Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 11

వికీసోర్స్ నుండి

జర్మనీలో ఈవసతిబడులు ప్రారంభము లో ఉన్నవి. కాని, జర్మనులు ఇటువంటిబడు లింకా ఎక్కువగా కావ లెనంటున్నారు. ఇంగ్లీషు పబ్లికు , స్కూళ్ళలో తమ వసతిగృహము, తమబడి, అనే అభిమానము ఎక్కువగా ఉంటుంది. ఈ అభి మాసము జర్మనీలో ఇంకా స్థిర పడ లేదు,

అధ్యాయము 11

విశ్వవిద్యాలయము లం, వృత్తికళాశాలలు.

(హాక్ షూలె Hoch Schule.)

ఉన్నతపాఠశాలలోని అంత్య పరీక్ష అయిన “ఆబిట్యు రియెంటెస్" పరీక్ష ప్యాసయిన వారినే చేర్చుకొనే కళాశాలలను ఈ క్రిందిరీతిగా విభజించ వచ్చును. (1) విశ్వవిద్యాలయములు: వీటిలో కళ లు, శాస్త్రములు, వైద్యము, స్మృతులు (Iaw), మతము నేర్పుతారు. కొన్నిటిలో వ్యవసాయము కూడా ఉంటుంది.

82

(2) ఇంజనీరింగు కళాశాలలు (హోక్ షూ

లె Hoch Schule): వీటిలో విద్యుచ్ఛక్తి ఇంజినీరిం గు, యంత్రముల ఇంజనీరింగు, శిల్పము, సివిలు ఇంజనీరింగు, రసాయన శాస్త్ర ఇంజనీరింగు, నేర్పుతారు, కొన్ని టిలో ఉపాధ్యాయులకు శిక్షణము కూడా ఇస్తారు.

(8) పశు వైద్య కళాశాలలు
(4) వ్యవసాయ కళాశాలలు,
(5) అడవి కళాశాలలు,
(6) వాణిజ్య కళాశాలలు.

వీటిలో తుది నాలుగింటిలోను ఏదో ఒకొ క్క విషయము మా త్రమే బోధిస్తారు. వీటిలో చదువుకొనేవారికి కూడా “డాక్టరు” బిరుదము నిస్తారు. కార్మిక విషయములున్ను, వృత్తివిష యములున్న, ఇంగ్లాండులో విశ్వవిద్యాలయాల లో చేరి ఉంటవి. కానీ, జర్మనీలో ఈ విషయా లలో ఒకొక్కదానికి ఒకొక్కకళాశాల ఉంటుంది. ఒకొక్క కళాశాలయున్ను ఒక విశ్వవి ద్యాలయమయి, విశ్వవిద్యాలయపు హక్కులను

83

కలిగి ఉంటుంది. జర్మనీ దేశము జనసంఖ్య ఆరు కోట్ల ఇరవై అయిదు లక్షలు, అంటే ఇండియా జన సంఖ్యలో - అయిదో భాగము. ఈ జనసంఖ్యకు 49 విశ్వవిద్యాలయాలున్నవి. వీటిలో 28 లో సాధారణ విషయాలు బోధిస్తారు. పదిం టిలో ఇంజినీరింగు చెప్పుతారు.నాలుగింటలో ప్రత్యేకముగా వ్యవసాయమే నేర్పుతారు. డింటిలో పశుకోగచికిత్సను గురించిన్ని ఏడింటిలో అడవులను గురించిన్ని, అయిదింటిలో వాణి జ్యమును గురించిన్ని చెప్పుతారు. ఈ 40 విశ్వవిద్యాలయాలలోను 113,657 మంది విద్యార్థులున్నారు. వీరిలో 8,824 మంది పర దేశీయులు, ఇండియా దేశపు విద్యార్థులు 67 గురు: ఉపాధ్యాయుల సంఖ్య 7,489. వీరిలో 2,441 మంది అధ్యాపకులు (Professors) స్త్రీ విద్యార్తి నుల సంఖ్య వేగముగా అభివృద్ధి చెందుతున్న ది. ప్రతి విశ్వవిద్యాలయములోను అన్ని విష యాలను బోధించినా, ఒకొక్కటి ఒకొక్క విష యమును గురించి ఎక్కువ శ శ్రద్ధ తీసుకొంటుంది.

84

ఆ విషయములో గొప్ప పేరుప్రతిష్ఠలను సంపాదింవచిన అధ్యాపకులనే అందులో నియమిస్తారు.

ఏ విషయము ఏ విశ్వవిద్యాలయములో ఎక్కువ గా బోధిస్తారో " మై నెర్వా” అనే పుస్తకములో గాని “ఊహాక్ షూలెన్ డోయ్ ష్ లాండ్ " అనే పు స్తకములో గాని ఉంటుంది. ఈ రెండో పుస్తక మును డాక్టరు రోమ్మె అనే ఆయన వ్రాసినాడు. ఇతని పై విలాసము, డైరెక్టర్ ఆఫ్ పారిస్ ఇన్ఫర్ మేషన్స్, 4 ఉంటర్ - వెస్-లిండెస్ ,బెర్లిను(Dr. Romme, Director of Forign Infour- mations, 4, Unter-den-Lindon, Berlin. Germany) ఆయనకు వ్రాస్తే పుస్తకము చిక్కుతుంది.

పైన తెలిపిన 49 విశ్వవిద్యాలయాల లోను డాక్టరు బిరుదము నిస్తారు. కొన్ని విషయములలో, అనగా మతము, ఇంజనీరింగు, వ్యవసాయ ము, వాణిజ్యములలో ఇంట్మడియేటు పరీక్ష ఒక టి ఉంటుంది. ఇది ఇంగ్లాండులోని బి.యే, పరీక్ష కున్ను బి. ఎస్. సి. పరీక్షుకున్ను, ఫ్రాన్సులోని

