కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/37వ మజిలీ
జన్ముండని నిశ్చయించి విరక్తులై యద్వైతతత్వబోధామృతంబుఁ గ్రోలుచు దపోవనంబున కరిగిరి. గంగానదిని మునింగి పండితరాయలు భార్యతోఁగూడ మనుష్యశరీరమును విడిచి యథాపూర్వకముగా దివ్యదేహము ధరించి పరమానందము నొందెను. గోపా! ఇదియే వారి వృత్తాంతము. మనకుఁ బయనపు సమయమగుచున్నది. లెమ్మనిపలికిన వాఁడు చేతులు జోడించి మహాత్మా! మీ కటాక్షమున మంచికథ వింటిఁ గృతార్దుండనైతి. చివర వారు యథాపూర్వకముగా దివ్యదేహములు ధరించిరని చెప్పితిని. దీనం బ్రశ్నావకాశము గలుగుచున్నది. వారు పూర్వ మెవ్వరు? అట్లు జనింప నేమిటికి? ఆవృత్తాంతముఁ జెప్పుడని వేఁడికొనిన నయ్యతి నవ్వుచు నిట్లనియె "ఓరీ! నేను మఱచిపోయి యిట్లంటి దీని కొకకారణము లే దని పలికెను. కాని యంతమాత్రమున వాఁడు విడువక యా సిద్ధుని యడుగులం బట్టుకొని వేఁడుకొనిన నతం డిప్పుడు చెప్పుటకు వీలులేదు. ముందు శివాలయము కనంబడినచోట జ్ఞాపకము చేయుము దాని కట్టి కారణమున్నదని చెప్పి వాని నొప్పించి పిమ్మట బయనంబై శిష్యునితోఁ గూడఁ దరువాత మజిలీ చేరెను.
ముప్పదియేడవ మజిలీ.
ఱాతిమందసము కథ
ముప్పదియేడవ యవసధము సాధారణమైనగ్రామము. అందు వాడుక ప్రకారము గురుండు నియమచిత్తుండై జపమునకుఁ గూర్చున్న సమయమున శిష్యుఁడు వింతలంజూడ గ్రామములోనికిం బోయి నలుమూలలఁ దిరిగితిరిగి యేదియుం గనంబడమి విసిగికొనుచుఁ బ్రాంతారణ్యభాగమునకుం జని యరయనరయ నొకచో నొకవింత గనంబడుటయుఁ గడురయంబున నయ్యవారియొద్ద కరిగెను. అయ్యతియు భోజనాదికృత్యములు నిర్వర్తించి వానిరాక నిరీక్షించియుంటంజేసి వానిం గాంచి రమ్ము రమ్ము. నీమొగమ్ముఁ జూడ వేడుకపడుచున్నట్లున్నది. ప్రొద్దుపోయినది. కుడిచిన పిమ్మట నడిగెదుగాని యని పలికిన విని స్వామీ! యాలస్యమైనచోఁ జెప్ప మఱచెదను. వినుండు. ఇదియు వెనుకటి మజలీవంటిదే ఇందేవింతయుఁ గనంబడలేదు. ఊరువిడిచి యడవికిం పోయితిని. అందొక యద్భుతమైన ఱాతిమందసము గనంబడినది అది తెల్లని పాలశిలతోఁ జేయబడినది. నూఱుగజముల పొడవును నలవది గజముల యెత్తును నేబది గజముల వెడల్పును గలిగి చతురస్రమై యొప్పుచున్న యాశిలాపేటికపై కెక్కుటకు యాసోపానము లెవ్వరో వింతగా నేర్పఱచిరి. పైకెక్కి చూచితిని మూఁత వేయఁబడి యున్నది. ఒకచోట రంధ్రము పడినది. కావున దానివెంబడిఁ జూచిన బాతాళబిలమువలెఁ గనంబడును. వేగురైనను దానిమూఁతఁ గదల్పఁజాలరు. పోలికంబట్టి యది మందసమని యూహింపబడుచున్నది. ఆపెట్టె వాడెడువా రెవ్వరో? ఎంతబలముగలవారో? ఎంతదేహము గలవారోగదా? దాని వృత్తాంత మడిగిన నచ్చటివారు పెద్దకాలమునుండి యిట్లేయున్నది. మాకేమియుం దెలియదని చెప్పిరి. మీకుఁగాకఁ యొరులకుఁ జెప్ప శక్యమా యని యూహించి వడిగా వచ్చితిని. దీనివృత్తాంతము విన నెవ్వరికిఁ గోరికయుండదు? వేగమ వాక్రుచ్చి నాకు సంతసము గలుగఁజేయుఁడని ప్రార్ధించిన నాపారికాంక్షి తన మణివిశేషముచేఁ దదుదంత మంతయు నాకలించుకొని వాఁడు భుజించినవెనుక సావకాశముగాఁ గూర్చుండి యాకథ యిట్లు చెప్పదొడంగెను.
మహామాయ కథ
దేవదుర్గమను పట్టణంబున బుధవర్మ యనురాజు కీర్తిమతియను భార్యతోఁ గూడి ప్రజలంబాలించుచుండెను. అతండు ధర్మశీలుండు దయాళుండును సత్యసంధుఁడును బరాక్రమశాలియు నగుటచేఁ బ్రజలతనియందు బద్ధాధరులై తండ్రింబోలెఁ జూచుకొనుచుండిరి. ఆనృపాలునకు సంతతి కలుగుట కించుక యెడమగుటయుఁ బ్రజలెల్ల తల్లడిల్లి తమతమ యభీష్టదేవతల నారాధించుచు వ్రతములం జేయుచు నియమములు బూనుచు యాత్రలుగాంచుచు పెక్కుతెరంగుల బరితపించుచుండిరి. దైవయోగంబున నన్నరపతికిఁ గాలక్రమంబున వరుసగా నిరువురుపుత్రులును నొకపుత్రికయుం జనించిరి. అప్పుడా యెకిమీఁడేకాక యాదేశప్రజలెల్లఁ బరమానందసాగరంబున మునింగిరి. భూపతియుఁ దనయపత్యమునకు యథాకాలమున జాతకర్మాది విద్యుక్తక్రియలు నిర్వర్తించి పెద్దవానికి బలభద్రుండనియు రెండవవానికిఁ గృష్ణుండనియు నాఁడుపిల్లకు సుభద్రయనియు నామకరణములు చేసెను. ఆమువ్వురకు సంవత్సరము హెచ్చుతగ్గు కలిగియున్నను నైదేండులుప్రాయము వచ్చువరకు వారు ముగ్గురు నొక్క ఈడు గలవారివలెనే గనంబడుచుండిరి. బాల్యంబున వారి మొగంబులును జూపులును మాటలును జూచిన నెట్టివిరక్తుల కైన ననురాగము గలుగకమానదు. సాముద్రికశాస్త్రలక్షితులై సర్వావయవసుందరులై యద్భుతతేజఃపరిపూర్ణులగు నాబాలురపోలికలు సమముగా నుండుటచే నిత్యముఁ జూచువారికే గుఱతుపట్టుట కష్టముగా నుండునది. ఆకారలక్షణతేజోవిశేషములఁ దుల్యులగు తనపిల్లలంజూచి బుధవర్మ మిగుల సంతసించుచు వారి కైదవయేఁడు ప్రవేశించినది మొదలు లోకవిషయంబుల నేమియుఁ జూడనీయక విద్యామందిర మొకటి కట్టించి యందు వారినిఁ బ్రవేశపెట్టి పలువురు నుపాధ్యాయుల నియమించి కేవలము విద్యాప్రసక్తియేకాని యితరవిషయము లేమియుఁ జెప్పవలదని వారిని బోధించి విద్య నేర్పింపఁ దొడంగెను.
ఆ గురువులును తమకు నియమితమగు కాలంబున నియమింపబడిన విద్య నేరుపుచుండిరి. ఆ రాచబిడ్డలు నితరవ్యాసంగముల నెఱుంగక గురువులనుండి. సమస్తవిద్యలను సక్రమముగా గ్రహించిరి. పదియాఱేఁడుల ప్రాయమువచ్చువరకు వారు శాస్త్రములయందును, ధనుర్వేదమునందును, జిత్రలేఖనమందును, గణితమునందును నసమానమైన పాండిత్యము సంపాదించిరి. పుత్రుల విద్యాగ్రహణసామర్థ్య మెట్లున్నదో యని బుధవర్మ యొకనాఁడు విద్యామందిరమునకుంజని పండితులచేఁ పరీక్షింపజేసెను. పండితులు పరీక్షించి తదీయవిద్యాపరిశ్రమమున కచ్చెరవందుచు రాజుతో “దేవా ! నీ పుత్రులును బుత్రికయు సకల విద్యలయం దారితీఱిన పాండిత్యము గలవారైరి. కాని లోక వాసనయేమియుం దెలయకపోవుట యించుక కొఱంతగా నున్నది. తోఁటకూర యని పలికెడు రామచిలుక తద్వస్తువును గురుతెఱుంగనట్లు వీరికి లోకానుభవ మేమియునులేదు. అదియే తీఱుపవలయునని వక్కాణించిరి. బుధవర్మ బిడ్డల నంతటితో విద్యాపరిశ్రమము మానిపించి ప్రతిదినము సాయంకాలమున నశ్వశకటముమీద బట్టణవీథులవెంబడిఁ దిరిగి యచ్చట విశేషముల గ్రహించునట్లు నియమించెను. అయాయీ విశేషములం దెలుప సమర్దులగు వ్యవహార వేదులఁగూడఁ దోడనంపుచుండెను. అది మొదలు రాజపుత్రులు జెలియలతోఁగూడఁ బ్రతిదినము సాయంకాలము గుఱ్ఱపుబండ్లెక్కి రాజవీధులం దిరుగుచుండిరి. వారికిఁ గనంబడిన విషయమెల్ల వింతగానే దోఁచుచుండెను. వారు విపణిమార్గంబునఁ బోవునప్పుడు బహువిధవ్యాపారములఁ జేయు వర్తకులంజూచి వీరెవ్వరు? ఈ వస్తువులెల్ల నెల్లరకు నిచ్చుచున్నారే? మంచిపుణ్యాత్ములవలెఁ దోచుచున్నారని యడిగిన సహాయు లిట్లనిరి.
'అప్పలారా! వీరు వర్తకులు నానాదేశములనుండి సరకులం దీసికొనివచ్చి యెక్కుడువెలకు నిక్కడ విక్రయించుచుందురు. దాని వలన విశేషలాభము వచ్చును. ధనికులై వస్తువాహనముల సమృద్ధముగా సంపాదించి సుఖించుచుందురు. యిదియే వీరి వృత్తాంతమని చెప్పిరి.
