కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/45వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఆ వార్తవిని ధనంజయ నృపాలుండు సకుటుంబముగా వచ్చి వారింగాంచి తమదంత మాద్యంతంబువిని వెఱంగుపడుచుఁ బుష్పహాసుండు తన మేనల్లుఁడని యనుమానము జెందితిననియు దండనాధుఁడు తనకు వ్రాసిపంపిన దేవాలయము గోడపైనున్న పద్యములం జూచి పుష్పహాసుని లలిత వరించి యేగినదనియుఁ దిలక సహకారిణిగా నున్నదని శిక్షవిధించిన యనంతర మూహించితిననియు మఱల నాశిక్ష తగ్గించి యట్టి యాజ్ఞ పంపితిననియు లోనగు తంత్రంబులన్నియుం జెప్పుచుఁ బుత్రికం గారవింపుచు లలితం గౌగలించుచుఁ బలుతెఱంగులఁ దన సంతోషమును వెల్లడించెను. అట్లు వారు పరస్పరానుగంబులం దెలుపుచు రెండు మూడు దినంబులు గడుపుదురు

అప్పుడు దేవదూత శుభముహూర్తంబున లలితా పుష్పహాసులకు వివాహ మహోత్సవము గావింపఁజేసి పిమ్మటఁ గుబేరున కాతెఱంగెరిగించి వచ్చి యతనిచే నంపఁబడిన నవరత్నమాల యొకటి పుష్పహాసుని కంఠంబునవైచి దీనిం ధరించినవారు వేయేండ్లు జీవింతురని తత్ప్రభావమగ్గింపుచు నతనిం బట్టభద్రుం గావింపజేయును. పుష్పహాసుండు తల్లి దండ్రుల యనుమతివడసి యత్తమామల కామోదము గలుగఁ జేయుచు దేవదూతకు బ్రీతిగా నట్లు పట్టాభిషిక్తుండై ధర్మంబున రాజ్యంబు జేయుచు సకల సుఖంబుల ననుభవింపుచుండును. దేవదూత వారిచే నామంత్రితుండై యలకా పురంబున కరుగును అని భవిష్యత్కధ యంతయు జెప్పి మణిసిద్ధుండు శిష్యునితోఁ గూడ నవ్వలి మజిలీ చేరెను.

నలువది యైదవ మజిలీ

క. శ్రీకర ప్రళయ స్తితిస
   ర్గైకనిదానప్రధాన హరిహరచతురా
   స్యాకారవినుత త్రిగుణ ని
   రాకార ప్రపూర్ణ సచ్చిదానందమయా.

దేవా యవధరింపుము -

అయ్యవసరంబున గోపాలుం డెక్కడికిం బోవక యందున్న చావడి యఱుగుఁపై గూర్చుండి యెద్దియో ధ్యానించుచుండెను. ఇంతలో నయ్యవారు ----------- నములం దీర్చుకొని భుజించి వాకిటకు వచ్చి వానింజూచి వత్సా ! ------------ విచిత్రము ; ఎక్కడికిం బోవక యిందే యుంటివి ? విశేషము లేమని యడిగిన వాఁడు లేచి నమస్కరించుచు స్వామీ ! ఇది కడు చిన్న గ్రామము దాపున jui, vు గనంబు పని తలంచి కలం నుంచి ... ముండని.. : సీల గ్నో సంచయం.. నను..... " స్పంది చెప్పితే ! యని పలికిన సయ్య తిపతి “50 - పిమ్మట సంతయుం - ఎలము జెప్పెదన" నుటయు వాఁడు సత్వరంబునం గుడిచి యాసిద్ధునొద్దకరిగి యల్లన నిట్లనియె.

తండ్రీ ! కృష్ణదేవరాయల భార్య కళానిలయము రామలింగకవి భార్య మందారవల్లి యు మహావిద్వాంసురాండ్రని మీ రిదివరకు నుడివిని కథలవలనఁ దెల్లమగుచున్నది గదా వారిద్దరిలో నేముద్దియ బుద్దిమంతురాలు ? మందారవల్లి వాదింపవచ్చినప్పు డప్పడఁతిమాట యేమియుం జెప్పితిరికారేమి ? మఱియు వారిరువురు నొక్కవీదియందే యుండిరికదా. తరువాత నెప్పుడైనం వారికి బ్రసంగములు జరిగినవియా ? తారతమ్యంబు లెవ్వరైన నిరూపించనారా ? యా వృత్తాంతమరసి యానతీయుఁడు వినఁ గుతూహలమయ్యెనని వేడిన నప్పండితుండు సంతసించుచు మణిమ్రోలనిడికొని యా యుదంతమరసి శిరఃకంపము చేయుచు నోరీ! నీయందేదియా యద్భుతశక్తి యున్నదిసుమీ ! నీవడిగిన విషయ మూరకపోవదు. అందుఁ బెద్ద వృత్తాంతము గలిగియుండెడిది. ఇప్పటి నీ ప్రశ్నమువలన మంచికథ దెలియబడు చున్నది. వినుమని యిట్లు చెప్పం దొడంగెను.

కళా నిలయ కథ

మందారవల్లి రాయలవారి యాస్థాన కవులతోఁ బ్రసంగించునప్పుడు --- నియల పుట్టినింటి కరుగుటచే నాఁబోఁటి లో ప్రస్తావింప నవసరము లేకపోయినది. మందారవల్లి రామలింగకవిం బెండ్లి యాడి రాయలవారి వీటిలో నుద్యానవనములోఁ గట్టింపఁబడిన దివ్యసౌధంబున వసించి విద్యావ్యాసంగము చేయుచుండెను. ఆ వనితకుఁ గావలసిన ద్రవ్యము ఢిల్లీనుండి తండ్రియే పంపుచుండెను.

కళానిలయ పుట్టినింటనుండి వచ్చినతరువాత మందారవల్లి వృత్తాంత మంతయు విని యొకనాఁడు రాయలవారితో నిట్లనియె. మనోహరా ! నేను లేనప్పుడు మనవీటికి మందారవల్లి యను వేశ్యాంగన యార్తువచ్చి మన పండితులనందఱఁ గాందిశీకులం జేసినదఁట. రామలింగకవి కపటంబున దానింబరిభవించెనని వింటిమి. అది యిప్పుడు మనవీటఁ దోటలో నిల్లుకట్టుకొని యున్నదఁటకాదా ? దాని నొకసారి నా యొద్దకు రప్పించెదరా ? పాండిత్య మేపాటిదియో చూచెదం గాక యని సావలేపముగా బలికిన నవ్వుచు రాయలవా రిట్లనిరి.

మదవతీ ! యా చిన్నది వేశ్యాంగనకాదు. క్షత్రియ కన్యక రామలింగకవిం బెండ్లి యాడినది. దానంజేసి మనవీటిలో నున్నది. మనకు పూజ్యురాలు నీవాకలికిఁ గుఱించి చులకనగా బలుకుచుంటివి. సరస్వతియైన నాయువతితోఁ బ్రసంగింపజాలదు. మన రామలింగకవి కపటముననే యోడించెను. మఱియు నత్తరుణి తండ్రి మా కెల్లరకు నేలుగడ పాదుషా యొద్ద ప్రధానమంత్రియై యున్న వాఁడు దానంజేసి మన మామెను మనయింటికి రప్పించుకొనరాదు. ఆ చేడియం జూడవలయునను వేడుక నీకుఁ గలిగియున్న నీవే యామె యింటికింబోయి చూడుము. అని పలికి యా వృత్తాంతమంతయు జెప్పెను. అప్పుడప్పడఁతి నవ్వుచు నాధా ! నా కథ నేను వినియే చెప్పుచుంటి నది క్షత్రియ పుత్రికయను మాట యట్లుండనిండు నిజమైన వేశ్యయుం గూడ కాదు. అది పల్లెది చదువుకొన్నదని మెచ్చుకొనుచుఁ దెచ్చుకొని శిరంబునం బెట్టికొనుచున్నారు. దానివలచి రామలింగకవియె వ్యూహము బన్నెను. ఇప్పు డది మన యింటికి రమ్మనిన వచ్చునాయని పలికిన నా నరపతి చాలుచాలు నీ బుద్దిబలమంతయుం జూపుచుంటివి. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో బుత్రియని యొప్పుకొని నాకుఁ బత్రికలు వ్రాసినది నీవెరుంగవు. అతి ప్రసంగముమాని చూడఁ దలంచుకొనినఁ బోయి చూడుము లేకున్న నూరకుండుమని మందలించెను.

వసుంధరుని కథ

మందారవల్లి విద్యావిశేషము లెల్లరు నద్భుతముగాఁ జెప్పుకొనుచుండ విని యీసుఁజెందుచు నాకాంతంబరిభవింపదలంచి కళానిలయ యొకనాఁడు పదియేండ్ల ప్రాయముగల కళావతి యను తన కూఁతుం దీసికొని యశ్వశకటంబుపై మందారవల్లి యున్న యుద్యానవనమున కరిగినది.

ఆమె రాక పనికత్తెల వలన విని మందారవల్లి యెదరు వచ్చి యాలింగనము జేసికొనుచు రాచపట్టని ముద్దు పెట్టుకొనుచు దోడ్కొనిపోయి యుచితాసనంబున గూర్చుండఁబెట్టి యెక్కుడుగా గౌరవించినది. అప్పుడు రాజపత్ని విదుషీమణీ ! భవదీయ కళాకౌశల్యము జగదంతయు వ్యాపించియున్నది. నీవనంగ విద్యా స్వరూపిణి వేయని లబ్దవర్ణులు వక్కాణించుచున్నారు. నీ వర్దులకుఁ గామదాయినివఁట. నీ చరిత్ర మంతయు గ్రంథములయందుఁ జూచి విస్మయముఁ జెందుచు నిన్నుఁ జూడవచ్చితినని యగ్గించినఁ దలయూచుచు మందారవల్లి యిట్లనియె. అమ్మా ! కళలన్నియుఁ బేరుగా గట్టికొని తిరిగెడి నీవును నన్నగ్గింపవలయునా ? నీ భర్తయు కులీనుండనియు నీవు పండితురాలవనియు దోషజ్ఞులు వర్ణించుచుండఁ బలుమారు వింటిని. నీ సాహస మొరులకు రాదు. కళావంతులు రతి కెక్కడుగా నీసు భగత్వము గొనియాడుచుందురఁట. నీకు నీవే సాటి. నిన్నుఁ జూడవలయునని యెన్నియో దినంబులనుండి యాసపడు చుంటి. నేఁటికి నా కన్నులకరపు దీఱినదని మందారవల్లి పెద్దగాఁ బొగడినది.

అప్పుడు కళానిలయ కొమ్మా ! పోనిమ్ము. నీ స్తుతి వచనములు మనకలవాటు పడినవే కదా ? యీ బాల కావ్యనాటకాలంకారాది గ్రంథములు చదివినది. యెందేనిం బరీక్షించి యడుగుము. తన పాటివారు లేరని గరువముఁ జెందుచున్నదని పలికిన నవ్వుచు మందారవల్లి వసుంధరా ? ఏమి చేయుచున్నావు ? ఒకసారి యిటురా. --------------- యొకబాలునిం జీరనది.