85


“లెసెన్సు” పరీక్షకున్ను సరిపోతుంది. ఇంజనీ రింగు కళాశాలలలో ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. విద్యారులు ఏకార్మిక శాఖలో ఎక్కువ కృషి చేయవ లెనో సలహా ఇవ్వడమునకు న్ను, ఒక సంవత్సరము అనుభవము పొందడానికి ఆ యా ఫాక్టరీలవారి నడిగి విద్యార్ధులను పంపడ ముడున్న, ప్రతి ఇంజనీంగు కళాశాలలోను ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది. ఇంజనీరింగు పరీక్షలో కృతార్తత పొందడానికి ఈ అనుభవము అవసరము. జర్మనీవారి కిప్పటికిన్ని ఒక టైనా వలస దేశము(en..........) లేకపోయినా,viట్సెస్ హౌసెస్ (Witsen ...........) అనే పట్టణములోని వలసకళాశాలను (........ college) సాగిస్తూనే ఉన్నారు. ఈకళాశాలలో., - 2000 మంది విద్యార్థులున్నారు. దీనిలో ఇతర విషయాలతోపాటు వృక్ష శాస్త్రము, వ్యవవసాయము, దేశములోని పంటలను వద్ధి చేసే విషయాలున్నూ, నేర్పు తారు, ఇంగ్లీషువారికి ఎన్నో వలస రాజ్యాలున్నావారికిటువంటి కళాశాల లేక పోవడము విచిత్రముగా నున్నది. వలస రాజ్యలకు

86

పోయే ప్రతి ఇంగ్లీషువాడున్ను తన స్వానుభవము

సుపయోగించి ఆ రాజ్యములోని వ్యవసాయమును, ఇతర విషయాలను అభివృద్ధి చేసుకోవలెను. పైని చెప్పిన జర్మను కళాశాలలన్ని టిని మూల ప్రభుత్వము వారే పోషిస్తారు.

వైద్యములో పట్టభద్రులు కావడానికి ఆ రేళ్ళు చదువుకోవలెను. 'రెండోయేడు ఆఖరున ఒక పరీక్ష జరుగుతుంది. తరువాత విద్యార్థులను ఆసు పత్రులలో పని చేయడానికి పంపు తారు. యూరో పు ఖండములోనేకాక. ప్రపంచ మంతటి లోను పెద్దదయిన వైద్య విద్యాలయము జర్మనీలోని “ఫియెన్నా” (Vienna) పట్టణములో నున్నది. దీనికి సంబంధించిన ఆస్పత్రులలో 20,000 రోగు లకు మంచములున్నవి. ఈ వైద్యవిద్యను రాక్" ఫెల్లర్ (Rockfeller) అనే అమెరికా కోటీశ్వరుడు ప్రపంచములో వైద్య సహాయముకోసము నిధిగా ఏర్పరచిన సొమ్ముతోనే చాలాభాగము జర్మనీలో సాగిస్తున్నారు. ఇంగ్లీషు మాత్రము తెలిసే గ్రాడ్యుయేట్లు ఇంకా ఎక్కువగా నేర్చుకొనడానికి

87

ఈ జర్మను వైద్యవిద్యాలయాలకు వస్తారు. వారి

కోసము ఇంగ్లీషులో కూడా ఉపన్యాసా లిస్తారు. అమెరికావారు ఇంగ్లీషుమాట్లాడేవారికి జర్మను వైద్య విద్యను గురించిన భోగట్టా తెలుపడానికి ఒక సంఘము స్థాపించినారు. ఈ సంఘమునకు “ఆమె రికర్ మెడికల్ ఎసోసియేషన్ (American Malli R! Association) అని పేరు. దీని విలాసము 9, ఆల్సాక్ స్ట్రస్సై, ఫియెన్నా 9. Alsac StrasseVienna . )

జర్మను విశ్వవిద్యాలయాలలో తరగతుల & భాగము గాని, ఫలానా ఉపన్యాసాలనే నియమము గాని లేవు, ఇందు చేత చాలా గందరగోళముగానే ఉంటుంది. ఉన్న తపాఠశాలలో తరగతి అయిన తరువాత తరగతి చదువుకొంటూ, ఒక పాఠక్రమ ము ప్రకార ము శిక్షణ ముపొంది, పరీక్షలు ప్యాసవు- తూ వచ్చిన విద్యార్థి, విశ్వవిద్యాలయములో ప్రవేసించగానే స్వతంత్రు డయిపోయి, దిక్కు దెస లేకుండా అధ్యాపకుల సహాయము లేక తనంతట తానే చదువుకోవలసి వస్తుంది, దీనికి “ట్యూటర్లు

88

అనగా చదువు చెప్పేవారుండరు. తానేమి చేయ వలెనో వానికీ తోచదు. అందు చేత అతడు తన పనిమీన శృద్ధవహించక,, సంఘములలోను, వినా దములతోను కాలయాపనము చేసి, ఒకటి రెండేళ్ళు కాగా నే మరొక విశ్వవిద్యాలయానికి పోయి., . శ్రద్దగా చదువుకోవడ మారంభిస్తాడు .ఈ వృధా కాలక్షేపమును గురించి జర్మను అధ్యాపకుల కంద రికీ తెలుసును. గాని, వారు దానిని ఆటంక పెట్టడానికి ప్రయత్నించరు. విద్యార్థులు తమ స్వాతంత్ర్యభంగమును సహించరని వారికి తెలుసును. యుద్ధమయిన తరువాత ఈ విషయమై రెండు పద్ధతులను ఆలోచిస్తున్నారు.

(1) ఉన్న తపాఠశాలలకున్ను , విశ్వవిద్యాలయాలకున్ను మధ్యగా ఇంటర్మీడి యేటు కళాశాలలను ఏర్పాటు చేయడము. ఈ కళాశాలలలో తరగతులలో పాఠాలు జరుగుతూఉన్నా విద్యార్థులకు కొంచెము స్వాతంత్ర్య ముంటుంది. ఈ కళాశాలలలో రెండేళ్ళు చదువవలెననిన్ని, వాటిలో ఒకయేడు హైస్కూలు విద్యాక్రమమున్ను, రెండో

89

యేడు ఇప్పుడు వృథా అవుతూ ఉన్న విశ్వవిద్యా లయపు మొదటి సంవత్సరపు చదువున్ను, అయి ఉండవ లెనిన్ని , అనుకొంటున్నారు,

(2) విశ్వవిద్యాలయములోనే విశేషజ్ఞాన మును సంసాదింప నారంభించగానికి పూర్వము రెండేళ్ళు మామూలు పాఠాలు నేర్పడము, అం టే, ఇంటర్మీడి యేటు. కళాశాలలను విశ్వవిద్యాల యాలలో భాగములుగా ఏర్పాటు చేయడమన్నమాట, ఈ విషయమై కావలసిన పాఠక్రకములు మొదలయినవి తయారైనని. ఈ భాగములో సామాన్య జ్ఞానము, విద్యాబోధము, రాజ నీతి, కూడా విషయములుగా ఉంటవి. విద్యార్థుల సంఖ్య నానాటికి ఎక్కువ కావ డము చేత ఒక "ప్యా సు” డిగ్రీ, అంటే సాధారణ బి. యే. డిగ్రీ వంటిది, చేర్చవలెనని ఒక సల హా ఉన్నది. జర్మను విశ్వవిద్యాలయాలలో ప్ర స్తుతము "డాక్టరు "డిగ్రీ, ఒక్కటే ఉన్నది. పరిశో ధనలు సాగించి, ఆ విషయాలను కనుగొన్న వారికే ఈ పట్టము నిస్తారు.ఒక్క పరీక్షలో

90

కృతార్థులయి పట్టములు సంపాదిం చే పద్ధతి జర్మ

నీలో లేదు.

