Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 10

వికీసోర్స్ నుండి

కోవడమునకున్ను , నిరాడంబర జీవనము చేయడ మునకున్ను అలవాటు పడు తారు.

అధ్యాయము 10

.

జర్మనీలోని పబ్లికువసతి పాఠశాలలు

.

( లాండ్ షుల్ హేమ్ landschulheim. )

కిందటి శతాబ్దము అంతమున డాక్టరు లీట్సు అనే ఆయన ఇంగ్లాండులోని విద్యా పద్ధతి మీద ఉత్సాహముచూపి “లాండ్ షుల్ హేమ్” అనే పేరుగల మూడు వసతి బడులను స్తాపించినాడు. వాటిలో ఒక టి చిన్న పిల్లలకున్న, రెండోది ఈడు వచ్చిన పిల్లలకున్ను, మూడోది మధ్య వయస్సు పిల్లలకున్ను, ఉద్దేశింపబడ్డవి. చిన్న పిల్లల వసతి బడి ఇంగ్లాండు లోని వసతి ప్రారంభ పాఠ శాలల కున్ను, తక్కిన రెంనున్ను ఇంగ్లీషు పబ్లికు పాఠశా లలలోని రెండు భాగములకున్న సరిపోతవి. వీటిలో క్లాసు చదువు తక్కువగాను, ఆటలు, వ్యాయా ఎక్కువగాను ఉంటవి. ఈ బడులలో

71

పనిచేసిన కొందరు ఉసాధ్యాయులు పాఠముల

మీద ఎక్కువశ్రద్ధ చూపవలసినదని అభిప్రాయ పడి, తమ స్వంత వసతిబడులను ఏర్పాటు చేసు కొన్నారు. ఈ పబ్లికుబుడులవల్లనే ఇంగ్లీషు వారు ఎక్కువ రాజనీతిజ్ఞులయినారనిన్ని, అవి లేకపోవడ ము చేత జర్మనులలో రాజనీతి మందగించినద నిన్ని జర్మను లనుకొని, ఈ పాఠశాలలను ఎక్కువ ప్రో త్సాహషర చడ మారంభించినారు. ప్రస్తుతము జర్మనీ లో విధ్నాలుగు పబ్లికు వసతిబడులున్నవి. ఇవన్నీ ప్రయివేటు బడులే. కొన్ని టికి మాత్రము ప్రభుత్వములవారు నామకా గ్రాంటు లిస్తున్నారు. పిల్లలు చెల్లించే జీతములమీద నే ముఖ్యముగా ఈ బడులు నడుస్తున్నవి. ఈబకులలో ఒకటి ఈ క్రింద వర్ణింపబడినది.

ఈబడికి అధికారవర్గమువారు పెద్ద పట్టణా లలో ఉండే ఆరుగుకు ధనవంతులనుంచి ఎంచుకొం టారు. వీరు సాధారణముగా సంవత్సరమున కొక సౌరి కలిసి, బడి నడుపవలసిన పద్ధతి, బడికి కావలసిన కొత్తగృహములను నిర్మించడము, కొత్త బోధన

72

విషయములను బడులలో చేర్చడము, మొదలయిన

వాటిని గురించి ఆలోచిస్తారు. ప్రధానోపాధ్యా యుడున్ను , ఖాయము ఉపాధ్యాయులలో ఎక్కువ అనుభవము గలవారున్ను , బడి నిత్య వ్వవహారా లను చూచుకొంటారు. ప్రధానోపాధ్యాయులను చిన్న చిన్న ఖాళీలు పడినప్పుడు ఉపాధ్యాయులను తానే నియమించవచ్చును గాని, ఉపాధ్యాయు లలో ఎవరినైనా ఖాయము చేయడానికి, సీనియరు ఉపాధ్యాయుల సమ్మతి కానలసిఉంటుంది, ఇంగ్లీషు పబ్లికు బడులలోవలె ఈబడి ప్రధానోపాధ్యాయుని కి సర్వస్వాతంత్ర్యము లేదు. ఇతనికి అధికార వర్గము వారు చిన్న చిన్న విషయాలలో తొందరలు కలిగించరు.

ఈబడిలో 190 మంది విద్యార్థు లున్నారు, వారు నాలుగు వాయిదాలలో సంవత్సరమునకు 10 పౌనులనుండి 120 పౌనుల వరకు జీతములు చెల్లిస్తారు. క్లాసు లనుబట్టి జీతములుకూడు ఎకువ అవుతవి. కొంతమంది బీద బాలురను తక్కువ జీతాలమీదకూడా చేర్చుకొంటారు. ఈ బడికి

73

గమనింప దగినది.