అప్పుడా లోపలినుండి పండ్రెండేఁడులబ్రాయముగల -------- డొకం డరు దెంచెను. వాని మొగము చంద్రబింబము వలె వట్రువై కళలు గలిగి ముద్దులు గులుకుచున్నది. కన్నులు తామర రేకులవలె సోగలై చెవులవఱకు వ్యాపించియున్న వి. చెక్కులయందము నొసటిసారు పలు వరుస తీరు చూచి తీరవలయు నొడలిరంగు కుందనమే యనందగి యున్నది. అట్టి యర్భకుం డరుదెంచి అమ్మా ! నన్నే మిటికిఁ బిలిచితివి నా చదువున కంతరాయము గలుగజేయఁ దగినంత పనియేమి వచ్చినదని యడిగిన మందారవల్లి పట్టీ ! యీ రాచపట్టి గట్టిగఁ గావ్యనాటకాలంకార గ్రంథములం జదివినఁదట. ఆ బాలికం బరీక్షింపు మిందులకే పిలిచితినని పలికిన నా మాణవకుం డా బాలికతో నిట్లు ప్రసంగము గావించెను.

వసుంధరుఁడు - బాలా ! నీ పేరేమి ?

కళావతి - నా పేరు కళావతి యండ్రు.

వసుం - నీ వేమి చదివితివి?

క - కావ్యములు నాటకములు నలంకార గ్రంథములు లక్షణ గ్రంథములు చదివితిని.

వసుం - నాటకములన్నియుం జదివితివా ?

క - ప్రసిద్ధములైన వన్నియుం జదివితిని.

వసుం - యెవరి యొద్ద ?

క - మా తల్లి యొద్దనే.

వసుం - శాకుంతలము మాళవికాగ్ని మిత్రము విక్రమోర్వశీ యమను నాటకముల మూటిని నెవ్వరు రచించిరి ?

క - మహాకవి కాళిదాసు.

వసుం - అందలి కథానాయకుల యందుగల లోపమేమియో చెప్పఁగలవా ?

క - లోపమేమి యున్నది ? వారు దక్షిణనాయకులు నాయక లక్షణము లన్నియు వారియందుఁ బూర్ణముగా నున్నవిగదా ?

వసుం - వారు దక్షిణనాయకులో పశ్చిమనాయకులో తరువాతవిమర్శింతము. వారి లక్షణముల కేమిలోపములేదు . ఉన్నదొక్కటియే లోపము.

కళా - అదియేమియో నాకుఁ దెలియదు.

వసుం - ఇంతియేనా నీ చదువు ? ఈ పాటిదానికే పరీక్ష. ?

కళా - మహాకవి కాళిదాసునకుఁ దప్పులు పట్టెదమా యేమి?

వసుం - కాళిదాసైననేమి తప్పులు గలిగినఁ జూపకుందుమా ?

కళా -- అ కొరంత యేదియో నీవే చెప్పుము.

వసుం - ఎల్లరకుం దెల్లమైనదే ! వేర చెప్పవలయునా ?

కళా - మాకుఁ దెలియలేదు. చెప్పుము. వసుం - అట్ల యిన వినుము. లోకమునఁ దొలిప్రాయమున నున్న సుందర పురుషుని యువతి మోహించినదని వర్ణించిన యుక్తముగా నుండును. శాకుంతలమునఁ బెక్కండ్ర భార్యలం బెండ్లియాడి యౌవనమంతయు గొల్ల పెట్టి వయసు మీరిన దుష్యంతుని నాయకునిగాఁజేసి నిరుపమాన కళాసౌందర్యాతిశయంబునం బొలు పొందు శకుంతలచే వరింపఁబడినట్లు రసపుష్టి చేసి వర్ణించెను.

కళా - తరువాత?

వసుం - మాళవికాగ్నిమిత్ర నాటకమునఁ దానదివఱ కిరువుర భార్యలం బెండ్లి యాడి సంతానము గని కాలము గడచిన యగ్నిమిత్రుని నాయకునిగాఁ జేసి యతని పెద్ద భార్య యొద్దఁబరిచారికగానున్న మాళవికను వరింపజేసి శృంగారసము వెల్ల విరియునట్లు వర్ణించెను. అట్టివానిం జూచి ద్రవ్యమున కాసపడి నారకాంతవరింపవలయుం గాని తరుణి యెవ్వతెయు మోహింపదు. అయ్యో ! యింత కన్న ననౌచిత్య మెందైనంగలదా ? రాజులు పరిచారిక లెంత సుందరులై నం గన్నెత్తి చూతురా ? అట్టివారి వరించిరని వినినంతనే కటువుగా నున్నదియే. రాజుల కా యపఖ్యాతియేకదా యిప్పటికి బాధించుచున్నది మఱియు విక్రమోర్వశీయమున వర్ణింపఁ బడిన విక్రముడెన్ని యేండ్లవాఁడో నీవే చెప్పుము. వృద్ధుల రసికులం జేసి రసపుష్టి లేకున్ననుం దెచ్చి పెట్టి వర్ణించుచు మహాకవియని పేరు పొందిన కాళిదాసు మూఁడు నాటకములను బాడుజేసె నీ మాఱైన లోపము తెలిసినదా ?

కళా - (తల్లి వంక చూచుచున్నది.)

కళానిలయ - ఏమి బాలకా ! నీ సాహసము. రామలింగ కవి పుత్రుఁడవు కాబట్టి యా మహాకవులనే యాక్షేపించుచున్నావు. శకుంతల దుష్యంతుని వరించి నట్లును ఊర్వశి విక్రముని వరించినట్లును బురాణములలో నున్నది నీ వెఱుంగవు కాఁబోలు ఆ తప్పు కాళిదాసునిది కాదు. వ్యాసునిది. ఆక్షేపించిన నతని నాక్షేపింపుము మఱియు మాళవిక పరిచారిక కాదు. రాజపుత్రికయైనట్లు నీ వెరింగిన నిట్లాక్షేపింపవు.

పసుం - ఓహో ? నీవే కాఁబోలు నీ బాలికకు విద్యగరపితివి. నీకే తెలియనిదే యా బాలిక బెట్లు తెలియును ?

కళానిలయ - డింభకా ! మాటలు పెక్కు నేరిచితివిలే నాకుఁ దెలియనిది నీకుఁ దెలిసినదేదియో చెప్పుము.

వసుం - ఇఁకజెప్పినం దెలియదు. వ్యాసునితప్పేది యున్నది ? పురాణములలో నట్లుండవచ్చును. అట్టి కథల నేరి కాళిదాసు నీ నాటకముల నెవ్వురు రచింపుమని బ్రతిమాలిరి ? మంచి కథలే రచింపరాదా ?

శ్లో॥ అనుకూలౌనిషేవేతే య త్రాన్యోన్యం విలాసినౌ
     దర్శనస్పర్శనాదీనిసంభోగోయముదాహృతః॥

సమమైన ప్రాయముగల విలాసవంతులు, దర్శన స్పర్శనాది రూపమైన క్రియలచే నన్యోన్యము గలిసికొనుట సంభోగమని దశ రూపకమునఁ జెప్పబడి యున్నది. అనకూల శబ్దమున కర్దమేమియో చెప్పుము. నాయిక తరుణియు నాయకుఁడు వృద్ధుఁడైన ననుకూలమెట్ల గును. రాజు ధనము గలవాఁడు కనుక ననుకూలుఁడని చెప్పవలయును కాఁబోలు. మఱియు నగ్నిమిత్రుఁడు మొదట మాళవికను వరించునప్పుడు రాజపుత్రికయని వరించెనా యేమి ?

కళానిలయ - దుష్యంతాదులు వృద్ధులనియా నీ యభిప్రాయము ?

వసుం - నీ యభిప్రాయము బాలురనియా యేమి ?

కళానిలయ - కాక యెవరు ?

వసుం - వారి కొడుకులు బాలురకుఁ దండ్రులు. వినుము అగ్నిమిత్రునకు వసులక్ష్మియను కూఁతురును వసుమిత్రుండను కొడుకున్నట్లు వ్రాయఁబడినది చూచితివా ? వసుమిత్రుఁడే కాదా సవనాశ్వము వెంట నరిగెనని చెప్పిరి. పదునెనిమిది యేండ్లైన నుండినంగాని గుఱ్ఱము వెంట గాపాడఁ బోవఁడుగదా. అట్టివానికి సంతాన మేలకలుగ కుండెడిది.

కళానిలయ - వారు సేవతుల్యులు. వారికి జరలేదు.

పసుం - మంచి సమాధానమే చెప్పితివి. చాలు చాలు అమ్మా ! యీమె యెవ్వతెయే ?

మందా - రాయలవారి భార్య. కళానిలయ యని చెప్పగా విని యుండ లేదా ?

వసుం – ఎక్కడనో వినియున్న పేరువలె నున్నది గదా.

మందా - మఱచితివా మొన్న పాఠము చెప్పుకొనునప్పుడు-

వసుం - ఆఁ ! జ్ఞాపకము వచ్చినది. ఓహో ! ఆమెయా యీమె !

కళా - (స్వ) మదీయ చరిత్ర వీరు పురాణముగాఁ జెప్పుకొనుచున్నారు కాఁబోలు. (ప్ర) బోఁటీ ! మీ పాఠములో నా మాటయేల వచ్చినది ?

మందా - ఏమిటికో వచ్చినది. జ్ఞాపకము లేదు.

కళా - జ్ఞాపకము చేసికొని చెప్పవలయును.

వసుం - అమ్మా ! నాకు జ్ఞాపకమున్నది. నేను చెప్పనా ?

మందా - (కనుసన్నచే వారించుచున్నది) )

కళా - డింభకా ! భయము లేదు చెప్పుము.

వసుం - మా యమ్మ అసతీత్వప్రశంసలో నీ కథ యుదాహరణముగాఁ జెప్పినది. నీ యొద్ద దాపనేల ?

కళా - మీ యమ్మ నన్న సతినిగా వర్ణించినదా ?

వసుం - సందేహమేల ? నీవు పతివ్రతవేయైనచో భర్తనేల చంప సాహసింతువు ? నీ యొద్ద ననుకున్నను లోకులు చెప్పుకొనరాయేమి ? కళా - మీ తల్లి కంటే నేనసతినా ? కొన్ని దినములు వేశ్యయై దిరిగి ద్రవ్యము సంపాదించి పెక్కండ్రఁ బతులగా వరించి చివరి కల్లాలువలెఁ గూర్చుండినం దెలియదనుకొంటివా యేమి ?

మందా - అమ్మా ! నేను రంకులాడిని. నాతో వియ్యమందవద్దు. ఎఱుఁగక కుఱ్ఱవాఁడన్నమాట పాటింపకుము.

కళా - నీతో వియ్యమందకున్న నెవ్వరితో నందుదును నీ పాటి వారు మాకు దొరకుదురా ? వీడు కుఱ్ఱవాఁడా | రాజుతోఁజెప్పి వీని నేమి చేయింతునో చూడుము.

వసుం - నీయర చేతికిఁ బండ్లువచ్చినప్పుడే చూతుములే.

మందార - అమ్మా ! వచ్చినవేశ మంచిదికాదు మొదటనే విరసముగా మాట్లాడితివి. ఇప్పటికి దయచేయుము. అని సవిసయముగాఁ ద్రోయుచున్నది.

కళానిలయ - అవును మర్యాద గ్రహింపక యిట్టినీచుల యింటికివచ్చుట నాదియే తప్పు అని పలికి కోపముతోఁ బుత్రిక నెత్తికొని బండియెక్కి యింటికింబోయి యీర్యాకషాయిత హృదయయై కోప గృహంబునఁ బండుకొని పరాభవదుఃఖాగ్నిం బొగులుచుఁ దనబాల సఖురాలు పల్ల వికయను దాని రప్పించి యిట్లనియె.