పరిపాలనము,

జర్మను విశ్వవిద్యాలయాల పరిపాలసము ఏమీచిక్కు లేనిది. వీటిలో రెండే సభలు, ఇద్దరే ఉద్యోగులు ఉంటారు. (1) ఫేకల్టీలు (2) సెనేటు- ఈ రెండున్ను సభలు. వీటి అధ్యక్షు లే ఉద్యోగులు,


విశ్వవిద్యాలయ ములోని అధ్యాసకులందరున్ను, తముతమ విషయాలకు సంబంధించిన ఫేకల్టీ లో సభ్యులు గా ఉంటారు,సెనేటులో పదకొండుగురు సభ్యులు మాత్రమే ఉంటారు. వీరినే ప్యా కల్టీవారు ఎన్నుకొంటారు. ఏ ఫేకల్టీవారు ఎంత మందిని సెనేటుకు ఎన్ను కోవలెనో శాసనము ప్ర కారము నిశ్చయమై ఉంటుంది. విశ్వవిద్యాలయ ములో' సెనేటు సభ్యులు మాత్రమే గౌనులు వేసు గొనడానికి అర్హులు. ఒకొక్క ఫేకల్టీ కీ సభ్యులు ఎన్నుకొన్న 5 నుంచి 7 గురు వరకుగల ఒక కార్యనిర్వాహక సంఘముంటుంది.

91

సెనేటు అధ్యక్షునికి "రెక్టో యర్”(Recteur) అని పేరు. మన విశ్వవిద్యాలయాల లోని ఛాన్సెలరు, ప్రొఛాన్సెలరు, వైస్ ఛాన్సు లరు, ప్రోవైస్ ఛాన్సెలరు అనేవారి అధికారాలన్నీ ఈయనకుంటివి. విశ్వవిద్యాలయ అధ్యాపకుల లో నుంచి సెనేటువారు ఈయనను ఎన్ను కొంటారు. ఇతను ఒక్క సంవత్సర మే ఆ పదవిలో ఉంటాడు, తరువాత తిరిగి అతనిని ఎన్నుకో కూడ దని నిషేధము లేదు గానీ, సాధారణముగా అతనినే ఎన్ను కోరు, ఓక శతాబ్దములో మూడు పర్యాయములు మాత్రను ఒకే వ్యక్తిని అధ్యక్షుని గా ఎన్ను కొన్నట్లు తెలియవస్తున్నది. రెక్టోయర్ ” పదవినుంచి తొలగిన ఆయన ప్రొ-రెక్టొ యర్ అవుతాడు. ఇది కేవలము గౌరవవోద్యోగము. " రెక్టోయర్ ” ఊరిలో లేనప్పుడు అతనికి బదులుగా అధ్యక్ష స్థానములో కూర్చొనడముతప్ప “పో. రెక్టోయరు” కు మరిఒక పని లేదు.

ఫేకల్టీ అధ్యక్షునికి "డెక్కాస్” అని పేరు. ఇనిని ఫేకల్టీ సభ్యులు ఎన్ను కొంటారు. ఇతడు

92

ఒక్క సంవత్సరమే ఆ పదవిలో ఉంటాడు. సంవత్సర మయిన తరువాత మరి అతనిని ఎన్నుకో కూడదు. ఈ " రిక్టోయర్ ” కున్ను, ఆయా ఫేకల్టీల “డెక్కా "నులకున్ను , అధ్యాపకులుగా వారి కిచ్చే జీతము కాక, మరి కొంచెము సొమ్ముకూడ ఇస్తారు. జర్మను విశ్వవిద్యాలయాలలో "కూరేటర్ ” అనే ఒక్క ముఖ్య ఉద్యోగి కూడా ఉంటాడు. ఇతను ప్రభుత్వము వారీ సివిల్ సర్వీసు ఉద్యోగి. ఇతనికి విశ్వవిద్యాలయ పరిపాలనముతో ఏమి జోక్యము లేదు. కాని, అతడు విశ్వవిద్యాలయ స్థలములో నే ఎల్లకాలమున్ను ఉండి అక్కడ జరుగుతూ ఉన్న పనిని గమనించి, దాని విషయమై ప్రభుత్వము వారికి తెలుపుతూ ఉంటాడు. విశ్వవిద్యాలయమువారికిన్ని, ప్రభుత్వమువారికిన్ని, జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈతని ద్వారా జరుగవలెను. మంత్రి సాధారణముగా ఈయన సలహానే అనుసరిస్తాడు. ఇతడు విశ్వవిద్యాలయము పనిలో జోక్యము కలుగ జేసుకోక పోయినా, తా

98

నక్కడ ఉండడము చేత విశ్వవిద్యాలయము పని తప్పు దారిపట్టదు. ఉపాధ్యాయవర్గము, విశ్వవిద్యాలయములోని ఉపాధ్యాయులు అధ్యాపకులు (Professors), ప్రయి వేటు ఉపా ధ్యాయులు, అని రెండు తెగలుగా ఉంటారు. అధ్యాపకపకులను ఆ యా ఫేకల్టీవారి సిఫార్సుల మీద మంత్రి నియమిస్తాడు. 'ఫేకల్టీవారు మూడు నాలుగు పేర్లు పంపిస్తే వారిలో ఒకరిని మంత్రి ఎంచుతాడు. మంత్రి ఫేకల్టీవారు సిఫార్సు చేసిన వారిలోనుంచే అధ్యాపకులను నియమించవలెనని నిగ్బంధము లేదు. కానీ, అతడు సాధారణముగా వారి సిఫార్సును తోసి వేయడు. వారు కూడా బాగా ఆలోచించి సిఫార్సులు పంపుతారు. వారు సాధారణముగా తమలోనుంచి అనుభవజ్ఞులయిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఈ కమిటీవారు దేశములో అధ్యాపకులుగా ఉండదగినవారి పేళ్ళనన్ని టిని ఆలోచిస్తారు. జర్మసీలో ఈ అధ్యాపక పదవులకోసము దరఖా

