Jump to content

చెన్నపురీ విలాసము/స్వరూపపద్ధతి

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవేణుగోపాలస్సహాయః,

చెన్నపురీ విలాసము-ప్రధమంబగు స్వరూపపద్ధతి

అందు మంగళప్రకరణము-ప్రథమము.

౼౼౼౼౼[0]౼౼౼౼౼

శా. శ్రీ మద్భీష్మసుతాస్వయంగ్రహ నమాశ్లేషాప్తి నాత్మీయ
   హామధ్యంబున లగ్నమౌఘసృణపంకాకంబు వీక్షించుచొ
   భామన్‌ గౌస్తుభకాంతి కైతవమునస్వవంచించులీలాభిక
   న్థేముంన్గొల్చెదఁదోట్లవల్లురిపుర శ్రీ వేణుగోపప్రభున్‌

మ.సరయస్తంభ భిదార్భటీవిదళదాశాభిత్తి సంధిస్ధీరీ
   కరణవ్యగ్రసరోజసణ్భవక రాగ్రక్షిప్తమృత్పిండవీ
   క్ష్యరయోద్థూతసటాచ్ఛటాచటులజంఝా మారుతాభ్రాట
   ర్భరభూధ్రంబగుమాల్య శైలనృహరిబ్రహ్మంబునన్‌ బ్రోవుతన్‌

క. వాణినలివేణినతగీ౹ ర్వాణిఘనశ్రోణి మధురవాణిఁ బరమక
   శ్యాణివిపంచీపుస్తక౹పాణిన్మదిఁదలతువారిభవభవురాణిన్‌
ఉ. అక్షయదుగ్ధపూరభరితాంతరమైన సుధాపయోధియ
   భ్రక్షరదాగతోదక ఝరంబులులోఁగొనదేయుదారవా
   గక్షతసేవధుల్సుబుధులన్యకేతుల్మదిమెత్తురౌటఁదా
   దృక్షవిభూతిమత్కృతి గ్రహింపనుతింతు సుధీవతంసులన్


వ. అని యివ్విధంబునం బ్రారీప్సిత ప్రబంధప్రతిబంధి ప్రత్యూహవ్యూహాంధకార విధ్యంసనా హస్కరంబగు నిష్టదేవతానమస్కారంబును శ్రేయస్కరంబగు సుకవి జనోపస్కారంబునుంగావించి యత్కించిదభినవ ప్రబంధ నిబంధనోత్సాహబంధురస్వాంతుడనైయున్న సమయంబున.

కృతినాయక ప్రకరణము♦ద్వితీయము

సీ.తనకీర్తిరుచిమరు త్వన్ముఖాశాధీశ,
              సౌధరాజికిసుధాచర్చగాఁగఁ
  దనప్రతాపోష్మ పద్మభవాండ,మంటపా
              భ్యంతరంబునకు దీపార్చిగాఁగఁ
  దనగుణశ్రేణి సత్కవికల్పితానల్ప,
              కృతికన్యకలకలం కృతులుగాఁగఁ
  దనవదాన్యత యాచకనికాయచాతక
              శ్రేణికి భూరివారిదముగాఁగఁ

గీ. బ్రబలు రాజాబహద్దరు ప్రభతినిభృత
   బిరుదపుంఖిఢక్కా గభిరనినద
   భితభితాఖిలాహిత వ్తాతుఁడగుచు
   బొమ్మదేవరకులనాగ భూవిభుండు.1

మ.జనులెల్లన్జగతీమహేంద్రుఁడనఁగా సామ్రాజ్యసంపూర్తిబే
   ర్కొనవల్లూరువసంతవాడమరియుం గూడూరునాఖ్యాతిగాం
   చిన రాజ్యంబులనంత ధాన్యధనలక్ష్మీ పూర్ణతన్మించఁగాఁ
   దనరున్నాగ నరేంద్రుఁడుద్భటభుజోద్దామప్రతాపోన్నతిన్‌.2

డును సమరధాటికాసమయ సమంతతఃప్రసృమర పరసహస్రసేనా పురస్సముత్తంభితాభ్రాంతర మరుద్వశ విభ్రా మితాభ్రపగా విభ్రమాదభ్రశుభ్రతర బిరుదకేతన పతాలాలోకాన మాత్రకాతర కాందీశీకపాశీక కరూశాది నానాదేశాధీ శ్వరుండును నగు నమ్మహీపాలచంద్రుని వినుతింపనప్పలుకు చెలికినైన నలవియె మఱియుదు.