సంవత్సరము రాబడి 19000 పౌనులు. ఈ మొత్త ము ఖర్చులకు సరిపోతుంది. భోజనము ఖర్చంత, చదువుజీతమింత, నాలుగు కాలాలుండే వస్తువుల మీద ఖర్చింత, నిత్యమున్ను అయ్యే ఖర్చింత, ఆ నే విభేదములు చేయరు. కొత్త ఇళ్ళు కట్టించడా ని కిన్ని, ఇటువంటి ఇతర పెద్దఖర్చులకున్ను, బాలురు చెల్లిం చే సొమ్మ చాలదు.

ఈ బడిలో మగపిల్లలు, ఆ పిల్లలు కలిసి వసతిగృహాలలో ఉండము ఇంగ్లాండులోని క్వేకరు ( quaker Schools) బడుల ననుసరించి ఈ విధానము నేర్పాటు చేసినారు. మగపిల్లల గదులనుంచి, ఆ పిల్లలగదులను వేరు చేయవచ్చును. ఇట్లు ఆడపిల్ల లున్ను మగపిల్ల లున్ను కలిసి ఉండడమువల్ల ఎట్టిదోషములున్ను కలుగ లేదు. కాని ఈ పద్ధతి ఎంతో కాలము అమ లులో లేకపోవడము చేత, ఈ పద్ధతి ఎంతవరకు సాగ గలదో ఇంకా చెప్పడానికి వీలు లేదు.బాలబాలిక లిద్దరుస్ను ఈవసతిగృహములో 19 ఏళ్ళు వయస్సు వరకు ఉండి అబిట్యురియంట్ పరీక్షకు పోతారు.


74

తక్కిన ఉన్నత పాఠశాలలలోవలె ఈ పరీక్షను "క్లాసు ఉధ్యాయులే చేస్తారు. ఆమండలము ఇన్స్పెక్టరుకూడా ఉ పాధ్యాయులతో కలిసి ఈ పరీ క్షను జరిపిస్తారు. ఇన్ స్పెక్టరు గవర్నమెంటు బడుల మీదకంటే, ఈ ప్రయి వేటు బడులమీద ఎక్కువ శృద్ధ తీసుకొంటాడు. ఆడపిల్లలు మగ పిల్లల పాఠ ములనే చదివి, వారి పరీక్ష లోనే కృతార్థురాండ్రు కావలెను. చేతిపనులలో మాత్రము కొంచెము భేదమున్నది. మగపి ల్లలు వడ్రంగము, కమ్మరము, యంత్రర్మాణము నేర్చుకొంటారు. ఆడపిలలు కుట్టుపని, వంట, గృహ నిర్వాహక త్వము నేర్చుకొంటారు,

పిల్లలకు ఏవిధమయిన దండనమున్ను చేయరు. జర్మనీ దేశములో పిల్లలకు దేహదండనము నీ షేధింప బడినది. జర్మను పిల్లలు బడుల కట్టు బాట్లను ఎన్నడున్ను మీరరట, ఈ బడులలో అట్టి 'రూల్సు' లేకపోవడమే వాటిని అతిక్రమించక పోనడానికి కారణమై ఉంటుంది. ఇతర బడులలో ఉండే 'ఇట్లు చేయవలెను', 'ఇట్లు చేయకూడదు'

75


అనే ఆజ్నలు ఈబడిలో లేవు. మొత్తముమీద జర్మనుజాతివారు మంచి శిక్షణములో ఉండడానికి అలవాటుపడి, తమ తమ పనులను సైనికులవలె 'తు,చ' తప్పకుండా చేసుకొంటారు.ఈ బడిలో ఇంటి వద్ద (proctor) గాని, తరగతి పెద్దలు (Monitors) గాని లేరు. పిల్ల లందరున్ను తమ యిష్టము వచ్చినపని చేసుకోవచ్చును. పిల్లలు పొగాకుచుట్టు , సిగరెట్లు కాల్చకూడదు; సారాయములను సేవించకూడదు. పిల్లలెదురు గా ఉపాధ్యాయులుకూడ సిగ రెట్లను, చుట్టలను త్రాగకూడదు.


