కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/341వ మజిలీ

వికీసోర్స్ నుండి


గీ. సుందర సరోజకోమలం బందియున్న
    కరమిదేలను లాఁగికో గడఁగె దబల
    చిరతరాపేక్ష నోకిందు దొరకె దీని
    నెట్లు విడతునొ చెప్పుమా యిందువదన?

ఇంతలో నబ్దినీపలాశపుటంబున నీరుగొని యతివేగంబున నేతెంచు తారావళి దూరమునుండి యా రాజేంద్రు నీక్షించి యమందానందకందలితహృదయారవిందయై వారికలయిక కభినందించుచుఁ బెద్దయెలుంగన నోహో ! సమస్తజగదాజీవనైక కారణు లగు దేవర యేకాకియై యెచ్చటినుండి యెట్లిచ్చటి కెందుల కేతెంచితిరో యెఱుంగ గోరుచున్నావని సవిస్మయోద్ద్రేకంబునఁ బ్రశ్నించుచుఁ దాఁ దెచ్చిన నుదకంబు మంగళ ప్రదంబుగ వా రిరువురిమీఁద జిలికెను. రాజును ముదమందుచు విశ్వభూతి శిష్యురాలు తనసమీపమున కేతెంచినది మొదలు జరిగిన నిజవృత్తాంతమెల్ల నామెకు దెలియఁజేసెను.

341 వ మజిలీ

ఇంతలో నాకసమునుండి పడిన పిడుగు చప్పుడువలెఁగఠోరమై యసుర సంహారసంరంభకుపితయగు కాత్యాయనీదారుణహుంకారమువలె భయంకరమై, యక్ష వధప్రధావితుండగు పవననందనుండొనర్చు కిలకిలారావములవలె భాసురమై, శత్రువర్గము నురుమాడునప్పుడు బీముండొనర్చు సింహనాదంబువలె భీకరమై ప్రతిశబ్ది తాద్రికందర సరోవరమై, యాకులీభూతసకలజలసత్వమై, యుత్రాసితవనశకుంతమై యొప్పు భయంకర హుంకార మొనర్చుచు, బ్రహ్మాండమండలమున కెల్ల వణఁకు బుట్టించుచు, నుదంచితచపేటంబునస్థలంబును బ్రద్దలుగొట్టున ట్లుప్పుచు, దిక్కులనెల్ల లాంగూలవలయంబున నరికట్టుచున్నట్లుగనిపించుచు, రోషానలజ్వలితములగు చూపులచే బుడమిని భస్మమొనరించునట్లు దోఁచుచు, బండ్లు పటపటం గొఱుకుచు, భయంకర దర్శనుండై నిద్రనుండిలేచి, తారావళివలన నభినందింపబడుచు నుదయసుందరిని జేపట్టియున్న రాజపట్టిని దూరమునుండియేచూచి మహాక్రోధంబున నందుండి యొక గోలాంగూలుం డతిరయంబున నా రాజేంద్రునిమ్రోల కేతెంచి వాని భుజముమ బట్టి లాగఁదొడంగెను.

అప్పుడు భయకంపితయై యుదయసుందరి యిట్లని విచారించెను. అన్నా ! దురాత్ముండగు దైవమువలన నిహతురాల నైతినిగదా. మన్మధశరవ్యాఘాతమూర్చితనై యీ కోఁతి యిందున్న దనుమాట మఱచిపోయితిని. చిరకాలముల కిష్టజనులఁగలిసి కొనిన సంతోషరసమున మత్తతంజెంది యిందది నిద్రించుచుండుట యించుకయును సమ్మతింపనైతిని. అనురాగాంధకారమునఁ జిక్కికొని యిచ్చటి కేతెంచు నీ దుష్టవన భి రావ[ీ: ఇండేమి