ఆ మాటల విని వారు 'ఇసిరో! ఇదియా వీరి వ్యాపారము స్వలాభమునకై పాటుపడుట సద్వ్యాపారము కానేరదు. పరోపకారపారీణు లనుకొంటిమే చాలుఁజాలు. మఱియొక విశేషము చూపుఁడని యచ్చటనుండి మఱికొంత దూరము నడచిరి. అచ్చటి వారి వృత్తములు చూచినను నట్లేయున్నవి. విపణి వీథియంతయుం దిరిగి యందలి జనుల వృత్తము లన్నియుఁ బరీక్షించి యడిగి యేకరీతిగా నుండుట విచారించి వారు మెచ్చుకొనక "యీ వీథి మంచిదికాదు. ఇందుఁబుణ్యాత్ము లెవ్వరును లేరు. మఱియొక వీథికి దీసికొనిపొండని" సహాయులఁ గోరికొనిరి. రెండవవీథిని నడుచునప్పు డొకచో విష్ణ్వాలయము కనంబడినది. అందలి గోపురమంటప ప్రాకారాదులు మనంబుల కచ్చెరువు గలుగుఁజేయ రాజపుత్రులు బండ్లనిలిపించి సహాయులతో శిలానిర్మితములైన యీ గృహవిశేషము లెవ్వరివి? మిక్కిలి యెత్తుగల యీముందరి మండపమందు జనులెవ్వరు నున్నట్ల కనంబడరేమి? లోపలి గృహము సైతము క్రొత్తతీరుగా నున్నది. దీని వృత్తాంతము చెప్పుఁడని యడిగిన సహాయ లిట్లనిరి. అయ్యా! ఇది విష్ణ్వాలయము. ఇందు మనల సృష్టించిన భగవంతుఁడు నివసించి యున్నాడు. ముందరిదానినే గోపురమని వాడుదురు. దానియవ్వలిది ధ్వజస్థంభము. ఆ వైపుది కళ్యాణమంటప మని యావిశేషము లన్నియుం జెప్పిరి.
అప్పుడా రాజపుత్రులు పరమభక్తితో బండ్లుదిగి యాలయము లోనికిం బోయిరి. అందున్న వైఖానసులు రాజపుత్రుల నెదుర్కొని యుచితసత్కారములతోఁ బ్రదక్షిణనమస్కార ఘంటానాదములఁ జేయించి స్వామి లోనియాలయమునకుఁ దీసికొనిపోయి భగవద్దర్శనము చేయించిరి. శంఖచక్రగదాధరుండైన శ్రీవిష్ణుదేవుని విగ్రహముఁ జూచి రాజపుత్రులు నమస్కరించుచు ఆర్యులారా! మనల సృష్టించిన భగవంతుఁ డితఁడా ? ఇందుండి జగమ్ములన్నియు రక్షించుచుండునా?" యని యడిగిన వైఖానసు లిట్లనిరి. "అయ్య! విష్ణుండు సర్వలోకవ్యాపకుండు. జగద్రక్షకుండు భక్తపరాధీనుండు. సర్వజనసేవ్యుండు. సర్వదేవోత్తముండు. ఇంతకన్న వేఱొకదైవము లేఁడని శ్రుతులు ఘోషించుచున్నవి. కావున మీరీస్వామి నారాధించుచుండుఁడు. కామితములు సిద్ధించు" నని తత్ప్రతిపాదకములైన శ్లోకములు చదివి వారి చిత్తములకు సంతోషముఁ గలుగఁజేసిరి. అంతలో సాయంకాల మగుటయు నాదినమున విహారము మాని వారు నివాసదేశమునకుం జనిరి. మఱునాఁడు వారు క్రమ్మఱ విహరించుచున్న సమయంబున మఱియొక వీథి శివాలయము సమున్నతగోపురప్రాకారమంటపాదులచే నొప్పుచు వారికిఁ గనంబడినది. దానింజూచి బలభద్రుఁడు “ఓహో! ఇది యేమి? మేము నిన్న వచ్చినవీథికే దీసికొని వచ్చితిరే! నిన్నటి యాలయము కనబడుచున్న" దని యడిగిన సహాయులు "అప్పలారా! ఇది నిన్నటి వీథికాదు. మఱియొకవీథి. ఇది శివాలయము. ఇందు జగద్రక్షకుఁడైన మహేశ్వరు డున్నవాఁడు విష్ణునివలె నీ స్వామిని ప్రజలు సేవించుచుందు" రని చెప్పిరి.
ఆ మాటలు విని వారు వెరఁగుపడుచు శకటంబులదిగి లోనికిం బోయిరి. అందున్న శైవులా వార్తవిని యెదురుకు వచ్చి రాజపుత్రులచే బ్రదక్షిణనమస్కారముల చేయించి గర్భాలయములోనికిఁ దీసికొనిపోయి “అయ్యా! సర్వలోకేశ్వరుఁడైన మహేశ్వరుం డిందున్నవాఁడుఁ ఈతఁడే మనల సృష్టించి రక్షించువాఁడు ఈతనికే మహేశ్వరుఁడని పేరునున్నది. ఇతర దైవముల కీనామము లేదు. ఇతండు భక్తపరాధీనుండు సులభలభ్యుండు సర్వదేవోత్తముఁడని శ్రుతులు ఘోషించుచున్నవి. కావున మీ రీమహానుభావు నర్చించిన గృతకృతు లగుదురని చెప్పిరి. ఆ మాటలు విని బలభద్రుండు తమ్ముని మొగము జూచి "అయ్యో! ఇది యేమి? వీరి మాటలు వింతగనున్నయవి. మనల సృష్టించినవాఁడు విష్ణుదేవుండని నిన్న వారు చెప్పిరిగదా? ఇప్పుడు వీ రిట్లు చెప్పుచున్నా రేమి? దీనిలో నేది నిశ్చయమో తెలిసికొనవలయు" నని పలుకుచుండగా విని శైవులు అయ్యా ! వినుండు. మీరు మిగుల బుద్దిమంతులు. మేము శివుఁడు సర్వోత్కృష్టుఁడని పెక్కుదృష్టాంతములు జూఁపగలము. వేదమంతయు శివపరముగానే యున్నది. విష్ణుండు శివునికి భక్తుడు ఆ మాట కప్పిపుచ్చి విష్ణువులు మీతో నతండే సర్వోత్తముఁడని చెప్పిరి కాఁబోలు. ఆమాటలు నమ్మకుఁడు. బదునెనిమిది మహాపురాణములలోఁ బదునొకండు పురాణములు శివమయ మనిఁ జెప్పిన నవి. వెనుక వేదవ్యాసుఁడు కాశీలో నారాయణుం డుత్తముండనువఱకుఁ గంఠంబుజస్థంభమైనది . మేము చెప్పనక్కరలేదు. వితర్కించిన మీకే తెలియునని యెన్నియో దృష్టాంతములు చూపి వారి చిత్తములు శివునందు లగ్నమగునట్లు చేసిరి. అప్పుడా రాజపుత్రులు వారి మాటలు నమ్మి సరే మేము రేపు వైష్ణవుల రప్పించి మా యొద్ద నబద్దము లేమిటికిఁ జెప్పవలయునో యడిగెదము. మీరును వచ్చి సమధానముఁ జెప్పుడని పలికి యాలయము వదలి బండ్లెక్కి మఱికొంత దూరము పోయిరి. అందు దుర్గాలయము కనంబడినది. దానింజూచి యిదియేమి యని యడిగిన సహాయులు అయ్యా! ఈమె యాదిశక్తి దేవతలను త్రిమూర్తులను సైత మీమెయే సృష్టించినట్లు చెప్పుదురు. జనులు మనము చూచిన దేవతలనట్లే యీ శక్తిని గూడ నారాధించు చుందురని జెప్పిరి. అప్పుడు వారు మిక్కిలి వెరఁగుపడుచు నాదుర్గ గుడిలోనికిం జనిరి. అందున్న శాక్తేయు లెదురువచ్చి తోడ్కోనిపోయి దుర్గాదర్శనముఁ జేయించి అయ్యా! ఈమె మహాశక్తి ప్రపంచమంతయు శక్తి మయము. శక్తిలేక యేకార్యము చేయలము గదా. సృష్టికి బూర్వ మీమె యొక్కరితయే యుండునది. తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నీమెయే సృష్టించినది. సర్వదేవతలతోఁ ద్రిమూర్తులు వచ్చి ప్రతిదినము సాయంకాల మీశక్తి ముందరఁ దాండవము సేయుచుందురు. ఈమె కన్ను విప్పిచూచిన లోకములన్నియు భస్మము కాఁగలవు. ఈమెకు మూఁడు కన్నులున్నవి. పెక్కేల? ఈ శక్తినే జనులెల్లరు నారాధింపవలయును. అని పెక్కు శ్లోకములు చదివి వారు మనసు సమాధానపడునట్లు చేసిరి.
ఆ మాటలన్నియు వినుటచే వారి హృదయములు వ్యాకులములైన నేదియు నిశ్చయింపనేరక యింటికి బోయిరి. ఆ రాత్రి బుధవర్మ పుత్రుల యొద్దకుఁబోయి వత్సలారా! మీరు మన పట్టణ విశేషణములన్నియు జూచి వచ్చితిరా? లోకవ్యవహారములు బోధపడుచున్నవియా? యని యడిగిన వారు తండ్రికి నమస్కరించి యిట్లనిరి.
తండ్రీ! మేము మొదట నంగటికిం బోయితిమి అందు వ్యాపారము చేయువారు పరోపకారపారీణులని సంతసించితిమి కాని వారు స్వార్థపరులని విని వారి వృత్తి నిరసించితిమి. అది యట్లుండె తరువాత విష్ణ్వాలయమునకుం బోయితమి. అందున్నవా రాస్వామి జగత్కర్తయని చెప్పిన నమ్మి సేవించితిమి. మఱునాఁడు రెండవ వీథిలో శివాలయము కనంబడినది. అందలి వారలు శివుఁడే సర్వోత్తముఁడని పెక్కు శ్లోకములు చదివిరి. తరువాత దుర్గగుడికిఁ బోయితిమి ఆ శక్తి వీరిద్దరింగన్నదనివారు చెప్పిరి దీనిలో నేదినిజము ? ఎవ్వరి నారాధింతుము ? పరస్పర భేదములు మనుష్యులతో గాక దేవతలలోఁ గూడ నున్నవియా ? ఇందలి నిజము మీరు జెప్పవలయు యబద్ధము జెప్పినవానిం దండింతుమని యడిగిన విని బుధవర్మ యిట్లనియె.
వత్సలారా ! ఈ తగవు చిరకాలము నుండి యున్నది. ఇప్పుడు తీరునది కాదు. మహర్షులు సైతము దైవమాయామోహితులై నిశ్చయింపలేకపోయిరి. వేదము విడఁదీసి యష్టాదశపురాణములు చేసిన వ్యాసభట్టారకునికే సంశయము కలిగియుండ మనుష్యులకు శక్యమా? ఎవరి కిష్టమైన దైవమును వారారాధించుచుందురు. ఇందొకటి నిజము. రెండవది యబద్ధమని యెవ్వరును జెప్పలేరు. మీకు నమ్మకము కలిగిన దైవము నారాధింపుఁడని పలికిన విని యారాజకుమారులు తండ్రి నాక్షేపించుచు నిట్లనిరి. తండ్రీ! యెవ్వరికిని శక్యముగాని పనియే మేము శక్యము చేయుదుము. దైవమాయ దెలియక మహర్షులు నిశ్చయింపలేకపోయిరిగాని మేము నిశ్చయింతుము చూడుడు. పట్టుదల యున్నచో నెట్టికార్యమైన లభ్యము కాకమానదు. ఇప్పుడు మేమా మతబోధకుల నెల్లర రప్పించి వాదము కల్పించి యందు నిగ్గు తేల్చెదము చూడు" మని పలికిన విని సంతసించుచు నారాజు “కానిండు దానివలన నష్ట మేమి యున్న" దని యంగీకరించెను.