పల్లవికా ! నేఁడులేచి యెవ్వరి మొగంబు జూచితినో కాని యిట్టి పరాభ భవము నాజన్మమున నెఱుంగను. పదియేండ్ల ప్రాయము గల మనకళావతికిఁ బ్రాయమునకు మించిన చదువు చెప్పితినని గరువము జెందుచు నేఁడు మందారపల్లి యొద్ద కరిగితిని. దాని కొడుకు జానెడు లేడు. పిల్లను నన్నుఁగూడ బూర్వపక్షముచేసిలు మాటాడనిచ్చిన వాఁడు కాఁడు. అది యట్లుండె. వాని పొగరు వింటివా ? మొగమాట ముడిగి నన్న సతినని నొక్కి వక్కాణించెను. తల్లి యు వినుచు నూరకున్నది. కాని కుమారుని మందలించినదికాదు. పెక్కులేల ? నోఁటికి రాని మాటలాడి విడిచిపెట్టిరి. అక్కటా ! యీయవమాన శోకమెట్టులీగికొందును ? ఉపాయమేమి ? ఈ సంతాపము నా మదిం దహించుచున్నదని పలికి పల్ల టిల్లి న నప్పల్లవిక యిట్లనియె.

దేవీ నీవొంటివై యేమిటి కక్కడి కరిగితివి ? నాకుం జెప్పితివి కావేమి ? ఆమె నవమానింప నరిగిన దై వము నీకే యవి కలుగఁ జేసెను. ఎదిరి బలాబలములు విచారింపక పోవుదురా ? పోనిమ్ము. ఇప్పుడు రాయల వారితో వారు చేసిన యగౌరవమును వక్కాణింతము. తగిన శిక్ష విధింపకుందురా యని పలికిన విని ------- తలద్రిప్పుచు నిందులకు రేఁడు పూఁతకొనిరాడు. చెప్పినం బ్రయోజనం లేదు. దాని తండ్రి పాదుషా యొద్ద మంత్రిగా నుండెనని వెఱచును. ఆ . . . . 10 లడు నుపాయము మనమే యాలోచించ వలయును ఎట్టులో మనం సత్పతి మేని యాగరిత గరువంబు విడిచి పొగులు చుండును. .... అన్న చు తన మీపమునకు ఫలంబనుభవించెడిని. ఇదియే కగము. పుం, తను. " 0 యిక్కార్యంబు కొనసాగించి నాయిక్కట్టు బాపెదవని నమ్మియుండెదనని సానునయముగాఁ బ్రార్దించినది. పల్లవిక యట్టి పనులం దంతకుముందు గడిదేర యున్నది కావున నప్పని కొడంబడి రాజపత్ని నోదార్చుచు నాటంగోలె వసుంధరుం జంపు తెరంగరయు చుండెను.

వసుంధరుం డెన్నఁడు మందారవల్లిని విడిచి యుండడు. సంతతము విద్యాగోష్టియే చేయుచుండును. విహారమునకైన బయటకు రాడు. సదా పల్ల విక యా యుద్యానవన ప్రాంతమందే తిరుగు చుండెను. కాన యాబాలకుని జూచుటకైన శక్యమైనదికాదు. అట్లు కొంతకాలము జరిగినది. మరియొకనాడు పల్ల విక కళానిలయ యొద్దకు వచ్చినం జూచి దీర్ఘ క్రోధినియగు నమ్మగువ సఖీ ! నీతో నా కార్యము జెప్పి రెండు సంవత్సరములు కావచ్చినది. సాధించలేక పోయితివిగదా. నీపు నిశ్చయముగాఁ దలఁచుకొంటివేని శత్రువులఁ బరిభవింపలేవా ? యశ్రద్ధ చేయుచుంటివని పలికినఁ బల్లవిక అమ్మా ! అట్లనకుము. నాశక్తికొలఁది యాలోచించుచుంటి శక్యము కాకున్నది. ఆ బాలుం డొక్క మాటైన నీవలకు రాడుగదా. ఇప్పుడు మఱియొక యాలోచన చేసితి వినుము. దక్షిణదేశ మెల్ల దిరిగి సోమశేఖరుండను బ్రాహ్మణుండు మనవీఁడు వచ్చెను. మంత్రశాస్త్రమందతండఖండ ప్రజ్ఞకలవాఁడని చెప్పుచున్నారు. ఆ పాఱుండు మంత్ర ప్రయోగంబున నాడింభకుంజంప గలడు. అట్టిమాట నే నాయనతోఁ జెప్పితినేని సమ్మతింపడు దీసికొని వచ్చెదను రహస్యముగా నీవే యాయనతో మాట్లాడుము. తగిన సొమ్మిత్తువేని యొడఁబడునని చెప్పిన సంతసించుచు నప్పుడే పోయి యాబాడబుం తీసుకొని రమ్మని చెప్పినది.

పల్ల విక యొకనాఁడు సాయంకాలమున సమయ మరిసి సోమశేఖరు నింటికిం బోయినది. రక్షరేకుల కొఱకును విభూతి కొఱకుఁ బెక్కండ్రు జనులతని వేచి కొని యుండిరి. అతండప్పుడు దేశీమందిరము ముందరఁ బులితోలుపై గూర్చుండి లలాటమునఁ గుంకుమ రేఖ మెఱయవిభూతి రుద్రాక్షమాలికా విరాజిత గాత్రుండై జపము జేసికొను చుండెను. ఒక వంక గాయకులు దేవీ స్తోత్ర కీర్తనల బాడుచుండిరి. యొకమూల బాహ్మణులు స్వస్తి చెప్పుచుండిరి. ఒకవైపు నాట్యములు జరుగు చుండెను.

అట్టి వినోదము చూచి పల్ల వికి విస్మయము జెందుచుఁ బూజావసానము దనుకఁ బ్రతీక్షించియుండి ప్రసాదము గై కొని యెట్లో సమయము జేసికొని రాజపత్ని యగు కళానిలయ ఱేపొకసారి మిమ్ము దర్శన మీయమని కోరినదని చెప్పెను. ఆ మాంత్రికుండామాట విని సంతసించచు ఱేపు ప్రొద్దున వత్తునని యుత్తరముచెప్పి దాని నంపెను.

పల్లవిక మరునాఁడుదయ కాలంబునంబోయి కళానిలయతో సోమశేఖరుని పూజాప్రకారమంతయు చెప్పుచుండఁగనే సోమశేఖరుం డచ్చటికి వచ్చెను. రాజపత్ని యుచితసత్కారములచే నతనికి సంతోషము గలుగఁజేయుచు నేకాంతగృహంబునకుం దీసికొనిపోయి పీఠంబునం గూర్చుండఁబెట్టి పాదంబులకు నమస్కరింపుచు మహాత్మా ! మీప్రభావమంతయు నాసఖురాలు చెప్పినది. మీరలోక సామాన్యులఁట. మీమంత్ర శక్తి చూపించ వలసిన సమయము వచ్చినది. శత్రుండొక్కడు నన్నెక్కుడుగాఁ బరాభవించెను. వానికిం దగిన ప్రాయశ్చిత్తము చేసితిరేని మీరు కోరినంత ధనమిచ్చెదను. ఈమాట పరమ రహస్యముగా నుంచవలయుసుఁడి : మీరునాకుఁ దండ్రివంటి వారు గావునఁ జెప్పుచుంటి మీయుపకారము నాయావజ్జీవము మఱచిపోనని స్తుతి పూర్వకముగా నుడివినవిని యా మాంత్రికుం డిట్ల నియె.

అమ్మా ! దీనికి నన్నింత యగ్గింప వలయునా ? నీ వెట్లు చెప్పిననట్లు చేయువాఁడ నీశత్రువు నాశత్రువు కాదా ? వానినేమి చేయవలయునో చెప్పుము. సత్వరంబున నట్లచేసి కృతకృత్యుండనగుదు. నన్నాంతరంగికునిగా నమ్ముమని పలికిన సంతసించుచు నారాజపత్ని యిట్లనియె.

ఆర్యా ! జెప్పనేమియున్నది ! శత్రువధయే కావింపవలయు. శా క్తేయుల కది యెంతపని ; నా హృదయశూలమును నిర్మూలింతువేని నీకుఁ బదివేల దీనారములు కానుకగా నిచ్చుచున్న దాన. దానదోషంబని విచారింపకుము. ప్రాయశ్చిత్తమున నాపాపము బాపికొనవచ్చును. అట్టి సామర్థ్యము నీకున్నదియా : సందియమందు చుంటివేమని పలికిన నా విప్రుండు చేతులు నలిపికొనుచు నిట్లనియె.

అమ్మా ! నీతో నేను నిక్కము వక్కాణించుచుంటిని. శా క్తేయులకు -------- మెండుగా నుండును చెప్పినంత చేయలేరు. నేను దక్షిణదేశ మంతయు దిరిగి యొక ----------- మూడేండ్లా శ్రయించి యక్షిణీ మంత్రముపదేశము పొందితిని. పిమ్మట నైదేండ్ల నుష్ఠానము జేసి యక్షిణిం బ్రత్యక్షము చేసికొంటిని. ఆదేవత మును... లంజంపించు. ఎక్కడికైన చూరమ.గా దీసికొనిపోయి పొర:యగలదు. లని ఎంచుకు వస్తుండగా.. జంపుటకు సామర్థ్యము లేదు. మరియు సుర... 'చిన మా వచ్చుంగడా సెలమి యని యడిగిన నప్పుడు ముక్కంత ఒకరి... కానిమ్ము ఆదియుఁ గొంత తెస్సయే అట్లు చేయుము. మహారణ్యము లో బవ చేయింపుము పిమ్మ : దేవుఁదే 2-0 జంపఁగలండు. అందుకు సంబం ను కావలయునని యసిగిన నా మాంత్రికం డిట్లనియె. అమ్మ : తొమ్మి దిదినములు దీక్ష వహించి జపము జేసి... (2) ణ సంతర్పణము గావింపవలయు. దీని కం . పల ..... : పమ ఓ మీ పారితోషిక మున్నడి. పడిపడినము , . vi... బాల కరసముగా నుండి ! - ... అనే మన సమయం ఆడుగలకు రహస్యము .. పును నu. ఎపు 1 చెప్పరులు. ఉతావసాన దినంబున రామదయ . viiva na 0 మీయొద్ద కనిపెద వానికి కాకితముపై వ్రాసియియ్యుఁడని యా విధానమంతయుం జెప్పుటయు నా కొమ్మ సమ్మతించి యా ద్రవ్య మప్పుడే యా విప్రుని వెంట వారింటి కనిపినది. మగనిం జంపఁబూనిన సాహసురాలి కా విప్రకుమారునిం జంప యత్నించు టొక యబ్బురమా !