ఇంగ్లీషు పబ్లికుబడులలో కొంతమంది ఉపాధ్యాయులను గృహోపాధ్యాయులనుగా నియ మిస్తారు. ఉపాధ్యాయులలో అనేకులకు ఉండు టకు ఇండ్లను ఇవ్వనైనా ఇస్తారు; లేకపోతే వారే ఇండ్లను అద్దెకు తీసుకోవ లెను. కాని, అందరు ఉపాధ్యాయులున్ను పిల్లల వ్యాయామక్రీడలలోను, వారి విందులలోను పాల్గొనవలెను. జర్మనీలో ప్రతి ఉపాధ్యాయుళున్ను ఒకొక్క పిల్లల వసతి

76

గృహమునకు యజమానుడుగా ఉంటాడు. అతడు

పెండ్లి చేసుకొని ఉంటే, అతని భార్య గృహయజ మానురా లవుతుంది. ఉపాధ్యాయుల నామకాగా కొంతసొమ్ము చెల్లించిగాని, ఉచితము గా గాని, తలిదండ్రులతో వసతి గృహములలోనే ఉంటారు. ఇంగ్లీషు పబ్లికుబడులలో ఉండే గృహపద్ధతి జర్మనీలో లేదు. ఇంగ్లాండులో ఈగృహ పద్దతి సర్వజనాదరణ పాత్రమై, వేళ్ళు నాటుకొని ఉన్న ది. పగటిబడులలోని పిల్లలుకూడా కొన్ని గృహము లలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తారు. ఈజర్మను బడిలో పదేసిమంది పిల్లలకు ఒకొక్క గృహములో ఉండేటట్లు ఏర్పాటుగా ఉన్నది. ఒకే గృహములో ఆడపిల్ల లను మగపిల్లలను కలిపిఉంచరు. గృహానికి ఉపాధ్యాయుకు యజమానుడు; అనికి భార్య ఉంటే ఆమె యజమానురాలు. వారి పోషణము క్రింద పదిమంది మగపిల్లలుగాని, పదిమంది ఆడ పిల్లలుగాని ఉంటారు. వీరందరున్ను ఒక్క టేబిలు దగ్గర కూర్చుండి భోజనము చేస్తారు. అందరున్ను

77

కలిసి విహారాలకుపో తారు, ఒకొక్క కుటుంబము

వారుకలిసి కూర్చుండడానికి ఒక చావడి ఉంటుంది. ఇక్కడ పిల్లలు అంతర్గృహకీడలు ఆడుకొంటారు. సాధారణముగా "పింగ్ పొంగ్" (Ping pong) అనే టేబిలు టెన్నిసూ అట ఆడుకొంటారు. ఇక్క డనే బడి పాఠాలు చదువుకొంటారు. పెద్దపిల్లలు కూర్చొనడానికి మరిఒక గది ఉంటుంది.

వ్యాయాము క్రీడల విషయములో బడిలోని పిల్లలందరున్ను కలిసి, వేరు వేరు "జట్టు"లుగావిడబడతారు. వీ రన్ని ఆటలున్ను ఆడ తారుగాని క్రికెట్టుఆట ఆడరు. ఈ ఆట చాలా మెల్లగా న డ స్తుందనిన్ని, వృదాకాలహరణ మవుతుందనిన్ని జర్మనుల అభిప్రాయము. సాధారణ పాఠశాలలలో కంటే ఈబడి లోని పిల్లలు ఎక్కువగా విహారాలకు పోతూ ఉంటారు.విడబడతారు. సాధారణముగా పిల్లలు సంవత్సరానికి రెండువారాలు విహారాలమీద ఉంటారు. ఎండకాలములో 3 రోజులు, ఆకురాల్పు కాలములో 3 రోజులు, చలి కాలములో 3 రోజులు విహారదినములు. ఇందు

78


లోని పిల్లలు ధనవంతుల కుటుబములోనుంచి వస్తారుగనుక, చాలాదూరవిహారాలు చేయడమే కాకుండా, పర దేశాలకు కూడా పోతూ ఉంటారు.

బడిలోని పిల్లలందరున్ను, ఒక టేచావడిలో భోజనము చేస్తారు. ఒకొక్క టేబిలువద్ద ఒకొక్క గృహము ల్లలు కూర్చుంటారు.ఈ టేబిలువద్ద ఒక ప్రక్క యజమాను మున్ను, అతని కెదురుగా యజమానురాలున్ను కూర్చుంటారు. వంటగదిలో విద్యుచ్ఛక్తితో పని చేసె ఉపకరణము లుంటవి. రొట్టెలను ఒకటే దళసరిగా ముక్కలు కోస్తారు. కూరగాయలను యంత్రాలతో తరుగు తారు. రొట్టెకు పిండి విద్యుచ్ఛ క్తి యంత్రాలతో విసురుతారు. ఈ ఉపకరణాలన్నీ కొంచెము వెలలకు చిక్కు తవి.ఈ బడిలోని పిల్లలు భోజన విషయమై ఏమాత్రమున్న అసంతృప్తి పొందరు. దీనిలోని రహస్య మేమిటంటే, ఉపా ధ్యాయులు, వారి భార్యలు, పిల్లలు, బడిపిల్లలు, తుదకు ప్రధానోపాధ్యాయుడు కూడా ఒక టే టేబి లు మీద, ఒక్క మోస్తరు భోజనమే చేస్తారు.