94



స్తును పెట్టుకోవ లేనని ప్రకటన చేయరు. ఎవరున్ను కూడా స్వయముగా దరఖాస్తులు పంపుకోరు. అట్లు పంపుకోసుట తమ గౌరవమునకు లోపమని వారనుకొంటారు. ఈ అధ్యాపక పదవిని తాము స్వీకరించవలసిన పని మంత్రి ప్రార్థించడమే జర్మను సాంప్రదాయము. ఈ ప్రయివేటు ఉపాధ్యాయులను ఆయాశాఖల వారు సిఫార్సులు చేసిన వారిలో నుంచి ఫేకల్టీవారు నియమిస్తారు. ఈ ఉపాధ్యాయులకు జీతము లుండవు. ఉపన్యాసములను వినడానికి వచ్చే విద్యార్థుల నుంచి కొంచెము జీతములను పుచ్చుకొంటారు. ఈ మధ్యనే విద్యార్థుల వల్ల వచ్చే సొమ్ము వీరి జీవనానికి సరిపోదని తేలుసుకొని, వీరికి చిన్న జీతము సంవత్సరానికి 100 పౌనులు ఏర్పాటు చేసినారు. ఈ విషయమునకు ఇంతమంది మాత్రమే ప్రయి "వేటు ఉపాధ్యాయులుండవలెనని నియమము లేదు. వీరు ప్రయి వేటు ఉపాధ్యాయులుగా చేరక పూర్వ ము, ఒక బహిరంగోపన్యాసము చేయవలెను. ప్రయి వేటు ఉపధ్యాయుని అధ్యాపకునిగా నియ

95

మింపవచ్చును. అట్టి ఖాళీ లేకపోయినా, ఆవిషయమును చెప్పే అధ్యాపకు డంత సమర్థుడు కాక పోయినా, సమర్థుడైన ఒకప్రయి వేటు ఉపాధ్యా యుని, అధ్యాపకుని జీతమంత జీతము మీద కాకుండా అసాధారణ అధ్యాపకుడుగా నియమిం చవచ్చును. ప్రతి అధ్యాపకుడున్ను తన విద్యా రులో ఒకనిని తనకు సహాయకుడుగా ఎంచుకొంటాడు. ఇతను తన అధ్యాపకుడు చేసిన ఉపస్యాసాలను వివరించి వ్రాస్తాడు. శాస్త్ర విషయాలను ఇతడు ఆయాపరిశోధనలను విద్యార్థుల యెదుట చేసికూడా చూపెట్టుతాడు. అధ్యాపకులకు సంవత్స రానికి 500 పౌనులు నుంచి 800 పౌనులవరకు జీతముంటుంది, ఈజీతము కాక, ఇతడు ప్రతి విద్యా నుంచిన్ని సంవత్సరానికి 50 పౌనుల నుంచి 200 మీన లవరకు జీతమువసూలు చేయవచ్చును. జర్మనీ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు తాము విన్న ఉపన్యాసాలకు ఇంతసొమ్ము చెల్లించవలెనని నియమమున్నది. ఈసొమ్ము విశ్వవిద్యాలయానికి పోను. ఉపన్యాసాలిచ్చిన ఉపాధ్యాయుని కిచ్చి

96


వేస్తారు. వారానికి నాలుగు గంటల ఉపన్యాసాల చొప్పున ఒక నెల్లాళ్ళ ఉపన్యాసాలకు విద్యార్థి చెల్లించవలసిన జీతము ఒక షిల్లింగు ఆరు పెన్సులు. శాస్త్ర విద్యార్థులు తమఉపకరణములను రసా యనవస్తువులను తామే తెచ్చుకొంటారు. అధ్యాపకుని జీవితాంతమువరకున్ను నియమించినా అతడు సాధారణముగా 65 ఏడు వయస్సున తనపనిని చాలించుకొంటాడు. అంతట అతనికి ' ఫేకల్టీతో సంబంధముండదు. అయినా అతనికి “అధ్యాపకుడు" (Professon) అనే బిరుదము పోదు. అతని జీవితాంశము వరకున్ను అతని నిండు జీతము నతని కిచ్చి వేస్తారు. పని చాలించుకొన్న తరువాత పోశ అకకు ఉపన్యాసా లివ్వవ లెనని ఉంటే ఇవ్వ వచ్చునుగాని, ఇవ్వవ లెననే పూచీ లేదు. కానీ సాధారణముగా, రిటైరయిన ప్రఫెసర్లు తమ పరి శోధనములను సాగించుకొంటూ, యూని వెర్సిటీ లో తరగతులకు ఉపన్యాసాలిస్తూ, బహిరంగ ఉపన్యాసాలు చేస్తూనే ఉంటారు. జర్మనీలో ప్రొఫెసరు అనేమాట ఒక విశ్వవిద్యాలయ బిరుద


97

ము వంటిది. ఉపాధ్యాయ వృత్తిని మార్చుకొన్నా,“ప్రొఫెసరు” అనే

మాటను తన పేరుకు చేర్చుకో వచ్చును.

విద్యార్థి ప్రవేశము

ఉన్నత పాఠశాలలోని తుదిది అయిన ఆ బిట్యూరియ్ర్ంటెస్ పరీక్ష లో కృతార్థులయిన వారందరుస్ను విశ్వవిద్యాలయములో చేరవచ్చును . దేశీయ విద్యార్థులు విశ్వవిద్యాలయము లో చేరడము చాలా సులభ మైనపని. తన దేశములోని విశ్వవిద్యాలయములో చేరడానికి అర్హతను సంపాదించిన పర దేశ విద్యార్ధి జర్మసు, శ్వవిద్యాలయ ములో చేరవచ్చును. ఇంతమందిని మాత్రమే చేర్చుకోవ లెననే నియమము జర్మనుకళాశాలల లో లేదు. ఇంగ్లాండులోని విశ్వద్యాలయాలవలే శాక, జర్మను విశ్వవిద్యాలయాలలో ఎంత మంది విద్యార్థుల నై నా చేర్చుకొనడానికి అవకాశం ములున్నవి. విద్యార్థుల సంఖ్య సాధ్యమయినం తమట్టుకు ఎక్కువ చేయడానికే ప్రయత్నిస్తారు. ఇందువల్ల ఆధ్యాసకులకు మరింత ఎక్కున జీతము

98

వస్తుంది. జర్మను విశ్వవిద్యాలయాలు భారతవ ర్షములోని ప్రాచీన నాలందా, నవద్వీప విద్యాపీఠములను పోలిఉంటవి. విద్యార్థులు ఎక్కువ అయి నా రే అన్న విచారమే ఉండదు. ఒక చిన్న గుమాస్థా వద్దకుపోయి, ఒక ఫారమును నింపపలెను, ఫారములోని ఈ క్రింది విషదుములు గమనింప దగినవి:--

14. ఇక్కడ నీవిద్య పూర్తి అయిన తరు వాత ఏవృత్తి నవలంబి ప దలచినావు?

