కాశీమజిలీకథలు/ఆరవ భాగము/89వ మజిలీ

వికీసోర్స్ నుండి

డేదారినైన నిటకరుదెంచునేమోయను నాసతోఁ దెఱవు మొగముననున్న యా విప్ర గృహంబున వసియించి వారికి వినోదార్దము కథలఁ జెప్పుచుంటి. దైవవశంబున నిన్నుఁ గలసికొంటి. నే నీరహస్య మిదివర కెవ్వరికిం జెప్పి యుండలేదు. వేయు నేల ఘటదత్తుఁడు భూలోక మంతయు నేలదగిన బలశాలి. ధర్మరాజుకన్న నెక్కుడు గుణవంతఁడు. అతని కింకను మంచిదినములు రాలేదని యావృత్తాంతమంతయుఁ జెప్పినది. మురళియు సరోజినీ ఘటదత్తుఁడు ఇంద్రదత్తపై యనురాగము గలవాఁడగుట నక్కడికే రాఁగలడు మన మానగరికిఁ బోవుదము రమ్ము. ఇంద్రదత్త సత్యమైన మీ చరిత్రవిని హృదయపరితాపము విడువఁ గలదని పలికి యక్కలికి తోఁగూడఁ గొన్ని పయనంబుల కావీడు చేరినది అని యెరింగించి మణిసిద్ధుఁ డవ్వలికథ మరియు నిట్లవ్వలి మజిలీయందుఁ జెప్పదొడంగెను.

ఎనుబది తొమ్మిదవ మజిలీ

మంజరి కథ

పాటలిక - ఓసీ ? మంజరికా ! ఇప్పుడు మహారాజు కౌముదియం దేమిటికో యలిగి యామె యంతఃపురమునకుఁ బోవుట లేదట. అందుల కామె పరితపించుచు మీ రెద్దియో కొండెములు సెప్పి మానిపించిరని తలంచుచు నా కారణము గ్రహించి రమ్మని నన్నుఁ నియమించినది. మనలో మన కంతరము లేదు కదా ? నిజ మెరింగినని జెప్పెదవా ?

మంజరిక - అత్తా ! నీతోఁ జెప్పకుందునా? నాఁడు మన మొుండొరులము చెప్పుకొన రహస్యములకన్న నివి గూఢములా యేమి? కౌముది తల్లి నీ కా బహుమానముఁ జేసినదా ?

పాట - లేదు. లేదు. తనపుత్రిక శిశువుఁగూడ గతతేరినది కాదా? అందులకు హెచ్చరిక లేక జరుపుచున్నది.

మంజ - కౌముదికిఁ బుట్టినది ఆడుబిడ్డయా ? దాని నెట్లు మార్చితివి ?

పాట - నీవు చెప్పినట్లే చేసితిని. ప్రసవసమయమున దాపున నేనును నా పుత్రికయు మాత్రమే యుంటిమి. తల్లి దూరముగానున్నది. పిల్ల భూమిపైబడిన తోడనే తెచ్చియుంచిన మృతయంత్రశిశువు నందుంచి యా బాలిక నేడువకుండఁ బట్టికొని నా కూఁతురు నొడిలోఁ బడవైచి యవ్వలికిఁ దీసికొని పొమ్మని పంపితిని.

మంజ - కౌముది చూడలేదుగదా ?

పాట - ప్రసవవేదనా వివశయై యామె యొడలే యెరుంగక కున్నదిగదా?

మంజ - తరువాత.

పాట - చచ్చియే పుట్టినదని యా పిల్లం జూపితిని. అంతగా విమర్శింపక కౌముదితల్లి లోనికివచ్చి మిక్కిలి దుఃఖించుచుఁ గళావతికి గలుగు సంతతి నెట్లయిన గడతేర్చి రమ్మని మరల బోధించినది.

మంజ - నీ పుత్రిక యా బిడ్డ నేమి చేసినది ?