79


ఉపాధ్యాయులు ప్రత్యేకముగా వంట చేసుకో కూడదు. మద్యాహ్న భోజనమయిన తరువాత విద్యార్థులందరున్ను ఇంటి ముందర అంగణములో కూడుతారు. వర్షముగా ఉంటే, హాలలోనే కూడు తారు. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు. చిన్న ఉపన్యాస మిస్తాడు. అతని తరువాత ఒకరిద్ద రుపాధ్యా యులున్ను కొంత మంది విద్యార్థులున్ను మాట్లాడుతారు. ఆ దినమునకు కార్యక్రమమును అక్కడనే అందరికిన్ని తెలుపు తారు. విద్యా ర్థులు తమలో తామెంచుకొన్న అయిదుగురు స్వ దేశ, విదేశ, వార్తా పత్రికలు చదివి, వాటిలోని భోగట్టాను సంగ్రహముగా అందరికిన్ని తెలుపు తారు. పక్షమున కొక సారి, ఒక విద్యార్థి దేశమునకు సంబంధించిన ఏదయినా ఒక విషయమును గురించి వ్యాసమువాసి చదువు తాడు. ఆ విషయమును గురించి విదేశీయ వార్తా పత్రికల అభిప్రాయము కూడా తెలుపు తాడు. ఈవ్యాసము వ్రాయడానికి ఉపాధ్యాయలు సహాయము చేయవలెను. విద్యార్థులకు పఠనాలయమున్ను



80

గ్రంథాలయమున్ను , ఒక ఉపాధ్యాయుని వశమ లో ఉంటుంది. ఈ బడిలో చర్చాసంఘము లేదు.

విద్యా పద్ధతులున్ను, విద్వోపకరణములు న్ను, మిక్కిలి నవీనమార్గము ననుసరించి ఉన్న వి. విద్యార్థులకు కావలసినన్ని మంచి పుస్తకము లున్నవి. ప్రతి ఉపాధ్యాయునికిన్ని , 200 నుంచి 500 పుస్తకాలవరకు స్వంతముగా ఉంటవి. పాఠాలు చెప్పే గదులన్నీ వేరు వేరుగా ఎడ మెడ ముగా ఉన్నవి. అన్నీ ఒక్కటే భవనములో లేవు. ఈబడిలో అనుభనవిద్య మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ప్రతివిద్యార్థిన్ని మధ్యాహ్నము రెండు గంటలకాలము ఏదోఒక చేతి పని చేయవ్లెను. పిల్ల లువడ్రంగము, కమ్మరము కాక తోటపని, పొలముపని కూడా చేస్తారు. బడిలోని బెంచీలు, కుర్చీలు, మొదలయిన సామానులను పిల్లలే చేస్తారు. వాటికి చిన్న చిన్న మరమ్మతులు కూడా వారే చేస్తారు. శాస్త్రమును బోధించే గదులు పరిశోధనాగారములుగా కూడా ఉపయో గించేటట్లు కట్టుతారు.

81

జర్మనీలో ఈవసతిబడులు ప్రారంభము లో ఉన్నవి. కాని, జర్మనులు ఇటువంటిబడు లింకా ఎక్కువగా కావ లెనంటున్నారు. ఇంగ్లీషు పబ్లికు , స్కూళ్ళలో తమ వసతిగృహము, తమబడి, అనే అభిమానము ఎక్కువగా ఉంటుంది. ఈ అభి మాసము జర్మనీలో ఇంకా స్థిర పడ లేదు,

అధ్యాయము 11

విశ్వవిద్యాలయము లం, వృత్తికళాశాలలు.

(హాక్ షూలె Hoch Schule.)

ఉన్నతపాఠశాలలోని అంత్య పరీక్ష అయిన “ఆబిట్యు రియెంటెస్" పరీక్ష ప్యాసయిన వారినే చేర్చుకొనే కళాశాలలను ఈ క్రిందిరీతిగా విభజించ వచ్చును. (1) విశ్వవిద్యాలయములు: వీటిలో కళ లు, శాస్త్రములు, వైద్యము, స్మృతులు (Iaw), మతము నేర్పుతారు. కొన్నిటిలో వ్యవసాయము కూడా ఉంటుంది.

82