చెన్నపురీ విలాసము/దక్షిణపద్ధతి

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

తృతీయంబగు దక్షిణపద్ధతి ప్రారంభము.

అందు దుగ౬ప్రకరణము. ప్రథమము.

 
     
క.శ్రీతోట్లవల్లురీనగ
  రాతతకంఠీరవావాధీశ్వరవి
  ఖ్యాతయశోజితశరనా
  నాతారతుషారచంద్ర నాగనరేంద్రా.1
వ.అవధరింపుము.2
చ.తగునలపట్టణంబునకుఁ దక్షిణభాగమునందసాధ్యమై
  నెగడెడు సీమఁగోటక్రమ నిమ్నముగా వసుధాతలాంతరో

      
  పగమయి సంభ్రమద్దృఢకవాటపటిష్ఠతరాట్టకూటయం
  త్రగణశతఘ్నికాభినిహితధ్వజనీబహుగుల్మగుప్తమై....3

మ. పరిఘౌఘత్రితయత్రివప్రయుతమై భాసిల్లులోకోటలో
    బరఁగున్ గౌర్నరుమెంటు త్రేజరుదలంపన్మిల్టెరీరచ్చచె
    చ్చెరఁగౌంటాంటునులోనుగాఁగల సభల్చెల్వారంగుల్గనన్....4
    క్కుడుసొజర్లవిబరకీసులుఫరంగుల్బల్పిరంగుల్గనన్.

గీ.బుడతకీసులు సోజరుల్పొదలుచుండ
  బారకీసులగదులు పెంపారునందు
  శరభశార్దూలహర్యక్షసంఘనిబిడ
  మందరాచలకకందరబృందమనఁగ...5

చ. వినిత పరార్థ్యవేషులగు వేలకొలంది దొరల్సమున్నతా
   సనములనిల్వ నీలపటసంవృతిమత్ఫలల కాళిముందు నూ
   ల్కొనలిఖియించు రైటరులు గొల్వగ గౌర్నరుగొల్వుసేయనా
   ఘనసభ సొంపుగానవలెఁ గాని వచింపవశంబెయరికి౯...6

గీ. సరభసవిసర్పిరాజహంసప్రచార
   రాజితంబగు క్రౌంచరంధ్రంబనంగ
   సంతత శ్వేతకాయసంచారమైన
   ద్వారలక్షాగుహాపరంపరదనర్చు.

చ.అలమోర్మేనురసంగిబొంబయియుభర్మాసీమపైగోవం
  గళకోరంగియునాదిగాఁగలుగుప్రఖ్యాతంపుకొస్తాలనా
  వలరాకల్నగరీజనంబులకురేవ౯ దెల్పురంజిల్లును
  జ్జ్వలసీకష్టనివిష్టకేతనపటు స్తంభాగ్రచేలచ్ఛటల్...8

సేనా ప్రకరణము-ద్వితీయము

      
సీ. రణభరంబు కరంబు రహిభరించినడంబు
              బొమిడికంబులు శిరంబులజెలంగ
   రోషంపుననలంపు రుచిముంపనఁనఁగ గెంపు
              కంకటంపు బిగింపుగరిమనింప
   నరిహింసలిరిరంసనల మెనన్నప్రశంన
             జల్లడాలసితమాంసలతనెసఁగ
   భుజదండతరుషందముల మదాంకురతండ
            మనఁదుపాకులకండ ఘనతనుండ

గీ. శ్రేణులైయాజిపరచితి సేయుచున్న
   మిల్టెరీలపటాళములెల్మఁగునందు
   మూతి౯మతంబులగు మదమోహాలోభ
   గాఢకోపాద్భుత వ్యతికరములనఁగ....1

