Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/339వ మజిలీ

వికీసోర్స్ నుండి

అంత నొక్కచో ననేక తరుశకుంతకూజితారావతుములంబున దెలివిఁబొంది తా నొక మహారణ్యమధ్యంబునఁ దిరుగుచున్న ట్లెఱింగెను. ఎదుర నెందుఁజూచినను గొండలతో నిండియున్న ప్రదేశమేగాని యామర్కట మందుఁగనంబడదయ్యెను. ఇఁక ముందుఁబోవుట కశక్యమగురీతి నడ్డముగానుండి యగస్థ్యునివలన మోసగింపఁబడుట యెఱింగి రోషమొంది పెరుగుచున్న వింధ్యనగేంద్రములీల దక్షిణ దిక్కునెల్ల నాక్ర మించుకొనియుండి గౌరీతపశ్చరణపంచాగ్నులచే మంచు కరిగిపోయిన హిమాద్రివలె, హరపదస్పర్శాప్రభావంబున స్ఫటికపాండుకుష్టువుం బోఁగొట్టికొనిన కైలాసముగతి, వార్థక్యంబునఁ గాంచ నచ్చనింబాసిన మేరువువిధంబున నొప్పుచు నదభ్రశిఖర కృతా భ్రంబగు నొక్కభూభృద్వరంబును గనుంగొనెను.

అప్పుడు రాజు విస్మయమందుచు సత్వరంబునఁ గళ్ళెమును లాగిపట్టి గుఱ్ఱ మును నిలిపి దాని నవరోహాణం బొనరించి యలసట వాయ ఘనశీతలచ్ఛాయల నొప్పు నొకవృక్షముక్రిందకు జేరెను

339 వ మజిలీ

విచిత్ర సమ్మేళనము

అప్పు డాపుండరీకరాజేంద్రుండు నలువైపులం దిలకించి విభ్రాంతుఁడై యిట్లు చింతించెను. ఆహా ! ఇప్పుడు నే నేమహారణ్యంబునఁ జిక్కుకొనియుంటిని? ‌ బ్రహ్మాండవలక కీలకంబుగ నొప్పుచున్న యీ పర్వతము పేరేమి ? ఈ ప్రదేశమున కేనెట్లు జేరుకొంటిని ? కుమారకేసరి ప్రభృతిసహాయు లేమైరి ? మహాజపంబున నీ తురంగము నన్నెంతదూరము దీసికొనివచ్చినది ? నేను దీని వేగలాఘవంబులనెన్నుచు న న్నేమార్గమున విచ్చటకుఁ దీసికొనివచ్చెనో గమనింపనైతిని. దీనిని బట్టికొన నెంత దూర మేతెంచితినో, యామర్కట మేమైనది ? అదృశ్యభావమ దిన యొకమహాభూత మదికాదుగదా ? మాయావి యొకం డీరూపంబున నన్నిటకు లాగికొనివచ్చెనేమో ? ఇఁకముందు న న్నేమిచేయునో ? ఇందు దైవము కర్మానురూపమగు ఫలమెయ్యది నాకు సమకూర్చునో ? లేకున్న విధి నాకిట్లు ప్రతికూలుఁడై యుండుటెట్లు సంభ వించును ? నే నిప్పు డేమిచేయవలయును ? ఈ తురంగము నధిష్టించి వెనుకకుఁ బోదునా ? ముందున కరుగుదునా ? లేక యిచ్చటనేయుండి మాయమైన యా కోఁతిని వెదకుదునా ? ఈ యుత్తమాశ్వము నిముసములో నన్ను నగరమునకుఁ దిరుగ దోడ్కొనిపోఁగలదు. కాని మహాద్భుత రసాస్పదంబగు నా వాలీముఖంబును దిరుగఁ గావించు యెట్లు ? దగఁగొన్నవారు పరమ ధర్మార్తిభృత్తులను నితాంతసీతలస్వాదు జలంబులుగలిగి, తీరంబుల ఫలవృక్షములతో నొప్పుచుండు జలాశయంబులఁ దరుచుగ నాశ్రయించుచుందురు. కావున నిప్పు డట్టి ప్రదేశంబునకే బోయెదంగాక ! అచ్చట నైన నవ్వనచరంబు గనంబడకుండునా ? మనఃప్రవృత్తియే సంతోషవిషాదంబులఁ గల్పించుచుండును. తీవ్రమగు నెండలోఁ దిరుగుటచే నలసియున్న యీ యశ్వమునకు నీరుబెట్టి సేదదేర్చి నేనును గాలోచితకరణీయంబుల నిర్వర్తించుకొనుట లెస్సయని నిశ్చ యించి యా వృక్షచ్చాయనుండిలేచి మందగమనంబున నటునిటు దిరుగుచుండ వానికి సమీపముననే జలాశయ మున్నటుల హంసాది జలపతిత్రసందోహకూజిత నిస్వనంబు వినంబడెను. ఇందు కాసారమున్నది రమ్మని సన్నఁజేయుచున్నటుల గాలిచే గదలు చున్న చెట్లకొమ్మలు గనంబడెను. కమలసౌరభంబుతో స్వాగతం బొసంగుచున్న విధంబున నెదురువచ్చు కమ్మగాలులవలన నందు జలాకరంబుండుట నిశ్చయించి యా భూమీశుం డమందానందంబున నా దిక్కునకరిగెను.