అమ్మఱునాఁడు రాజకుమారులు తమపట్టణములో నున్న యా యాయా మతబోధకులనెల్ల రప్పించి యొకసభఁజేసిరి. కొల్వుకూటంబంతయుఁ పండితులచే నిండింపబడియున్న సమయంబున రాజపుత్రులు విచిత్రవాగ్గుంభనలచే నుపన్యసించుచు మొదట వైష్ణవులలో నిట్లు సంభాషించిరి.
రాజపుత్రులు — అయ్యా! విష్ణుండు సర్వోత్తముండని చెప్పెడు వారెవరో నిలిచి ముందరకు రావలయును.
వైష్ణ -- అయ్యా! మేము మేము అని లేచి నిలువంబడిరి.
రాజ - మీ దేవుండు సర్వోత్తముం డెట్లయ్యెను. దృష్టాంతరము లేమి ?
వైష్ణ -- వేదములు పురాణములు శాస్త్రములు విష్ణుండు జగత్కారణుండని ఘోషించుచున్నవి. నారాయణము వినుండు. అని చదువఁబోవఁగా,
రాజ - (వారించుచు) మాకు పురాణములు వేదములు శాస్త్రములు నవసరము లేదు. ప్రత్యక్షముగా జూపవలయును.
వైష్ణ --- ప్రత్యక్షము కాకేమి? నీ దేవునడెందున్నాడని తండ్రి దండింపఁగా ప్రహ్లాదునికి స్తంభమున నరసింహాకృతిని బ్రత్యక్షంబై కాపాడెను. ద్రౌపదికిఁ గౌరవసభలో నవమానము కాగా బ్రార్దించినంతనే యక్షయమైన వలువలిచ్చెను. కలిసి గాచెను. అనేక దృష్టాంతరము లున్నవి. శైవులు మిమ్ము మోసముచేసి తమమతము బోధించినారు కాఁబోలు.
రాజ - వెనుకటి కథలు మాకవసరము లేదు. ఇప్పుడేమైనఁ బ్రత్యక్షముగా నతం దేవుఁడైనట్లు కనపఱుపఁగలరా ?
వైష్ణ - అయ్యో! కనబఁడకేమి. కాకాసురుని రక్షించినది యసత్యమా? విభీషణుని రక్షించినది బూటకమా? పుండరీకుని సాకినది మృషయా? అనేక భక్తులను రక్షించిన మహానుభావుని నధికుఁడు కాడనినఁ గన్నులు పోకుండునా?
రాజ — ఓహో ! మీకు మా మాటలే యర్దముకాలేదు. వెనుకటి గాథలు వలదు. ఇప్పుడు మాకు నిదర్శనము చూపినచో మీ మతము స్వీకరింతము. లేనిచో దూరముగాఁ బొండు.
వైష్ణ – శైవులు మాత్రము శివుం డుత్తముండైనట్లు ప్రత్యక్షము చూపఁగలరాయేమి?
రాజ - ఆ మాట మీకేల మీ మతము గుఱించి మీరు మాటలాడుఁడు. మీ దైవము మీకుఁ బలుకునా ?
వైష్ణ - శ్రీరంగము, తిరుపతి, ద్వారక, కంచి లోనగునవి విష్ణుక్షేత్రములు, పైదివ్యక్షేత్రములయం దట్టిమహిమ కనబండును గాని యిక్కడ గనఁబడదు .
రాజ — ఇచ్చట మీరేమియుఁ బ్రత్యక్షముఁ జూపలేరు కాదా ?
వైష్ణ -- ఇచ్చట జూపలేము.
రాజ - దూరముగా గూర్చుండుడు. (అని మఱియు) శివుఁడు సర్వోత్తముఁడని చెప్పు పండితులు లేచి ముందుకు రావలయును.
శైవు -- చిత్తము. చిత్తము. మేము మేము.
రాజు – అవియన్నియు నేమి ?
శైవు - గ్రంథములు. వీనిలో శివుఁడు సర్వోత్తముఁడని నిశ్చయింపఁబడియున్నది.
వైష్ణ -- (లేచి) గ్రంథములు పనికిరావు. ప్రత్యక్షముఁ జూపవలయునఁట. ఇవియే నమ్మినచో మా వద్దఁ పదిబండ్ల తాఁటియాకుల కట్టల గ్రంథము లున్నవి. ఏమి ప్రయోజనము.
రాజ - మీరు లేచెదరేల? కూర్చుండుఁడు. మాటాడవద్దు మీ గ్రంథములతో మాకుఁ బనిలేదు. ప్రత్యక్షముఁ జూపవలయును.
శైవులు - అందులకు సందేహమేల? వినుండు. పూర్వ మొకప్పుడు కంచిలో నీ విషయమై వైష్ణవులకు శైవులకుఁ దగవు వచ్చినది. అప్పుడు వైష్ణవబాలు డొకండు శివభక్తుడై యెఱ్ఱగాఁ గాలియున్న చెఱకు పెనముపై నాట్యముచేయుచు శివుండు సర్వోత్తముఁడని పాడుచు గొన్ని శ్లోకములు రచించెను. అవి వినినచో మీ సందియము తీరఁగలదు.
శ్లో॥ ఏకనిపాపా భువనభీషణ కాలకూటం. అని చదువునప్పుడు,
రాజ - (వారించుచు) మీ యట్టి ఛాందసులతో మాటాడుటయుఁ గష్టముగదా ? మొదటిగాథలు వలదని చెప్పుచుండ నా కథలు చెప్పెదరేల ? అవి యన్నియు మేము వింటిమి. వానివలన నిశ్చయింప శక్యము కాకున్నది. మా యెదుట నిశ్చయము గలుగునట్లు భగవంతుడు వచ్చి చెప్పవలయును.
శైవులు - చిత్తము చిత్తము. శంకరాచార్యస్వాములవారు మధ్యార్జునములో వాదము వచ్చినప్పుడు లింగముఖముగా శివుఁ డెక్కుడు దైవమని పలికించెను
వైష్ణ - (లేచి) అబద్ధము అది యబద్ధము మీ యొద్దబొంకుచున్నారు. ఆ తగవు ద్వైతాద్వైతమతములఁ గుఱించి వచ్చినది. సత్య మద్వైతమని చెప్పినట్లు గ్రంధములో వ్రాయబడియున్నది.
రాజ - మీ యవివేకము వింతగా నున్నది. మే మెన్నిసారులు చెప్పినను వెనుకటి గొడవలే చెప్పెదరు. మీలో నొక్కరికైనఁ బ్రత్యక్షమైన విషయమున్న దియా? సరియైన యుత్తరము చెప్పనచో దూరముగాఁ ద్రోయుంతుము జుఁడీ ?
శైవు - చిత్తము చిత్తము. దివ్యక్షేత్రములలో నట్టిమహిమ గనంబడును గాని యిక్కడ నేమియుం గనంబడదు అదియే నిశ్చయము.
రాజ — మీకు దివ్యక్షేత్రము లేవి ?
శైవులు — కాశీ రామేశ్వర శ్రీశైల కాంచీ కేదారాదులు మహామహిమగల క్షేత్రములు. అచ్చటికిఁ బోయిన బెక్కునిదర్శనములు గనంబడును.
రాజ — సరియే. దూరముగాఁ గూర్చుండుఁడు. మాకు మీ మత మంగీకారము కాదు.
వైష్ణవులు – ఈ లాగున దయచేయుడు మనమందఱము నొకచోటనే కూర్చుందము. ఇక శాక్తేయులున్నారు.
శైవులు — వారుమాత్రముగా ప్రత్యక్షముఁ జూపగలరా యేమి? విచారింపనక్కరలేదు. క్షణకాలములో వారును మనయొద్దకే వచ్చి కూర్చుండెదరు. అని కూర్చుండిరి.
రాజ — శాక్తేయ లెచ్చట?
శా - (లేచి) ఇదిగో మేము. మేము.
శ్లో॥ తస్యాస్సేవానిరతమసాం, అని చదువుచుండ,
రాజ - (వారించుచు) అనవసర ప్రసంగము జేయవలదు. శ్లోకములు గ్రంథములు మాకుఁ బనికిరావు. శక్తి ప్రధానురాలైనట్లు ప్రత్యక్షముఁ జూపవలయును. వెనుకటి గాథల నమ్మము.
శా - నమ్మకున్న నెట్లు? అందఱివలెనే శక్తినికూడఁ దీసివేయుదురా యేమి? పూర్వము శంకరాచార్యులు శక్తిమతము నిరసించువఱకు నామె యతనిఁ బెక్కుచిక్కులను పెట్టినది.
రాజ — ఆ మాటలు మానివేయుఁడు ఆమె మీ కేమైనఁ బ్రత్యక్షమగుచున్నదియా?
శా -- కాకేమి పెక్కుసారులు కనంబడినది! నిరుడు మశూచి రోగములు వ్యాపించినప్పుడు డెందరికోఁ బూనినది. ఆమె యప్పుడు రక్షింపనిచో నీపాటికి మనపట్టణము శూన్యమే యగును.
వైష్ణవులు శైవులు (లేచి) అయ్యా! వట్టిది అది క్షుద్రదేవత చాకలివాండ్రకును మంగలివాండ్రకును మహాశక్తి ప్రత్యక్షమగునా. కోడిపుంజులకై వాడ్రూరక సివమాడుచుందురు. అది నిజముకాదు మీ యెదుటఁ బ్రత్యక్షముఁ జూపుఁడని యడుగుఁడు.
రాజ - నవ్వుచు వారింగూర్చుండ నియమించి శాక్తేయులతో అయ్యా ! చాకలివాండ్రకు మహాశక్తి ప్రత్యక్షమైనదని మీరు చెప్పుచున్నారు. అది యెంత యుక్తముగా నున్నదియో యాలోచింపుడు. మీ వాదమె మీరుమరచితిరి. శక్తి జగత్కారణురాలను దృఢపఱచవలయును. ఆ విషయము మాకు బ్రత్యక్షముగాఁ జూపవలయును. మీకు సమర్థతయున్నదా చెప్పుఁడు. లేకున్న దూరముగాఁ గూర్చుండుఁడు తెలిసినదా?
శా - చిత్తము చిత్తము తెలిసినది. తత్ప్రభావము శక్తి క్షేత్రముల కరిగిన స్పష్టమగునుగాని యిక్కడంతగా దెల్ల ముకాదు.
రాజ - శక్తి క్షేత్రములేవి ?
శా – కాశీ కొల్హాపురము కాంచి శ్రీశైలము లోనగునవి.
రాజ — సంతోషించితిమికాని మీ మూఁడు మతములలోఁ గూడ బ్రధానత్వము నిశ్చయించుటకు వీలులేదు. ఇప్పటికి మీరు నిలయంబులకుఁ బోవచ్చును. అందలి నిక్కువము మేమరసి ముందు మీకుఁ దెలియఁజేయుదుము. పొండని యా రాజపుత్రు లంతటితో సభముగించిరి.