పాట - వినుమని యప్పడే యిల్లు వెడలి నడివీధింబడి శ్మశాన భూమికిఁ దీసికొని పోవుచున్నదట.

మంజ - తరువాత.

పాట - నడివీధిలో నొక యాబోతు దానిందరుముకొని వచ్చినదట అప్పు డది జడియుచుఁ గాలికొలఁది పారుచుండ నొడిలోనున్న పిల్లజారి నేలబడినది.

మంజ - బళాబళి. తరువాత నేమి జరిగినది ?

పాట - ఆ శిశువును దీసికొనుట కవకాశము దొరికినదికాదట. దానిప్రాణము దక్కించుకొని పారిపోయినది.

మంజ - పిమ్మట నా బాలిక నెవ్వరైన కొనిపోయిరేమో చూచినదా ?

పాట - నా గూఁతురు కొంతసే పాప్రాంతమున దాగికొని గోపల్లభంబు దూరము చనినపిదప మరల నచ్చటికి వచ్చి చూచిన నా పాప కనంబడలేదు.

మంజ - మరియేమైనది ?

పాట - సగము మేమే చంపితిమి. వృషభఖురకోటిఘట్టనంబున మిగిలిన యసువు లూడినంత నా మృత శిశువుం దీసికొనిపోయి తలారులు కందకములోఁ బారవేసియుందురని చెప్పినది.

మంజ - ఆ మాట సందియము కాని నిశ్చయముగాదు.

పాట - ఎట్లయినను మనము చేయవలసినపని చేసితిమిగదా ! నీ వా బాలుఁ నేమి చేసితివి? ‌

మంజ :- కళావతి మగశిశువుం గనినది. వానిని వెంటనే గొంతువునులిమి నా తల్లి చేతి కిచ్చితిని. అది కుండలో నిడికొని యర్దరాత్రంబున స్మశానభూమిమీదుగా నగడ్తయొద్ద కరుగుచుండఁ బిశాచము మీదఁ బడినదఁట. కుండ నేలఁ బారవైచి పారిపోయి వచ్చినది. తరువాత నా బాలుఁ డేమయ్యెనో తెలియదు.

పాట :- సరి. సరి. రెండుక్రియలు‌ నేకరీతిగానే యున్నవి. కళానిలయ నీ కానుక లేమి చేసినది.

మంజ :-- ఎట్టివారికిని మొదటనున్న యాసక్తి తరువాత నుండదు. ఆమెకును దనకూఁతురు సంతతి నిలచి కౌముదిసంతతి నశింపవలయుననిగాదా యభిప్రాయము. అట్లు జరుగలేదు. ఇరువుర కానుకలు సమముగాఁ బంచికొనవలయునని మన యిరువుర మాపనుల సాగించి యిరువురకు దుఃఖప్రదుల మైతిమి. ఇరువురును గానుకలు సున్నఁజుట్టిరి. ఈ సారి మాకుఁ గానుకలు రాఁగలవు. నీ యల్లుఁడు గ్రామాధికారి యగును.

పాట - ఎట్జెట్టూ? వేగము సెప్పుము. మంజ :- మొన్న రాజుగారితోఁ గళావతితో నే నా ప్రోలికరిగి నప్పుడు కళానిలయ ననుఁజూచి కోపము సేయుచు నీతోఁ జెప్పినపని యొక్కటియుఁ గొనసాగించితివి కావుగదా యని యాక్షేపించినది.

పాట :- ఏమీ ! అప్పటిపని యెవ్వరియానతి నాచరించితివి. అది మరచినదియా యేమి?

మంజ :- ఆమాటయే నేను ముదలకించుచు అమ్మా ! నీకతంబున శిశుహత్యఁ గావింపలేదా? దైవము మనకు నపకారముఁ గావించెను. దానంజేసి నీకు నా చేసిన యుపకారమేమియు నచ్చినదికాదు. అని పలికితిని.

పాట :- తరువాత.

