిన యుపన్యాసములు చదువఁ జదువ రుచికరంబులయి మనంబునకు " నాహ్లాద మొసంగుచున్నవి. నాని నెల్ల నిచట భాషాంతరీక రించి చదువరుల రంజింపఁ జేయ లేకుండుట కెంతయుఁ జింతిల్లవలసి యున్నది. ఒకటి రెండు బిందువులను చవిగొని రసాయనంపు మాధుర్యాదుల నెఱుంగు భంగి, యీమహా రాజు నుపన్యాస ములలోని యొకటి రెండు నాక్యములతో నీతని విశాల హృద యమునొక కొంత కనుగొననగు.
ఒక చో నీతఁడు " రాజకీయాధిక్యతని వాణిజ్య ప్రాము ఖ్యతగాని ఒక్క జాతితోనే పుట్టిన నెల్లు కాపు. అట్లే ముత భేదముల వలనను సంఘమునందలి స్థానమువలనను మన దేశ మున గలుగుచుండు వి శేషాధికారాధిక్యములు ఆయామతము
లతోగాని ఆయాసంఘభాగములతోగాని జనించినవిగావు. అవి మధ్య కాలమున స్వస్వలాభమునకయి తెచ్చి పెట్టుకొనఁ బడినవి. కావున వానిని మనము రద్దుపఱచవలెను. మనము స్వార్థ త్యాగ వైభవము ననుభవింప నేర్చుకొనవలయును.. హీనజనులయిన మనసోదరులను మనంతటివారిని జేయవలయును. ఆ స్వా భావిక మగు విభేదములను దుడిచి వేయవ లెను, వాక్యశూరత్వ మునకంటెఁగార్యశూరత్వమే ఎక్కుడు ఫలప్రదంబనీ గ్రహంచి మనము మనవాక్కులను బరి పాలించుటకు వెనుదీయరాదు" అని నచించెను.
మఱియొక చో ," సంఘమునందు సామాన్య జను లకుఁగల గౌరవమును బ్రాముఖ్యత యును వారు దెలిసికొనునంతటిజ్ఞానము గలవారగునట్లు చేసిన నే తప్ప నిజమును శాశ్వతమును నయిన యభివృద్ధి గలుగఁ జాలదు. మనలో విద్యా వంతులును ధనవంతులునునైన వారు సామాన్యజనులను బ్రబోధించి వారికిఁ బ్రోత్సాహ మొసంగి జ్ఞానమలవడం జేయుటయే ప్రథమక ర్తవ్యముగ నెన్నుకొన నలయునని నా యాశయము. వారు స్వాభివృద్ధికి పాటుపడుటకై వారికి మనము సాహాయ్యము చేయవలయును. వారి పయినాధిక్యమూనుట మాత్రమెప్పుడును తగదు. మనకుఁ బ్రస్తుతము ముఖ్యతమముగ వలసినది సాహాయ్యసం యోగమే (Co-operation)గాని వారి
యెడ దాతృభావనా ప్రదర్శనముగాదు” అనియు నుడివి యున్నాఁడు,
ఈ పై వాక్యములకు వ్యాఖ్యానము వ్రాయఁ గడఁ గినచో గ్రంథము నెంత యైనను పెంచవచ్చును. కాని ప్రస్తుత మది కార్యముగాదు. సయాజీరావు ఉపక్రమించి జయప్రదముగ నడుపు చుండు సంస్కారములను వర్ణించినచో నాతఁ డెట్లు తన వాక్యములను సార్ధక పఱచినదియుఁ జదువరులకు విశదముగాఁ గలదు.
బరోడా రాజ్యమున నిప్పటిగాయిక వాడు కాలమున జరిగిన సంస్కార ఫలములు ముఖ్యముగ ప్రజల విద్యను గుఱించి నవియే యయియున్నవి. ఈసంస్థానమున 1880-81 న సంవత్సరములలో 180 స్వదేశ భాషా విద్యాలయములుం డెడివి. అందు 17,465 గురు విద్యార్థు లభ్యసించుచుం డెడివారు. 1904 - 05 లో విద్యాలయములసంఖ్య 1248 అయి యుండెను. అందలి విద్యా ర్థులు 81, 649. ఈయభివృద్ధికి "కారణ మేమి? 1885 వ సంవత్స రమున నొక క్రొత్తయు త్తరువు బయలు దేరెను. దానివలన సంవత్సరమునకు 30 క్రొత్తవిద్యాలయములు గట్టి పవలసిన దనియును విద్యా శాఖవారు (1) క్రొత్త వాచక గ్రంథముల సిద్ధ పజచుటయందును (2) బాలురకు వ్యాయామవిద్యల .నేర్పుట యందును (3) బాలికా పాఠశాలలకు నుపాధ్యాయినులుగ నుండ,
స్త్రీలను శిక్షించుట యందును (4) మధ్యజాతుల వారికిని హీన శ్రీయుత రమేశ చంద్రదత్తు.
