Jump to content

చంద్రరేఖావిలాపము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చంద్రరేఖావిలాపము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరహితగేహ! చంద్రీ
వారవధూమదనసదనవర్ధితసుఖరో
గారూఢితమృదుదేహవ
నీరంగవిహారసాంద్ర! నీలనరేంద్రా!

1


వ.

ఆకర్ణింపుము తావకీనకథావిధానంబు యథార్థంబుగాఁ
దొల్లి శ్రీ శివబ్రాహ్మణవర్ణాగ్రగణ్యుం డైన వీరభద్రభట్టారునకు శ్రీ
మద్వైఖానసవంశోత్తముం డగు నంబి నరసింహాచార్యుం డవ్వలి కథ
యిట్లని చెప్పందొడంగె.

2


క.

అక్కమలేక్షణ యది గని
చిక్కెంబో వీడు నాదు చేతి క టంచున్‌
నిక్కుచుఁ దల్లికడకుఁ జని
మక్కువ నక్కథ యెఱుంగ మఱువునఁ దెలుపన్‌.

3


వ.

ఇట్లు దెలుప వేంకటసాని యిట్లనియె.

4


క.

నీ తండ్రి క్రతువు కనుఁగొన
నాతతగతి నీలనృపతి యరుదెంచి నినున్‌
రాతిరి గని మోహించుట
లాతులలోఁ దేనె పుట్టిన ట్లయ్యె గదే.

5


క.

ఏ మేమి! నీలభూపతి
నీమీఁదం గన్ను వైచి నిష్టురజవవ
త్కామశరజాలనిర్దళి
తామేయస్వాంతుఁ డయ్యెనా? మేలుభళీ!

6

క.

కూఁతుర, యాతుర పడి నీ
వాతనిఁ జేరంగఁబోకు, మటుతాళుము, వాఁ
డేతెంచు సంచులను ధన
మాతతగతి నించుకొంచు వ్యామోహమునన్‌.

7


క.

వలపెంత నీకుఁ గలిగినఁ
గులధర్మము తప్పరాదు కుమ్మరపురువుం
బలెఁ దిరిగి పొట్టఁ బెంపఁగ
వలెఁ జుమ్మా ముద్దుగుమ్మ వగ నాయమ్మా.

8


వ.

అని యనేకప్రకారంబుల లాలించి మేలెంచి తనకాలంబు
నాఁటి నాటకంబులు బూటకంబులు బోటిదనంబులు నీటులు కూటం
బులమాటలు చాటుమాటు లేక తేటతెల్లంబుగా నబ్బోటితోఁ జాటం
దొడంగె.

9


క.

వేంకటశాస్త్రులవంటి ని
రంకుశులను మరులు కొల్పి యర్థము చాలన్‌
లంకించి నాకు నమ్మిన
కింకరులుగఁ జేసికొంటిఁ గిమ్మనకుండన్‌.

10


క.

మున్నెంత వాఁడు వేఁడినఁ
గన్నెఱికం బీక మీఁదుగట్టితి నీకై
మన్ననఁ గైకొమ్మని విటు
లన్నిత్యము మాయచేసి లంకింతు వరాల్‌.

11


ఆ.

ఒకఁడు గానకుండ నొక్కని రావించి
యొకనిచెంత కేఁగుచుండి నడిమి
దారి నొకనిఁ గూడి తబ్బిబ్బు గావించి
ధనము కొల్లగొందుఁ దవిలి ముందు.

12


క.

మందుల మంత్రంబులచే
విందులచేఁ బూఁతచేత వీడెంబులచే
తందనపదముల నాటల
మందులఁ గావించి విటుల మానక దోఁతున్‌.

ఉ.

అందలము ల్శతాంగములు నశ్వచయంబులు పాలకీలునున్‌
మందరశైలరాజనిభమత్తగజంబులు వెంటనంటి రా
ముందఱఁ బొందుగా ధనము మూటలు మేటులు కాన్క లంపి నా
మందిరసీమఁ గాతు రసమాననృపాలకుమారు లెప్పుడున్‌.

14


క.

నీ కేమి చెప్పవలయును
లోకు లెఱుంగుదురు నాఁటిలో మదనుఁ డహా
నా కనుసన్నల మెలఁగును
కాకుండిన నింతసొమ్ము గడియింతు నఁటే.

15


క.

అప్పారాయని సభలో
మెప్పొందితి సాటి సానిమేళంబులలో
చెప్పినఁ బగ్గెగ నీ మది
కిప్పుడు తోఁచును, మఱెవ్వ రిచ్చట సాక్షుల్‌.

16


క.

చెలమకుఁ బిట్టలు చేరెడు
పొలుపున నా యింటిచుట్టు భోగాభిరతిన్‌
పలుగు గులాములు తురకలు
వలగొని కానుకలు గొనుచు వత్తురు సుమ్మీ.

17


క.

కట్టిన కోకలు కట్టక
పెట్టిన మణిభూషణములు పెట్టక సిరులం
దొట్టి విటకోటి కొలువఁగ
దిట్టతనంబునను గొలువు దీర్తుఁ గడంకన్‌.

18


క.

జూదంబులఁ బటువీణా
నాదంబుల దండలాస్యనటనముల మతుల్‌
భేదించి విటజనంబుల
చే దండుగఁ కొందు ధనము చెప్పఁగ నేలా.

19


సీ.

వలిప చెంగావిపావడ కటిస్థలిఁ దాల్చి
            జిలు గైన సరిగంచుచీర కట్టి
కులుకుగుబ్బలమీఁద మలయజాతము పూసి
            కట్టువాపని కంచుకంబు దొడిగి

లీలగా సిగ వేసి పూలదండలు చుట్టి
            ముత్యాలతాటంకములు ధరించి
కడియాలు కుంటేళ్ళు గంట లొడ్డాణంబు
            బవిరలు బావిలీల్‌ బన్నసరులు.


గీ.

నుంగరంబులు కెంపులు ముంగరయును
మొదలుగల సొమ్ములను దాల్చి మురిపె మమరఁ
దిరుగుచును విటకోటుల ధృతి కలంచి
హొన్నులు గడింతు మరునాన చిన్నదాన.

20


క.

నా వగ నా యొసపరినడ
నా వాలుంజూపుకోపు నా మాటలతీ
రావంతయు నీ వెఱుఁగ వ
హా వన్నెలకానికూఁతురా యిది మేరా.

21


క.

చండ్లు పడెఁ బండ్లు కదలెను
గండ్లకుఁ జత్వార మొదవెఁ గాయము ముదిసెన్‌
గోండ్లును భగమును బిగి చెడి
దిండ్ల తిరుగు నేర్పు తప్పె ధృతి మఱపూనెన్‌.

22


క.

వృద్ధత్వ మివ్విధంబున
సిద్ధించెను గాని యిపుడు చిల్లరవిటులన్‌
బద్ధానురాగులుగ అని
రుద్ధజనకుఁగేళిఁ దేల్చిరో వెలఁ గొననే.

23


తే.

కాన నీవును నావలెఁ గాముకులను
వంచనము చేసి విత్తమార్జించవలయుఁ
గాక యాతనిపై మోహకాంక్ష పూనఁ
జనునె వాఁ డెంత సౌందర్యశాలి యైన.

24


మ.