రాజపుత్రు లేమతమును ప్రధానముగా నిశ్చయింపలేదు. కావున నా మూఁడు మతములవారును సంతోషముతోఁ దమతమ నెలవులకుంబోయిరి. అమ్మఱునాఁడు వివిక్తప్రదేశమున వసియించి బలభద్రుఁడు తమ్మునితోఁ గృష్ణా! వీరి వాదముల వినవిన నెవ్వరికిని సత్యము దెలియదని తోచుచున్నది. వెనుకటి కథల ననుసరించి వీరు వారివారికి నభిమతమైన దేవతల నాశ్రయించుచున్నారు. ఈ విషయము మహర్షులు సైతము నిశ్చయింపలేక పోయిరట దైవమాయన నేమియును లేనిది. తెలియక యేమోయనుకొనుచున్నారు గదా! అన్యదుర్లంభంబైన యిక్కార్యంబు మనము సాధించుకొని వచ్చితిమేని బ్రజ్ఞావంతులమగుదుము. ఇప్పుడు వీరుచెప్పిన దివ్యక్షేత్రములయందుఁ దన్మహత్త్వము విశదముకాకమానదు. పత్యక్షముఁ జూచి ప్రధానత్వము నిశ్చయింతిమేని లోకోపకారముగనుండును మనల సృష్టించిన భగవంతు డొక్కఁడుగాని యిరువురుండను అమ్మహాత్ముఁడెవ్వడో తెలిసికొనుట యావశ్యము. కావున మనము తండ్రిగారికిఁ దెలియకుండ దేశాంతరమరుగుదుము. ఒక సంవత్సరములో నన్ని విశేషములును దెలిసికొని రావచ్చును. నీవు శివక్షేత్రములకరుగుము నేను విష్ణుక్షేత్రములకరిగెదను. అందు మనస్సునకు దృఢముగా నమ్మకమైన విషయమే మనము గ్రహింపవలయు ఒకరు చెప్పినదానిని నమ్మవలదు. ఇందులకు నీ యిష్టమే" మని యడిగిన గృష్ణుండిట్లనియె.
"అన్నా! నీ యభిమతమే నా యిష్టము, నీ యూహ సమంజసముగా నున్నది. ఈ రహస్యము మనచెల్లెలు సుభద్రతోఁ జెప్పిపోవలయు లేకున్న నా చిన్నది మనలఁ గానక పరితపించెడు ఇంతకు మున్నెన్నడును మనల విడిచియెఱుంగ" దని నుడువిన విని యతండందుల కియ్యకొని యప్పుడే వారప్పడఁతియొద్దకుం జని తమయుద్యమ మెఱింగించి యల్లన నిట్లనిరి "చెల్లీ ! మేమిప్పుడు లోకోపకారకమగు పనికై దేశాటనముఁ జేయఁబోవుచున్నారము. సంవత్సరములోపునే తిరిగివత్తుము. మేమరిగిన వెనుక మనతండ్రితో నీ తెఱం గెఱింగింపుము. ఇది పరమరహస్యము మాకొఱకు నీవు చింతింతువని నీకుఁ జెప్పి పోవుచున్నాము. నీవు విచారింపవల" దని చెప్పిన విని యతన్వి కన్నీరు గార్చుచు నిట్లనియె.
"అన్నలారా! పుట్టిననాటఁగోలె మిమ్మువిడిచి యుండలేదు. తల్లిదండ్రుల కన్న మీ యొద్దనే నాముద్దు చెల్లుచుండును. మీరు దేశాంతర మరుగుఁ నొంటిగా నింటనుండజాలను నాకుఁగూడ నొకపని నియమింపుడు. నమ్మకముగాఁజేసి జన్మము సార్థకము నొందించుకొనియెదను. పరదేశమున నాఁడుదాని వెంటఁ దీసికొనిపోవుట శ్రమకరంబని సంశయింపవలదు. నేనుగూడ పురుషవేషము వైచికొని తిరిగెదను. మీ రనుమతింపక తీఱదని పలికిన వారెట్టకే నంగీకరించి శక్తిమహిమ నరయ నత్తరుణికి వంతువైచి నాఁడే ప్రయాణసన్నాహములు గావించుకొని విలువగల రత్నములు బంగరునాణెములు సంగ్రహించుకొని తండ్రికిఁ దెలియకుండఁ గుఱ్ఱములెక్కి కాశీమార్గంబునంబడి యరిగిరి. వారు మువ్వురు కొంతదూరము కలిసియే యరిగిరి. కాని యా క్షేత్రములు నలుదెసలం గలుగుటచేఁ బిమ్మట నేకముగా బోవుటకు వీలుపడినది కాదు. మువ్వురు మూఁడు దెసలకుం బోయిరి.
బలభద్రుండు తొలుత వేంకటగిరికరిగి యందుఁ బాపనాశన గోవర్ధనాది తీర్థంబులఁ దీర్థంబాడి వెంకటేశ్వరుని సేవించి యందుఁగల యద్భుత విషయంబుల నెల్ల విమర్శించి యెందును దైవశక్తి యున్నట్లు కనంబడమిఁ దైర్థికుల నిందించుచు నచ్చటనుండి కాంచీపురంబున కరిగెను. అతఁడు కాంచింగల పుణ్యతీర్థంబుల సేవించి వరదరాజస్వామి నర్చించి వైష్ణవులతోఁ దత్ప్రతిపాదములగు ప్రసంగములు గావించి తన మది కించుకయు నమ్మకము జనింపమి నందుండి శ్రీరంగమునకుఁ బోయెను. ధారు వైకుంఠంబన ప్రసిద్దివడసిన యా దివ్యక్షేత్రమున నా రాజపుత్రుఁ డొకమాసము వసించి పరకానదీ నదృశంబగు కావేరిం దీర్థములాడుచు రంగనాయకుని సేవించుచు వైష్ణవులతో ముచ్చటించుచుఁ దన్మహిమ నరయుచుండెను. కాని యేదియుఁ దనమది కచ్చెరువుఁ గులుగఁజేసినదికాదు. అతండారీతిఁ బుడఁమి గల విష్ణుక్షేత్రంబులం దిరిగెను. ఎందును దనమదికి నమ్మకమైన మహిమ నేమియుంగానక విష్ణు భక్తులఁ బరిహసించుచు దైర్థికుల నాక్షేపించుచుఁ గ్రమంబున ద్వారకకుఁ జనియె. అందుఁగల తీర్థవిశేషము లరయుచు మృతినొందిన వారియెమ్ముల శంఖచక్రగదా చిహ్నము లుండునని చెప్పినమాటల యథార్థముఁ దెలిసికొను తలంపుతోఁ బితృవనంబుకుబోయి యస్థులం బరీక్షించుచున్న సమయంబున నాదారిని కృష్ణుండు గుఱ్ఱమునెక్కి వచ్చుచుండెను.
వానింజూచి సంతసముతోఁ బిలిచిన నతండును బలభద్రుండని యెఱింగి గుఱ్ఱముదిగి దాపునకు వచ్చి యన్నం గౌఁగలించుకొనియెను. అతండును దమ్ముని గౌఁగలించుచుఁ గుశలప్రశ్న చేసి మనచెల్లె లెందున్నదో యెఱుఁగుదువా? ఎందుండి వచ్చుచున్నావు? విశేషము లేమైనం గనంబడినదియా? యని యడిగిన నతం డన్న కిట్లనియె. “ఆర్యా! నీ వీ స్మశాన భూమింగూర్చుండి యేదియో వెదకుచుంటివేల? నీ వెందెందుఁ దిరిగితివి? ఇక్కడి కెప్పుడు వచ్చితివి? గ్రామములోనికిం బోవుదము రమ్ము మన సుభద్రయు రాత్రికిచ్చటికి రాఁగల" దని పలికిన నతఁడు "తమ్ముఁడు నేను బుడమిఁగల విష్ణుక్షేత్రములన్నియుం దిరిగితిని. ఎచ్చటను దైవశక్తి యేమియుం గనఁబడలేదు. మూఢమానవు లా యుత్సవములుచూచి సంతోషించుచుందురు. ఇచ్చటఁ జచ్చినవారి యెమ్ములలో శంఖచక్రాది చిహ్నములు గనంబడునని కొందఱు చెప్పిరి. ఆ విషయము విమర్శింప నిచ్చటికి వచ్చితిని. ఇంతలో నీవు కనంబడితివి. చూడుమిదిగో యీ గీఁతలం జూచి శంఖచక్రము లని లోకులు భ్రమయుచుందురు. ఇవి నీ కెట్లు కనంబడుచున్నవని యడిగిన నతండుచూచి యివి గీఁటులేకాని చిహ్నములు కావని నిశ్చయించి చెప్పెను.
పిమ్మట వారిరువురు వీటిలోనికింబోయి యొకచో నివసించిరి. కృష్ణుం డన్నతో “నేనును దేశమెల్ల గ్రుమ్మరితిని. శివక్షేత్రములన్నియు వితర్కించితినిగాని యెందు నే మాహాత్మ్యము గనంబడలేదు. కాశీపట్టణములో రెండునెలలు వసియించితిని. అందు మృతినొందు జనుల చెవులలోఁ దారకేశ్వరుఁడు తారకమంత్ర ముపదేశించుననియు దానంజేసి కుడిచెవి పైకి వచ్చుననియు జెప్పిరి. ఆ విషయము వితర్కించితిని. జంతువుల కచ్చట నట్లువచ్చుట మాత్రము నిక్కువమగును. తరువాత నొక చార్వాకసిద్ధాంతి గనఁబడియెను. వానితో నీ విషయము ముచ్చటింపఁగా నది దైవరహస్య మనియు నచ్చట భూమియందున్న యుష్ణమున మరణకాలమం దవయవముల గాల్చు ననియుం జెప్పి నా సందియముఁ బోగొట్టెను. అంతకన్న వేఱొక్క విశేష మేదియు నాకుఁ గనంబడలేదు. తరువాత నేను హరిద్వారమునకుఁ బోయితిని. అచ్చట మహాపందయున్నదని చెప్పఁగాఁ దన్మాహత్మ్యమును విమర్శించితిని. అదియును బూటకమే యైనది.
అచ్చటనుండి గంగోత్తర కరిగితిని. అందు మన చెల్లెలు సుభద్ర కనంబడినది. దానిని నేను గుఱుతుపట్టలేకపోయితిని. నన్నది గుఱుతుపట్టి నా యొద్దకు వచ్చినది. మేమిద్దరము చూచి వచ్చిన విశేషములం జెప్పుకొనుచు రెండు దినములందు వసించితిమి. అదియు శక్తి క్షేత్రములన్నియుం జూచి వచ్చినదఁట. ఏ దైవ శక్తియు గనంబడలేదని చెప్పినది. తరువాత మేమునీ జాడఁ దెలిసికొనుచు నింటికిఁ బోవలయునని నిశ్చయించి బయలుదేరితిమి. ద్వారవతి విష్ణుక్షేత్రమగుట నీ విందుండుదువేమో యని యరసిపోవ నీయూరు వచ్చితిని. సుభద్ర యీ ప్రాంతమందొక శక్తిక్షేత్రం బున్నదని యెవ్వరో చెప్పఁగా నది చూచి వత్తునని యరిగినది. రాత్రికి మనలం గలిసికొనఁగలదని యా వృత్తాంతమంతయుం జప్పెను. ఆ చరిత్రమంతయుం విని బలభద్రుండు "తమ్ముఁడా? మన మాకాశకుసుమంబునకుంబోలె లేని వస్తువునకై వృధాశ్రమ పడితిమి. మన తండ్రి మనలం గానక యెంత చింతించు చుండునోకదా? మన మిల్లువెడలి సంవత్సరము కావచ్చినది. ఏదియో గొప్ప ప్రయోజనము నిర్వాహకముఁ జేసికొనిపోయి యెక్కుడు పేరు పొందవలయునని తలంచితిమి. అంతయు దబ్బర, దైవమేలేఁడు. స్వభావము చేతనే యీ ప్రపంచకము సృష్టి స్థితిలయములఁ బొందు చున్నదఁట? దీప మాఱిపోవునట్లు మనుష్యుడు చచ్చుచుండును. పునర్జన్మాదులు లేవు. సుకృత దుష్కృతముల మాటకల్ల. సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. ఆనందమే ముక్తి. ఇంతకన్న వేఱొక మోక్షము లేదు అని యొక క్షేత్రంబునఁ వారసిల్లిన చార్వాక సిద్ధాంతి యొకఁడు చెప్పియున్నాఁడు. అప్పుడతని మాటలు పాటించ నైతిని గాని యిప్పుడవియే నిక్కువములని తోఁచుచున్నవి. ఈ క్షేత్రములన్నియు దైవముల పేరు చెప్పి ధనము లాగుటకై మనుష్యులచేఁ గల్పింపబడినవి. కాకున్న నొక చోటనైన నించుకయు దృష్టాంతము గనంబడకుండునా ? మన పురాణగాథలు వినినచో దైవము భక్తుల వెంట దిరుగుచున్నట్లు స్పష్టమగుచున్నది. అవి యన్నియు కల్పితములు. మన మీపాటికి నింటికింజని నాస్తికమతమె యవలంబింతుము దాన సౌఖ్యము మెండుగా గలుగునని యుపన్యసించిన విని కృష్ణుండును దాని కనుమోదించెను. ఇంతలో సాయంకాల మగుటయు సుభద్ర వచ్చి వారితోఁ గలసికొనినది. ఆ రాత్రి యెల్ల వారు తాము చూచిన వింతల నొండొరుల కెఱింగించుకొనుచుఁ ద్రుటిగా వెళ్ళించిరి.
