చెన్నపురీ విలాసము/పూర్వపద్ధతి

వికీసోర్స్ నుండి
శ్రీరస్తు

శ్రీవేణుగోపాలస్సహాయః

ద్వితీయంబగు పూర్వపద్ధతి ప్రారంభము.

అందు సముద్రప్రకరణము ప్రథమము


క. పరిపూర్ణ ధాన్యధనభా
   స్వరతరగూడూరురాజ్య సామ్రాజ్యవిక
   స్వరవివిధ విభవజిత కి
   న్నరపతివాఃపతి మహేంద్ర నాగనరేంద్రా.1

వ. అవధరింపుము.2

ఉ. ఆపుటభేదనంబునకు నారయదూర్పున దీవ్రవాత వి
   క్షేపవిఘూర్ణితోర్మిచయజృంభిత భూరిగభీరఘోషణా
   టోపముతో బయోధినెగడుం దదశేషపురాధిరాజతా
   ధ్యౌపయికానిశధ్వనదయత్న భవాద్భుతదుందుభిస్థితిన్.3

ఉ. భ్రాంతివహించునొక్కపుడుఁబాయఁడు చెంతవిసించునానదీ
   కాంతుఁడు జాలిమైకొనఁగ గామిక్రియన్నగరీమతల్లీమే
   ల్గాంతికిఁజిక్కి చూపునధికంబుగ నూర్మిభుజాముఖోచ్ఛల
   ద్దంతురశీకరస్తబకదంభసముజ్జ్వల మౌక్తికాంజలుల్‌.4

ఉ. తుంగతగెల్వనింగికెగఁదొట్టిసముద్ధతిఁబొంగుసాగరా
   భంగతరగ భంగికలు ప్రాంతగ సౌధపదాంతఘట్టన౯
   భంగమునొంది లజ్జపడుభంగివిళీననములై జనున్సదా
   భంగుర వృత్తులౌజడులు వాంఛితలాభముల౯ భజింతురే..5

ఉ. శ్రీ మెఱయంగనంకమునఁ జెల్వగుతద్వరదుర్గలక్ష్మీన
   క్షామవిసర్పితాంబు పరిఘాభుజమందలిఁజేర్చి పుత్రికా

  
   ప్రేమఁదనర్చు నంబునిధివేమఱు విద్రుమశంఖశుక్తి ము
   క్తామణిమాలి కాళిమపకంఠమదిప్రమలంకరించుచు౯. ...6


తీరహర్మ్యపకరణము-ద్వితీయము

 
క. పారావారంఒవ్వలి
   తీరమగను వేడ్కనిక్కితివిరినమాడ్కి౯
   దీరస్థితసౌధములరు
   దారంగననగు సమున్నతాగ్రములగుచు౯...1

 గీ. తీరసౌధధ్వజాగ్రసందీప్తమైన
    గుండొకటిప్రొద్దుతోడనెక్కు మఱివ్రాలు
    వనధిరాజునకెదురఁదత్పట్టణేంద్ర
    జాలికుఁడుపూంచునొకయుంద్రజాలమనఁగ....2


నౌకాప్రకరణము తృతీయము


శా. వీరస్థోన్నతసౌధరాజికెదుర౯దోండ్రించుచుంవార్ధిలో
    బారుల్దీఱిచియున్న భూరితరుణి వ్రాతంబుచూడంగఁజె
    ల్చారుందత్పురిబ్ధిరాజపురిహర్మ్యవ్యూహసన్నద్ధమై
    పోరందార్కొనిమోహరించిన విధంబుల్తేట తెల్లంబుగన్.... 1

శా. ద్వత్రస్తంభవిచిత్రతంబులు మహావిస్తారదీఘ౯ంబులై
    నేత్రానందమొనర్చునావలుదధిన్వేవేఁగబర్వుంజగ
    చ్చిత్రంబుంగను వేడ్కలేచియసకృద్విస్రంభసంచారియౌ
    వృత్రారాతికిలోఁగిదాఁగిన మహోర్వీభృత్తతింబోలుచున్‌....2

 గీ. సరుకునింపను దింపనుసారుసారెఁ
    దరులయొద్దకు దరియొద్దకరుగుపడవ

      
   లోడలకుమేడలకు మైత్రినొనరఁగూర్ప
   నిటునటు చరించుచారుల నెనసివెలయు..3

క. సంఘములై పొగయోడలు
   జంఘాలతఁబఱచునెపుడు జలనిధివీచీ
   సంఘాతవిహృతి లీలా
   లంఘనకృత్తిమి తిమింగలంబుల పగిదిన్‌....4


