Jump to content

కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/43వ మజిలీ

వికీసోర్స్ నుండి

విసరి గుర్రమునాపి దిగుదిగుమని పలికితిమి. మా మాటల కా బోఁటి జడియుచు నన్నలారా ! నామేన నున్న వస్తువు లన్నియు మీ కిచ్చి వేయుదుసు. నన్నేమియుం జేయక కట్టుబట్టతో విడిచివేయుఁడని ప్రార్ధించిన మొదట నంగీకరించితిమి.

ఆ చిన్నది గుఱ్ఱముదిగి వస్తువులన్ని యుఁ దీసి మా ముందర రాశిగాఁభోసి మఱల గుఱ్ఱమెక్కబోవు సమయంబు నడ్డు పెట్టి నిన్ను బోనీయము. మాలో నొకనిఁ బెండ్లియాడుమని చెప్పితిమి ఆ చిన్నది మాకంటెఁ జాలగడుసుది. అప్పుడు మమ్మందఱం జూచి నన్ను బెండ్లియాఁడువాఁ డెవ్వఁడని యడిగిన నేను నేనని తగవు లాడఁదొడంగితిమి. అప్పుడప్పడఁతి అదికాదు, నేనీ గుఱ్ఱమెక్కి యొక్క దండము విసరెదను. అది వేగముగాఁ బరుఁగిడి ముందెవ్వఁడు నాకుఁ దెచ్చి యిచ్చునో వాఁడే నాభర్తయని చెప్పిన నందఱము సమ్మతించితిమి. అప్పుడు బారెడు దండము నొక దానిఁగొని గుఱ్ఱమెక్కి అదిగో కాచికొనుఁడు వైచుచున్నానని గట్టిగా విసరినది. అది నూఱు బారల దూరమునఁ బడినది. దాని నిమిత్తము మేమందఱము పరుగిడితిమి. ఆసందున నా సుందరి గుఱ్ఱమెక్కి పాఱినది. మే మంతవడిగాఁ బరుఁగిడిపోయినను మాకు దొరికినదికాదు. వస్తువులు మాత్రము తెచ్చికొంటిమి. ఈ భటులు మమ్ముఁ బట్టికొని కొట్టిన దెబ్బలకు మితిలేదు. బాబూ ! యదార్ధము చెప్పితిమి రక్షింపుఁడని వేడుకొనిరి. అప్పుడా రాజు కనికరింపక బ్రహ్మచారితోఁగూడ నా ముచ్చులకు ద్వీపాంతర వాసశిక్ష విధించి యా యరణ్యము లన్నియు వెదకిరమ్మని రాజభటులం బంపి కూఁతురు జాడ నరయుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వేళమిగులుటయుఁ గథఁజెప్పుటఁ జాలించి తదనంతరోదంతంబు ప్రైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.

నలువది మూడవ మజిలీ

పోలిశెట్టికథ

గోపా ! వినుమట్లు లలిత సఖురాలు తిలక గుఱ్ఱమునుండి పుడమింబడి యది యిసుకనేల యగుటఁ గొంచెము దెబ్బతగిలినను బెద్దతడ వొడలెరుంగక వివశయై యెట్టకే మై దెలిసి కనులు దెరచి చూచినంతఁ దెల్ల వాఱుచున్నది. అప్పుడు లేచి నలు దెసలుం బరికింపుచు, అయ్యో ! లలిత నన్ను విడిచి యేగినదా ? నా జాడఁ దెలియక యెందు విచారించుచున్న దోకదా ? దారిం దప్పితిమేమో, నాపడినది యెఱుంగక యేగెనని తలంచెదను. కానిమ్ము. అది మగనితోఁ గలిసికొనిన నాకదియే పదివేలుఁ అని తలంచుచు నందొక దారిఁబడి నడువసాగినది. పోవంబోవ మధ్యాహ్నమున కొకపల్లె గనంబడినది. అందొక గృహస్థునింట భుజించి తన కులశీలనామంబులు దెలుపక యందలి జనులవలన దూరపు సముద్రపు తీరంబుననున్న రేవా నగరమునకు దారి యడిగి తెలిసికొని కొన్నిదినముల కతిప్రయత్నముతో నాపట్టణముఁ జేరినది. అది రేవుపట్టణము ద్వీపాంతరముల కరుగువా రందే యోడలెక్కి. పోవుచుందురు. పుష్పహాసుండు రేవానగరమున నిరువది దినంబులుండి యక్కడనోడయెక్కి యమరావతీపురి కరుగుదును. అని యుత్తరములో వ్రాసియున్న వాఁడు కావునఁ దిలక వారిజాడఁ దెలిసికొనుటకై యందుఁ బ్రవేశించినది.

ఆ బోఁటి వీటిదాపున కరుగువరకు సూర్యాస్తమయ మగుచున్నది. పట్టణములో జనసంచార మెక్కుడుగానుండును. ఈ రేయి నిందు నివశించి రేపు పోయెదంగాకయని నిశ్చయించి తిలక యాయూరి బయటనున్న గ్రామదేవత యాలయమున కెదుట రావిమ్రాను మొదట గుదురగు వేదిక పై వసియించి గమనశ్రమ వాపి కొనుచు శయనించినది. నాఁడు దూరము నడిచివచ్చుటచే మొదటఁ గొంచెముసేపు గాడముగా నిద్రపట్టినది కాని కడుపులో నాకఁలి యగుచుండుటచే నంతలో మెలకువ వచ్చినది. పిమ్మట నిద్రపట్టినదికాదు.

అది కృష్ణపక్షమగుట హృదయాంధకారమునకుఁ దోడుపడి బాహ్యతనుః పుంజంబు లక్కంజనయనకు భయము గలుగఁజేయఁ దొడంగినవి. అందు మనుష్య సంచారమేమియు లేకపోవుటచే క్రూరమృగ మేదియైనవచ్చి బాధించునేమో యని యడలుచు నప్పడఁతి గదివలె దొలువఁబడియున్న రావిమొదలులో దూరి కనులు మూయక తన యవస్థగుఱించి చింతించు చుండెను.

అట్టి సమయంబున నాముఖమండపములోని కొక పురుషుఁడు వచ్చి యగ్గి పుల్ల వెలిగించి నలుమూలలు పరిశీలించి చూచెను. ఆ వెలుఁగున దిలక వానింజూచినది. చెవులకు రవ్వల జోడును మొలకు బంగారుమొలత్రాడునుఁ జేతికి మురుగులును నుంగరములుం గలిగియున్నవి. శరీరచ్ఛాయ నల్ల నిదైనను మెఱుఁగుఁ గలిగి యుండుటచే నించుక చూడదగియేయున్నది. అన్నిటికి విపరీతమైన కడుపు. వానిం జూచిన నెట్టివారికి నవ్వురాకమానదు. అట్టియాకారముగల యాపురుషునిం జూచి యా చిన్నది వెరఁగుపడుచు నోహో ! యీతని వేషముఁజూడ భాగ్యవంతుఁడువలెఁ గనంబడుచున్నాడు. ఇంత ప్రొద్దుపోయిన తరువాత నీచీఁకటిలో నొక్కరుఁ డిక్కడికి రానేల ? యని యాలోచించుచున్న సమయంబున మఱియొకఁడువచ్చి మెల్లగాబాబూ ! సెట్టిగారూ ! అని పిలచెను.

ఆ మాటవిని యాసెట్టి ముందరికి వచ్చి యేమిరా ! నరిసిగా ! యింత యాలస్యము చేసితివి. అప్పి కనబడినదా ? యేమన్నది ? కార్యసాఫల్యమగునని చెప్పినదా యని యడిగెను.

నరసిగాడు - బాబూ ! నేనారింటిదగ్గరవెల్లి అప్పిని పిలవఁగా నా భీష్ముఁడు పో పో అప్పిపని నీకేల ? నీవెవ్వఁడవని కేకవేసెను. సెట్టి -- ఓరీవెధవా ? దొడ్డిగుమ్మముదగ్గరకు వెళ్ళి పిలువమనిన వీధి గుమ్మముదగ్గరకు వెళ్ళినావఁటరా ? తరువాత.

నరసి - అప్పుడు పారిపోయి నేను వచ్చుచుండగా దొడ్డిగుమ్మమున అప్పివచ్చి నాతో శెట్టిగారిని మరిడమ్మ గుడిదగ్గి రుండమని చెప్పుము. నేను తీసుకొ'ని వచ్చుచున్నానని చెప్పినది.

సెట్టి – ( మేనుప్పొంగి) ఆమాట చెప్పినదికదా ! సరే ! ఆమనిషిని నీవు చూచినావురా?

నరసి - ఆయెర్రనావిడేనాఅండి ? చాలా చిక్కివున్నది బాబూ !

సెట్టి - అవును అబ్బా : చిక్కియున్నను దానియందము చెప్పనలవి కాదురా ?

నరసి – ఆవిడ ఆ భేమ్మడి పెండ్లామేనా అండి ?

సెట్టి - ఆయని పెండ్లామైతే యిన్ని చిక్కులు పడనేల ? మన యింటికే రప్పించుకొందును. కాదు వారింటికి వచ్చింది బంధుగురాలఁట దానికొరకు రెండునెలల నుండి ప్రయత్నముచేయుచున్నాను. ఇందు నిమిత్తమై ఆయన భార్యకు వేయి రూపాయలు వెలఁగల రవ్వలజోడు పంపినాను. ఇంకా చాలదనుచున్నది.

నరసి — ఆమెను మొదట మీరెట్లు చూచినారు బాబూ ?

సెట్టి - శివరాత్రినాఁడు రాత్రి కోటీశ్వరుని యాలయములో దేవతా దర్శనము చేయుచుండగాఁ జూచితిని. నాఁటినుండి యీలలు తీసి నేఁటికి వశపరచు కొనుచున్నాను. అలుకు డగుచున్నది. వచ్చుచున్నా రేమో చూడు.

నరసి - (చూచివచ్చి) బాబూ ! వస్తున్నారు.

సెట్టి - నీవు కొంచెము చాటుగా నుండుము.

నరసి - చిత్తము బాబూ ! (అని గుడివెనుకకుఁ బోవుచున్నాఁడు)

అప్పి - (ప్రవేశించి మెల్ల గా) శెట్టిగారూ !

సెట్టి - ఏమేవు. ఇక్కడ. ఇక్కడ. ఈలాగునరా తీసికొనివచ్చితివా ?

అప్పి - అబ్బా : మీ నిమిత్తమెన్ని పాట్లు బడితినండి యేది నాకు బహుమతి ?

సెట్టి - రానీ యింతలో తొందర పడియెదవేల ?