అసదృక్కాముకుఁ డౌటచే తను దదీయాంగంబునం దెంతయున్‌
రసపొక్కు ల్బలుబిళ్లలు న్బహుళఘోరస్ఫారజాగ్రత్ప్రమే
హసుఖవ్యాధులు మానకుండును సదా హా వాని పొం దూనినన్‌
వెస నంటుం గద నీ భగస్థితి భయావిర్భూతభావంబునన్‌.

25

క.

అది చెడుట నీవు చెడుటయె
కద యెవ్వరు నిన్నుఁ దేఱి కనుఁగొనకయె న
వ్వుదు రొక కాసు నొసంగరు
తుది నీ బ్రతు కేమి యగునొ తోఁచదు నాకున్‌.

26


ఆ.

అనుచు బోధ సేయునట్టి మాయలమల్లి
బేసబెల్లి వగలవేసవెల్లి
నులిపి తెగులుబొల్లి నుల్లసిల్లెడు తల్లిఁ
జూచి యా బొజుంగుఁజోటి పల్కె.

27


క.

అమ్మా నా మానస మిపు
డమ్మానిసిఱేనిమీఁద నంటి వదల దిం
కిమ్మాడ్కిఁ జెప్ప చేటికిఁ
బొమ్మా మరుచేతికీలుబొమ్మా సరగన్‌.

28


క.

ధన మేమి బ్రాఁతి నా కది
ఘనమే ఘనమేచకప్రకటకచ వాఁడే
పెనుమేటిపెనిమిటి గదా
విను మే నిక్కంబు విన్నవించెదఁ దల్లీ.

29


ఆ.

పెల్లు కల్ల లల్లి బొల్లిమాటలఁ జల్లి
మెల్లమెల్ల నిల్లు గుల్లసేయు
తల్లి గలుగు లంకె నుల్లోలమతిఁ జేరు
పల్లవులకు సౌఖ్య మిల్ల జగతి.

30


క.

రమ్మంచును నమ్మించును
బొమ్మంచుం గోక లాగు పోఁకల్‌ రూకల్‌
క్రొమ్మించు సొమ్ము లెమ్మిం
దెమ్మంచును లాగు లంజె తెగి విటవరులన్‌.

31


సీ.

లఘువర్ణ గురువర్ణ లక్షణం బరయక
            సరసపదార్థముల్‌ సంగ్రహించి
వృత్తభంగమునకు వెఱపింతయును లేక
            గణనిర్ణయనిరూఢి ఘనత గనక

యపశబ్దములకు రోయక సంధివిగ్రహ
            ప్రాణహానివిచారపరత దక్కి
భావం బెరుంగక పండితోత్తములతోఁ
            గలయ నొల్లక మహాకపట మూని.


గీ.

యతులఁ బోనాడి మూర్ఖసంగతి వహించి
తిరుగు వెలబోటి జీవనస్థితి గణింపఁ
గుకవికృతకావ్యరూపానుగుణతఁ బూని
యరసి చూచిన నిస్సారమగును బిదప.

32


క.

లంజెయును బీఱకాయయు
ముంజెయు బాల్యమునఁ జాల మోహము గొలుపున్‌
రంజన చెడి ముదిసిన వెను
కం జూడరు ముట్టఁబోరు గద నరు లెందున్‌.

33


చ.

పలువలు చెంతఁ జేరి యొక పాతికనేబులు చేతికిచ్చి ఛీ
మొలఁగల బట్టవిప్పి తగ ముందుగఁ బాన్పున నుండి వార లే
పలుగుఁదనంపుఁ గూటముల బాధలు పెట్టిన నోర్చి పూనికన్‌
గులుకుచు నుండు నప్పడుపుకూటివెలంది కొలంబుపెద్దయే.

34


సీ.

పరధనాకర్షణప్రాంతంబు స్వాంతంబు
            వ్యర్థమాయావచోవ్యసనరచన
శఠవిటోచ్ఛిష్టాదిసదనంబు వదనంబు
            పలుబొజుంగులచొంగఁ బావి మోవి
పల్లనభయదకృపాణులు పాణులు
            కుటిలాఘవితతులకోపు చూపు
కృత్రిమగుణగణగేహంబు దేహంబు
            షిద్గసంఘంబుల సెజ్జ బొజ్జ.


గీ.

పంచసాయకరోగప్రపంచఘోర
యాతనాదూయమానప్రయాతవిటప
మదసలిలయుక్త మగు దోని మలపుయోని
కనుఁగొనఁగ వేశ్య హేయభాజనము గాదె.

35

తే.

ఇట్టి వేశ్యాకులంబున దిట్ట వైన
నీకు జనియించి యిన్నా ళ్ళనేకవిటులఁ
బలుతెఱంగుల బాధించి బహుధనంబు
గూర్చి తిఁక నిప్పడుపుఁగూడు గుడువ నొల్ల.

36


క.

పట్టి నని నన్ను దయఁ జే
పట్టి యతనిఁ దెచ్చి కూర్చి బహుభాగ్యంబుల్‌
గట్టిగఁ గొన నొల్ల వయో
కట్టిఁడివి గ దమ్మ లేచి కడ కటు పొమ్మా.

37


క.

మాతా జామాతపయిన్‌
బూతులపాఁతఱలు దీసిపోయుదు రటవే
ఖ్యాతా సద్గుణగణసం
ఘాతా పూతా విలాస కలనోపేతా.

38


మ.

చతురున్‌ బుణ్యజనున్‌ సదాగుణయుతున్‌ సౌందర్యశోభాసమ
న్వితునిన్‌ జింతలపాటివంశభవునిన్‌ నీలాద్రినామప్రజా
పతి ని ట్లూరక నింద సేసెదవు నా పట్టూనలే కయ్యయో
మతి దప్పెంగద నేఁడు నీకు జననీ మాయామయోద్యోగినీ.

39


క.

ఏలాగున నైనను నే
నీలాద్రినృపాలుఁ జేరి నెయ్య మెలర్పన్‌
లీలాలోలత నుండుదుఁ
జాలును నీలంజెజాతి సంబంధ మిఁకన్‌.

40


క.

అని తల్లిమీఁదఁ గనలుచుఁ
గనుఁగొనలను బాష్పవారి కడువడి జాఱన్‌
జని నిజశయ్యాతలమున
దను వొయ్యనఁ జేర్చి యతనిఁ దలఁచుచు నుండెన్‌.

41


క.

అత్తఱిఁ జంద్రిని జిత్తజుఁ
డత్తి మహోన్మత్తసాయకావళి క్రోధా
యత్తమతి నింప బెం పఱి
పత్త చిరిఁగి సిండవిఱిగి పడి మూర్ఛిల్లెన్‌.

42

ఆ.

ఆర్చి పేర్చి మారుఁ డారీతి నేచంగఁ
గూర్చి కూర్చి సాడుఁ గార్చుకొనుచు
మూర్ఛఁ దెలిసి తనదు ముంజేయి యోనిలో
దూర్చి యతనిఁగూర్చి దుఃఖపడుచు.

43


ఉ.

హా యతిసారసుందరతరాంచితవిగ్రహ! నిన్నుఁ జూచి నే
నాయతమోహపాశవశ నైతిని సన్నకసన్న నిప్పుడే
డాయఁగ వచ్చి నా భగతటస్ఫుటఘట్టితపంచసాయకా
మేయశిలీముఖచ్ఛటల మీటి రమింపుము నీలభూవరా.