మంజ :- ఆ మాట నే నెరుంగుదు. నీ తల్లియు నీవును గట్టివారలుగదా ! కౌముదియందు రాజునకు విరోధము కలుగునట్లు చేయలేరాయని యడిగినది.

పొటలిక :- ఏమంటివి ?

మంజ :- అట్లుచేసిన మాకిత్తుమన్న గ్రామములు మూఁడుకు దయ చేయుదురా యని యడుగుటయు వసుంధరునకు కౌముదియందు బ్రబలవిరోధమును బుట్టించి దానింటికిఁ బోకుండఁ జేయుదురేని మీరు కోరిన గ్రామములు తప్పక వ్రాసి యిప్పించు చున్నాను. అని వాగ్దత్తముఁ జేసినది. ఆ మాట‌ విని పరమసంతోషముఁ జెందుచు ఘటదత్తు జూచి కౌముది నవ్వినదని యనుమానముఁ జెంది వసుంధరుఁ డాసంగతి కౌముదిని దరచి తరచి యడిగిన కథ నేను వినియున్నదానఁ గావున నదియే యవకాశము జేసికొని యింటికి వచ్చిన మరునాఁడొక పత్రిక వ్రాసిసి యతఁడు పండుకొను మంచము తలయంపిఁ గ్రుచ్చితిని. అ పత్రికం జదివికొనియే యతండు ఘటదత్తు నూరునుండి లేవఁగొట్టి కౌముదిపై నలిగి యక్కడికిఁ బోవకున్నవాఁడు. నీవడిగితివి కావున రహస్యమైనను నిజము నీకుఁజెప్పితిని. కళావతి యాగొడవ యేమియు నెరుఁగదు. పదిదినములలోఁ గళానిలయ యొద్దకుఁ బోయి కార్య మెరింగించి యాగ్రామములు నీయల్లునిపేర వ్రాయించి పుచ్చుకొనియెద మిదియే యదార్దమని చెప్పినవిని యా పాటలిక మిక్కిలి సంతసించుచు నిట్లనియె.

మంజరికా ! మనము మొదటఁజేసిన కార్యములన్నియు నిష్పలములై నను నీకార్యము కొనసాగినది. నా యల్లునికి వచ్చుటచే నాకు వచ్చునట్లే సంతసించితిని. పోనిమ్ము. నీవై రము చల్లారకుండ వృద్దిఁజేసి నీయం దామెకుఁ గల దయ నిబ్బడింపఁ జేసెదనులేయని తత్కాలోచితముగా సంభాషించు సమయంబున నెవ్వతెయో వచ్చి మంజరికా ! నిన్నమ్మగారు రమ్మనుచున్నారు. వేగము రమ్ము అని పిలిచినది.

అప్పుడు మంజరి అత్తా ! నీ విఁక పొమ్ము. నేను గళావతియొద్ద కరుఁగ వలయునని పలుకుచు లేచి మెల్లన నామె కడకుఁబోయినది. కళావతి మంజరికఁజూచి చేటీ ! ఎవ్వరో ముత్తయిదువ వచ్చినదఁట. ఎదురు పోయి తీసికొనిరా వేగపో ? అని చెప్పిన‌ మహాప్రసాదమని యర్ఘ్య పాద్యాదులం గొని యది ద్వారదేశమున కెదురు వోయి యందు నిలిచియున్న యొకబ్రాహ్మణిని దర్శించి సబహుమానముగాఁ దీసికొనివచ్చి పీఠంబునం గూర్చుండఁ బెట్టినది.

పిమ్మటఁ గళావతి వచ్చి యామెను నమస్కరింపుచు నర్వా! మీ కాపుర మీపుర మేనా? పేరేమి? భర్తగారు విద్వాంసులగుదురా పిల్ల లెందరు? పార్వతివలెనుంటివి గదా? ఎన్నఁడును మా నగరికి వచ్చితివి కావేమి? అని యతివినయముగా నడిగిన నా విప్రపత్ని యిట్లనియె.