అమ్మఱునాఁడు రాత్రి వారు స్వదేశగమనలాలసులై ప్రయాణసన్నాహముఁ జేసికొని జాము ప్రొద్దున లేచి గుఱ్ఱము లెక్కి తూరుపు ముఖముగా నడువఁదొడంగిరి. అప్పటికిఁ చీఁకటిగానున్నను నక్షత్రముల వెలుతురున మార్గము గుఱుతుఁ జూచికొని నడుచుచుండిరి. ఆ రీతిఁ బెద్ద తడవు నడిచినను దెల్ల వాఱినది కాదు. అప్పుడు బలభద్రుఁడు, తమ్మునితోఁ గృష్ణా మనము ప్రొద్దు తెలియక పెందలకడలేచి పయనము చేసితిమి. ఎంత సేపటికిని దెల్లవారకున్నది. మబ్బు గ్రమ్మినది కాఁబోలు గగనమున నక్షత్రములు గనంబడుటలేదు. దానంజేసి యంధకార మెక్కువ యగుచున్నయది. గుఱ్ఱములు దారి తెలియక తొట్రుపడుచున్న యవి. సుభద్ర గుఱ్ఱము నడిభాగమున దాపుగా నడిపింపు మనుము. ఈయంధకారము మనబోఁటులకు భీతిగలుగఁ జేయుచున్నదని పలుకుచు గుఱ్ఱము మెల్లఁగా నడిపింపఁదొడంగెను. ఎంత సేపటికిఁ దెల్లవాఱినది కాదు. చీఁకటి క్రమక్రమముగా వృద్ధికాఁ జొచ్చినది . మార్గము తప్పినది పొదలు వృక్షములు లతలు గమనమునకు నంతరాయముఁ గలుగఁ జేయఁ దొడంగినవి. గుఱ్ఱములు ముందు తెరపిగానక యొకచో నిలువంబడినవి. అప్పుడు వారు వాఱువముల దిగి చూడ భూమియంతయుఁ గంటకావృతమైయున్న యది అడుగు పెట్టుటకుఁ జోటు దొరికినదికాదు. విస్మయ సాధ్వసంబుల చిత్తం బుత్తల పెట్టఁదత్తరముతో మెల్లన నడుగులిడి కంటకంబులఁ దప్పించుకొని యొకచోఁ గూర్చుండి మన్నును మిన్నునుగానక దిగ్ర్భమఁ జెందుచు లోకబాంధవునిరాకకై యెదురు చూచుచుండిరి.
వారు గగనముదెస మొగములు పెట్టుకొని చూచుచుండ నెంతవేళకుఁ దెల్లవాఱుజాడఁ గనంబడినదికాదు. అప్పుడు సందియము గలిగి బలభద్రుడు తమ్ముడా ! ఇది ప్రళయమువలెఁ గనంబడుచున్నది. మనము బయలుదేఱిన వేళను బట్టిచూడ నేఁడెనిమిది జాములై నట్లున్నది. అక్కడఁ దెల్లవాఱుచుండఁగ బయలు వెడలితిమి. చీఁకటి క్రమముగా నధికమగుచున్నది. కాని తెల్లవారు జాడఁ గనంబడదు. అది యేమి యుపద్రవమో తెలియదు. మన మిప్పుడు నిద్రఁబోవు చున్నామేమో? స్వప్నములో నీలాగున వింతలు కనంబడును. నీ మదికిట్లు తోఁచుచున్న దేమో చెప్పమని యడిగినఁ గృష్ణుండు విస్మయ మభినయించుచు నిట్లనియె "అన్నా! నీవన్న ట్లిది యకాండప్రళయమువలె నున్నది. దీని స్వప్నమని యెట్లు చెప్పనగు. మనము మువ్వురము ద్వారవతినుండి గుఱ్ఱము లెక్కి బయలుదేఱి వచ్చితిమి గదా! నిద్ర యెక్కడఁ బోయితిమి. నిద్రలేనిదే స్వప్నము వచ్చునా? ఇది యేదియో యింద్రజాలము కాని యదార్ధము కాదు' అని పలికెను. అప్పుడు సుభద్ర విస్మయ మభినయించుచు “అన్నలారా! ఇది యింద్ర జాలమును స్వప్నమును గాదు. దీనిని దైవమాయ యని యూహింపుడు మనము దైవము లేఁదనియు వేదశాస్త్ర పురాణాదులు మృషలనియు బుణ్యతీర్థములు మనుష్యకల్పితమనియు నిందించుచు నాస్తికమతము స్వీకరించి బయలు వెడలితిమి. దానంజేసి భగవంతుఁడు తన మాయ యిట్టి ప్రదేశమున మనల మహాంధకారకూపంబునఁ బడవైచినాఁడు. కానని నిద్దచీకఁటి యెన్నడైన జూచితిమా! ఇంతసేపు తెల్లవారకుండునా పెద్దతడవె నట్లు మన యాకలియే చెప్పుచున్నది. అమ్మహానుభావుని వేఁడుకొనుటయే యిప్పుడు కర్జము అంతకన్న వేఱొక సాధనము లే"దని పలికినది. ఆ చిన్నదాని మాటలు విని వారును మనంబున సందియమందుచు నంతకుమున్ను నిందించిన వాక్యములన్నియుఁ బరీక్షార్థమే కాని యథార్థములు కావని లెంపలు వాయించుకొనుచుఁ బశ్చాత్తాపచిత్తములతో నమ్మహాత్ము నిట్లు స్తుతించిరి.
సీ. కాశి కేగఁగఁ గానఁ । గారాక రామేశ్వ
రమునకుఁబోవ ద । ర్శన మొసంగఁ
కల కంటిలో జాడఁ । దెలుపక వేంకటా
చలమునఁజూడ సా । క్షాత్కారింప
కమరాద్రిఁ గనఁగఁ బ్ర । త్యక్షంబుగాక సా
కేతంబునను నెమ । కినను లేక
కేదారమాయావు । రాదితీర్థములఁగా
లించి వెదకిననుఁగా । న్పించవై తి.
గీ. హరివొ హరుఁడవొ శక్తివో । యనుచు నిన్ను
నయ్యయ్యో ? తెలియనట్టి మ । మ్మంధకార
కూపమునఁ గూలఁ ద్రోయుదే కోపమునను
సకలజకదీశ సర్వేశ । శరణు శరణు.
అని ఫాలంబులం గేలుగీలించి వారు నుతింపుచున్న సమయంబునం దళుక్కుమని యొక్కమెఱపు మెఱసినది. ఆ మెఱపు వెలుతురున నాప్రాంతమం దొకమందిర మున్నట్లు కనంబడుటయు బలభద్రుఁడు లేచి తమ్ముడా! దాపున ద్వారము కనంబడినది చూచితివా? ఈగృహ మెవ్వరిదో యరసి వచ్చెద. వెలుతురు వచ్చుదాక మనమందు విశ్రమింతమని పలికి తడవుకొనుచుఁ బదియడుగు లటు నడచెను. అప్పు డతఁడొక బిలములోఁ బడిపోయి హా! కృష్ణా! హా! తమ్ముడా! హా! సుభద్రా! హా! చెల్లెలా! నేనొక గోఁతిలోఁ బడిపోయి జారిపోవుచుంటి. మీ కంటికి నేనిఁకఁ కనంబడనని యొక్క కేక పెట్టెను. ఆ ధ్వని విని వారదరిపడి హాహాకారముతోఁ బరుగిడి యతండు పడిన గర్తములోనే పడిరి. కాని వానిం గలిసికొనలేక పోయిరి.
పాతాళబిలము కథ
బలభద్రుం డట్లు పాతాళవివరంబునం బడి యొడలు నొవ్వకుండఁ జుట్టు నిసుమురేణువులు రాచికొనుచుండ జాఱిజాఱి స్మృతి తప్పి పదిదినంబుల కొకకొండశిఖరంబునం బడియెను. దూరపతనశ్రమవలన నించుక తెలివి వచ్చిన నతండు కన్నుల దెఱచి చూచి యగ్గిరికూటంబు హాటకతటఘటితంబై పృధుల వివిధరత్న . ప్రభాధగద్దగితంబై ఫలితవికసివిత లలిత తరులతామనోహరంబై మధుర జలనిర్ఝర పరిపూర్ణంబై యొప్పుటంజేసి విస్మయావేళ వివశహృదయుండై యొక్కింత తడవు ధ్యానించి యందలి మలయమారుత పోతంబులు మేనికి హాయి సేయ నించుక బలము కలిగి లేచి కూర్చుండి నలుమూలలు సూచుచు నాకలియుం దప్పియుఁ బెద్దతడవునుండి బాధించుచున్నవి గావున నచ్చటి ఫలంబులంది కోసికొని కడుపునిండఁ దిని నిర్ఝరజలంబులం గ్రోలి యందలి వింతలం జూచుచు నిట్లు ధ్యానించెను. అయ్యో? భగవంతుని మహిమ దెలిసికొనుట కడుదుర్బటముగదా. మేమెద్దియో పేరువడయుదమని తగని పనికిఁబూనికొని పెద్దలమాట నిరసించితిమి వృద్ధాచారములేల యసత్యములగును? భగవంతుని బాషాణప్రాయునిగాఁ దలంచి నిందిచుటచే నతండు నన్ను బంధువుల కెడఁజేసి యీ యధోలోకమునం బడవేసెను. పోనిమ్ము. మా తమ్ముడును, జెల్లెలును సుఖించినం జాలుఁగదా? అక్కటా? మఱచిపోయితినే? గాఢాంధకారబంధురంబైన కంటకప్రదేశముల నుండి వా రేయధోగతిం బొరసిరో? అధోగతిం బొరసినను నా పనియే మేలైనది. ఆహా! ఇచ్చట సూర్యుఁడు లేకున్నను నిట్టి వెలుతు రెచ్చటినుండి వచ్చుచున్నదోగదా? తెలసినది. రత్నప్రభలే పట్టపగలు చేయుచున్నవి.