(i) ఈ కింది వృత్తులలో ఒక దాని కింద గీత గీయుము (ఇక్కడ 60 వృత్తుల పేళ్ళు వ్రాసిఉంటవి),

(ii) ఉద్యోగము స్వతంతమా! ప్రయివేటు ఉన్యోగమా, పబ్లికు ఉద్యోగమా? (దేశము, రాష్ట్రము, జిల్లా, మ్యునిసిపాలిటీ, మత సంఘము, కులసంఘము మొద.)

15. నీవు పాఠశాలలో గానీ, విశ్వవిద్యా లయములోగాని నీవృత్తికి సంబంధించిన అనుభవమును సంపాదించినావా? ఎంతకాలము? ఎట్టి ఆ

99

నుభవమును సంపాదించినావు?

16. నీకిప్పుడు ఏదయినా ఖాయము ఉద్యోగము కాని, ఖాయము కాని ఉద్యోగము కాని ఉన్న దా? ఆఉద్యోగము స్వభావమెట్టిది?

17. కిందటి "ఓర్ములో" ఏదయినా ఉ గ్యోగము చేసినావా? ఏఉద్యోగముచేసినావు?

ఈ ఉద్యోగము వల్ల సీవు సంపాదించిన సొమ్ము యిప్పటి చదువుకు ఎంతనరకు సరిపోతుంది?

ఇటువంటి ఫారము నింపి, ఆఫీసు గుమా స్తా వద్దకుపోయి, తన ఆబిట్యూరియెంటెస్ సర్టిఫి కేటును చూపి, జీతము చెల్లించవలెను. ఇదంతా కొన్ని నిమిషములు మాత్రము పట్టుతుంది. పర దేశ విద్యార్థులు “డక్కన్” వద్దకు పోవలెను. ఇతడు పర దేశ విద్యాలయాలవారిచ్చిన పట్టాలు తనిఖీ చేసి తన విశ్వవిద్యాలయములో చేరడానికి విద్యార్థికి హక్కున్నదో లేదో చూచుకొంటాడు.

విద్యా పద్ధతి.

ఇండియాలోని విద్యాలయాలలో ప లే జర్మ

100

ను విశ్వవిద్యాలయాలలో విద్యార్థులను 'మొదటి సంవత్సరము క్లాసు, రెండో క్లాసు, అని ఈ మోస్తరుగా వేర్వేరుగా విడదీయరు. చదువంతా అయిన తరువాత అంతమందు జరిగే ఒక్క పరీక్ష తప్ప మరేవీ పరీక్షలు జరగవు. ఈవిద్యార్థులు ఈ “ట్యూటరు” కింద ఉండవ లెననే పద్ధతి లేదు, ఉపన్యాసాలపట్టికను ప్రకటిస్తారు. వాటిలో విద్యార్థికి ఏ ఉపన్యాసాలు ఇష్టమయితే వాటికి పోయి వినవచ్చును. ఏ ఉపన్యాసాలు వింటే మంచిదో సలహా ఇవ్వడానికి ప్రత్యేకముగా ఉద్యోగస్థుడెవ్వడున్ను ఉండను. ప్రతి విద్యార్థి వద్దను ఒక ఉపన్యాసాలు వాసుకొనే పుస్తక ముంటుంది. దీనిలో విద్యార్థి ఏ ఉపన్యాసాలను ఎంచుకొని,జీతము చెల్లించినాడో, ఆఫీసు గుమా స్తా వ్రాస్తాడు. "టెర్ము” ఆరంభముస, ఆఖరున, ఇందులో ఆధ్యాపకుడు సంతకము చేయవలెను. అతడు సంతకము చేయడానికి విద్యార్థి ఏ ఉపన్యా సమును విసవలెననే నియమము లేదు, ఒక్కఉపన్యాసము నైనా వినకుండానే పట్టాను సంపాదిం


101

చవచ్చును.

జర్మనీలో ఉపన్యాసము ఎప్పుడారంభమవు తుందో తెలియజేసిన వేళకు 15 నిమిషముల తరువాత అధ్యాపకుడు ఉపన్యాసము నారంభిస్తాడు, ఈ గడువుకు “ఎకెడెమిష్, ఫీర్టెల్ " (Acade- nische , Viextel) అని పేరు. కొన్ని సమయము లలో ఈ గడవు ఉండదు. గడువు ఉన్నదీ లేనిదీ స్పష్టముగా తెలియ జేస్తారు.

చదువు (1) కలో క్వియమ్ (Colloquiun) (2) సెమినార్ (Seminar) (3) గెసెల్ షాఫ్ట్ (Gesselechaft) అనే మూడుస్థలాలలో జరుగు తుంది. కలో క్వియములో విశేషజ్ఞానము నిచ్చే ప్రయివేటు ట్యూషను ఇస్తారు. ఒక విషయమును ముందుగా నిశ్చయించుకొని, అనేక విద్యార్ధు లిక్కడ ఆధ్యాపకుని కలుసుకొంటారు. ఇవి పబ్లికు క్లాసులు కావు.వీటికి పోవడానికి జీతము చెల్లించ నక్కర లేదు. ఆయా అధ్యాపకుని అనుమతి తీసుకొని ఏవిద్యార్థి అయినా ఈ క్లాసులకు పోవచ్చును. ప్రతి ఉపాధ్యాయుడున్ను వారము


102

నకు ఒక సారి అయినా ఇంటువంటి క్లాసు

పెట్టుతాడు.