అప్పి - ఎప్పటిదప్పుడే. ఇప్పుడు నాకు పనియున్నది.

సెట్టి - (నాలుగు రూపాయలు చేతిలోపెట్టి) ప్రస్తుతమింతే ఇచ్చితిని. రేపు మాయింటికి రా.

అప్పి - చాలు. చాలు. నీబారీ తెలిసినది. ఇదియా ? ----------- అని మీదఁ బారవైచుచున్నది) సెట్టి - ఏమంటావు?

అప్పి- పదికాసు లిమ్మంతాను.

సెట్టి - సరే రేపిస్తాను. అందాక యివివుంచు. అప్పీ : అప్పడతి నేలా వొప్పించినావు ?

అప్పి – నిన్న మద్దాన్నము రామాభాయిగారు తల నొప్పి వచ్చిందని పట్టువేసికొని మూల్గుచుండగా నేను మరిడమ్మ పూనినదని శివాడితిని.

సెట్టి - ఏమని శివాడితివి ?

అప్పి - ఆదివారమునా డర్దరాత్రి పేరంటాలుచేత నా గుడికి చలిమిడి, పానకము, వడపప్పు, వక్కలాకులు, సాంబ్రాణి పంపించుము. లేనిచో నీనొప్పి పోనీయనని శివాడితిని.

సెట్టి - తరువాత.

అప్పి --- తరువాత ఆమె అట్లు దండము పెట్టి మీదుఁగట్టి నేఁటి రాత్రి వెళ్ళుమని అయమ్మను

బ్రతిమాలికొన్నది.

సెట్టి - తరువాత.

అప్పి - ఆకాంత యంతయుఁ జూచుచున్నది. కావున మాట తీసివేయలేక వొప్పుకున్నది

సెట్టి — ఈ సంగతి రామాభాయి మగఁడెఱుగునా ?

అప్పి - ఎఱుగఁడు. అమ్మో ? యెఱిఁగిన నామెను ఇట్లు కదలనిచ్చునా ?

సెట్టి — అంతేకాని నాసంగతియేమియు నామెతో చెప్పలేదా ?

అప్పి - కొంత సెప్పితి. అక్కడ సెట్టిగారుంటారు ఆయనతో మర్యాదగా మాట్లాడవలయునని, అదియునుంగాక యిక్కడికి వచ్చినతరువాత నీవు సరసుఁడవు కావాయేమి ? చెప్పవలయునా ? నిన్ను జూచిన ... అని సగము పలికి నవ్వినది.

సెట్టి - సరిలే మాటకు చెప్పితిని, ప్రొద్దుపోయినది తీసికొనిరా. ఎక్కడ నిలిపివచ్చితివి ?

అప్పి - ఇదిగో మాయింటికి వెళ్ళివత్తునని చెప్పి యొక అరుగు మీఁద కూర్చుండబెట్టి వచ్చినాను. పోవలయును. నీవు మొదటనే పల్కరించకేం.

సెట్టి - నే నెక్కడుండను ?

అప్పి -- యీ స్తంభంచాటున కూర్చో. నేను పిల్చువఱకు బలుకకు అని చెప్పి నిష్క్రమించినది.

సెట్టి - (పరుండఁబోకుం) నరసిగో లోను వర : 3వ ఆ..యంచే ప్రాణము 1 నరసి - (వచ్చి) యెక్కడ ? బాబూ ! యెక్కడ ?

సెట్టి - కడుపుమీఁదురా ! బాబో : గుండెలలో కెక్కి నదిరా !

నరసి – అయ్యో : అయ్యో : కడుపుమీఁదనే ! ఏదీ అగ్గిపెట్టి (అని పుచ్చుకొని పుల్ల రాచి వెలిగించి) అమ్మయ్యో ! మండ్రగబ్బండో.

సెట్టి - మండ్రగబ్బే : చచ్చిపోతానురో.

నరసి - భయములేదు. నల్ల దిలెండి. వచ్చినవేళ మంచిదికాదు. బాబూ ! ఇంటిఁ బోదామూ ?

సెట్టి – అయ్యో : యేలా రానురా : ఆ చిన్నది వస్తున్నది. యేలాగో బిగ్గపట్టుకొని వుంటాను. కాని నీ వింటికిఁబోయి నా పెట్టిలో తేలుచెక్క యున్నది. తీసికొనిరా.

చిత్తముబాబూ ! (అని తాళముచెవి తీసికొనివాఁడు నిష్క్రమించుచున్నాఁడు. అంతలో అప్పివచ్చి మెల్లగా

అప్పి- శెట్టిగారూ : ఆమె వస్తున్నది. జాగ్రత్త.

సెట్టి - అప్పేవు ! నాపని అయినది. మండ్రగబ్బ పొత్తికడుపు క్రింది కుట్టినది. గుండెలో బరువెక్కువై నది. దానియందుఁగల మక్కువచే నట్లంటిని కాని దొర్ల వలసినంత బాధపెట్టుచున్నది. అయ్యబాబో : (అని యరచుచుండెను)

అప్పి - (స్వ)పోనీ యీదినమునకు దాటినదికదా ! ఈ బొజ్జకనకయ్యను జూచి యాచిన్నది మట్లాడునా ? అదియునుగాక ఆమె మంచిగుణవంతురాలు. కానిమ్ము . రేపు నాబహుమతి లాగికొనిమరీ పనిచేస్తాను. (ప్ర) ఆలాగునా ? అయ్యో ? మంచి విఘ్న మే వచ్చిందే ? పోనీయండి యీవేళ వూరికే చూడండి ఎల్లుండి మళ్ళా తీసికొనివస్తాను.

సెట్టి - అందుకోసరమే యింటికిఁ బోవుచున్నాను. ఆ చిన్నదాన్ని దలంచుకొనుచుండ నాబాధ కనంబడుచుండలేదు.

దప్పి - ఏమి మూల్గకండీ. (అని ముందుకుపోయి) అమ్మాగారూ ఈలాగునరండీ. ఇదే అమ్మవారిగుడి.

మహిళ - అప్పీ ! అమ్మవారికిఁ బ్రదక్షిణముజేసి వత్తమురమ్ము (అని దానితో గుడి తిరిగివచ్చి ముఖమండపములోఁ బ్రవేశించి) తలుపులు వేయఁబడియున్న వా యేమి ?

అప్పి - తలుపులువేసి యర్చకుఁడింటికిం బోవును. రాత్రి యిక్కడ నుండియే నై వేద్యములు పెట్టుదురు. మీరును అట్టె జేయుఁడు.

మహిళ - (దీపము వెలిగించి హారతులిచ్చి యుపహారముల నైవేద్యము పెట్టి చేతులు జోడించి) అమ్మా ! భవానీ ! నీవు త్రిలోకవంద్యురాలవు నా యిచ్చిన యుపాహారములఁగైకొని మా యజమానురాలి తలనొప్పి పోఁగొట్టి యనుగ్రహింపుము: అమెకు సంతానము గలుగఁజేయుము. దేవీ ! భక్తజన వాత్సల్యమేపార మదీయచిత్తం బెప్పుడు పాతివ్రత్యగుణవిశిష్టంబై యుండునట్ల నుగ్రహింపఁ బ్రార్థించుచున్నాను. నన్ను నా వల్లభునితో నెప్పుడుగూర్తువో ? నిన్నే నమ్మియున్నాను. ఇదియే నీకుఁ బదివేల నమస్కారములు.

సెట్టి - (స్వ) అయ్యయ్యో ! నాపాలిట కీపాడుతేలెక్కడవచ్చినదో. కార్యము సిద్ధపడినప్పు డనుభవించుటకు యోగము లేకపోయినదిగదా. ఆహా ! అ మోహనాంగి మోమెంత వింతగానున్న దో యొక్కసారి ముద్దుఁగొనిన జన్మమునకుఁ జాలదా ? కానిమ్ము. ఎల్లుండి రాత్రి యెప్పుడు కన్నులబడునో.

మహిళ - అప్పీ ! ఈ లాగునరా ! అక్కడ నెవ్వరితో మాట్లాడు చున్నావు ? ఈ పాత్రలం గైకొనుము. వేగమింటికి బోవుదము. అర్థరాత్రమైనది.

అప్పి - చిత్తము. ఎవ్వరును లేరు. నాలో నేనే యేదియో పాడుకొనుచున్నాను. (అని పాత్రలం గైకొని ముందులాంతరు బుచ్చుకొని చూపుచు మహిళతో గూడ నిష్క్రమించినది).

అంతలో నరిసిగాఁడు తేలుమందుఁ తీసికొని వచ్చి బాబూ ! యెందున్నా రని పిలిచెను.

సెట్టి - యిదిగో యిక్కడున్నాను. మందు తెచ్చితివా ! అబ్బా నా ప్రాణములు పోవుచున్న విరా ? యింతదనుక యీ చిన్నది యున్నది. కావున బాధ కనుపించినదికాదు. ఇటురా ! నా భార్య లేవలేదుగద ?

నరసి - నేను పెట్టి తడుము చుండఁగా ఎవరు వారన యదరిపడి యమ్మగాఱు లేచిందండి.

సెట్టి - అది యెందుకని యడిగిందా యేమిటి ?

నరసి - అడిగినారు తేలు చెక్కకై వచ్చితిని. బాబుగారికి తేలుకుట్టిందని పొరపాటు చేత చెప్పినాను బాబూ !

సెట్టి - ఓరీ వెధవా ! యెంత తెలివి తక్కువ వాఁడవురా ! అమ్మవారి గుడి దగ్గర ఉన్నానని కూడ చెప్పినావా యేమి ?

నరసి - (తొందరపడి) ఆ మాటయుం జెప్పితిని బాబూ !

సెట్టి - అయ్యో ! యిక్కడికది రావడము లేదుగద ?

నరసి - తేలో పామో ! అని భయపడి అమ్మగారు బండి కట్టించుకొని వచ్చుచున్నారు బాబూ !

సెట్టి - యెంతదూరములో నున్నదిరా ? వెధవకాన  ? సెట్టి - బాబూ దగ్గిరకే వచ్చినారు.

సెట్టి - కొంప మునిగినదే. నీ వెదురుపోయి యిక్కడ లేరనిచెప్పుము. (అని యందొక చిన్న గదిలో దూరి తలుపులు వై చికొను చున్నాఁడు. నరిసిగాడు గుడి వెనుకకు పోవుచున్నాఁడు.)