శతఘ్నికాప్రకరణము-తృతీయము


ఉ. దాపగువారిధిన్వెడలితారుదులోపలఁజేరఁజూచియూ
   రోపులుకారఁబెట్టుపొగరున్మకరప్రకరంబులట్టగం
   డోపలమండలోల్బణమహుార్విధరంబులమాడ్కి వేద్కకుం
   బ్రాపయియొప్పు నెప్పుడుపిరంగులబారులుగుండ్లప్రోవులు౯..1

ఉ. యామశతగ్నిరేయుబగలాబలుకోటవినిశ్చితంబులౌ
   యామములన్గభీరముగనబ్ధిఁబ్రతిధ్వనులు ద్భవిల్లను
   ద్దామతఘంటికాసహకృతంబయి ఘర్ఘరఘోషమిాననా
   యామికులంబురప్రజలునారసిప్రొద్దుఁజరిఁతురెంతయు౯..2

      
శా. దూరద్వీపవణిక్ప్రనతి౯బృహత్పోతాగమంబున్మహో
   దారుల్గౌర్నరులాదిగాదొరలప్రస్థానంబులన్యుద్ధవి
   స్తారాశ్చర్యములన్విచిత్రజయవాతు౯ల్దెల్పునెల్లప్డుత
   న్నీరంధాభ్రఘనధ్వనద్బహుశతఘ్నీఘోరనిఘో౯షముల్‌.3

మేడిసు ప్రకరణము-చతుర్థము

 
మ.విపులం బైతగుకోటలోపలశిలావేదిన్‌ జతుస్తంభమం
   టపమందాసులు తానుఁడోడితనబిడ్డన్‌దెచ్చియొప్పించుట
   ల్గృపఁ జేకొంటయుఁగన్పడన్నిలుపుమేడీనున్‌గనన్‌దోఁచుతీం
   డ్రపుశ్రీరంగసమాఖ్యపట్టణరణారంభంబులీనాటికిన్.1


మండోలు ప్రకరణము.పంచమము

మ.అతిపీనాంగుఁడతిప్రమాణ తురగాధ్యారూఢుఁడర్హాజినా
   వృతుఁడంఘ్రిస్పృగవాజ్ముఖాసిధరుఁడై బెంపొందుమండ్రోలునా
   కృతిఁజూడందగియొప్పునప్పురికవాగ్దిగ్భూమి నుచ్చైఃప్రక
   ల్పిత విస్తారవితర్ది మిాఁదఁదిరువల్లిక్కేణిపెన్రోడ్డునన్‌.1


మ. రవిరథ్యంబులఁబోరఁజూచుక్రియదర్ప శ్రీవిజృంభించుమే
    ల్జవనంబైన హయంబునెక్కి నుఖిలాశాభర్తలన్గెల్వఁగా
    దివికిన్‌బోవఁగ దట్టివాజీనెగయన్‌ దీకొల్పుచున్నట్టుగా
   నవుమండ్రోలుగనంగ నిప్పటికిబశ్యద్విస్మయాపాదియై.2

ధర్మాస్థాన ప్రకరణము.షష్ఠము

మ.గ్రసదాశేశ్వరసంనదుద్యమము లింకంటాక్ససిసెంటుటా
   క్సుసదర్కోర్టును హేడ్డుపోలిసును నాసొంపారునాఫీసులిం
   పెనగున్‌దత్పురి దక్షిణంపు దెసలో కైకార్హధర్మంబుమే
   లొసగన్‌ జాతిదొరల్‌మటింపదగిబాహ్వూద్యానభాగంబుల౯