ఉ. ఆనరపాలలోక మకరాంకుఁడు వేంకటనారసింహరా
   ట్సూరుఁడుబొమ్మదేవర విశుద్ధకులాబ్ధి మృగాంకుఁడాబృహ
   ద్భానుడు దీప్తిబూర్ణసిత భానుఁడుకీర్తిఁబ్రతాపఖరిన్‌
   భానుఁడుగాన నాగజనపాలుడుచూడ నృపాలమాత్రుడే.౩

సీ. శ్రీవేణుగోపసం సేవైకహేవాక,
              పాకోపనతపక్వ ఫలమనంగ
   సర్వాతిశయమహోజ్జ్వలమహారాజాది
              రాజరాజశ్రీ విరాజమాన
   భోగయౌ సీమరాణీగారు సైన్యసా
              హాయ్యంబునకు మెచ్చి యాకతీయ
   ముదమంది కలకత్త మదరాసు గౌర్నరుల్‌
              చెలిమి వాటిల్లగా సెలవుసేయ
   బందరుపురములోపల గలెక్టరు జడ్జి
              కర్నలు మొదలుగాగలుగు దొరలు
   హిందూనరేంద్రులు యందరుసభజేసి
              యపరిమితోత్సామతిశయిల్ల




  

సీ. రాజాబహద్దరు ప్రభతి సద్బిరుదాంకు
            డురుతర బొమ్మదేవరకులాబ్ధి
   చంద్రుడౌ నాగరాజన్యదేవేంద్రున
           కవిరళవైవోత్సవములమర
   శాలివాహాన మహాశకవత్సరంబులు
           గుణవారణమనీందుగణనగల్లు
   రౌద్రినామకవత్స్రమున నాశ్వయుజీయ
           బహుళ పంచమి మంద వాసరమున
గీ. భాసురస్వర్ణమయమైన బాహుపురియ
   రమ్యకాశ్మీర పట్టాంబరద్వయంబు
   ఘనతమిాఱ బహూకృతిగానొసంగి
   రానృపోత్తముగరిమ నేమనఁగవచ్చు.

సీ. శాలివాహన మహాశకవత్సరంబుల్
            భుజగజమునిచంద్ర పూర్ణసంఖ్య
   బరగుసిద్ధార్థి సంవత్సరంబున మాఖ
            బహుళ తృతీయర్యవాసరమున
   గొప్పాకపుర వేణుగోపాలదేవాల
           యాగ్రభగంబున నలఘుపటిమ
   బొమ్మదేవర కులాంబుధి పౌర్ణచంద్రుండు
           పట్నాలగోత్రాబ్జపద్మహితుఁడు

గీ. ప్రబల రాజాబహద్దరు ప్రభృతిబిరుద
   శాలియైనట్టి నాగభూపాలమౌళి

   తేజమింపందంగ ధ్వజ ప్రరిష్ఠసలిపెఁ
   దనరఁ దనకీతి౯ యాచంద్రతారకంబు. 10
గీ. అట్టి శ్రీ నాగభూమిపాలావళీవ
   తంసకమ్ము మున్నొక నిమిత్వబువలన
   విడిన గూడూరు పరగణాపేర వెలయు
   జీర్ణ రాజ్యంబు మరల నార్జింపఁదలచి. 11

గీ. శాలివాహనశాక వర్షములుగుణక
   జర్షి శశిసంఖ్యగల రౌద్రివర్ష మాఘ
   బహుళపక్ష తృతీయజ్ఞవాసరమున
   నిష్టదేవతనర్చించి యెలమిమించి.12