అంతట సెట్టి భార్యవచ్చి బండిదిగి కరదీపిక యెత్తినలుమూలలు సూచుచు రామీ ! యిక్కడ నెవ్వరు లేరేమి ? ఇంటిఁకి బోయినారేమో కదా యనుటయుఁ నా రామి యమ్మ గారు ! యింటికి వస్తే మనకు గనంబడరా ? మఱియొక చోట నున్నారేమో ? యనుటయు సెట్టిభార్య ఓసీ ? యీ దీపము దీసికొని నలుమూలలు చూచిరా. (అని పంపినది) మొదటి దీపముతో నాలుగు దెసలు పరీక్షించి యెవ్వరిం గానక రావిచెట్టు మొదట వేదికపై దొంగ నిద్ర బోవుచన్న తిలకం జూచి యెవ్వరు నీవని గట్టిగా లేపినది. అది కన్నులు నులుపికొనుచు లేచి నా పని మీకేమి ? మేము బాటసారులమని యుత్తరము చెప్పినది. ఇక్కడ మా సెట్టిగా రుండవలయు నేమైరో నీ వెఱుంగుదువా ? యని యడిగిన నత్తిలక యా గదిలో నున్నవాఁడని వ్రేలితోఁజూపినది. అప్పుడది యా గది తలుపులు తెరచి యొకమూల నక్కియున్న సెట్టింజూచి భయపడి అమ్మయ్యో ! యిందెవ్వరో యున్నారని కేకవైచి యీవలఁబడినది. యెవ్వరే? యెవ్వరే : సెట్టిగారేమో చూచితివా ? యని సెట్టి భార్య యడిగిన అమ్మా ! మన సెట్టిగా రట్లేల నక్కియుందురు ? దొంగవాఁని వలె నున్నాడని చెప్పినది.

సెట్టిభార్య దీపమెత్తి లోపలికిఁబోయి భిత్తి నంటుకొని శవములాగున నిలువంబడియున్న మగనింగని అయ్యో ! నీ కిదియేమి ప్రారబ్దము వచ్చినది ? కానిపనులు కిట్లు వచ్చితివి కాబోఁలు నిదియా తెలిసినది. తేలనిన నేమోయను కొన్నాను. కానిచో నీ యర్దరాత్రమును నీ యమ్మవారి గుడికి రావేల ? నీ కెన్నియేండ్లు వచ్చినను బాడు చేష్టలు మానితివికావు. పదపద అని మెడబట్టుకొని బైటకి గెంటివేసినది. ఆ సెట్టి మాఱు మాటాడక యాగెంటుతో మండపమున కవ్వలఁబడియెను. పిమ్మట నా కొమ్మ నరసిగా ! నరసిగా ! యెక్కడ నున్నావు వెధవా ! నీ విందులకు సహకారివై మాయ మాటలు చెప్పుచున్నావా ? యింటికిరా. నీ సంగతి : యని పలుకుచు సెట్టిభార్య సెట్టి బండియెక్కిన తరువాత దాను గూడనెక్కి, రామి వెనుక నడుచుచుండ నింటికి బోయినది.

ఆ విశేషము లన్నియుం జూచినది కావునఁ దిలక మిక్కిలి విస్మయముఁ జెందుచు నా సతీతిలకము మొగము దీపము వెలుఁగున గనంబడినది. పోలిక చూడ రాచ బిడ్డవలె, దోచుచున్నది. ఆమె స్తుతివచనంబులు విన యోగ్యురాలు కాని కులట కాదు. ఆమె నీ కోమటి శెట్టి మోహించి ద్రవ్యము కఱుచుపెట్టుచున్నాఁడు. బ్రాహ్మణుని పెండ్లాము రవ్వలజోడు వీని వలన లంచము గైకొని కైతవము పన్ని యామె నిక్కడికి బంపినది వాని మఱియకటి కాదు. సెట్టి భార్య వీనిని భాగుగాఁ గొట్టినది. లోకమున నెట్టి వింతలైన నున్నవని తలంచుకొనుచు నా రాత్రి వేగించినది.

మఱునాఁ డుదయంబునఁ గాలోచి కృత్యంబులు నిర్వర్తించికొని తిలక యా పట్టణములోఁ బ్రవేశించి రాజమార్గంబునఁ బడి నడువఁ దొడంగినది. అది మిక్కిలి గొప్ప పట్టణమగుటచే నెంత సేపు నడిచినను ---------- చివర గనంబడలేదు. దైవికముగా బ్రాహ్మణులున్న వీధి గనంబడుటయు నందెవ్వరేని భోజనము పెట్టుదురేమో యని యిటు నటు దిరుగుచుండ నొకయింటి యరగుపై భోజనముఁ జేసి కూర్చుండి యున్న బ్రాహ్మణుఁడొకండు తిలకం జూచి అమ్మా ! నీ దేయూరు ? పలు మా ఱీవీధిం దిరుగుచున్నావేమని యడిగిన అయ్యా ? మాది చాల దూరదేశము. ద్వీపాంతరమందున్న యమరావతీ పురంబున కరుగుచున్న దాన. మేము శూద్రులము. ఆఁకలి యగుచున్నది పట్టెడన్న మెవ్వరైన నిడుదురేమో యని తిఱుగుచున్న దాననని చెప్పిన నవ్వుచు నా విప్రుం డిట్లనియె.

అమ్మీ ! అడిగినం గాని యమ్మ యైనఁ బెట్టదను సామెత వినలేదా? ఊరక తిరిగినఁ బిలిచి నీ కన్న మెవ్వరు పెట్టుదురు ? పాపమెప్పుడు నొరుల వడిగినదానవు కావు కాఁబోలు, రమ్ము మా యింటఁ గడుపుమని పలుకుచు అప్పీ ! యిటురా యని యొకదానిం బిలిచి యీ యమ్మికిఁ దొడ్డిదారిం దీసికొని పోయి యన్నము పెట్టింపుము అమ్మగారితోఁ జెప్పుము పొమ్మనవుడు నా దాసి తిలకం దొడ్డిదారిని లోపలికిఁ దీసికొనిపోయి యొకచో విస్తరివేసినది. అంతలో మఱియొక కాంతపళ్ళెముతో నన్నము తీసికొని వచ్చి వడ్డించినది. తిలక భుజించుచు నామె చక్కఁదనముఁజూచి యాశ్చర్య మందుచు రాత్రి యమ్మవారి గుడికి వచ్చిన చిన్నది యామె కాదుగద. అప్పి యను నది యీ దాసి గాఁబోలు ఆ కోమటిసెట్టి యీమెం జూచి వలచుట యబ్బురమా ? యని యనేక ప్రకారములఁ దలంచుచు భుజించునది.

సాపడిన పిమ్మట నలసటగా నుండుటచే నా చావడిలోనే పరుండి యచ్చటి వారితో నేదియో ముచ్చటింపుచుండెను అంతలో నా లోపల నుండి మఱియొక స్త్రీ వచ్చి అప్పీ మఱల నేఁడు తలనొప్పి వచ్చుచున్న దేమే ? అయ్యో ? క్రమముగా బలియుచున్న దే. నిలువలేనని నేలఁ జతికిల బడినది అప్పుడు అప్పి తలవిరియఁబోసికొని యిటునటు త్రిప్పుచు శివ మాడఁ దొడంగినది.

నేను మఱిడమ్మను ; నాకు నిన్నఁ బంపిన యుపహారములలోఁ బెరుగు లేకపోయినది. దానంజేసి, నీకీ నొప్పి మఱలఁ గలిగించితిని. మఱల మంగళవారము రాత్రి బెరుగుతోఁ బంపితివేని నీ నొప్పి పోవునని యా శివలోఁబ్రేలుచుండుటయు నా స్త్రీ తల్లీ ! నీ వెట్లుకోరెదవో అట్లు ఱేపురాత్రి నీ గుడి కుపహారము మఱలఁ బంపెదను నా నొప్పి వాయఁ జేయుము. నీ మహిమఁజూతమనుటయు నంతలో నా దాసి శివమాడుటఁ జాలించి కొంతసేపు తలయూచుచుఁ దిరుగ మాట్లాడ దొడంగినది. రామాభాయియు ఆహా ! నా తలనొప్పి యెంతలో పోయినదో ! శక్తిమహిమ మిక్కిలి కొనియాడఁ దగినది గదా ? యని స్తోత్రములు సేయుచు దాపుననున్న చిన్న దానితో మహిళామణీ ! నీవు నా నిమిత్తము రేవు కూడ శ్రమపడవలయుం జుమీ యని చెప్పిన నామె యంగీకారము సూచించుచుఁ దల యూచినది.

ఆ సంగతి యంతయు జూచి తిలక మిక్కిలి యాశ్చర్యపడుచు నాహా ! స్త్రీ లిట్టి కార్యమునకైన వెఱువరు గదా. ఒరుల నననేల ? నేను మాత్రము విచిత్రములు పన్న లేదా ? యని తలంచుచుఁ గానిమ్ము. ఈ మహిళామణి యెవ్వతెయో వీరింట నేమిటికి వసించినదో తెలిసికొనవలయు. ఈమె గుణము మంచిదివలెఁ గనంబడుచున్నది. రామాభాయి యీమెను మోసము చేయఁదలంచు చున్నది. ఈ సంగతి యా యజమానుం డెఱుఁగఁడు. ఆయన చాల మంచివాఁడు ఈ రహస్యమాయనతోఁ జెప్పి వెల్లడిచేయుదునా ! యని తలంచి పోనిమ్ము. ఈ గొడవ నా కేల ? రేపాగుడి దగ్గరకుఁబోయి యేమి జరగునో చూచెదంగాక యని నిశ్చయించి యప్పుడు వారితోఁ జెప్పి యనిపించుకొని యెక్కడికోపోయి యమ్మఱునాఁడు రాత్రి యథా ప్రకారము పోయి రావిచెట్టు మొదటనున్న వేదిక పైఁ బండుకొనియెను.

ఆ రాత్రి గొంత ప్రొద్దుపోయిన తరువాతఁ గోమటిసెట్టి నరిసిగాని వెంటఁ బెట్టుకొని మెల్ల గా నా గుడి దగ్గరకు వచ్చి ఓరీ ? ఆలస్యము జేసితివేని నాభార్య యనుమానముపడి మఱల నిచ్చటికి రాఁగలదు. నీవు సాయంకాలముపోయి అప్పితోఁ బెందలకడ దీసికొనిరమ్మని చెప్పితివిగదా ! యింకను రాలేదు. నీవు పోయి యాజాడ గనుంగొనిరమ్ము. ఈవేళ జోడు తొడిగికొని వచ్చితినిలే. తేలు నన్నే మియుజేయలేదనిచెప్పి వానిం బంపి యొకమూల మంటప స్తంభము దాపున గూర్చుండెను. ఆవీఁట వీరుఁడను సాలెవాఁడు కుమారునికి జబ్బుచేసినంత నమ్మ వారి కుపహార మిత్తునని మ్రొక్కికొని యా దివసంబున భార్యచే నయ్యుపహారమునుఁ బట్టించుకొని దాను వెనుక దండమును చేతఁబూని నడుచుచు నయ్యమ్మవారి గుడిదగ్గరకు వచ్చెను.

