కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/44వ మజిలీ
నలువది నాల్గవ మజిలీ
వజ్రమాలకథ
గోపా ! వినుమట్లు పుష్పహాసుండు రాజభటులం దప్పించుకొని కోవెల ప్రాకారము దాటి యవ్వల కుఱికెనని నీకు విశదమైనదికదా ! అతండు వలయములు దిరుగుచు నా గోడ ప్రక్కనున్న దొడ్డిలోని మల్లి పందిరి మీదికి దిగెను. త్రాళ్ళపందిరిపై దట్టముగా నల్లి కొని నెరయఁ బూసియున్న యా మల్లి పందిరిపైఁ బడుటచే నతనికిఁ బతనవ్యధ యించుకయు గలిగినదికాదు. పుష్పశయ్యపైఁ బడిన ట్లందుఁ జిక్కు కొనియెను. అప్పు డందుఁ బదియా రేఁడుల ప్రాయముగల యెలనాగ యొకరిత మల్లి మొగ్గలు కోయుచు నాకసము నుండి తటిత్ప్రకాశము పడినట్లు పడిన యతనిం జూచి బెదురుకు దూరముగాఁ బారిపోయి యా దెస చూచుచుండెను.
అంత నతండావల్లి నల్లనఁ దప్పించుకొని లేచి పందిరి దిగి యమ్మగువ దాపునకుఁబోయి బాలామణీ ! యీ గృహ మెవ్వరిది ? నీ పేరేమి ? నీవు నా కొక యుపకారము సేయవలసియున్నది. నీ మొగము చూడ మంచిదానవువలెఁ గనఁబడుచున్నావు. నా కోరికఁ దీరుతుడి యనుటయు నా జవ్వని యతని మువ్వంపురూపు ఱెప్పలారక చూచుచు వెఱగుపడి స్మరశరషిద్ధ హృదయయై మోహావేశంబుననొక్కింత తడవొడ లెఱుంగక మైగరుపార స్మారవికారంబులు సూచింపుచు నించుక తలవంచుకొని యిట్లనియె.
సౌమ్యా ! నీవు దివినుండి యవతరించిన జయంతుఁడవని తలంచెదను. నీ యభీష్టమెద్దియో వక్కాణింపుము. సత్వరంబుగఁ దీర్చి కృతార్దురాలనగుదును. ఇది వజ్రదత్తుఁడను వర్తకుని గృహము. నే నతనికికూఁతురను నా పేరు వజ్రమాల యండ్రు మా తండ్రి యల్లునితో గూడ ద్వీపాంతరమందున్న యమరావతీపురికి వర్తకము నిమిత్త మరిగెను. మా తండ్రి పురుషాపత్య రహితుఁడగున నల్లునిం దెచ్చి యింటఁ బెట్టికొనియెను. మా తండ్రికిఁ బ్రవహణ వ్యాపారము రత్న వ్యాపారము మాత్రము గలిగియున్నవి. మేము గూడ మొన్ననే యా పట్టణంబునకుఁ బోవలసినదే. మా బంధువుఁడు పోలిసెట్టియనువాఁ డీనడుమ బలవన్మరణము బొందుటచేత నా పయన మాగిపోయినది. దానికి ఫలము మీ దర్శనమే యని వృత్తాంత మంతయుం జెప్పిన విని పుష్పహాసుం డాత్మగతంబున నిట్లు వితర్కించెను.
ఔరా ! యీ నారీమణి నన్ను జూచి మరుబారిం బడినది తాను మగనాలి యయ్యు నిట్టి వికారము బొందుట ధర్మవిరుద్దం బని యెఱుఁగదు. ఆహా! స్త్రీల చేష్టలు కడు విపరీతము లైనవి. కానిమ్ము. నేనిప్పుడు వైరస్యము జూపితియేని కార్యము చెడిపోవక మానదు. పరిచయంబు గలిగిన పిమ్మటఁ గ్రమంబున నొక్కి వక్కాణిం చెదఁ గాక. యని తలంచి తరుణీమణీ ! నే నొక బాటసారిని నన్నన్యాయముగ రాజ భటులు పట్టుకొనఁ జూచినఁ దప్పించుకొని పారిపోయి వచ్చితిని. నా యుదంత మంతయు ముందు వివరించెదను. మా యింట దాచి మీరు పోవునపుడు నన్నుఁ గూడ నమరావతీ పురంబునకుఁ దీసికొని పోవుఁడు అది యే నా కోరిక యని చెప్పెను.
1 . . . . . . . . . ) అమ్యం నా జవ్వసము నేటి సాగును . "మ " అన్నది. ఆ ) 13. సువచ్చి నరంటట సినది. అమ్మక గు, మ్య సం .. చుర న్మకు స్వర్గమ్మదియేల? ము...... , సున్నము గలడు . . ్వళ్ళూరు సుసం తో నా వగ - తు. "పు త. . . గిం ను ముపుమడ.3 దీనికి నన్నింత బ్రతిమాల వలయునా ? నా హృదయంబునం బెట్టుకొని నిన్నుఁ గాపాడెద మా యింటనున్న ఫాలాక్షుండైనఁ దెలిసికొనఁగలఁడా ? ఆ సౌధంబు లన్నియు మా యవియే సుమీ, లోపలికి బోవుదము రమ్ము. పరిచారకులై నం జూడఁ గూడదని పలుకుచు నతని చేయిపట్టుకొని మారు దారి నొక మేఁడమీఁదికి తీసికొనిపోయి కూర్చుండఁ బెట్టినది.
అంతలో రాజభటులు వచ్చి వాఁకిట నిలిచి తలుపులు తట్టుచు గేకలు వైచిరి ఆ రొద విని వజ్రమాల యామేడ దిగి తల్లి యొద్దకు వచ్చినది. అప్పుడు పరిచారకులు వచ్చి రాజభటులు మన యిల్లు పరీక్షింతురఁట. ఎవ్వఁడో దొంగ యొకఁ డీవైపునకుఁ బారిపోయి వచ్చెనఁట. తలుపులు తీయుమనుచున్నా రని పలికిన విని వజ్రమాల వానికిఁ గొంత లంచము పంపి యిందాఁడువారు కాక మఱియెవ్వరునులేరు. మేమంతయుం జూచి వచ్చితిమని చెప్పుఁడని పరిచారకులకు బోధించి యంపినది. రాజ భటు లాపరిచారకు లిచ్చిన లంచముకొని సంతసించుచు నా యిల్లు పరీక్షింపక యవ్వలికిం బోయిరి. అప్పుడు వజ్రమాల బ్రహ్మర్షసాగరమున మునుంగుచు నాఁడుకాంచన మణి భూషాంబర విశేషంబులం దాల్చి యచ్చర మచ్చెకంటి తెఱఁగున మెఱయుచు నుపహారంబులఁ బెక్కుగై కొని అమ్మా ! నేఁడు నేనా క్రీడాసౌధంబునం బండుకొనియెదను. పిలువకుమని చెప్పిన విని యమ్మగువ బాగు బాగు ! నీ మగఁడూర లేడుగదా. యొంటివై నీవా మేడం బండుకొనుటకు, గారణమేమి ! నేఁడు సింగార మేమిటికి సేసితివని యడిగిన బుడి బుడి దుఃఖం బభినయించుచు నమ్మించుఁబోడి తల్లి కిట్ల నియె.
అమ్మా ! నీతో జెప్పక దాచనేల ? రాత్రి నా మనోహరునితో గ్రీడింపు చున్నట్లు కల వచ్చినది మధ్యను మెలకువ వచ్చుటచే నప్పటి నుండియు నా మనంబున నెట్లో యున్నది. నేఁడు సౌధంబున నా తల్పంబునఁ బండుకొని తత్ప్రతికృతిం జూచుచు నిద్రించితి నేని స్వప్న శేషంబు పొడగట్టి శేషించిన క్రీడావిశేషంబు ఫలం బనుభవింపఁగలదాననేమో యని భ్రాంతిపడుచు నిప్పనికిఁ బూనుకొంటిఁ దెలిసినదా ? యూరక కుశంకలు చేయుదువని పలికిస విని యా యిల్లాలు నల్లుండు దేశాంతరమఱిగి తడవయ్యెఁ గూఁతున కభిలాష గలిగినది కాఁబోలునని తలంచి యంగీకరించినది. పొలంతుకలుబొంకులకు నెలవులుకారా !
అట్లు తల్లి చే ననిపించుకొని వజ్రమాల యా మేడలోనికిం బోయి తలుపులు వైచి గాజుదీపములు వెలిగించి యొకపీఠంబున నొదిగి యేదియో ధ్యానించుచున్న పుష్పహాసుం బలంకరించి ఆర్యా ! నీవిఁక వెఱవవలసిన యవసరము లేదు. రాజభటులువచ్చిరి. లంచమిచ్చి సాగనంపితి. ఇవిగో నీళ్ళు కాళ్ళు గడిగికొనుము. ఇవి ఫలము లివి భక్ష్యము లిది పరమాన్నము ఇవి పాలు నీ యిచ్చవచ్చిన వానిం భుజింపుమని పలికిన నతండిట్ల నియె.
తొయ్యలీ ! నాకొఱకింత ప్రయత్నము చేసితివేల ? ఇవి యన్నియు నేమిటికిఁ దెచ్చితివి ? నేను వాని భక్షింపనోపఁ బాలుమాత్రము పుచ్చుకొనియెదఁ గొన్ని దినములనుండి నొక వ్యాధి బాధింపుచున్నది. దానంజేసి పథ్యంబు చేయుచున్న వాఁడనని పలికిన విని యప్పడంతి యెడద కఱుకుమన మనోహరా ! యివి యన్నియు పథ్యములే. వీనిం దినిన నీ వ్యాధి మొదలంట బోవఁగలదు. తఱచు సుకుమారు లిట్లే పలుకుచుందురు. నా యాన వీనిం భక్షింపక తీఱదని బలాత్కారముజేసి యెట్టకే వానిచేఁ గొన్ని భక్ష్యములు దినిపించినది. పిమ్మట నాకులు మడిచి యిచ్చినది. కాని యతండది యందికొనక యా పళ్ళెములోనే యుంచి యిట్లు సంభాషించెను.
పుష్ప - బోఁటీ నీ మాటలు చేష్టలును బరికింప మిగులఁ భ్రౌడవువలె గనంబడుచుంటివి. నీ వేమైనం జదివితివా ?
వజ్రమాల -- ఎన్ని యేనిం జదివితి. నా చదువులకు నా రసికతకు నానందించు వారెవ్వరు?
పుష్ప - ఎవ్వరానందింపవలయు నీ భర్తయే యానందించును.
వజ్రమాల – నా భర్త యాపాటివాఁడైనచో నాకీ ప్రారబ్ధమేల ?
పుష్ప - (స్వ) ఓహో ? మిగిలిపోవుచున్న దే (స్వ) కానిమ్ము నీ వేయే గ్రంథములు చదివితివో జెప్పుము.
వజ్ర - వసుచరిత్రము, తారాశశాంకవిజయము, బిల్హణీయము, హంస విశంతి, శుకసప్తతి, రాధికాస్వాంతన, కొక్కోక, కామసూత్ర కందర్ప చూడామణి, అసంగరంగ, రతిరహస్య, నాగస్వర స్వకాసిరత్న, మన్మధ, సంహిత, మనసిజసూత్ర, రతిమంజరి, కామమంత్ర, రతికల్లోలినీ, పంచనాయక ప్రథృతి శృంగార ప్రబంధము లన్నియుం జదివితిని సంగీతములో నా ప్రభావము నేను జెప్పుకొనరాదుగాని సరస్వతినైన మెచ్చుకొనను. అన్నియుఁ గలిగియున్నవి అంచునకు తొగరుమాత్రములేదు.
పుష్ప - వైరాగ్య గ్రంథము లేమియుం జదువలేదా ?
వజ్ర - అవి వృద్ధులు చదువుకొనవలసినవి. మనబోంట్ల కేల ? పుష్ప - పోనిమ్ము కొక్కోకము కంఠస్థముగా నున్నదియా ?
వజ్ర - (ముఱియుచు) తలక్రిందుగా నేకరువు పెట్టగలను.
పుష్ప - అందుఁ బండ్రెండవ పరిచ్చేదము నీకు జ్ఞాపకముగా నున్న దియా ?
వజ్ర - (నవ్వుచు) ఓహో ? పదియేను పరిచ్ఛేదములుండ నీ కది దొరికినదా ? మంచి రసికుండవే. అది స్ఫుటముగానే యున్నది. దానిలో నేమి యడిగెదవు ?
పుష్ప - పదవ శ్లోకము చదువుము.
వజ్రమాల – నాకు రాదనుకొంటిరాయేమి ? వినుఁడు.
శ్లో॥గతిపతి దయితేతు క్వాపి మాంగళ్య మాత్రా
ణ్యపచిత గురువిప్రా ధారయే స్మండనాని
అనవసిత విధానె తస్యనిర్వాహయత్నం
వ్రతనియమ విధించ క్షేమసి ద్యైవిదధ్యాత్.
ఇదియేనా ?
పుష్ప -- అగు నందలి తాత్పర్యమేమియో చెప్పుము.
వజ్ర — భర్త గ్రామాంతర మరిగినప్పుడు భార్య మంగళసూత్రములో నగు ప్రధానవస్తువులు మాత్రమే ధరింపవలసినది కాని యితరాలంకారము లేమియు ధరింపఁగూడదు. మరియు గురువిప్రాదుల సేవింపుచు నతని క్షేమముకొఱకు వ్రతములు చేయుచుండవలయు.
పుష్ప - మఱి నీవట్లు చేయుచుంటివా ?
వజ్ర - అమ్మకచెల్లా ! నన్నాక్షేపించుటకా యీ పరీక్ష : తెలిసికొనలేక బోయితినిగదా.