ఆ విప్రుండును మఱునాఁడు దీక్షవహించి రహస్యగృహంబునం గూర్చుండి యక్షిణీ మంత్రము జపించుచు హోమముగావించి బ్రాహ్మణ సంతర్పణము జేయుచుఁ బూర్ణాహుతిసేయు దివసంబు రాత్రి ధండుండను తన శిష్యుంజేరి యోరీ ? నీ వీ రేయి గళానిలయ యంతఃపురంబున కరిగి యీ యుత్తరంబిమ్ము. నీకొక పేరుగల కాకితం బిచ్చును. దాని రహస్యముగా దీసికొనిరమ్ము. నడుమ బ్రహ్మకైనం జూప రాదు సుమీ యని బోధించి పంపిన వాఁడట్లు చని కళానిలయకుఁ దనగురు డిచ్చిన యుత్తరమిచ్చుటయుం జదువుకొని పరమ సంతోషముతో నా యోషామణి పల్లవికతో నాలోచించి యంతకుముందు మందారవల్లి కొడుకు వసుంధరుఁడు అని యొక కాకితముపై వ్రాసి మడిచి యుంచినది. కావున నది యాయంతే వాసికిచ్చి భద్రమని చెప్పి యంపినది.

ఆ ధండుండల్లన రక్ష్యాంతరంబులు గడిచివచ్చుచు సింహద్వార ప్రాంత మందలి వినోద సభాంతరమున వారకాంత లత్యంత మనోహరముగా నృత్యంబు సేయుచుండుటయు నొక్కింత సేపందుఁ గూర్చుండి యా వింతలం జూచుచుండెను. అప్పుడు గానాయత్తచిత్తుండగు నాధండుని హస్తమునుండి యా కాకితపుమడతయందు జాఱిపడి గాలిచే నవ్వలి కెగిరిపోయినది.

అంతలోఁ దన ప్రమాదమును దెలిసికొని యా శిష్కుండదరిపడుచు జేతం గాకితము గానక యందు నలుమూలలు వెదకఁ దొడంగెను పరిచారకులు పనికిమాలిన కాకితముల పీలికలన్నియుం దుడిచి యందొకచో రాశిగాఁ ద్రోయుచుందురు. ఆ ప్రోగావటుఁడుచూచి యందు దడవి తన కాకితమును వెదకెను. అట్టి కాకితము మడత యొకటి యతని చేతికిం దొరకినది. అదియే యదియనుకొని పరమసంతోషముతో నా వినేయుఁ డతిరయంబున గురునొద్దకుంజని దండన భీతిచే నడుమజరిగిన కతయేమియుం జెప్పక రాజపత్ని యిచ్చినదని యా కాకితము మడత యిచ్చెను

అందుఁ గళానిలయ కూఁతురు కళావతి అనియున్నది. ఆ యొజ్జయందలి వ్యత్యాసము విమర్శింపక యా పేరుచ్చరించుచు యక్షిణీ మంత్రము జపించి యా కళావతిని సంకల్పించిన ప్రకారము దూరదేశ కాంతారములోఁ బడవేయుమని కోరుచు నా నిశావ సానముతో హోమావసానము గావించెను.

ఆ మాంత్రికుండు కార్యసిద్ధియైనట్లు పొడగట్టుటయుఁ దనకెక్కుడు ద్రవ్యము దొరుకునని మిగుల సంతసించుచు మఱునాఁడుదయంబున నక్షతలంగైకొని కళానిలయ యంతఃపురంబున కరిగినప్పుడు

సీ. భర్తృదారికగనం • బడదేమియో యంతి
             పురిలోనలేదని • పొక్కువారు
    అయ్యయో ? యేమయ్యె • నమ్ము ? రాతిరిబండు
             కొనమేడలో గంటి • మనెడువారు
    చాలప్రొద్దుగుదాఁక • బాలతోఁ గూడి యిం
             పుగఁ బాడితిమటంచు • వగచువారు
    అరయరే! నిష్కుట • మందుఁ గ్రుమ్మఱునేమొ
             యనఁ జూచివచ్చితి • మనెడువారు

గీ. ఎందులేదమ్మ ? యాకొమ్మ • యేమమాయ
    యో గదమ్మ నృపాంగన • కొక్క ప్రాణ
    మమ్మ యాబాలయెటుసైచు • నమ్మ దేవి
    యనుచు శోకింపుచుండిరం • దందుసఖులు.

అట్లు కళావతిని వెదకి యెందునుం గానక కొందలమందుచుఁ గొంద ఱిందుముఖులు కళానిలయ కత్తెరంగెఱింగించుటయు నమ్మించుబోడి యయ్యుత్పాతంబు విని పెద్దగాలిం జలించు కదళియుం బోలె వడంకుచుఁ బల్ల వికం జీరి యావారిజాక్షితో నేడీ విపాతంబునకు హేతువేమని చింతింపుచున్న నాజన్నిగట్టు శిరంబున నొక శాలువ జుట్టి మఱియొకటి మేనం గప్పికొనుచు మొగంబున నిండిన గుంకుమరేఖ జూపరులకు వెఱపుగలుగఁజేయఁ లోనికివచ్చిన యతనిజూచి రాజపత్ని కన్నీ రుదుడుచు కొనుచు శిరంబువంచి నమస్కరించి పల్లవికకుఁ గనుసన్న జేసినది.

పల్లవిక యా పాఱుని లోపలికిఁ దీసికొనిపోయి యార్యా ! నీవు మఱచి పోయి మా రాజుపుత్రికకు మంత్రించితివా యేమి ? యా చిన్నది కనఁబడుటలేదు. అని యడిగిన నతండు అదియెవ్వతెయో నాకుఁ దెలియదు. మీరు వ్రాసిపంపిన చిన్నదానిపేరు జపించితిననుటయుఁ బల్ల విక యుల్లము తల్లడిల్ల గుండెపై చేయిడు కొనుచు నమ్మయ్యో ? చిన్నదనుచుంటివేమి? మేము చిన్న వానిపేరు వ్రాసి పంపితిమే ప్రమాదము జరగలేదు గద యని పలికినవిని యతండు జడియుచుఁ దనయొద్ద నున్న కాగితమువిప్పి చూ పెను. అందుఁ గళానిలయకూఁతురు గళావతి యని వ్రాయఁబడి యున్నది. ఇదియే నేను జపించినపేరని చెప్పగా నప్పడఁతి నేలంబడి మూర్ఛిల్లి యొక్కింతకు దెప్పరిల్లి అయ్యో ! యిఁక నేమియున్నది ? కొంపమునిఁగినది.

రాజపుత్రికనే యడవిపాలు సేసితివే ? మేము పంపిన కాగిత మిదికాదు. ఇది మీయొద్ద కెట్లువచ్చినది. దీని మొదటి దినమున రాజపుత్రికకు శరీరములో స్వస్థత తప్పుటచే విభూతి పెట్టుటకై యా పేరు వ్రాసిపంపితిమి. పితిమి. 2. సవర్చనం. ఆహా : మిగుల విస్మము గాని. .. . Supia " తినాయన పలిన సమ్మకాసురుం... న తు లు ... తల్లీ ! దైవముతోడు నే నేమియు నెఱుంగను. మా శిష్యుఁడు తీసికొనివచ్చి యీ కాగితమే నాకిచ్చెను. ఇందలిపేరే నేను జపించితిని నిదియే నిక్కువమని యతం డనేక ప్రమాణములు చేసెను. అప్పుడాశిష్యు నందు రప్పించి నిర్బంధించి యడిగిన వాఁడు భయపడి యధార్థము చెప్పెను. పత్రికా వినిమయ మప్పుడు జరిగినదని నిశ్చయించి యా పల్ల విక యా మాంత్రికుని మఱల నబ్బాలిక నిచ్చటికి రప్పింప వలయునని కోరినది.

అప్పుడతం డమ్మా ! యిది దైవికముగా జరిగినది. దీనికి నేనేమి చేయుదును. ఆఱుమాసములదనుక మఱల నే నా జపము చేయరాదు. చేసినను యక్షిణి ప్రత్యక్షముగాదు. అదియునుం గాక మా దేవతకు దేనినైన దూరముగాఁ దీసికొని పారవేయుటకేకాని దూరమునుండి తీసికొనివచ్చు సామర్థ్యములేదు. మఱియు నబ్బాల యెందు పడినదో యాఱుమాసము లరిగినగాని యిప్పుడు తెలిసికొనఁజాలను. అక్కటా ! దైవ మెట్టియిక్కట్లు తెచ్చిపెట్టెనోగదా వీరభటులంబంపి వెదకింపవలయునని యతం డత్యంతసాధ్వని శోకకంపితచిత్తుండై నుడివెను.

గీ. ఒరుల కలిమిజూచి . యోర్వలేక జనుండు
   కీడుసేయఁ దనకె . మూఁడు నెపుడు
   మింటిశోభ సైప . మితి రాయి ఱువ్వెన
   శిరముమీదఁబడి న . శించుగాదె.

ఆ మాంత్రికుని మాటలు విని పల్ల విక తల్లడిల్లుచుఁబోయి యా వృత్తాంత మంతయుం గళానిలయ కెఱింగించినది. ఆమెయు నురముబాదికొనుచు దైవమును దూరుచు భూసురుం దిట్టుచుఁ బెద్దయెలుంగున నేడువఁదొడంగినది. శోకేద్రేకము వివేకమును మట్టుపఱచునుగదా. అట్లు పెద్దతడవు వాపోవుచు నా పూఁబోడి పల్ల వికచే నూరడింపబడి రహస్యభేముగాకుండ యక్షిణి పుత్రిక నెత్తుకొని పోయినదని యుచ్చరించుచు నావార్త రాయలవారి కెఱింగించినది.

ఆ వార్త విని యా భూభర్త యాశ్చర్యశోకసంభ్రమంబులు చిత్తంబుత్తలపెట్ట నతఃపురంబున కరిగి కళానిలయ నూరడించుచుఁ బుత్రికా వృత్తాంతము దెలిసికొనుటకై పెక్కండ్ర వీరభటుల నాలుగు దెసలకుం బంపెను.

కళానిలయయు నంతఃపురమునం దనయావియోగశోకాగ్నిం బొగులుచు శాత్రవోచ్ర్ఛయము సహింపక యాఱుమాసములు గతించిన పిమ్మట మఱల రహస్యముగా నా సోమశేఖరుని రప్పించి కొమార్తెజాడ నడుగక యీ తేప శత్రుందప్పక పరిభవింపవలయునని పలుకుచున్నప్పుడే "మందారవల్లి కొడుకు వసుంధరుఁడని" తానే వ్రాసియిచ్చి కానుకలతోఁగూడ ననిపినది. ఆమాంత్రికుఁ డింటికిం జని వెండియు, దీక్షగైకొని హోమముచేయుచు దీక్షావసానంబున వసుంధరుని నడవిపాలగునటులు చేసెను. ధనపిశాచగ్రస్తులకుఁ గార్యాకార్య వివేచన ముండదుగదా ! విద్యాన్మాలయను యక్షిణి మంత్రబద్దయై వసుంధరుని నెత్తుకొనిపోయి యొక కొండశిఖరమునంబెట్టి యరిగినది. అతండు వాడుక ప్రకారము వేకువజామున లేచి పుస్తకము తడవుకొనుచు నేమియుం గనంబడమి వెఱగుపడి అమ్మా ! అమ్మా ! యని పిలిచెను. ప్రతివచనము వినఁబడినదికాదు. సంశయాకులితమతియై నలుమూలలు చూచి యంతలోఁ దెల్లవారుచున్నది. కావున వృక్షలతా గుల్మాదులు గనంబడిన విభ్రాంతినొందుచు నది స్వప్నమనుకొని కన్నులు మూసి యొక్కింతతడవు పండు కొనియెను.

