Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/340వ మజిలీ

వికీసోర్స్ నుండి

వానుని గర్భాండకము విధంబున బ్రకాశించుచు రవి దివంబుననుండి దానికి మిగుల సొగసుగూర్చుచున్నాఁడను నీసున ధరణికిఁగూడఁ దానుండి యందమును గల్పింతునని వచ్చిన మచ్చున నొప్పుచు, నాసన్నవిటపంబులు స్వచ్చమైన తనయందుఁ బ్రతిబింబిత ములై గనంబడుచుండఁ దమాలశాఖాంధకారమున మలినమైన యా శాముఖంబును బహుదూరము బ్రసరించు నిజకరప్రదీప్తిని క్షాళన మొనరించుచు, సర్వత్రవ్యాపించు చున్న నిజతేజోరాశిచే జగములకెల్ల నేకభూతాత్మకత్వంబు నాపాదించుచు, నత్యంత నిర్మలమై యతిమనోహరంబై ప్రకాశించుచున్న మాణిక్యమొకటి గోచరమయ్యెను.

దానింజూచి విస్మయంబందుచు నల్దిక్కులు బరిశీలించి యందెవ్వరును లేకుండుట దృఢపరచుకొని 'ఆహా ! ఈ యపూర్వమాణిక్యి మెక్కడిది ? ఈ చెరువు గట్టున కెట్లువచ్చినది ? ఎచ్చటినుండిపడి యిట్టి దుస్థితి పాలయ్యెను ? అనంతమరీచు లచే నప్రతిహతములగు సహస్రకరములతో నొప్పుచున్నను రాత్రులయందుఁ గాంతి వహింపఁజాలని ద్యుమణిని నిదియతిక్రమించుచున్నది. నిర్మలత్వమునఁ గౌస్తుభమాణి క్యమును నతిశయించుచున్నది. నిష్కోపత్వంబున మునీంద్రులకును సపగతత్రాసత్వం బున సురలకును జిత్తములయందు స్పర్దను బుట్టించుచున్నది. దీనికాంతిచే విజితమై సిగ్గుపడి కౌస్తుభంబు హరివక్షస్థలంబున వనమాలాపగూఢమగు నసితప్రబాంధకారమున నడఁగియున్నది. చింతామణి దీని సామత్యం బొందఁగోరి దానవ్రతంబున నభీష్టసిద్ది యగునని యెఱింగి యర్దులకుఁ గోరినదెల్లనిచ్చు ప్రవృత్తియందున్నది. ఇతరములగు మణులు ప్రభాపరాభవభయంబునఁ గొన్ని యగాధమగు నంబోధిమధ్యమం దడగి యున్నవి. కొన్ని రోహణాద్రి నాశ్రయించి మీఁద మన్ను గప్పుకొని యదృశ్యములై యున్నవి. కొన్ని రసాపలమునఁ బ్రవేశించి ఫణీంద్రఫదాపంజరముల నధిష్టించి యున్నవి. ఇట్టి యుత్కృష్టరత్నము నెవ్వడైన స్నానార్ధ మిచ్చటి కేతెంచి మరచి పోయెనేమో ? అంబరమున విమానముమీఁద సంచరించు దివ్యునిమణి యిందుజారిపడె నేమో ? ఏ వన్యజీవనమైన నే పక్షియైన దీని నెటనైన నపహరించుకొనివచ్చి యిందు విడచిపోయెనేమో ? తుమ్మెదలుమూఁగు పరిమళ ముండుటచేతను నందందు సింధూర రేఖ లుండుటవలనను నియ్యది సౌరభ్యసంభృతాంగవయవ సంగితంబగు నలంకరణమై యొకరమణీమణి విభూషణమని తలంతును అయినను దానిందెచ్చి పరిశీలించెదంగాక యని లేవఁబోవు రాజు ముందర నయ్యశ్వఖురప్రహారవేగంబున నమ్మణి యెగిరివచ్చి పడెను.

340 వ మజిలీ.