దక్షిణశాఖానగర ప్రకరణము-సప్తమము

వ.వెండియు నాదండధర దిజ్మండలంబున నఖండవైభవోద్దండఁబులై మెండుకొని దండిమెరసి సౌధమండలామ మిాయమాన తత్రత్యజనవిచిత్ర విభవ పరిపాకయగు చేపాయు విపులతర విపణివీధీమతల్లి శ్రేణి యగు తిరువల్లి క్కేణియు.... రోద్యానతరువాటయగురాయపేటయుఁబటుతమ ప్రభాపహసితాలకాపురంబగు మైలాపురంబును నిబిరీసనారి కేవిటపిఝూటంబగు కృష్ణాంపేటయు హర్మూకూట తిరస్కృతాద్రికూటయగు చింత్రాద్రిపేటయు హూణే శ్వర సౌధసందోహ భాస్వరంబై పేటలకునెల్ల హేడ్డగు మౌండోడ్డునను శాఖానగర ప్రకాండంబులు సదృశ్యమండన శోభాఖండాభిరామంబులై యప్పట్టణంబునకుఁ బాయని తోడునీడల వడువున నెగడుచుం గన్నులపండువు సేయు చుండు నందుఁ దిరువల్లిక్కేణి యందు మున్నమందరణ భరాస్పంద రభసంబున సంక్రంననందన స్యంద నం బాందోళికపింఛదామ సుందరంబుగా నతిరయంబునంఒఱపుట వలనం బొడమిన బెడిదంపుబడలిక లుడుపు కొనంగడంగి పార్థసారథియన న్నెగడి యర్చావిభవంబున విశ్రమించిఅ యా విశ్వగర్భుని యత్యున్నత పురుష ప్రమాణంబగు దివ్యమంగళ విగ్రహంబు రుచితర రాజమాన విమానగోపుర ప్రాకార బహుస్తంభ మంట పానీక పతాకికా పుష్కరణీ విలాసంబులును గనుంగునుట బహుజన్మకృతసుకృత పరిపాకంబునంగాక యూరక యేలచేకూఱుమఱియును.1

పార్థసారథి ప్రకరణము-అష్టమము

 

సీ. అభ్రంలిహాకార విభ్రమస్వీకార
            శుభ్రభప్రాకార సుభగరుచులు

మహిత శిలాస్తంభ మాలికావష్టంభ మంటపౌఘాదంభ మంజిమములు వదగ్రల సమాన కనకాచల సమాస కలితోజ్జ్వల విమాన క్రమగతులు మిార్దాంత గోపురాంతర్ధానగోపురస్స్పర్ధాళు గోపుర ప్రాభవములు. రమ్య భాస్వర కార్తస్వర ధ్వజాభిజాభి విలసిత వికస్వర ప్రభావిలసనములుల పరిష్కార రణిపుష్కరణి వణిపార్థ సారధి హరికందుబ్రధిమజెందు.

  
చ.ప్రధితప్రోన్నత పార్థసారధిగృహాగ్రస్థాయి హైమధ్వజ
  గ్రధితాలంబిత ఘంటికాస్తబక సంఘంబుల్‌ ముహుర్మందవా
  తధుతిన్‌ఘల్లురనంగ నిష్కుటతరూదంచత్ఫలాస్వాదనా
  విదురంబౌశుక రాజిసారె కెగయన్విన్వీధికి౯ ఘొల్లున౯...2