44


క.

వారస్త్రీలకు మెచ్చగు
మారుండ వఁటంచు జనులు మఱిమఱి యెన్నం
గా రూఢిగ వినియుందు ను
దారవిరహతాప మార్పఁదగదే నీకున్‌.

45


క.

చూచినయప్పుడె పైఁబడఁ
జూచి మరులుకొంటి వారసుందరి నగుటన్‌
నీ చతురకార్యపద్ధతు
లే చొప్పున నొప్పు ననుచు నెంతయుఁ బ్రేమన్‌.

46


క.

వాచె మొగంబు భగంబును
నీ చరణము లాన యింక నీ విట నాకున్‌
గోచరుఁడవు గమ్ము వెసన్‌
రాచినృపకుమార వారరమణీమారా.

47


క.

వలరాజుచేత యాతన
బలువయ్యెను దాళఁజాలఁ బ్రత్యక్షుఁడవై
చెలిమిని రమింపు మిందున్‌
గులుకుచు నీలాద్రిభూప కోమలరూపా.

48


క.

చల మేటికి రాకొమరులు
బలువుగఁ జూడంగ నాదు పజ్జను వేగన్‌
గులు కొప్ప వచ్చి భగము బ
గల దెంగుము చండ్లు పట్టి కసి దీరంగన్‌.

49

క.

సొమ్ములు కోకలు రూకలు
తెమ్మని నినుఁ జిక్కుసేయ; దీకొని ఖరబం
ధమ్మున దెంగుము వడిగా
నమ్ముము పెక్కేల వారనారీలోలా.

50


క.

చలమేటికి రమ్మిఁక కో
మలరూప పిశంగనేత్ర మన్మథబాధల్‌
తలగంగ మనసుఁ దీరఁగ
బలువుగ దెంగంగ నాదు పజ్జకు వేగన్‌.

51


వ.

అని మహోన్మాదావస్థచే దేహస్వాస్య్థంబు లేక చీకాకు
పడుచు దుర్గంధబంధురంబై గొఱ్ఱెముక్కు వలె ననవరతంబు ద్రవించు
తన యుపస్థం జూచి యుపస్థతో ని ట్లనియె.

52


ఉ.

పమ్మినవేడ్వ వ్రాఁతపని పావడ పైకెగఁదీసివైచి చొ
క్కమ్ముగ గుద్దక్రింద నొక కమ్ములదుప్పటి నెత్తు వెట్టి మే
ఢ్రమ్ము నిగుడ్చి లోనికి దడాలున నంచులు మోయ దూర్చి నీ
తిమ్మిరిఁదీఱ వాఁ డెపుడు దీకొని తాఁకునొ యో త్రికోణమా.

53


ఉ.

ఎందఱు పొందుఁ గూడి విషయించిన నిర్ద్రవమై నితాంతమున్‌
కెందలిరాకుడాల్హొయలు గీల్కొనఁ బొంగుచు దెంగుమంచు లో
గందకఁ దీటతీఱక వికాసత నొందెడు నీకు దృప్తిగా
మందుఁడు నీలరా జెపుడు మగ్గమువెట్టునొ యో త్రికోణమా.

54


క.

ఆకా? పోకా? రూకా?
కోకా? మేకా? మఱేమి గొని యిచ్చెను తా
నీ కాతనితో నేపని
పూకా! యీకరణి నేల పొరలెద వయయో!

55


సీ.

తురకలమొడ్డలు దూదేకుమొడ్డలు
            గుల్లాపుమొడ్డలు గొల్లమొడ్డ
లాబోయమొడ్డలు యలకాపుమొడ్డలు
            చాకలిమొడ్డలు సాలెమొడ్డ

లబిసీలమొడ్డలు పబువులమొడ్డలు
            బాపనమొడ్డలు భట్లమొడ్డ
లింగిలీజులమొడ్డ లీడిగమొడ్డలు
            పీంజారిమొడ్డలు బేస్తమొడ్డ.


గీ.

లెన్ని దూరించి దెంగిన నించు కైన
జడియకుండెడిదాన వాశ్చర్య మిపుడు
నీలనరపతి చచ్చుమొ డ్డేల నీకు
కాంక్ష గైకోకు మో దోసకారి పూక!

56


ఆ.

త్రుళ్ళిపడియె దేల చిల్లిలోపల వాని
చుల్ల వెట్టి నిన్ను గిల్లికొనుచు
నల్లిబిల్లి దెంగ నుల్లసిల్లెదవు నీ
రుల్లిపాయచాయ గొల్లికాయ.

57


వ.

అని మఱియు మనోజాతనిశాతచూతసాయకవ్రాతఘాత
యాతనాధూతచేతోరవింద యై, కంది కుందుచుఁ, గొందలంబందుచు,
వైవర్య్ణంబుఁ జెందుచుఁ, బాన్పుపయిఁ బడుచు, బొరలుచు,
లేచుచు, వంగుండుచుఁ, దొంగుండుచు, దెంగుండు దెంగుం డనుచు,
వెక్కివెక్కి యేడ్చుచు, వెడవెడం గన్నులు తేలవేయుచు, విహ్వ
లించుచు, విసువుచు, విన్నంబోవుచు, వీణం బాణుల ముట్టక, బట్ట
కట్టక, బోనంబు మెసవక, సురాపానంబు సేయక, ప్రాఁతబొజుంగులం
బలుకరింపక, నాయాసంబు పొందుచు, నారాటంబునం గుందు
చుఁ, జింతించుచుఁ, జేతులు పిసికికొనుచుఁ, జిన్నబోవుచు, సీత్కా
రంబు సేయుచుఁ, జిడిముడి వడుచుఁ, జీకాకు నొందుచుఁ, జెమ్మటలన్
దోగుచుఁ, బలవరించుచుఁ, బండ్లు కొఱుకుచు, బైలు కౌఁగిలించుచుఁ,
బరవశం బగుచు, బెంగ కొనుచు, బిసరుహాంబకుం దిట్టుచు, బిరబిర
శరీరం బెఱుంగక మరుమందిరంబునం గిరికొని గాఢంబులై వంకరలై
వరలు నిడుదసొగ హొరంగు మెఱుంగు వెండ్రుకలు దెగలాగి పాఱవై

చుచు, నలుదిక్కులు కలయం జూచుచు, నవ్వుచు “హా! నీలాద్రి నర
పాలపుంగవా! వచ్చితే!” యని లేచి “నా కుఱువుపయిం గూర్చుండు”
మనుచుఁ, బరిపరివిధంబుల మతిదప్పి, వెఱ్ఱిగొనిన వేఁపి తెరంగున,
నాలి సాలెపురువు చందంబున, మగ్గంబులో నాడెడి నాడెకైవడి,
మధుపానంబు చేసిన వానరంబుపోలిక, మావి కఱుచు నక్కటెక్కునఁ,
బిడుగు మొత్తిన జనునిచందంబున, మూఁగలాగున, ముల్లెపోయి
పొరలు ముండవిధంబున, ముక్కుచు, మూల్గుచు, ముఱికిపిత్తులు
పిత్తుచు, మూఁకుడువంటి మూత్రద్వారంబు మొగి విప్పుచు, ముడుచుచు,
మొగంబు దిగవైచుచు, మూర్ఛిల్లుచుఁ, దెలియుచు, మోహదాహాతి
తాపంబునం దల్లడిల్లుచుండె; నయ్యవసరంబున.