అయ్యశ్వము మణిస్పర్శాప్రభావంబునఁ దోడనే తురగరూపమును విడచి జటావల్కలోపవీతములుదాల్చిన తారావళియయ్యెను. పుండరీకుండును నట్టిప్రభావము గల మాణిక్యము దనముందుఁ బయట దిలకించి యేమి‌ యీ యింద్రజాలమని యక్కజ పడుచు నతికుతూహలమున నమ్మణిని గ్రహించి రూపాంతరమునువిడచి క్రొత్తగా నున్న దారావళిపై నిశ్చలదృష్టులంబరపి చూడసాగెను.

ఆమెయును స్వస్వరూపలాభమునకు ముదమందుచు నాగిరి సరోవరముల వలన నిరుద్దమధ్యమగు నా మహారణ్యంబును విస్మయంబుతో నిటునటుఁ బరికించి “సాధుసాధు" దేవతలు చిరకాలమునకు నా కోరికను దీర్చి యనుగ్రహించిరి. క్రూరవన చరావతారదారుణారణ్యంబుననున్న నీకాసారతీరమునఁ ద్రిభువనలక్ష్మీసీమంతరత్నము నుచితావస్థానదుస్థితిం గాంచుచున్నదిగదా ? యని వలుకుచుఁ జేతులెత్తుకొని యతిజవం బున నా కొండకెదురుగాఁ బరువెత్తఁదొడంగెను.

ఆమె ప్రవృత్తిని దిలకించుచున్నా రాజామాటలకు శంకించుకొనుచు నౌరా ! ఈ పలుకులు నాకర్ద మగుటలేదు. మణి నాయొద్దనే యున్నది. ఆమె యాకొండ కెదు రుగాఁ బోవుచున్నది. అని విస్మయపడుచు నావంకచే చూచుచుండ మొదట వాని కాపర్వతముతప్ప యేమియును గనుపింపలేదు. పిమ్మట నకస్మాత్తుగా నాగిరిగర్భంబున విచిత్రనవరచనామనోహరంబగు మాణిక్యమణిమందిర మొండు గోచరమయ్యెను. అందుండి మత్తమాతంగయానము ననుకరించు విలాసగమనంబున నేతెంచుచు వెనుక రాజు చిత్రపటంబునుజూచిన రూపమునే పోలుచు, శరిబింజశకలిముల నిర్మింపఁబడి నటులఁ, జందనము బూయఁబడినరీతి. కర్పూరము జేర్పఁబడినపోల్కె, పద్మసౌభా గ్యము నింపఁబడినగతి యమృతమున ముంచఁబడినటుల నేత్రానంద మొసఁగు స్వరూ పమున నొప్పుచు, సుఖకుసుమమున శోభించు చరణ పల్లవసంపదచే సౌభాగ్యభూమి యందు ప్రభవించిన యభినవ లతవలె నలరారుచు, రతినివాసమునకుఁ గల్పింపబడిన చిత్రశాలవలెనే స్నిగ్దోరుస్తంభంబులందాల్చి కందర్పకులాలుని కర్మశాలయటుల నిశాల జఘనచక్రంబున నొప్పుచు, శృంగారరససమాసాదనకై జాతిగేంద్రవిద్యయందువలెఁ గంభీరమైన బొడ్డను మూసతో నలరారుచు సౌందర్యదేశాంతరంబులఁ బ్రవహించు నది వలెనే పవిత్రయతరంగములఁ జెలంగుచుఁ, ద్రిభువనలక్ష్మియొక్క రత్నావళివలె సువృత్త పీవరస్తనయుగళంబగు మాణిక్యనాయకమణుల వహించుచు, లావణ్య సాగర తీరమువిధంబునఁ జూపుమీలచే నలరారు నెన్నుదురుఁగాంచి తారుణ్యభనిటువీరవృత్తి చందంబున భ్రూచాపలవలయంబువహించి, బ్రహ్మాండసరోవరమందలి పద్మినివిధం బున ముఖసరోజసుందరయై త్రిభువనమనోహరముగా విధాతచే నిర్మింపఁబడి దృష్టి దోషమునకు వెఱచి యొరులు జూడకుండున ట్లీయరణ్యగహర్వంబున విడువఁబడిన రీతి నొప్పుచు వేడుకగాఁ బుడమిసంచరించు జలదేవత చందంబున మృణాళికాభరణమై కమలవనంబునఁ గ్రీడింప వెడలిన లక్ష్మివిధంబున కరకలితలీలాంబుజయై, చల్లగాలికి సరసీతటంబున విహరించు వనలక్ష్మివలెఁ గుసుమోత్తసంభాషితయై, యతివిమలాం తశ్చటలకు ధారాగృహమై, కందర్పకుసుమమునకు ఫలంబై, లావణ్య వారికి తీర్ధమై, శృంగారరసమునకుఁ బ్రాతమై, మదనార్తి యనువ్యాధివలనఁ దెల్లనైన చెక్కులుగలిగి తారావళి నాలింగనము జేసికొనుట కెదురువచ్చుచున్న యుదయసుందరి గనం బడెను.