వ.మఱియు నిజభక్తిభావ భారభరిత భాగవత సార్ధసాత్కృత పురుషార్థ సేవధియగు పార్ధ సారథి మధుమధను నకుం బ్రత్యబ్దం వైశాఖ మాసంబున శుద్ధపక్షంబున సమారబ్ధంబగు సంవత్సరోత్సవారంభ సంభ్రమంబున ధర్మ కర్తలు భర్మరస పరివర్మిత దర్పణాభిరామంబులు సుత్తంభిత సఫలస్తబకరం భావష్టంభ సురుచిర స్తంభ మాలికా గంభిరంబులు దుగ్ధసింధు ఫేన ధవళ తరళ వితాన విలంబమాన లాచమయ చిత్రదీప యంత్రమాలికాలం కృతం బులు వికర సురభిళ వివిధ కుసుమ దామమంజులంబులు నవిరళనారికేళ దళక టైఘటనాపటు తరంబులు నుత్తుంగ తరతోరణా కీర్ణంబులు నై దివ్య విమానంబులననుకరించు కాయమానంబులు తదీయ దేవాలయపు లోభాగం.....వీధులనందు నందునుం బొందుబఱచి తన్మందిరాళిందంబు మొదలుగ రధ్యాపథంబు సురభిసలిల సిక్తసంర్ష్టంబుగావించి ప్రతి గృహంబునభినవమంగళాకారశోభనంబులుగా నొప్పునప్పురంబుననప్పరమేశ్వరు నేగింపమునుకొనినానావిధమ ణికందళ ప్రభాసందోహ సుందరంబై రోహణ వసుంధరాధరంబ చందంబుననందం బొందు దివ్యస్యందనంబు పైఁ గృతాధిరోహణు జేసి యుగపదాపుంఖితపుంఖాను పుంఖశంఖ్హకాహళ పటహడమరుడిండి మనిస్సాణ నిస్సరన్ని స్వానంబులకు నదరు గదుర బెదురగొమరతిమురుబ్రాయంబు తెరగంటి తెఱవలురువడినొనరించు స్వయం గ్రహ పరీరంభ గుంభనంబుల కలరి సురుగ రుడకిన్నరోరగ గంధ్వర్వ సిద్ధసాధ్యవిద్యాధర కింపురుష ప్రముఖ నిఖిల లేఖ ప్రకరంబులు బహూకార పూర్వకంబుగఁ బలుమాఱు బలుదెఱుంగులం జేయు జయజయ శబ్దంబులకు నను ప్రాసంబులగు వందిమాగధ సందోహసుందరామందస్తవసారంబులు పరిఢవిల్ల వేడుక౯ దోడుకొను ప్రోడలగ ద్రావిడ వైష్ణవులు గూడికొని యజాండ క్రోడంబు పేడెత్త నెలుగెత్తి పాడు దివ్య ప్రబంధాను సంధానంబులకుఁ దోడై నెగడున స్తోక సౌవస్తిక భూసుర స్వస్తి ప్రవచనంబులు నిండార నాలోకన కౌతుకగతా నేకలోకనికరంబుల కల కలంబులు వారించి వేత్రహాస్తులు బరాబరులు సేయ మహనీయ మహోత్సవదిదృతిచే నంతరిక్షంబు వలన క్షితిజ తలంబునకుం దిగిన ఋక్షమందలంబునకు సదృక్షంబులయిన సురభి తైలధారాప్రజ్వలిత కరదీపికాలక్షం బలు వెలుంగ నిప్పుమిారుధరిత్రీతల నర్తనంబు సొంపుదమకుంజొ పుడమి విమానంబులెక్కి యుప్పరంబున నుండి భరత ఫణిత సరణి బహుల తాండవ భేదంబులు దండిగా మెండుసూపు వెలయాండ్ర తండబుల నవిస్మయంబు గా సందర్శించు పురందర పుర సుందరీ సందోహంబులనియెడు సందేహంబు నాపాదించు ప్రాసాదోపరి పరిక్రీడ తుర పురంథ్రికానికరంబుల కరకమలంబులచేత వికీర్యమాణంబులగ సురభిళ కుసుమ పరంపరల వలన సమాగతంబు లై మిళింద బృదంబుల నవపరిమళు లోభ పరిమిళ తంబు లుగావున మొత్తంబుగాఁ దమసికజుట్టిన పువ్వుటెత్తుల