జాతుల వారికిని విద్యనందఁ జేయుట యందును (5) పాఠశాలల కొజుఱకు వస్తు ప్రదర్శనాగారముల నెలకొల్పుట యందును (6) దేశ భాషావాజ్మయము నభివృద్ధి చేయుటయందును శ్రద్ధ పుచ్చుకొని పని చేయనలసిన దనియును ఏర్పడెను. నాటినుండియే 'విద్యాలయములు గట్టించుటకుగాను బరోడా సంస్థాన ప్రభుత్వము వారు సంవత్సరమునకు నించుమిం చుగ నరువది వేలు వ్యయ పెట్ట నిశ్చయించుకొనిరి. ఈ త్తరువు కొంత కాలముసాగి దాని ఫలములు గనుపించిన తరువాత 1898న సంవత్సరమున గాయిక వాడు నిర్బంధ విద్యాపద్ధతిని అవ లంబింప నిశ్చయించుకొని ఒక్క తాలూ కాయం దంతయునుఁ దదనుగుణముగ బాఠ శాలల స్థాపించున ట్లు తరువు చేసెను. ఏడు సవత్సరములకు పైఁబడిన పిదప బాలురు పండ్రెండు సంవత్స రముల వఱకును బాలికలు: పదేండ్ల నఱకును. విద్యాలయము లుదువిద్య నభ్యసించి తీరవలసినదని నిర్బంధమగు కట్టుబాటు చేయఁబడెను. దాని నతిక్రమించిన తల్లిదండ్రులు కొద్దిపాటి జరి మానా నచ్చకొననలసినవారై .. బీదసాదల కీ నిబంధనవలన గస్టములు గలుగ కుండుటకయి మొదట నూటికి నలుబదిగురు బాలురవఱకును నుచితముగఁ పాఠశాలలయందుఁ జేర్చుకొనఁ బనుచువచ్చిః. కొంతకాలమైన పిదప నీ పాఠశాలలయందు నెల్లరకును ఉచితముగ విద్యగఱపఁబడఁజొచ్చెను. 1904వ సంవ త్సరమున నిర్బంధ విద్యాపద్ధతిని 'రాష్ట్రమున కంతకును
వ్యాపింపఁ జేయుచు గాయిక వాడొక చట్టమును నిర్మించెను. దానినలన బాలురు 6. మొదలు 14 ఏండ్ల ప్రాయము నచ్చు వఱకును బాలికలు 6 మొదలు 12 ఏండ్ల ప్రాయమువచ్చు వఱకును విద్యాలయముల కనుపఁబడవలసి నట్లేర్పడెను. కొన్ని సందర్భములయందు మాత్ర మీచట్టమును గఠినముగ నుప ' యోగింప కుండునట్లు నిర్ణయింపఁ 'బడినది. ఇట్టి సందర్భము లేవియు లేనిచోట బాలుఁడుగాని బాలికగాని పాఠ శాలల కనుపఁ బడనిచో వారి తలిదండ్రులు వారిని పంపువఱకును మాస మున కొక రూపాయి యపరాధము నిచ్చుకొనుచుండవలెను. ఈవిధముగ నుపక్రమింపఁబడిన నిర్బంధోచిత విద్యా పద్ధతిని గుఱించి సయాజిరావు గాయికవాడే నుడివినట్లు రాఁగలవని జంకించిన కష్టములును నష్టములును . రాఁజాలవని అనుభవ ముచే స్థిరపడినది.”
మనగాయిక వాడు మహా రాజు మహమ్మదీయులకును హీన జనులకును విద్యాభ్యాసానుకూలము లేర్పఱచుటయందువి శేష మగుఁ బరిశ్రమచేసి యున్నాఁడు. ఇప్పుడు విద్యాభ్యాసమునకు యుక్తమగు వయస్సుగల నుహమ్మదీయ బాలురలో. నూటికే బదిగురు విద్య నభ్యసించుచున్నారనిన గాయిక వాడు. పట్టుదల విశదముగాఁ గలదు. 1888వ సంవత్సరము మొదలు అంత్యజు లకయి విశేష, విద్యాలయము లభివృద్ధిఁ జెందుచు వచ్చుచున్నవి. జె. ఎన్. కాటనుగారు వ్రాసిన విద్యావిషయకమయిన పదు . నై దేండ్ల వర్తమానమను (Quinquennial Reviery of the Progress cf Education) గ్రంథమునం దీబరోడా సంస్థానము నందలి విద్యాభివృద్ధిని గుఱించి యిట్లు వ్రాయుచున్నాఁడు:-- " అమేలియందు హీనజాతులకు విద్యగఱవుటకయి నెలకొల్పఁబడిన విశేషస్థాపనలును, నిర్బంధ విద్యా పద్ధతియును నిప్పుడనుభవము నలన ఫలప్రదము లయినవి.