ఆమెంగాంచి చమత్కారముగా శిరఃకంప మొనరించుచు నోరా ! తారావళి మాటలు యధార్థములే యైనవి. ఈ మృగాక్షి నిక్కముగఁ ద్రిభువనలక్ష్మికి సీమంత రత్నమే ! ఈ మణిని నాయెదం దాల్చెదంగాక. కుమారకేసరి చెప్పినదానికన్నఁ జిత్రపటమునఁ జూచినదానికన్న మిన్నగ నీ మోహనాంగిరూపం బొప్పియున్నది గదా !


గీ. వనజగర్భుఁడు రూపసర్వస్వ మీమె
    యందు నిక్షేపముగఁ జేసె నని తలంతుఁ
    గానిచోఁ గార్ముకముదాల్చి కాముఁ డేలఁ
    గాచియుండంగవలయు రక్షకునిలీల.

గీ. లక్ష్మి యామెయై హారాద్యలం క్రియాతి
    వైభవమునకు న న్నధీశ్వరునిఁ జేసె
    నీమెఁ గన నాదుకన్నుల నెసఁగు హర్ష
    జలకణంబులు ముత్తెంపు సరులుగాఁక.

చ. లలన వినిద్రచంపకదళద్యుతియం దతిలీనమై మనో
    జులసదిషుప్రహారముల శోణరుచిం గను మన్ననంబు గెం
    పొలయ విచిత్రవర్ణముల నొప్పుచుఁ గాంచనభూషణంబునన్‌
    గల తరళంబువోలెఁ గడకన్‌ విలసిల్లునటంచు నెంచెదన్‌.

ఔరా ! విధివిధానము ! ఔరా ! కర్మపరిణతిప్రభావము ! ఔరా ! సంసార

వైచిత్ర్యము ! ----------- వనవాసక్లేశ మనుభవించుచుండుటయే యిందులకుఁ దార్కాణము. ఈ యరణ్యమధ్యంబున నామె యెందునిమిత్తము జేరియున్నదో తారా వళి కీతురఁగరూపమేమిటికిఁ గలిగెనో నే నీ చెట్టుచాటుననుండి వీరిమాటలవలన సర్వము నెఱింగెదంగాక యని నిశ్చయించి యట్లు పొంచియుండెను.

ఉదయసుందరియను జిరకాలమునకుఁ దలవనితలంపుగాఁ బ్రియసఖిం గాంచుటవలనఁ గలిగిన మహానందంబున నెదురుగాఁ బఱువెత్తుకొనివచ్చు తారావళి నధికవేగంబునఁ గలసికొని గాఢముగా నాలింగనము జేసికొనెను. ఆమెయును విస్మ యోత్సుకయై ప్రియసఖి యెదపైవ్రాలి బహువిరహ దుఃఖభావమునఁ గొంతతడవు మైమఱచియుండెను. బిదప నిరువురును గటి మి. పదిన ( ఎలిప్పుడున ర్చన “యుండ

చెను. త్‌ నవ్య లౌాంత సాడు ఫట్టునంగవా ఎముక స అలు రుం యుంటుంది... ఆలిఎవచ్చు సరికి నే నీసరోవరతీరంబున నుంటిని. నాయెదల నొక దివ్యచూడామణి యలంక రింపఁ బడియుండెను. దాపున మహాదేహదారుణమైన యొకవానరము గాపుండెను. ఇంతకుఁదప్ప నా కేమియుఁ దెలియదు. పిమ్మట నేనతి భయాకులితచేతస్కనై యిట్లు విలపించితిని.