సేతుప్రకరణము చతుధ౯ము


శా. ఓతప్రోతనిభాతితాయ సమయ ప్రోద్దండదండోపరి
   స్యూతస్ఫీతవిశాలదారుఫల కాస్తోమంబులన్వారిలో
   బోతవ్రాతముదాకఁ గట్టినట్టినదిటంపున్సేతువొప్పారుఁబ్రా
   గ్భూత శ్రీరఘురామ సేతురచనాస్ఫూర్తిందలంపించుచు౯...1


నౌకాదీపస్తంభప్రకరణము పష్ఠము


మ.పురదుగ౯ంబుల మధ్యభాగమున నంభోరాశితీరంబునన్‌
   బరపైయొప్పు శిలావితర్థిపయినుద్భాసించునెల్లప్డుసా
   గరధావత్తరికోటికిన్ని శలమాగ౯ంబుంబ్రదర్శింప భా
   స్వరదీపం బిడుగచ్చుఁగంబ మొకడాశ్చర్యాతిఘా౯కృతి౯.1

చ.ప్రమదమొనర్చురాత్రులశిరస్ద్ఝ్సితదర్పణపేటికాంతర
  భ్రమదతిచిత్రదీపనికర స్ఫురణంబలగచ్చుగంబమ

        
   భ్రమయుడు రాజిఁగాంచుతఱి బ్రాతిగనాతతిఁబట్టుభూరివి
   భ్రమనగరేందిరోన్నమిత బాహుమృణాళమునాఁగనుంగొన౯...


మ.తనరుంగన్గొనందత్సమున్నతపృధుస్తంభాంతరళంబున౯
   జనులెక్కన్ఘటియించు నూర్ధ్వవిలసత్సౌపానసంతానమా
   ఘనథీభాసితులింగిలీషులు సమగ్రప్రౌఢిసాధింపఁజ
   య్యవనయ్యింన్ద్రపురంబుదార్కొనంగృతంభౌగూఢమాగ౯ంబన౯

సభాప్రకరణము సప్తమము

 
చ. ప్రతతరనౌషధీయుతముద్రావక పూరిత కాచపాత్రికా
   న్వితమువిచిత్ర యంత్రపరివీతముగంధకలోహరజ్జుసం
   యుతమునుదద్ఞ సేవితము నైతగియౌషధసిద్ధతాపనా
   యతనముఁబ్రోలుతాంత్రిక సభాయతనంబు పురంబుతూర్పున౯

మ.పెసుపొందున్న గరంబుతూర్పునను సూప్రీమ్‌కోర్టునాజిఁన్నికో
   ర్టునుసీకష్టమునాఁగమిస్సరియు నారూపింప నాఫీసులీ
   జనలోకంబున సర్వధర్మములు సంస్థాపింపనేతేంచిని
   ల్పినపాకారియమాంబునాథ ధనరాళ్లీలాసభావైఖరి౯.....2

మ.బుధసేవ్యంబులు హేతిభృత్పరిగతంబుల్ధర్మరాడ్డండస
   త్ర్పథముల్పుణ్యజనాశ్రయంబులు ప్రచేతస్థ్సానముల్సాశుగా
   భ్యధికోద్యోగములర్ధపప్రియములుగ్రాక్రీడముల్గాన న
   ధి౯ధరన్నించు దిగీశసంసదుపమాస్తిందత్ససస్పద్మముల్‌....3

మాలినీ.శుభగుణమణిపేటి సూరిమందారవాటీ
యిభహయఘనధాటీ యింద్రవహాభఘోటీ












      
   స్వభుజబలకీరీటి శత్రుభిత్ఖడ్గకోటి
   ప్రభుజనపరిపాటీ భవ్యకేత్వగ్రశాటీ...4

గద్యము-ఇదిశ్రీమన్మాల్య శైలనృసింహప్రసాదసమాసాదితనకల

శాస్త్రసంవిదుప స్కృతాంధ్రసాహితీ పురస్కృత సరస

సారస్వత చతురవాగ్ధోరణి మతుకుమల్లి కులమతల్లి కాబ్జవల్లికా

వియన్మణి కాద్రిశాస్త్రిబుధ గ్రామణి తనూ భవాగ్రణి

నృసింహవిద్వన్మణి ప్రణీతంబయిన చెన్నపురీ

విలాసంబను ప్రబంధంబునందు ద్వితీయంబ

గు పూర్వపద్ధతి సంపూర్ణము.

5