చర్చ:భగవద్గీత - తెలుగు అనువాదము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ్యాసం సూచనలు[మార్చు]

ఇవి అనువాద వ్యాసం ప్రారంభించినపుడు ఆరంభంలో వ్రాసిన సూచనలు. వాటిని చర్చాపేజీకి మారుస్తున్నాను. --Kajasudhakarababu 20:13, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


గమనిక

 • సంస్కృతంలో భగవద్గీత పూర్తి పాఠం భగవద్గీత సంస్కృతము‌లో ఉన్నది. చూడగలరు.
 • ఇది భగవద్గీతకు తెలుగు అనువాదాన్ని సమకూర్చడానికి ప్రారంభించిన వ్యాసం. బహుశా ఇదే తెలుగు వికిసోర్స్‌లో మొదటి అనువాద కార్యక్రమం కావచ్చును. కనుక కొన్ని నియమాలను ఏర్పరచుకోవలసిన అవుసరం ఉన్నది. (అలాగని వీటిని మార్చకూడదని కాదు. మీకుమంచిదని తోస్తే పాతవాటిని మార్చి క్రొత్త నియమాలను ఇక్కడే రాయండి.
 • ప్రస్తుతం కొన్ని నియమాలను ఇక్కడ రాయడమైనది.
 1. సంస్కృతంలో మూల శ్లోకం సంఖ్య రాయాలి. కాని అధ్యాయాల పేర్లు రెండవ లెవెల్ హెడ్డింగులుగాను, శ్లోకం మొదటి పదాలు మూడవలెవెల్ హెడ్డింగులుగాను చేస్తే, శ్లోకాల సంఖ్య విషయసూచికలో ఆటోమాటిక్‌గా వస్తుంది.
 2. ప్రతి శ్లోకానికి అనువాదం క్రొత్త పేరాలో రాయండి. ఇంకా వివరాలు, వ్యాఖ్యలు ఆ తరువాతి పేరాలో వ్రాయవచ్చును.
 3. ఇక కాపీ హక్కుల విషయం- మూలానికి ఎలాగూ కాపీ హక్కు లేదు.అనువాదాలు వందలాదిగా ఉన్నాయి. శ్లోకానికి తిన్నగా తాత్పర్యం విషయంలో కాపీ హక్కు పాటించవలసిన అవుసరం లేదని (ఈ రచయిత) అభిప్రాయం. కాని ఈ విషయం వ్యాఖ్యలకు వర్తించదు. వ్యాఖ్యలను అనుమతి లేకుండా కాపీ చేయవలదు.
 4. ఏమయినా గాని, మీరు తీసుకున్న మూలాలను పేర్కొనండి. ఆయా రచయితల పట్ల గౌరవంతో.
 5. ఇక భగవద్గీత విషయంలో మరికొన్ని గముఖ్యంగా మనించదగిన అంశాలు:
  • ఇలాంటి గ్రంధం అనువాదంలో వేరువేరు వ్యాఖ్యాతల అనువాదాలు భిన్నంగా ఉంటాయి. అనువాదాల శైలులు కూడా భిన్నంగా ఉంటాయి.
  • వీలయినంత వరకు సరళమైన భాషను వాడండి.
  • ఏమయినా అనువాదంలో భిన్నత్వాలు మీకు తారసిల్లినట్లయితే వేరువేరు రెండు అనువాదాలనూ చూపడానికి యత్నించండి.
  • మొదలు పెట్టండి.

 • ముందు ఒకే వ్యాసంగా ప్రారంభించిన ఈ అనువాదాన్ని పిఢరా గారు అధ్యాయానుసారం విభజించారు. కృతజ్ఞతలు.
 • {{భగవద్గీత అనువాదం అధ్యాయాలు}} అనే మూస తయారు చేశాను. ప్రతి అనువాద అధ్యాయంలోనూ ఈ మూస ఉంచితే ఉపయోగకరంగా ఉంటుంది.

--Kajasudhakarababu 06:15, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అనువాదం మూలం గురించి మరిన్నివివరాలు[మార్చు]

తొలిముద్రణ సంవత్సరం, ముద్రాపకుని విలాసం. కాపీరైటు గురించిన వివరం వుంటే అది తెలియచేయండి.--అర్జున (చర్చ) 10:45, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]