58


క.

వేంకటసాని కి దంతయుఁ
గింకరు లెఱిఁగింప, దుఃఖకీలితమతి యై
కొంకుచుఁ గూఁతురి నునుప
ర్యంకము చేరంగఁబోయి హా హా యనుచున్‌.

59


తే.

బిడ్డరో నీకు మునుపుండు నడ్డగరలు
పెక్కుమాఱులు తగిలిన స్రుక్కకీవె
మాన్పుకొంటివి యిటువంటి మమత నాఁడు
కలుగదయ్యెను వట్టి దుష్కర్మ మొదవె.

60


క.

ఆరయ నీలనృపాలుని
పేరును బెంపేమి? యతని పెద్దలు మున్నే
తీరున నుండిరి? యీ సిరి
వీరాగ్రణి విజయరామవిభుఁ డొసఁగెఁ గదా!

61


తే.

ఇంతెకాని, జమీందారుఁ డే యతండు?
పరమమూర్ఖుండు బహులోభి పాపచిత్తుఁ
డాత్మదాసీరతుఁడు వాని కాస చెంద
నిహపరసుఖంబు లేదు నీ దేటి వలపు?

62

ఆ.

ఎదురు వెట్టి వేడ్కఁ జదరంగ మాడెడు
పగిది నీకుఁ గల్గు పడుపుఁగూటి
సొమ్మొసంగి చేరరమ్మన్నఁ గైకొను
నట్టివాఁడు ముద్దుపట్టి వినుము.

63


సీ.

పండ్లు తోమఁడు గుదప్రక్షాళనము సేయఁ
            డమవసనాఁ డైన హరిదినంబు
నం దైనఁ గడు నూరబందిమాంసము లేక
            కూడు భుజింపఁడు గురుముఖంబు
గాఁడు తమ్ములఁ జేరనీఁడు సత్కవులకు
            వైశ్యుల పెండ్లిండ్లవలన వచ్చు
కట్నముల్‌ తా దురాగ్రహమున లంకించి
            లంజెల కిచ్చును లజ్జమాలి.


గీ.

వినయమునఁ దండ్రి తద్దినమునను విప్రుఁ
బిలిచి యొకకాసు తవ్వెడు బియ్య మీఁడు
పతితుఁడును లోభి చింతలపాటి నీల
రాజు, ఛీ ఛీ యతనిమీఁద మో జదేల?

64


ఉ.

పూచిన శాల్మలీద్రుమముఁ బోలిన లోహితదీర్ఘదేహమున్‌
గాచసమానపీతరచిఁ గ్రాలెడు కొంచెపుఁ గన్నుదోయి జ్యే
ష్టాచపలాక్షి వ్రేలెడు విశాలతరాస్యముఁ గల్గువాని సం
కోచములేక చూచి వలగొంటివె? వారవధూశిరోమణీ.

65


క.

సానులకు గబ్బిబెబ్బులి
పూని కనుంగొనినవాఁడు పోనీఁడు గదే
హాని యొనరించు హా! రతి
కూన! సరగఁ బాఱిపొమ్ము కొట్టామునకున్‌.

66


తే.

నల్లమందును గంజాయి కల్లుఁబోతు
పిచ్చుకల మెక్కి నిను వాఁడు పిత్త దెంగు
పత్త చినిఁగిన విడువఁడే పాపి వాని
దుడ్డువలె నుండు మొడ్డపై దుంగ లెత్త!

67

క.

కుత్తయు పత్తయుఁ జినఁగగ
మొత్తును మత్తిల్లి నీదు మొడ్డకు దండం
బొత్తకు మని వేఁడిన వినఁ
డత్తులువబొజుంగు వాని కాసింతు రటే?

68


క.

పాపి విను వట్టియాసలు
చూ పియ్యఁడు డబ్బు లంజెసొమ్ము భుజించున్‌
పాపాత్ముఁడు పశుకర్ముఁడు
మా పని రే పని భ్రమించి మగ్గము నెట్టున్‌.

69


క.

పిచ్చలు వడివడి రాయఁగ
గుచ్చులు మెయ్యంగ వాఁడు గొనకొని తాఁకున్‌
గచ్చంత పగిలి సలుపుచుఁ
జచ్చేవే చంద్రరేఖ సాంద్రసురేఖా.

70


క.

పెద్దల నెఱుఁగఁడు మాటలఁ
బద్దులు పచరించు గర్వి భామ కురతిలో
నెద్దువలె మెలఁగు నీ కా
బుద్ధి వలదు మాను మమ్మ పుత్తడిబొమ్మా.

71


క.

ఖలుఁడైన నీలనృపుఁ డీ
యిలపై నిన్నాళ్ళు బ్రతుకునే నరసాంబా
గళకలితకనకమయమం
గళసూత్రోత్కృష్టమహిమ గాక కుమారీ.

72


తే.

రొక్క మిచ్చెడు విటుఁ జూచి దక్కినట్లుఁ
దక్కుచును బొల్లిమాటలఁ దనుపుఁ; గాని
నిక్కముగ మానసం బీయ నిశ్చయించి
వారకన్యక యీరీతి వలచు నటవె?

73


క.

ఎక్కడి నీలాద్రినృపుం
డెక్కడి యడియాస వలపు లివి కూడ విఁకన్
గ్రుక్కినపేను తెఱంగునఁ
గిక్కురుమనకుండఁ జనుము గేహంబునకున్‌.

74

వ.

అని వినయవిస్రంభగంభీరసంరంభంబులు గుంభింప పలుక,
నచ్చిలుకలకొలికి కంతకంతకు వింతవింతలుగ దురంత నితాంత విప్ర
లంభ వేదనాభరంబు భరింపరాకుండ కరంబు దళంబుగా బరవశ
త్వంబు నొంది మారుమాటాడ నోడి, ఓడిన కోడి చందంబున
తల వ్రేలవైచుకొని, కదల మెదల నేరక కన్నులు మూసికొని, యూరక
శరీరంబు నీరు విడువ శయ్య నొయ్యన వ్రాలి తూలం కనుంగొని
బెంగను లొంగి దుఃఖాంభోధి మధ్యంబున మునింగి కన్నీరు లేఱులై
పారి వెల్లివిరియ డిల్లపడి తల్లడంబున నుల్లంబవియ మెల్లమెల్లన
నప్పల్లవ మనోభూతంబున కాతతగతి చల్లనిపనులు సేయందలంచి
తన దాసికాజనంబులుం దానును దాని నిజశయ్యాతలంబునం జేరి.

75


సీ.

భగమధ్యమున మంచిచిగురుప్పుఁ గూరించి
            పైఁ గొండనల్లేరు ప్రస్తరించి
లంబస్తనప్రదేశంబున రేవడి
            దూలగొండిచిగుళ్ళు గీలుకొలిపి
కన్నులలోన నర్కక్షీరములు నించి
            ముక్కుగూండ్లను ఆవముద్ద లుంచి
వీనులలోపల వేఁడినూనియ పోసి
            నాలుకఁ జెముడుపా ల్చాలఁ బొడిచి.


గీ.