సీ. ప్రస్థానభేరి నిర్భరభూరిభాంకృతు
           ల్భూనభోతరమున బోరుకలుగ
   హస్త్యశ్వ రధభటాభ్యధిక సంరంభంబు
           కడిమిచేఁ బుడమి గ్రక్కడలిపొదల
   బిరుదకేతన పటప్రేంఖోళిత ప్రభ
           ల్గగన భాగంబునఁ గడలుకొనగఁ
   గవిబుధ ప్రవర భాంధవ మంత్రివర్గము
           ల్వాహనారూఢత వరుసఁగదలఁ


గీ. బరమవిభవంబుతో నాత్మపురము వెడలి
   పటకుటీర పురీభవదటవియగుచు
   గతిక్షయ ప్రయాణంబులఘనతమిాఱ
   చెన్నపురిఁజేరి హర్షంబు చెన్నుమిగుల. 13

 

మ. మహిమం జాకలపేట దంజపురి రామానాయనింగారిచే
    విహితంబౌ మహితాగ్రహారమున నావిర్భూతశాఖానికా
    యహిమప్రాయతలద్రుశోభిత తదీయారామ సౌధంబులో
    రహిమిారన్ని వసించి యాత్మపరివారవ్రాతముల్గొల్వఁగ౯.14

చ. ఘనతఁగమిస్సెరీదొరల గౌర్నరుగార్లను సెక్రిటేరుల౯
   గవక గమిస్సెఋఈజెవలుగారు సిఫారసు సేయ మెచ్చి నె
   మ్మనమునకూర్మి నానృపతిమౌళికి గౌర్నరుమెంటువారు
   భూజనులలరారగాఁహుకుమొసంగిరి క్రమ్మరరాజ్యమిాయఁగ౯.15

వ. ఇవ్విధంబున బువర్లబ్ధాభిమత రాజ్యలాభ ప్రమోదమీదుర హృదయారవిందకందళిత ప్రసాదసూచక శుచి స్మతాలంకృతసుముఖారవిందుడై చెన్ననగరంబునం బూర్వోక్త సౌధోపరిభూమికాభాగంబున దివ్యసభామంటపంబున భద్రసింహాసనంబున మహేంద్రవుభవంబుల సిరుల నిరవొందుచు సచివ సామంత బాంధవ కవి విబుధ నికర వీర భటానీకంబు గొలువ నిండుగొలువైయుండి.

కృతి ప్రకరణము--తృతీయము


మ. నను మల్యాద్రి నృసింహభక్య్తుదితనానాశాస్త్ర పాండిత్యశా
    లిని శ్రీమత్కనకాద్రిశాస్త్రిసుతుథీలేఖర్షభాచార్యుఁబా
    వనసత్కాశ్యపగోత్ర సంజనితు నాపస్తంబసూత్ర్సుమిా
    పనివిష్ణున్నరసింహపండితుని సంభావించిపల్కె౯దయ౯.1
సీ. క్షమవిహరించు బాక్సతిపుట్తినయిలుమ
             తుకు మల్లికులమతల్లి కతదన్వ

   యోదితుల్వేంగలళా ర్యాదులుమాల్యశై
              లనృసింహకరుణోప లబ్ధవరచ
   తుష్షష్టివిద్యావిదులు భబత్పృపితా
               మహుండు మాధవ కవీద్రోత్తముఁడభి
   నవభారాతాది నానాగ్రణ్ధకర్తనీ
               తాతనృసింహవిద్వద్వరుండు
  
గీ. శబ్దశాస్త్రత యిావిచక్షణుఁడు నీదు
   జనకుఁడైనట్టి కనకాద్రిశాస్త్రివర్యుఁ
   డఖిలశాస్త్రార్థవేదినీ వద్భుతప్ర
   సిద్ధసారస్వతుఁడవు నృసింహశాస్ర్తి.2