అన్నన్నా ! ఈ శైలంబు కైలాసంబో మేరుగిరియో కావలయుం గానిచో నిందుగల పాషాణంబు లన్నియు రత్నములు, భూమి యంతయు బంగారముగా నేమిటి కుండును? స్వర్గమనునది. యిదికాదుగద! ఈ వృక్షంబులు కల్పవృక్షంబువలెఁ దోఁచుచున్నవి. కాదు స్వర్గము మీదుగా నుండునందురు. అయ్యో? ఇది యంతయు నిక్కువమని నేను భ్రమపడుచుంటిని స్వప్నములో నీవింత లన్నియుం గనంబడుచున్నవి కాఁబోలు. ఇది కలగాదని యిందాక మేమనుకొంటిమే. అ ట్లనుకొనుటయు స్వప్నములోని వార్తలే కావచ్చును. ఏదియుంగాదు. దైవమాయ యని నిశ్చయించినమాట మఱచిపోయితినేల ఏది యెటులయిననేమి. ఈ గిరిశిఖరవిశేషంబు లరసెదంగాక.
అని యనేకప్రకారంబులఁ దలంచుచు బయలువెడలి యప్పర్వతశృంగశృంగాటకంబునం బర్యటనంబుఁ గావింపఁజొచ్చెను. అట్లు తిరుగుచుండ నక్కొండ ప్రక్క మిక్కుటమగు వేగమున గొప్ప చప్పుడు లుప్పతిల్లం బెల్లుకొను వెల్లువంబోలెఁ బరాగ శూన్యంబై గాలివిసరఁజొచ్చినది. త్రిశూలధారులును విభూతి రుద్రాక్షమాలికాలంకృతులు బాలశశాంకశేఖరులు నగు పురుషులు కోటానకోటులు దాటియాకులవలె నా గాలిలోఁ గొట్టుకొని పోవుచుండిరి తుదమొదళ్ళు లేక యేకరీతిగా విసరుచుండెడి యా జంఝామారుతప్రవాహములో నా పురుషులు కట్టెలయట్టుల గొట్టుకొని పోవుటఁ జూచి బలభద్రుండు విస్మయ సాధ్వసంబులు చిత్తంబుత్తల పెట్ట నయ్యో! ఈ గాలి సోకినంత పర్వతములైన నెగిఱిపోవును. ఈ గిరిని సోకకుండ నొకదండగాఁ బోవుచున్నది. క్రమక్రమముగా దీనిమీఁదికి వచ్చునేకదా. వచ్చినచో నేనీగిరితో ధిమో పింజమువలె నెగిఱిపోవుదును. ఇఁక బ్రతుకెక్కడిది. ఈ శైలమున సుఖముగాఁ నుందమనుకొన్న నీ యుపద్రవము తటస్థించుచున్నది. అన్నా! స్వర్గమునకుఁ బోయినను నిడుములు నన్ను విడువవు కాఁబోలు నని విచారించుచుండ నా గాలి కొంచెము దూరముగా మఱియొకదెస కరుగుచున్నట్లు కనంబడినది.
అతండప్పుడు కొంత సంతసించుచు మఱియొకమూలకు పోయి యచ్చటి విశేషములు చూచుచు నరుగుచుండ నొక్కచో రత్నసానుకవాటమండితంబైన ద్వారమున నలంకరింపబడిన గుహయొకటి కనంబడినది. ఆ ద్వారముఖస్థగితరత్నరుచిని చయములు కన్నులకు మిరుమిట్లు గొలుపఁ బలుతెఱంగుల వెఱఁగుపడుచు నతం డతి సాహసముతో నా గుహలోఁ బ్రవేశించి నడువఁ జొచ్చెను. పెక్కేల? అందుగల వింతలు వైజయంతమున సైతము లేవని చెప్పవచ్చును. జనశూన్యంబైన యిక్కందరాంతర మిట్టి యలంకారమున భాసిల్లుటకుఁ గారణమేమియో యరసెదంగాక యని పోవఁబోవ నొకచోటఁ గళ్యాణమంటపము కనంబడినది. నవరత్నకల్పితములైన స్థంభములచే శోభిల్లు నామంటపమధ్యభాగమునఁ బెండ్లిపీట వేయఁబడియున్నది. దాని ముందర వివాహమంగళకృత్యమునకుఁ గావలసిన సామగ్రియంతయు సవరింపబడి యున్నది. వధూవరులు ధరింపఁదగిన రత్నభూషాంబరము లద్భుతదీప్తిదీప్తము లగుచుండ నొకకనకపాత్రంబున నమరుపఁబడియున్నవి. పుణ్యాహవాచకకలశములు రసాలకిసాలాచ్ఛాదితములై యున్నవి. ఆ సామగ్రియంతయుఁ జూచి బలభద్రుండు ఓహో! నాకుం గన్నులు కలిగినందులకు నేఁడుగా సాద్గుణ్యమైనది. మనుష్యుల కెన్నడైన నిట్టి యద్భుతవిషయంబులఁ జూడ తటస్థించునా? ఇందుగల యొక రత్నమునకుఁ భూలోకమునంగల సంపదయంతయుఁ దులకాదు. నేను పూర్వజన్మమున సుకృతమేల చేసితిని. మా తమ్మునికిఁ జెల్లెలికి నిట్టి వింతలంజూపు భాగ్యము లభించినదికాదుగదా! నేనుబడిన బిలములో వారునుం బడినచో నిచ్చటికి వత్తురు మేము కలిసియే యిట్టి వింతలం జూచినచోఁ జెప్పనేల? ఈ మండపము దేవతలు పెండ్లియాడు కళ్యాణమంటపము కాఁబోలు. ఇప్పు డెవ్వరికో బెండ్లిచేయుటకై సర్వసన్నాహములు చేయఁబడి యున్నవి. అదియు నా కన్నులం బడినచోఁ గృతార్థుండ నయ్యెదను.
అని తలంచుచున్నంతలో నతనికి మంగళవాద్యధ్వనులు వినంబడినవి "ఓహో! పెండ్లివా రిచ్చటికే వచ్చుచున్నారు కాఁబోలు? ననుఁజూచి శపించరుగద! ఏల శపింతురు? నేనేమి తప్పుజేసితిని. పోనిమ్ము కానున్నది కాకమానదు. ఇది యంతయు నా ప్రయత్నముననే వచ్చినదా యేమి? యని తలంచుచు వారిరాక కెదురుచూచుచుండెను. అప్పుడా దరీమందిరమునుండి కొందఱు పురుషులును స్త్రీలును వచ్చిమాల్యాంబరాభరణాదులు ధరించి ముందర మంగళవాద్యములు మ్రోగుచుండఁ పదియాఱేఁడుల ప్రాయముగల పెండ్లికూఁతుం బల్లకిలో నెక్కించుకొని యచ్చటికి వచ్చి యా మంటపముపై విడసిరి.
దివ్యమంగళవిగ్రహముగల యా పెండ్లికూఁతుంజూచి బలభద్రుఁడు మోహనిద్రావివశుండై అయ్యారే! ఇయ్యలనాగం బెండ్లియాడిన వానిదిగదా జన్మము. వాఁడు పూర్వజన్మమున నెట్టితపంబులఁ గావించెనో? ఎట్టి దానధర్మముల నాచరించెనో! ఎట్టి పుణ్యకార్యంబులం జేసెనోకదా! కాకున్న నిట్టి చక్రవాకస్తని నిట్టి వైభవముతోఁ బెండ్లియాడఁగలుగునా! సీ! మనుష్యలోకముకన్నఁ బాడులోకమేదియునుం లేదు. భూలోకమునం గల కలకంఠుల సోయగమంతయుం గలిసినను నీకలికిమిన్న నఖాంచలమునకు సాటిగాదు. ఇసిరో! మేము చక్రవర్తులమనియు సార్వభౌములమనియు గర్వించు నృపతుల యైశ్వర్యమంతయు నిక్కాంతారత్నము కనిష్టకాంగుళీయరత్నమున కెనగాదు. ఇట్టి జగన్మోహినిం బెండ్లియాడు పురుషుఁ డెంతవాడో? ఎట్టి సోయగముగలవాఁడో? యెట్టి యైశ్వర్యము గలవాఁడో? చూచి వినోదించెదంగాక? అదియే నా జన్మమునకుఁ జాలునని తలంచుచు నందొకమూల నొదిగి యా వింతలం జూచుచుండెను.
అప్పుడు వారిలోఁ బురోహితుండు గురుపీఠంబునం గూర్చుండి ముహూర్తము సమీపించుచున్నది. పెండ్లికొడుకుం దీసికొనిరండు. సంకల్పము జరిగించ వలయునని పలుకఁగా నచ్చటివారి చూపులెల్ల బలభద్రునిపై వ్యాపించినవి. పిమ్మట నతఁడే యతఁడే యను ధ్వని యొకటి బయలువెడలినది. అప్పుడు బలభద్రుడు బెదురుగదురఁ దెల తెలఁపోయి చూచుచుండెను. అంతలో నిరువురుకాంత లతని చెంతకువచ్చి చేతులుపట్టుకొని రమ్ము రమ్ము నీవు పెండ్లి కొడకవైతివి. మంగళస్నానము చేయింతుమని పలుకఁగా నతం డానందసాగరనిమగ్నహృదయుండై యేమియుం దెలియక యేమియుం బలుకనేరక వారు చెప్పినట్లు చేయుచుండెను.
ఆ యువతు లతని దీసికొనిపోయి పన్నీట స్నానము చేయించిరి. మఱికొందరు సుందరులు తడియొత్తిరి. వేఱొకరు ధూపమువైచి తలయార్చిరి. ఇంకొకరు నూత్నమాల్యానులేపనాభరణాదుల నలంకరించిరి. పురోహితుండు ఫలయుక్తంబగు తాంబూలంబు జేతికిచ్చి తీసికొనిపోయి వివాహవేదికాపీఠంబునం గూర్చుండఁబెట్టి బెట్టిదముగఁ దూర్యనినాదములు మ్రోగుచుండ సంకల్పముఁ జేయించి యథావిధిఁ బుణ్యాహవాచనపూర్వముగా వైవాహికమంత్రంబులు పఠించుచు నయ్యించుముఁడిని దెరమఱుగున నుంపించి పాణిగ్రహణవిధి జరిపించెను. పిమ్మట నతం డాకొమ్మ కంఠమ్మున మంగళసూత్రంబు ఘటియించెను. తరువాత వారొండొరులు ముత్తెములతోఁ దలంబ్రాలు పోసికొనిరి. అట్టి సమయమునం నతనిడెందమునం గల యానందం బెట్టిదని చెప్పుటకు జిలువఱేరికైన వశంబుగాదుగదా! పిమ్మట నా పొన్నకొమ్మ నతనిచెట్ట బట్టించి వారెల్ల మెల్లమెల్లగా వచ్చినదారింబట్టి యాకందరాంతరంబున కరిగిరి. అప్పుడు బలభద్రుండు మేనఁ జెమ్మటలుగ్రమ్మ సిగ్గునం దలవాల్చి తన ప్రక్కనిలిచియున్న యజ్జవరాలి సోయగము పలుమాఱు సూచుచు మోము చెన్నుఁ జెక్కులఁతళ్కు నుదురుపౌరుఁ గైవారముసేయుచుఁ బల్కరింపఁబోయి డగ్గుత్తిక వెలుంగురాక తలయూచుచు నాచిగురుఁబోడి చేయిపట్టుకొని యా మంటపము దక్షిణ భాగముగా బదియడుగులు నడిచెను.