అందుదాను దూరముగా నిలువఁబడి భార్యను మంటపములోనుండి నై వేద్యము పెట్టిరమ్మని నియోగెంచెను. ఆ యువతియు నమ్మవారి ద్వారమున నిలువెంబడి దీపము వెలిగించి పండ్లనైవేద్యము పెట్టి మ్రొక్కి తిరిగి వెళ్ళఁబోవు సమయంబుగఁ గోమటిసెట్టి యదియే మహిళామణి యనుకొని తమి నిలుపలేక యడ్డమువచ్చి చిగురుబోడీ ! నిలునిలు యెక్కడికిఁ బోయెదవు ? నీ నిమిత్తము రెండు నెలలనుండి వేచియున్నాను నామనోరధము తీర్పుము. నీకుఁ గావలసినంత ధన మిచ్చెదనని పలుకుచుఁ జేయిపట్టుకొని లాఁగదొడంగెను. అప్పు డప్పడఁతి అమ్మయ్యో ! నన్నెవఁడో పట్టుకొనుచున్నాఁడని యరచినది. ఆ ధ్వని విని వీరుఁడు సత్వరంబునం జనుదెంచి యెవఁడవురా నీవు ? అని యదల్చుచు నాసెట్టి పొట్టమీఁద నొక్కతన్ను తన్నెను. ఆ దెబ్బ యాయువుపట్టునఁ దగిలి కోమటి గిలగిలఁ గొట్టు కొనుచు నిమిషములోఁ బ్రాణములు వదలెను. అప్పుడు వీరుఁడు దీపము వెలిగించి యా సెట్టి చచ్చుట దెలిసికొని యోహో ! మోసమువచ్చినది. నాతన్నువలన వీఁడు మృతుండయ్యెను ఎవ్వరైనం జూచిన నాకు మాటవచ్చునని తలంచి తనదగ్గిరనున్న తాళముచేవులతోఁ బ్రయత్నముమీఁద నాగుడి తలుపును తెరచి భార్య సాయముపట్ట వాని నాగుడిలోనికి దొరలించి మఱలఁ దలుపులు వైచి యెవ్వరికిం దెలియకుండ రహస్యముగా నింటికిం జనియెను.

ఆ సంగతి యంతయుఁ దిలక రావిమొదలునుండి తిలకించుచునేయున్నది. అంతలో మహిళామణి యప్పిని వెంటబెట్టుకొని యుపహారములతో నాయాలయము దాపునకు వచ్చినది అప్పి కోమటి సెట్టినందు గానక నలుమూలలు తిరుగుచుండెను. మహిళామణి దీపము వెలిగించి పూర్వమువలెనే యుపహారము లమ్మవారికి నై వేద్యముఁ జేసి మఱల నింటికిం బోవలయునని తలంచుచు అప్పిని పిలచినది అప్పి సెట్టిజాడ నరయుటకై దూరముగాఁ బోయినది. కావునఁ బలికినదికాదు. అప్పుడు దానిజాడఁ జూచుచు ద్వారదేశమునఁ గూర్చున్న సమయంబున సెట్టభార్య మగని నింటిలోఁగానక యనుమానముపడి బండియెక్కి వెనుకటి రీతిగానే యక్కడికి వచ్చినది. మహిళ బండిలో వచ్చినవారెవ్వరో యని యాలోచించుచున్న సమయంబున సెట్టిభార్య బండి దిగి దాసి దీపముపట్టుకొని ముందునడువ నమ్మవారి గుమ్మము దగ్గరకుఁ బోయి యందున్న మహిళంగాంచి నీ వెవ్వతెవు ? ఒంటరిగా నిచ్చటికేమిటికి వచ్చితివో చెప్పుమని యడిగిన నామె యేమియు మాటాడినదికాదు. అప్పుడు సెట్టిభార్య మునుపు వోలె తనభర్తయం దెచ్చటనో దాగియున్నాఁడని తలంచుచు రామీ : యాగదిఁజూడు మని చెప్పినది. అప్పుడు వెనుకటిగది తెరచిచూచి యందుఁగానక యది అమ్మా ! యిందులేరు. ఆ లోపల నున్నారేమోయని పలికి గుడితలుపులు త్రోసినది వీరుఁడు గుడితలుపులు మాత్రము జేరవేసెనుగాని మఱఁల దాళము వేయలేదు. కావున నా తలుపులు వచ్చినవి. అప్పుడు రామి లోపలికిఁ బోయి యందొకమూలఁ బడియున్న సెట్టింగాంచి అమ్మాగారూ ! సెట్టిగా రిందున్నారు. రండి. అని పలికిన నాకలికి యలుకతో రామీ ! యిటురా ! అందుండనీ యని పలికి యదివచ్చిన తరువాతఁ జూచితివా ? యీరండ నాకొంప ముంచుచున్నది. దీనిం దగిలికొని సెట్టి ప్రతిదినము రాత్రులయం దిచ్చటికి వచ్చుచున్నాఁడు. మొన్న రాత్రి మనతో బాటసారులమని చెప్పినది. కానిమ్ము. వీరిరువురను దలవరుల కప్పగించి దండింపజేయుదముగాక యని పలుకుచునామెను బలాత్కారముగా నాగుడిలోనికిఁ ద్రోసి రండా ! నీవుకూడ నిందుండుము. రేపు ప్రొద్దుట మీయిరువుర పనిఁ బట్టింతునని పలుకుచుఁ దలుపులు ----------- గొల్లెముఁబెట్టి కూర్చున్నది.

అంతలోఁ దెల్లవాఱినది. సెట్టిభార్య అప్పుడావీధిం దిఱుగుచున్న తలవరులం బిలిపించి యిందొక రంకులాడి నా మగనితోఁ గ్రీడింపుచున్నది. రెండు మూఁడు తేపలు పట్టుకొని క్షమించి విడిచిపెట్టితిని. ప్రతిదినము రాత్రుల నిందు సాంకేతికము జేసికొని వచ్చుచుండ నెన్ని నాళ్ళూరకుందును ? ఇరువురం బట్టుకొని లోపలఁబెట్టి గొణ్ణెము పెట్టితిని చూడుఁడు. వీనికిఁ దగిన శాస్తి చేయింపుడని వేఁడి కొనినది. అప్పుడు వాండ్రాగుడితలుపులు తెరచి యా ప్రాంతమున నిలుబడి విస్మయ స్వాధనశోక వివశయై పరమేశ్వరుని ధ్యానించుచున్న మహిళామణిం గాంచి బై టికి రమ్ము. రమ్ము. నీగుట్టు రచ్చయెక్కినది. తల వాల్చికొనిన బ్రయోజనములేదని పలికిన నులికిపడుచు నక్కలికి వాకిటకు వచ్చినది.

అప్పుడాగుడిలో నించుక చీఁకటిగా నుండుటచే సెట్టి చచ్చిపడియున్న వాఁడని తెలిసికొనలేక పరు డియున్నాఁడనికొని సెట్టి గౌరవమంతకుఁ బూర్వమె ఱిఁగి యున్న వారె కావున తలవరులు సగౌరవముగా సెట్టిగారూ ! రండి రండి. తెల్లవాఱినది మీవంటివా రిట్టిపనులకుఁ బూనుకొందురా ? యని పలికిరి. కాని సెట్టి లేవలేదు. అప్పుడు సెట్టిభార్య రామీ : యీపాటికి రమ్మనుము ప్రజల మొగము చూచుటకు సిగ్గుపడుచున్నాఁడు కాబోలు : సిగ్గుండిన నీలాటిపను లేమిటికిఁజేయును ? ఎక్కడనో మంచి తొత్తునే సంపాదించెనులే. రండా ! నీవిదివఱ కెందఱికొంపలు దీసితివి? అని మహిళా మణిం బొడుచుచుఁ బరుషములాడఁ దొడంగినది. అంతలోఁ దిలక యాచర్యలన్నియుఁ జూచుచున్నది. కావున మహిళ నిర్దోషురాలని తెలిసికొని జాలిపడి యచ్చటికి వచ్చినది.

ఆ లోపల రామి లోపలికిఁబోయి సెట్టినిలేపి, లేవకుండుటచే బిగ్గఱగాఁ బిలిచియుఁ బ్రతివచనంబుఁ బసయక విసిగి వాకిటకు వచ్చి అమ్మా ! సెట్టిగారు చాల భయపడినారు ఎంతపిలిచినను మాట్లాడుటలేదు. మీరేపోయి పిలువవలయునని చెప్పిన నప్పడఁతి భయమేమీ ? డబ్బున్నదిగదా యింతమేత పాఱవేసినచో నందఱు వ--లగుదురు. ఇఁక నెన్నఁడు నిట్టిపని చేయఁడని యిట్టు చేసితిని. అని పలుకుచు లోపలికిఁబోయి చేయిపట్టుకొని లెండి లెండి. అయ్యో : చీఁకటిలోఁ గిందబరుండ రేమి ? అవును. ఇంటిదగ్గర మూఁడు పఱుపులు వైచినను నొత్తుచున్నదని పలికెదరు. ఇక్కడిదియే సుఖముగానున్నది కాఁబోలు. కోపము వచ్చినదాయేమి ? పరిహాసమున కిట్లు చేసితిని. మగవారలుగదా ! మీ కేమితప్పు ? తలవరులు మిమ్మేమియుం జేయరు. రండి అని యూరక బ్రతిమాలఁ దొడంగినది.

అంతలోఁ గొంత వెలుగు వచ్చినది కావున ముఖవైలక్ష్యము స్పష్టముగాఁ గనంబడినది. నిదానించి చూచి అమ్మయ్యో ? సెట్టి కన్నులిట్లు తేల్ల గుడ్లు పడిన వేమి ? ప్రాణములున్నవియా ? యని యడలుచు నూపిరి పరీక్షించి గాలిం గానక గుండెలు బాదుకొనుచు అయ్యో : అయ్యో : మాసెట్టిని నీరంకులాడి చంపినఁదండో యని యఱచుచుఁ బెద్దధ్వనితో నేడువఁ దొడంగినది. అప్పుడు తలవరులు లోపలికిం బోయి పరీక్షించి సెట్టి చచ్చెనని నిశ్చయించి యాపీనుఁగును వాకిఁటికి దీసికొనివచ్చి పరుండఁబెట్టిరి. అంతలో నావార్తఁ దెలిసి రాజభటులు గ్రామాధికారులు లోనగువారందఱు నచ్చటికి వచ్చి పరీక్షించి యీతని నిట్లెవ్వరు చంపిరని యడిగిన సెట్టిభార్య చెప్పిన మాటలంబట్టి మహిళామణియే గుడిలో వానింజంపినదని తలవరులు చెప్పిరి. ఆర్యభట్టుగారింటిలోనున్న యాఁడుది. మరిడమ్మ గుడిలో నిన్న రాత్రి సెట్టితో నుండఁగాజూచి సెట్టిభార్య తలుపులు వేయగా సెట్టిం జంపినది అను వార్త పట్టణమంతయు వ్యాపించినది అప్పికిని నందలి నిక్కువమేదియో తెలిసినదికాదు.