అందు కఠినశిలాతల సంపర్కంబు గాత్రంబు నొవ్వ నయ్యో యిది మదీయమృదుతల్ప మింతకర్కశముగానున్నదే. మంచమునుండి క్రిందఁబడితినాయని ధ్యానించుచుఁ గన్నులందెరచిచూడ మహారణ్యము గనంబడినది. అప్పటికి రవికిరణంబులు కొన్ని నభంబునం బ్రాకినవి.

వసుంధరుం డప్పుడు మోహవిజండై తానున్న నేలయుఁ దన శరీరము తన దుస్తులను బలుమారు జూచుకొనుచు విస్మయం బభినయించుచుఁ బెద్దతడవు చింతా సముద్ర కల్లోలడోలికల నూగుచు నేదియు నిశ్చయింపనేరక యెట్ల యిన లెస్సయేయని ధైర్యమూని లేచి యా ప్రాంతమందున్న యొకమఱ్ఱిచెట్టెక్కి నాలుగుదెసలు పరికించెను. ఎటుచూచినను మహారణ్యమేకాని యెందును దెరపి కనంబడినదికాదు.

ఒక దెసదాపుగనే జలపక్షు లెగురుచుండుటచూచి యతండా మ్రానుదిగి యావంకకుఁ బోయెను. అందొక తామరకొలను వానికి నేత్రపర్వము గావించినది. దానికి నలుచక్కి చక్కని సోపానములు గట్టబడియున్నవి. బహువిధ వర్ణములఁ బొలుపొందు జలబముల గదలింపుచు గంధవహుండు మేనికి హాయిసేయ హంస ప్రముఖ జలవికిర నికరంబులు చెవులపండువగుచుండఁ దీరతరుశ్రేణీ విరాజితమై యొప్పారు నాకాసారము హృదయంగమంబై యంతకుముందు బొడమినచింత మఱుపు సేయ వసుంధరుం డందలి వృక్షంబుల మధుర ఫలంబులఁదిని యాసరసిజలంబులం గ్రోలి యాఁకలినడంచికొని భూరిత రుచ్ఛాయాభిరామంబులగు తీరసోపానములం గూర్చుండి తనరాక గుఱించి చింతించుచుండెను.

పరివ్రాజకునికథ

అప్పు డవ్వలితీరమున నొకపరివ్రాజకుఁడు స్నానము చేయుచున్నట్లు కనంబడెను. ఆ సన్యాసింజూచి వసుంధరుండు పరమానందముఁ జెందుచు నో----- ఇది తపోవనముఁబోలు. మహార్షులీ తటాకమునఁ దీర్దము లాడవచ్చుచున్నట్లు పొడకట్టుచున్నది. కానిచో నీభూమి యింత రమ్యముగా నుండునా ? ఆ మహానుభావుని గలసి నా వృత్తాంతం బడిగెదగాక యని నిశ్చయించి లేచి యల్లన లతాగుల్మాదులం దప్పించుకొనుచు నా ఋషియొద్ద కరిగెను. అంతలో నతండును స్నానముజేసి యనుష్ఠానము దీర్చుకొని జటాకలాపము ముడివైచికొనుచు నొడలెల్ల విభూతి ప్రామికొని కమండలువున జలంబుబూరించి యవ్వలంజనుచుండెను. వసుంధరుండు వడివడి నడిచి యాజడదారింగలిసికొని యో మునీంద్రాశరణార్థిని రక్షింపుము రక్షింపుమని యతని పాదంబులంబడి నమస్కరించెను.

ఆ యతి హస్తసంజ్ఞచే వారించుచుఁ దనతో రమ్మని సూచించిన లేచి వసుంధరుఁడా మునివెంట నతని పర్ణశాల కరిగెను. ఆ విరాగి యందొక మాకందము నీడఁ గూర్చుండుమని వసుంధరు నియమించి తానాపర్ణకుటీరములోనికిం బోయి యారవైచి యుంచిన వల్కలముదాలిచి యగ్ని దేలిచి యందుఁ గందమూలంబులఁ బచించి యాకుననిడి కొంత యతిధికిచ్చుటయు నతండు మహాత్మా ! వలదు, వలదు. ఇంతకుమున్న ఫలంబులందిని యాకలినడంచుకొంటి. యతిమాత్రసత్కారముతోఁ బనిలేదు. వీని శిష్యునిగాఁ భావింపుఁడని వేడికొనియెను.

తరువాత నాయతి ఫలంబులందిని వార్చి వాకిటకువచ్చియందు వినమ్రుండై యున్న వసుంధరుంజీరి వానితోఁగూడ మందార తరుమూలవేదికం గూర్చుండి స్వాగత పూర్వకముగా నీ వెవ్వఁడవు? ఈ యరణ్యమున కెట్లు వచ్చితివి ? నీ వృత్తాంత మంతయుం జెప్పుమని యడిగిన వసుంధరుఁడు స్వామీ! ఆంధ్రదేశాధినాయకుండగు కృష్ణదేవరాయలవారి యాస్థాన కవీంద్రుండు తెనాలి రామలింగకవి కౌరసపుత్రుండ నా పేరు వసుంధరుడందురు. నేను మందారవల్లియను మా తల్లియొద్ద శుద్ధాంతములో శాస్త్రములం జదువుచు నిన్నరాత్రి బండుకొంటి నింతియ నే నెఱింగినది. నేఁటి యుదయంబున లేచిచూడ నీ మహారణ్యములో నుంటి నిందులకు గారణమేమియం దెలియదు. మీరు సర్వజ్ఞులుగదా ! నా రాకకుఁ గతంబరసి మీరే వక్కాణింపవలయు. మఱియు నిది యేదేశము ఈ పర్వతము పేరేమి ? ఇందుదపంబు గావించుచు నా దురదృష్టదేవతం బారఁదోల ప్రత్యక్షమైన దేవర నామాక్షరంబు లెట్టివో వివరించి నన్నుం గృతార్థుంగావింపఁ బ్రార్ధించుచున్నాడ. నింతదనుక మీరు నాయెడజూపిన యాదరమే నన్నిట్లు వాచాలుని జేయుచున్నది పరిచయము గొంచమైనను నధికపకృతులకుఁ ప్రగల్భము గలుగఁజేయునుగదా, యని యత్యంత వినయానుబంధపూర్వకముగా నడిగిన మందహాసము గావింపుచు నా బైరాగి యిట్లనియె

వత్సా ! నీవు బాలుండవైనను బ్రకర్షవచనంబులచే నీ యెంతస్సారంబు దెలియఁ జేసితివి. నీ పాండిత్యమునకు సంతసించితిమి. నీయందు మాకక్కటికము కలిగినది. నీ యాగమంబునకుఁ గారణంబు యోగదృష్ఠింజూచి ముందు వక్కాణించెద నిన్ను మీ బంధువులం జేర్చుటకేనపూట. నీవు విచారింపకుము. నాయొద్దఁ గొన్ని దినంబులుండుము. నీకు మంచి మత్రంబు లుపదేశించెదనని తన వృత్తాంత మేమియుం జెప్పక యప్పుడు వేరొక ప్రస్తావము దెచ్చెను.

తదీయవచనోపన్యాసము విని యతని కేమియుఁ బాండిత్యము లేదని నిశ్చయించుచు వసుంధరుఁడు మహాత్ముల ప్రభావమచింత్యముకదా యేమియు నిశ్చయింపరాదని తలంచుచు నతివినయముతో నామహర్షి నాశ్రయించి తిరుగుచుండెను. నాలుగు దినంబులు గడిచినంత వసుంధరుఁడొండొండ నాయతి యంతశ్శక్తి గ్రహించి యతనియందు మొదటఁ గలిగిన భయభక్తి విశ్వాసములు క్షీణదశ నొందుచుండ నొకనాఁడు వేడుకగా మటలాడికొనుచున్న సమయంబున యతీంద్రా ! నేనడిగిన ప్రశ్నమున కుత్తరముఁ జెప్పితిరి కారేమి ? మీ తపంబునకు లోపము వచ్చుననియా యేమీ ? వృత్తాంతము చెప్పినంతనే కొరంతపడు తపంబు రంభాదులు వచ్చి యెదుట నిలిచిన యెట్లు చెడకుండు . నన్నన్యునిగాఁ దలంపక మీ యుదంతము వక్కాణింపుడు విని సంతసించెద. మీ పూర్వాశ్రమ దేశమేది ? అభిధానమేమి ? కులశీలంబులెట్టివని యడిగినఁ దదీయ వచనరచనా చమత్కృతికి లోఁబడి యా తపసి గుట్టువిడిచి తనకథ యిట్లని చెప్పదొడంగెను.

తుందిలునికథ

వత్సా ! నా చరిత్ర గుప్తంబయినను నీయందుఁగల మక్కువచేఁ జెప్పుచుంటి వినుము. నేను దామ్రపర్ణీ తీరంబుననున్న దేవనిలయమను నగ్రహారమున వసించు విష్ణుగుప్తుఁడను బ్రాహ్మణుని యేడవకుమారుండ. నన్నుఁ దుందిఁలుడని పిలుచుచుండిరి. మాయన్న లందఱు వేదశాస్త్రములం జదివికొని రాజసభల కరిగి పెక్కు ధనము సంపాదించుఁకొని మంచికన్యలం బెండ్లియాడి గృహస్త ధర్మముల నెరవేర్చుచుండిరి. నేను బాల్యంబుస నాకతాయితనంబునం బెద్దలమాట వినక బడికి బోవక చదువక నిరక్షరకుడినై కాల్చి విడిచిన యాఁబోతవలెఁ దిరుగుచు నిత్యము శ్రాద్ధంబుల భోక్తగా నిమంత్రితుండనై పొట్టనిండ మెక్కుచుండుకతంబున బలిసి తుందిలాభిధేయంబు సార్థకమునొంద గర్వాభిభూతుండనయి వర్తింపుచుంటిని.

నా తలిదండ్రులు మదీయవిద్యావిహీనతకును బొగరుఁబోతు తనంబునకును వగచుచుఁ గొంతకాలమునకుఁ గాలధర్మము నొందిరి. పిమ్మట నాయన్నలు నాయవివేకమునకుం గినిసి నన్నుఁబరామర్శింపక విడిచిపెట్టిరి. నాయట్టిహీనునికిఁ బిల్ల నెవరిత్తురు? నేను వివాహశూన్యుండనయి యన్నమిడువారు లేమింజేసి నేనాయగ్రహారము విడిచి కొంతకాలము దేశాటనము గావించితిని. నాచూడని పట్టణంబులు, చేరని యరణ్యంబులు కానని తీర్ధము లెందునులేవు. పుడమియంతయు గ్రమఱితిని. ఏ విశేషము గనబడినదికాదు.

శతానందయోగికథ

విను మొకనాఁ డుత్తరకురుదేశంబులఁ దిరుగుచుండ నొక యరణ్యములో నిప్పుడు నావలెనే యొక పరివ్రాజకుఁ డొక్కరుండు పర్ణశాలఁ గట్టికొని వాసముచేయు చుండ దై వికముగా నే నావాసమున కరిగితిని. ఆ యతింజూడ నెనుబదియేండ్ల వయసు గలవాఁడుఁగా దోఁచుచుండెను. గడ్డమంతయు నెరసి యురమును మఱుఁగు పెట్టబడిన తెరవలె మెఱయుచున్నది. తదీయ జటాకలాపగ్రంధి వీక్షింప ధనలోష్టీషభ్రమ గలుఁగ జేయకమానదు. శరీరమంతయు మడతలు పారినను మొగంబుమాత్రము లావణ్య యుక్తమై యొప్పుచున్నది. రుద్రాక్షమాలికారుచిరవక్షుండును భసితలిప్త సర్వాంగుడునై యయ్యతి రెండవ మేరుకోదండుని వడుపుంమెఱయచుఁ బర్ణశాలమ్రోల దళరచిత వటంబునం గూర్చుండి జపమాలికం ద్రిప్పుచు వేడుకలం గ్రీడించు లేడిపిల్లల యాట వీక్షింపుచుండెను.