దాజంగలమో సత్వర ఒహ 4 ఖరిపొలింపబడుచున్న నీ విట్లు స్థిరత్వమునుబూనుట సమంజసమేనా ? ఓ యథధినాధా ! నీ తనూజయగు లక్ష్మి కితండు పతిగదా ! యేమిటికట్లు జడత్వము వహించెదవు? దిక్పాలులారా ! సకలదిగ్విజయం బందు వీనిచే మీ నగరములు సంరక్షింపబడెను. మీ రేమిటి కట్లు దూరముననుండి యూరక చూచుచుండెదరు ? ఓహో ! సూర్యుఁడా ! తేజంబున నీ వీతనికి సోదరుఁడవు. ఇట్లు నీవేమిటి కుదాసీనుఁడవై తిరిగెదవు ? మీ రెల్లరు నే మై యీ దుష్టవనచరాధమునిచే హింసింపఁబడుచున్న యీ జగదేక నాయకుని సమక్షమున కేతెంచి వీనిపక్షమై యుండరేమిటికని యుదయసుందరి యత్యంత భయాకులయై గడ గడ లాడుచుండెను. అప్పుడా భూతలేంద్రుం డిట్లని వితర్కించుకొనెను.

ఔరా ! వీఁడు సామర్థ్యవిహీనుఁడు. సత్యశూన్యుఁడు. స్వభావచపలుఁడు. కాతరనిదర్శకుండు. ఇట్టి వీనిపై త్రిభువన జేగీయమాన విక్రముండనగు నే నెట్లు శస్త్ర మేయఁగమకింతును ? నే నూఱకున్న నీ లతాంగిభయం బుడుగనేరదు. కావున వీని నిగ్రహించెదంగాక. ఉచితప్రహారంబున వీని మూర్చితుంజేసి యీమెం గొనిపోవలయునని నిశ్చయించి దక్షిణపాణినెత్తి యా కోఁతి చెంపమీఁద గట్టిగా జఱచెను.


గీ. తోడనే కోఁతిరూపమువీడి దివ్య
    పురుషదేహ మంది కిరీటభూషణాధి
    కమును దాల్చి విమానయానమున దివ్య
    సతులు గొల్వఁగనుండి భూపతిని బొగడె.

అట్లు సాధువాదంబు లొనర్చుచు రాజున కిట్లనియె ఓ క్షితీశతిలకా ! నీ యనుగ్రహంబున నేను నిజస్వరూప మందగలిగితిని. పోయివచ్చెదను నా నివాసమున కరుగుట కంతరావళమున నెంతవిలంబగునో యెఱుంగను. కావున నేఁ బోవుట కనుజ్ఞ నొసంగుము. ఓ పుండరీక రాజేంద్రా! మనుజభువనైక చక్రవర్తినీ లక్షణలక్షితయగు‌ నీ యంగనామణిని దేవేరిగాఁ బరిగ్రహించి నిజనివాసంబగు ప్రతిష్ఠాన నగరంబున కరుగుము. నీకొఱకే విధివలన సృజింపఁబడిన యీ యన్నులమిన్న నింతదనుక నే నిందుఁ గాపాడుచుంటినని బలుక నా రాజేంద్రుండు విస్మయమందుచు నింపుగొలుపు పలుకుల వాని కిట్లనియె.