అందొక యుద్యానవనము నందనమువలె వారి కన్నులకు విందొనరించినది వింతలపై వింతలు గనంబడుచుండ నత్యంత సంతోష సాగరమున నీదులాడుచుఁ దన పూర్వ వృత్తాంతము మఱచి యత్తరుణీలలామ చిటికెనంబట్టికొని కొంతతడ వత్తోటలో విహరించెను. తరువాత నా నాతిని మాటలాడింపదలచి యొక లతామండపమునఁ గూర్చుండి యింతీ! నీ పేరేమి? ఎవ్వరి కూతురవు? ఈ లోక మెయ్యది? నీ వృత్తాంతము వాక్రుచ్చి నాకు వేడుక నొనరింపుము. నీ మృదుమధుర సంభాషణము లాలింప మదీయశ్రవణంబులు సంతసము జెందుచున్నవి. సానునయనముగాఁ బలికిన నచ్చిలుకలకొలికి కలికిచూపు లతనిపైఁ బరగించుటయేగాని యేమియుఁ బ్రత్యుత్తర మిచ్చినదికాదు. అప్పు డతండు సందియమందుచు నీ యోషామణికి నా భాష తెలిసినది గాదా? లేక సిగ్గునం బ్రత్యుత్తరమిచ్చినదికాదా! ఆహాహా! నా చరిత్ర తలంచుకొనిన నబ్బురమిట్టిదని తలఁపశక్యము కాదు. నే నెవ్వఁడ నీ జవ్వని యెవ్వతె? ఈ గుహ యెక్కడ? క్రొత్తవాఁడనగు నన్నుఁ బరీక్షింపక నాకీ కన్యకం బెండ్లి చేయుట యెట్టిది? నే నిచ్చటికి వత్తునని యంతకుమున్ను వీ రెఱుంగురా యేమి? ఇది యంతయు నిక్కువమే! కాదు కాదు. కలయే యైయుండవచ్చును. అగుంగాక! ఇట్టి నెలంత నాచెంతఁ బత్నిగా నిలిపిన భగవంతునియుపకృతి యెంతయని కొనియాడుదును దీని హృదయముఁ దెలిసి విహరింపవలయును. అనుకూలముగానే యున్నట్లు తోఁచుచున్నది. చిటికెనవ్రేలి యుంగరముల మార్చిన నంగీకరించినదికాదా? మఱియు నే నెటకరిగిన నటకు నంటివచ్చుచుండుటయు బ్రీతికి సూచకమే. మాటాడకున్న నేమి? శృంగారలీలలు వెలయించి సిగ్గు వాయఁజేసెదఁ గాక యని తలంచుచు నల్లన నప్పల్లవపాణి యధరపానకంబు గ్రోలంగను నుంకించు సమయంబున మున్నుజూచిన సోకుదయ్యము చప్పుడు వినంబడినది.
ఆ ధ్వని విని యతం డదరిపడి బెదరుతో నలుదెసలం బరికింప నొక పెడదాపుననే యుద్యానపాదపంబుల మొదలంట నూడనెగర జిమ్ముకొనుచు నా జంఝామారుతప్రవాహము వడివడిగా విసరుచుండెను. దానింజూచి యతండు బెబ్బులిం గనిన సారంగము తెఱంగున నంతరంగమున జడియుచుఁ గర్తవ్యము దెలియక యా కలికి చేయింబట్టుకొని రెండవదెసకుఁ బరుగిడ దొడంగెను.
అంతలో నా జంఝామారుతం బాక్రమించి యుద్యానతరులతావితతితోఁ గూడ నా దంపతుల దూదిపింజలవలె నెగరజిమ్మినది. బలభద్రుం డొకసుడివిసరునం ... మన మత : మనం ఆ వ్పాకుంబోలె గిరగిరం దిరుగుచు మన .. ఆ కనుల పంచిన ప్రస్తరంబుభ్రంగి గాలివిసరుస నెగిరి సిప... అంది.... - 18 - | | నలు, అలుపెరచిచూచి యతండు విస్మయము ముల స్వప్నం కలిసివచ్చినదె : అయ్యారే ! ఆ స్వరు లయను మూట మఱచి పలవరించు అ... సూర్యోదయమగుచున్నది మా "", " . . . మ యను కొనుకున్నాను. నిద్రబోవనిదే A 10 నులములోఁ బడినపిమ్మటగదా యా మన ఆ కల మన చు. సక్కువముగాదు. మహామాయ 4:11. . . . . . . . . . యన్న ది. అ.. పలుగతులఁ దలంచుచుఁ దమ్ముచా : కృష్ణా : న , ముచ్చస్వరం - . లుపుచు నలుచేసల దినగఁజొచ్చెను. అప్పదం తరుపు క్రిందఁ బరుండియున్న తమ్ము నింబూచి చేరఁజని పేర ...లచి లేవనెత్తుయు నతఁడు కన్నులు సులిమికొనుచు హా! ప్రేయసీ! హా! ప్రేయసీ! యని పలవరించుము లేచి కూర్చుంది... బలభద్రుఁడు వెఱగుపడుచుఁ దమ్ముడా ! పేయసి పతె ? కన్ను లుపిప్పి చూచులు మన సుభద్ర యేదని యడిగిన నతండు అయ్యే: ఎంతమోసము : ఎంతమోసము : అటువంటి కలువంటి నావంటి ఉధమనికి చక్కునా! ఆహాహా: యేమి చక్కదనమురా ఆన్నన్నా : /యేమి శృంగార ముఠా అయ్యారే : ఏపి పణ్యము : యని యూరక పరివరించిన బలవచుఁడ. 'గ్గరగా లిపి తము (డా : ఇటు చూడుము కన్నులం జపుము. సుక్క ఉయేది ? " పే యుసీయని పలువరించుచున్నావు. అది యెవ్వతె, నీ వృత్తాంతము నీ విప్పుము., యమున నలం... తెరపి దెచ్చుకొని యన్న కిట్లనియె. ఆన్నా : నేను గన్న వార్త నిజంబనం, భ్రమతో నల్లగుచున్నాను. ఇటువంటి అంత లెన్నఁడును చూచియు వినియు నెఱుంగను, దైవమాయ యన అంటే కాబోలు. ఎరుము నీవు నిన్నటి రాత్రి పాతాళ లములోఁబడి యార్త స్వ... నన్ను ఎంతిచి గదా : ఆ రోదన విని నేనును సుభమయు వె:ుచుచుఁ బరు గిడిపోలు న పన జలములోనే సతిమి. నీ వేసి పోయితివో మాకు చుడు. కు కముఁ బసిందని, మాతము నాకుఁ దెలియును. పిమ్మట నేమైనదో A n. కరత నావక సమము. అటుపడి యలములో సురక మందికి ... ను విడుము లేక యడ్లాన్ని దెసలు తినో ఆ ... నన్ను ఎందుకు పంచు ప్రదేశమునఁ బడి L
గల మేనిలో జవసత్వము లేమియుం దరుగలేదు. నిద్రలేచినట్లు లేచి యా పట్టణ మెయ్యదియో చూచెదంగాక యని పురాభిముఖముగా నడువఁ దొడంగితిని. అది పగలో రాత్రియో చెప్పఁజాలను. సూర్యుఁడు కనంబడలేదు. నెలుఁగు పెద్దగానున్నయది. ఆ పట్టణంబునంగల సౌధముల తీరీ రీతినున్నదని చెప్పుటకు నా తరము గాదు. అన్నియు హాటక రత్న ఘటితంబులే కాని పాషాణదారు నిర్మితములు గావు అది స్వర్గము కావచ్చును. ఆ పురిలో వీధింబడి నడుచుచుండ మేడలలోని సంగీతనాదంబులు కర్ణ పర్వము గావించినవి. మేను పరవశమై పోయినది. అందుఁగల జనులు కడురూపవంతులు నన్నెవ్వరును బల్కరించలేదు. నేను పట్టణము నలుమూలలు దిరిగితిని. పోయిన వీథియుఁ బోవలసిన వీథియు నాకు గురుతు తెలయలేదు. వేఱొక మూలకుఁబోయి చూచి నంత నా ప్రాంతమున నొక ప్రవాహము వాయు వేగముగాఁ బ్రవహించు చున్న యది. దానిలో శంకచక్రగదా ధనుర్దారులను దులసీమాలాలం కృతులునగు వైష్ణవులు కొట్టుకొని పోవుచుండిరి. ఆ ప్రవాహమునకును వారికిని దుదియు మొదలును గనంబడలేదు. ఆ ప్రవాహము పొంగుచున్నట్లు కనంబడినంత నేను భయపడుచు మఱియొక మూలకుం బారిపోయితిని.
ఒక వీథిలో నరుగుచుండ నొక సౌధములో మంగళఘోషములు వినంబడినవి. శుభ కార్యము జరుగుచున్నదని తలంచి నేనా లోపలికిఁబోయి తొంగిచూచితిని. వివాహవేదిక యందుఁ బీటలువైచి పెండ్లి చేయుటకు సర్వసిద్ధము గావించియందున్న వారెల్ల బెండ్లికుమారుని రాకకై యెదురు చూచుచుండిరి. నన్నుఁజూచిన వారెల్ల సంభ్రమముతో నదిగో పెండ్లికొడుకు వచ్చినాఁడు. కార్యము జరిగింపుఁడుజరిగింపుఁడని కేకలు వైచిరి. అందులకు నేను వెఱఁగుపడి చూచుచుండ నన్నుఁ దీసికొనిపోయి మంగళ స్నానములు చేయించి పీఁటలపై గూర్చుండఁ బెట్టిరి. వారికిని నాకుఁబ్రశ్నోత్తరము లేమియు జరిగి యుండలేదు. అంతలో బంగారుబొమ్మ యనందగు పొన్ని కొమ్మను దీసికొని వచ్చి నా ప్రక్కం గూర్చుండఁ బెట్టి వివాహ విధి నిర్వర్తించిరి. నేనా చిన్నదానికి మంగళసూత్రము గట్టితిని. తలఁబ్రాలు పోసుకొంటిమి. దాని ప్రాయము పదియాఱేఁడు లుండును. రూపము వర్ణింప సహస్రముఖుఁడైనను జాలఁడు. అన్నా! నీతో ఏమని చెప్పుదును.
ఉ. కన్నులు గల్వరేకులు మొ • గంబుగళానిధి మేని డాల్పదా
ఱ్వన్నె పసిండి జక్కవక * వం బురడించు గుచద్వయంబహా
సన్నినికొను ముత్తెముల - చాలు రదాభి మదాభి రైశ్యమ
న్నన్న ? గణింప శక్యమిత • దాకృతి సోయగ మన్విధాతుకున్.