అయ్యో ! నే నిప్పు డెచ్చట నుంటిని ? తామరపాకుల పందిరిక్రింద నేను నిద్రించుచున్న యాసౌధశిఖర మేమైనది ? చేరువనే నిద్రించుచున్న తారావళి యెచ్చట నున్నది ? ఉదయమునకు పూర్వమే నా సమీపమున కేతెంచి సర్వదా నన్నుఁ గని పెట్టుకొనియుండు చెలిమికత్తియ లేమైరి ? ఉదయమున లేచినతోడనే నా యభివాద నము లందికొను తల్లిదండ్రు లెం దుండిరి ? ప్రభాతమంగళోపగీతగర్భితమై ప్రబుద్ధ పరిజనారావడంబరమై, కలకలలాడు కన్యాంతఃపుర మేమైనది ? హా ! దురావసదుం డగు విధిచే నిహతురాల నయితినిగదా ! ఈ యరణ్య మెక్కడిది ? ఈ కొండ యెక్కడిది ? ఈ కాసార మెక్కడిది ? సమీపమం దీమర్కట మెక్కడిది? అని యడలుచు నాలుగువైపులఁ దిలకించుచుండ మనుష్యజ్ఞానముగల ప్లవగమందుండిలేచి ముందు నిబిడతరులతాడంబరమై నికుంజాంతరితమై యింద్రనీలమయమై యొప్పు నీ గిరిభిత్తకను నిజభుజబలంబున నాకర్షించి యూడఁదీసెను. అందు హంసతూలికా తల్పంబుచే నలంకరింపఁబడియున్న మాణిక్యభవన మొండు గోచరించెను. దానినే నాకు వసతిగా నేర్పఱచి యవ్వలీముఖంబు మదీయచరణసంవాహనాది విహితసుఖ సూచకోపచారంబులవలన నాయెడదఁగల యలజడి నుడువదొడగెను.

పిమ్మట నాప్రాంతోపవనమందలి తరులతాదుత పుష్పములఁగోసి సరస్సు నందలి కుమలకువలయంబులఁ గ్రహించి వానినెల్ల నొక పెద్దయరఁటియాఁకులో బెట్టి తెచ్చి ముందుంచి నాయడుగులు బట్టి కొనియుండెను. నేను దాని యింగిత మెఱెంగి, యందుండిలేచి యా సరోవరంబునకేఁగి జలకమాడి యాకోఁతి తెచ్చినపుష్పములతో నిష్టదై వంబులఁబూజించి తిరిగి వచ్చుసరికి మాణిక్యభననంబున ననేక నవపక్వఫలం బులు నాకాహారమునకై సిద్దపఱుపబడియుండెను. వానిం దిని యాఁకలి యడంచు కొంటిని. చీఁకటిపడినతోడనే నేనందున్న తల్పంబున శయనించియుండ నాకోఁతి ద్వారదేశంబుననిల్చి గావలి యుండెను. ఇట్లు ప్రతిదినమును జేయుచు, ఫలాలాదికము నకై బైట కేఁగునప్పు డం దితరులు ప్రవేశింపకుండ నాగిరిభిత్తిని నిలిపియుంచి నా యునికి నితరులకు గోచరింపకుండఁ జేయుచుందును ఇట్టిదురంతవన గహ్వరంబునఁ బడి దిగ్ర్భమఁజెంది యెందుఁ బోవలెనో యెఱుఁగకుంటిని. మఱియు నాకోఁతియెదుట యెందైనఁబోవ నడుగుఁదీసి యడుగైనఁ బెట్టుటకు వీలులేదు. అతిబలసంపన్నుఁడగు గపిప్రవరుండాశ్రయించియున్న కతంబున నీ యరణ్యంబునందలి వనజంతువులెల్లను

నిలువజాలక భయంబున దూరముగాఁ బాఱిపోయినవి.