మఱునాఁ డింటికిఁపోయి రామాభాయితో నచ్చటజరుగుచున్న సంగతు లన్నియుం జెప్పినది. తనకేమి మూడునోయని రామాభాయి భయంపడుచు నప్పితో నా రహస్యమేమియు వెల్లడిసేయఁగూడదని గట్టిగా మహిళామణి యెందున్నదని యడిగిన రాత్రిగదిలోఁ బరుండినది. ప్రొద్దున్న నాకుఁ గనంబడలేదు. ఆమాటయే యిప్పుడప్పి నడుగుచున్నాను. పొరుగింటి కెక్కడకేనిఁ బోయినదేమోనని రామాభాయి యుత్తరముఁ జెప్పినది. అప్పు డార్యభట్టు ఓసీ ? దాని నింటిలోఁ బ్రతిదినమురాత్రులు జూచుచున్నావా ? యని యడిగిన నాప్రోద పండుకొనునప్పుడును మఱల నుదయంబునను జూచుచుందును. నీలోపల జూచుటకు నాకేమిపనియని చెప్పినది.

అప్పుడా బ్రాహ్మణుఁడు నిట్టూర్పు నిగుడింపుచు అది ప్రతిదినము నేమి చేయుచున్నదో చూచితివా ? రాత్రులయందు మరిడమ్మ గుడిలో పోలిసెట్టిని గలిసికొనుచున్నదఁట. మనమాకర్మమేమియు నెఱుంగము. అది కడు గుణవంతురాలను కొనుచున్నాను నిన్నరాత్రి వానియందేమి కోపమువచ్చినదో గుడిలోఁ జంపినదఁట. రాజభటులు దానిం బట్టుకొని విచారించుచున్నారు. దానిమూలమున మనకుఁగూడ నపకీర్తి వచ్చినదని యావృత్తాంతమంతయుఁ జెప్పెను.

అంతలోఁ దిలక యచ్చటికిఁ బరుగిడికొనివచ్చి యార్యభట్టుం బిలిచి అయ్యా ! మీకు నమస్కారము మీయింటనున్న మహిళామణి సెట్టిం జంపినదని రాజభటులు నిర్బంధించి చదురనకుఁ దీసికొనిపోవుచున్నారు. పాపమామె యేపాపము నెఱుఁగదు. ఏమన్నను మాటాడక మౌనముద్ర వహించి తప్పుఁ జేసినదానివలె గనంబడుచున్నది. వేగఁబోయి యాయిల్లాలిం గాపాడుఁడని వేడికొన్నది.

అప్పుడా విప్రుఁడు చాలుచాలు దాని యిల్లాలితనమంతయుం దెల్లమైనది. మాయింటనున్నదని చెప్పినచో మాకుఁగూడ మాటరాఁగలదు. పోనిమ్ము ? దాని గొడవ మాకేల మాయన్న యప్పగించెనుగదా యని పుత్రికా నిర్విశేషముగాఁ బెంచుచుంటి. పిరుం తె... it..ఎంచుదు. నాయని పలుకగాఁ దిలక అయ్యా ! తమరట్లన సుడియు నడు: కాలు యూర ఎంత. నేను మీరుసుం:ు వరి, ... - రంపురం, వేడి కానన మనము 3. యుత్యపు చదాచుకు కవు... చ. భార్య పుచువలదు. అది విచున మనమీఁదఁ బడిగల... మనకు . అక్కయా ! చెల్లె యా ! యేమో అన్నగారప్పగించినారుగదాయని నాలుగు దినము లన్నము పెట్టితిమి. ఆగొడవలన్నియు మనకేలనని వారించినది.

అప్పు డార్యభట్టు అమ్మీ ! నీవెవ్వతెవు ? దానితో నీకీ చుట్టరికమెక్కడఁ గలిసినది? దానిపై నీకింత ప్రేమయేల గలుగవలయునని యడిఁగిన దిలక అయ్యగారూ ! ఆమె యెవ్వతియో నే నెఱుంగను. కాని నిర్దోషురాలని నిశ్చయముగాఁ జెప్పఁగలను. మొన్నను భుజించునప్పుడు మీయింటనే చూచితినని చెప్పుచుండగనే రాజభటుఁ డొకండువచ్చి యార్యభట్టుగా రిల్లి దియేనా యని యడిగెను. ఆమాట విని యతండు భయపడుచు అయ్యో ! మాకొంపయు మునింగినది. రాజదూతవచ్చి నా పేరడుగుచున్నాఁడు. ఏమిచేయుదును? ఎక్కడ దాగుదునని తలంచుచుండ నాకింకరుండు లోపలికి చ్చి బాపఁడా ! ఆర్యభట్టువు నీవేనా ? నిన్ను జదురునకుఁ దీసికొనిరమ్మని మాదండనాయకుఁ డాజ్ఞాపించెను. రమ్మనుటయుఁ దిలక అయ్యా ! తమకేమి భయము ? పదుండు నేనుఁగూడ వత్తునని చెప్పినది. అప్పుడు వారందరుఁ గలసి చావడి దగ్గరకుఁ బోయిరి. అతడు మహిళామణి యాచావడిలో నొకమూల దలవాల్చుకొని నిలువంబడియున్నది. చమూపతి ఆర్యభట్టుం జూచి యిట్లనియె.

చమూపతి - అరే ! బాపనాడా ! నీకీ యీఆడదీ యేమీ కావాలా ?

ఆర్య – మహాప్రభో ! నాకేమిన్ని కాదు.

చమూ - కాకపోతే మీకీ యింటిలో యెందుకూ వుండాలీది భాంచోతు.

ఆర్య - భాంచోతు మా యింట్లో యెప్పుడూ వుండలేదండి.

చమూ - అరే భాంబోతుకాదు. ఆడది మీకి యింట్లో యెందుకు వుండాలీవోయ్.

ఆర్య - అదాండి. మా అన్నగారు వరికుప్ప నూరిపించుచుండఁగా బ్రోగుగావేసిన గడ్డిలో వచ్చి యిది కూర్చున్నదట. అప్పు డా యన యింటికిఁ దీసికొని వచ్చి కొన్ని సంవత్సరములు తన దగ్గఱ నుంచుకొని చచ్చిపోవుచున్న సమయంబున నా కప్పగించి దీని యావజ్జీవము పోషించుమని చెప్పెను. అందు మూలమున దీనిని మా యింటిలో నుంచుకొన్నామండి.

చమూ - అరే భాంచోత్. దీనికి మీ అన్న గారికి వుంచుకున్న మనిషా నాకీ ఆలా సెప్పవేమి.

ఆర్య - వుంచుకోవడం అనగా తప్పుమాట కాదండి పెంచుకున్నారన్న మాట.

చమూ - ఇది ఇప్పుడు పెద్ద సెట్టికి పొట్టమీఁద సంపి మాట్లాడదేమి ? అరే భాంచోత్ యిది ఆగే సంభe an in ' సి : సంచరిసిన ముగ్గులు, సేసింది .

ఆర్య - ఇది యింటిదగ్గర దఱచు మాట్లాడేది కాదు.

తిలక - అయ్యా ! 1 : . మనవి యున్నది. ఆమె యేమియు నేరము చేయలేదు. సెట్టి నిది చంపలేదు. అంతయు నాకుఁ దెలియును, దైవముఖమున నిజము సెప్పెదను.

చమూ - అరే భాంబోత్ దీనికి యెవ్వరు బే

ఆర్య - అది యెవ్వరో నే నెఱుగనండి.

చమూ - నీకీ నిజము యెట్లు సెప్పఁగలవు ?

తిలక - నేను గన్నులార జూచితిని. అని తాను రావిచెట్టు మొదటఁ గూర్చుండినది. మొదలు నాఁటి తుదవఱకు జరిగిన కథ యంతయుం జెప్పినది.

అప్పుడా చమూపతి యార్యభట్టుగారి యిల్లు పరీక్ష చేయుటకై నిరువురి రాజభటులం బంపెను. వారాయిల్లు శోధించి యందు శెట్టి వ్రాసిన యు త్తరమును శెట్టి పంపిన రవ్వలజతయుం బట్టుకొని యప్పిని రామాభాయిని వెంటబెట్టుకొని చమూపతి యొద్దకరిగి యా వృత్తాంతమంతయు జెప్పిరి. చమూపతి యా యుత్తరమిట్లు చదువుచున్నాఁడు.

నీవు కోరిన ప్రకారము రవ్వలజత యిందుతోఁ బంపించితిని. నా మనోరథము తీరుతువేని పిమ్మట నా యౌదార్యము చూతువు గాక ! నాకిదియొక లెక్కా ! క్షణమొక యుగము లాగున్నది. ఆలస్యము చేసితివేని ప్రాణములు నిలువవు. సాంకేతిక మేర్పరచి వెంటనే ప్రత్యుత్తరము వ్రాయఁగోరెదను.

ఇట్లు నీదాసుఁడు రత్నాల పోలిశెట్టి.

అని చదివి చమూపతి గడ్డముఁ దువ్వుకొనుచు అరే భాంచోత్ దీనికి కోమటికి యెవ్వరికి వ్రాసినది తెలియదేమి. తల పంకించుచు రామాభాయిం జూచి దీనికి యెవ్వఁడు అని యడిగిన నార్యభట్టు అది నా భార్యయని యుత్తరము సెప్పెను.

చమూ – అరే భాంచేత్ దానికీ అడిగితే నీకి సెప్పుదావేమీ ఉరుకో. నీకి యీ చీటి కోమటి వ్రాసినాడా ?

రామా - లేదండి మహాప్రబో. లేదండి.

చమూ - దీనికి మీ యింటి కేలాగు వచ్చినది.

రామా - ఈ మహిళామణి మా యింటిలో నుండఁగా వాఁడు చూచినాఁడు కాఁబోలును దానికి వ్రాసినాఁడు నాకేమియు దెలియదండి.

చమూ - నీకి దీనికి గుడికి పంపినావని యీ యాఁడది సెప్పుతోంది నిజమేనా?

