కాశీమజిలీకథలు/పదవ భాగము/226వ మజిలీ

వికీసోర్స్ నుండి

ప్ర - సొమ్మెంత యీయవలయునో చెప్పుము.

కో -- మీకుఁ దోచినంత యీయుఁడు గొప్పోరు. మీకడ బేరములాడుదునా రేపు వెండియువచ్చి సొమ్ము పుచ్చుకొనియెద నీ రాత్రి వీనినెల్ల మీ చిలుకలకుఁ గట్టుఁడు.

ప్ర - సానీ! మంచిమాట చెప్పితివి. రేపుపెందలకడ రమ్ము. నీతోఁ జాల ముచ్చటింప వలసియున్నది. నీనిమిత్తము ఈభద్రికనుద్వారము కడ నిలిపెదను. నీవు రేపురాకున్న నీకే నష్టముసుమీ!సొమ్ముచేరదు.

కో — మీకొఱకువత్తునా తల్లీ ! ఈరాత్రి మువ్వలఁ జిలుకలకుం గట్టి యెట్లుపలికినదియుఁ బ్రొద్దున జెప్పవలయుంజుడీ. ఇఁక ననుజ్ఞయిండు పోయివచ్చెదనని లేచి బుట్ట జంకనిడుకొని చిలుకను ముద్దాడుచు భద్రిక గోటగుమ్మముదనుక సాగనంపి తప్పక రేపు ప్రొద్దున రమ్మని చెప్పుచుండ వల్లెయని పలుకుచు వీధింబడి పోయి పోయి బాటసారులు నివసించు నూరిబయలునున్న పెద్దసత్రమునకుం జని యందొకగదిలోఁ బ్రవేశించి తననెత్తిపైనున్న చిలుక కేదియో యోషధి తగిలించినది. అది యంతలోఁ జక్కనిపురుషుండై నిలువంబడినది. అకోయత తానుగావించిన పనులన్నియు నాపురుషున కెఱింగించుచు నారాత్రిఁ తృటిగా వెళ్ళించినది.

___________

226 వ మజిలీ.

చిలుక పురుషుడైనకథ

కోయది యఱిగినవెనుక రాజపుత్రిక భద్రికతో దానియందమునుగుఱించి ముచ్చటించుచు మాటలు వర్ణించుచు సాహసము నభినందించుచు నిర పేక్షిత్వ మగ్గింపుచుఁ బైడిమువ్వల విమర్శించి అవి కేవలము సువర్ణముతోఁ జేయఁబడినవిగాఁ దెలిసికొని వెల తక్కువగా వేయుటకు శంకించుచుఁ బలువిధంబుల నాలోచించుచుండెను. మఱియు నాయూర నామెకుఁ గాళిందియు రుక్మవతి యను సఖురాండ్రిరువురుగలరు. కొన్నిమువ్వగుత్తులిచ్చి భద్రికను వారికడకుఁ బంపుచుఁ గోయదాని వృత్తాంతమంతయు జెప్పి యామువ్వల వారుపెంచుచున్న చిలకలకుఁ గట్టమనుము. అది వచ్చువేళకు వారింగూడ నిందు రమ్మని చెప్పుమని నియమించుటయు భద్రిక మువ్వగుత్తులందీసికొనిపోయి వారికిచ్చి యాసందేశ మెఱిఁగించినది.

ఈలోపల రాజపుత్రిక కొన్నిమువ్వగుత్తులఁ దీసికొని పంజిరమునొద్దకుఁబోయి యందున్న రామచిలుక నీవలకుఁదీసి ముద్దాడుచుఁ గీరరాజమా! నీకలంకారములు గొంటిమి తాల్తువా! ఒకపద్యము పాడుము. నీముద్దుపలుకులు విన వేడుకకలుగుచున్నది. ఎప్పుడు మౌనమే వహింతువు. అని పలుకుచు నామువ్వల మెడకును గాలికినిఁ గట్టుచుండ గుభాలున నాకీరము పురుషుండై నిలువంబడియె. రాజపుత్రిక జడిసికొని అమ్మయ్యో! అని యఱచుచు నేలంబడి మూర్ఛవోయినది.

ఆపురుషుం డాపూఁబోడిపాటు తెలిసికొని నలుమూలలు సూచుచు నయ్యో! ఈచిన్నది యెవ్వతియో తెలియదు. నన్నుఁజూచి వెఱచిపడిపోయినది. నేనిక్కడి కెట్లువచ్చితినో యెఱుంగను. ఈభవనము శుద్ధాంతమువలె నున్నది, మాసోదరులేమైరి. నేనిద్రబోయితినా. మేమాగిరికూటమెక్కి చెరువులో స్నానముచేసితిమిగదా. తరువాత నేమిజేసితిమో జ్ఞాపకములేదు. ఇది నాకు స్వప్న మాయేమి? నేను కళాభిరాముఁడనే అంతయు నీ కాంత నడిగెదంగాక. అని వితర్కించుచున్నంత నయ్యింతియు నొక్కింతసేపు మైమఱచి యట్టె లేచినది. అభినవమదనుండోయన నొప్పుచున్న యప్పురుషుంజూచి మోహపరవశయై హృదయము దృఢపరచుకొని నమస్కరించుచు నిట్లనియె. ఆర్యా! మీయాకారముసూడ నుత్తమవంశ సంజాతులవలెఁ గనంబడుచున్నారు. మీరీ చిలుకరూపు ధరించుటకుఁ గారణమేమి? మిమ్మెవ్వరైన శపించిరా? లేక విలాసమున కిట్టిరూపు దాల్చితిరా? కంతువసంతజయంతాదులలో నొక్కరగుదురని తలఁచితిని కాని మీ కన్నులుజూడ ననిమిషులుకారని తెలిసికొంటి. మీకులశీలనామాదు లెఱిగించి నాకు శ్రోత్రానందము గావింతు రే యని వినయముగా నడిగిన నతం డిట్లనియె.