మ. వనమం దిఁట్లనిలార్కసత్కరసుసంపర్కంబు మాత్రంబె నేఁ
     గనుచున్‌ వానరరక్ష గాసిపడుచున్‌ గాఢాంగజాతాగ్ని పీ
     డను గాసారమృణాళపద్మముల జాడన్‌ గొంతశాంతించు కొం
     చును దైవాధికనిర్ణయంబు గనుగొంచున్నేవసింతున్‌ గదా.

కాని యాప్ల వంగపుంగవుఁడెవ్వరో, యెందుకొఱకు నాసమక్షమందుండి యిట్లు సంరక్షణ మొనర్చుచున్నాఁడో, నే నెట్లిచ్చటకు రాఁగలిగితినో, నాకేమియును దెలియదు నేఁడు వాడుక వడువున నీకాసారమునసాన్న మొనరించుచుఁ జూడామణిని దీసి దేవపూజకు వేళ యతిక్రమించుచున్న దను తొందరతో దానిని చీరచెంగునఁ జుట్ట పెట్టి వదులుగ ముడివై చితిని. పిమ్మట దేవపూజ నిర్వర్తించుకొని త్వరితగతిఁ బోవుచు దానిమాట మఱచితిని. అమ్మణి బరువు వలన వసనాంచలమునుండి జాఱి యెందో పడి పోయెను. ఇచ్చటఁ జేరిన పిదప నారత్నము మాట దలంపునకు వచ్చుటయును దానిని వెదుక దూర మరుగనక్కఱలేదుగదా యనియును నే నెం దేఁగినను సాయము వచ్చు కోఁతి నేఁ డెవ్వనిచేతనో బాధింపఁబడిన ట్లతిశ్రమంబున నేతెంచి యలసి నిద్రించు చుండుటచేత దానిని లేప నిచ్చగింపక యేకాకినై యిప్పు డిచ్చటి కేతెంచితిని. ప్రియ సఖీ! సంక్షేపముగా నీవృత్తాంతముగూడఁ జెప్పుము. నన్ను విడచినది మొదలు నేఁటి వఱకు నీ వేమిచేసితివో, యశ్వరూపమున నా మనోహరుండు గనంబడెనేమో చెప్పు మని ససంభ్రమంబుగ నడుగుచున్న యుదయసుందరికి తారావళి నిజవృత్తాంత మిట్లు సంగ్రహముగాఁ జెప్పదొడంగెను.

సఖీ ! వినుము. నాఁటియుదయంబున నిద్రనుండి లేచి నిన్నుఁగాంచక మిగుల దుఃఖించుచు నీ తల్లి దండ్రుల కీదుర్వార్తఁ దెలియఁ జేసితిని. మీతండ్రి శిఖం డతిలకుండు ని న్నన్వేషింప నెల్ల లోకములకు దూతలం బుచ్చెను, నేను స్వయముగా నిన్నన్వేషింప బయలుదేరితిని. ఒక్కచో నన్నొక రక్కసుండు జూచి మదనమోహి తుండై తఱుముకొని వచ్చి నిగ్రహింపఁబూన నీ హృదయనాయకునిచే సంరక్షింపఁ బడితిని. వాని కులగోత్ర నామ నివాసంబు లెఱింగితిని. ఆ యనఘుండు కుమార కేసరిని నాకుఁ జూపి వాని వృత్తాంతము జెప్పి నీకుఁ బ్రాణప్రదంబయిన చిత్రపటమును గూడఁ జూపించెను. దానిని నేను చూచినతోడనే భవద్వియోగదుఃఖము నాకు ద్విగుణిత మయినది. నీయందలి యనురాగంబున వలవంతఁబడుచున్న నారాజేంద్రుని జూడజాలక యారాత్రి యెట్లో వెళ్ళించి తరువాతఁ బుష్పాపచయ నెపంబున బయలుదేరి యాపు రంబు విడచి నిన్ను వెదకుటకుఁబోతిని పిమ్మట నే ననేక గ్రామాగ్రహార పురపట్టణం బుల వెదకుచు నతి వేగంబున నంతరాళంబున నరుగుచు నొకచోట మధ్యాహ్నతరణితీ వ్రతాపంబున విహ్వలనై భ్రమభరాలసంబులగు చూపులకు ముందెల్ల నంధకారమై గనుపింప నెందయిన విశ్రమింపనెంచి యొక పర్వత శిఖరమునకు దిగితిని. అందొక ముహూర్తకాలము గడపిన పిమ్మట దప్పిచేఁ బెదవు లార నీర్వట్టుకొఱ కందందుఁ జూపఁ బఱపితిని. ఆ కొండ కొనయందు దూరముగా నొకమారుమూల ఘనలతా గుల్మముల విహితమై గరుడుని ముక్కునుండి జాఱిపడిన యమృత భాండమునుండి కారిన‌ సుధవిధంబున మధురజలంబు గలిగి తాండకేళీలోలుఁడై న బాలేందుమౌళి జటా మండలినుండి త్రుళ్ళిపడిన గంగాంబుసటలంబువలె నొప్పుచు, బ్రహ్మదేవుని చేతినుండి పడిన కమండలు పాత్రమువలె నలరారుచు, కల్పాంతవాతమువలనఁ ద్రెళ్ళిపడిన చంద్ర బింబమువలెఁ బ్రకాశమానమై, గట్టులొరయుచుఁ జిన్న చిన్న యలలతో నొప్పుజలాశయ మొండు గనంబడెను.