అట్టి సమయంబునంబోయి నేనమ్మహాత్ముని పాదంబులకు నమస్కరించి యతఁడడుగ మదీయ వృత్తాంతమంతయుఁ జెప్పి తాపసేంద్రా ! ఆజన్మాంతము మీకంతేవాసుండనై పాదంబులచెంతఁ గాలంబు గడిపికొనియెద. నన్నుఁ గృతార్థుం గావింపుమని వేడుకొంటిని. అత్తాపసపురందరుండును దయామేదురములగు చూపులు నాపైఁ బరగింపుచు నిర్భయముగా నిందుండుముని యభయహస్త మిచ్చెను నేనును నిర్వ్యాజ శుశ్రూషాపరుండనై యత్తపుస్వీసత్తము నారాధింపుచుంటి. మటియును -

సీ. మునికన్న మున్న మే • ల్కొని పర్ణనివసధం
              బలికి చిత్రముగ మ్రు • గ్గులు ఘటింతు
    జటి తీర్దమాడంగ • సరసి కేగగఁ గమ
             డలపు గైకొని ముందు • నడుచుచుందు
    దేవపూజకుఁ బ్రయ • త్నింపఁగా సన్యాసి
            కమరింతు బాత్రల • నగ్రభూమి
    తపసిపడు వేళఁ • దడివల్కలములెత్తి
           యటకలితో రుద్ది • యారవైతు

గీ. ఱేయిఁగృష్ణాజినం బమ • రించి పండు
   కొనఁగఁ బాదంబులొత్తుదు • మునికి నెపుడు
   నిద్రలోనైనఁ జీరెనే • నియుఁ దపస్వి
   స్వామి ! పనియేమియని సమ • క్షమున నిలుతు.

అట్ల త్యంత భక్తివిశ్వాసముతో శుశ్రూషజేయుచుఁ గొన్ని దినములు గడిపితిని. అతండు రాత్రులఁ బర్ణశాలలోపలఁ బండుకొన నేను బహిర్వేదికపై శయనింతు నిట్లుండ నొకనాఁడు నడిఱేయి నేమిటికో లేచితి నప్పుడా పర్ణశాలలోఁ బట్టబగలు వంటి గాజుదీపముల కాంతి గనంబడినది. అది చూచి నేను వెఱగందుచుండ వల్ల కీతంత్రి నాదము శోత్రపర్వము గావించినది. అది విని నేనోహో యిది పర్ణశాల కాదా ! నేనెక్కడకైనం బోయితినా ? నిష్కాముండైన మా యయ్యవారింటిలో నిట్టి వెలుఁగు గలుగుటకుఁ గారణ మేమని యాలోచింపుచు నాకులసందునుండి లోనికిఁ దొంగి చూచితిని. అప్పుడాలోపలి కృష్ణాజినములు కమండలువులు దర్బాసనములు నారచీరలు నేమైపోయినవో తెలియదు. అయ్యాకుటిల్లు విచిత్ర రత్నప్రభాధగద్ధగితంబై కాంచానాంబరవితాన సమావృతంబై బహు విధచిత్రప్రతిమాసమలం కృతకుడ్యంబై యింద్ర భవనమువలె మెఱయుచున్నది. అమ్మందిరాభ్యంత రమ్మున హంసతూలికాతల్పంబునఁ గూర్చుండి యొక పికవాణి వీణఁబాడుచున్నది. అయ్యారే ! ఆ తొయ్యలి చెలువం బిట్టిదని చెప్పుటకు నాకు శక్యము కాదు.

క. ఆమొగమాసగవానొస
   రామేనివిలాసమాయొ • యారం బాచె
   రామెఱుఁగుచూపు లా స్తన
   కోమల మెన్నంగ బ్రహ్మ • కును వశమగునే.

మా యయ్యవారయ్యెలనాగ తొడపై శిరంబిడుకొని తరుణ వయస్కుండై వీడెమువై చికొనుచు బండుకొని తద్గానం బాలింపుచుండిరి. ఆ వింత గనులారఁజూచి నేను విస్మయ సముద్రములో మునిఁగి ఈ జవ్వని యెవ్వతె ? యీ ఋషీకీయభిలాష యేమిటికిఁ గలుగవలయును ? ఇట్టివారే మారక్రియాసక్తులై యుండ నా బోఁటివాడు నిష్కాముం డెట్ల గును ? జన్మమెత్తినందుల కట్టి చక్కెరబొమ్మతోఁ గ్రీడించి నప్పుడుగదా సార్థకము ! బాపురే ! మా యయ్యవారా నారీమణిం బొందుటకెన్ని యేండ్లు తపంబు గావించెనోగదా ! మేలు మేలు భళి భళి. బాపురే ! ఆ తపసికిఁక స్వర్గమేల సామ్రాజ్యమేల ? చక్రవర్తులకైన వయసు మీరిన భోగవిముఖత గలుగును గదా ! ఈ తారుణ్య మెట్లువచ్చును ? ఇట్టి సుందరు లెక్కడ లభింతురు ? అయ్యో ! లోకాతిశయ సౌందర్యంబునం బొలుపొందు నీమ్దుముఖిం గనుగొంటి నిది నా జన్మకు జాలును. అని పెక్కు తెఱుంగులఁ దలంచుచుఁ దదీయక్రీడా విశేషములన్నియుం జూచుచుండ మోహం బొదవుటయుఁ జిత్తవిభ్రాంతి గలిగి యొడ లెఱుంగక పడిపోతిని.

మఱునాఁడుదయంబున లేచి చూడ నెప్పటి కుటీరము బోడితపసియుం గనంబడరి. అప్పుడు రాత్రి గనంబడిన విషయములన్నియు స్వప్న గతములని నిశ్చయించి యూయింతి సోయగమే తలంచుచు నత్తెఱంగుముని కెఱింగింపక యాదినము గడిపితిని, మఱియు నాఁటిరాత్రి నేను నిద్రబోక యా కుటీరమువంకనే చూచుచుంటిని కాని యేమియుం గనపడినదికాదు. అంతటితో విడువక ప్రతిదినము నట్టే చూచుచుంటిని. బాలకా ! విను మెనిమిదవనాడు రాత్రి మఱల నాకావింత గనంబడినది. మనం ఉవ్విలూరఁ జూచి చూచి తలయూచుచు నేనప్పుడాహా ! యిది ---------------- - "కు తెలిసినది. మా యయ్యగారు వారమున కొకసారి దివ్యాంగ in 1 . పులున్నాం గా అన్నన్నా : పగలే సమును మన వంతు ఏం సం రాత్రి యెన్ని విలాసములు వ్యక్తపరచుచుండెను. ఎట్టి రసికత్వము చూపు చెందెను. ఓహో హో యని మెచ్చుకొనుచు నమ్మచ్చకంటి చక్కందనముఱెప్ప లార్పక చూచుచు నంతలో మోహ మావేశింప నొడ లెఱుంగక వివశుండనై పడి మఱునాఁడు లేచి యెప్పటి విషయంబులం జూచితిని.

మఱియు నట్లాఱువారములు తప్పక మేల్కొని వారిక్రీడా విశేషంబులఁ జూచితిని. అప్పుడు నాకు మదవోన్మాదము జనించినది. కన్నులకు గట్టినట్లాయన్నుల మిన్నయే యెల్లప్పుడు కనంబడుచుండును. అన్నము రుచింపదు. నిద్రరాదు. తదేక ధ్యానముగాఁ దిరుగుచుంటి. మదీయ ప్రమాదమెఱిగియాయతి యొకనాఁడునన్నుఁజీఱి యోరీ ! నీ స్థితి వెనుకటిమాదిరిగా లేదేమి ? ఇట్లు చిక్కుచున్నా వేమని యడిగిన నేనిట్లంటి,

స్వామీ ! మీరు నా తప్పు మన్నింతు రంటిరేని యధార్ధము వాక్రుచ్చెద. నా మది నా యధీనములో లేదు. ఏమి చేయుదును. దేవర పాద సేవకుఁడగదా? నా కామితము తీర్పక తప్పదు. వినుండు అని బెదరుగదుర బలుకకున్న విని నవ్వుచు నవ్వనవాసి తుందిరా ! భయ పడియెదవేల క్రొత్తవాఁడవాయేమి ? నిక్కము వక్కాణింపుము. సందియములఁ దీర్తుననియభయహ స్తమిచ్చుటయు వెఱపుడిపికొని నే నిట్లంటి.

స్వామీ ! మీరు నిస్సంగులు గదా. వారమున కొకసారి యా నారీమణీలో నట్లు భోగించుచున్నా రేమి ? ఆ జవ్వని యెవ్వతియ ? ఈ పర్ణశాల కా యలంకారము లెక్కడినుండి వచ్చినవి. నా కన్ను లార పలుమారావింతలం జూచితిని. ఆ చిగురుఁ బోడిం జూచినది మొదలు నా మది చెదిరిపోయినది. మీ యొద్ద దాచనేల మీ వంటి వారికే యట్టి కామ్యము గలిగియుండ నా వంటివానికిం గలుగదా ? ఆ వృత్తాంతము చెప్పుమని యడిగిన నా జడదారి నవ్వుచు నిట్ల నియె.

తుందిలా ! ఇందులకా నీ వింత వలవంత గొనుచుంటివి ! విను మది యొక యక్షిణీకాంత నలువదియేండ్లు యక్షిణీశైలమున నారాధించి యమ్మించుబోఁడిని వశపరచుకొంటి తత్ప్రభావంబున నెప్పటి కప్పుడే యా శృంగార విలాసము లన్నియు నావిర్భవించు చుండును. వారమున కొక తేపవచ్చునట్లు నియమించితిని. ఆ జవ్వని యిచ్చి వచ్చినని వినోదములు చూపి యభీష్టగామంబులఁ దనుపుచుండును. కోరితి నేని స్వర్గపట్టణం బెదురంబెట్టి చూపఁగలదు. వలసినంత ద్రవ్యము తెచ్చియిచ్చును. అద్దేవత వశ్యయైనచో నాకముతోఁ బనిలేదను మాట సత్యమే వృద్ధులకైనఁ దారుఢ్య మొసఁగి క్రీడించును. ఆయువు వృద్ధిపఱచును. దీనంబరలోకహాని యుండదు. ఐహిక సుఖం నిండనుభవింపుచుఁ బదలోకసుఖంబు కొఱకై తపంబు గావించుచున్న వాఁడ నిదియే దీని వృత్తాంతమని తన కథయంతయుం జెప్పినవిని నేను క్రమ్మఱ నత్తపసి కిట్లంటి -

స్వామీ ఎఱిఁగియో ఎఱుఁగకయో మీ శిష్యుండొక విన్నపము జేసికొను చున్నాడు. వినుండు పొడమినది మొదలు నేఁటిదనుక నిడుములం గుడిచి కుడిచి నా బొందె చిట్టము గట్టినది. వనిలాసులం బించుకయుఁ జవిచూచి యెఱుఁగుదును గదా ! సంకల్ప శతములతోడనే కాలము సగము గడిచినది. పుట్టు బ్రహ్మచారినై యిట్లుంటి దొంటి పుట్టువున నెప్పుడో కొంచెము సుకృతము గావించితిని గాఁబోలు మీ దర్శన లాభము గలిగినది. ఇఁకనాకు జేయవలసిన పని యేమియును లేదు. మీ యంతేవాసి కాయక్షిణీ మంత్రముపదేశము సేయుఁడు. అగ్గిరి కరిగి నలువదియేండ్ల దేవత నారాధించెదను. అక్కన్ని యు ప్రసన్నయై మీకుఁబోలె నభీష్టంబులఁ దీర్చినఁ దీర్చుకాక లేకున్న మృతినొందించుఁగాక యంతకన్న వేరొక దారిలేదు. అట్లు చేయకపోతిరేని మీ మ్రోల నిప్పుడే ప్రాణంబుల విడుచువాఁడనని పలుకుచుఁ బాదంబులంబడి లేచితిని కాను.