దేవీ ! నా పేరు శారద యండ్రు. మేము మీ పురమే యాశ్రయించుకొని కాపుర ముంటిమి నా భర్త కొంచెముగాఁ జదివికొని యున్నారు మీ యాస్థానమునకు వచ్చునంత సామర్థ్యము లేదు. నాకు లేక లేక యొక్కఁడే కొమరుండు కలిగెను. వానిని మీ భర్తగారే పెంచి పెద్ద వానిం జేసిరి. వాఁడు మీగుణంబులు పొగడుచుండ బలుమారు వింటిని. కాబట్టియే యిట్టి యదృష్ట మనుభవించుచుండి మా వాఁడు కొన్ని దివసములనుండి యింటికి వచ్చుటలేదు. ఎంతపని యున్నను రాత్రియైన వచ్చిచూచి పోవువాఁడు. అతనిజాడఁ దెలియకదండ్రి మిక్కిలి పరితపించుచుఁ దా నిక్కడకు రాలేక నన్నుఁ బోయి యడిగి రమ్మనిపంపిరి. అందులకై వచ్చితిని. దయయుంచి ఘటదత్తు నెందైన బంపిరేమో నీ భర్తగారి నడిగి చెప్పవలయు. నిందులకే నే నిచ్చటికి వచ్చతినని‌ యత్యంత దైన్యముతోఁ బ్రార్దించిన నాలించి యమ్మించుబోణి యబ్బురపాటుతో నిట్లనియె.

ఏమీ? ఘటదత్తుఁడు నీ కుమారుఁడా? ఎంత పుణ్యము చేసికొంటివోకదా? అతండు నీ కడుపునం బుట్టెనా? పెంచుకొంటివా? నిక్కముఁజెప్పుమని యడిగిన నామె నా కడుపుననే పుట్టెనని చెప్పినది. ఆ మాటలో స్వరభేదమరసి యత్తరుణీరత్నము అమ్మా ! నాకడ నసత్యము లాడనేమిటికి? సత్యమే చెప్పరాదా ? ఘటదత్తుఁడు నీ కడుపునం బుట్ట లేదని నేను చాటి చెప్పఁగలను. అని పలికిన నులుకుచు శారద దేవీ? నీకా మాట యెవ్వరు సెప్పిరో చెప్పుము. తరువాత నిజము జెప్పెదను. ఔరా ? ఈ రహస్యము నాకును నాభర్తకుఁగాక బ్రహ్మకుఁ దెలియ దనుకొనుచుంటిమి. నీకెట్లు తెలసినదో చిత్రముగా నున్నదని లఘుహృదయయగు నా విప్రాంగన సూచించిన నవ్వుచుం గళావతి యిట్లనియె.

సాధ్వీ? నీవు నిజముఁ బేర్కొంటివేని పిమ్మట నాకుఁజెప్పిన వారిం జెప్పెద. దీన నీకుఁ దప్పేమి యున్నది? చెప్పుము చెప్పుమని యడిగిన నామె యాకథ యెఁరిగి యున్నదని తలంచి దేవీ! ఎట్లయిన నాకు వచ్చిన కొదువలేదు. అతండు నాకుఁ బెంపుఁడు కొడుకన్న మాటయే కాని కన్న వానియందై న నట్టి ప్రేమలేదు వినుండు. అని తాను యోగినివలన మంత్రోపదేశమై యర్దరాత్రమున స్మశానమున కరుగుటయుఁగుండ యత్తరి యెవ్వతియో వచ్చుటయు దానిం బెదిరించుటయు నందీశిశువు దొరకుటయు లోనగు వృత్తాంత మంతయు వక్కాణించి దాననే యతనికి ఘటదత్తుఁడని పేరు పెట్టితిమని నుడివినది.