పడతీ ! నావృత్తాంత మిదమిద్ధమని చెప్పుటకు నింకను నాకు బోధపడకున్నది. పిమ్మట జెప్పెదంగాక నీవెవ్వని కూఁతురవు. ఈ గృహ మెవ్వరిది? నేనిక్కడి కెట్లువచ్చితిని. నీపేరేమి? నీవృత్తాంతము జెప్పుమని యడిగిన నమ్మగున యిట్లనియె. సౌమ్యా! ఈనగరమునకు గిరివ్రజమని పేరు. మాతండ్రి పేరు సోమదత్తుఁడు. ఆయనయే యీదేశమునకధికారి. నా పేరు ప్రఫుల్ల యండ్రు. ఇది నాయంతఃపురము. రెండునెలలక్రిందటఁ గొండవాండ్రు, మూడుచిలుకలనమ్మఁదెచ్చిరి. అందు నేనొకటియు నాసఖురాండ్రు కాళిందీ రుక్మవతులిరువురు చెఱియొకటియు గొనినారము. ముద్దుగాఁ బెనుచుచు మాటలనేర్పుచుంటిమి. నేఁడొకకోయది పైడిమువ్వలుదెచ్చి వీనిఁజిలుకలకుగట్టినగట్టిగా మాటాడఁగలవని చెప్పియిచ్చిపోయినది. వానింగట్టినంతమీరీరూపముదాల్చితిరి. ఇదియే మీయాగమనవిధానము. తరువాతి వృత్తాంతమునకుమీరే ప్రమాణమని పలికి యూరకన్న నొక్కింత ధ్యానించి యతండిట్లనియె.

నాతీ ! నేనొక దేశాధిపతి కుమారుండ. నాపేరు గళాభిరాము డందురు. మే మేవురము సోదరుల ముత్తరదిక్కు జయింపబయలుదేరి పెక్కెండ్రరాజుల జయించితిమి. ఒకనాఁడొక పెద్దకొండగాలివిసరి గఱ్ఱములతోఁగూడ గొట్టకొనిపోయి యొకకొండయెక్కి యందలి తటాకజలఁబులఁ దీర్థమాడితిమి. అది స్వప్నయో నిజమో తెలియ కున్నది. మాసోదరుల మాట జ్ఞాపకములేదు. అదియొక యింద్రజాలమువలెనున్నది. నావృత్తాంతము నాకు లెస్సగాఁ స్ఫురణకు రాకున్నది. ఈశుకరూపము నాకెట్లువచ్చినదో తెలియదు. నేనాకొండవాని చేతి కెట్లు వచ్చితినో తెలియదు. కోయది యిచ్చిన మువ్వలు గట్టినంతనే నిజరూపము దాల్చుట చిత్రముగానే యున్నది. ఆపుణ్యాత్ము రాలెవ్వతియో తెలిసికొనవలయు. దానియునికి యెందున్నదియో చెప్పుము. పోయి తెలిసికొని వచ్చెదనని యడిగిన నమ్ముదిత ముదిత హృదయయై యిట్లనియె.

సౌమ్యా ! మీరందుఁ బోనక్కరలేదు. మాకు మువ్వలిచ్చి పోయిన కోయది రేపుప్రొద్దున యిక్కడికి రాఁగలదు దాని కింకను వీనివెల యీయలేదు. దానివలన మీవృత్తాంతము తెలిసికొనవచ్చును. అంతదనుక భద్రముగా మీరిందు వసింపుఁడు మీ కే కొఱంతయునుండదు. మీరు కళాభిరాములు గదా. అన్ని విధములఁ బూజ్యులే. మాయతిధిసత్కారములఁ గైకొనుఁడని పలుకుచు నపూర్వోపచారములచే నారాధించుచు సుధు రాలాపములచే నతనిహృదయము గరుగఁజేసినది. అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. తదనంతరోదంత మవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

__________

227 వ మజలీ.

చిలుకలుగుఱ్ఱములైనకథ.

మఱునాఁ డుదయకాలంబునఁ భద్రిక రాజపుత్రికయొద్దకు వచ్చి భర్తృదారికా ! రాత్రి నీదర్శనమే యైనదికాదే. లోపలగదిలో నేమిచేయుచుంటివి? ఆమువ్వలు తీసికొనిపోయి కాళిందీరుక్మవతుల కిచ్చితిని. తమచిలుకలకుఁ గట్టెదమని చెప్పిరి. మఱియు ఱేపా