అయ్యతి నన్ను లేవనెత్తి చిఱునగవుతో తుందిలా ! అమ్మంత్రోపాసన సామాన్యమనుకొంటివా ? వినుము విద్యున్మాలఁ చంద్రలేఖ, సులోచన, యనియక్షిణీ దేవతలు మూఁడు తెరంగులఁ బొలు పొందుచుందురు అందు విద్యున్మాలను బది యేండ్లు చంద్రలేఖ నిరువది యేండ్లు సులోచనను నలువది యేండ్లును ఊపాసింప వలయును. చంద్రలేఖా సులోచనోపాసకులు పుడమి నెక్కడనోకాని లేరు. విద్యున్మాల నుపాసించనవా రద్భుత క్రియలఁ గావించుటయే కాని యిట్టి యభీష్టంబులం బొందలేరు. అదియునుంగాక యా యక్షిణీశైలమునకుం బోవుటయే దుర్ఘటము. అందు యక్షిణీదేవతలు క్రూరమృగ స్వరూపముగా వచ్చి యక్కొండశిఖర మెక్క నీయరు నీ వీ శ్రమ యెక్కడపడగలవు. నలువదియేండ్లు కందమూలంబులందినుచు నందామంత్రానుష్టాన మెట్లు చేయఁగలవు ? సుఖంబుగా నిందుండుమని చెప్పిన నేనిట్లంటిని.

స్వామీ ! యెన్నియేండ్లు తపంబుజేసిన నేమి యెంతశ్రమ పడిననేమి. అట్టి వన్నె కాడితో నొకఱేయిఁ గ్రీడించినం జాలదా ? యావజ్జీవము తపంబు గావించి యాయించుబోడిని వశపరచుకొనియెదఁ గనికరించి నాకామంత్ర ముపదేశముగావింపుఁ డని ప్రార్థించిననప్పారికాంక్షి సమ్మతించి శుభముహూర్తంబున సాంగముగా నాకమ్మంత్రోపదేశము గావించెను.

ఉపచార పరిగ్రహ మూరకపోవునా మఱియు నత్తపసి 1 1. 0 వచ్చి యిది నీ చెంత నుంచుకొని యయ్యచం: బునకుం 23-మ్ముడు... తన ములు నన్ను దాధింపవు. అయ్యషణ్ శైల కూటం. క0 3'0'. ఉన్న డి. దాని కసతిదూగములో య. ఈము లయ సంకలి సంక సంథం ఇనం సూర్పు, . ... మను న నప్పుడే ఆరు.. ఆ హానట్లు పిమ్మట నమ్మునితిలకుని యనుమతి వడసి శుభముహుర్తంబున బయలు వెడలి తదుక్త్ర ప్రకారం బీగిరి శిఖరంబున కేయంతరాయముం గానక యరుదెంచి జటావల్కలము ధరించి నాటం గోలెనిందా యక్షిణీమంత్రానుష్ఠానము గావింపుచుంటి. నిప్పటికి బదిదినములు కొఱఁతగా ముప్పదిసంవత్సరములై నది. ఇఁక పదియేఁడులు గడుపవలయు నిదియే మదీయ వృత్తాంతమని యతం డించుకయేనిఁ దాచక తన కథ యంతయుం జెప్పెను.

ఆ యుదంతము విని వసుంధరుఁడు ఇసిరో ? వీరెంత మూర్ఖులో కదా ! జీవితకాలమంతయు శ్రమపడి క్షుద్రసుఖంబు గోరుచున్నారు. కై వల్యమున నీ పాటి యానందము లేదు గాఁబోలు అక్కటా ? వైరాగ్య పవృత్తి యెఱుఁగరుగదా యని తలంచుచు నతని కథ కనుమోదించు వాడుంబోలె నభినయించుచు నయ్యక్షిణీ దేవాలయ మెందున్నదో నాకు జూపితిరికారేమని యడిగెను.

ఆ తుందిలుఁడు వసుంధరా ! నేను బ్రతిదినము వేకువజామునలేచి యక్కడికే కాదా పోవుచుంటిని. అందు మధ్యాహ్నము దనుక జపంబు జేసికొని వెండియు స్నానము జేసి పర్ణ శాలకు వచ్చి కుడుచుచుందును. నీకు జూపెద రేపునాతో రమ్మని చెప్పి యమ్మఱునాడు వాని నా దేశమునకుఁ దీసికొనిపోయెను.

తుందిలుఁడు జపము జేసికొనుచున్న సమయంబున పసుంధరుఁ డచ్చటి విశేషములన్నియుం జూచుచు శతానందయోగి యెరింగించిన స్తటి స్తంభము నందలి శిలాఫలకము గనంబడుటయు నందలి లిపి యంతయుం జదివికొని తాత్పర్యము జేసి కొనియెను.

యక్షిణిదేవి కథ

అందు సులోచనావశ్య విషయమై కొన్ని నిబంధనములు వ్రాయబడి యున్నవి. మొదటిది నలుబదియేండ్లు కందమూలములం దినుచుఁదన్మంత్రానుష్ఠానము చేసిన వశ్యమగును. రెండవది ముప్పదియేండ్లు మంత్రానుష్ఠానము చేసి పదునాలు గేఁడుల ప్రాయము గల విప్రకుమారు బలియిచ్చిన వశ్యమగును.

మూఁడవది ముప్పదియేండ్లు తన్మంత్రానుష్ఠానము గావించిన వాని బలి యిచ్చిన సద్యోవస్యము మరియు ననేక బంధములున్నవి. వానిలో రెండవ నిబంధనము దాపున గురుతుం గలిగియున్నది. మూఁడవ నిబంధనము దెలియకుండ మట్టి పూయఁబడియున్నది. పసరు వ్రాసి చదివెను కావున వానికాలిపితెల్లమైనది. రామలింగకవి పుత్రుఁ డాగురుతులు గ్రహించి యౌరా ! ఈ సన్యాసి నన్ను బలియియ్య వలయునని తలంచి కాఁబోలు నిందుగురుతు వెట్టియుండెను ? నేనది జూచి తన్ను పరియునని తలం, పాలు నలదు ఎందుకు మును? నేసవి మచి తన్ను బలియిత్తునని వెఱచి యీ లిపి కప్పిపుచ్చెను. సీ ! తుచ్ఛసంపదల కాసపడి నేనట్టి పని చేయుదునా నన్ను జంపఁ బ్రయత్నించెనేని గడతేర్చక మానను. దానబాతకము రాదని తలంచి మూఁడవనిబంధనముపయి మఱల మట్టిరాచి తెలియకుండ నెప్పయ యట్ల యాముని యొద్దకు బోయి కూర్చుండెను. తుందిలుండును వాడుక ప్రకారము జపావసానమున వానితోఁగూడ సరస్సునకుంబోయి స్నానము జేసి పర్ణశాల కరిగి భుజించెను. ఈ రీతి వానితో నత్యంత ప్రీతిపూర్వకముగా మాటలాడుచు నాదరించుచుఁ దొమ్మిదిదినములు గడి పెను. దొంగకు దొంగయై వసుంధరుండు వాని చర్యలన్నియు నరయుచునేయుండెను.

పదవనాఁడు వాడుక ప్రకారము స్నానముజేసి వారిరువురు గుడికిఁ జనిరి. తుందిలుఁడు ముఖమంటపమునం గూర్చుండి వత్సా ! వసుంధర ! నీయందు మా కెక్కుడు వాత్సల్యము గలిగినది. నేఁడు నీకొకమంచిమంత్ర ముపదేశము గావించెద దాన సిద్ధుండవయి పక్షివలె మీదేశమునకుఁ బోఁగలవని చెప్పిన విని యతండు మహాత్మా ! ఆ మంత్రము మీరనుష్ఠానము గావించితిరా ? మీకు సిద్ధియైనదా ? యని యడిగెను. అతండు సందియమేలా ? మాకు సిద్ధించనిదే నీకుపదేశము చేయుదుమా ! తప్పక నీవు పక్షివలె నెగరఁగలవని మఱల జెప్పెను.