ఆ కథ విని యామధురవాణి విధుర హృదయయై మంజరిక మొగము జూచుచుఁ జేటీ ? అప్పురుషరత్నముంగని పారవైచిన భాగ్యశాలిని యీ ప్రోల నెవ్వతె యున్నది? అందులకుఁగారణ మెయ్యదియై యుండును? ఈమె చెప్పినట్లు మృత్యుఁడైన శిశువు యోగినీవరంబునఁ బతికెనా ? ఊహింపుమని యడిగిన గద్గదికస్వరముతో బమ్మా ! ఆ మాటయే సత్యము కావచ్చును. ఈమె యోగిని చెప్పినట్లు నియమము జరిపినది. దేవతా ప్రసాదంబున నా బాలుండు జీవించె. అందులకే యతండంత వాఁడయ్యెనని యుత్తరముఁ జెప్పినది. ఆ మాట విని కళావతి అయినంగా వచ్చును. మరియు జగన్మోహనాకారంబుగల యా సుకుమారుఁగనిన సుందరి యెవ్వతియో దాని భర్త యెంతవాఁడో తెలిసికొనవలసి యున్నది ? ఆ దివసం బీసతీమణి యెరింగించియే యున్నది గదా. నాఁడు మనయూరఁ బ్రసవమైన వారి పేరులు వ్రాయఁబడియే యుండును. నీవు పురములోని కరిగి యవ్విషయము విమర్శించి రమ్మని నియమించి, శారదతో సాధ్వీ! నే నీ రాత్రి నా భర్తగారి నడిగి ఱేపు మీకు వర్తమాన మంపెదను. మీ రందులకుఁ జింతింపవలసినపని లేదు. ఘటదత్తుఁడు భూ భర్తకుఁ బ్రాణమువంటి వాఁడు. భయము లే దిప్పటికి మీ రింటికిఁ బదుడని సవినయముగా నామెను బంపినది.

పిమ్మట మంజరిక అమ్మా ! ఘటదత్తునిపై నయ్యగారికిఁ దగని కోపము వచ్చినది. మొన్న నూరు వెడలి పొమ్మనిరి. ఈ యుదంతము మీ ఱెఱుంగరు కాబోలునని చెప్పిన నే మేమీ ? ఘటదత్తుని మీదనే యయ్యగారు గినియుట. నే నా మాట నమ్మను. నీవు పరాకుగా వింటివేమో ? అంత యపరాధ మతం డేమి కావించెను. అనుటయు మంజరిక యిట్లనియె.

అమ్మా ! అది యొక్కటే కాదు. వేరొక విశేషము గూడ వినవలసి యున్నది. అయ్యగారు కౌముదియం దలిగి యామె మేడకు పోవుటలేదు. అని చెప్పినఁ గళావతి యదరిపడి వింతలు చెప్పుచుంటివే? ఆమె యేమియపరాధముఁ జేసినదని కోపగించిరి ? విన్న తెరం గెరింగింపుమని యదలించిన నది వెరచుచు అమ్మా? నే నీ కథ యొరులవలన వింటి. అంత లెస్సగాఁ దెలియదు. మీరే యయ్యగారి నడుగుఁడు అని పలికినది.

కళావతి మరియొక రేయి భర్తతోఁ గలసికొని యపగత సుఖుండును సంతోషవిముఖుండునై యుండుటఁ దిలకించి యులికి యులికి పలకరించుచుఁ జేతులు జోడించి మనోహరా! ఘటదత్తుని‌ తల్లి మొన్న నా యొద్దకు వచ్చి తన కుమారుఁడు తమ‌ యింటికి రాలేదని వగచుచు మీ రెక్కడికైనఁ బంపిరేమో యడుగుమని మిక్కిలి దైన్యముతోఁ బ్రార్దించినది వెనుక రీతి నతనిమాట మీరు ప్రస్తాపించుట మానివేసితి రేమి ? అతం డిప్పు డెందుండెను. అని యడిగిన నమ్మహారా జొక్కింత తడవేమియు మాటాడక‌ నిట్టూర్పులు నిగుడించుచు నామె మొగంబుఁ జూచుచు నిట్టనియె.