మేన ఱాసున్న మెంతయు మెత్తి, నెత్తి
గొఱిగి, నిమ్మపులుసు గంట్లఁ గ్రుమ్మి, లోని
కిముడ నేపాళము లొసంగి యిట్లు శిశిర
కృత్యములు సేయ, అప్పు డక్కితవవనిత.

76


క.

బడబడఁ బిత్తులు పిత్తుచు
బడిబడి బహుభంగి మీఱఁ బాఱుచు మరి తా
నొడ లెఱుఁగక పెనుమూర్ఛం
గడు సోలఁగఁ దల్లి కాంచి కటకటపడుచున్‌.

77


ఉ.

వేంకటసోమయాజి కిది వేగ మెఱుంగగఁ జెప్పకుండినన్‌
గింక వహించి దుఃఖపడుఁ గేవల మాతఁడె దీనిఁ గన్నవాఁ

డిం కిట నుండ నేల యని యేడ్చుచు నాతనిఁ జేరి యంతయున్‌
జంకక చెప్ప నాతఁడును సంభ్రమదుఃఖభయార్ద్రచిత్తుఁ డై.

78


తే.

వెఱ్ఱిలంజెవు, కా కున్న విషమబుద్ధి
శిశిరకృత్యంబు లీ రీతిఁ జేతు వటఁవె?
చల్లయును నన్నమును బెట్టి నల్లమందు
లోని కిప్పించి చేయింపు తాన మిపుడె.

79


క.

ఈ చందంబునఁ జేసిన
నీ చిన్నది బ్రతుకు నిపుడు నిక్కము దానిం
జూచెద ననఁ గ్రతు పూనితి
నీ చోటుం దరలి రాఁగ నిది చెడునుకదా.

80


ఉ.

చన్నుల జందనం బలఁది జానుల నంటిచిగుళ్ళు గప్పి వా
ల్గన్నులఁ గప్పురంపుఁ గలికం బిడి బాహువులందుఁ బొందుగా
దిన్నని తూండ్లు జుట్టి నునుదేనియ మోవిని జిల్క వేగమే
చిన్నది తెల్వినొందు నిక చిత్తములో వగఁబూన నేటికిన్‌.

81


క.

అది లెస్సగ ను న్నంతట
ముదమున నీలాద్రిరాజు మోహంబున నీ
సదనమున కరుగుదెంచును
పదపడి మన కిరువురకును భాగ్యము లిచ్చున్‌.

82


క.

వస్తాఁడు నీలభూపతి
తెస్తాఁడు ధనంబు నీ కతిప్రమదముగా
నిస్తాఁడు విరహవేదనఁ
జస్తాఁడా? నమ్ము మదిని సందియ మేలా?

83


ఆ.

అనుచుఁ దెలియఁజెప్ప నామోదహృదయ యై
సరగ నరిగి యట్లు సలుపఁ జంద్ర
రేఖ రేఁగుఁబువ్వు వైఖరిఁ దెల్విచే
వలపు గులకరింప నలరుచుండె.

84


క.

నీలాద్రి నృపుండచ్చో
సోలుచు విరహానలార్తి స్రుక్కి వగచుచున్‌

జాలిం బొందుచు నేడ్చుచు
వాలారుచు నింక నేటి వల పనుకొంచున్‌.

85


సీ.

దాని జానగు యోనిలో నటింపని మహో
            ద్దండదర్పితకామదండ మేల?
దాని కోమలసుధాధరము గ్రోలని మధు
            రసరుచివ్యాలోలరసన యేల?
దాని లంబస్తనతాడనం బబ్బని
            వరకవాటోపమవక్ష మేల?
దాని జానుయుగమర్దనము సేయని దీర్ఘ
            దర్వీసమానహస్తంబు లేల?


గీ.

దాని నిర్భరమధుమదాహీనదేహ
గాఢపరిరంభసంభోగకలన లేని
భూరివిస్తారశాల్మలీభూజతుల్య
పుష్టియుతఘనమద్దేహయష్టి యేల?

86


క.

దానిని మక్కువఁ దొడపైఁ
బూని కనుంగొనని రాజభోగం బేలా?
యీ నెఱవయ సేలా? యని
మానని చింతాభరమున మఱుఁగుచు మఱయున్‌.

87


ఉ.

చందురుకావిపావడయు సైకపుబంగరువ్రాఁతచీరయున్‌
ముందల కుచ్చుగచ్చు తెలిమొగ్గలకంచెల మించు చేమపూఁ
గుందనపుంగడేలు వగగుల్కెడి క్రొమ్ముడి పట్టుబొందు సొం
పందెడు దాని మేనిసొబ గద్దిర! నామదిఁ గొల్లలాడెడిన్‌.

88


వ.

అని దురంతచింతాక్రాంతస్వాంతుండై.

89


సీ.

గ్రుడ్లు త్రిప్పును బండ్లు కొఱుకును మూల్గును
            నీల్గును మిగులఁ గన్నీరు నించు
నసురుసురను పింగు పిసికికొనును నోరు
            మోఁదుకొనున్‌ “లంజెముండ యిచటి

కేల వచ్చెను? దాని నేల చూచి విరాళి
            చెందితి?” ననుకొనుఁ జెడితిఁ బడితి
నెవ్వరిఁ బంపుదు? నే రీతి నది వచ్చు?
            నేమి సేయుదు? వైన(దైవ) మిట్లు వెతల.


గీ.

పాలుగాఁ జేసె సాటి నృపాలకోటి
లోన నగుఁబాటు లయ్యెఁ గా లూనరాని
విరహపరితాపభరమున వేఁగఁ దరమె?
యంచుఁ బలవించుఁ దలవంచు నార్తిగాంచు.

90


సీ.

తములంబు తినఁడు బోగమువారి నాడింపఁ
            డన్నంబు కుడువఁడు సన్నవన్నె
కోకలు కట్టఁడు(గల్లఁడు) కొలువుఁ గూర్చుండఁడు
            జలక మాడఁడు గంద మలదు(గంప మలఁచు)కొనఁడు
వేపులతోఁ దాను వేఁటకుఁ బోవఁడు
            నడు(ను)పుకత్తెలఁ గూడి నవ్వుకొనఁడు
వేంకటముఖి యజ్ఞవిధిఁ గనుంగొనఁడు భా
            గవతుల వేషవైఖరులు గనఁడు.


గీ.

కటకటా! చంద్రరేఖావికటకటాక్ష
వీక్షణాక్షీణవాతూలవిజితదేహ
బాలభూరుహుఁ డగుచున్న నీలనృపుఁడు
పరవశత లేచి వనలతాతరులఁ జూచి.

91


క.

కమ్మవిలుకాని తూ పన
నమ్మఖశాలాంగణమున నగపడి చనె నో
యుమ్మెత్తకొమ్మ! నీవా
క్రొమ్మెత్తని మేనిసానికొమ్మం గనవే.

92


క.

వింటివొ లేదో శునకపుఁ
దంటెమువలె బిఱ్ఱబిగిసి తలఁగని వలపుం
గొంటిని గనినది మొదలుగ
తంటెపుమోకా! యి దేమి తబ్బిబ్బో కా?

93

ఆ.

కప్పువిప్పు గలుగు గొప్ప కొప్పలరారు
నప్పొలంతిఁ జొప్పు త్రిప్పుకిప్పు
డొప్పుమీఱ మీరు చెప్పరే గుప్పున
మెప్పు లిత్తు నుప్పితిప్పలార!