రామా - వట్టిదండి. నా కేమియుం దెలియదు. దీనికి నామీఁద గిట్టక చెప్పుచున్నది. ఇది అది వకటేనండి. అప్పుడప్పుడు మా యింటికి వచ్చుచుండ నేమిటికో యనుకొంటినని యారామాభాయి యంతకుముందచ్చట జరిగిన సంగతులన్నియు రహస్యముగా నప్పినిబంపి తెలిసికొన్నది గావున సందర్భానుసారముగా బొంకి యా నేరము తన మీదఁ దప్పించుకొని తిలకమీఁదఁ బడునట్టు తాను జెప్పుటయే గాక నితరుల చేతఁగూడ సాక్ష్యమిప్పించినది. రామాభాయి వంటి ప్రోడ యా వీఁటిలో లేదు. అప్పుడా చమూపతి తిలకఁ గూడ నేరములో నున్నదని నిశ్చయించి యపరాధినిగా నెంచి చెఱసాలం బెట్టుమని యాజ్ఞాపించెను.

అంతలో నొకమూల కోలహల ధ్వని యొకటి వినఁబడినది అందఱు దృష్టి ప్రసారము లాదెసకు వ్యాపింపజేసిరి. అప్పు డిరువురు భటులు వచ్చిసలాములు చేయుచు సామీ ! హసాదు పుష్పహాసుఁడను పల్లె వాఁడు చక్రవర్తి కొడుకునుఁ గొట్టి పాఱిపోయి వచ్చి ద్వీంపాంతరమున కరుగుచుండ నోడలోఁ బట్టుకొని మీ యొద్దకుఁ దీసికొని వచ్చుచుండ నా దేవాలయము దాపున మమ్మదలించి తన్ని త్రాళ్ళు తెంపుకొని యా దేవాలయములో దూరి తలుపులు వైచికొనెను. ఆ కోవెల ప్రహరి కోటవలె నున్నది. తలుపులు తీయక దానిలోఁ బ్రవేశించుటకు సామాన్యముగ శక్యముగాదు. దేవర దయచేసి వానిం బట్టికొనవలయునని చెప్పిరి.

ఆ మాటలు విని ఆ దండ నాయకుఁడు అగునగు వాని పేరు పుస్తకములో వ్రాసికొంటిమి వానిం బట్టుకొనిన మంచి పారితోషికము రాఁగలదు. అని పలుకుచు యేదియో యూది ధ్వనిచేసెను. ఆ నిమిషములోఁ బెక్కండ్రు రాజభటు లక్కడికి వచ్చిరి. అప్పుడు చమూపతి యీ నేరములోఁగొంచెము విచారింప వలసియున్నది. వీరి నిట్లే యుండనీయుఁడు. తృటిలో వత్తునని చెప్పి రాజభటులతోఁ గూడ నా దేవాలయము దాపున కరిగెను.

కోవెల ముందర గొప్ప గోపురమున్నది. దాని తలుపులు కోట తలుపులు కన్నఁ బెద్దవి. అవి యుత్సవ దినములలోఁ దక్క తక్కిన సమయములందు మూయఁ బడియుండును. వానిలో నొక తలుపున కమరింపబడియున్న చిన్న ద్వారమునుండి జనులు పోవుచుందురు. పుష్పహాసుం డాతలుపువైచి గడియ బిగించి యున్నవాఁడు. కావునఁ చమూపతి యాలోచించి యంతకు ముందాలోపల నున్నవారి దలుపు తీయుఁడని భటులచే నరపించెను. లోపలవారికిఁ బుష్పహాసుని నిర్బంధమునఁ దలుపు తీయుటకు నవకాశము గలిగినది కాదు.

అప్పుడు చమూపతి వీరభటులఁ గొందర శృంఖలా నిశ్రేణికలనుండి యా గోడ నెక్కి లోపలికి దింపి తలుపులు తీయించి దేవళము ముఖమంటపము దాపునకుం బోయెను. పుష్పహాసుఁడు గనఁబడలేదు. అప్పుడందన్న వారి నదలించుచు నతండా పల్లె వాఁడెందున్న వాఁడని యడిగిన వారిట్ల నిరి.

అయ్యా ! మేము మీ కేకలు విని తలుపులు తీయఁబోయిన గడియ గట్టిగఁ బట్టుకొని తీయనీయడయ్యె. మీరులోనికి వచ్చుసన్నాహము జూచి రెండవవైపుననున్న గోపురము మీదుగా నా గోడ యెక్కి నవ్వలకురికి పాఱిపోయెను. ఇంతలో మీరువచ్చితిరని చెప్పిరి. వాని సాహసమునకు, బలమునకు నందున్న వారెల్ల వెరగపడఁ జొచ్చిరి. చమూపతి వాడిందున్నప్పుడేమి చేసెనో సవిస్తరముగా వక్కాణింపుడని యడిగిన వైఖానసు డొకండు అయ్యా ! వాఁడీ గుడిలోఁ బ్రవేశించినది మొదలు నేను వెంట వెంటనే తిరుగుచుంటి. గుడి చుట్టు తిరుగుచు నుత్తరము వైపుననున్న గోడమీఁద నేవియో పద్యములు వ్రాసియుండగా విమర్శించి చూచి దాని క్రింద మసిబొగ్గుతోఁ దానేదియో వ్రాసెను. మఱియు నా గోడలన్నియు బరీక్షించుచు దిరిగె, నిదియే వాఁడు చేసినపని యని చెప్పెను. అప్పుడు చమూపతి వాఁడు వ్రాసిన వ్రాత యేదియో చూడవలయునని యా గోడ యొద్దకుఁబోయి చూచెను. అందీ క్రింది పద్యములు మసి బొగ్గుతో వ్రాయబడియున్నవి.

క. విరినవ్వుతావులివియని
   యరుదెంచితినిందదేమియగపడదయ్యన్.
   సరిసరియని యొకతుమ్మెద
   హరినెలపునఁ దిరిగెఁ జిత్రితాబ్దంబులపై.

గీ. లలితపదబంధ మీపద్యకలితభావ
    మరయువారలు నాకాప్తులగుదు రెపుడు

ఇంతవఱకు నొకరు వ్రాసిన పోలికఁ గనంబడుచున్నది.

    తెలిసికొంటిని నెమ్మోము తిలకమనఁగ
    గలిసికావింతు నేస్తంబు గానిపింపు.

పై చరణములు మఱియొకరు పూర్తి జేసినట్లు కనంబడుచున్నది. పుష్పహాసుం డీక్రింది పద్యము పై వానింజూచి వ్రాసెనని చెప్పిరి.

క. మితిమీరెఁగాన నిలుచుట
   యతికష్టముగాన నొరుల కగ్గంబై నన్
   వెతగావునఁ జనియె మదు
   వ్రతమా ! యమరావతిని శుభంబగు తావుల్.

చమూపతి మహమ్మదీయుఁడగుట వాని యర్థమేమియో తెలిసికొనలేక యా మూడు పద్యములు కాగితముపై వ్రాయించి చదురునకుంబోయి పట్టణమంతయు వెదకి వానిం బట్టుకొని రెక్కలు గట్టి తీసికొని రండని కింకరుల కాజ్ఞాపించి యందు నిలువం బడియున్న యార్య భట్టుం జూచి వీనికర్థ మేమియో చెప్పుమని యా కాగిత మాయన చేఁతికిచ్చెను. ఆ విప్రుండు సంస్కృత భాషా పాండిత్యము గలవాఁడయ్యు నందలి భావము గ్రహింపలేక పదిసారులు చదివి చదివి యిది యేదియో సాంకేతికముగా స్త్రీ పురుషులు వ్రాసికొనినట్లు కనంబడుచున్నది. దీని భావము నాకేమియుఁ దెలియలేదని చెప్పి యా కాగితము తిరుగ నిచ్చి వేసెను. అతండు మఱియు నాఁవీటనున్న మేటి పండితులఁ బెక్కండ్ర రప్పించి యా పద్యముల భావమేమని యడిగిన వారు విమర్శించి చూచి తెలియక అయ్యా ! తఱచు మాలో దేవాలయములో గోడల మీఁదను . సత్రము గోడల మీఁదను బాటసారులు వ్రాయుచుండుట వాడుకయున్నది. ఈ పద్యము లెవ్వరికిఁ దోచినట్టుగా వారు వ్రాసిరేకాని వీనికొక యభిప్రాయమందు వివక్షత యున్నట్లు కనంబడదు. ఒకదాని కొకటి సంబంధము లేదని చెప్పిరి.

చమూపతి యంతటితో నా సభ ముగింపుచు వీరభటులం జూచి నిష్కారణము దొరకిన యపరాధిని విడిచిపెట్టితిరి. పట్టణమంతయు గాలించి రేపు మధ్యాహ్నములోపుగ వానిం బట్టుకొని నా యెదురఁ బెట్టనిచో మిమ్మునందర బందీగృహంబునం బెట్టింతునని పలికి శెట్టిం జంపిన నేరము విచారింతునని వారిం కారాగారము కనిపి తా నింటికిం బోయెను.

ఆర్యభట్టు భార్యతో నింటికిం బోయి తమ్ము విడిచి పెట్టినందులకు భగవంతుని కనేక నమస్కారములం గావించుచు మహిళ గావించిన దుర్ణయము గుఱించి యిరుగు పొరుగువారు వచ్చి వెరగు పడుచుండ వారికిఁ దగు సమాధానము జెప్పి తన భార్య గుణగౌరవము మెచ్చుకొనుచు నా దివసము వెళ్ళించెను.

నాఁడు తిలకయు మహిళతోఁ గూడ జెఱసాల బెట్టఁబడినది. మహిళ సాధారణముగా దినమునకు నత్యంతాప్తులలో సైత మవసరమును బట్టి యొకటి రెండుమాటల కంటె నెక్కువగా నాడునది కాదు ఆ దివసమునఁ దన నిమితమై తిలక నిష్కారణము బద్ధురాలయ్యెనని విచారించుచు మెల్లగా నిట్ల నియె.

యువతీ ! నీ వెవ్వతెవో ధర్మాత్మురాలవుగాఁ గనంబడుచుంటివి. నీ ప్రాయము చిన్నదైనను గుణము పెద్దదిగదా. అయ్యో ! యీ మందభాగ్యురాలి కేమిటి కుపకారము చేయఁబూనితివి. కటకటా : యే పాపమెఱుంగక నా నిమిత్త మూరక శిక్షింపఁబడుచుంటివే అక్కటా ! పాడువిధీ ! నన్నింక నెన్ని చిక్కులు పెట్టి చంపెదవు. అని కన్నీరు మున్నీరుగా విచారించుటయు నూరడింపుచుఁ దిలక యిట్ల నియె.