ఇచ్చట హిందూస్థానమునందు మఱెచ్చటను గానరాని స్త్రీ విద్యాభి వృద్ధియుండుటయు నొక వి శేషాంశమే. ఇదే సందర్భమున భరతవర్ష మునందు మొత్తముమీఁద నూరు గ్రామములకు 28.47లో విద్యాలయములుండ బరోడాయందు మాత్రము నూటికి 48.41 గ్రామములలో పాఠశాలలుండెనని యును. విద్యాభ్యాసమునకు ఉచిత వయస్కులగు బిడ్డలలో మన దేశమంతటికిని విచారించినచో నూటికి 12.5 నుండ బరోడా యందు మాత్రము 25.5 గనుండెననియు, అందును బాలికలలో దేశమంతటికిని నూటికి 2. 10 గ నుండఁగ బరో డాలో 8.6 గ నుండెననియుఁ దెలియవచ్చుచున్నది.
ఇట్లు ప్రథమపాఠశాలల యెడ గృషి చేయుటతోడ నే తృప్తినొందక నీ మాన వేంద్రుఁడు దరిద్రులకును ఇదివఱకు విద్యాభిరుచి ఎక్కుడుగ లేని జాతుల వారికిని బ్రోత్సాహ మొసంగుటకయి. ఉన్న తవిధ్యను - నేర్పునట్టియు, పరిశ్రామిక విద్యను బోధించునట్టియు - ఉత్తమ విద్యాలయము లేర్పఱచి
యందు అనేకము లయిన ఉప వేతనములును ఇతరానుకూల ములును నగు సౌకర్యముల కలుగఁ జేసియున్నాఁడు.
1888 వ సంవత్సరమాదిగ పరిశ్రామిక విద్యాలయములు నెల కొల్పఁబడినవి. అందు ముఖ్యము ' బరోడా యందలి “కళా భవః' అనునది. అట (1) చిత్ర లేఖన, నర్ణ లేపనములును (2) వడ్రంగమును (3) యంత్రోపయోగ విద్యయు (4) రంగుపనియు (5) నేతపనియు (6) గడియారములు చేయుటయు మున్నగు విద్యలు శాస్త్రీయముగ నేర్పఁబడుచున్నవి.
ఇంతియేగాక విదేశములకు వెడలి (1) వ్యవసాయ శాస్త్రము (2) అరణ్య పోషణశాస్త్రము (Forestry) (8)వైద్య శాస్త్రము (4) దోహదశాస్త్రము (Horticulture) (6) విద్యుచ్ఛక్త్యు పయోగము (6) గానవిద్య (7) యంత్రశాస్త్రము (Engineering) (8)యంత్రనిర్మాణ విద్య (Machine Construc- tion) (9) రసాయన సంశ్లేషణము (Chemical Analysis) (10) ద్రవ్య శాస్త్రము (Finance) (12) గడియారములు చేయుట (13) న్యాయశాస్త్రము మున్నగు విషయములయందు పరిశ్రమచేయ సెంచిన వయోవంతులకు నితఁడు సర్వసాహాయ్య ములు నమర్చి విద్యాభ్యాసానంతరము వారిని దన రాష్ట్రమునందు జనోపయోగ కార్యములకు నియమించుచున్నాఁడు. ఇట్లు సయాజీరావు గాయిక వాడు “విద్యమూలంబు దేశాభివృద్ధి కెల్ల” ననెడి మతమువాఁడు గానఁ దన యావచ్ఛ క్తిని విద్యాభివృద్ధికయి వినియోగించుచున్నాఁడు.
ఇతర విషయములయందును నీతఁ డుక్తమాదర్శములు గలవాఁడయి ప్రఖ్యాతి వడసియున్నాడు. సంఘసంస్కార విషయమున నీతఁడు చూపిన దారులవలన నీతఁను త్తమ సంస్క 'ర్తలలో ఒక్కఁడుగ నెన్న బడవలసి యున్నది. విదేశములకుఁ బ్రయాణమగు విద్యార్థులకు సాయ మొనర్చుట యటుండ నితఁడును నీతని యర్ధాంగలక్ష్మియు స్వయముగ నైరోపాఖండ మును జుట్టివచ్చి య నేకాంశముల మనకు నెల్ల డిచేసి యున్నారు.