స్వామీ ! మీకట్టి సామర్థ్యమున్నదియా ? యేది యొకసారి యెగిరి చూపింపుడని శంకించినఁ దల కంపించుచు నతం డోహో ! విషమప్రశ్నములు వేయుచుంటివే ? నీకే మేముత్తరము చెప్పలేమనుకొంటిరా యేమి. ఒక మంత్రానుష్ఠానము చేయుచున్నప్పుడు మఱియొకటియనుష్టేయము కాదు. దానంజేసి ప్రత్యక్షము నీకుఁ జూపుటకు వీలులేదని చెప్పెను. స్వామీ ! అట్లయి నాకిప్పుడు మంత్రోపదేశము మాత్రమెట్టు చేయుదురు ? దానికతి వ్యాప్తి కాదా యని వసుంధరుడు పలికినఁ గన్నులెఱ్ఱ చేయుచు నోరీ ! బాలికా ! నీతో మేము చనువుగా మాటలాడుచున్నా మనియా ? యిన్ని శంకలు చేయుచున్నావు ? చాలు ! చాలు ! గురువుల కెప్పుడు తోచునో యప్పుడు చెప్పుదురు. దానంగాదె వారినెప్పుడు ననుసరించి తిరుగవలయు నని పెద్దలు చెప్పుదురు. ఇన్ని మాటలేల నాయొద్ద సుపదేశము పొందుదువా ? పొందవా ? యొకటే మాట చెప్పమనియు నతం డీషత్స్మితలలిత వదనార విందుండయి స్వామీ ! కోపగింపకుఁడు మీశిష్యుఁడఁగాన నింత నిర్భయముగా మాటాడుచుంటి శతానందయోగి యొద్ద మీరుచునువుగా మాటలాడలేదా ? కానిండు అటులే యుపదేశము పొందెద నందులకేమి చేయవలయునని యడిగెను. అప్పుడతండు నవ్వుచు వత్సా ! మాగురువు నొద్ద నేనెంత జడియుచుండువాఁడనో నీ వెఱుంగుదువా ? నీవలె కుశంకలు చేసితినేని బ్రతుకనిచ్చునా ? వినుము నీవేమియ మాకు గురుదక్షిణ నీయనక్కరలేదు. నాపాదముల రెంటిపై శిరంబిడి నానుడివిన మంత్రం బుచ్చరింప వలయు నిదియే చేయఁదగిన కృత్యంబని పలికిన విని యావిన్నాణి జాపురే ? మూఢ ? నీకపటం బెఱుంగని మందమతి చెంత నిట్టు పలుకుము. నా కడనా ! యని యంతరంగమున నిందించుచు వాని కిట్లనియె. స్వామీ ! నేను పుట్టినది మొద లెన్నఁడును క్రింద బరుండి యెరుంగను. ఇక్కడకు వచ్చినది మొదలు పుడమిఁ బండుకొను చుండుటచే నాకాళులన్నియు సడలి పోయినవి. అబ్బా వెన్నెముక కొంచెమయినను వంగుటలేదు. ఎద్దియయిన పట్టు వైచుకొనవలయునని తలంచుచుంటి నిప్పుడు మీపాదములకు శిరంబుసోక మ్రొక్కజాలను. నిలువంబడి యుండిన మంత్రోపదేశము సేయరాదా ? యని యడిగిన నయ్యతి అదిగో ! నీస్వభావము విడిచితివి కావుఁ యతికిఁ బ్రతి చెప్పుచుందువు. ఒక్కతృటికాలము లలాటముమోపి నిలువలేవా ? ఇంతమాత్రము శ్రమపడక మంత్ర సిద్ది యెటులగను ? మేము పడియెడి యిడుమలఁ జూచుచుండలేదా ? శరీరము మృదువు సేయరాదు సుమీ ! యని పలికిన వసుంధరుండు స్వామీ ! మీమాట కడ్డు చెప్పినఁ గోపము వచ్చుచున్నది. మీ యిష్టము వచ్చినట్లే చేసెద మఱియొండు వినుండు పలుమారిట్టట్టనిన నేను వంగలేను. ప్రణామవిధి యెట్లో నాకుఁ జూపింపుఁడు అట్లు గావించి మంత్రోపదేశము పొందెదనని పలికిన సంతసించుచు నతండింత చదివితివి. ప్రణామవిధియే తెలియదా ? ఇదిగో ! చూడుము ఇట్లేయని యతని పాదముల దాపున బోరగిలఁ బండుకొనియెను. అప్పుడా క్షత్రియకన్యకా పుత్రుఁడంతకు ముందు తన శిరంబు ఖండింప నాసనాసచే నాప్రాంత స్తంభము చాటునదాచఁబడిన ఖడ్గమును గయికొని వాని జటాకలాప నెడమచేతితో నదిమిపట్టి యోరీ ! ముప్పదియేండ్లు కందమూలములం దిని తపంబు జేసియు గనికరము బూనక భోగంబుల కాసపడి కపటంబున నన్నుఁజంప నుద్యుక్తుండ వై యీకత్తిఁదెచ్చి దాచితివి దురాత్మా ? నీ దుర్బుద్ధి నే గ్రహింపలేననుకొంటివా ? యీకత్తియే నీపాలిటి మిత్తియై ప్రాణముల గ్రోలు చున్నది. నీయిష్టదేవతలఁ దలంచుకొమ్మని పలికెను.

అప్పుడామాట విని యాబడుగు సన్యాసి కదలలేక హా ! వసుంధరా ? హా ! వసుంధరా ? చంపకు చంపకుము రక్షింపుము రక్షింపుము విడువుము. నీ దాసుండనై తిరిగెదనని బ్రతిమాలఁ దొడంగెను. వాని దీనవచనంబులు విని జాలి వొడమ నా విప్రకుమారుండు ఓరీ ! నీచా ! నీవు నన్నుఁజంపుట కుద్యుక్తుండవైతివా లేదా నిజము చెప్పుము. నిన్ను విడుతుననుటయు నతండు జంపబూనినమాట నిజమే గడ్డిం గరచితిని విడువుమని గిలగిలఁ కొట్టికొనుచు వేడికొనియెను.

అంతలో క్షత్రియ దౌహిత్రా ! వీని విడువకుము నాకు బలియిమ్ము . తృటిలో నీకు వశమగుచున్నానని యశరీరవాక్య మొకటి వినంబడినది. ఆ మాటవిని వసుంధరుడు అమ్మా ! నేను వీనియింటఁ బదిదినములు గుడిచితిని ఆ విశ్వాసము హృదయము బాధించుచున్నది. వీనిం జంపుటకు జేతులురాకున్నవి. అదియుంగాక తుచ్చభోగంబుల గాసపడి బ్రహ్మహత్య చేయుదునా ? అవసరమయినప్పుడు నీవు నన్ను గాపాడుచుండు మదియే నాకుఁ బదివేలని ప్రార్థించుటయు మేలు మేలు : నీ కృపాశీలమునకు మెప్పువచ్చినది. భవదీయ విషయభోగపరాజ్ముఖతకు సంతసించితిని. అవసరమయినతరిఁ దలంచికొనుము. కార్యసాఫల్యము గావించెదని మఱల నాయతను ధ్వని వినంబడినది.

మహాప్రసాదమని యవ్వాక్యంబు శిరంబునం గైకొని యతండు. "దయా విహీనుండవై మహర్షులవోలె జటలనేమిటికి దాలిచెదవు ? నీవు చండాలుండవని" పలికి యా కత్తిచే వానిజడలం గోసి విడిచిపెట్టెను. ఆ సన్యాసి మృత్యుముఖమునుండి బయలుపడి లేచి మారుమాట పలుకక తలవంచుకొని తనయింటికిం బోయెను.

సామ్రాజ్యపదంబు లభించుచుండ లెక్క. సేయక తన్నుఁ జంపబూనిన వానిని విడిచిపెట్టిన యా బాలకుని దయాళుత్వము వేనోళ్ళం గొనియాడఁదగి యున్నది గదా ? అట్లు సన్యాసి లజ్జావసతముఖుండై యరిగిన వెనుక పసుంధరుఁ డెక్కడికిని బోక యందేయుండి మధ్యాహ్నము ఫలములం దిని రాత్రి యా మంటపములోఁ బండుకొని క్రూరమృగంబులవలన భయంబునంజేసి నిద్రఁబోవక యెద్దియో ధ్యానించు చుండెను. అర్ధరాత్రమైనంత నతని చెవులకు మనోహరమైన గానము వినంబడినది. ఆ సంగీతము విని యతం డదరిపడిలేచి యోహో యీ విజనారణ్యమున నిట్టి సంగీతము పాడువా రెవ్వరోకదా ! యని నాలుగుదెసలు పరికింప యక్షిణీదేవత గర్భాలయములో నా వినోదము జరుగుచున్నట్లు తెలియఁబడినది.

అప్పుడతండు మెల్లన లోనికిఁబోయి యొక విగ్రహముచాటున నడఁగి చూచుచుండెను. దివ్యమాణిక్య విభూషాంబరశోభితలై యక్షకన్యలు పెక్కండ్రా యంతర్బవనమంతయు విధూషణమణీ ప్రభాధగద్ధగితములగు దేహకాంతులచే మెఱయఁజేయుచు నా దేవతా విగ్రహముచుట్టునుం గూర్చుండి వీణాతంత్రీస్వరముతో మేళగించి కొందఱు గాంధర్వంబు వెలియింప గొందఱు నృత్యములు సేయుచుఁ బెద్దతడ వమ్మహాదేవి నారాధించిరి. కొంతసేపు వినోదకధాసల్లాప విశేషములఁ గాలక్షేపము గావించిరి. ఆ ప్రసంగములోఁ జంద్రరేఖయను యక్షకన్యక-

సఖులారా ! మనము వచ్చునప్పుడా ముఖమంటములో నెవ్వఁడో పండుకొని నిద్రపోవుచున్నాఁడు చూచితిరా ? వాని సౌందర్య మర్కజముగా నున్నది సుఁడీ !

విద్యున్మాల - వాఁడు మందారవల్లి కొడుకు. వసుంధరుఁడను వాఁడు. అస్మద్దేవతయే వాని నీగిరిశిఖరమునకుఁ దీసికొనివచ్చి పడవైచినది .

చంద్రలేఖ – ఏమిటికట్లు పడవేయవలసి వచ్చినది ?

విద్యు – సోమశేఖరుఁడను బ్రాహ్మణునిచే మంత్రబద్దయై తదాజ్ఞానుసార మట్లు చేసినది. వీని విద్యచూచి రాజపత్ని యోర్వలేక యట్లు చేయించినదఁట.

చంద్ర – వీనికి రూపానుగుణ్యమైన విద్యకూడ నున్నదియా ? సులోచన - విద్యయొక్కటియే ! దయాదాక్షిణ్యాది గుణంబులెన్ని యేనిఁ గలవు. వీఁడు కనికరించి యా సన్యాసినిఁ జంపక విడిచెను. కానిచో మా దేవితోఁ గూడ మే మీపాటికి వీనికిఁ బరిచారికలమై యుండవలసివచ్చును.

చంద్ర - సిరిరా మోకాలొడ్డువాఁ డుండునా ?

సులో - అట్లే చేసెను. ఉత్తమ బ్రాహ్మణ హృదయంబు వెన్న వంటిది గదా !

విద్యున్మాల - వీని మంచిలక్షణములఁ బరిశీలించియే కాఁబోలు మా దేవి రాజపుత్రిక నడవిపాలుచేసి వీని నీయక్షిణీ శైలమునకు దీసికొని వచ్చినది.

చంద్ర - రాజపుత్రిక నేమిటికి నడవిపాలు సేసినది ?

విద్యు - దానికిని నా మాంత్రికుని శాసనమే కారణము.

సులోచన – వీనికి సామ్రాజ్య సౌఖ్యము గలుగునట్లు మనము దీవింప వలయు.

చంద్ర - ఈ పుణ్యాత్ముండు పట్టభద్రుండగుగాక !

విద్య - ఈ సుకృతిఁ దప్పక వర్ధిల్లుఁగాక !

అని మాట్లాడికొనుచు నంతలోఁ దెల్లవారు సమయమగుచున్నది కావున వారెల్ల నిష్క్రమించిరి. ఆ మాట లన్నియును విని వసుంధరుఁడు రాజపత్ని యే తన ప్రవాసమునకు హేతువని తెలిసికొనియు నామెయం దించుకయు నలుగక యుదయంబున లేచి యా దేవతలకు నమస్కరించి సరస్సు కరిగి స్నానముజేసి చేతులు జోడించి 'తల్లీ : యక్షిణీ : నే నీ పర్వతము దిగి యరుగునప్పుడు క్రూరమృగబాధ గలుగకుండ ననుగ్రహింపుము నిష్కంటకమైన దారిఁజూపు' మని ప్రార్థించి నడువ దొడంగెను.

అప్పు డతనికి నిరువంకలఁ గుసుమ కిసలయఫలదళమనోహరములగు తరులతా గుల్మములచే నలంకరింపబడిన సోపానమార్గ మొండుగనంబడినది. అది యక్షిణీ ప్రభావమని సంతసించుచు నతం డాగిరి నశ్రమంబున దిగెను. తత్పాదంబుల మూఁడు దెసల సముద్రము, నొక దెస తామ్రపర్ణీనదియు నావరింపబడి యున్నది. వానిం దాటుట యెట్లని తలంచుచున్నంతలోఁ గొందఱు నావికు లొకయోడం దీసికొని యా తీరమున కరుదెంచి వాని నా కలముపై నెక్కించికొని యవ్వలి రేవునదింపి పోయిరి వసుంధరుఁ డా తీరమునఁ దిగి యందుఁగల జనపదంబులమీఁదుగా బ్రయాణము గావించెనని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలి వృత్తాంతము తరువాత మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.