చ. పురములలోనఁ జెన్నపురి పూర్ణ విలాసము వణ౯నీయమై వై
   ఖరియగుఁగానఁదత్పుర వికస్వరచారువిలాసవణ౯న
   స్ఫురణ నొనర్పుమొక్కకృతిభూరిగభీరతరార్థగుంభన
   ర్మరసభరఁబు గామతుకుమల్లి నృసింహ కవీంద్రశేఖరా.3
   

వ.అని సగౌరవంగుగా నానతియొసంగినం బొంగిఉఅభంగురవ్రమోదతరంగి తాంతరంగుడనై యమ్మహారాజదేవేంద్రునకభ్యుదయ పరంపరాభివృద్ధిగా నొనర్పబూనిన చెన్నపురీవిలాసంబను ప్రపంధంబునకుంబ్రారంభం బెట్టిదనిన

సన్నివేశము-చతుర్థము

<poem> శా. శ్రీశోభాద్భుతమబ్ధితీరవసతి న్థేమాభిఆమంబునా

   నాశాఖానగరాభిశోభిత మభిన్య స్తేష్టికానద్ధర 


    థ్యాశుంభద్రరాజి చెన్నపురి చెల్వారుంజిరస్ఫూతి౯ హూ
    ణేశాధిష్ఠితరాజధాని మదరాసీయయుర్వరాస్వర్గమై.......1

మ. చతురంబై చతురశ్రమండలసమస్థానస్థితంబైమహా
    ద్భుతశోభాస్పదమై యభూతచరమై పొల్పారి క్రోశద్వయా
    యతవిస్తారమునౌవురి౯ సపరిణాహస్ఫూతి౯ రాణించువం
    చిత పాశ్వ౯ద్వయసాంద్రసౌధనివహశ్రీవీధీకాశ్రేణికల్.......2

మ. వరప్రావృతమైయుదగ్దిశమదంవత్తోయదుర్ధర్షదు
    స్తరమై తూర్పునదక్షిణంబునసముద్యద్యంత్రదుర్దర్శదు
    ర్గరమాదుర్గమమై ప్రతీచిరి మహాగాధాబ్ధిశాఖాప్రవా
    హరయాఢ్యంబయియొప్పునప్ఫురమభేద్యంబై యజేయస్థితి౯...3

గీ. ఆపురోత్తంసమరయ ముత్యాలపేట
   పెదనాయనిపేటనాద్వి విధమయ్యెఁ
   బ్రకటసీమావి భాగవిభక్త విపుల
   విపణికాపణవీథీకా వితతమగుచు....4

మ. ప్రజవర్ణింపఁబ్రతోళికా విపణికాపణ్యాపణాట్టాలక
    ప్రజమదంబర వీథిఁబాసినగరిం బ్రాపించుతారాగణం
    బుజగల్మీఱనిశాముఖంబులఁబురిం బొల్పు౯ దివారాత్రఘృ
    ష్టిజ సంధ్యానలవిస్ఫులింగశకల శ్రేణుల్‌ ప్రదీపావళుల్. ....6

    అలరును భూతధాత్రివివిధాఖిల వస్తుమహాసమృద్ధ్ను
    జ్జ్వలమగుతత్పురంబుజలజాత భవుండధిక ప్రపంచకృ
    త్యలఘుతకాత్మమెచ్చకతదల్పతరత్యభి రామరేఖరా
    జిలమరల౯ సృజింపవిలసిల్లు జగద్వలయంబునాఁదగ౯......7

వీధీప్రకరణము-పంచమము


చ. అరయ విశాల మిానగరమౌననివేరెనుతింపనేల యం
   దిరుదెసమేటిమాడువులు హెచ్చగు గచ్చుటరుంగు పంచలు
   న్బబరపగు నంగణంబును నారికెడంపునిటంపు పందిరు
   ల్బరగఁగ వీధికాశతమెలర్చెడిచోఁదతదీర్ఘమై.....1

చ. ఇరుగడనొక్కటొంటి కెడమియ్యక క్రిక్కిఱియంగఁగొండల
   ట్లరుదగు హర్మ్యమాలికల హర్పతిమార్గముగప్పియొప్ప న
   ప్పురవరవీధులం జనులు పూర్ణసుఖాప్తిఁబగళ్ళనెండ సోం
   కరయక సంచరింతురు నయంబుగ రెండవజాముదక్కగ౯...2

సౌధప్రకరణము షష్ఠము.