ఓ వివేకచూడామణీ ! నీ వెవ్వరో తెలుపుము. ఇట్టి దివ్యాకృతినిబాసి వనచరుండవై యేమిటి కాపదపాలై తివి? ఈ మృగాక్షి నెందుకొఱ కిందు సంరక్షించుచు గష్టపడుచుంటివి ? ఈమె కెందునిమిత్తమిట్లు వనవాసదుఃఖము గలిగించితివి ? నాకర ప్రహారంబున నీ కెట్లు పూర్వరూప మబ్బఁగలిగెను ? నా పేరును నా నగరముపేరును నీ వెట్లు తెలిసికొంటివి? ఈ మహాపర్వత మెయ్యది ? అంభో-సోదరియగు నీ సుందర‌ సరోవరము పేరెయ్యది? మఱియు ము. పేరున నిర్మింపఁ బడినది ? అని యిట్లు ప్రశ్నించు నృపతిలకున భూమీంద్రచంద్రా ! చెప్పెద నాకర్ణింపుము. ఈ లోకమున మేరుభూధర వప్రోపకోణమందు దివ్యభువనంబులఁ బ్రసిద్ధికెక్కిన కోశాతకి యను విద్యాధరపురం బొండుకలదు. దానికినే నేలికను. తారాకిరీటుఁడను విద్యాధరుఁడను. అంధకవిపాట కుండగు పరమేశ్వరుండు పాతాళంబున హాటకేశ్వరుండనఁ బ్రసిద్ధికెక్కి యుండెను. వానిని సేవింప నేను బ్రతి యష్టమీ చతుర్దశుల నందేఁగుచుందును. ఒక యష్టమినాడు వాడుకవడుపున నా దేవుని దర్శించి నఱిగి యందు భక్తాభీష్టఫలకల్పపాదపుండగు జండీశుని భక్తితో నర్చించి యా దినమంతయు నందుఁగడపి కృతకృత్యుడనై యా రాత్రి నాగలోకము విడిచి పోవుచు నొకచో సముద్రాంతర్ద్వీపమందు వెన్నెలలోఁ దెల్లముగ గన్పట్టుచున్న యొక సౌధాగ్రమునఁ బచ్చనియాకుపందిరి క్రింద బూ సెజ్జపై బవళించియున్న యీమె నీక్షించితిని. దూరమునుండియే యామె వదనము నీక్షించి యిట్లు వితర్కించుకొంటిని.


మ. అది రోలంబకదంబకానృతశిరంబై విప్పు పద్మంబొ ? య
     య్యది నూత్నాసమనీలిమాంకశుభగంబౌ చంద్రబింబంబొ ? లే
     కది నిక్కంబుగ మానిసీకురుల జాలాక్రాంవమౌ మోముకో ?
     అదిరా! యిట్టివిచిత్రసృష్టి విధివిఖ్యాతిన్ గదన్‌ గాంచెడిన్‌.

అట్లు ముద్దుగుమ్మయని నిశ్చయించి యనేక సురలోక నాయికోపభోగ క్రీడాకృతార్దమైన‌ మన్మనం బాత్రిభువనమోహనాకారమును గావించినతోడనే తద్వశం వదమయ్యెను. అప్పుడు నేనిట్లు తలంచుకొంటిని. ఈ బాలికాభరణ వివాహితకాదు గదా ! కన్యక మేయైనను ననురాగంబున స్వయముగా వరించివచ్చినప్పుడుగాని యామె తలిదండ్రు లొసంగినప్పుడుగాని పురుషుండు పరిగ్రహింపదగును. ఈమె వివాహితయే యైనచోఁ బరాంగనయై యగమ్యయగునుగదా ? శిశిరోపచారపరిచయంబు గలిగియున్న నీమెను బూర్వానురాగముగల ప్రియతముని నెడఁబాసి విరహార్తిఁబడియున్న పరాంగ నఁగా భావింతునని దలంచుచు నంతలో వివేక మెడల మైమఱచితిని. వంశమర్యాదల మఱచితిని. సుకృతపథంబు మఱచితిని. గురూపదేశముల మఱచితిని. లోకప్రవృత్తుల మఱచితిని. కేవలము దురాత్ముండగు మన్మధహతకునిచేఁ బ్రేరితుండనై, దుష్కార్య చరణపదాయణుండనై, నరకగతివలన సంజ్ఞితుండనై , యపయశోకళంకమున నభ్యనుజ్ఞాతుఁడనై, యిదియే వివేకము, యిదియే వంశమర్యాద, యిదియే సుకృత మార్గము, యిదియే గరూపదేశతత్వము, యిదియే లోకప్రవృత్తియని దలంచి సంసార మును సఫలంబుగఁ జేసికొందునని నిశ్చయించి నిద్రనుండి‌ లేవకుండగనే యొరు లెఱుంగకుండఁ గొనిపోవనెంచి సమీపించి ప్రవాళతల్పంబున నిద్రించు నామె నెత్తుకొని వచ్చి నా విమానమునఁ బరుండఁబెట్టి యలబ్దలాభమును గాంచినట్లు సంతసించుచు అంతరిక్ష మార్గంబునఁ బోఁదొడంగితిని. అంబరముననున్న శశాంకబింబమును విమానమందున్న యామె ముఖంబును మాటిమాటికిఁ జూచుచు నిట్లని దలంపఁ సాగితిని.