కళావతీ ! నా హృదయంబున రవులుచున్న కోపాగ్ని నేల ప్రజ్వరిల్లఁ జీసెదవు ? వాఁడేమయ్యెనో నాకుఁ దెలియదు. ఊరు కొనుమని పలికిన వదలక నమ్మదవతి యనునయించుచు నత్యంతశాంత స్వభావులైన మీ హృదయంబునఁ గోపజ్వలనం బుదయించుటకుఁ గారణము తెలియకున్నది శీతకరుం డెన్నడైన వేడిఁ గలిగించునా ? అక్కధ యెరింగింపక విడుచుదానను గాను దిట్టినం దిట్టుదురుగాక యని యతని మనసు గరుఁగునట్లు ప్రార్దించిన నొక్కింత శాంతుండై యిట్లనియె.

పల్లవాధరలు చల్లని మాటలాడుచు వల్లభునియుల్లము లాగికొని మోసపుత్తురు. అట్టివారిని నమ్మిన మగవారిం బట్టుకొని జుట్టుకోయవలయును! వినుము కౌముది కడు నిల్లాలని నమ్మి నేను మోసపోయితిని. ఘటదత్తుండు కృతఘ్నుండని యెఱుఁగక నాఁడు మీ యిరువురి యొద్దకుఁ దీసికొని పోయితినిగదా ? వానిం జూచి యే మేమో వెఱ్ఱిచేష్టలఁ బ్రకటించి యడిగినంత నిర్భయముగా నుత్తరముఁ జెప్పినది. తరువాత మనమాయూరి కరిగినప్పుడు చేసిన చర్య లీపత్రికవలనం దెలియబడఁగలవు. చూచు కొమ్మని యా చీటి యాబోటి కందించెను.

ఆ కనకగాత్రి యా పత్రికం జదివిగొని‌ కనురెప్ప లస్వశించుచు నొక్కింత తడవు ధ్యానించి మనోహరా ? మీరు విద్వాంసులయ్యుఁ గృతాకృతముల వితర్కింప కున్నారు గదా ? కౌముది కడునుత్తమురాలు. ఏకళంకము నెరుఁగదని నేను శపధముఁ జేయఁ గలను. మీ యెదుట నామె నుడివిన మాటలం బట్టి యనుమానించు చున్నారు. ఆ సతీమణి వీసమైన దోసము చేసినదియేని నిర్భయముగా నట్లు మీతో వాదింపదు. అంతఃపురపరిచారిక లెవ్వరో యిట్టి ప్రధను బుట్టించినారు. ఒరుల కీ పత్రిక వ్రాసి మీ తల్బంబున నిడుట శక్యమా ? వ్రాతరీతిం బరిశీలించి వారింబట్టు కొనియెదఁ జూడుఁడు. వెనుక భోజరాజు భార్య విషయమై శంకించు కొని కాళిదాసుం బొమ్మని నిక్క‌ మెరింగిన పిమ్మట నెట్లు పశ్చాత్తాపము జెందెనో యెరుంగరా : ఘటదత్తుని పైనట్లే యనుమానపడి మీ రూరక నలఁగుచున్నారు. ఆతం డుత్తమకుల సంజాతుండు సుగుణ విధానమగుట ద్రోహకృత్యములకుఁ దొరకొనఁడు. లెస్సగా విమర్శించి దోషారోపణము జేయవలయునని యా సాధ్వీమణి ఘటదత్తుని జన్మ వృత్తాంతముతో ననేక దృష్టాంతములు చెప్పి యా వసుంధరుని మనసు పశ్చాత్తాపముఁ జెందునట్లు గావించెను.