ఉ. బాలికలెల్ల నానగరి బంగరుమేడలలోఁ జరించుచోఁ
   జాలకమార్గగామియగు చందురుఁబట్టఁగఁబోయిపట్టఁగా
   జాలక నేటికేమి యొకసారితొలంగె తొలంగుగాక రే
   ఉఏలిక రేపుపట్టెద మదెంతని పల్కుదురాత్తముగ్ధత౯...2

చ. కువలయపత్రలోచనలఁగూడి సుఖించుచు గేళికా రస
   ప్రవణ విజాంతరంగులు పరంగులు ఏల్వఁగ సప్తభూమికా


    భవసమలొప్పు భూరిబిలవారచరత్సురసిద్ధదంపతీ
    నివహమలైనతారధరణీధర మందరశైలముల్బలె౯. 2

క. వరతత్పుర రుచిరోన్నత తరసౌధవిటంక సంతతవ్యాఘ్రాతో
   పరచితకిణమాశశినలు పరయక పామరులు హరిణమందురుదాని౯...3

మ. లలనల్‌ ప్రోన్ంతసౌధశ్ర్ంగముల మ్రోలంబోల్చుద్యోవాహినీ
    పులిన శ్రేణులనాడఁబోయి తమసొంపుంబెంనిష్పంద దృ
    ష్టులచేజూచు తురంగగాత్ర తురగాస్యుల్లోనుగాఁగల్గువే
    ల్పులవీక్షించి భయంబునందదుదరంబుల్సొత్తురాప్రోలున౯. 4

మహుమప్రకరణము-సప్తమము

మ. ఎరణాయూరునుగత్తి వాకయడ యారెన్నెళుంబూమే
    ల్తిరువట్టూరునురాయపేట తిరువల్లిక్కేణిచేపాకయు
    న్బబరశుంవాక పరంగికొండ మరికృష్ణాంపేటయు౯లోనుగాఁ
    బురిచుట్టు౯విలసిల్లునాటుపురమల్ భూతిందదేకాకృతి౯...1

సీ. కుంభకోణము కల్లికోటకర్ణోలుబ
            ళ్ళారిచిత్తూరు నేలంబుకడప
   కబడాలబందరు కనరామధురతిఱ్న
            వల్లియు తెరిచెనాపల్లిమఱియుఁ
   గోయముత్తురుమంజకుప్పంబు నాగచెం
            సల్పట్టు నెల్లూరనల్పపటిమ
   వఱలుగుంటూరుబందరును రాజమహేంద్ర
            వరము నాఁగవిశాఖపట్టణంబు

గీ. ననఁగ శ్రీకాకుళము గంజననఁగబరఁగు
   నిరువదియురెండు జిల్లాలకిరువు మిారు
   రాజకార్యంబులకునెల్ల రాజధాని
   యాపూ ప్రాభవముభివిసదృశంబు...2


   పురింజుట్టు నుబశ్చిమోత్తరదిశాభోగంబుల౯ లోహము
   ల్గరచ౯ బూంచినయంత్రకూటముల పైగన్పట్టునాత్మాహితా
   మరలోకంబడవంబురఁబిడి సమ్యగ్ధూశ్శరఘ్నుల్‌ బలె
   బరమప్రాంశుతరాగ్నియంత్రగసుధాబద్ధేష్టికాస్తంభముల్..3