పుష్ప - నాకిప్పుడు మనస్సు కొంచెము వ్యాకులముగానున్నది. భవదీయ గాంధర్వ పరిశ్రమంబు దేటపడ వీణాగానరసం బించుక చెవులఁ జిలికించి యానందము గలుగఁ జేయుము.
వజ్ర - ఈసారి మంచిదారికి వచ్చితివి. అని సారెలు సవరించి వీణం జేతఁబూని మనోహరముగా సంగీతము పాడుచున్నది.
అప్పుడు పుష్పహాసుండు పీఠమున జేరఁబడి. . . . . inurme 'ఆ చిన్నది ఆహ్య : ఏనికి ఈ త్వమే . తను న్నది . మంత శ్రీనుండైన - - - - - - ... : సిన నీరు ..... దిల్లిన మంత . . . కాకతి పోలు లంచుచు నాతండు రంగా అము..... మేల్కొనునేమో యని పెద్దగా రొదచేయుచు నిట్టూర్పులు నిగుడింపుచు బలువెతలం గుడుచుచుండ నింతలోఁ గోడికూత వినంబడినది.
అప్పు డప్పడతి యా యింటితలుపులు మూసి తల్లి యొద్ద కరిగి పండుకొన్నది. తల్లి యు నవ్వుచు అమ్మా ! కలలో నీ మనోహరుఁడు గనంబడెనా ? యెంత బేలవోగదా! అంత యేలవచ్చినది ? మనము పోవుదము రమ్ము. వారు రమ్మని యిదివఱకే వార్తల నంపిరిగదా. రేపు మనయోడ నొకటి పయనము జేయింపుఁ డని నావికుల కాజ్ఞాపించెదనని పలుకుచు నోదార్చినది. ఆ మాటలేమియు నా బోటికి చెవికెక్కలేదు. అత్తరుణి మఱల మధ్యాహ్న ముపహారములం గొని యా మేడకుఁ బోయి యాతనికిచ్చుచు సుందరుఁడా ! నీ వంటి రసికు నెందును జూడలేదు. రాత్రి నన్ను సంగీతము పాడుమని నిద్రఁబోయెదవా ? చాలు చాలు నేనెంతో ముచ్చటపడి మంచిరాగము లాలాపించితినే ! నా మగనికన్న వెక్కువవాఁడవలె నుంటివని యించుక యలుకతోఁ బలికిన నా చతురుండు మందస్మితము సేయుచు సిట్ల నియె.
సాధ్వీ ! నాకుఁ బదిదినములనుండి నిద్రలేదు. అదియునుంగాక “దుఃభీతే మనసి సర్వమసహ్యం" అను నార్యోక్తి వినియుందువుగదా ? నా వెఱపు నీ కేమి యెఱుక ! నన్నెట్ల యిన నమరావతికిఁ దీసికొనిపోవుదువేని నా చాతుర్య మక్కడఁ జూతువుగాని మఱియు నాకు వ్యాధి బాధింపుచున్నది. ఇట్టిస్థితిలో నీ సంగీతము నాకు రుచించునా ? యని పలికిన విని యజ్జవరాలు నవ్వుచు నిట్లనియె.
నిన్ను ఫాలాక్షుఁడు చూడలేదు. నిర్భయముగా నుండుమని యభయహస్త మిచ్చి యుండలేదా ? ఊరక వెఱచెదవెవ్వరికి ? అమరావతీ ప్రయాణము సిద్ధమయ్యే యున్నది. నీ మది సంతసించినం జాలునని పలికిన నతం డిట్ల నియె.
సఖీమణీ ! నన్నుఁబట్టుకొనుటకై రాజభటు లెల్లెడలఁ గడు ప్రయత్నముతోఁ దిరుగుచున్నారు. వెనుక నోడలోఁ గూర్చుండగనే పట్టుకొనిరి. కావున నేనీ రూపు మార్చి స్త్రీ వేషము వైచుకొని మీతో వచ్చెదను. అట్లయిన బరీక్షించుట కవకాశ ముండదు. నీకునుం దప్పునుండదని పలికిన సంతసించుచు నయ్యంతి భళిలే ! మంచి యూహ చేసితివి. దానం బెక్కులాభము లున్నయవి. అని యుబ్బుచు ---------------- యప్పుడే వానికిఁ దలదువ్వి జడవైచి చీరఁగట్టి నగలువెట్టి యద్దము జూపినది. అతండు తన రూప మద్దములోఁ జూచుకొని మిక్కిలి వెరగుపడఁజొచ్చెను. జగన్మోహినివలె నున్న యతని స్త్రీ వేషమునుజూచి వజ్రమాలయు సిగ్గుపడఁజొచ్చినది. దరచు పురుషులకు వ్యత్యయ వేషములు వైచికొనినప్పుడు క్రొత్తయందము ------------- వజ్రమాల యతని దల్లి యొద్దుకుఁ దీసికొనిపోయి అమ్మా ! ఈ నదులు ..వరు -- (తుపట. దీని ధర యమకావు : న్న.....! పుదుము. తెలు ది..తం - అని. వచ్చ లేనప్పుడు..... గృహకాగ్యములు చక్కగట్టుక పడింది. నలు, పులు.. ము... నాకు సహవాసముగా నుండును. ఇది తప్పుగా గణించవుగదా : యని చెప్పిన నామెనవ్వుచు నిట్లనియె.
పుత్రీ ! మంచిపనియే చేసితివి. కాని యిన్నివస్తువులతో నీ చిన్నదానిని దానివారలు లేకుండ విదేశమునకుఁ దీసికొనిపోవుటకు గొంచె మాలోచింపవలసి యున్నది. కానిమ్ము. సమ్మతించి యుంచితివిగదా. దీన మనము పడియెడు శ్రమ యేమి యున్నదని యనుమోదించినది.
అమ్మ ఱునాఁడు నక్షత్రము మంచిదికాకపోవుటచే వారికాదివసము రాత్రియే ప్రయాణము సేయక తప్పినదిగాదు. దానంజేసి వజ్రమాలకు నాఁటిరేయి పుష్పహాసునితోఁ గూడ సంకల్పించిన ప్రకార మా మేడలో వినోదింపఁ దటస్థించినదికాదు. నావికుల రప్పించి భోజన సామాగ్రియుం బఱుపులు మందసములులోనగు వస్తువులెల్ల బండ్ల మీఁద బంపి వారు మువ్వురు నొక బండిలోఁ గూర్చుండి యోడ యొద్ద కరిగిరి.
రాజభటులు వచ్చి వారిం బరీక్షించి యాఁడువాండ్రగుట విడిచి పెట్టిరి ప్రవహణ మెక్కినతోడనే నావికులు మంచిగాలి విసరుచున్నది కావునఁ దెరచాపలె త్తి యోడను విడిచిరి. అదియు నా సముద్రములో వాయువేగముగా నడువఁజొచ్చినది. ఆ యోడంత పెద్దదికాకపోవుటచేత వజ్రమాల తలచుకొనినప్రకార మందు స్వేచ్ఛగా వానితో వినోదించుటకు వీలుపడినదికాదు.
ఆ యోడలోఁ బుష్పహాసుఁ డెప్పటికప్పు డేదియో మిషపన్ని వజ్రమాల కొలఁదిగా దొరకక తప్పించుకొని తిరుగుచుండెను. ఆ ప్రవహణంబు మంచిగాలి విసరుటచే బదిదినము లహోరాత్రములు చాలాదూరము పోయినది. ఇఁక రెండు మూడు దినములలో రేవుచేరునని నావికులు సంతసించుచుండ నా గాలియాగి వినిమయ పాతంబు వీవఁజొచ్చినది. అప్పడానౌక యటుపోక రెండవదెసకరుగఁ జొచ్చుట ------- నావికులు భయపడుచుఁ దెరచాపలు ------------ సాధనంబులన్ని తొంటిదెసకు నడిపింపఁజూచిరిగాని వారి ప్రయత్న మేమియుఁ గొనసాగినదికాదు.
ఆ ప్రతికూలవాతంబు గ్రమక్రమంబునఁబలిసి విసరుచుండుటయు నత్తఱిక త్తరి వాహకులు తత్తరమందుచు తెరచాపలుదింపుటకుఁ బ్రయత్నముచేయు చుండ నింతలో గాలివానబట్టి యా యోడ యట్టిట్టు కొట్టుకొనుచు మునుఁగుటకు సిద్దపడినది. అప్పుడు నావికులు నిష్ప్రయత్నులై దైవమును బ్రార్థింపుచుండిరి. అప్పుడా నౌక మునుఁగక దైవవశంబున నొక గాలివిసరున నొకదీవికిఁ గొట్టుకొనిపోయి యందున్న పర్వతమునకుఁ దగిలి నూఱువ్రక్కలగుటయు నందున్న వారు ప్రాణా --- యొడ్డునంబడుట దర్ఘటమైనది.
వజ్రమాలయుఁ దల్లియుఁ బుష్పహాసుఁడు ... ఆ నది యే మనము ఆయన నాడు ఇం సము. సచికాదు. దీవియని చెప్పిరి. అంతలో దమదెసకెవరో వచ్చుచున్నట్లు గనంబడిన సంతసించుచు వీరును వారికభిముఖముగా కొంతదురముపోయి వారినేదియో యడుగదలంచునంతలో వాండ్రు దొంగలని తెలిసికొని పారిపోవఁ బ్రయత్నించిరి. కాని యంతలో వాండ్రు వచ్చి కలిసికొని వారి శరీరముననున్న వస్తువులన్నియు లాగికొని కట్టుగుడ్డలతో విడిచిపెట్టిరి. నావికులు మఱియొకదెసకుఁ బారిపోయిరి. కావున వీరు మువ్వురు మాత్రమే మిగిలిరి.
అప్పుడు స్త్రీవేషము విడిచి పుష్పహాసుఁడు తొంటిరూపముతోఁ తిరుగఁ బ్రయత్నించెను. కాన, వజ్రమాలతల్లివలన మాటవచ్చునని యంగీకరించినదికాదు. అతం డారూపముతోడనే యుండి వారిరువుర నోదార్చుచు ధైర్యము వహించి యందున్న యొకదారి ననుసరించి నడువసాగెను. ఆ పర్వతము దిగినతరువాత నందున్న భూమి తెరపిగానే కనంబడినది. ఆదారి సముద్రముదరిగాఁ బోయినది. వారా దారిననుసరించి నడుచుచుఁ గొంతదూరము పోయిన వెసుక నొకచోటఁ గొందఱు మనుష్యులు నేల దున్నుకొనువారు గనంబడిరి. వారింజూచి పుష్పహాసుఁడిది యేదేశము? గ్రామమెంత దూరమున్నదని యడిగెను. కాని వారి కామాట తెలియక వారి భాషతో మీరెవ్వరని యడిగిరి.
పుష్పహాసుఁ డఖిలభాషా వేదియగుట, దెలిసికొని వారిభాషతోనే మఱల నడిగెను. వారప్పుడది యవనద్వీపమనియు యవనావతియను పట్టణ మచ్చటికి రెండు క్రోశముల దూరములో నున్నదనియుంజెప్పిరి.
వరుణదత్తుని కథ
ఆ మాటవిని పుష్పహాసుఁడు భయమభినయించుచు బోటులారా ! మనము ప్రాణసంకటమైన చోటునకు వచ్చితిమి. ఇది యవనద్వీపమంట. మనదేశములోఁ దప్పుజేసినవారిని యీద్వీపమునకుఁదీసికొనివచ్చి విడిచిపెట్టుదురు. ఇందున్న ---- లతిక్రూరులు. పొలదులంబట్టి వేధింపుచుందురని మనదేశములోఁ జెప్పుకొను చుందురు. పోనిండు యేమి చేయుదుము ? దైవమట్లు పంచిన నట్లు పోవలసినదేగదా యని పలుకుచు వారిని వెంటఁబెట్టుకొని యతండు వడిగా నడచుచుఁ గొంచెము ప్రొద్దువేళ కాపట్టణప్రాంతమునకు పోయెను.
అట్టి సమయమున నొక్క గొప్ప యుద్యోగస్థుఁడు రెండుగుఱ్ఱముల బండిమీఁద విహారార్దమై యరుదెంచుచు దారిలో వారిమువ్వురింజూచి బండినాపి మీరెవ్వరు ? ఎందుఁబోవుచున్నారని పరిచారకులచే నడిగించెను. పుష్పహాసుఁడు బండి దాపునకుఁ బోయి యా పురుషుని యాకారము విమర్శించిచూచెను. విశాలమైన నేత్రములును, చంద్రబింబమువంటి మొగము, ఆజానుదీర్ఘభాహుపులు వెడదరయురము సువర్ణచ్చాయయుఁ గలిగి మిక్కిలి శోభించుచున్న యాపురుషసౌందర్యమునకుఁ బొడవగు గడ్డము మాత్రమించుక వికారముగానున్నది.
అతని రూపలక్షణములు పరీక్షించి యౌదార్యపురుషుఁడని నిశ్చయించి పుష్పహాసుండు సలాముచేయుచు అయ్యా ! మాది హిందూదేశములో రేవానగరము. అమరావతీపురంబున కరుగుచుఁ గడలి నడుమ గాలివానపట్టి కలము వికలమై యీ దెసకుఁ గొట్టికొనివచ్చి శకలమైనది. పిమ్మట దొంగలు వస్తువులు దోచికొనిరి. దారిఁ గానక యిట్లు వచ్చుచున్నారము. మాదేశమునకు పోవుమార్గ మేదియేనియున్నఁ దెలిపి పుణ్యంబు గట్టికొనుఁడని సవినయముగాఁ బ్రార్దించిన జాలివొడమ యప్పుణ్యాత్ముం డించుక సే పేదియో ధ్యానించి యిట్లనియె.