నత్తినగర కలితకనకకుసుమ మంజరీ జాలంబు వారించు చూడవచ్చినఁ ప్రోడచేడెల కనత్కన కంకణ నిక్వాకంబులు చెలంగ ఝుడితి జాజ్వల్యమాన హుతవహ యంత్ర మహిర హిమకర జ్యోతిః పుంజ జంజన్యమానరో చిర్జాల ప్రసరంబుల కులుకు కలికికులుకు చిలకలకొలుకుల నలిమికొని యలుకలుదీర్చు మదుసలి మగువల జరాజర్ఝ రాక్షరాలాంబులను వొందను ఘనా ఘనఘన ఘటా కఠోర దీర్ఘ నిర్ఘాతఘర్ఘర నిర్ఘోషఘుమం.......ధ్వానకోలాహలంబులకు బిట్టులికి నెట్టవం గుట్టుచెడిమట్టు మిాఱ నొండండనెట్టుకొని దుట్టువడిదట్టంబులుగ నచ్చటచ్చట బఱిచిన నానావిధంబులగు నంగడులు ద్రోక్కిమట్టాడుచుం బట్టినంబట్టువడక కడువడిం బరచుచుం బరుగెత్తు దర్శనాగత నాగరజనం బెక్కిన శకటంబులకుఁ గట్టిన తట్టులఁ గాంచి ఘొల్లున నగు గ్రామ్యపల్లవాధరుల కరతల తాలశబ్దంబు లుబ్బుమిాఱ వీధులందందంద నిలిపిన పూఁబం దిరుల నా కందర్పజనకుని నిలిపిన యెడల నందుండు భాగవత సందోహంబులకుఁ జందనంబులుం గుంద మందారారవింద మాల్యంబులుం దాంబూలంబులు ఫలంబులు పానకంబులు వడపప్పులు నర్పించి సంతర్పణం బు సేయుచు గర్పూర మిళితంబులగు గందవొడులు నవ్వుటాలకు వన్నెకాండ్రోండఁ జల్లులాడ నెల్లెడల మొల్లం బుగ నల్లుకొనుట నందుల్లసిల్ల జనంబులెల్ల పుల్లకాశకాసన వైఖరిని బాటిల్ల వలమానమ లయపవమాన రధ్యాపార్శ్వభాగ సముత్తంభిత రంభాస్తంభ లలితతరతరుణదళ తాళవృంతానిలంబులు పరిభ్రమ జ్జన పరిశ్రాంతి నపనయింప నంతట ప్రతిపౌర నిశాంత ద్వారాతికంబులఁ గాంతర కాంతాజనక రాంతలతాంత తంతన్యమాననీరాజస మంగళంబు లాజంగమ నియంత కంగీకరింపఁజేయుచుఁబురప్రదక్షిణంబు సేయించి మరల మణిసౌంధాంతరాళంబులం బ్రవేశింపజేసి వివిధభోగ ప్రసాద వినియోగంబుల సకల జనులకుం బ్రమోదంబొనఁగూర్చునట్టి యపాథ౯సారధిదేవుని మహూత్సవవైవంబు గనుంగొన్న వారల కిహంబున సకల కళ్యాణ కౌతుకంబులబ్బుటయుంగాక కైవల్యంబు కరగతంబైయుండు మఱియును

      
పృధ్వీవృత్తము.
            ప్రసిద్ధతరబొమ్మ దేవరకులోద్ధనాగాధిపా
            ఖ్యసింధుహరిణాంక వేంకటనృసింహభూపాత్మజా
            ప్రసక్త బిరుదీభద్బహదరూరు ఢక్కాధ్వజ
            ప్రసంజిత బహుప్రధాప్రసృతి భీతవైరి వ్రజా.

గద్యము-ఇదిశ్రీమన్మాల్య నృసింహ ప్రసాద సమాసాదిత సకల శాస్త్ర

సంవిదు పస్కృత సంస్కృతాంధ్ర సాహితీ పురస్కృత సరస

సారస్వత చతుర వాగ్ధోరణి మతుకుమల్లి కులమతల్లికాబ్జ

వల్లికా వయన్మణి కనకాద్రిశాస్త్రి బుధగ్రామణి

తనూభవాగ్రణి నృసింహవిద్వన్మణి ప్రణీతంబైన

చెన్నపురీవిలాసంబను ప్రబంధంబునందుఁ

దృతీయంబగు దక్షిణపద్ధతి

సంపూర్ణము.