అప్పు డతండెడద జాలివొడమ పడతీ ! తొందరపడి ఘటదత్తునిఁ దూలనాడితినిగదా ? ఆతం డేపాపము నెరుఁగనిచో నా మాటలకు నెంత దల్లడిల్లునో? అయ్యో? ని న “పాప .ఏటు లీగికొందుగు. క్రుద్దుండు గరువైనఁ జంపునసు

- కటకటా ! నోటికిరాని దుర్భాషల నాడినంత మే నెల్ల నీరై పోవ మ్రాన్పడి తెల్ల బోయి చూచుచు నవ్వలికిఁ బోయెంగదా ! అవ్విధము తలఁచు కొనిన నా గుండె పగిలిపోవుచున్నది. ఏమి చేయుదును ? అతనిని దేశాంతరము పొమ్మని శాసించితిని. ఈ మాట వినినఁ దల్లిదండ్రు లెంత చింతింతురోయని పరితపించుచున్న వసుంధరు నూరుడించుచుఁ గళావతి యిట్లనియె.

ప్రాణేశ్వరా? మీ హృదయము వెన్నకంటె మృదువైనది. ఇంత పరుసముఁ జెందుట చిత్రమే. కానిండు వాని వెదకి రప్పింపవచ్చును గతమునకు వగచుట యార్యలక్షణము కాదు. మిగిలినది యేమియును లేదు. అని బోధించి యతని వెత కొంత తగ్గించినిది.

మంజరిక యాసంవాద మంతయు జాటున నుండి విని సంతాపముఁ జెందుచుఁ బాటలికయొద్ద కరిగి అత్తా! మనకొంప మునిఁగినది. మనరహన్యము లన్నియు వెల్లడి కాకమానవు. ఘటదత్తుఁడు కళావతి కుమారుఁడు. వానిపెంచుకొన్న తల్లి వచ్చి చెప్పినది. కానిచో వానికంత తేజ మెట్లు కలుగును. మరియు మొన్న వ్రాసిన పత్రిక నా చేతిలిపితో వ్రాసితిని. కళావతి యవ్విషయంబు వితర్కింపక మానదు. ఆ పత్రిక యామెచేత జిక్కినది . దీనిం గురించి పెద్దగా వితర్కములు జరుగును. తీగ తీసిన పొదఁగదలక మానదు. కావున మన మెందేనిఁ బారిపోవుట లెస్స. ఇందుండినఁ బరాభవము జరుగకమానదు. అని యుపదేశించుటయు నదియు భయపడినది. ఇరువురు నాలోచించుకొని యా రాత్రి యెవ్వరికిం జెప్పకుండ నా వీడు వెడలి బహుదేశములు దిరిగిరి. చివరకు గమలాపురంబుఁ జేరి యందు విజయదేవ భూపాలునిభార్య శర్వాణి నాశ్రయించి అమ్మా ! మేము బర్బర దేశాధీశ్వరునిభార్య యిందుమతీదేవి పరిచారికలము ఆమె స్వర్గస్తురాలై నంత జింతించుచు విరక్తిఁజెంది కాశీపురమున కరిగియుదుఁ గొన్నాళ్ళుండి వెండియు దేశమునకుఁ బోవుచున్నారము. తల్లి లేని పుట్టినిల్లువోలె నిందుమతిలేని యా పురమున కరుగుటకు మా మనసు లొల్ల కున్నవి. మే మంతఃపుర పరిచారికులమైరాజ భార్యలయొద్దను రాజపుత్రికయొద్దను నమ్మకముగా నుపచారములు చేయగలము. నీవు గడు దయావతియని వి‌ని నీయొద్ద నూడిగములు సేయుట నుత్సహించుచుంటిమి. మమ్ము నీ‌ బిడ్డల వలెం జూచికొని‌ కాపాడుము. నీమరుగుఁ జొచ్చి దేహయాత్రఁ గావించుకొందుము. మీ పాద సేవయు భగవద్విచారము తప్ప నొండులో మాకుఁ బనిలేదు. అని యత్యంత వినయ విశ్వాసముతోఁ బ్రార్థించిన నాలించి శర్వాణి మిక్కిలి జాలిగలదగుట వారి మాటలనమ్మి తమ్ముఁ బోషించిన యిందుమతీదేవి మరణమునకు విరక్తి జెందిన వారి సుగుణములు గొనియాడుచు వారి సేవకంగీకరించి యప్పుడే వారిద్దరఁ దనపుత్రిక యింద్రదత్త యొద్ద కనిపినది. ఇంద్రదత్తయు వారి మాటలు వారి వినయములు నమ్మికడు నమ్మకమైన వారని నిశ్చయించి తన యొద్ద నుంచుకొని పనులకు నియోగించుచుండెను. అని చెప్పి యప్పారికాంక్షి యేతత్క థాశేషం బవ్వలినివాస స్థానంబున నిట్లు చెప్పుచుండెను.