మగవారి తోడులేక యాఁడువాండ్రు పయనము సేయవచ్చునా ? మీరిప్పు డీపట్టణములోఁ బ్రవేశించితిరేని యీయవనులు మిమ్ము భంగపెట్టకుందురా ! మీ పుణ్యము మంచిది కావున, నాకుఁ గనంబడితిరి. మాయింటికిరండు స్వల్పకాలములో మీ దేశమున కనిపెద, నిందుఁ గూర్చుండుఁడని తనబండిలో నొకమూల తావిచ్చెను.
ఆ పురుషుని యకారణవాత్సల్యమునకు స్తుతిఁజేయుచు పుష్పహాసుఁడా యిరువురతరుణులతో నాబండిలోఁగూర్చుండెను. పైవిహారముమాని యాయుద్యోగస్థుఁడు బండి మఱలించి యప్పుడే తనయింటికిఁ దోలించుకొనియెను. తదీయమందిర ప్రాకారవిశేషంబులెల్ల జూచి యబ్బురమందుచుఁ బుష్పహాసుం డతనినొక చక్రవర్తిగాఁ దలంచుచుండెను. పిమ్మట వారు మువ్వురు భృత్యనిర్దిష్ట మార్గంబున లోపలికింబోయిరి. ఆ యజమానిభార్య వారి వృత్తాంతము దా సేతరులవలస విని మిక్కిలి గౌరవించుచు నివసింపఁదగు గదులంజూపినది. ఆమెచేసిన సత్కారములకు కడువిస్మయము జెందుచుఁ బరోపకారపారీణు లన్నిదేశములలో నున్నారుగదా యని యగ్గడింప దొడంగినది.
వారింటనున్నప్పుడుకూడ వజ్రమాల పుష్పహాసుఁడు తనమనోరథము తీర్చునని యాసపడుచు నాసన శయనాది సమయములయం దేకాంతముగా దొరకునేమోయని చూచుచుండెను. కాని యతండట్టి యవసరమీయక తప్పించుకొని తిరుగు చుండెను క్రమంబున బుష్పహాసుండా యజమానిభార్యతోఁబరిచయముగలుగఁజేసికొని యొకనాఁడు అమ్మా ! యీపట్టణములోనున్న వారందఱునొక్క జాతివారుగా గనంబడుచున్నారు. మీమతము హిందూమతమువలెఁ దెలియఁ బడుచున్నది. -------------- దులసిమొక్కవోలె మీరొక్కరీతుఱకవీటిలో నెంతకాలమునుండి వసించితిరి ? మీ వృత్తాంతమించుక చెప్పియామోదము గలుగఁజేయుమని ప్రార్థించినదా సంతసించుచు నిట్లనియె.
వసంతసేన కథ
సుందరీ ! మాతండ్రి హిందూదేశవాస్తవ్యుండు. శూరసేనుండను నొక సామంతరాజు అప్పటి చక్రవర్తి కాయనపై యెద్ధియో కోపమువచ్చి మున్నిచ్చిన గ్రామంబులు లాగికొని కట్టుగుడ్డలతో విడిచిపెట్టెనఁట. అప్పుడు తనకుఁ గలిగిన యవమానమునకు మిక్కిలి లజ్జపడుచు మాతండ్రి యాదేశమున నుండనొల్లక భార్యతో బయలుదేరి విదేశములయాత్రచేయుచుఁ బ్రవహణ ప్రయాణంబున నొక్క నాఁడు మక్కాయను పట్టణంబున కరిగెను.
అప్పుడు దైవవశంబున నీపట్టణపు సుల్తానుగారి భార్య పెద్దబిబ్బియాత్రార్థమై యక్కడికివచ్చినది. ఎట్లో మాతండ్రిగారామెతోఁ బరిచయముచేసికొని తనకుటుంబ గౌరవమంతము నామెతోఁ జెప్పుకొనిరఁట. అప్పుడామెకు జాలిగలిగి యాదంపతులఁ దమతో నీవిఁటికిం దీసికొనివచ్చి యిందొక యుద్యోగమిప్పించినది. మాతండ్రి మిగుల బుద్ధిమంతుఁడగుడఁ గ్రమక్రమంబున నాశ్రయించి సుల్తానుగారి యనుగ్రహమునకుఁ బాత్రుండై మిగుల ధనము సంపాదించెను.
మాతండ్రి యిక్కడికివచ్చి నలుబది సంవత్సరములై నది. ఇక్కడికివచ్చిన పదిసంవత్సరములకు నేను జనించితినఁట. లేక లేక గలిగినదానగుట నన్నత్యంత ప్రేమానుబంధ పూర్వకముగా జూచుచుఁ బెంచుచుండిరి. కాలచక్రంబున నభివృద్ధి నొందుచున్నఁ నా మేన యౌవనచిహ్నములు పొడసూపుచుచుండ మాతండ్రికి వివాహ చింతస్వాంతంబున వేధింపందొడంగినది. కామధేనువు గటికివానికి దానమిచ్చినట్లిందలి యవనులకుఁ గూతునిచ్చుట కంగీకారము గలుగదుగదా ! స్వజాతి పురుషుఁడీదేశమునలే డేమిచేయుటకుందోచక మాతండ్రి దైవముమీదనే భారమువైచి కాలక్షేపముఁజేయు చుండెను.
అట్లుండ గొండకనాఁటి సాయంకాలమున నొక పురుషుఁ డీపురవీధులం దిరుగుచుఁ గనంబడిన వారినెల్ల అయ్యా ! బాటసారులు నివసింపదగిన సత్ర మెందున్నదని యడుగుచుండఁ దురకలు పరిహాసము సేయుచు నటుయిటు యిటుసటు అని త్రిప్పుచుండిరఁట. ఇందున్నవారికి సత్రమన నేదియో తెలియదు. మసీదని యడుగవలయు నా పరిభాష యాపురుషుఁ డెఱుంగడు. పాపము రాత్రి రెండు యామముల దనుక తిరుగుచుండెనఁట. మఱియుఁ ద్రాగిమత్తిల్లి యొడలెరుంగక తిరిగెడు యవను లతనిం దిట్టుచుఁ గొట్టుచు బారద్రోలుచుండిరి.
మాతంగడింభకుల రాయిడింబది పరుగులిడు వృషభవత్సంబుచాడ్పున నతండు వీధులవెంబడి పరుగులిడఁ దొడంగెను. దొంగ దొంగ య మఱికొందఱు తరిమిరఁట, హిందువులంజూచిన నిచ్చటివారు కుక్కలంబోలె తరుముచుందురు. వీరికి దయాదాక్షిణ్యములు లేవు. నీచులకు స్వస్థానబలం బధికము. ఆ పురుషుడు మఱునాఁడుదయ కాలము వఱకు విశ్రాంతిగానక తిరుగుచు బాషాణదండ ప్రహరణంబుల మేనంతయు రక్తము గారుచుండఁ సేకస్త్రాచ్ఛాదితుండై దుఃఖించుచు ఉనున్మత్తుండువలె మాయింటిదాపునకు వచ్చెను. అపుడు మాతండ్రి వీధియఱుగుపయిఁ గూర్చుండి దంతధావనము జేసికొనుచు దురక బాలురచే దరుమఁ బడుచున్న యా పురుషుం జూచి జాలిపడి నిలునిలుం డని వారినెల్ల నదలించి యతనిం దాపునకుఁ బిలిచెను.
అప్పుడతండాహా ? ఇంతపట్టణములో నీ మాత్రము చల్లగామాటాడిన పుణ్యాత్ముఁ డిదివఱకు గనంబడలేదు. ఎవ్వరితో జెప్పుకొనినను బాదుమనువారే కాని యాదరించుమనువారొక్కరును లేరు శ్రీరామరామ ! యిది రాక్షసనగరమని తోచు చున్నదే ! యని పలుకుచు నతండు మాతండ్రి దాపునకువచ్చి నమస్కరించుచు దన దెబ్బలన్నియుం జూపి అయ్యా ! ఇంత యన్యాయ మెందైనం గలదా ? ఇక్కడఁ బ్రజలం బాలించు రాజులేడా ? అయ్యయ్యో ? నిన్న రాత్రియెల్ల నన్నీ పౌరులు పెట్టిన బాధ పరమేశ్వరుఁ డెఱుగు. పూర్వజన్మమున నెట్టిపాపముచేసితినో యని దుఃఖింపుచుఁ దనపాటమంతయు మాతండ్రితోఁ జెప్పుకొనియెను.
మా తండ్రి యతని మాటలచే హిందువుఁడని తెలిసికొని యోదార్చుచు లోపలికి దీసికొని వచ్చి వైద్యుల రప్పించి యా గాయములకుఁ జికిత్స జేయించి యన్న పానాదులిచ్చి యాదరించెను. నాలుగు దినములలో నా గాయము లన్నియు మానిపోయినవి. తదీయ రూపరేఖా విశేషంబులు మదికచ్చెరువు గొలుపఁ మా తండ్రి యొకనాడు నీ వెవ్వడవు ? ఇందేమిటికి వచ్చితివి ? నీ వృత్తాంతము సెప్పుమని యడిగిన నా పురుషుం డేదియో ధ్యానించుచు నేనొక గొప్పవంశపు క్షత్రియుఁడ నా పూర్వ చారిత్ర మేదియో నాకే స్పురింపకున్నది. తెలిసినట్లే యుండును గాని చెప్పుటకు నోఁటికిరాదు. శాపోపహతుండనై సముద్రంబునం బడితిని. అందు మునుంగకయీది కొని తీరము జేరి నిన్న సాయంకాలమున కీ పట్టణములోఁ బ్రవేశించితిని. తరువాతి కృత్యంబు లన్నియు మీకు విన్నవించియే యుంటినన చెప్పిన వెఱఁగుపడుచు మా తండ్రి యతనిం దనయింటఁ బెట్టుకొని వరుణనిత్తుఁడని పిలుచుచుఁ బోషింపుచుండెను.
మఱికొన్ని దినము లరిగిన వెనుక నే వినుచుండ మా తల్లి తోఁ గాంతా ! మన వసంతసేనకు బ్రాయము వచ్చినది. వివాహము చేయవలసినదిగదా. మన జాతివా రీ దేశమునలేరు. ఈ వరుణదత్తుఁడు రూపంబున మన్మధుం బోలియున్న వాఁడు. విద్యాగుణ శీలంబుల నన వద్యుఁడనియే చెప్పదగినది. ఉత్తమ క్షత్రియుఁడఁట. వీని మన యింటికి భగవంతుఁడే తీసికొనివచ్చెను. వీనికి మన వసంత సేననిచ్చి వివాహము చేయవలయునని యున్నది. నీ వేమనియెదవని యడిగిన మా తల్లి నా మొగము చూచినది. నేనింగితముల నంగీకారము సూచించితిని. అప్పు డా దంపతులు సంతోష ముతో శుభముహూర్తంబున నన్నాతనికిచ్చి వివాహముఁ గావించిరి. అతండే నా భర్త.
నే నట్లనుకూలవాల్ల భ్యంబు లభించుటచేఁ బరమ సంతోషముజెందుచు నీయనతో సకల సౌఖ్యముల ననుభవించుచుంటిని నా భర్త మిగుల దయాళుండు సౌజన్య నిధి. సుగుణాకరుండని చెప్పఁగలను వినుండు. హిందూ దేశమున ద్వీపాంతరవాస శిక్ష విధింపఁబడినవారి నీ దీవికిఁ బంపుచుందురు. అట్టివారిం బట్టుకొని యిక్కడి యవనులు పశువులం బోలె బాధించుచుఁ బనులు సేయించుచుందురు. అది యంతయుం జూచి నా భర్త యట్టివారిం బనులు సేయించుటకుఁ దనకధికారమిమ్మని మజ్జనక ముఖముగా సుల్తానుగారిం గోరికొనియెను. సుల్తాను మా తండ్రి మాటలకు జవదాటఁడు కావున నట్టియుద్యోగ మప్పుడే యిచ్చెను. నా తలిదండ్రులు కొలఁదికాలము క్రిందనే నాక మలంకరించిరి.
నాటంగోలె నా భర్త యా యుద్యోగము చేయుచున్నారు. నెల కొకసారి యోడ రేవునకుంబోయి మీ దేశమునుండి వచ్చిన యపరాధుల విమర్శించి తీసికొని వచ్చి నేరము ననుసరించి శక్యమయిన పనులం జెప్పి కాపాడుచుందురు.
ప్రమాదవశంబున నెవ్వరేని యన్యాయముగ శిక్షింపఁబడిరని తెలిసినచో నట్టివారిని విడుచుటకు సైతము సుల్తానుగా రాయన కధికార మిచ్చియున్నారు. మన పెరటినంటియున్న పొలములోనే పుష్పజాతులు మొక్కలు వేన వేలు వేయించి యట్టివారిచేతనే యందుఁబనులు చేయించుచుందురు.
మీరు తొల్తనే యప్పుణ్యాత్ముని కంటఁబడిరి. కావుననే యిక్కట్టు నెఱుంగక మా యింటికి వచ్చితిరి లేనిచో మిమ్మీ యవనులెల్ల చిక్కులు పెట్టుదురు. మీ శీలములఁ జెరుపకుందురాయని యావిడ యా వృత్తాంత మంతయుం జెప్పినది.