పౌరప్రకరణము-అష్టమము

   భేరీలంవెఱపించు పెద్దకడుపుల్వ్రేగౌబృహద్బీజపుం
   భారంబుందమ మందయానములకుంబ్రాపై విజృంభింపఁగా
   భూరి ప్రౌఢిమహావృషమంబు ల్రుమంబోలంవినోదింతురా
   బేరీలాదిగఁగొందఱంగడులగోభృత్తుండిభుల్ తుణ్దిభుల్...1

   కచభారంబతిభరమాకచభరా ఖర్వాతిగర్వారియా
   కుచభరంబరయంగఁ దత్కచకుచాక్షుద్రోరుభారాతిభా
   రచితం బాకటీచక్రమౌటఁ దగుమంద్రక్షీణయానాభిశో
   భిచమత్కారములందుఁ దుందిభలకాబేరీవణి క్స్త్రీలకు౯. 2

   తేలిక పారులయ్యరవదేశపు చుట్టుడుపాగలొప్పనం
   గీలుపదాగ్ర సీమఁదులకింపఁగ ముచ్చెలు కాళఁజేరు మా
   లలు ధరించి సోయగములంబురవీధులఁబొల్తురెప్డు వీ
   లాల ఘుతార్హరేఖ మొదలారులు పిళ్లలుసెట్టునాయకుల్.3




ఉ. ప్రొద్దున లేచిగుంటలకుఁబోయి మొగంబులఁబ్రామివచ్చివే
   ల్సద్దులుపుల్లనీరులునుజాలగఁద్రావిపొగాకువీడెముల్
   కొద్దిగజేసిలోనబలుగోచులు పై బురిచుట్లునొప్పుగాఁ
   బద్దులతో జరింతురరవల్ పురవీధులబేదమునుగ౯.

క. పురవీధులహాస్యరస
   స్ఫురణకుఁబ్రాతులయి తిరుగుచుందురెపుడుగొం
   దఱు నేనుఁగుఁగాళ్ళంగల
   పురుషులు వనితలునుస్ఖలితపున్నడకలతో౯.

చ. పసుపునునూనెమేనులను బ్రాముపయి౯ నలుగిప్పపిండిరు
   ద్దిసలిపినారికేళవనదీర్ఘికలందిగి తీర్థమాడియ
   య్యసమపుకీలుగంటపిరుదంటఁగఁదీర్ధపుగిండిరొండిపైఁ
   బొసఁగఁనిండ్లునేరుదురు ప్రొద్దుటిప్రొద్దులద్రావిడాంగనల్‌.

చ. తెలతెలవేగమేలుకొని తీర్థపుగుంటలకేగిదోవతుల్‌
   తలతలనొప్పగానుతికి తాపలపైనిడితానమాడితా
   వులఁబదిరెండుపుండ్రములు పూనిగృహంబులసేర్చి నీట త్రా
   డులపయినానాఱవైతురు మడుంగిడి చేతులఁదట్టివైష్ణువుల్‌.

వీరభటప్రకరణము.నవమము


చ. పటిమఁబురోపకంఠతటవాటికలన్వడి బార్లుదీరియు
   ద్భటసుభటచ్చటాపటలదాటులు రేపుమాపుబాహుసం
   ఘటితములౌతుపాకుల చకచ్చకలొప్పఁగవాతు సేయని
   ష్కుటకుటజప్రతిధ్వనిగఘూర్ణిలు ఫైర్లఫెళత్ఫెళధ్వనుల్‌.


   కుదురుగ సందునందుఁబురిగుప్తికినిల్పఁగ వీరరౌద్రసం
   పదలనెసంగుపోలిసుల బంటులొగింబడు నిద్దరల్పపుం
   గుదియలు పూని లాగులును గుత్తపుకంచుకముల్‌ ధరించువా
   రదయతఁగాల కింకర భయంకతవృత్తిఁజరింతురెంతయు౯.2


ఉపవన ప్రకరణము దశమము


సీ. వేణికాంచత్స్నుహీశ్రేణికామ్రేడిత
            వేణుకాండాతతావృతులుగలిగి
   సురసాలనిభనూతనరసాలముఖచారు
            తరసాలషండ సంతతులు గల్లి
   మల్లికాదిగపుష్పవల్లి కాలోకమ
            తల్లికామంట పోద్యమముగల్లి
   యాళీభవత్పద్మపాళీవినోద
            న్మరాళిదుచిర దీర్ఘకాళిగల్గి....1