సెమినారులో పబ్లికు క్లాసులు జరుగుతవి. వీటిలో ఒక రిద్దరు విద్యార్ధులు ముందుగా తెలియ జేసిన విషయాల మీద వ్యాసాలు వ్రాసి చదవడమో, కొన్ని నిశ్చిత విషయాలను గురించి ఉపన్యాసాలు చేయడమో జరుగుతుంది. వ్యాసము చదవడముగానీ, ఉపన్యాసము చేయడ ముగాని అయిన తరువాత అందరూ కలిసి ఆ విష యమును గురించి చర్చిస్తారు. ఈ చర్చలో ఆ ధ్యాపకులు సహాయ పడుతూ ఉంటాడు, "సెమినారలో ఇద్దరు ముగ్గురు అధ్యాపకులు కూడా కలిసి సహాయము చేయడమున్ను కలదు. సెమీనారు ఉపన్యాసాలకు పూర్వము ఆవిషయమును గురించిన చరిత్రమును, దాని మీద ఉండే పుస్త కములను ఆలోచిస్తారు. ఒక టెర్ము చదువు, ముందుగా నిర్నీతమయిన విషయమును గురించే అయి ఉంటుంది,

"గె సెల్ షాఫ్ట్” అనేది ఒక విషయమును

103

గురించిన జ్ఞానమును అభివృద్ధి చేయడానిక ఏర్పడిన సంఘము. ఆంఘము సాధారణముగా వారమ న కొక నాడు కలస్తుంది. ఒక ఆవిషయమును బోధించే ఉపాధ్యాయులందరున్ను ఈసభలకు వస్తారు. విద్యార్థులలో ఎక్కువ అనుభవము గలవానిని కూడా ఈసభలకు ఆహ్వానిస్తారు. 'మొ దటి అరగంట, గడచిన వారములో ఆ విషయము సుగురించి బయలు దేరిన పుస్తకాలు, వ్యాసాలు, మొదలయిన వాటిని గురించి చర్చ జరుగుతుంది. ఒక కొత్త పుస్తకముగాని, ముఖ్య మైన వ్యాసముగాని ఉంటే, దానిని చదివి, దానిమీద తన అభిప్రాయమును మరుచటి సభలో తెలియ చేయవలసినదని, ఒక ఉపాధ్యాయుని గానీ, అనుభవ ముగల విద్యార్థిని కాని అడుగుతారు. ఇందువల్ల జర్మనీ లోను , ఇతర దేశాలలోను, ఒక విషయమై జరుగు ఉన్న అభివృద్ధి అంతా ఇక్కడివారికి తెలుస్తూ ఉంటుంది. రెండో అరగంటను వ్యాసములను చదివి, వాటిమీద చర్చ చేయడానికి వినియోగిసారు. సెమినారులో చదివే వ్యాసాల


104

కంటె, ఈ వ్యాసాలు ఎక్కువ ముఖ్యమయినవిగా ఉంటవి. ఈ మీటింగయిన తరువాత సభ్యులందరూ ఒక అల్పాహారగృహములో కలుస్తారు.

పాఠక్రమము

ఈ గంటలలో ఈ ఉపన్యాసాలు జరుగ తవి అని ఎవరున్ను టైము టేబిలు ఏర్పాటు చేయరు. రాబోయే "టెర్ము"లో ఏ షషయమును గురించి ఉపన్యాసా లివ్వదలచిన దిన్ని ప్రతి ఉపాధ్యాయు డున్ను తెలుపు తాడు. ఒక శాఖలోని పెద్ద అధ్యాపకుడు ఒక ఉపాధ్యాయుని చేత ఎప్పు డేఉపన్యాసము జరిగేదీన్ని ఏర్పాటు చేయిస్తారు. ఒక ఉపన్యాసము జరిగే గంటలో మరి ఒక ఉపన్యాసము కూడా జరుగకుండా మాత్రము ఆ ఉపాధ్యాయుడు చూడపలెను.

వసతి

విద్యార్థుల వసతులమీద : విశ్వవిద్యాలయ మువారికి ఎట్టి అధి కారమున్ను లేదు. విద్యార్థులకు ప్రత్యేక వసతిగృహములు (Host:is) లేవు. వారు తమ ఇష్టము వచ్చిన ఇంటిలో ఉండవచ్చును.

105

తమ కిష్టము వచ్చినపని చేసుకోవచ్చును. వారి స్వాతంత్యమునకు ఎట్టి నిర్బంధమున్ను కలుగజేయరు. విద్యార్థులకు అద్దెలకు గదులివ్వడాని కిష్టపడే కుటుంబముల వారి పట్టీని తయారు చేయడా నికి పీడల్ (Pedal) అనే ఒక ఉద్యోగి ఉంటాడు. పర దేశ ద్యార్ధులకు ఇదిమంచి సదుపాయము. ఈ సదుపాయము లండనులో గానీ, ఇంగ్లాండులోని వ సతి విద్యాలయాలలో కాని, ఇతర విశ్వవిద్యాలయా లలోగాని లేదు. విద్యార్థులు సరియైన వసతిని సంసాదించుకొనడానికి అక్కడ చాలా ఇబ్బందిపడ తారురు. నిద్రపోవడానికిన్ని , చదువుకొనడానికీన్ని ఒక్కటే గదినిగాని, 'వేరుగదులను గాని విద్యార్థులు అద్దెకు తీసుకొనవచ్చును. జర్మను విద్యార్థులు మధ్యా హ్న భోజనమును ఏదయినా హెూటలులో చే స్తారు. రాత్రి భోజనముకోసము ఇంటినుంచి తెప్పించుకొంటారు. జర్మను భాష రాని పర దేశ విద్యార్థులు భోజనసదుపాయములు గల గదులను ఏర్పాటు చేసుకోవడమే మంచిది. ఇప్పుడు విద్యార్థుల సహకారభోజనశాలను ఏర్పాటు చే

'


106

సుకొన్నారు. వీటిలో అంత ఎక్కువ ఖర్చుకాదు.

వసతి, ఉపన్యాసముకు పోవడము, ఇతర పనులు - వీటి విషయములో ఇతర దేశములలో కంటె జర్మనీలో విద్యార్థులకు ఎక్కువ స్వాతం త్యమున్నది. విశ్వవిద్యాలయమువారు ఎట్టి నిర్బంధమున్ను చేయరు. మొన్న మొన్నటివరకున్ను దేశ చట్టములను అతిక్రమించిన విద్యార్థిని గవర్నమెంటు మేజ స్ట్రేటు విచారిం చేవాడుకాడు. పోలీసువారు ఆ విద్యా ని పట్టుకొని అతడా కళా శాలవా డే అని రుజువు చేస్తే విశ్వవిద్యాలయాధి కారికి ఒప్పగించేవారు, యునివర్సిటీ మేజిస్ట్రేటే ఆ కేసును విచారించేవాడు. ఇప్పుడీ విద్యార్థుల హక్కును తీసి వేసినారు. కాని విద్యార్థి నేరము చేసినప్పుడు అతనిని అరెస్టు చేసిన సంగతిని విశ్వవిద్యాలయాధికారులకు తెలుపుతారు. తని పక్షమున వాదించడానికి విద్యాలయాధికారు లు తగిన సదుపాయములు చేయవచ్చును,