అమ్మా ! నా కిచ్చటికి వచ్చినది మొదలు గలిగిన సందియమును భోగొట్టితివి. మీ వేషములు నలంకారములు చూడ యవనులం బోలియున్నవి. ఆచారము హిందూమతానుసారముగా నున్నది. మొదట నేను నీ భర్తంజూచి యవనుఁడే యనుకొంటిని. మా దేశములో దురకలు గాని గడ్డము పెంచుకొనరు. ఇక్కడ భుజించుటకే సంశయము పడితిని అన్ని సంశయములు తీర్చితివి. నీవు కడునిల్లాలవు. భర్త నెక్కుడుగా నతిధుల నాదరింపుచున్నావని స్తుతిజేయుచు నమ్మా ! మాకీ పట్టణము చూడవలయునని యున్నది. సహాయము నెవ్వరినైన నిచ్చి పంపరా ! మా దేశములో నిన్నెల్ల కాలము చెప్పుకొనుచుందుమని కోరిన నామె యిట్లనియె
యువతీ ! నా భర్త యోడలరేవునకు రేపు పోపుదురు. అప్పుడు మీరొక బండిమీఁద పోయి పురము చూచివత్తురుగాక. ఆయన వినిన సమ్మతింపరని చెప్పినది. పుష్పహాసుండు తాను స్త్రీ వేషమున నుండుటకు వగచుచుఁ బురుషుఁడుగా మారుట కుపాయ మాలోచించు చుండెను. అమ్మరునాఁడు వరుణదత్తుడు ద్వీపాంతరము నుండి వచ్చిన యపరాధుల దీసికొని వచ్చుటకై యోడల రేవు నొద్దకుంబోయెను. అప్పుడొక గుర్రపుబండి యెక్కించి యీ మువ్వురను పట్టణము చూచి రమ్మని వసంతసేన యంపినది ఆ బండివాడు క్రొత్త వాడగుటచే గమ్యాగమ్యస్థానము లెరుగంక సుల్తానుగారి మేడవీధిం దోలికొనిపోయెను. హిందూ సుందరులకు ముసుంగు వైచుకొను వాడుకలేదు. వారు పట్టణ విశేషంబులంజూచు తలంపుతో నా శకటగవాక్షంబులన్నియుఁ దెరచి కూర్చుండిరి. నాఁడు చిన్నసుల్తాను దైవికముగా నా వీధిలో బంతులాడుచు నా చేడియల వీక్షించెను. మఱియు నతం డాబండిదాపునకు వచ్చి యందున్న వారెవ్వరని వారలడగిన బండి వాఁడు వరుణదత్తుగారి బంధువులని యుత్తరము చెప్పెను.
అప్పుడు స్త్రీ వేషముతో నున్న పుష్పహాసుఁడు తిర్యక్ప్రసారితవక్త్రుండై యా బండిలోనుండి రాజపుత్రుం జూచెను. మగువలకుఁ బోలె మగవారికి లజ్జా విభ్రమంబు లెట్లు సహజంబులై యుండెడివి ? తదీయముఖచంద్ర బింబము జిన్న సుల్తాను గారి చూపు గల్వలను వికసింపఁజేసినది. జగన్మోహనం బగు తద్రూపంబు మహర్షుల నైన మోహవివశులం జేయుననుచో నొక యవన యౌవన పురుషుని వలపించినదనుట యేమి యబ్బురము ? రాచపట్టి చూపులాబండి ననుసరించియె పెద్దదూరము పోయినవి. పుష్పహాసుని విలోకన విలాసములు యవన కులావతంసుని హృదయ శకుంతమునకు వితంసములై తగిలికొనినవి.
అట్లు పట్టణమంతయుఁ ద్రిప్పి బండివాఁడు సాయంకాలమునకు వారినింటికిం దీసుకొనివచ్చెను. పుష్పహాసుఁడును బండిదిగి వసంతసేనతో వారు చూచివచ్చిన విశేషము లన్నియుం జెప్పుచుండ నింతలో సముద్ర తీరమునుండి యయ్యగారు వచ్చినారని పరిచారకు ఆమెకుఁ దెలియజేసిరి.
అప్పుడు కొంచెము చీఁకటి పడినదిగావున వసంతసేన వాడుక ప్రకారము స్నానము చేయుటకై భర్తకు వేడినీళ్ళు సిద్దపఱపించినది. వరుణదత్తుఁడు దుస్తులన్నియుదీఁసి పెరటిలోనికి వచ్చి స్నానము చేసి భోజనము చేయుచున్న సమయంబున వసంతసేన దాపున నిలువంబడి తాళవృంతముతో విసరుచు నేఁటి విశేషములేమని యడిగిన నతం డిట్లనియె విశేషముల కేమియున్నది. యెక్కడఁ జూచినను స్త్రీ సాహసమే విశేషముగాఁ గనంబడుచున్నది. ఇరువురు స్త్రీ లొక రత్నవర్తకునిం బరి మార్చిరఁట ? వారికి ద్వీపాంతరవాసశిక్ష విధించిరి. వారిం జూడఁ యున్నవారు. ఇట్టి సాహసమున కెట్లు పూనికొనిరో తెలియదు పనులు beg is? అన్నది చాల మణిమ సుందర పురు.... . . . . ... త, ఆ పర్మింపలేడు. వీను తప్పున ములు : సీపము 4 . M...న్నారని విప్పగా ..... : సం.....? 3. విరలంత విడారెంపుముందు వారి.. 'ఎం పాటు తిష విధం . కారం . చినఁ గలిసి యిందుందురుగదా ! అట్లుకాక యెఱిఁగి వారి భర్తలిచ్చట కరుదెంచిన రానిత్తురాయని యడిగిన నవ్వుచు నతండిట్లనియె.
జాతియాభిమానము పోనిచ్చితివి కావు. మగనాలులై ననేమి ఘోరకృత్యము చేసి శిక్షింపబడిన నట్టివారిని మగలేల యనుమతింతురు. అనుమతించి వచ్చిరేనిపిమ్మట మా యిష్టము. స్త్రీ నిమిత్తము నిరపరాధులనుఁ గూడ శిక్షింతురాయని పలికిన విని యక్కలికి నాధా నేను జారకృత్యముల శిక్షింపబడినవారి మాటఁ జెప్పలేదు. ప్రమాద వశంబున నేదియేని యపరాధము జేసి శిక్షింపఁబడిన వారి విషయమై చెప్పితిపోనిండు, నాకాయాడు వాండ్రం జూపెదరా ? వారి మాట వినిన జాలియగుచున్నదని పలికిన నతండు రేపు ప్రొద్దున నుద్యానవనములోనికిం బోయిన గానిపింతురు. నీ కిష్టమేని జూపింతునని చెప్పెను.
ఇంతలో నొక పరిచారకుఁడు వచ్చి "అయ్యా ! సుల్తానుగా రెద్దియో చీటిని పంపినారు. తీసికొనిరానా" యని యడిగినఁ దత్తరముతోఁ దెమ్ము తెమ్మని వానింబంపి సుల్తానుగారిప్పుడు చీటి పంపుట కవసరమేమి వచ్చినది చెప్పుమా యని యాలోచించుచుండెను. ఆ లోపునా భృత్యుఁడా చీటిందెచ్చి యిచ్చెను. ఎడమ చేతితో విప్పి భార్య దాపుగా దీపము చూపుచుండ నా చీటిం జదివి మఱల నా భృత్యుని కిచ్చి “సరే చూచితిమని యా చీటి దెచ్చినవానితో చెప్పి పొమ్మనుము " అని చెప్పి యం పెను.
అప్పుడు వసంత సేన ప్రాణేశ్వరా ! ఆ యుత్తరములో నున్న విశేష మేమని యడిగిన నతండు మఱేమియును లేదు. నాతో నత్యంతావసరముగా మాట్లాడ వలసిన పని యున్నదట. రేపు సూర్యోదయము కాక పూర్వము వచ్చి చూడవలయు నని వ్రాసిరి శిక్షితులగు హిందువుల గుఱించి యడుగుటకని తలంచెదనని చెప్పిన నట్లైన నంతయవసరమైన పనియని యేల వ్రాయును ? వే రెద్దియో కారణమున్నదని యామె చెప్పినది. పోనిమ్ము . రేపన్నియుం దెలియను గదా యని వరుణదత్తుం డుత్తరము చెప్పెను.
వరుణదత్తుండు భుజించి లేచి వేగమ పండుకొని మఱునాఁడు సూర్యోదయము కాకమున్నే బండియెక్కి సుల్తానుగారి యాస్థానమున కరిగెను వసంతసేనయు రాత్రి యంతయు నా వ్రాత గుఱించి చింతించుచు మఱునాఁ డుదయంబునఁ గాల కృత్యంబులు దీర్చికొని పుష్పహాసుం డెద్దియో పనిమీఁద నుండుటచే వైశ్యాంగనల నిరువుర మాత్రము వెంటఁబెట్టుకొని పరిచారకులు దారిజూప నుద్యానవనమునకుం బోయినది.
అమ్మగారు వచ్చుచున్నారని విని యందుగల భృత్యు ------- వచ్చి అమ్మా ! యే మూలకుఁ బోవుదురని యడిగిన నామె నిన్న వచ్చిన యాఁడువాం డెందున్నవారో యచ్చటికిఁ దీసికొని పొండని చెప్పిన వాండ్రు అమ్మా ! పాపమా స్త్రీలు శిక్షపడినది మొదలు నన్నము తినుటలేదఁట. చాల చిక్కి, యున్నారు. రాత్రి యెంత చెప్పినను గుడిచిరిగారు అయ్యగారికి త్తెరఁ గెఱింగింపఁ దలచుకొంటిమి. ఇటు రండు అని దారి చూపుచు నామెను వారి యొద్దకుఁ దీసికొనిపోయిరి.
అప్పుడందొక సుందరి పండుకొని దుఃఖించుచున్నది. రెండవది ప్రక్కనఁ గూర్చుండి యూరడింపుచున్నది. వసంతసేన వారి యొద్ద కరిగి సహజ దాక్షిణ్యము గలది కావున వారి యవస్థకు వగచుచు మగువలారా ! మీరేమి నేరముఁ జేసితిరి ? అయ్యో పాపము గుడువకునికి మీ ప్రాణములు కన్నులలో నున్న వికదా ఎన్ని దినములిట్లు పవాసములు చేయుదురు ? మిమ్మోదార్చు వారెవరు ? భగవంతునే వేడుకొనుచండవలయు నా జగద్రక్షకుఁడే రక్షింపపలయు విచారింపకుఁడని కన్నీరు గార్చునాఁ జల్లని మాటలచే వారి నోదార్చెనది. అమ్మతోసమానంబులగు నా మెసల్లాపంబులఁ దమసంతాపము కొంత చల్లార నందుఁగూర్చుండియున్న చిన్నది అమ్మా ! యిటువంటి చల్లని మాటలు విని యెన్ని దినములై నదో కదా. తప్పుచేసి శిక్షింపఁబడితిమేని దుఃఖమే లేకపోవును. తొలి జన్మమునఁ జేసిన యపరాధమునకు దైవము మమ్మిప్పుడు శిక్షింపుచున్నాఁడు నీవు గడునిల్లాలవువలెఁ గనబడుచున్నావు. మా దంత నీతో చెప్పుకొంటిమేని కొంత తఱగగలదు. తల్లీ నిరపరాధులము మమ్ము శిక్షించినారు. ఈమె మహా పతివ్రత యీమె నిర్దోషురాలని యెఱింగి నిజముఁ జెప్పినందుకు నన్నుఁగూడ శిక్షించిరి. అధికారుల న్యాయమెట్లున్నదో జూడుమని తాను రేవానగరము సేరినది మొదలు శిక్షింపఁబడువఱకు జరిగిన కథయంతయుఁ బూసగ్రుచ్చినట్లు తెలియజేసినది. అపరాధులని యెఱింగినప్పుడే పరితపించెడు నా యిల్లాలు వారు నిర్దోషురాండ్రని యెఱింగిన పిమ్మట నెట్టి పరితాపముఁ జెందునో చదువరులే యూహించుకొనవలెను.
అప్పుడత్యంత దుఃఖాక్రాంత స్వాంతయై వసంతసేన యా యింతిని దన రెండు చేతులతో లేవనెత్తి కన్నీరు దుడుచుచు తల్లీ ! మహిళామణీ ! తొల్లి చంద్రమతియుఁ సీతయుఁ ద్రౌపదియు నెంతెంతలేసి యిడుమలం గుడిచిరో వినియుంటివా ? తఱచు పతివ్రతలకే వెతలెక్కుడు గలుగుచుండును. విచారింపకుము. నా భర్త కడు మంచివారు ఆయనతోఁ జెప్పి సాధ్యమైనంత యుపకారము గావించెద. మా యింట భుజింతువుగాని రమ్ము. అయ్యో ! కుందనమువంటి నీ దేహ ముపవాసముచే నెట్లు కృశించి వాడినదో ? నీ పతియెవ్వఁడు ?
భవద్వియోగంబున నెంత చింతించుచున్నాఁడో కదా యని యడిగినఁ ----- అమ్మా! ఆచరిత్రమంతయు భారతమంత యున్నది. క్రమంబున నీకుఁ జెప్పక యేమిచేయుదుము ? మా యాత్రముడిగింప నీకు భారమని పలికినది. అప్పుడు వసంతసేన ఆమె నింటిలోనికిఁ దీసికొనిపోవఁ బ్రయత్నించినది. కాని పరిచారకు లయ్యగారికిఁ జెప్పికాని తీసికొనిపోఁగూడదని మనవి చేసికొనిరి. వసంతసేన తన భర్తతోఁ జెప్పియే వారిని రప్పించెదననిచెప్పి యంతలోఁ బ్రొద్దెక్కుటయు నింటికివచ్చి గృహకార్యముల జక్కజేసికొనుచుండగా నప్పుడు వరుణదత్తుఁ డాస్థానమునుండివచ్చి తనగదిలో బండుకొని భార్యకు వర్తమానము జేసెను.
అప్పుడు వసంతసేన పతియొద్దకఱిగి కోపవిషాద మేదురహృదయుండై యున్న మగనితో మెల్లన సుల్తానుగారు మిమ్మేటికి రమ్మనిరని యడిగిన నతం డించుక యలుకతో నిన్న మనయింటనున్న యాఁడువాండ్రు బండియెక్కి పురమంతయుఁ దిరిగిరా ? యని పలికిన నప్పడఁతి గడగడ వడంకుచు నాథా ! వారు పట్టణ విశేషంబులం జూతుమని పదిదినములనుండి నన్నుఁ గోరుచుండ నిన్నఁ బంపితిని. దాన సుల్తానుగారికిఁ గోపము వచ్చినదా ? యనుటయు నతం డిట్లనియె .