గీ.తద్వవంబులనెత్తునేతములుపారె
  నెగయుటయు వ్రాలుటయును వర్ణింపఁదగును
  భువినధపురి దివినిస్వఃపురియటంచు
నభినయించువనేందిరా హస్తలీల...2

చ. పురివెలిపేటలందునుపఁబొల్పగు నారికెడంబుతోటలం
   దిరువగుబంగళాల కొకరికిద్దఱు మువ్వురు లంజయాండ్రతో
   వరశకటాప్తినేగి ధనవంతులు నాగరులెల్లరాత్రులం
   బరగ సుఖింతురెప్డు మధుపాన రతోవవిభ్రమోన్నతి౯...3

మ. పురికిందక్షిణపశ్చిమంబుల వనాభోగంబులుంజూడ గౌ
    ర్నరులుంగర్నలు సెక్రిటేరులు కమాన్డర్లింక జడ్జీల్కల
    క్టరులుం బాదారులుంగమీషరులు మేస్తిర్లెంజనిగ్లారిగా
    దొరలుండదగుబంగాళాలు చెలువొందున్నూరువేలుందగ౯..4

శాకతక్రవిక్రయికా ప్రకరణము-ఏకాదశము.

చ. తికముక పైటఁజాఱుచనుతిత్తులు గంతులు వ్రేయ సోర్ణగం
   డ్లకు సరితూట్ల వ్రేలుచెవుల౯ బెనుగమ్మలుతూఁగధూమప
   త్రకలుషవీటికాశన శితప్రచలాధరలై చరింతురిం
   చక వడిశాకవిక్రయికశూద్రజరద్ద్రవిడాంగనల్ పు౯...1

సీ. పడఁతి రోతగు చల్లపిడతకు వెలయెంత
              పెద్దదుడ్డటువైచి పేర్మిఁగొనుము
   తరుణి నీపెరుగుముంతలు పల్చనైనవి
              తోడుగూడినవవి చూడుమింక
   కలికిరొ పాలిండ్లఘనతఁజెల్వగుఁగదా
              పాలిండ్ల జూడ మాపటికిరమ్ము
  వనజాక్షి నీవెన్న వలపులూన్పవెప్రీతి
             స్నేహముగలచోట నెరయువలపు

గీ.లనుచు రసనర్మమర్మభావాన్వితముగ
  వన్నెగాండ్రించ్చు చతురంపు ప్రశ్నములకు
  వరుసననుగతములుగ నుత్తరములిడుచు
  చల్లలమ్ముదురుప్పరి గొల్లచెలులు...2


పుష్పలావికా ప్రకరణ ద్వాదశము


మొల్లలుమల్లెలున్మరువముల్ దవనంబులుమించు గొజ్జగుల్
సల్లలితంబులైన విరజాజులు జాజులు సంపెగల్ సము
త్పుల్లములైన గన్నెరులు బూన్చిన చిత్రపు చెండులెత్తులుం
హల్లక పద్మమూల్యములు నమ్ముదు నప్పురిబుష్పలావికల్ 1

కవితామోదభరానుగ భ్రమరఝంకారంబు లింపొందగా
లలితా మూల్యలతాంతమూల్యములువ్రేలన్ గ్రోలలుంబూనివీ
ధులలో గ్రుమ్మరు దూర్యముల్ మొరయజేతో జాస్త్రముల్ పేర్మి వా
టిల నేగించెడి తజ్జయేందిరలమాట్కిం బుష్పలావీతతుల్. 2

అలిగెదుతనువల్లి నంటినంతలతాంగి
     చిలుకు చేసోకపుష్పిణికిరజము
గణికలపై మాకు గలదుకూర్మిమృగాక్షి
     మాజాతులనుగన్న మరలగలవె
పద్మినీజాతి గన్పడదేమె పద్మాస్య
     తావులచేదాని దగదెలియుము
సకియ నీయలరుదండడు గోరివచ్చితి
     దగువెలపెట్టి నా దండగొనుమ

తే.గీ. టంచు సాకూతవిటవచనానురూప
     చతురతర నర్మ గర్భమోచాసమాన
     చారువాచా చమత్కృతుల్ సలిపి పువ్వు
     లమ్మెదరు పుష్పలావిక లప్పురమున.