94


క.

మీ రింద ఱొకటి యై పొలు
పారం దిట మూనఁ బల్కి యతిరయమున నో
కోరిందడొంకలారా
సారేందుముఖీలలామ జాడ దెలుపరే.

95


క.

మారార్తి నెంత వేఁడిన
మా రాకడఁ దెలియఁజెప్పి మా ఱాడక యో
జోరీఁగలార మీ రా
నారీరత్నమును దెచ్చి నా కొసఁగరుగా.

96


క.

చింతలనాటి కులీనుఁడ
చింతాసంతాపచలితచిత్తుఁడ నిను నేఁ
జింతామణిగా నెన్నెదఁ
జింతా! యక్కాంత తెరువు చెప్పుము నాకున్‌.

97


సీ.

వ్రణకిణాంకితయోనిగణికాలలామ నా
            లోకింపరే తుమ్మమ్రాకులార
తుంబీఫలసమానలంబమానోరోజఁ
            బొడగానరేఁ బట్టకడుములార
యింగాళకంబళశృంగారతరకేశ
            పాశ నీక్షింపరే పాశలార
క్రకచదంష్ట్రాంకురాగ్రమృదుత్వసంయుక్త
            దేహఁ గానరె తిప్పతీఁగలార.


గీ.

ఉష్ట్రరదనచ్ఛదోపమానోష్టబింబ
నీడఁ జూడరె మీరు జిల్లేడులార
మర్దళసమానవిపరీతమధ్యచంద్రిఁ
గాంచరే నిక్కముగ నేఁడుగారలార.

98

ఉ.

పోడులమ్రోడులార కడుఁ బూచిన పీతిరితుమ్మలార బల్‌
బాడిదచెట్టులార ఫలభాగ్విషముష్టికుజంబులార యా
వేడుకకత్తె చిత్తమున వేడుక మీఱఁగ వేగిరంబు మీ
నీడకు నీడ కొక్కసరణిం బఱతెంచదుగా వచింపరే.

99


క.

బెండా మూర్కొండా యా
దొండా మీ యండ కిపుడు తోరముమీఱన్‌
దాండవ మాడుచు మేలిప
సిం డందెలచంద్రి రాదె చెచ్చెరఁ జెపుఁడా.

100


క.

నా కెదలోపల విరహము
చీకాగుగఁ జేయఁజొచ్చెఁ జెచ్చెర నిపు డో
కాకీ ఘాకీ కేకీ
పూ కీదగుమేనిసాని పొడఁ జూపరుగా.

101


క.

కృకవాకులార మాద్య
త్కృకలాపములార గవయ కిశశశశునీ
వృకజాతులార బోగపు
సకియలతలమిన్నఁ జంద్రిసానిం గనరే.

102


క.

ఉరుతాపకరణకారణ
వరతామరసాశుగములు వైచి మరుఁడు వి
స్ఫురితాంగిఁ జూపు మిపు డో
యుఱుతా మామాట సేయ నొప్పినఁ గొఱఁతా.

103


క.

పందీ నీ గాత్రసదృ
క్సౌందర్యకళావిలాసచంచన్మురజి
న్నందనమందిర యగు నా
యిందీవరపత్రనేత్రి నిటు చూపఁగదే.

104


క.

నీ తీరు గలుగు రూపము
చేతన్‌ విటకోటి నవయఁజేయుచుఁ గడఁకన్‌
బాతర లాడెడి పడుపుం
గోతిని వీక్షించినావె కోఁతీ ప్రీతిన్‌.

105

క.

కల్లు కడుఁ ద్రావి ప్రేలుచు
హల్లీసక మాడుకొనుచు నది యిచ్చటి కు
ద్యల్లీల రాదె బల్లీ
పిల్లీ కడు ముద్దుఁజిలుకు పిల్లలతల్లీ.

106


క.

నీలాద్రిరాజనాముఁడ
వాలెంబున దానిఁ జూచి వలచితి నేఁడా
స్థూలోపస్థాన్వితగణి
కాలలనన్‌ చంద్రరేఖఁ గంటివె ఖరమా.

107


వ.

అని మఱియును.

108


చ.

మనసిజమాయలం దగిలి మ్రాఁకులఁ దుప్పలఁ బక్షిజాతులన్‌
వనమృగకోటులం దలఁచి వారక యీగతి వేఁడి వేఁడినీ
రు నయనపాళి జాలుకొన రోదన మెంతయుఁ జేసికొంచుఁ బూ
చిన విషముష్టిభూరుహము చెంగట నీలశిలాతలంబునన్‌.

109


క.

చేరి కళేబర మచ్చో
చేరిచి హా చంద్రి నాకుఁ జెప్పక పఱవం
గారణ మేమి మఱెవ్వని
కోరిక దీర్పంగఁ దలఁచుకొంటివొ చెపుమా.

110


క.

కోకలు రూకలు నాకులు
పోఁకలు మేఁకలును బట్టుబొందులు సొమ్ముల్‌
నాకంటె మిక్కి లీగల
రాకొమరుఁడు గలఁడె యీ ధరావలయమునన్‌.

111


క.

చక్కనివాఁడ రభసమున
కుక్కుటమార్జాలశునకకూర్మరతులచే
చొక్కింపంగలవాఁడను
జిక్కులు వెట్టంగ నీకుఁ జెల్లునె చంద్రీ.

112


క.

రమ్మా నా యభిమత మిపు
డిమ్మా యిమ్మాడ్కి నేఁచ నేటికి హొన్నుల్‌

గొమ్మా సమ్మతి ని(నె)చ్చెదఁ
గొమ్మా వెలముద్దుగుమ్మ గుబ్బలగుమ్మా.

113


ఉ.

జాలము చేసి మారశరజాలము పాలుగఁ జేయ నాయమా
తాళఁగఁజాల నీ విరహతాపభరంబు కరంబు హెచ్చె నీ
తాళఫలోపమానసముదగ్రకుచద్వయ మక్కుఁజేర్చి లీ
లాలలితోపగూహనకళాకలనన్‌ సుఖియింపఁజేయుమా.

114


శా.

శోషించెన్‌ మదనోపతాపమున నక్షుద్రోన్నతస్థూలని
ర్దోషోద్యత్తనుయష్టి పుష్టిగను మందుల్‌ చేసినన్‌ గా దహో
రోషం బూనక నేఁ డపారకరుణారూఢాత్మపంకేజ వై
యోషిద్రత్నమ చంద్రి నీ యధరపీయూషంబు నా కీయవే.

115


క.

పెక్కుతెరంగుల నీకున్‌
మ్రొక్కెదఁ జల మేల నాదుమోహము తీరన్‌
జక్కెరవిల్తుని కూఁటమి
మిక్కుటముగ తేల్చి యేలు మీ దాసునిగాన్‌.

116


క.

మే లెంచెద సామ్రాజ్యం
బేలించెదఁ దొంటిసతుల యెల్లరకంటెన్‌
లాలించెదఁ బాలించెదఁ
దేలింపుము రతుల నన్నుఁ దేకువ మీఱన్‌.

117


క.