సుల్తానుగారి కథ
అది పాడుఁవీఁడని నేను జెప్పుచుండలేదా ? ఆఁడువాండ్రు వీధింబడి పోయినం జూచి యీ చెడుగులోర్చుదురా ? సుల్తానుగారి వీధినుండియే యా బండి తోలించిరఁట ? సుల్తానుజూచి మువ్వురిలో నా యెఱ్ఱదానిని మోహించెనఁట. రాత్రి యెల్ల నిద్దురబట్టక విరహాతురుండై పరితాపము జెందుచుండెనఁట. దాని దనకుఁ బెండ్లి చేయుమనియు, నది మగనాలియని చెప్పినంత దాని మగడెంతసొమ్ము గోరినను నిత్తుననియు నందులకు నీవొడంబడవేని బలిమినైని దానిం గొనెదననియు జతురుపాయంబులచేతను నన్నుఁ గోరికొనియెను. వాని కేమని యుత్తరమిత్తును ? గోవులం జంపి తినువారికిఁ గనికరముండునా ? మనము చెప్పినట్లు వినుటకు వీఁడు వెనుకటి సుల్తానా ? క్రొత్తఁవాడు. యౌవన మదమున నొడలెరుంగకున్నాఁడు. నేనును గొంచె మాలోచించి దేవా ! మీ మాట కాదనుటకు నే నెంతవాఁడ. ఇంటియొద్దఁ జెప్పి యప్పడఁతి నొప్పించెద ననుజ్ఞయిండని పలికి యనిపించుకొని వచ్చితిని. ఇదియే యచ్చట జరిగిన విశేషము. తరువాత నేమి చేయవలయునో ? యాలోచించుకొనుమని పలికిన విని యులికిపడుచు నక్కలికి ముక్కు పై వ్రేలిడికొని యిట్లనియె.
భళాభళి ! ! సేబాసు. ఎట్టి విపరీతములు వినంబడినవి. యీ క్రొత్తసుల్తా నంత మత్తిల్లినాఁడా ? ఒకని పెండ్లాము నెట్లు పెండ్లియాడును ? పతివ్రత లందు కంగీకరింతురా ? అయ్యో ఈ యుపద్రవము నాకేమి తెలియును ? పురిజూతుమన నంపితిని. అక్కటా ! నాలుగు దినములు మనయింటఁ దలదాచికొన వచ్చిన యా చిన్నదానితోఁ గులముచెడి నీచజాతివానిం గలియుమని యెట్లు చెప్పుదును. ప్రాణము బోయినను నా నాల్కనుండి యా మాటరాదని పలికిన నతండిట్లనియె.
నారీమణీ ! వారిలోఁ బెండ్లి యాడినదానిని మఱలఁ బెండ్లి యాడఁగూడదను నిషేధములేదు. పశువులం గొనినట్టె దానివారలకు సొమ్మిచ్చి గైకొనుచుందురు. అదియునుగాక రాజుదలఁచిన దెబ్బలకుఁ గొదవా యనినట్లు వానిపనికాదని మందలించు వారెవ్వరు ? మన మూరకుందుమేని మన జీవికకును భంగమురాఁగలదు. ఆ మాట నా బోఁటితోఁ చెప్పుటకు నోరాడకున్నది. యేమిచేయుదుము ? అని ధ్యానించుచుండ రెండుజాములు దాటినది. ఎవ్వరికిని భోజనములులేవు.
అప్పుడు వారి సంవాదమంతయు సవసవగా విని పుష్పహాసుఁడు మెల్ల న నా గదిలోకింజని నమస్కరించుచుఁ దల్లీ! మాకు నీవు తల్లివనియు నాయన తండ్రి యనియు మేము భావించుచున్న వారము. మా విషయ మిప్పు డెద్దియో కలతపడి భోజనము చేయకున్నారు. అది న్యాయముకాదు. మీ యాజ్ఞయైనచో నగ్నియైనం జొచ్చెదము. మీరు కావించెడు నారద మేతాదృశ్యంబేయని పలికిన వరుణదత్తుఁ డర్ధ స్వరముతో నిట్లనియె. పుత్రీ! నీవనినట్లు మిమ్ము మేమట్లు చూచుకొను చున్నారము. ఇఁక పదిదినములలో నోడవచ్చుననియు మిమ్మమరావతికిఁ బంపుదుమనియు దలఁచు చుంటిని.
దైవము మఱియొక యిక్కట్టు దెచ్చి పెట్టెను. నిన్న మీరు నా యెఱుక లేకుండఁ బురము తిరిగివచ్చిరఁట. అప్పుడు సుల్తాను బండిలో నిన్నుఁ జూచి వరించెను. ఇప్పుడు తనకుఁ బెండ్లి చేయమని కోరుచున్నాడు. వలదన బలాత్కారముగాఁ దీసికొనిపోవునఁట ! అందులకే మిమ్ము వెలపలకుఁ బోవలదని చెప్పితిని. ఇప్పుడేమి చేయుటకుం దోచక యాలోచించుచున్నారమని చెప్పిన నొక్కింత యాలోచించి యతం డిట్ల నియె. ఆర్యా 1 యీ కార్యమునకు మీరింత సంశయింప వలయునా నేనుబోయి శీలము చెడకుండ నతనిచేతనే వలదనిపించుకొని వచ్చెదను.
అంగీకరించితిమని ప్రత్యుత్తరము బంపుఁడు. దానిమగండెప్పుడును దాని ననుసరించి తిరుగుచుండును కావున జాగరూకతతో మెలంగవలయునని మాత్రము దానిలో వ్రాయుఁడు. సంశయింపకుఁడు. కార్యము సాధించుకొని వచ్చెదనని యత్యుత్సాహముగాఁ బలికిన వరుణదత్తుఁడు సంతోషముతోలేచి మీరు సన్నాహము చేసికొన వచ్చును. మీరు కోరిన చిన్నదాని నీ రాత్రి యనుపుచున్నానవి ప్రత్యుత్తరము వ్రాసి తనతో వచ్చి వాకిట నిలిచియున్న రాజభటునకిచ్చి యంపి భోజనమునకు లేచెను.
వాడుకప్రకారము వసంతసేన పతి భుజించుచున్నప్పుడు తాళవృంతమున విసరుచు దాపున నిలువంబడి ప్రాణేశ్వరా ! నిన్న మీరుచెప్పిన నాఁడువాండ్ర నిరువురఁ బ్రొద్దుబోయి చూచితినిసుండీ! పాప మక్రమముగా వారిని శిక్షించిరి. ఇందు మూలముననే రాజ్యాంతమున నరకము వచ్చునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు ఆ వర్తకు నెవ్వఁడో కాలితో దన్ని జంపెనట. కాకతాళీయ న్యాయముగ నమ్మవారికి నుపహారము లీయ నప్పు డక్కడికిఁ బోయిన నామెమీద నీనేరమువైచిరఁట ఆమె మహా పతివ్రత కావున నేమియు మాటాడినదికాదట. అది యంతయు జూచుచున్న రెండవ చిన్నది నిజము చెప్పినదనియు దానిలోఁ కలిసియున్న దని దానింగూడ శిక్షించిరట. ఎంత కపటమో చూడుఁడు. వారి వృత్తాంత మంతయు నాతోఁ జెప్పిరి. ఆమె కడునిల్లాలని నేను బ్రమాణము చేయ గలను. రామరామా ! పదిదినములనుండి యేమియుం గుడుచుటలేఁదట. వారి యుసురు వారి కెన్నడు తగులునో ? ఆ సుందరి చక్కఁదనము చూచితీరవలయు నుపవాసముల గృశించి మాసిన చంద్రరేఖవలె నొప్పుచున్నది. మీరు వారినిచ్చటికి దీసికొని వచ్చునట్లాజ్ఞ యియ్యవలెను.
వారికి భోజనముపెట్టి రక్షించెదనని పలికిన విని తన జవరాలి కనికరమునకు లోపల మెచ్చుకొనుచు వరుణదత్తుండు నవ్వుచు సరిసరి నిన్నక్క డికిఁ బొమ్మనుట మాదియేతప్పు. నేరముచేసిన వారందరునిట్లే చెప్పుచుందురు. వారి మాటల ననుసరించి చేసిన వ్యవహారములు సాగునా ? తప్పుచేసి లేదని ప్రమాణికములు చేయుదురు. ఎవ్వరు నొప్పుకొనరు. నీ కా నిదర్శనము చూ పెద, భోజనమైన వెనుక నాతో రమ్మని పలికెను. అప్పుడా యెలనాగ దయితా ! అదియేమియు నాకుఁదెలియదు వారింగాపాడక తీరదు.
ఎల్లవారివలె వారిమాటలు నిరసింపరాదు. వారింజూచిన మీకే జాలిపొడము నని యెన్నియో విధముల బ్రతిమాలికొన్నది. అప్పుడతండు కానిమ్ముఁ జూతముగాక యని పలికి భుజించిన వెనుక భార్యనుదీసికొని యా యుద్యానవనమునకరిగి యోరీ ! నిన్న వచ్చిన యపరాధుల బురుషుల నిచ్చటికిఁ దీసికొనిరండని యొక మా కందము క్రిందఁ గూర్చుండి కింకరుల కాజ్ఞాపించుటయు వారు ముహూర్తములో వారిందీసికొని వచ్చి యెదురం బెట్టిరి. అప్పుడు వరుణదత్తుఁ డందొకనిం జీరి యోరీ ! నీ వేమి నేరము జేసితివి. నిన్నేమిటికి శిక్షించితిరని యడిగిన నతండు తలవాల్చుకొని యేమియు మాటాడినాఁడు కాఁడు.
అప్పుడతండు మఱియొకనిం బిలిచి నీవేమితప్పు జేసితివి. నీ కేమిటికీ ద్వీపాంతరవాస శిక్షవిధించితిరి ? నిజము చెప్పుము. నిన్ను విడిపింతునని యడిగిన నతండిట్ల నియె, అయ్యా ! నే నేపాపము నెఱుంగను. దైవముతోడు ఆ చిన్న దాని నడవిలోనుండ మా యింటికి గృహస్థధర్మమున రమ్మంటిని వచ్చినది. ఆ కడియ మదియే నాకిచ్చినది. అది తప్పని యెట్లుచెప్పనగు ? దానిం గొనిపోయి యంగడిలో నమ్మజూప వాఁడు తొత్తుకొడుకులు నన్నుఁ బట్టుకొని సింధువార నగరంబునకుఁ దీసికొనిపోయి ధనంజయుని యెదుటఁబెట్టిరి.
అతండు ధర్మాత్ముఁడు కడియము బుచ్చుకొని నన్ను విడిచిపెట్టునను కొంటిని. లలితా! గంధర్వదత్తా! యని యేడ్చుచు వాఁడు నా కొంప ముంచివేసెను. అబ్బబ్బా ! యీ రాజభటులు పెట్టిన చిక్కులకు మేరయున్నదా ? అన్నమైనఁ దిన్నగా దిననీయరు గదా ? నాయుసురు వీరల కెప్పుడు తగులునో ? అకటా ! ఏ దోస మెరుంగక పౌరోహిత్యము సేసికొనుచు గాలము గడుపుచున్న మా యింటికివచ్చి యా చిన్నదే యీ ముప్పు దెచ్చి పెట్టినది. యింతకన్న నేనేమియు నెఱుఁగనని పలుకుచుఁ గన్నీరుగాఁ నేడువఁ దొడంగెను.
అప్పుడు వరుణదత్తుండు వానిమాట లాలించి యేదియో జ్ఞాపకము దెచ్చికొని హా! గంధర్వదత్తా ! నీ వృత్తాంతము మఱచిపోయి యన్యదేశంబున సుఖింపు చుంటి గదా ! అయ్యో నీ పేరైన జ్ఞాపకము లేకపోయినదే. హా ! పుష్పదంతా నీ మొగ మొకనిమిషము చూడకున్న పరితపించెడు నే నిన్ని నాళ్ళు నిన్నుఁజూడక యెట్లుంటినో హా! కన్నతండ్రీ! హా! ప్రాణేశ్వరీ ! యని పలుకుచు నేలంబడి మూర్చిల్లెను. అప్పుడు వసంతసేన విభ్రాంతిపడుచు అయ్యయో ! యిదియేమికర్మము నా ప్రాణేశ్వరుఁడిట్లు పలవరింపుచుఁ పడిపోయెనేమి ? రక్షింపుఁడు రక్షింపుఁడని పలుకుచు ? శైత్యోపచారములు పెక్కు చేయించినది కాని తెలివివచ్చినదికాదు.
పరిచారకు లతని మెల్లన నెత్తుకొని లోపలిగదిలోనఁ బరుండబెట్టిరి. వసంతసేన దాపునఁ గూర్చుండి విసరుచుఁ బెక్కండ్ర దైవములకు మ్రొక్కుచు నాథా ! మనోహరా ! ఇటుచూడుము. మాట్లాడుము నే నెవ్వతెను ? అట్లు పలవరించి రేల ? గంధర్వదత్త యెవ్వతె ? చెప్పుఁడని పిలిచిన నతఁడు కన్నులం దెరచి నిట్టూర్పు నిగుడించుచు నీవెవ్వతెవో నే నెఱుంగ, నా యర్థశరీరము గంధర్వదత్త యెందున్నది ? నా ముద్దులపట్టి యేడీ ? యిక్కడికి నేనెట్లు వచ్చితిని ? నా రాజ్యమేమైనది ? అని యూరక పలవరించుచుండ భయపడుచు వసంతసేన వైద్యులఁ బెక్కండ్ర రప్పించినది.