ఆ కొండలనడుమ హిమప్రభేదమువలె చందనసంస్కారము లీల చంద్ర పరిణామముగతి శీతకాలసంతానవిధంబున నత్యంతశీలంబై వర్షాగమకోశమువలె సంచి తాంబు సర్వస్వమై, సముద్రరూపాంతరము పోల్కె సుస్వాదుజలమయంబై, వరుణ రాజు చక్రవ్యూహములాగున వివిధోర్మిచమూచలనదుస్తరంబై. మానససరోవరమునకుఁ దోడఁబుట్టువై, మహీమాత్రుకయందలి ఠకారమట్లు వర్తులంబై, నిరాలంబమైయున్న యభ్రగంగ బరువుచేఁ గ్రిందఁబడిన ట్లొక్కచో బుంజీభూతమై, ధర్మము నడంచు గలి కాల మేతెంచుట యెఱింగి‌ యందులకుఁ బ్రతీకార మొనర్ప నేకాంతమునఁజేరి యాలో చించు మందాకినీ నదీత్రయంబు డంబునఁ గుండ్రముగాఁ గలసియున్నదై, సురపతికి ఫణీంద్రునితోఁ గలిగిన వివాదముమూలమునఁ బాతాళమునుండి యూర్ధ్వలోకంబు నకుఁ గొనిపోవ మర్త్యలోకమునకుఁ జేర్పఁబడిన యమృతకుండములాగున నలరారుచు, శైత్యాభిలాషచేఁ బడినట్లు తటతరుచ్ఛాయలు స్పృశించు శీతలతరంగములను, తరంగ సంగతా లంబితంబులగు శాఖాగ్రపల్లవముఖంబుల స్వాదుతాప్రలుబ్దములైనట్లు తీర వృక్షములచే ననవరతంబును ద్రావఁబడు సలిలముగలిగి, క్షారసాగరజలంబులఁ గ్రోలఁ జాలక సుధామధురవారి గ్రహింపఁబడిన యభినవాభ్రపటలంబులవలె విశాలములగు పద్మదళంబులచే నెల్లెడల నావరింపఁబడి వికసించిన తెల్లదామరలందుఁ బ్రతిఫలించి లోనున్న వరుణదేవున కెండ తగులకుండఁ దచ్చైనికులుబట్టిన వెల్లగొడుగులట్లు జెలంగుచుండఁ దీరముననున్న తాళద్రుమంబుల ప్రతిబింబము లయ్యది యమృతకుండ మని భ్రమించి పాతాళమునుండి యేతెంచిన భుజగ వీరులవలెనుండఁ బ్రకాశమానమై యనిలతరలితంబులగు శీకరనికరములచే నిరంతరము చాతకములగు దుర్దినోత్సవ మొన గూర్చుచు నిందిందిరములకు గమలసౌరభసుగంధితంబగు విలాసభవనమై, సుస్వాదు శీతలజలంబున నటవీచరులకు ప్రపాసత్రమై, దుస్తరంబైనను తరంగములచేఁ దరింపఁ బడునదియై, యగాధమైనను జలములకు లబ్దమధ్యమై విమలమైనను నిందీవరప్రభలచే మలినమై, పవిత్రతోయయైనను నరవిందమిధుబిందుమిశ్రితమై, జలదేవతాంజనకూపికల వలె కువలయకళికలంగలిగి, చిందెడిజలమున భూమినెల్లఁ దడుపుచు. నెగురు తరంగ ములవలన దిక్కులాక్రమించుచుఁ బైకిఁ జిలుకు శీకరకదంబకముచే నంతరిక్షమునకు మార్జనం బొనర్చుచు విన్న మాత్రముననే తాపోపహారకమై చూచినంతనే తృష్ణా హారంబై నీటియేనుఁగునకునైన నంతుతెలియనిదై యలలకైనఁ దుని తెలియనిదై యపార జలాకరంబగు కమలాకరంబొండు గనంబడెను.