దానిం గాంచి యతిహర్షంబు నచ్చోటి కేఁగి దప్పికిం దీర్చుకొన ముక్తా మరీచిసంచయ్యస్వచ్చమై యతిశీతంబులగు నాజలంబుల బుడిసిళ్ళం గ్రహించి కడుపు నిండఁ గ్రోలితిని. ఆజలము గ్రోలినతోడనే నేను తొంటిరూపము విడిచి యశ్వము నయితిని. నిముసమాత్ర మచ్చటినుండి నన్ను నేఁ దలంచుకొని యిట్లు విచారించితిని. ఔరా! ఇట్లు దేహపరివర్తన మొనరించు జలంబుల మాటల పూర్వము మునులు జెప్పిన పురాణగాధల నాకర్ణించియంటిని. అన్నా ! మందభాగ్యురాలనై డప్పిగొన్న నా కీ నీర్వట్టేమిటికిఁ గనంబడవలె? కనంబడెనుచో దీని నేమిటికి సమీపించి వెంటనే యిందలి నీ రేమిటికిఁ ద్రాగవలెను? త్రాగిన వెంటనే నోటిలోఁ జేయి వెట్టుకొని వమన మేమిటికి జేసికొన నయితిని? ఆహా ! విధివిధాన మతి విచిత్రముగదా! అని‌ యనేకరీతులఁ జింతిం చుచు నా కొండక్రిందఁ బుడమిపై సరసదూర్వాప్రవాళశాద్వలం బగు తృణస్తంబం బును గాంచి యాఁకటిచిచ్చుఁ జల్లార్చుకొననెంచి దానిపై కుఱికితిని. పై నుండి యట్లు భూమిమీఁదం బడినతోడనే నాకుఁ బూర్వజ్ఞానము బోయినది. పిదప నే నెచ్చట నుంటీనో, యొందేగితినో, యెందెందుఁ బరిభ్రమించితినో, యెవనిచే నే నిచ్చటకుఁ దీసి కొని రాఁబడితినో, యెట్లు నిజస్వరూపము నందఁగలిగితినో, నాకేమియు దెలియదు. కేవలము దైవ మనుకూలుఁ డగుటచేతనే మన మిందుఁ గలిసికొనఁ గలిగితి మని యత్యంతసంతోషమునఁ బలికి యూరకుండెను.