వారు పరీక్షించి యీతని కేమియు భయములేదు. సైతాను సోకినది. ఎవ్వరును బిలువవద్దు. తలుపులువైచి పంచుకొననిండు. సాయంకాలమున కన్ని దోషములు పోవుననిచెప్పి తగు చికిత్సల జేసి యరిగిరి. వసంత సేనయు వారుచెప్పినట్లు తలుపులువైచి పిలువక ద్వారము దాపున గూర్చుండి చూచుచుండెను. అంతలో సాయంకాలమైనది. అప్పుడు సుల్తానువారి యొద్దనుండి యేడు గుఱ్ఱముల బండి పెండ్లి కూఁతుం దీసికొని పోవుటకై వచ్చినది. పుష్పహాసుండు వేరొక మేడలోఁ గూర్చుండి యలంకరించు కొనుచున్నాడు. కావున వరుణదత్తుని వృత్తాంతమేమియు నెఱుఁగక బండి వచ్చిన వార్తవిని వజ్రమాల దన్నుఁ బరిహాసమాడుచుండఁ జక్క గా నలంకరించుకొని యాబండిలోఁ గూర్చుండెను. అప్పుడు నియంత యత్యంత వేగముగా నాశకటమును సుల్తానుగారి యంతఃపుర నికటంబునకు దీసికొనిపోయెను.
భేరీపటహాదివాద్య ధ్వానంబులు రాజమందిరముఁ బెల్లుగ మ్రోగుచుండ వేగురుపరిచారికలు వచ్చి యచ్చెల్వనంతఃపురమునకుఁ దీసికొనిపోయిరి. చిన్నసుల్తాను వేగిరపడచుఁ బురోహితునితోఁ దొందరగా మంత్రంబులం జదివి పెండ్లి తంత్రము జరపుమని కోరిన నతఁడట్టు చేసెను. అప్పుడు సుల్తాను తన కులాచార ప్రకారము గాజుపూసనొక దానిని పెండ్లి కూఁతురు మెడలోఁ గట్టెను. పిమ్మట నా దంపతుల దివ్యాలంకార శోభితంబగు కేళీమందిరములోఁ బ్రవేశ పెట్టి యెల్లరు వోయిరి. ఆ మందిరమునకు నూఱు గజముల దూరములో నితరులెవ్వరు నుండగూడదని సుల్తానుగా రాజ్ఞాపించియున్నారు. ఆప్తు లందఱు దూరముగానున్న గదులలోనికింబోయి పండుకొనిరి.
సుల్తాను తలవంచుకొని యొకమూల నిలిచియున్న పెండ్లి కూఁతురు చేయి పట్టుకొని తల్పము దాపునకుఁ దీసికొనిపోయి కుడిచేతితో మోమించుక యెత్తుచు వోమోహనాంగీ ! నిన్నుఁ జూచినది మొదలీ సుల్తానుపడిన పరితాపము దేవుఁ డెఱుంగును. నే నింతకుమున్ను పెక్కండ్ర యువతులం బెండ్లి యాడితినిగాని వారిలో నొక్కరితయు నీవలె నామది నాకర్షింపలేదు. నీయధరసుధారసంబించుకఁ గ్రోల నిచ్చితివేని నాపరితాపము చల్లారగలదు. అని యనేక ప్రకారంబులఁ గ్రీడాభిరతుండై సంభాషించిన నవ్వుచు నక్కపటచపలాక్షి యిట్ల నియే.
మహారాజా ! నీవంటి మనోహరుండు నామనోహరుండై నప్పుడు నాకుఁ గల సంతోషము శచీదేవికి లేదని చెప్పగలను. దీని కొక యంతరాయము గలుగు చున్నదని దేవరకు విన్నవింపఁ గొంకుచున్నాను. నామనోహరుం డెప్పుడునన్నా వేశించి యుండును. అతండు మిగుల బలవంతుండు. ఇది యపరాధముగా గణించి యలిగి మీకేదియైన పరాభవము గావించునని వెఱచుచున్నాను. ఇంతకన్న యంకిలి యేమియు లేదని పలికిన నతండు శబాసు నీపతినన్నుఁ జక్రవర్తి యని యెఱుఁగడా ? యెద్దియేని కోరిక యుండిన గోరుమనుము. సంతస పెట్టెద నింతియకాక నాకపకారము సేయ బ్రహ్మకు శక్యమా యని సావలేపముగాఁ బలికి యక్కలికిం గౌఁగిలింప వచ్చెను.
సంవర్తసమయ స్ఫూర్ణద్గర్జారోవంబువోలె నాభీలసింహనాదంబు గావించి గిరగిర వలయా కారముఁ దిరిగి యాసందడిలోఁ బై గప్పి కొనియున్న చేలంబుఁ బార వైచి యతండు పురుషవేషంబు గాన్పింప నోరీ ? మ్లేచ్ఛకులాధమా ! నాభార్యబట్ట గమకింతువే ? నిన్నిప్పుడే కృతాంతపురి కతిధిగానంపెదఁ జూడుమని పండ్లు పటపట గీడుచుఁ గిరీటంబు నేలంబడదన్ని శార్దూలంబు వృషభంబునుంబోలె నెడమచేత గుత్తుక గట్టిగఁబట్టుకొని పడవైచి రెండవచేత ఖడ్గంబుబూని వేయనుంకించుచు నిన్ను జంపుచుంటి నీయభీష్టదేవతల స్మరించుకొనుమని పలికెను. అప్పుడా సుల్తాను తల చిదిమిన పామువలె కాలు సేతులఁ గొట్టుకొనుచుఁ గుత్తుక దప్పించుకొను పాటవములేక నిస్సారుండై యోమహాపురుషవర్యా ! నీకు సలాము చేయుచున్నాను.
నన్ను విడిచిపెట్టుము. నీభార్య జోలికిరాను. ఎప్పటిచోట నప్పగించెదఁ బెక్కుకానుక లిచ్చెద నాకుఁ బ్రాణదానము చేయుము. నీ పెండ్లాము చెప్పినను సమ్మతించితినికాను. మంచి ప్రాయశ్చిత్తమైనది. బ్రతికినన్నాళ్ళు నీ పేరు తలంచుకొను చందును. రక్షింపుమని యనేక ప్రకారములఁ బ్రార్దించిన మూర్చవచ్చునట్లుగా గొంతుక నొక్కి విడిచిపెట్టి యెప్పటియట్ల చేలము ధరించి స్త్రీ వేషముతో నిలువఁబడియెను. ఒక్కింత తడవునకు సుల్తాను తెప్పఱిల్లి యుల్లంబు పగుల బెండ్లి కూతుం జూచి వడంకుచు బోటీ ! నీ చెప్పినమాట వినక చచ్చినంత పాటుఁబడితిని. నీపొందు చాలు. పదివేలు సలాములు మాతల్లి కడుపున వెండియుం జనించితి నీ పుణ్యము నీజోలికెన్నడును రాను నీమగనితోఁ జెప్పుము, క్రమ్మఱ వచ్చునేమోయని వెఱచుచున్నవాఁడ అతండు కరుణించి విడిచెను. కాని మఱికొంచెము నొక్కెనేని నే నీ పాటికి స్వర్గలోకములో నుందును. నీవు నాకుఁ దల్లివి. నీకుఁ గోకలు పసపుకుంకుమ కానుకలిచ్చెదఁ గైకొని మీ యింటికిం బొమ్మని ప్రార్ధించిన నక్కపటయువతి నవ్వుచు మహారాజా ! ఇఁక నీవు వెఱవ వలదు. నా మగడు నీపొగడ్తలకు మెచ్చి విడిచి పెట్టెను. హాయిగా నిద్రబొమ్ము. రేపు ప్రొద్దున నేను మా యింటికిం బోయెదనని యోదార్చిన నతండట్లు పండుకొని నడుమ నతండు మఱలవచ్చి కుత్తుక పట్టుకొను నేమోయని యులికిపడుచు నెట్టకే దెల్ల వార్చెసు సూర్యోదయము కాకమున్న వెనుకటి శకటమును దెప్పించి యెవ్వరికిం జెప్పకుండఁ బెండ్లి కూతురను దానిమీఁద గూర్చుండఁబెట్టి కనకాంబర భూషణము లెన్ని యేని కానుకగానిచ్చి వరుణదత్తా ! నీవు పంపినది, యాఁడుదికాదు సైతాను. ఎఱుఁగక వరించితిని బుద్ధివచ్చినది. మఱల దానినిఁ గానుకలతో మీయింటి కనిపితినని యుత్తరము వ్రాసి యా వరుణదత్తునింటికని పెను.
పుష్పహాసుఁడట్లు సుల్తానును వంచించి యింటికింబోయి యా వృత్తాంతము వజ్రమాల కెఱిఁగించి కడుపుబ్బలాగున నవ్వించెను. పిమ్మట నాయుత్తరమును దీసి కొని వరుణదత్తునొద్ద కరిగిన వసంతసేన యతనింజూచి అమ్మా ! పోయివచ్చితివా ! నిన్నటినుండి మీ తండ్రికి స్మృతిలేదు. ఎద్దియో పలవరించును. నేదియును తెలియదు. నీవుమిగుల బుద్ధిమంతురాలవు వచ్చి చూడుమని పలికినఁ జింతించుచు నాగది లోనికిం బోయి జనకా ! యిటుచూడుము, నేను సుల్తానుగారి యొద్ద కరిగి వచ్చితిని. ఆయన మీకెద్దియో యుత్తర మిచ్చిరి, చూడుఁడని పలికిన నులికిపడినట్లు లేచి యేది యుత్తర మని యడిగెను.
అప్పుడాయుత్తర మతనికిచ్చినం బుచ్చుకొని చదువుకొని నవ్వుచు మంచి నేర్పరివె ? చెప్పినట్లు చేసితివని మెచ్చుచు నంతలో హా ! గంధర్వదత్తా ? హా పుష్ప దంత ! యని పలవరింపుచుఁ బండుకొనియెను. అప్పుడు వసంతసేన పుత్రీ ! జూచితివా ? రాత్రియెల్ల యిట్లే పలవరింపుచున్నారు
రెండవమాట లేదు. కారణమేమియో తెలియదని చెప్పఁగ నతఁడు ఎప్పటి నుండి నిట్లుపలవరింపు చున్నారని యడిగిన నప్పడఁతి నుద్యానవనములో o.. నది - దలు. జరిగిన విషయంతం.. అని ముందు, లకుమ చంద్ర : గంధర్వదత్త యిది - వచ్చింది. ఆ ను విడివి వచ్చితివఁట విచారించుచున్నదని పలికినవిని దిగ్గునలేచి నాప్రాణసఖియేదీ ? యిటు రమ్మను కుమారునింగూడ దీసికొని వచ్చినదా ? ఎంత స్వప్నము గంటినని పలుకుచు నలుమూలలు సూచుచుండెను. పుష్పహాసుండు తండ్రీ ! నీపేరు మణికుండలుడుకదా? వింధ్యకూట నగరమున నుండి యిక్కడి కెట్లువచ్చితివని యడిగిన నతండు పుత్రీ ! నీవు నిజము గ్రహించితివి. నా పేరు మణికుండలుఁడే మా కాపురము వింధ్యకూట నగరమే యిక్కడికి నిజముగా వచ్చితినా ? స్వప్నమను కొనుచున్నాను కానిమ్ము నాభార్య గంధర్వదత్తం జూపుమని యడిగెను.
విభ్రాంతస్వాంతయై చూచుచున్న వసంతసేనతోఁ బుష్పహాసుండమ్మా ! వీరి చరిత్రము నాకిప్పటికి బోధపడినది. ఒకప్పుడు నేను ధనంజయుడను రాజునొద్ద కొక కడియము కానుకగాఁ తీసికొని పోయితిని. ఆరాజు వీరి చరిత్రమంతయు నప్పుడు చెప్పెను. ఈతండు భార్యతోఁ బుత్త్రునితోఁ గూడికొని మేడమీదఁ బండుకొని మఱునాఁడుదయమునఁ గనబడలేదఁట. వీరి నిమిత్తమై దేశదేశము లాయన వెదకించెనఁట. యెందునుం గనంబడలేదని విచారించుచున్నాఁడు ఇప్పుడా వృత్తాంత మంతఃకరణ గోచరమైనది దానంజేసి చింతించుచున్నాఁడిదియే కారణము. మఱేమియు భయము లేదని యూరడించెను.
అప్పుడా వరుణదత్తుడౌను నీవనినదే యధార్తము ధనంజయుండు నా కుస్యాలకుఁడే. పాపము నానిమిత్తము వెదకించుచున్నాడా ? యిందున్నానని యెరుఁగఁడు కాబోలునని యుత్తరము చెప్పెను. అంతలో నొక పరిచారిక వచ్చి అమ్మా ! వారికెవ్వరికో భోజనము పెట్టి తు నంటివఁట వచ్చి పెరటిలోఁ గూర్చుండిరి. అన్నా తురులై యున్నారు. వేగము వత్తు రేయని చెప్పిన అయ్యయ్యో ? ఎంత మరపువచ్చినది. పాపము పది దినములుండి వారు భుజించుటలేఁదట. యీ గొడవచే మఱచి పోయితిని. పుత్రీ ! నీవిందుండుము. వారికన్నముపెట్టి సత్వరముగాఁ జనుదెంతునని పలికి పోయి వారింగాంచి సాధ్వులారా : రండు వేరొక కారణంబున మీమాట మఱచి యాలస్యము చేసితినని పలుకుచు స్నానము చేయుట కుష్ణోదకమిప్పించి మనపుట్టములు గట్టనిచ్చి బంధువులంబోలె నాదరించుచు మృష్ణాన్నము వడ్డించినది.