అమ్మా ! నా నిమిత్తము నీవు విచారింపకము. నే నన్నింటికిం దెగించి యున్న దాన. మొన్న నిన్నుఁ జూచినది మొదలు నీ వృత్తాంతము వినవలయునని యూరక తలంచుచుందు. నీ యజమానురాలి దుష్టచేష్టలన్నియుఁ గన్నులార గంటి. జెవులార వింటి కోమటి వలన లంచముగొని నిన్ను గపటంబున గుడికంపినది. నీవు కడునిల్లాలవు ఏ దోషము నెఱుంగవు. నిన్నుఁగామించిన దుర్మార్గుడు నశింపక నిలుచునా నీవు వీరింటికెట్లు వచ్చితివి. నీ జన్మభూమి యేది. నీ పతి యెవ్వఁడు ? నీ వృత్తాంతము చెప్పుము. మనకు మనమే యోదార్చుకొనవలయు మనల నూరడించువా రెవ్వరున్నారు ? అని యడిగిన విని యక్కలికి మఱియు వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది.

అప్పుడు తిలక పెద్దతడవు సానునయముగా నూరడింపుచు అమ్మా ! నా ప్రశ్నమువలన నీకు మఱికొంత విచార మెక్కుడైనట్లున్నది. పోనిమ్ము . మఱి యొకప్పుడు చెప్పెదవు కానిలేయని పలికినది చమూపతి యమ్మఱునాఁడు మరలఁ జావడికి వచ్చి మహిళయుఁ ల వంచి ముందుకు ని.) vija>u .. సరము.పపంచి సుకుంటున్న సమJ: K Rs. 2 ... * నొక ఆ పన పురు , . . . ! - మంచి మురు ) , సం.వలన .. .. . ముచు స్వామీ ! ప్మీ : . . . స్వ... 8:31 నున్నందున .. ri.... ...................... పుష్పహాసుఁడు పిత - ఆ . : * ములు. .. .. .. .. .. - | - కాని యట్లు పొడి 12) 1 1 ... ... తమ : ఎ... ఏం 1.3 1.13 :: :త : .... ! - మన కవి - - - ఏ మందరము పుము. ... ... ... ... తిపు, మురు.. ము.... . , . తములు . లయ ar.. vintaina ni గాచికొని పరీక్షింపుచుంటిమి. నేఁటి యుదయమునఁ గొంచెము 11. A nu నిన్నటి దేవళములోనికివచ్చి వీఁడు నలుమూలలు తిరిగి తిరిగి చూచుచు నుత్తరపు గోడయొద్దకుఁ బోయి యందు వ్రాయబడియున్న పద్యములఁ బరిశోధింపుచుండెను.

అందుఁ గావలియున్న రాజభటులరసి తటాలున వీనిం బట్టికొని సంకెళులు దగిలించిరి. ఇంతలో మేమందరము గలిసికొని దేవర యొద్దకుఁ దీసికొని వచ్చితిమి. వీఁడు చూడం జూడ మృదువులాగునఁ గనంబడునుగాని కలియఁబడిన నూఱ్వురఁ బరిమార్చగలఁడు. అబ్బా! నిన్న వీని లాగలేక మా చేతులు తెగిపోయినవి కదా యని యాకథ యంతయుం జెప్పిరి.

అప్పుడు చమూపతి నిజముగా వీఁడు పుష్పహాసుఁ డగునా మఱియొకడు కాడుగద. మీరు వీని బాగుగ గురుతెఱుఁగుదురా యని యడిగిన సందేహమేల వీఁడే పుష్పహాసుఁడు. మే మెఱుఁగనిదే పట్టికొందుమాయని యుత్తరముఁ జెప్పిరి. చమూపతి యోరీ ! నీవు పుష్పహాసుఁడవేనా రాచపట్టి నేమిటికిఁ గొట్టితివని యడిగిన నా పురుషుఁడు నేను పుష్పహాసుఁడనుగాను. మకరందుఁడనువాఁడ. నా కాపురము ద్వీపాంతర మందున్న యమరావతీ నగరము. వీరు నన్ను నిష్కారణముగాపట్టి తీసికొనివచ్చిరి. ఇంత యన్యాయ మెందైనఁ గలదా యని పలికిన విని చమూపతి భటుల మొగముఁ జూచెను.

అప్పుడు వాండ్రు సామీ! వీఁడు గజదొంగ. వీనిమాటలు నమ్మవలదు. మీసములు గొరిగించుకొని పేడివలెనె గనంబడుచున్నాఁడు. వీని విడిచిన మఱల బట్టుకొనజాలమని యందఱు నేక వాక్యముగాఁ బలికిరి. చమూపతి కానిండు. ఇప్పుడు పుష్పహాసుఁడు పట్టువడెనని చక్రవర్తికి దెలియజేయను. ------------- మనకేమి యాజ్ఞ యిత్తురో యట్లు చేయవచ్చు. నంతదనుక వీనిం జెరసాలయందు భద్రముగాఁ గాపాడు చుండఁడని పలికి పోలిశెట్టినిఁ జంపిన నేరము బూర్తిగానిప్పుడు విమర్శించి మహిళా మణి సెట్టిం జంపినట్టును తిలక సహకారిణియైనట్టును ధ్రువపరిచి వారిరువుర నపరాధినులుగా నిశ్చయించి యట్లువ్రాసి యా పత్రికల న్యాయాధికారియొద్ద కనిపి పైవారి యజ్ఞయగుదనుక వారి నిద్ధరఁ జెరసాలనుంపుఁడని కింకరుల కాజ్ఞాపించి చమూపతి యంతటితో సభఁ జాలించెను.

అప్పుడు తిలక యాత్మగతంబున అయ్యో ! యీ యౌవనపురుషుని మొగమెక్కడనో చూచినట్లున్నది. వీనిఁ బుష్పహాసుఁడని భ్రాంతి పడుచున్నారు. కాడని చెప్పుదునా. ఓహో ! పుణ్యమునకుఁ బోవఁ బాప మెదురుపడును ఈ మహిళ కుపకారము చేయఁబూనుటఁ గదా యిట్టియిక్కట్టు పడుచుంటి. ఈ గొడవ నాకేల. పాప మీ చిన్నవాఁడు నా మొగమువంక నూరక చూచుచున్నాడు. ఒక్కడైనఁ బరిచయము చేసియుండ లేదుగద ఆహా ! యురిదీయబడుటకు సిద్ధముగానుండ వెఱ్ఱి యూహలకుం బోవుచున్నానేయని పలు తెరంగులఁ దలంచుచుండెను

ఇంతలోఁ గృతాంతకింకరులవంటి రాజభటులు పదుఁడు పదుఁడని యదలించుచు వారి మువ్వుర బందీగృహంబునకుం దీసికొనిపోయి యాపురుష నొకగదిలోను నాడువాండ్ర నిరువుర నొక గదిలోను బెట్టి తలుపులు వైచిరి మకరందుఁడున్న గదికిని వీరున్న గదికిని నడుమ నినుపగవాక్షముండుటచే నొకరి నొకరు చూచుట కవకాశము గలిగియున్నది. రాజభటులు కొంచెము దూరముగాఁ బోయినంత దిలక యూరకొనలేక యా కిటికీనుండి తొంగిచూచుచు సుందరుడా ? నన్నూరక చూచుచున్నావు. నీవెవ్వడవు ? పాపము పుష్పహాసుండవని నిన్ను వీండ్రు బట్టికొనిరి. ఇది కడునన్యాయము. పుష్పహాసు నేనెఱుంగుదును. నీ కాపుర మమరావతీపురమని చెప్పితివి. అక్కడనుండి యిక్కడి కెప్పుడు వచ్చితివి? సింధుకారనగర కాపురస్తులం దెవ్వరైనఁ గనంబడలేదుగద. యని యడిగిన నాపురుషుండు మెల్ల గా దానికిఁ దెలియున ట్లేదియో చెప్పెను.

బాలా ! నాకథ చాల పెద్దది. పిమ్మటఁ దెల్పెదను. నీ వీ చెరసాల నేమిటికిఁ బడితివి. యామె యెవ్వతే ? నీ మొదటి వృత్తాంతము చెప్పనక్కరలేదు. తదనంతర వృత్తాంతము చెప్పుమని యడిగిన నాజవ్వని నివ్వెరపడిచూచుచుఁ దానాపట్టణముఁ జేరినది మొదలు జరిగిన కథయంతయుఁ జెప్పినది. అప్పుడా పురుషుఁడు మహిళామణి శీలమును గుఱించి మెచ్చుకొనుచు చమూపతి యన్యాయమును గురించి చింతింపఁ దొడంగెను.

వారిరువురట్లు మాట్లాడుకొనుచుండ మహిళకన్నీటి జడింబయ్యెదం దడుపుచు ముర్మోము వెట్టి దుఃఖింపఁ దొడంగినది. అప్పుడు తిలక అమ్మా ! మన మిప్పుడు యమలోకమునకుఁ బయనమై సిద్దముగా నుంటిమి. విచారించి బ్రయోజన మేమి ? నీ యాకారము జూడ గొప్ప వంశమునం బుడమినదానవువలె గనంబడు చుంటివి. ఇప్పుడైన నీ వృత్తాంతముజెప్పి నీ సఖురాలి మనస్సునకు శాంతిఁ గలుగ జేయవా ! సు: . ce : సమంత us invi srus యగు దాయం సాం .ని ., - - 50 ని.

గంధర్వదత్త కథ

- - - - - - - - - - - - - - - - . /లు ఏపుచుండు ముకు: ? అయ్యో! - - a sir. కున్న నేనిప్పుడు - - - - - - - - - - - - - - - - - - - - - ... ప - హా: హా!

, పుండ గుచుండఁ జెప్ప

10. .. .. .. .. .. .. సుసిన సింధు ర నగరము. ... వీరు సృint: : : యు పికుంజయుడు - పేప గంధర్వ చనం , నన్ను మాతండ్రి వింధ్యకూటనగర ప్రభువైన మణికులుండను రాజనందనునన కిచ్చి వివాహము గావించెను. నేనత్త వారింటికిం జనిన వెంట నా కొక ముద్దుల కొమరుఁడుదయించెను. అని డగ్గుత్తికచే మాటరాక యొక్కింత తడవూరకొని నిట్టూర్పు నిగుడింపుచు వాని కన్నులు వాని చెక్కులు వాని యందము వాని లక్షణములు జూచి వీఁడు చక్రవర్తి యగునని దైవజ్ఞులు చెప్పిరి. యేదియుం జూడ లేకపోతిని.