అప్పుడే మా యుంగరములు మారిపించి చెట్టలు పట్టించిరి. పిమ్మట మమ్మొకయేనుఁగుపై నెక్కించి యూరేగించిరి. ఆ వినోదము లన్నియుఁ గలలో వార్తలని నీకు సంక్షేపముగా జెప్పుచుంటిని. ఆ పెండ్లి కూఁతురు మొగము నొకదాని వర్ణింపఁ బదివత్సరములు పట్టును. ఆహా ! తలంచుకొనినఁ గంపము జనింపుచున్నది. చూడుము. ఏనుఁగు మీదఁ గూర్చుండి యూరేగింపు దంతకుమున్ను మాతో నున్న వారందఱు నేమైరో తెలియదు. మేమిరువురము మాత్రమే యుంటిమి. అప్పుడా చిన్నదాని లజ్జయుడుగ మోమెత్తి పల్కరించితిని. సిగ్గుచే మాటాడినదికాదు. కాని మందహాస విలోకనాంకురములు నాపైఁ బ్రసరింపఁజేయుచు హృద్గతాభిలాషము సూచించినది. అప్పుడు నేను మోహవివశుండనై కౌఁగిలించుకొన యత్నింపు చున్నంతలో నా పాడు దంతావళ మా ప్రవాహము దాపునకుఁ బోయినది. దానికి మావటీఁడు లేఁడు. మేమేమి చేయుదుము. ఎంత యదలించినను దిరిగినది కాదు. ఆ ప్రవాహము నింగిపొడవున నుప్పొంగి మమ్మైక్యముఁ జేసికొనినది. చెఱియొక మూలకుం గొట్టుకొని పోయితిమి. అందొక పెనుమీను త్రోకపై నుండ నన్ను విసరినది ఆ విసరున వచ్చి యిచ్చటఁ బడితిని. పతన వ్యధచేఁ గన్నుల మూసికొనియుండ నింతలో నీవు వచ్చి పిలిచితివి. ఇదియే నా వృత్తాంతము. ఇది కలయో కల్ల యో నిక్కువమో నీవే యూహించి చెప్పుము. ఇదిగో యా మదవతి చిటికిన వ్రేలి యుంగరము నా వ్రేలనున్నది చూడుమని పలికి యూరకుండెను.
అతని చరిత్రమంతయు విని బలభద్రుఁడు ముక్కుపై వ్రేలిడుకొని యొక్క నిమిషము ధ్యానించి అయ్యారే ! యిట్టి చిత్రముల కథల యెందును విని యెఱుంగము. ఇది యేమి మాయయో తెలియదు. తమ్ముడా ! నా కథయు నీ కథనే పోలియున్నది. చెప్పుకొనిన దుఃఖమే కాని లాభము లేదు. దాని మాట యట్లుండనిమ్ము. మన చెల్లె లేమైనది ? ఈ యడవిలో నెందైన మన కొఱకుఁ గ్రుమ్మరుచున్న దేమో వెదకుదము అని పలుకుచు నతనితోఁ గూడ నయ్యడవిలో సుభద్రా ! యని పిలుచుచుఁ దిఱుగఁజొచ్చిరి.
ఇదిగో మహా పాపాత్మురాల నిచ్చటనున్నాను మృతి నొందలేదు. ఇటు రండు అని ధ్వని యొకటి వినంబడినతోడనే నంత వెదకుచు వారా నినాదము --- నరిగి యొక పొదరింటిలో నున్న సుభద్రంగని ------------------- గౌఁగలించుకొని ముద్దు చెల్లెలా ! నిన్నుఁజూడరక యెంత ------------- నీ వెక్కడకుఁ బోయితివి ? నీవు గూడఁ బాతాళ బిలములోఁ బడిపోయితివి గదా ! ఎట్లు బయటకు వచ్చితివి ? నీ కేమేమి వింతలు గనంబడినవి. ----------- ననేకములగు చోద్యములంజూచితిమి. వానినె సావకాశముగాఁ జెప్పుకొని -------------- తెఱంగెఱింగింపుమని యడిగిన నప్పడఁతి వేడి నిట్టూర్పు నిగుడింపుచు ---------- నలుదెసలు చూచి యేదియో ధ్యానించి యల్లన నిట్లనియె.
అన్నలారా ! మీ వెనుక నేనాగోతిలోఁబడి ---------------- దిగజారి దిగజారి యొక సరస్సులోఁ తదళములుం గలిగిన కాంచన సరోజములచే దీపించుచు నా తటాకమెంతేని దర్శనీయమై యున్నది. ఆ తటాకములోఁ బతనాయాసము వాయ నేను స్నానముఁ జేసి మణిసోపానముల వెంబడి దటముఁజేరి నలుదెసలుం బరికించితిని. అంతయు బయలుగాఁ గనంబడినది. అందొకచో నద్భుతమైన తేజ మొకటి కన్నులకు మిఱుమిట్లు గొల్పుచున్నది. అది తీక్షణమైయున్నను మనోహరముగా నున్నది. ఆ తేజమునకు జన్మస్థానము యేదియో తెలిసికొన వలయునని తదభిముఖముగాఁ గొంతదూరము పోయితిని. అక్కడనొక యగ్నికుండ మున్నది. అందుండి యగ్నిజ్వాల బయలు వెడలు చున్నది.
విస్ఫులింగములు రులభటచ్ఛటారావములతో నాజ్వాల యాకసమునకు నతి వేగముగాఁ బోవుచుండెను. అందు మువ్వురేసి పిల్లలఁ జంకనిడుకొనిన స్త్రీలు వేలఁకొలఁది మిణుగురులవలె నెగిరిపోవుచుండిరి.
మఱియు నొక విచిత్రమందుండు ఆ యగ్నికుండ మొకచోట నిలువక నలుమూలలు దిరుగుచున్నది. దానిలోఁ-------- బర్వతమైనను భస్మము కాకమానదు. అది నా దెసకు వచ్చునేమో యని ------------- నందుండక మఱియొక దెసకుఁ బోయితిని. ఎట్టి సమయ మందైనను -------- బోవదుగదా ! ఆ జ్వాలయు నాకుదూరమగుచుండ సంతసించుచు నేనా -------------- గనంబడునేమో యని సంచరింపఁ దొడంగితిని, జ , చేసి పక మయంబగు సౌధం బొకటి గన్నులపండువు గావించినది నవరత్న -------మగు నా ప్రాసాదముల జూచి నేను వెఱఁగుపడుచు నందెవ్వరుందురో చూచెదం గాక యని నిర్భయముగా మేడపై కెక్కితిని.
అందు హంసతూలి కాతల్పంబున నొక యౌవన పురుషుండు నిద్రించు చుండెను. అన్నలారా ! మీతోఁ జెప్పవలసినది కాదు కాని వాని యాకారము జూడ సంత నవంధతి యైనను మరల 30 న చూసడ.. అహా : ఆగము - నొసలు నా చెక్కులు ను అమలవులు - మురును నా తేజముఁ జూడఁజు ఈ ఒపు , కించినది . మనో వారం ముందున్న గోలు చానించో 3 20 రక యూకు చూచుచున్న ఇత స్వంత రు....... - :: కన్నం .. శృంగార రసం... కలల నాలుకనుంచ త స్వేడం మంచహాసము గావించెను. అమ్మందహాసమే మదీయ రులు జంద్రహాసమైనంత నా మేన సాత్విక వికారము లన్నియు నొక్కసారి యుదయించినవి. ఆ దయాళుండు మదీయు వికార ప్రకారం ...... న లేచి శయ్యపైఁ గూర్చుండి ఇటురమ్మని నాకు సన్న జేసెను.
అప - నల చయ్యన నే నాయన సెజ్జపజ్జకుం బోయి నిలువంబడితిని. తన కళార ... చినున్న శయ్యపై కొయ్యన లాగుకొని తొడలపై నిడుకొని మోము ముద్దాడుచుఁ దన యుంగరము నా వ్రేలికిడి నా యుంగరము దన వ్రేల నిడుకొని యెద్దియో సంభాషించు నభిప్రాయము సూచింపుచున్నంతలో హా! యెంత కష్టము? సోదరులారా! పైనఁ జెప్పజాలను గదా? అని పలుకుచు మూర్చపోయినది అప్పుడు వారిరువురు నొండొరుల మొగములు చూచికొనుచు సుభద్రను సేదదీర్చి చెల్లీ? నీవు పైనఁ జెప్పనక్కఱలేదు. మాకే బోధపడినది. మనము మువ్వురము నొక్కజాడయే యెక్కితిమి. ఇది యథార్ధము కాదు మహామాయ. దీని కొఱకుఁ జింతింపవలసిన పనిలేదు. మీ రట్టి యానందముతో నున్న సమయమున మొదట నీకుఁ గనబడిన యగ్నిజ్వాల వచ్చి మిమ్మైక్యముఁ జేసికొనినది. నీ వందులోఁ బడి తదర్చిస్ఫురణంబున నెగిరి యిచ్చట వచ్చి పడితివి. ఇదియేనా నీవు చెప్పునది యని యడిగిన నప్పడఁతి వెఱగుపడుచు అన్నలారా! దీని మీరెట్లు గ్రహించితిరి? వింతగా నున్నదని యడిగిన వారు తమ వృత్తాంత మంతయుంజెప్పి యంతయు నొక్క పోలికగా నుండుటచే గ్రహించితిమని పలికిరి.
అప్పుడు సుభద్ర తలయూచుచుఁ దెలిసినది తెలిసినది. ఇదియే భగవన్మాయ. దీనిని దేవతలు సైతము తెలిసికొనఁ జాలరు. మనమెట్లు తెలిసికొందుము. ఇఁక బుద్ధి గలిగి మన మింటికిం బోవుటయే యుచితము. మీ సందియములు దీఱినవియా? యని పలికిన విని వారిరువురు అవును దైవమాయ కడువిచిత్రమైన యింద్రజాలమువంటిది. దీనిని మనము తెలిసికొనలేము. ఇంటికిఁ బోవుదమని సమ్మతించిరి. అప్పుడు వారు గుఱ్ఱము లెక్కి స్వదేశాభిముఖులై యరుగుచు సాయంకాలమున కొకపల్లెం జేరిరి. తాము చూచిన విషయములు మహా మాయయని యెఱింగియు వారు మోహావేశంబునం జేసి హృదయంబున దయితాకారంబుల ధ్యానించుచు విభ్రాంతి పడుచుందురు. అందు బలభద్రుండు దాను జూచిన విషయములు పర్వతశిఖరము మహామందిరము కళ్యాణమంటపము గ్రీడావనము దాను బెండ్లియాడిన చేడియను జిత్రపటంబున వ్రాసి కృష్ణునికిఁ జూపుటయు నతండును తాను బెండ్లియాడిన చేడియను విచిత్రపటము హాటక మత్తగజము ప్రవాహములో నగునవి పటంబున వ్రాసి యన్నకుఁ జూపించెను. వానింజూచి సుభద్ర తన భర్తను ప్రాసాదమును అగ్నిజ్వాలను వ్రాసి వారికిఁ జూపినది ఒండొరులు వ్రాసిన చిత్తరువుల నొండొరులుజూచి విస్మయము జెందుచుండిరి. ఆ పటముల వారు సతతము హస్తములయం దుంచుకొని యా విషయములనే తలంచుకొనుచు యున్మత్తుల కియఁ గొన్న పయనములు సాగించిరి. అని యెఱింగించువఱకు సమయ మతిక్రమించుటయు మణిసిద్దుండు తత్కథఁ జెప్పుటమాని తదనంతరోదంతము పై దిట్లని చెప్పదొడగెను.
ముప్పది యెనిమిదవ మజిలీకథ.
గోపా! విను మట్లు వారు స్వదేశగమనోత్సుకులై గుఱ్ఱములెక్కి యరుగునప్పుడు