అప్పుడు తిలకయు మహిళయువచ్చి మిక్కిలి యాకలిగొని యున్నవారు కావున నత్యాతురముతో భుజించిరి. ఎట్టియాపద యందైన నాఁకలిబాధ యెక్కుడు గదా ! వారు భుజించునప్పుడు వసంతసేన సతీమణులారా ! నెమ్మదిగా గుడువుఁడు. నాభర్తతో మీమాట సెప్పితిని. అప్పటి నుండియు గంధర్వదత్తా పుష్పదంతా యని యూరక పలవరింపుచున్నాడు అందలి కారణమేమియో తెలియదు. ఆయన మనసు కొంచెము స్థిమితమైన తోడనే దానుపకారము గావించెదరని చెప్పుచుండఁగనే మహిళ భుజించుటమాని యబ్బురపాటుతోఁ బరికింపుచుఁ గన్నీరు విడువఁజొచ్చినది.
అప్పుడు తిలక అమ్మా ! భుజింపుము. ఆ విషయమేదియో నేఁను విమర్శించెదనని పలికినది. ఆ మాటవిని వసంతసేన ఆ విషయమేమియది ? ఈమె యట్లు కన్నీరు విడుచుచున్న దేమి ? గంధర్వదత్తను మీరెఱుఁగుదురా ? యని యడిగిన, తిలక యెఱుఁగుదుము. నేనువచ్చి నీభర్తగారితో మాట్లాడి చెప్పెదనని పలికి భుజించిన పిదప వసంత సేన వెనుక నాగదిలోనికిం బోయినది.
ఆ పుష్పహాసుఁ డాతిలకం జూచి గురుతుపట్టి సంభ్రమముతో నెలతుకా ! నీ పేరు తిలక కాదా ? నీ విక్కడి కెట్లు వచ్చితివి ? నీ స్నేహితురాలేమైనదని యడిగిన నేను దిలకనే ప్రారబ్దవశమున నిచ్చటికి రావలసి వచ్చినది. నాసఖురాలు నా తోడనే యున్నది. కాని గురుతు పట్టజాలకున్నాను. నీపేరు చెప్పి నాకును సంతోషము గలుగఁజేయుమని పలికినది.
అంతలో వరుణదత్తుఁడు లేచి వసంతసేనా ? నాకు బయనము సిద్దపఱచుము. వింధ్యకూటనగరంబునకుం బోయి నాప్రాణనాయకి గంధర్వదత్తం జూడవలయు. నాలస్యము చేయకుమని పలుకగా విని తిలక దేవా ! మీరంతదూరము పోనక్కరలేదు. మీరు మణికుండలులే యైనచో గంధర్వదత్త యిక్కడనే యున్నదని పలికిన విని యేదీ ? వట్టిమాటలు చెప్పుచున్నారు. నేను నిశ్చయముగా మణికుండలుడనే హా ! గంధర్వదత్తా యిటురా నీప్రాణేశ్వరుఁ డిందున్నాడు. నీవ్రతము లిప్పటికి ఫలించినవేమో ! యని పలుకగా విని మహిళ యా లోపలినుండి యక్కడకు వచ్చి నామనోహరుండేడీ ? యని పలికినది.
వరుణదత్తుఁడామెంజూచి మంచము డిగ్గనురికి హా ! ప్రాణేశ్వరీ ! హా గంధర్వదత్తా ! నేనిందున్నట్లెవ్వరు చెప్పిరి. ఎట్లు వచ్చితివని పలుకుచు బిగ్గరఁగా గౌఁగలించుకొనియెను. గంధర్వదత్తయుఁ బెద్ద యెలుఁగున నేడువఁ దొడంగినది.
వసంత తెల్లపోయి చూచుచున్నది. పుష్పహాసుండును నివ్వెరపడి నిలువంబడియె. తిలకయు నాశ్చర్యసాగరంబున మునింగెను. అట్లు కొంతసేపు వియోగ దుఃఖం బనుభవించిన తరువాత వసంత సేన వారినెల్ల గూర్చుండ నియోగించ ప్రాణేశ్వరా ! యీ గంధర్వదత్త నీ ప్రాణేశ్వరి యెట్ల య్యెను ? యీ మాటం యెప్పుడుం జెప్పితిరి కారేమి ? ఇప్పుడైన స్పష్టముగా మీ వృత్తాంతము తెలియఁజేసి నా సందియము పోఁగొట్టుఁడని వేడికొనిన స్వస్తుండై వరుణదత్తుం డిట్ల నియె.
రమణీ ! నేను సముద్రంబునంబడి తేలి మీయూరు వచ్చిన యుదంత మంతయు నీవు విని యుంటివి గదా ? అంతకు బూర్వ చారిత్రము మీకు నేను జెప్పి యుండలేదు. నాకును స్వప్న ప్రవృత్తివలె దానిం జెప్పుటకు బుద్ధియాకలించినదికాదు. లెక్కించుకొన నేను మా వీఁడు విడిచి నేఁటికు బదియారు సంవత్సరములైనది. - (ద గంధర్వపకతోఁ బు తును మనము న్యూ ..... 2 ఏ సున్నిత మన్వం.. of... - తము. చిమ్మట తిలక గంధర్వరమును - నరుం స్పంచు తుపులు ! వృత్తాంతము విని వసంత సేన అమ్మకచెల్లా ! దైవసంఘటన మెంత చిత్రముగా నున్నది.
తాననే కాఁబోలు నీమెం జూచినది మొదలు నా మది యూరక తపించినది ఆహా ! యని యచ్చెరువు నొందుచుండెను
శ్లో॥ వ్యతిషజితిపదార్ధానాతరః కోపిహేతు
ర్నఖలుబహిరు పాదీన్ప్రీతయస్సశ్రయంతె
వికసతిహి పతంగస్యోదయె పుండరీకం
ద్రవతిచ హిమారశ్మాపుద్గతేచంద్రకాంతః॥
ప్రీతులకు బాహ్యోపాదులు కారణములు కావు. అంతరంగికమగు హేతు వెద్దియో వానికిఁ గారణమై యుండును. అంతరిక్షమందు మిక్కిలి దూరముగా నున్న సూర్యుఁడుదయించినతోడనే పద్మములు వికసించుచున్నవి. చంద్రోదయమైన తోడనే చంద్రకాంతశిలలు ద్రవించుచున్నవని పుష్పహాసుండు శ్లోకముచదివెను. వరుణదత్తుడు గంధర్వదత్త వృత్తాంతమునువిని మిక్కిలి పరితపించుచు మన పుష్పదంతుండెందున్న వాడో దైవకృపచే నాతండు గూడ గానఁబడిన నీ జన్మకుఁ గోరవలసినది లేదుగా యని పలికిన తిలక -
అయ్యా ! ఆ కొరంతయు దైవము తీర్పకమానఁడు మీ మేనగోడలు లలితయు మాతోపాటు చాలా యిడుములం గుడుచుచున్నది చూచితిరాయని చెప్పిన ధనంజయుని కూతురా ? యేది యిటు తీసికొనిరండు. బంధువ్యూహ మంతయు నొక్కచోటికే తీసికొని వచ్చెనే భగవంతుఁడెంత యనుకూలుఁడయ్యెనని వరుణదత్తుడు పలుకుచుండగనే తిలకబోయి పురుష వేషముతో నున్న లలితం దీసికొని వచ్చి చూపినది. చూచి వరుణదత్తుఁడు "ఈతఁడు శిక్షింపబడిన మకరందుఁడుకాదా ? యిందాక నీ దోటలోఁ జూచితినే ? లలిత యేది యని యడిగిన నవ్వుచు తిలక స్త్రీ వేషముతో నందున్నవాఁడు పుష్పహాసుండని తెలిసికొన్నది. కావున భగవంతుని మాయయద్భుతమైనది కాదా! స్త్రీలను బురుషులు గాను బురుషుల స్త్రీలఁగాను మార్చుచుండును. ------- యీ పుష్పహాసుని నిమిత్తమై పురుషుండైనది, పుష్పహాసుండు లలిత నిమిత్తమై స్త్రీ యయ్యెను. ఈ పుష్పహాసుఁడే మీ పుష్పదంతుఁడని చెప్పఁగలను. గంధర్వ దత్త పోలికయు వీని పోలికయు నొక్కటిగా నున్నదని పలుకుచు బుష్పహాసుని గంధర్వదత్త దాపున నిలువం బెట్టిన నచ్చుగుద్దినట్టుగా యొక్కటయే మొగము వలె పోలిక యగుపడినది. గంధర్వదత్త నప్పుడు పాలుచేపు వచ్చినవి. వరుణదత్తుఁడు విస్మయముతోఁ జూచుచుండెను. ----------- దిలక మకరందుని బుష్పహాసుని బ్రక్కకుఁ దీసికొని వచ్చి నిలఁబెట్టి --------- నీ కొడుకును గోఁడలును చూచుకొను మని పలుకుచుండగనే యాకాశమునుండి యొక దేవదూత మందముతో దిగి సత్యము రాజా ! సత్యము. వీఁడే నీ కొడుకు పుష్పదంతుఁడు. ఇది నీ భార్య గంధర్వదత్త; అది నీ కోఁడలు లలిత; నేనే మీకీ వియోగము గలుగఁజేసిన దుర్మార్గుండని పలుకుచు వారి మ్రోల నిలువంబడియెను.
ఎల్లరు చూచి విస్మయం బభినయించుచున్నారు. అప్పుడు వరుణదత్తుఁడు దేవదూతకు నమస్కరించుచు "నార్యా ! నీ వెవ్వఁడవు ? మే మల్లనాఁడు మేడమీఁద బండుకొన్న మంచమిది కాదా ? ఇది మీ యొద్దకు కెట్లు వచ్చినది. మా వియోగమునకుఁ గారణుఁడనేనని పలికితిరి. అది యెట్లొ వక్కాణింపుఁడని" యడిగిన దేవదూత యిట్లనియె.
దేవదూతకథ
అలకాపురములో నూరేండ్ల కొకసారి నిథి పూజామహోత్సవము జరుగు చుండును. ఆ యుత్సవమునకు ఇంద్రుడు జయంతుఁడు ముప్పదిమూడుకోట్ల దేవతలు దిక్పాలురు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు గంధర్వులులోనగు వేల్పులెల్ల భార్యలతోఁ జనుదెంతురు. మహర్షులు పెక్కండ్రు వత్తురు అచ్చర లెల్ల వచ్చి నాట్యము సేయుదురు. తుంబురు ప్రముఖ గాయకులు సంగీతము పాడుదురు. మునులు ప్రసంగములు చేయుదురు. పెక్కులేల త్రిమూర్తులుఁ దక్క తక్కిన దేవలోకములన్నియు నచ్చటికి వచ్చి యయ్యుత్సవము జూచి యానందించును. అప్పుడు నవనిధులకుఁ గుబేరుండు భార్యాయుక్తుండై పదిదినము లహోరాత్రము లేకరీతిఁ బూజగావింపుచుండును.
అప్పుడు నలకూబరుండు ఆయా బూలోకంబులనుండి వచ్చిన చక్కఁ దనమునం బ్రసిద్దికెక్కిన మిధునంబులనేరి వేఱు వేరున గూర్చుండబెట్టి వారి వారి సౌందర్యాతిశయంబుల తారతమ్యముల వక్కాణింపుఁడని మహర్షులను దేవతలను బ్రార్దింపుచుండును. ఇది వఱకు జరిగిన సభలలో నలకూబరుండును, జయంతుఁడును మొదటివారు గాను జంద్రుండు వసంతుండును, రెండవ వారుగాను అశ్వినీ దేవతలు మూడవ వారుగాను పరీక్షకులచే నిరూపింపఁబడిరి. మన్మధుండు రూపము లేనివాడగుట నేయంతరములోఁ జేరఁడని కొందఱు, చేర్చితిమేని మొదటవానిగాఁ జేర్పవలయునని కొందఱు వాదించిరి.
దానంగాదే సుందరుల వర్ణించునప్పుడు వారినే యుపమాన భూతులుగాఁ జెప్పచుందురు : మఱికొన్ని యంతరములు నిరూపించబడినవి కాని వారిం బేర్కొన నేల? వినుండు. ఈ నడుమ జరిగెడు నుత్సవమునకుఁ బూర్వమొకనాఁడు మా స్వామియైన కుబేరుఁడు మిత్రులతో నుత్సవగోష్ఠి గావింపుచు భూలోకంబునం గూడఁ జక్కదనంబునఁ బ్రసిద్ధి కెక్కినవారు బెక్కండ్రు గలిగియుందురు : మన యుత్సవమునకు వారింగూడ రప్పించిన యుక్తముగా నుండునని యాలోచించి నన్ను బిలిచి యోరీ ! నీవు పుడమి యంతయుం దిరిగి సౌందర్యాతిశయంబునఁ బొగడఁదగిన యొక మిధునము నీ యుత్సవమునకు దీసికొనిరమ్ముఁ వారికి మనోహరుండగు కొమరుండు గలిగియుండ వలయు వేగమ పొమ్మని యా నతిచ్చిననే నయ్యాజ్ఞ శిరంబునం దాల్చి తద్దత్తకామరూప ప్రభావములతోఁ బుడమియంతయు గ్రుమ్మఱితిని.
సీ. మగవాఁడు సౌందర్యఁ మహిమగాంచినచోట
నువిద చక్కఁదనాన నొప్పదయ్యె
భార్య సౌందర్యసంపత్తి నత్తినచోట
రమణుండు వికృతరూపమున వెలయు
నెలమి భార్యా భర్త లిరువురు రుచిమించి
పరిగినఁ బుత్రసంప్రాప్తి గలుగ
దట్టివారికిఁ బుత్రుడెట్ట కే జనియింపఁ
జూడఁజక్కనివాఁడు కాడు వాఁడు
గీ. పుడమి గమనీయసంతతి బడయువారు
చూడదగువారుగా రెల్ల చోటులట్టు
లన్నిలక్షణములు గల్గునట్టివారి
వెదకి కనలేక తిరిగి నే విసిగిపోతిని.