విద్యార్థుల జీవనము

ఇంగ్లాండులో విశ్వవిద్యాలయాలలోని క్రిం

107


ది తరగతులలో ఉండే విద్యార్థులకు అతిముఖ్య ములయిన “విద్యార్థుల సంఘములు" జర్మనీలో లేవు. కాని, ప్రతివిశ్వవిద్యాలయానికిన్ని ఒక పఠనాలయముంటుంది. దీనితో ఒక గంధాలయముకూడా చేరి ఉంటుంది. పఠనాలయమును చూడడానికి సగము మంది విద్యార్థుల న్ను సగము మంది అధ్యాపకులున్న గల ఒక ఉసంఘముంటు , వీరిని సభ్యులు ఎస్ను కొంటారు. యుద్ధానంతరము ఈ పఠనాలయాలకు ఎక్కువ మంది పో తున్నారు. విద్యార్థులకు చర్చా సంఘములు లేవు.. చర్చను ఏలాగు సాగించడమో జర్మను విద్యార్ధులకు తెలియదు. కొంత మంది అధ్యాపకులతో కలసి ఒక అధ్యాపకును ఒక చర్చాసంఘమును ఆ రంభించినాడు గాని, వివాగ్దస్తములయిన రాజకీయవిషయముల పై అందరున్ను సకారణముగా ఏకాభిప్రాయమునకు రాలేకపోవడము చేత, ఈ ప్రయత్నమును మానుకొన్నారు.

కాని, మరిఒక విధమైన విద్యార్థి సంఘము లున్నవి. ఇవి రెండు విధములుగా ఉంటవి.

108

కొన్ని ఒకరితో ఒకరు కలిసి పరిచయము కలిగిం చుకొనడమునకున్ను, కొన్ని ఇట్టి పరిచయమే కుండా శాస్త్ర విషయాలను, సాహిత్య విషయాలను చర్చించుకొనడమునకున్న ఏర్పాటయి ఉంట వి. రెండో తరగతి సంఘములు గణితము, వేదాం తము , చరిత్రము, మొదలయిన విషయాలను బట్టి వేర్వేరుగా ఉంటవి. ఈ సంఘములకు ఒక అధ్య క్షుడు, ఒక కార్యదర్శి, ఒక అలంకార కార్యదర్శి, ఒక కోశాధిపతి ఉంటారు. వీరిని విద్యార్థులే ఎస్ను కొంటారు. వీరు ఒక్క ఓర్ము మాత్రమే ఆ ఉద్యోగములో ఉంటారు.. జర్మను విశ్వవిద్యాలయములో నవంబరు ఆరంభమునుంచి ఈస్టరువరకు ఒక టిన్ని , మే నెల మొదలు ఆగస్టు మధ్యవరకు ఒక టిన్ని 'రెండే టెర్ములుంటవి. మొదటి రెండు సంవత్సరముల విద్యార్థులు చేత పై సంవత్సరముల విద్యార్థులు పసులను చేయించుకొంటారు. ఈ క్రింది విద్యార్థులకు "ఫూక్స” (luclas) అని పేరు. వారానికి ఒక సభ జరుగుతుంది. అందులో ఒక విద్యార్థి తప్పకుండా ఒక వ్యాసమును చదువు


109

తాడు. కొన్ని పర్వదినాలలో అధ్యాపకులను కూడా విద్యార్థులసభలకు పిస్తారు. వారున్ను వ్యాసాలు చదువుతారు. ఆ వ్యాసముమీద శాస్త్రీయచర్చ జరిగిన తరువాత అందరున్ను అల్పా హారాలకు చేరుతారు, ఈవిందు తెల్లవారుజాము మూడు నాలుగు గంటలవరకున్న జగుగు తుంది. విద్యార్థులు పాటలుపాడుతారు, హా స్యోపన్యాసాలు చేస్తారు. కాని, వారందరున్ను చాల కాలము “బీరు” సారాయమును తాగడ ముతో గడుపుతారు. జర్మను విద్యార్థి బీరు త్రా గడము విషయమై అనేక కథ లున్నవి. ఒకొక్కడు గంటకు 48 పెద్ద గ్లాసుల సారాయము కూ డా తాగగలడట. ఆతరువాత గంటకు ఎనిమిది గ్లా సుల చొప్పున మరినాలుగుగంటలు కూడా తాగగలడు.

ఈసంఘముల సభకు "క్నీపే"” (Knei pe) అని పేరు. ఇందు- ఒకరితో ఒకరు చేతులు క లుపుకొని పరిచయము కలుగ జేసుకోరు. ఒకరి ఆరోగ్యముకోసము ఒకరు “బీరు” తాగి పరిచ

110

యము కలుగ జేసుకొంటారు. ఇద్దరున్ను గ్లాసు

లను “బీరు”తోనింపి “ఒకటి, రెండు, మూడు అని ఒక్క గుటకలో తాగి వేస్తారు. ఇట్లు ఆట్లు త్రా గుతే వారి సౌహార్దము వెల్లడి అవుతుందట. కొక్కప్పుడు వారిద్దరికి పరిచయము కలుగజేసే మూడోవాడు మధ్యను నిలబడి “ఒకటి, రెండు మూడు, పాసిట్' (ఆరోగ్యము)” అంటాడు. అప్పుడు వారిద్దరున్ను గ్లాసులను టేబిలుమీద చప్పు డు చేసి “ఒకటి. రెండు, మూడు, పా సీట్ (ఆరో గ్యము)" అని తాగి వేస్తారు. ఎవరు ముందర తాగి వేస్తే వారు గెలిచినట్టు. 'పేదరికము చేత చాలమంది విద్యార్థులు ఎక్కువగా తాగడము అలవాటు చేసుకోరు. ఈ సంఘములవారు టె ర్ములో ఆధ్యాపకులు చేసిన ఉపన్యాసాల సారాంశ మును వ్రాసిన రిపోర్టు ఒకటి ప్రకటిస్తారు. దీని ప్రతులను ప్రాత విద్యార్థుల కందరికిన్ని పంపుతారు. ఈ ప్రాత విద్యార్థులకు "అల్టెహెర్” ( Alte Herr) (ముసలి పెద్దమనుష్యులు) అని పేరు. వీరిని ఆయా సంఘాల ముఖ్యసభ లకున్ను వింది.