మ. నవనాళీకమనోజ్ఞవీజనములన్‌ వశ్యుండునై వేడ్క గం
     ధవహోద్యత్తులితంబునైన నవగంధంబంది రోలంబుకుం
     డు వరామోదరనప్రమత్తుఁడయి తోడ్తో పద్మినీలక్ష్మి మ్రో
     ల వికారాతిరవంబునన్‌ దిరుగులీలన్‌ గ్రామ్యజారుం డవన్‌.

అట్టి సరోవరమునుగాంచి యిట్లు వితర్కించుకొనెను.

చ. తిరుగ నగస్త్యమౌని యరుదెంచఁగ వానికిఁ భీతిఁ జెంది సా
    గరములు మూఁడునాల్గు గటకన్‌ వణకూర్ములఁ గానిపింప నీ
    సరసిగభీరగర్భమున సైరతఁజేరఁగఁబోలు దీరమం
    దొరసెడి ఫేనపిండమిష నొయ్యన వింధ్యకు వృద్ధిఁగూర్చుచున్‌.

ఇట్లు తలంచుచు సంతోషాదరస్వాంతుండై భూమీంద్రుండు వడిగఁ దత్తడి నుండిదిగి దానిపైనున్న జీనుఁదీసి కడిగి నీర్వెట్టి తీగెలలో బందమువైచి నవహరిత దూర్వాంకుర మనోహరంబగు నా పరిసరంబున స్వేచ్చగాఁ దిరుగ చ నయ్యశ్వమును విడచెను. పిమ్మటఁ దానును తురగీఖురశిఖరఖండితాధ్వధూళి దూసరమగు చర్గణద్వంద్వ మును గడిగికొని యంబుజాదిజలజకుసుమంబులఁ గోసితెచ్చి మధ్యాహ్నికదేవపూజా దుల నిర్వర్తించెను పిదప లేదామరదళంబులను దీరతరులతాఫలంబులను భుజించి తరు చ్చాయాతిశీతలంబగు జలంబుద్రావి సమీపమున ననేకశాఖోపశాఖలతో నొప్పుచున్న తమాలవృక్షచ్చాయయందు విశ్రమించెను.

అం దుపవిష్టుఁడైయుండి యా వాసరము దలంపునకువచ్చుటచే దాని కొఱకు జలావతరణమార్గంబులఁ దటతరుశిఖరంబుల లతాంతరంబుల గుల్మసంధుల కందరదలీముఖంబుల దృష్టుల నిగుడించి విమర్శింపఁదొడంగెను. పిమ్మట నిట్లు దలంచు కొనెను. ఔరా ! దుష్టమగు నావనచరము నాకెచ్చటను గనుపింపదయ్యెను. ఈ యరణ్యంబున మనుష్యసంచార మున్నట్లు గోచరించుటలేదు ప్రాణులు నివసింపఁదగు ప్రదేశము లేశము నిందుఁ గన్పింపదు. ఈ దుర్వనంబున శ్వాపదంబులుగూడ సంచ రించుచున్నట్లు పొడగట్టుటలేదు. నేనిందుండ నేమిటికి ? కుమారకేసరిప్రభృతు లెందు న్నారోగదా! నన్ను వా రెట్లనుసరించి రాఁగలరు? నాకొఱ కెచ్చట వెదుకఁగలరు ? 4). నెట్లు న ర్థించుచున్నిటో * సరసచూర్వాహార "స? తిరిగి పోయెగంగాం యని తలంచి ఎలయండదు .పఏరుపుదీవ వగిస సూరంభగ వానుని గర్భాండకము విధంబున బ్రకాశించుచు రవి దివంబుననుండి దానికి మిగుల సొగసుగూర్చుచున్నాఁడను నీసున ధరణికిఁగూడఁ దానుండి యందమును గల్పింతునని వచ్చిన మచ్చున నొప్పుచు, నాసన్నవిటపంబులు స్వచ్చమైన తనయందుఁ బ్రతిబింబిత ములై గనంబడుచుండఁ దమాలశాఖాంధకారమున మలినమైన యా శాముఖంబును బహుదూరము బ్రసరించు నిజకరప్రదీప్తిని క్షాళన మొనరించుచు, సర్వత్రవ్యాపించు చున్న నిజతేజోరాశిచే జగములకెల్ల నేకభూతాత్మకత్వంబు నాపాదించుచు, నత్యంత నిర్మలమై యతిమనోహరంబై ప్రకాశించుచున్న మాణిక్యమొకటి గోచరమయ్యెను.