పుడమి యింతగొడ్డునోపునేయని యాక్షేపించుచుఁ గార్యసాఫల్యంబు గామి విషణ్ణ హృదయుండనై మఱల నలకాపురంబున కరుగుచుండ దారిలో నారదమహర్షి తారసిల్లుటయు నమస్కరించితి నమ్మహాత్ముండు నన్ను దీవించుచు నెక్కడినుండి వచ్చుచున్నవాఁడ వేమిటిది కార్యంబని యడిగిన నేను వినయంబుతో ధనపతి శాసన ప్రకారంబు జెప్పి మునివరా ! భూమియన నేమియో యనుకొంటి జక్కని యొక్క మిధునంబు గనంబడినది కాదే యని సాక్షేపముగాఁ బలికిన నవ్వుచు నత్తాపసోత్తముం డిట్ల నియె.
కుబేరానుచరా ! సుందరదేవతా మిధునంబులం గాంచుచుండెడి నీ కన్నులకు మానవ దంపతులు రుచింతురా ? కానిమ్ము వింధ్య కూటనగరంబునకుం బోయితివా ? అందు మణికుండలుండను రాజనందనుం గాంచితివా ? అతని భార్య గంధర్వ దత్త నీకుఁ గనంబడినదా ? వారి కుమారుఁడు బుష్పదంతుండు, నీ కన్నుల పండువు గావించెనా ? వారి జూచిన నీ విట్లనవుగా యని పరిహాసమాడి యా దేవముని యలకాపురంబునకుం బోయెను. అప్పుడు నేనప్పట్టణంబు జూడమికి బశ్చాత్తాపము జెందుచు మఱలి సత్వరంబున మీ పురంబునకుం జనుదెంచితి. దైవవశంబున మీరు నాఁటి రాత్రి బుత్రుని లాలించుచు నుప్పరిగమీఁద నీ శయ్యపైఁ బండుకొని నిద్ర బోయితిరి. మిమ్ముజూచి యాశ్చర్యము నొందుచు దేవముని ప్రభావనుగ్గింపుచు దిగ్గున నీ మంచము శిరంబున నిడుకొని యుప్పరమున కెగసి యలకాపురాభిముఖుండనై యరుగుచుండ నొకదండఁ ప్రచండజంఝామారుతంబు విసరినది, తద్వాత ఘాతంబున మీరా శయ్యనుండి పుడమిం బడితిరి. అది నే నెఱుంగక యతిరయంబున నలకాపురంబునకరిగి యిప్పర్యంతంబు గుహ్యలేశ్వరుని కురంగట నిడితిని. గుంకేశ్వరు: సరంగు : తిని. ఈ మూలన దానం ధనపతి : నలుడు దారిగా : వ మంది ) కచ్చితి... - మన న న న న పదం సర్వ..! నారదమహర్షి రాసకంబున ముసుగుల ,చ్చిం. | ప్రమాసం ) జ గినది. - ఘతంబున దానికను - .. . -- " లన ......మలు చూడు చుంచ రో". 10 - it is , : కలం | కంచు దంపతులం కు వచ్చి 10, 11 న - 11° : . మన వాడు మదన్ నేమి యరసిర . అని ము లు ... బతి10 - సం గలిపిరమ్మ. ఏమ్ము . . . . . . . వచ్చిరి. ని తు నియత దినే సలమని యుసలిచ్చిన ఏం .. ను: ప.15 ను, పలు సము) సప్పుచయల కాపురం ఎడలి పురమయంత ముం చిలి.1800. ఎందు... , త గసంబనినదికాడు. అప్పుడు సేతు సమరని విశ్చలంచి చింతించుడు సలుపఁ జనుతుండఁ ద్రోవలో వెండియు నారద మునీంద్రుండు నాకు కన్నుల పండువు గావించెను. గ్రక్కున మొక్కులిడి నేనమ్మునిపతికి జరిగిన కష్టమంతంయుం జెప్పి వారెందున్నవారని యడిగిన నద్దేవ ఋషి దివ్యదృష్టింజూచి నోరీ : వారు [1] పావురము శాపంబు నించుక వియోగదుఃఖంబుల ననుభవించి యిప్పుడే యవనా తీరంబునం గలిసికొనుచున్నారు. అందు బొమ్మని యానతిచ్చి యత్తపసి యవ్వలం జనియెను. తద్వచన ప్రకార మీ మంచముతో నే నిచ్చటికి వచ్చితి మీరు గనంబడితిరి. నీ కొడుకు గంగా గర్భంబున బల్లె వాఁడు పన్నిన జాలములోఁబడి వానిచే బెంపఁబడి మేనమామ కూఁతురు లలితచే వరింపఁబడి దేశముల పాల్పడి రాజపురుషుల రాయిడికి భయపడి యాఁడురూపమునఁ గడలిదాఁటి మీ యింటికి వచ్చిచేరె నీతండే పుష్పఁదంతుండు పుష్పహాసుండని పిలువం బడు చుండెను.
మఱియు నీ భార్య సూర్యభట్టను బ్రాహ్మణుని వరిగడ్డిరాసి పైఁబటి ప్రాణంబులం బాయక తొలుత నాయనచేఁ గొంతకాలము పోషింపఁబడి తరువాత నార్యభట్టు నింటనుండి యాయనభార్య చేసిన కపటంబున గుడికిజని యందు శెట్టిం జంపెనను నేరము కతంబున శిక్షింపఁబడి నీ చెంతకరుదెంచె. నీ మహాసాధ్వి గంధర్వ దత్తయే మహిళ యని పిలువఁబడుచున్నది. ఈ లలితయు నీ సుతుని వరించి యడవుల పాల్పడి తస్కరాపహృతసర్వమందనయై పురుషవేషంబుదాల్చి రేవానగరంబునఁ గ్రుమ్మరుచు పుష్పహాసుఁడను బుద్ధితో రాజభటులు పట్టుకొని తీసికొనిపోవ న్యాయాధి పతిచే శిక్షింపఁబడిఁ యిక్కడికి వచ్చినది. ఇది తత్సఖురాలు తిలక; మీ చరిత్రము దేవలోకమున సైతము వ్యాపించుయున్నదని నారదుండెఱింగించిన ప్రకారము దేవ దూత వారి చారిత్రమంతయు నుగ్గడించెను.
ఆ వృత్తాంతము విని యెల్లరు ప్రహర్ష సాగరమున మునింగియుండ బురుషవేషముతోనున్న లలిత దిగ్గునలేచి యవ్వలికిం బోయినది. పుష్పహాసుఁడు పురుషవేషము ప్రకటింపుచుఁ దల్లి దండ్రులకు నమస్కరించుచు ఆహా ! దైవమొక యైంద్రజాలికుండై జనుల బొమ్మలవలె నాడించుచుండును. అది యెఱుంగక మానవులు స్వప్రయోజకత్వము ప్రకటింపుచు సుఖదుఃఖముల నొందుచుందురు. ఉపిరి విడుచుటకై న వీరికి స్వతంత్రములేదు. సర్వము దైవాధీనము. అంతయు నాశ్చర్యకరమైనదే యని పలుకుచుఁ దిలకచేసిన పనులన్నియు నుగ్గడించి తదీయ సాధుమేధకు మిగుల నానందించెను. తల్లి దండ్రు లతని బెద్దయు బ్రొద్దు గ్రుచ్చియెత్తి ముద్దాడిరి. మఱల నొండొరులు పడిన యిడుమల నొండొరుల కెఱింగించుకొని విస్మయ శోకంబు నభినయించిరి.
అప్పుడు దేవదూత అయ్యా ! మీరీ మంచముపై గూర్చుండుఁడు. మీ పట్టణంబునకుం దీసికొనిపోయెద నిది కబేరుని శాపమని పలికిన విని సంతసించుచు రత్నకుండలుఁడు సుల్తానునకుఁ దమ వృత్తాంతమంతయు జెప్పి యందున్న యపరాథులనెల్ల స్వేచ్ఛగ దిరుగ విడిపించి వజ్రమాలనుఁ దల్లితోఁగూడ నోడయెక్కించి భర్తనొద్దకనిపి తన కుటుంబముతో నా మంచముపైఁ గూర్చుండెను. అప్పుడు గోవిందుఁడను బ్రహ్మచారి దీనవదనుండై చూచుచుండ లలిత తన కపటంబుననే వానికీశిక్ష కలిగినదని యా కథఁ జెప్పుచు నాతినిగూడ మంచముపై నెక్కించుమని మామగారికిఁ దెలియఁజేసిన నతడంగీకరించెను
అట్లు వారందఱుఁ గూర్చుండి యిష్టలాపము లాడుచుండ దేవదూత మంచముశిరంబునఁ నిడికొని ద్రొణగిరిదాల్చిన హనుమంతుడువోలె నతిరయంబున వింధ్యకూట నగరాభిముఖుండై యరుగుచున్న వాడు గోపా ! తదీయచ్ఛాయయే నీకు గనంబడినది. తెలిసినదా ? యని పలికినవిని యా గోపకుమారుండు సంతోషించుచు మహాత్మా ! మీ యక్కటికంబు గలుగ నేమిటికి దెలియదు. వారి భవిషవృత్తాంతము గూడఁ గొంచెము చెప్పి మీ శిష్యునిఁ గృతార్థుంజేయుఁడని వేడికొనిన నవ్వుచు నయ్యతి పుంగవుం డిట్లనియె.
విను మట్లా దేవదూత యాకాశగమనమున వింధ్యకూటనగరమున కరిగి వారి యంతఃపురమున వెనుకటి యుప్పరిగపయి నా మంచమును దింపి యవ్వార్త యందున్న రాజునకుం దెలియఁజేయుటయు నానృపుఁడు తదాగమనముకు మిక్కిలి యభినందింపుచు నప్పుడే యా రాజ్యమతని యధీనము జేసెను. ప్రకృతివర్గము వారి రాక విని వానరాశియుంబోలె నుప్పొంగుచు హల్లకల్లోలముగాఁ బ్రశంసింపఁజొచ్చెను. ఆ వార్తవిని ధనంజయ నృపాలుండు సకుటుంబముగా వచ్చి వారింగాంచి తమదంత మాద్యంతంబువిని వెఱంగుపడుచుఁ బుష్పహాసుండు తన మేనల్లుఁడని యనుమానము జెందితిననియు దండనాధుఁడు తనకు వ్రాసిపంపిన దేవాలయము గోడపైనున్న పద్యములం జూచి పుష్పహాసుని లలిత వరించి యేగినదనియుఁ దిలక సహకారిణిగా నున్నదని శిక్షవిధించిన యనంతర మూహించితిననియు మఱల నాశిక్ష తగ్గించి యట్టి యాజ్ఞ పంపితిననియు లోనగు తంత్రంబులన్నియుం జెప్పుచుఁ బుత్రికం గారవింపుచు లలితం గౌగలించుచుఁ బలుతెఱంగులఁ దన సంతోషమును వెల్లడించెను. అట్లు వారు పరస్పరానుగంబులం దెలుపుచు రెండు మూడు దినంబులు గడుపుదురు
అప్పుడు దేవదూత శుభముహూర్తంబున లలితా పుష్పహాసులకు వివాహ మహోత్సవము గావింపఁజేసి పిమ్మటఁ గుబేరున కాతెఱంగెరిగించి వచ్చి యతనిచే నంపఁబడిన నవరత్నమాల యొకటి పుష్పహాసుని కంఠంబునవైచి దీనిం ధరించినవారు వేయేండ్లు జీవింతురని తత్ప్రభావమగ్గింపుచు నతనిం బట్టభద్రుం గావింపజేయును. పుష్పహాసుండు తల్లి దండ్రుల యనుమతివడసి యత్తమామల కామోదము గలుగఁ జేయుచు దేవదూతకు బ్రీతిగా నట్లు పట్టాభిషిక్తుండై ధర్మంబున రాజ్యంబు జేయుచు సకల సుఖంబుల ననుభవింపుచుండును. దేవదూత వారిచే నామంత్రితుండై యలకా పురంబున కరుగును అని భవిష్యత్కధ యంతయు జెప్పి మణిసిద్ధుండు శిష్యునితోఁ గూడ నవ్వలి మజిలీ చేరెను.
నలువది యైదవ మజిలీ
క. శ్రీకర ప్రళయ స్తితిస
ర్గైకనిదానప్రధాన హరిహరచతురా
స్యాకారవినుత త్రిగుణ ని
రాకార ప్రపూర్ణ సచ్చిదానందమయా.
దేవా యవధరింపుము -
అయ్యవసరంబున గోపాలుం డెక్కడికిం బోవక యందున్న చావడి యఱుగుఁపై గూర్చుండి యెద్దియో ధ్యానించుచుండెను. ఇంతలో నయ్యవారు ----------- నములం దీర్చుకొని భుజించి వాకిటకు వచ్చి వానింజూచి వత్సా ! ------------ విచిత్రము ; ఎక్కడికిం బోవక యిందే యుంటివి ? విశేషము లేమని యడిగిన వాఁడు లేచి నమస్కరించుచు స్వామీ ! ఇది కడు చిన్న గ్రామము దాపున jui, vు గనంబు పని తలంచి కలం నుంచి ... ముండని.. : సీల గ్నో సంచయం.. నను..... " స్పంది చెప్పితే ! యని పలికిన సయ్య తిపతి “50 - పిమ్మట సంతయుం - ఎలము
- ↑ పావురముల మిధున మొకగూటిలో బిడ్డలతో నాదరించు చుండఁ దన్మాంసలోలుండై యానృపుఁడు మట్టియుండ నింటసంధించి వాని గొట్టెను. దానం గోపించి పావురమట్లు శపించినది.