వీరి పుత్రులును బుత్రికలును ఇంగ్లాండునందుఁ గొంత వఱకు విద్యనభ్యసించియో సభ్యసింపుచునోయున్నారు. అతి బాల్యవివాహముల సంగతి నెత్తికొంటి మేని యీతఁడా దురా చారమును దొలఁగించు నుద్దేశముతోఁ 'దన రాష్ట్రమున ఒక చట్టము నేర్పఱచి యున్నాడు. దానివలన బండ్రెం డేండ్లకు లోఁబడిన కన్యకలకు వివాహము సేయ రాదు. వారికి ఆవయస్సు దనుక నిర్బంధ విద్యాభ్యాసముండుట వలన నీ అతి బాల్య వివాహ శాసనము నుపయోగించు .నవసర మేయుండఁ బోదనిన నంత సాహసముగాదు. . ఆశాసనము వలనను నిర్బంధ విద్యాభ్యాస పద్ధతివలనను' బాలురకుఁ గూడ - నతి బాల్య వివాహములు ని షేధింపఁ బడినవి.
ఇక రాజకీయ విషయములఁ దడవితి మేని ఇతఁడు మిక్కిలి యుదారమగు మార్పుల నొనర్చి యున్నాఁడు. బహు కాలమునుండి మన మహాజనసభలు ఏ రాజకీయ సంస్కారమున
కయి మొఱ్ఱ పెట్టుచుంవో ఆ రాజకీయ సంస్కారము - అధి కార న్యాయ శాఖల . : విభజనము - నీతఁడు దన రాష్ట్రమున నొనర్చి నిర్భంధ విద్య, అతి బాల్యవివాహశాసనము మున్నగు, విషయములుదు వలెనె: తక్కుంగల భారతీయ ప్రభుత్వములకు మార్గదర్శకుఁడయి యున్నాఁడు. గ్రామ పంచాయతుల నభి వృద్ధి చేసి తాలూ కా బోర్డులకును జిల్లా బోర్డులకు నవి. నిశ్చయ సంబంధము గలవగునట్లు చేయు. తలుపుతో.. నతఁడు నిర్వచనా పద్ధతులను తన దేశమున నుపక్రమించి యున్నాడు. .
ఈ సంస్కారము లన్నియును మహారాజు, గాయిక వాడు "సయాజి రావు దీర్చుటలోఁ దనకు, సహాయులుగ నాతఁడు: నియ మించుకొనిన మంత్రులును , మన దేశ చరిత్రము నందు మహ నియులే. అందు' సర్. టి. మాధన రావునకుఁ దరువాత ముఖ్యుఁడు కీర్తి శేషుఁడగు 'రమేశచంద్రదత్తు. ఇతనినిగుఱించి విశేషించి యట వ్రాయుటకు నవ కాశము లేదు. కాని యీతఁడు పరిపాలకులలోఁ బరిపాలకుఁడనియు గ్రంథకర్తలలో గ్రంథకర్త యనియు స్వదేశాభిమానులలో, స్వదేశాభి, మానియనియుఁ , బేరువడసియున్నా డనిన నీతని విస్తారశ క్తి.. వెలువడఁగలదు. ఇట్టి చరిత్రగల బరోడా సంస్థానమింకను వృద్ధినొంది సర్వకాలమును భరతవర్షము , నందలి యితరస్వ దేశ రాష్ట్ర ములకు మార్శదర్శకమగుచు వెలుంగుగాత!
- ↑ అనఁగా చక్రవర్తికి గావలయు పన్ను లో నాలవవంతు పన్ను :
- ↑ ప్రతినిధి
- ↑ ఈయప్పులకుఁ గారణము లివియని మౌంటు స్టూఆర్టు ఎల్ఫిక్ స్టను కొన్ని టిని వ్రాయుచున్నాడు. కాని మొత్తముమీఁద నీకోటి నొక లక్ష రూపాయలును సెనికులకు బాకీపడిన జీతముల రూపముననొ మాళవమున గాయిక వాడు (ఆంగ్లేయులకయి) నడపి నయుద్ధముల సమయమున దదర్దము సాహుకారులిచ్చిన యప్పురూపముననే ఉన్నదని ఎఫ్. ఏ. ఏచ్ . ఎలియట్ బొంబాయి' ' గెజటీరులో వ్రాయుచున్నాఁడు.
- ↑ ఈవిషయమున మహా రాజు హోల్కారుయొక్కయు నప్పు డాతని మంత్రిగ నుండిన సర్ టి. మాధవ రావుయొక్కయు పరిశ్రమ - కొంతకలదు