గీ. అమలమగు నీలమణిఫనకమును బోలు
    గగనమున వెట్లు శశిబింబకమును గాంచి
    తలఁచితిని నావిమానమం దలరు చెలువ
    వికసితో జ్వలాస్యప్రతిబింబమనుచు.

గీ. ఇందుఁ డితఁడు లతాతన్విసుందరాస్య
    సంపలకోడి లోఁ గలుషంబు బూని
    వెన్నెలముసుంగుఁ దాల్చి ప్రచ్చన్నగతిని
    రాత్రులఁ జరించుచుండెఁ దాఁ ద్రపవహించి.

గీ. ముజ్జగంబుల నీరూపమునకు సాటి
    యైనమానిని లేదని యబ్జభవుఁడు
    వ్యోమభూమిని ఖటికతో నొరులరూప
    మునకు సున్నఁజుట్టినయట్లు దోఁచెను విధుండు.

ఆహా ! నిద్రచే నేత్రములు మూసికొనియున్నను నీమె ముఖసౌందర్య మెంత యొప్పిదంబుగ నున్నది ? అంతస్తాపంబునఁ జిపురు సెజ్జంగూడ దహించు చున్నను నీమె శరీరమెంత లావణ్యభూయిష్టమై యున్నది. శిశిరోపచారచందనజడీ కృతమునైనను నీమె యవయవముల కాంతి యెంత యద్భుతముగనున్నది ? అని యిట్లు ప్రశంసించుచు నామెయందే బుద్ధినిలిపి ముందు విమర్శింపకుండ నేను బోవు చుండ నీపర్వతశిఖరముపై గగనగంగాతటంబునఁ దపం బొనరించు నొక మహర్షి మీఁదుగా వానిశరీరము నొరసికొని నా విమాన మరిగినది.

అందులకుఁ గుపితుఁడై యా మునీంద్రుండు క్రూరదృష్టుల నాపై బఱపుచు నోరోరీ ! చపలుడా ! నీ చపలస్వభావమునకు దగినఫల మతిశీఘ్రముననే యనుభ వింతువుగాక. నీ యవివేకమువలనఁ గలిగిన పాపంబుమూలమునఁ జపలమర్కటమువై వనపశుత్వంబు నందుమని శపించి యెదుర విమానమందున్న నబల నీక్షించి సర్వ విదుండగు నతం డించుక ధ్యానించి సమస్తమును దెలిసికొని ససంభ్రమంబున నిట్లనియె. ఓరీ ! పాపాత్మా ! దుష్టబుద్ది స్త్రీరత్నము నపహరించుకొని పోవుచుంటివా ! ఈ రవిశృంగమను పర్వత మూలంబుననున్న కువలయామోదమను సరోవరప్రాంత కాంతారముననే యుండి యీమెను నీవే సంరక్షించుచుండుము. మఱియును మద్వచః ప్రభావంబున నాగిరిగర్భంబున మనోహరమగు మాణిక్యభవన

ము అని వచించి ఎలంము సంభవించిన కిరణకోశమనురత్నము. సకల విషకారమూర్చాంగ పరివర్తనాద్య శేషాపాయములఁ దప్పింప సమర్దమయినది. ఆపదలకు నెలవగు నీ వననివాసంబున దీనిం బడయుట శ్రేయస్కరమని ప్రియముమీఱ బలుకుచుఁ నామెకుఁ దీనిని జూడా రత్నముగా నొసంగి యూఱకుండెను.

