చిన్నయసూరి జీవితము/సాహిత్య విద్యాప్రచారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

13. సాహిత్య విద్యాప్రచారము

సూరి గ్రంథరచనమేకాక నా కాలమున సాహిత్య విద్యా ప్రచారమునకు బహుముఖములుగాఁ దోడ్పడిన మహనీయుఁడు.

ప్రాచీనగ్రంథ పరిష్కరణము

చిన్నయసూరి నన్నయ రచిత భారతములో 'ఆదిపర్వము'ను పరిష్కరించి 1847 లో ప్రకటించినాఁడు. మఱియు, కూచిమంచి తిమ్మకవి 'నీలాసుందరీ పరిణయము'నకు తొలుత సుపరిష్కృత ముద్రణము వెలయించినది సూరియే

పత్రికా సంపాదకత్వము

చిన్నయసూరి రచనా ప్రారంభ దశలో "వర్తమాన తరంగిణి" అను పత్రికకు వ్రాయుచుండెడివాఁడు. ఆ వెనుక "సుజన రంజని"*[1] అను మాస పత్రిక నాతఁడు నడిపెను.

పఠనీయగ్రంథ సభాధ్యక్షత పదవి

క్రీ. శ. 1845 లోనే, అనఁగా, సూరి రాజధానీ కళాశాలకు రాకముందే - యాతఁడు చెన్నపురి పాఠశాలోపయుక్త గ్రంథకరణ సభకు (The Madras School Book and Vernacular Society) నధ్యక్షుఁడై తన జీవితాంతమువఱకు నం దుండెను. ఈ విషయము క్రీ. శ. 1866 'తత్త్వబోధిని' పత్రిక తెలుపుచున్నది.

  1. * ఈ విషయము అముద్రితగ్రంథచింతామణి 1886 సంవత్సరము జూన్ నెల సంచికవలనఁ దెలియనగును.