అప్పు డా యుదయసుందరి ప్రియసఖీ ! తారావళీ ! నా కెఱకెంత కష్టపడి తివి? నా మనోవిషయనాయకుని యన్వయనామ వసతులు నీ వెఱింగియున్నను, వానిని నీవు చూచియున్నను దైవవిధి వలన నిటుల మనము వానికి దూరమై యుండవలసి వచ్చెను. నా మనోహరుండు మనకుఁ దిరుగఁగనంబడునా? అయో! ఎట్లగుపడును? ఎపుడు గనంబడునని విలపించుచు విపాదదోదగ్రవేగంబున వివశయై పడిపోయెను తారావళి యడలుచు హా! ప్రియసఖీ ! హా ! నిజవంశ వై జయంతీ! హా ! కందర్పవిజయ లక్ష్మీ ! హా ? త్రిభువనాలంకార ముక్తామణీ ! ఏమిది ? ఇట్లచేతనురాల వైతివేమి? అస్తం గతమైన చంద్రబింబమువలె జగమునంతయు నంధకారబంధురముగ నొనర్చుచుంటివి గదా ! హా ! హా ! యెంతమోస మని ప్రలాపించుచు మొగముమీఁద జల్లుటకై సలిలమును గొనివచ్చుట కతిరయంబున బరువెత్తుకొని పోయెను. అప్పుడు రాజు మనంబున దిగులొంది యౌరా! నే నిప్పుడు ప్రచ్చన్నముగా నుండుటఁ దగదు. నా యొద్దఁ గల మణి దేహపరివర్తనవికారము బోఁగొట్టఁగలిగి నప్పుడు మూర్చాది దోషముల నెందులకుఁ దొలఁగింపజాలకుండు నని తలంచి సత్వ రము లేచి చేతియం దా మాణిక్యమును బట్టుకొని యుదయసుందరి సమీపమున కేఁగి యామె హస్తమును మణిచేఁ బ్రకాశించు నిజకరంబున గట్టిగా బట్టుకొనెను.


గీ. మణి శరీరము సోఁకినమాత్రముననె
    మూర్చవిడనాడి కన్నులమూఁత విప్పి
    లేచి యాలేమ కాంచెను లీలఁ దనదు
    కరము గ్రహించియున్న భూకాంతు నెదుర.

గీ. వానిని మనోధినాధునా వనిత యెఱుఁగ
    నెడద ననురాగరసమెల్ల నెసక మెసఁగె
    దాని తెఱఁ గిట్టిదని చెప్పఁ దరముఁగాదు
    హరిహరహిరణ్యగర్భాది సురలకై న.

గీ. నవకటాక్షబిసంబుల నువిద తృషిత
    యట్లె వానిరూపామృతం బానఁ దొడఁగె
    నంగజాగ్ని వాడినదాని‌ నవనినాధుఁ
    డడరి నిజసాంద్రృష్టులఁ దడుపుచుండ.

గీ. వారి నూత్నసంయోగోత్సవప్రమోద
    లోలములునై యపాంగవిలోకనములు
    గలియ నొండొంట నెదుర రాగంబు హెచ్చి
    రాకపోక మొనర్చె హృద్రథ్యములను.

అప్పుడు వారు మదనశ్రమజలంబున మంగళస్నానము లొనర్చి మణిసనా ధంబగు కరంబునఁగరంబు గీలించుకొనియుండి పార్శ్వంబులఁ దిరుగు ద్విజోద్ఘోషంబు వేదమంత్రస్వనంబుగాఁ బాణిగ్రహణోత్సవం బందిరి.

ఆ సమయంబున జలోర్మిశిఖరశీకరనికరంబులును, తరులతా ప్రవాళకుసుమంబు లును గాలిచే వారి సమీపమునఁ బడి జలవనాధి దేవతలు వధూవరులపై నభినందిం చుచుఁ జల్లు సేసలవలె విలసిల్లెను. అట్టి యుత్సవంబున నుదయసుందరి నెమ్మేనఁ జెమ్మటలు గ్రమ్మి గగుర్పాటు లొదవ శరీరము గంపింప సిగ్గుచేఁ దలవంచుకొని మందహాస భాసురముఖారవిందయై, యోహో? నన్ను విడిచిపెట్టుఁడు. విడిచిపెట్టుఁడని మృదుమధురభాషణంబులఁ బలుకుచుఁ జేయి లాగికొనఁ బ్రయత్నించెను. రాజోత్త ముండును సహర్షుఁడై మందస్మితం బొనర్చు ననురాగ మిగురొత్తనర్మ సందర్భ

మున నామె కిట్లనియె.