అప్పుడు నేను వానిదుర్వారశాపోక్తులవిని దుర్భరదావానల జ్వాలలంవడు వనవృక్షములలీల తోడనే వివర్ణుడనై పరయువతీ రత్నాపహారపాపంబునకు ఫలంబు గంటినని పశ్చాత్తాపమందుచు నవనమితమౌళినై యా మునీంద్రునకుఁ బ్రణమిల్లుచు వినయంబున నిట్లంటిని. మహాత్మా ! శాంతి వహింపుము. అజ్ఞానతిమిరంబునఁ గన్ను గానక వివేకహీనుడనై యధర్మంబునఁ ప్రవర్తించిన నాకు కరుణాతరంగుడవై శాపాంత మును బ్రసాదింపుమని ప్రార్థింప నా మునీంద్రుండు దయార్ద్రహృదయుండై తల పంకించుచు “సరే, కానిమ్ము. ఈ యరణ్యంబున‌ నీమెను ప్రతిష్టాననగరాధీశ్వరుండగు పుండరీక రాజేంద్రుం డెప్పుడు జేపట్టి నీచెంప వాయఁగొట్టునో యా క్షణముననే నీకు శాపాంతమగునని నన్ననుగ్రహించెను.

పిదప నేనా మునీంద్రుని యానతి నౌదలందాల్చి తోడనే కోఁతినై యిమ్మణి భవనంబున నీమెను సంరక్షించుచు భవదాగమనమును బ్రతీక్షించి యుంటిని. నేఁటికి నా పుణ్యవశంబున నీ వేతెంచి నా శాపదోషమును బోఁగొట్టితివి. ఈ పర్వతము రవిశృంగమనియును సరోవరము కువలయామోద మనియును మునీంద్రుని మాటల ధోరణిని మనవిచేసియే యుంటిని. ఈ మణిమందిరము వానియాజ్ఞాసిద్ధమైనదనికూడ మనవిచేసికొని యుంటిని. ఓ లోకోపకారపరాయణా ! పుణ్యాత్మా ! నీ వడిగిన వృత్తాంతమెల్లఁ జెప్పితిని. ఇఁక నాకు సెలవొసంగుమని వచించి యా రాజేంద్రు ననుమతంబు వడసి యా విద్యాధరుఁడు మింటికెగసి నిముసములో నదృశ్యుఁ డయ్యెను.

342 వ మజిలీ

పురప్రవేశము

అట్లు మర్కటరూపమునువిడచి నిజవృత్తాంత మెఱిగించి విద్యాధరుఁ డఱి గినపిమ్మట నా రాజశేఖరుండు నల్దెసలఁ బరికించుచు నభీష్టయువతీసంగమాభినందన పురస్పరంబుగ నిట్లని విచారింపఁ దొడంగెను. అనుకూలదైవప్రభావంబున నా ప్లవం గము ననుసరించి వచ్చి నే నిచ్చోట నాప్రాణేశ్వరి నత్యద్భుతంబుగఁ గలిసికొనఁ గలిగతిని. ఇష్టజనయోగదుఃఖముదప్ప మఱొకకష్ట మేమియు నీమె యనుభవించి యుండలేదు. ఈ మహారణ్యము దిక్కులనెల్ల నాక్రమించుకొని యుండుటచేఁ బుడ మిలో నీ ప్రదేశమెచ్చటిదో తెలియకున్నది. ప్రతిష్టాననగర మేదిక్కున నెంతదూర