Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 12

వికీసోర్స్ నుండి

అధ్యాయము 12


పట్టణములలో విద్యార్థులకు వసతులు.

విద్యార్థులకు తగిన బసలను ఏర్పాటు చే యడము విషయములో ప్రతి పెద్ద పట్టణములోను కష్టము లుంటవి. ఇంగ్లాండు దేశములో కొన్ని పట్టణములలో విద్యార్థులకు కొన్ని వసతి గృహ ములను ఏర్పాటు చేసినారు గాని, వీటిలో స్థలము బొత్తిగా చాలకుండా ఉన్న ది. జర్మనీలో విద్యా ర్థులకోసము గృహములు కొన్ని కట్టినారుగాని ఇవి మీటింగు , చేకొనే విద్యార్థి సంఘములు గా ఉన్న విగాని, వసతిగృహములుగా తగి ఉండ లేదు. విద్యార్థులకు ఎక్కువ ఖర్చు కాపడము ,వారి వసతులు అనారోగ్యముగా ఉండడము, సరియైన వ్యాయామముగాని, సహవాసముగాని లేకపోవడము- ఇవన్నీ ప్రతి పెద్ద పట్టణములోను ఉండేవే. కలకత్తాలో ఈ సమస్య చాలా క్లిష్టముగా ఉన్నది. ఇప్పటికిన్ని ఈకష్టాలను తొలగించ డానికి తగిన ప్రయత్నాలు జరగలేదు. యూరోపు దేశములో వలె ఇండియాలో కుటుంబీకులు



116


పై విద్యార్థులను తమ కుటుం బాలలో చేరనివ్వరు. యూరోపు ఖండములో కుటుంబీకులు విద్యార్థులను చేర్చుకొని, వారికి తమ నౌకరులు పనిచేస్తే ఊరుకొంటారు. ప్రేగు (Prague) పట్టణములో విద్యార్థుల వసతులకోసము కొత్తగా ఏర్పాటు జరిగినది. జెక్కులకున్న జర్మనులకున్న భాషా భేదము వలను సంప్రదాయ భేదముల వల్లను సరిపడదు. అందుచేత ఆపట్టణములో జేక్కు విద్యా రుల కొక వసతిగృహమున్న, జర్మను విద్యార్థుల కొకటిన్ని కట్టినారు. ఉన్నత పాఠశాలల కంటె పై తరగతులలో చదువుకొనే విద్యార్థులందరున్ను ఈ వసతిగృహములలో ఉండవచ్చును. ఈ రెండు వసతిగృహముల లోను ఒకటి ఈకింద వర్ణింప బడినది


ఈహాస్టలును స్థాపించినది ఒక ప్రయివేటు కమిటీవారు. ఈ కమిటీలో జెకో-స్లో వేకియా రిపబ్లికు అధ్యక్షుడు నియమించిన ఒకడున్ను, ఆ దే శము మంత్రులు ఐదుగురు నియమించిన అయిదు గురున్ను, ప్రేగు పురపాలక సంఘమువారు నియ

117

మించిన ఒక దున్ను, విద్యార్థులే ఎంచుకొన్న ఒక డున్ను, మొత్తము ఎనమండుగురు సభ్యులున్నారు, దీనికి ప్రభుత్వము వారు సంవత్సరమునకు 2,000 పౌనులు గ్యాంటు ఇస్తారు. ఇల్లుకట్టు కొనడానికి పురపాలక సంఘమువారు ఉచితముగా స్థలమిచ్చి ఇల్లు కట్టడమునకయిన మొత్తము సొమ్ము లో రెండువంతులు ప్రభుత్వము వారిచ్చినారు. తక్కినవంతు కమిటీవారు చందాలమీద వసూ లు చేసినారు. దీనిలో 800 మంది విద్యార్థులకు వసతి ఉన్నది. విద్యార్థికి ఖర్చు మోతాదుగా ఉన్నది. ఒకొక్క-నికి నెలకు బసకు భోజనమునకు 2 పౌనుల నుంచి 5 పౌను. అవుతుంది. పిల్లల తలిదండ్రుల స్థితిగతులను బట్టి ఇచ్చుకోవలసిన సొమ్ము భేదిస్తూ ఉంటుంది. నూటిలో 50 మందిని తక్కువ సొమ్ముకు చేర్చుకొంటారు. నూటికి 20 మంది నెలకు 2 పానులు మాత్రమే చెల్లిస్తారు. గదు లన్నీ ఒక టేరకముగా ఉంటవి.; భోజనము కూడా ఒక్కటే. ఈహాస్టలు విశ్వవిద్యాలయము మునుంచి అయిదు మైళ్ళ దూరములో ఉన్నది. కానీ ఇ

118

సారు.

క్కడనుంచి ట్రాము ముబండ్లు పోతవి. విద్యార్థులకు ట్రాము 4 క్కెట్లు తక్కువ ఖరీదుకిస్తారు. గదికి ఇద్దరు విద్యార్థులుంటారు. కాని ప్రత్యేక పరీక్ష లకు చదువుకోవలసి ఉన్న విద్యార్ధులకు ఒకొక్క నికి ఒక గది యిస్తారు. కర్చీ, బల్లలు, అలమరాలు, మంచాలు, పరుపులు, హాస్టలువారే ఇస్తారు. విద్యార్థులు పుస్తకాలు, బట్టలు మాత్రము తెచ్చుకోవలెను. ఈ హాస్టలుమీది అది కారి ఎల్లప్పుడు దానిని కనిపెట్టుకొని ఉంటాడు. ఇతడు పూర్వము విశ్వవిద్యాలయములో - అధ్యాప కుకుగా ఉండేవాడు హాస్టలులో ఒక పఠనాలయ ము, చదువుకొనే గదులు, పెద్ద భోజనచావడి, 1500 మంది కూర్చొనడానికి చాలిన పెద్దహాలు ఉన్నవి. ఈ హాలులో నాటకములు ఆడుతారు,

119