చక్కెరవిల్తుని బారిన్‌
జిక్కితి నీ పాదయుగకుశేశయములకున్‌
మ్రొక్కితి దక్కితి నిఁక నీ
తక్కులు దిగఁద్రొక్కి నన్ను దయఁ జూడఁగదే.

118


తే.

గంధమత్తరుజవ్వాదికస్తురియును
దొడ్డయొడ్డాణమును గమ్మదోయి క్రొత్త
పట్టుచీరలు కుచ్చుల బావిలీలు
రొక్క మిదె(వె) గొమ్ము నీ లంజెటక్కు మాని.

119


తే.

తాళఁజాలను నీ వింత జాల మేల

చేసెదవు నన్ను మిక్కిలి చెలిమి రతుల
నేలు మీ వేగ మా టాడి ఫాలలసిత
సరసనవచంద్రరేఖ యో చంద్రరేఖ.

120


ఉ.

తియ్యని మొద్దుమాటలును దేనియ గాఱెడు బొల్లిమోవియున్‌
బయ్యెదకొంగులోఁ బొదలు బల్చనుగుబ్బలు మంగలంబుతోఁ
గయ్యముసేయు మోము నులిగన్నులు తోరపుఁగౌను నాకుఁ జూ
పియ్యడ మారుకేళిఁ గడు నేలుము జాలము సేయ కింతయున్‌.

121


మ.

అమలం బై తరుణారుణద్యుతిసమేతాశ్వత్థపత్రాభ మై
రమణీయస్ఫుటదీర్ఘలింగయుత మై రంగద్ద్రవోపేత మై
సమ మై రోమవిహీన మై వెడద యై జానొప్పు నీ మారగే
హము నా కర్మిలిఁ జూపి ప్రౌఢరతి నోల్లాడించు చంద్రీ దయన్‌.

122


వ.

అని మఱియును.

123


ఉ.

హా యనుఁ జంచరీకనిచయాంచితకుంచితరోమకామగే
హా యను దానమానితమహాద్విపమోహనమోహనైకబా
హా యనుఁ గంకకాకమహిషాశితదుర్భరనిర్భరాతిదే
హా యనుఁ జంద్రి తాళ నహహా యనుఁ భీతశిరోరుహా యనున్‌.

124


ఉ.

డాయఁగ రాకు నన్ను మరుడా యను నేఁచగ నేల రిక్కఱేఁ
డా యను వద్దువద్దు చనుడా యను సోఁకక పొమ్ము గాలిపీ
డా యను చంద్రితల్లి వఱడా యను వేంకటశాస్త్రి నేఁడు రాఁ
డా యను కూఁతుఁ గూర్పఁ దగఁడా యను నేగతి దేవుఁడా యనున్‌.

125


క.

ఆకరణి నుడివి డేరా
మేకువలెన్‌ బిఱ్ఱబిగిసి మిట్టిపడు నిజా
స్తోకసుమకామదండముఁ
జేకొని చీకుచును బుద్ధిఁ జెప్పఁ దొడంగెన్‌.

126


ఉ.

చాపలమోపు చంద్రి నిను జక్కఁగఁ జక్కెరవింటిదంట పెన్‌
గాపురపింటిలోపలికిఁ గ్రక్కున దూరి సుఖింపకుండ సం
తాప మొనర్చి యేఁగె నటు తాళు మటన్నను దాళకేల యు
ద్యాపనశక్తిఁ జూపెదవు దండము నీకు మనోజదండమా.

127

ఉ.

గచ్చులు మచ్చు లచ్చెరువుగా గడలన్‌ వెదఁజల్లు చంద్రి బల్‌
పచ్చనిఱెక్కదోయి గల పక్కిహుమాయివజీరునింటిలోఁ
జొచ్చుచు వచ్చుచున్‌ మిగులఁ జొక్కుచుఁ గ్రీడ యొనర్చుచుండగాఁ
నిచ్చలు దృప్తి జేసెదను నిల్వవె కొంచెముసేపు దండమా.

128


ఉ.

పెక్కుతెఱంగులం గరనిపీడన మే నొనరించి వంచినన్‌
స్రుక్కక మిట్టిమిట్టి తలఁ జూపుచు సన్ననిపంచెఁ జించుచున్‌
మొక్కలపాటుఁ జూపెదవు మున్నుఁ ద్రికోణము లెన్ని చూపితిన్‌
మ్రొక్కెద నిక్కు మాను మతిమూర్ఖమనోభవదీర్ఘదండమా.

129


ఉ.

కాయలు గాచె నీదు తలకాయ యహా సుకుమారవారక
న్యాయతకచ్ఛపోపమభగాంతరనిత్యగతాగతక్రమో
ఛ్రే(ధ్రే)యసమగ్రఘట్టనవిశేషతరావద నైన నింక నో
కాయజదండమా విసువుఁ గైకొని యూరక నుండలేవుగా.

130


ఉ.

పంకము లంటె నాకు బహుభంగుల నీ కతన న్విలాసవ
త్పంకజపత్రనేత్రలను బల్మినిఁ బట్టఁగఁ దద్విశాలమీ
నాంకగృహాంతరాళభరితాత్మజలప్లుతపాంశుసమ్మిళ
త్పంకము నీకు నంటెఁ గద పాపపుమేఢ్రమ యిట్లు సేతురే.

131


ఉ.

ఎందఱి వేఁడుకొంటి మఱి యెందఱి పాదము లంటుకొంటి ముం
దెందఱి నాశ్రయించితి నిఁ గెందఱికిన్‌ బ్రణమిల్లఁ జేసెదో
కొందల మందెడి న్మనసు గొబ్బున నా మన వాలకించి యా
బందెలమారి చంద్రి భగభాగ్యము గోరకు మారదండమా.

132


సీ.

కమలపత్రస్ఫూర్తిఁ గనుపట్టు భగములు
            మించుటద్దమ్ముల మించు భగము
లశ్వత్థపాండుదళాకారభగములు
            పనసతొనలఁ బోలు ఘనభగములు
దింటెనపూవులవంటి భగంబులు
            నీతగింజలరీతి నెసఁగు భగము
లలపందిముట్టెలవలె నుండు భగములు
            కాకిపిల్లలనోళ్ళగతి భగములు.

గీ.

పెక్కు జూపితి నీవును నిక్కుకొనుచు
నన్ని లొడవెట్టి వెడలితి వకట యిపుడు
చంద్రిభగ మేమి భాగ్యమా సైపుమా ము
డుంగులింగమా చాలపొడుంగు మాని.

133


క.

తులువలు వడివడిఁ దాకఁగ
లలిఁ జినిఁగిన పూకు దెంగులకు వెఱచునె నీ
తల బ్రద్ద లగును దానిం
దలఁచి నిగుడఁబోకు మదనదండమ యింకన్‌.

134


సీ.

కొం కేది బానిసగుడిసెలు దూఱుట
            పరికించి చూడ నీకొఱకుఁ గాదె
బత్తిని దొమ్మరితొత్తుల నిల్పుట
            గొనకొనియున్న నీకొఱకుఁ గాదె
గోడిగలను గొని గూడులఁ గట్టుట
            కొంచ కెంచంగ నీకొఱకుఁ గాదె
బాలవిధవలకు నోలి మాన్యము లిచ్చు
            టరసి చూడంగ నీకొఱకుఁ గాదె.


గీ.