శకట ప్రకరణ త్రయోదశము

మ. చతురశ్వద్విహయాన్వితంబులు చతుశ్చక్రాభిరామంబుల
   చిత చితాంబరసద్వితానకములై చెల్వారు సారట్లను
   న్నతిమీర న్విహరించు నన్నగరి నానాదేశభూపాల సం
   హతి తత్పూర్విభవేక్షణాభ్యుప గతాశాధీశులను బోలుచున్

గీ. పేద మున్నుగ నెక్కిన పెట్టెబండ్లు
   తట్టులెద్దులబూన్ప సత్వరత బరచు
   గిరిగొనుచువచ్చు బ్రజ తొలగించు పగిది
   మ్రోగుచు నిరంతర గతాగతముల.

మ. సకియల్లోవెలయన్ బయిన్శితిపటచ్ఛన్నంబులై పేటికా
   శకటవ్రాతమువీట ఘర్ఘరఘవస్వానంబులన్ బర్వు వీ
   ధికల న్మించులతో బురంబునన్ ప్రీతిన్ వచ్చి గజిన్ ల్లుచు
   బ్రకటస్ఫూతిన్ బరిభ్రమించు నిబిడాశ్రేణిచందంబునన్

గీ. ఇర్రిపోతులబోల్కంచి యెడ్లబండ్లు
   పటురయంబున బరచు నప్పట్టణమున
   దత్పురాద్భుత విభ్రమదర్శ నైక
  రభసపవమాన దేవతా రథములనగ.

మ. లలితాకారవిచిత్రవేష రుచిరాలంకార శృంగార మూ
    ర్తులు యూరోప్దొరసానులున్ దొరలుదొడ్తోసారటుల్నెట్టిదో

   స్థలి నారూఢవిమానులై తిరుగు గంధర్వాప్సరఃకిన్నరు
   ల్బలెఁగ్రీడింతురు వీటవార్ధికడ లీలారధ్యల౯ సంధ్యల౯..5

చ. ప్రకటతజూడనొప్పఁబురిరాత్రులఘోర రటద్రుతవ్రజ
   చ్ఛకటముఖంబులందు నిరుచక్కిఘటించిన దీపయంత్రదీ
   పికలు పురప్రదీపరుచి విభమధిక్కరణా సహోన్నద
   త్ప్రకలుషితభ్రమత్తిమిర దైవతతామ్రతామ్రత రేక్షణాకేతి౯....6


స్రగ్విణీ వృత్తము

అంకముక్తేందు బి బాభవక్త్రా.బుజో
దంకురన్మందహాసావ గమ్యద్దయా
పంకజాప్తోపమభ్రాజితేజోద్భుతా
రాంకవోలంకృతా రాజ్యలక్ష్మీసుతా.7


గద్యము-ఇది శ్రీమన్మాల్య నృసింహప్రసాదసమాసాదిసకలశాస్త్ర

సంవిదువస్కృత సంస్కృతాంధ్ర సాహితీపురస్కృత సరస

సారస్వత చతుర వాగ్ధోరణి మతుకుమల్లికులమతల్లి కాబ్జ

వల్లికా వియన్మణి కనకాద్రిశాస్త్రి బుధగ్రామణి

తనూభవాగ్రణి నృసింహవిద్వన్మణి ప్రణీతంబైన

చెన్నపురీవిలాసంబను ప్రబంధంబునందు

బ్రథమంబగు స్వరూపపద్ధతి

సంపూర్ణము.