111

లకున్న పిలుస్తారు. కొన్ని సంఘాలలో ఈప్రా త విద్యార్థులు ఒక విధమైన దుస్తులను ధరించవలసి ఉటుంది, వారానికొకసారి జరిగే సభల కే కాకుండా, “బీరు” తాగడానికి విద్యార్థులు కలుస్తూ ఒకే హో టేలులో భోజనము చేస్తారు. ఆది వారాలలో విహారాలకు పోతారు. జర్మను వి ద్యార్థి ఉదయము ఆరుగంటలకు బయలుదేరి రా త్రి పదిగంటలవరకున్న ఒక్క బిగిని నడవగలడట, రోజుకు ఏ భై మైళ్ళు నడవగలడట. జర్మను విశ్వవిద్యాలయములోని విద్యా ర్థులు ఒక్క విశ్వవిద్యాలయము నే అంటిపెట్టుకొని ఉ:డరనిన్నీ, ఒక దానిలో నుంచి మరిఒక దానిలోనికి తిరుగుతూ ఉంటారనిన్నీ, ఇంతకుముందు తెలుప బడ్డది, సరాసరిగా ఒక విశ్వవిద్యాలయములోనే చదివిన విద్యార్థి కనేబడడు, రెండు విద్యాలయాలలో మాత్రము చదివిన వారు బహు అరుదు. చాలమంది ఒక దాని తరువాత మరిఒకటిగా మూడు నా లుగింటినయినా చూస్తారు. ఒక విశ్వవిద్యాలయము లో ఏయే సంఘాలు ఉంటవో, మరిఒక దానిలో కూ .

112

-, డా ఆసంఘాలే ఉంటవి ఒక విశ్వవిద్యాలయములో చరిత్ర సంఘములో ఉండే విద్యార్థి తానుపోయి న క్రొత్త విశ్వవిద్యాలయములో దానికి సరిపో యే చరిత్ర సంఘమలో వెటనే చేరడానికి హ క్కున్నది. అతడు టెర్మకు ఇంత అనీ చెల్లించి ఈ సంఘము లో సభ్యుడు కావచ్చును. లేదా, ఏ మీ చెల్లించ నక్కర లేకుండా గౌరవభ్యుడుగా అయినా ఉండవచ్చును. ఒక సంఘములోని సభ్యు లు ఒకరినొకరు చనువుగా అన్నా, తమ్ముడూ” అని పిలుచు కొంటారు.

ఇండియాలో ఉండేక్రి కేట్టు, ఫుట్ బాల్ , హాకీ సంఘములు జర్మనీలో లేవు కాని, యుద్ధానంతరము వ్యాయామక్రీడలమీద ఎక్కువ శ్రద్ధధ వహిస్తున్నారు. జర్మనీ విద్యార్థుల సంప్ర దాయమునకు ఈ ఆటలు సరిపడవు. కానీ అందరున్ను టెన్నిసు ఆడుతారు, కసరత్తు చేస్తారు, ఈ ఆటలు లేకపోవడమనే లోపము సంఘాలలో తీరిపోతుంది. ఈ సంఘాలు ఒకొక్క రాష్ట్రము విద్యార్థులుకలిసి ఏర్పాటు చేసుకొంటారు. జర్మను

113

సామ్రాజ్యము అనే అభిప్రాయము ప్రబలినకొద్దీ సామ్రాజ్య భక్తియే ఆధారముగా ఈ సంఘ ములు ఏర్పడుతున్నవి. అంతకంతకున్ను ఆటల మీద ఆసక్తిపుట్టి, అది ఎక్కటిపోరులలోనికి పరి ణమించినది,

ప్రస్తుత మీసంఘాలు కొంతవరకు అల్పా హారాలకోసమున్ను, కొంతవరకు ఆటలకోసమున్న ఏర్పడి ఉన్నవి. విద్యార్థులు "క్నీపె” సభలలో చేరి పాటలు పాడుకొంటూ, హాస్యోపన్యాసాలు చేస్తూ, విహారాలకు పోతూ ఉంటారు, సభ్యులందరు న్ను కలిసి ప్రత్యేక గృహాలలో భోజనాలు చేస్తారు. కాని, ఎక్కటిపోరు చేయడమే ఈ సంఘాల ము ఖ్యోద్దేశము. ఈపోరు,ముష్టి యుద్ధమును (Boxing)పోలి ఉంటుంది. దీనిలో పిడికిళ్ళకు బదులుగా వాడికత్తులను ఉపయోగిస్తారు. పోరు జరిగేటప్పు డు గాయములకు కట్టుకట్టడానికి ఒక వైద్యుడు తప్పకుండా ఉంటాడు. టెన్నిసు, ముష్టి యుద్ధము లవలె, ఎక్కటిపోరులు స్నేహముగానే జరుగుతవి. ఏడెనిమిది సంఘాల అధ్యక్షులు వారానికొకసారి

114

కూడి, తమతమ సంఘాలసభ్యులలో ఈ పోరులను ఏర్పాటు చేస్తారు. క్రొత్తగా సంఘములో చేరిన విద్యార్థి ఒక పోరులో జయము పొందే వరకు "ఫ్లూక్సు" గానే ఉంటారు గాని, పెద్ద సభ్యు కు "బుర్ష్” (Bur sch) కాజాలడు. ఈ పోరులలో చాలావాటి ని సంఘాల అధ్యక్షులే ఏర్పాటు చేస్తారు, కాని, విద్యార్థులలో ఇద్దరికి పెద్దతగవు పుట్టు తే, వారు ఎక్కటి పోరు చేసి తమ తగవు తీర్చుకొంటారు. ఈ ఎక్కటి పోరుకు చాలా ఖర్చవుతుంది గనుక ఎవ రో ధనవంతుల బిడ్డలే వీటిలో చేరుతారు. సభ్యు లందరి మొలమీదను కత్తిపోట్ల మచ్చలుంటవి. ఈ మచ్చలు మగవారి అందమనకు లక్షణమని అనుకొంటారు. జర్మనీ దేశములో శాస్త్ర పరిశోధన విహారములు విద్యార్థి జీవనములో ముఖ్యములు. ఈ విహారాలను అధ్యాపకులు ఏర్పాటు చేసి, విద్యార్థులను కార్మిక ప్రాముఖ్యముగల పట్ట ణములకు తమతో తీసుకొనిపోయి, ఆయా పరిశ్ర మను గురించి వివరముగా తెలుపుతారు.

115