వారకన్యకలకు నే నవారితముగఁ
గోకలును రూక లిడుట నీకొఱకుఁ గాదె
కూళతన మూను టెల్ల నీకొఱకుఁ గాదె
యో మకారోత్వమా శాంత మూనుకొనుమ.

135


ఉ.

తేనియకంపు పెంపు గల తేజము ఝల్లునఁ బెల్లువారగా
గోనెలలీలఁ దేరు చనుగొండలు సిండయుఁ దాండవింపఁగా
గానుఁగఱోలు బోలు మెయి కంపిలఁ బైకొని మేఢ్రదండమా
దాని పకారకొమ్ము వెడ దాఁకఁగ వ్రక్కలు సేయు టెన్నడో.

136


ఉ.

కుక్కుటచూళికాభగనగొల్లి నఖంబుల గిల్లి మెల్లనే
చొక్కపు మన్మథాలయము జుంబన మెంతయుఁ జేసి దానిలో
గ్రక్కున మోవి దూర్చి వగ గైకొని పీల్చినఁ జంద్రి మిక్కిలిం
జొక్కి రమింప నిచ్చుఁగద సొంపుగ నో లవడా తడాలునన్‌.

137

శా.

ఆ భూతాకృతి చంద్రి సాంద్రతరరోమాంచత్రికోణంబులో
ఆభోగస్ఫుటచండతాండవమహావ్యాపారకేళీకలా
లాభం బందెద నంచు నిక్కినను నేలా సారె గారించెదో
శేభస్తంభమ దాని పొం దెటువలెన్‌ సిద్ధించు నీ కిత్తఱిన్‌.

138


ఉ.

గొల్లెనకంభ మంత నిడుగొల్లి చొకారపు నల్లతీగెల
ట్లల్లికఁగొన్న రోమములు నద్రిగుహోపమ మౌ బిలంబునన్‌
దెల్లని కొఱ్ఱగంజి పస మించు ద్రవంబును గల్గు చంద్రి మా
రి ల్లెపు డీవు సొచ్చెదవొ హెచ్చరికన్‌ బహుదీర్ఘశిశ్నమా.

139


ఉ.

నీచత కోర్చి బంధుజననిందకు రోయకఁ దొల్లి గార్దభిన్‌
జూచియు నీవు మిట్టిపడఁజొచ్చిన నీ చపలంబుఁ దీర్పఁగా
లోచితవృత్తిఁ గైకొనియు నొద్దిక మీఱఁగ దాని యోని దూ
రించినవాఁడఁ గాదె నిను రిత్తగఁ జేయక నాదు మేఢ్రమా.

140


చ.

వినువిను వద్దువద్దు యవివేకముఁ బూనకు చంద్రిపూకుపై
మన సిడ కంచుఁ జెప్పినను మానక మిట్టిపడేవు జొచ్చినన్‌
ఘన మగు పుండ్లునున్‌ సెగయు గడ్డలు నంటి చెడేవు మానుమీ
యనుపమరూపనిర్జితమహాగజదండమ మారదండమా.

141


వ.

ఇ ట్లనేకప్రకారంబుల మనోవికారంబుచేతం జేతనాచేతన
జ్ఞానవిహీనుం డై యా నీలాద్రిరాజన్యశతమన్యుం డుద్దండంబుగ దండ
నుండి గండుకొని వచ్చు కుసుమాయుధవిధుమలయాచలసమాగత
వాతపోతమధువ్రతపరభృతకీరశారికావారంబుల గుఱించి దూషింపం
దొడంగె.

142


క.

మదనా మదనాశుగచయ
మదనా చెలరేఁగి యేయ నాతతశశభృ
ద్వదనామృదులోపస్థా
సదనా యెద నాటె నిపుడు శంబరమథనా.

143


తే.

సకలపూరుషహృదయార్తి సంఘటించు
సాని నీ చంద్రరేఖాభిధాన మూని

కేరుచున్నది దానిపైఁ గినుక మాని
తద్విరహి నన్ను నేఁచంగఁదగునె చంద్ర.

144


క.

ఫణిరోమరేఖ యగు న
గ్గణికాంగనమీఁదఁ బోవగా వెఱచి సమీ
రణమా మము నేఁచఁగఁ గా
రణ మేమి తలంగు సత్వరత సద్బుద్ధిన్‌.

145


ఉ.

మిమ్ము జయించు మించుగల మేలి నునుం బెనుగొప్పుచేతనే
మమ్ము మనోభవప్రకటమార్గణజాలముపాలు చేసి తాఁ
గి మ్మన కేగె దానిదరిఁ గేరరు చంపకగంధి యంచునో
తుమ్మెదలార మీ రిచట దృళ్ళెద రక్కట శౌర్యహీనులై.

146


క.

ఆ వెలపొలంతిఁ గని నేఁ
గేవలవిరహార్తిచేతఁ గృశియించెడిచో
నీవు చెవుల్‌ చిందఱగొనఁ
గోవెల కూయకుము నిన్నుఁ గొఱుతన్‌ వేయన్‌.

147


క.

పరపురుషార్థం బంతయు
హరియించును నేఁచు చంద్రి యంచితబింబా
ధర మాని సుఖింపక త
త్పరవశు నను నేఁచ నేమి ఫల మగుఁ జిలుకా.

148


తే.

అని అనివార్యమానమదనాపదచే సకలప్రపంచమున్‌
దనువును బేరునున్‌ మఱచి తన్మహనీయవియోగవార్ధిలో
మునుఁగుచుఁ దేలుచున్‌ బరమమూర్ఖతచేఁ బలవించుకొంచు అ
జ్జనవరపుంగవుండు కడుసత్వ్తము పెంపు దొఱంగి మూర్ఛిలెన్‌.

149


తే.

అనుచు శ్రీ నంబి నారసింహార్యవర్యుఁ
డాన తిచ్చిన శివభూసురాగ్రగణ్యు
డైన వీరన విని యద్భుతాత్ముఁ డగుచు
బిదప కథఁ జెప్పుఁ డతులితప్రీతి ననుడు.

150


క.

మారాకారా కారా
గారాంతరవిహరణోగ్రకర్మఠ పారా

వారావృతధరణీతల
వారవధూజాల నిత్యవర్ణితశీలా.

151


మాలిని.

హరిగుణగణఖేలా యంగజవ్యాధిలోలా
పరిచితవిటజాలా బాలరండానుకూలా
నిరతరచితజాలా నీచదాసేయపాలా
దురితచయవిశాలా దుర్గుణౌఘాలవాలా.

152

గద్యము
ఇది శ్రీమజ్జగన్నాథదేవకరుణాకటాక్షవీక్షణానుక్షణసంలబ్ధసరసకవితా
విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల
పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూనసమాననానా
విధరనంగత్రిలింగదేశభాషావిశేషభూషితాశేషకవితావిలా
సభాసురాఖర్వసర్వలక్షణసారసంగ్రహోద్దామ శుద్ధాం
ధ్రరామాయణప్రముఖబహుళప్రబంధనిబంధన
బంధురవిధాన నవీనశబ్దశాసనబిరుదాభిరామ
తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశో
మేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథ
నామధేయ ప్రణీతంబైన చంద్రరేఖా
విలాపం బను హాస్యరసప్రబంధ
రాజంబునం ద్వితీయా
శ్వాసంబు
సంపూర్ణము.