దానింజూచి విస్మయంబందుచు నల్దిక్కులు బరిశీలించి యందెవ్వరును లేకుండుట దృఢపరచుకొని 'ఆహా ! ఈ యపూర్వమాణిక్యి మెక్కడిది ? ఈ చెరువు గట్టున కెట్లువచ్చినది ? ఎచ్చటినుండిపడి యిట్టి దుస్థితి పాలయ్యెను ? అనంతమరీచు లచే నప్రతిహతములగు సహస్రకరములతో నొప్పుచున్నను రాత్రులయందుఁ గాంతి వహింపఁజాలని ద్యుమణిని నిదియతిక్రమించుచున్నది. నిర్మలత్వమునఁ గౌస్తుభమాణి క్యమును నతిశయించుచున్నది. నిష్కోపత్వంబున మునీంద్రులకును సపగతత్రాసత్వం బున సురలకును జిత్తములయందు స్పర్దను బుట్టించుచున్నది. దీనికాంతిచే విజితమై సిగ్గుపడి కౌస్తుభంబు హరివక్షస్థలంబున వనమాలాపగూఢమగు నసితప్రబాంధకారమున నడఁగియున్నది. చింతామణి దీని సామత్యం బొందఁగోరి దానవ్రతంబున నభీష్టసిద్ది యగునని యెఱింగి యర్దులకుఁ గోరినదెల్లనిచ్చు ప్రవృత్తియందున్నది. ఇతరములగు మణులు ప్రభాపరాభవభయంబునఁ గొన్ని యగాధమగు నంబోధిమధ్యమం దడగి యున్నవి. కొన్ని రోహణాద్రి నాశ్రయించి మీఁద మన్ను గప్పుకొని యదృశ్యములై యున్నవి. కొన్ని రసాపలమునఁ బ్రవేశించి ఫణీంద్రఫదాపంజరముల నధిష్టించి యున్నవి. ఇట్టి యుత్కృష్టరత్నము నెవ్వడైన స్నానార్ధ మిచ్చటి కేతెంచి మరచి పోయెనేమో ? అంబరమున విమానముమీఁద సంచరించు దివ్యునిమణి యిందుజారిపడె నేమో ? ఏ వన్యజీవనమైన నే పక్షియైన దీని నెటనైన నపహరించుకొనివచ్చి యిందు విడచిపోయెనేమో ? తుమ్మెదలుమూఁగు పరిమళ ముండుటచేతను నందందు సింధూర రేఖ లుండుటవలనను నియ్యది సౌరభ్యసంభృతాంగవయవ సంగితంబగు నలంకరణమై యొకరమణీమణి విభూషణమని తలంతును అయినను దానిందెచ్చి పరిశీలించెదంగాక యని లేవఁబోవు రాజు ముందర నయ్యశ్వఖురప్రహారవేగంబున నమ్మణి యెగిరివచ్చి పడెను.

340 వ మజిలీ.


అయ్యశ్వము మణిస్పర్శాప్రభావంబునఁ దోడనే తురగరూపమును విడచి జటావల్కలోపవీతములుదాల్చిన తారావళియయ్యెను. పుండరీకుండును నట్టిప్రభావము గల మాణిక్యము దనముందుఁ బయట దిలకించి యేమి‌ యీ యింద్రజాలమని యక్కజ