గీ. సుందర సరోజకోమలం బందియున్న
    కరమిదేలను లాఁగికో గడఁగె దబల
    చిరతరాపేక్ష నోకిందు దొరకె దీని
    నెట్లు విడతునొ చెప్పుమా యిందువదన?

ఇంతలో నబ్దినీపలాశపుటంబున నీరుగొని యతివేగంబున నేతెంచు తారావళి దూరమునుండి యా రాజేంద్రు నీక్షించి యమందానందకందలితహృదయారవిందయై వారికలయిక కభినందించుచుఁ బెద్దయెలుంగన నోహో ! సమస్తజగదాజీవనైక కారణు లగు దేవర యేకాకియై యెచ్చటినుండి యెట్లిచ్చటి కెందుల కేతెంచితిరో యెఱుంగ గోరుచున్నావని సవిస్మయోద్ద్రేకంబునఁ బ్రశ్నించుచుఁ దాఁ దెచ్చిన నుదకంబు మంగళ ప్రదంబుగ వా రిరువురిమీఁద జిలికెను. రాజును ముదమందుచు విశ్వభూతి శిష్యురాలు తనసమీపమున కేతెంచినది మొదలు జరిగిన నిజవృత్తాంతమెల్ల నామెకు దెలియఁజేసెను.

341 వ మజిలీ

ఇంతలో నాకసమునుండి పడిన పిడుగు చప్పుడువలెఁగఠోరమై యసుర సంహారసంరంభకుపితయగు కాత్యాయనీదారుణహుంకారమువలె భయంకరమై, యక్ష వధప్రధావితుండగు పవననందనుండొనర్చు కిలకిలారావములవలె భాసురమై, శత్రువర్గము నురుమాడునప్పుడు బీముండొనర్చు సింహనాదంబువలె భీకరమై ప్రతిశబ్ది తాద్రికందర సరోవరమై, యాకులీభూతసకలజలసత్వమై, యుత్రాసితవనశకుంతమై యొప్పు భయంకర హుంకార మొనర్చుచు, బ్రహ్మాండమండలమున కెల్ల వణఁకు బుట్టించుచు, నుదంచితచపేటంబునస్థలంబును బ్రద్దలుగొట్టున ట్లుప్పుచు, దిక్కులనెల్ల లాంగూలవలయంబున నరికట్టుచున్నట్లుగనిపించుచు, రోషానలజ్వలితములగు చూపులచే బుడమిని భస్మమొనరించునట్లు దోఁచుచు, బండ్లు పటపటం గొఱుకుచు, భయంకర దర్శనుండై నిద్రనుండిలేచి, తారావళివలన నభినందింపబడుచు నుదయసుందరిని జేపట్టియున్న రాజపట్టిని దూరమునుండియేచూచి మహాక్రోధంబున నందుండి యొక గోలాంగూలుం డతిరయంబున నా రాజేంద్రునిమ్రోల కేతెంచి వాని భుజముమ బట్టి లాగఁదొడంగెను.

అప్పుడు భయకంపితయై యుదయసుందరి యిట్లని విచారించెను. అన్నా ! దురాత్ముండగు దైవమువలన నిహతురాల నైతినిగదా. మన్మధశరవ్యాఘాతమూర్చితనై యీ కోఁతి యిందున్న దనుమాట మఱచిపోయితిని. చిరకాలముల కిష్టజనులఁగలిసి కొనిన సంతోషరసమున మత్తతంజెంది యిందది నిద్రించుచుండుట యించుకయును సమ్మతింపనైతిని. అనురాగాంధకారమునఁ జిక్కికొని యిచ్చటి కేతెంచు నీ దుష్టవన భి రావ[ీ: ఇండేమి

దాజంగలమో సత్వర ఒహ 4 ఖరిపొలింపబడుచున్న