వానిముద్దు ముచ్చటలం జూచుకొనుచు నాలుగు సంవత్సరములొక ఘడియ లాగున గడిపితిమి. నాభర్త రాజ్యతంత్రములు మాని సర్వదా వానితోనే కాలక్షేపము చేయుచుండెను. అప్పటి యానందము నిప్పటి దుఃఖఘు దలంచికొనఁ బ్రపంచమున నేదియు స్థిరము కాదని యసహ్యము వైచుచున్నది మేము వసంత కాలమున నొకనాఁడు రాత్రి పండువెన్నెలఁ గాయుచుండ సౌధోపరిభాగంబున బట్టబయలఁ దల్పము వైపించుకొని మే మిద్దరము ముద్దుపట్టిని నడుమ నిడుకొని పెద్ధతడవు వాని ముద్దు మాటలు క్రీడలు వేడుక సేయ వెన్నెల సేవించితిమి. అయ్యో ? మా సుఖముల కదియే కట్టడయని తెలిసికొసలేక పోయితిమి.

ప్రహరద్వయ పర్యంతము నట్టి యానందముతో నుండి యంతలో నిద్ర బోయితిమి. తరువాత నేమి జరిగినదో నాకు దెలియదు. మఱునాఁడుదయమున లేచి చూడ నీప్రాంతమందొక యగ్రహారములో సూర్యభట్టను బ్రాహ్మణుని యింటిలో నులక మంచముమీఁద బరుండి యుంటిని. ఆ బ్రాహ్మణుఁడు. తన పొలములో వరి కుప్ప నూరిపించుకొనుచుఁ దీసి రాసిగా వేసినగడ్డిలో స్మృతిఁ దప్పి బడియుండనన్నుఁ దన యింటికిఁ దీసికొని వచ్చి సేదఁ దీర్చితినని నాతోఁ జెప్పెను. పిమ్మట నీ వృత్తాంతమేమి ? నీ వెవ్వతెవు ? నీ పతి యెవ్వడని యా విప్రుండు నన్నెన్నివిధముల నడిగినను మూఁగదానివలె మాటడక సమాధానము చెప్పితినిగాను. అదేమి కారణమో నా కథ యాయనతోఁ జెప్ప బుద్ధి పుట్టినదిగాదు. వెర్రిదానివలె మూఁగ దానివలె సంచరించుచుంటిని. పాపమా బ్రాహ్మణుఁడు నన్నుఁబుత్రికా నిర్విశేషముగాఁజూచి పోషింపు చుండెను. నేను పూర్వ చరిత్రమంతయు స్వప్న ప్రచారమని తలంచి వైరాగ్యముతోఁగాలక్షేపము చేయుచుంటి. ఇట్లుండ గొన్ని నాళ్ళకు నా దురదృష్ట వశంబుననే యా పుణ్యాత్ముఁడు కాలధర్మము నొందెను. ప్రొణోత్క్రమణ సమయంబున సూర్యభట్టు తన తమ్ముడైన యీ యార్యభట్టును రప్పించి సంతాన శూన్యుఁడగుటఁ దనసొత్తుతో గూడ నన్నితని కప్పగించుచుఁ దమ్ముఁడా ? యిది నా కూఁతురు సుమీ ? వట్టి వెర్రిది యేమియుం దెలియదు. దైవము నాకుఁ దెచ్చి యిచ్చెను. ఇది వెఱ్రిదైనను సద్గుణవంతురాలు సుమీ ! మూఁగదై నను జెప్పిన పని చేయుచుండును. కూఁతురుగాఁజూచి కొని దీని ముప్పు గడుపవలయు నిదియే నీవు నాకుఁ జేయుపని యని తనచేతఁ జేయి వేయించుకొని యా సుకృతి ప్రాణముల విడిచెను. అతనికిఁ నా యందుఁగల యకారణ వాత్సల్యమున కక్కజమందుచు నతని చావునకుఁబెద్దతడవు వాపోయితిని.

ఆర్యభట్టు నన్నూరడింపుచు దనయింటికిఁ దీసికొని వచ్చి భార్యతోఁ జెప్పి యన్న చెప్పిన చొప్పుననే యనురాగముగాఁ జూచుచుఁ బోషించుచుండెను. ఆయన భార్య రామాభాయియు భర్త వలన భయము చేతనో సహజ ప్రేమచేతనో దిక్కులేని దానననియో నన్నాదరముగానే చూచుచున్నది ఇట్లుండుటకును సహింపక దైవము మఱల నన్నీ యాపత్సముద్రములో ముంచెను. పోనిమ్ము. సర్వదుఃఖ విస్మరణ కారణంబగు మరణంబు సంప్రాప్తించుచున్నది కదా. విచారింప నేటికి మేమా బాలునకుఁ బుష్పదంతుఁడని పేరు పెట్టుకొంటిమి. మీరు పలుమారు పుష్పహాసుండనిచెప్పు కొనుచుండ వాఁడు జ్ఞాపకము వచ్చి హృదయంబున విచారము పొడమినది. ఇదియే నా వృత్తాంతమని చెప్పుచుండగనే తిలక విస్మయ మభినయించుచు నేమేమీ ? నీవు గంధర్వ దత్తవా యెట్టి చోద్యము ఎట్టి చోద్యము ! అయ్యో ! మీ కొఱకు మీ సోదరుఁడెంత విచారించుచున్నాడు. అయ్యారే ! నీ వృత్తాంతము వినిన నమ్మహారాజెంత సంతోషించును. నీ భర్తయుఁ బుత్రుఁడు నేమైరో నీకుఁ దెలియదు కాఁబోలు అహాహా విధి నిన్నెట్టి యిడుములం గుడిపించుచున్నాఁడు. అని వెఱగుపడఁజొచ్చిన నా యిల్లా లిట్లనియె.

పొలఁతీ ! నన్ను నీ వెట్లెఱుంగుదువు , మా సోదరుని పరిచయ యెక్కడ గలిగినది. నీ పేరేమి ? నీ వృత్తాంతము చెప్పితివి కావేమి ? నా భర్తయుఁబుత్రుఁడు నచ్చటలేరని నీ కెవ్వరు చెప్పరని యడిగినఁ దిలక అమ్మా ! నేను మీ మేనకోడలి సఖురాలను. నా పేరు తిలకయండ్రు. ఒకనాఁడు నీ కడియము మత్స్యగర్భంబున నుండగాఁ బల్లెవానికి దొరకినది . అది మా రాజునొద్దకుఁ గానుకగాఁ దెచ్చెను. దానిపై నీ పేరున్నది గురుతుఁబట్టి ధనంజయుఁడు కన్నుల నీరుగార్పుచు నప్పుడు నీ వృత్తాంత మంతయుఁ జెప్పెను. నీవు చెప్పినట్లా రాత్రిఁ బుత్రునితో మేడపై బరుండిరి. ఆ యుదయమున నేమైరో తెలియలేదని చెప్పిరి. మీ నిమిత్తము పెక్కు దేశములు వెదకించెనని యా వృత్తాంత మంతయుం జెప్పినది.

ఆ మాట విని మహిళ విస్మయము నొందుచు అగునగు నేనా రాత్రి నా రత్నకంకణముల జత తీసి తలక్రింద వైచితిని. అది యెట్లు చేఁప కడుపులోనికి వచ్చినదో చిత్రముగానే యున్నది అయ్యో ? నేనొక్కరి తనే యిక్కడ దుఃఖమను భవించు చుంటి ననుకొనుచున్నాను. వారును లేరా ? భళిరే విధాతా ? మాపై మంచి కన్నె వైచితివిలే యని యక్కజమందుచుఁ దిలకా ! మా సోదరుఁడు కుశలియై యున్నవాఁడా ! నా మేనకోఁడలు పుట్టినపుడు వచ్చితిని అది యిప్పుడు పెద్దదికావలయుఁ బెండ్లి జేసిరా దానికి లలితయని పేరు పెట్టిన జ్ఞాపకము. దానికన్న పెద్ద వాఁడు సుందరకుఁడను మగవాఁడుండవలె నెట్లున్నాడు అన యడిగిన విని తిలక అమ్మా ! నీ వడిగిన వారందరు క్షేమముగా నున్నారు. లలిత మాత్ర మిప్పుడింటివద్ద లేదని చెప్పెను.

అత్తవారింటికి వెళ్ళినదాయేమి ? దానికి మంచి సంబంధము వచ్చినదా ? నా సోదరుఁ డిది నీ కోఁడలు చూచుకోయని నా చేతంబెట్టె. నా కట్టి భ్యాగముపట్టునా? నా వంటి దుఃఖభాగిని పుడమిలో నెక్కడనులేదు. దాని కేమైనఁ బిల్ల లాయని యడిగిన విని తిలక అమ్మా ! యింకను బెండ్లి కాలేదు. యౌవన పురుషు నొక్కని వరించినది పరువపు గరువము యుక్తా యుక్త కార్య వివేకము గలుగనీయదు గదా ? రూపైకపక్ష పాతియగు మన్మథునిచే బెక్కుచిక్కులఁ బొందింపబడుచున్నదని యర్దోక్తిగాఁ బలికినది. అంతలో రాజభటు లాప్రాంతమందు సంచరించుటచే మాటాడికొనుట కవకాశము దొరకినది కాదు. ఆ యౌవన పురుషుఁడు పారిపోవునేమో యని సంతతము రాజ ప్రణిధులచ్చటనే యుండువారు.

మరికొన్ని నాళ్ళరిగిన వెనుక నొకనాఁడు దండనాధుఁడు వారి నెల్లఁ దన చదురునకు రప్పించుకొని తొలుత యౌవనపురుషుడు నుద్దేశించి పుష్పహాసా ! నీ చర్యలన్నియు వ్రాసి మా చక్రవర్తి యొద్ద కనిపితిని. ఆయన విచారించి నీవు రాజ ద్రోహివనియు దుండగుఁడవనియు వ్రాయుచు నీకు ద్వీపాంతరవాస శిక్ష విధించితిమని తెలియఁజేసిరి, అని చెప్పి పోలిశెట్టిం జంపిన యాఁడువాండ్ర కిరువురకు ఉరిశిక్ష విధింపక ద్వీపాంతరవాస శిక్షయే విధించెను. మా చక్రవర్తి యెంత దయాశాలియో చూచితిరా ? ఆడువాండ్ర కనికరించెనని యా రెండు తీరుపులు వినిపించి చమూపతి సభ చాలించి యింటికిం బోయెను. అని యెఱిగించి మణిసిద్ధుం డప్పుడు వేళ యతిక్రమించుటయుఁ దరువాత కథ పై మజిలీయం దిట్లు చెప్పం దొడంగెను.