తొంబదియవ మజిలీ

కవి కంఠకౌక్షేయుకుని కథ

రాజపుత్రా ! నీవు మంచి సమయమున వచ్చి నా కుపకారముఁ గావించితివి. నీ మే లెన్నటికిని మరువను. నాఁడు నన్ను వీండ్రు బట్టుకుందురా ? నా చెల్లెలు సరోజిని‌ కపాయము వచ్చునని దాని దాటించుచుఁ గాచికొనలేకఁ బోయితిని. ఈ కత్తియే నా చేత నుండినచో నెంతమంది వచ్చినను బీచ మడపక విడుతునా? ఇఁక నీ కృపాణమేమరక కరంబునఁ దాల్చియుండెద. నీ రాజభటులెందరు వత్తురో చూతుముగాక. నీవు సరోజినిం బెండ్లియాడెదనని యొప్పుకొని మానితివికదా ? అట్టి బుద్ధిమంతురాలు గుణవంతురాలు రూపవంతురాలి పుడమిలోనున్నదియా? ఎవ్వరో భోగముదానయని చెప్పినంతనే నమ్మి యుపేక్షింతువా ? దాని పుట్టువను గురించి తెలిసికొనవలసి యున్నది‌. ఉత్తమవంశ సంజాతయని దానిరూపమే చెప్పుచున్నది. అని పలుకుచు దన కథయు సరోజిని చరిత్రయు ఘటదత్తుఁడు సుముఖనితో నొక నాఁడు వక్కాణించెను.

ఆ మాట విని సుముఖుండు బావా ! నన్ను సుమేధుఁడు వేశ్యాంగనం బెండ్లి యాఁడ కూడదని యంకిలి చెప్పెను. మా కీ రహస్యము లన్నియు నెట్లు తెలియగలవు. అట్ల యినను నేను సరోజినీ గుణపాశ బద్దుండనై యింట నిలువక మీ నిమిత్తమై దేశాటనముఁ జేయుచుంటిని. కాళిందీపురమున కరిగి చంద్రవతి యింటికింబోయి దానితో సంభాషించితిని. ఇంట నున్న విత్తమంతయుఁ బోవుటయే కాక సరోజినిని కూడ నెత్తుకొని పోయిరని మిక్కిలి దుఃఖించుచున్నది. ఆ చిన్నది యున్న వెండియుఁ వెండియుం బైదియుఁ సంపాదించుకోఁ గలనని చెప్పుచున్నది. అది నీ కడుపునం బుట్టినదా యని నే నడిగితిని. మొదటఁ గొంతసేపట్లే చెప్పి చెప్పి చివురకది యట్టిది యయినచో నా చెంతకుఁ గ్రమ్మర రాకుండునా ? దానిం దెచ్చుకొంటి నారండకు నిందుండి పోవలయుననియే యున్నది. అని యదార్ధముఁ జెప్పినది.

అక్కడినుండి బయలుదేరి నే ననేక జనపదంబులు చూచుకొనుచు నిప్పటికి ఎంచి... న్ను. బొడగంటి... నీ వసవాయహారు(గవు. నిన్నర్ధుపనితోం గ సన్నం తెరగా మూఘుకరిన్ను యమం గల రిప్‌. 20 .అలాల. * బతి సంచులు ఎప్పినందులకే సొమున నలి పిళ్య్వాన థి యన ప ముబణంయిలే తన్మాతములే, ఇట మొనలు నేన ని యాజ