Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/83వ మజిలీ

వికీసోర్స్ నుండి

కాశీ మజిలీ కథలు

ఎనుబది మూడవ మజిలీ

కౌముదీకళావతుల కథ

చ. నరనుత నేఁడు వింతలు గనంబడవేమియు నిందుయక్షిణీ
    వరజనిత ప్రభావనితవద్య యశోనిధి రామలింగ ధీ
    వరసుతఁ డవ్వసుంధరుని వార్తవినం గడు వేడ్కఁ బుట్టెఁ ద
    చ్చరితమునందు నెందయిన నత్కథకల్గిన నానతీఁగదే.

అని శౌనకుం డడుగుటయు మణిసిద్దుం డాత్మీయమణి ప్రభావంబుననందలి విశేషంబు లన్నియుఁ గరతలామలకముగాఁ దెలిసికొని గోపా ! నేఁడు నీ ప్రశ్నంబునకుఁ దగిన యాశ్చర్యకరమగు కథ యొకటి నా హృదయమునఁ దోచుచున్నది. వినుపింతు నవహితుండవై యాకర్ణింపుము. తెనాలి రామలింగకవి కుమారుండు వసుంధరుఁడు యక్షిణీదత్త వరప్రభావసంపన్నుండై రాయలవారి కూఁతురుఁ గళావతిని, కుముద్వంతునిపుత్రిక కౌముదిని బెండ్లియాడి యిరువుర భార్యలతో సుఖింపుచుఁ గుముద్వతీనగరంబుఁ బాలించుచున్నాఁడని నీకు వెనుకఁ జెప్పియున్నానుగదా ? రాయలవారిభార్య కళానిలయకు మందారవల్లియందుఁగల యీ సునఁదనసుత నా వసుంధరునకిచ్చుట కిష్టములేకున్నను స్వయముగాఁ కళావతి వసుంధరుని వరించుటచే నా పెండ్లిఁ జేయుటఁ తప్పినది కాదు.

అట్లుండ నొకనాఁడు పల్లవిక కూఁతురు మంజరిక యను పరిచారిక కళావతిచేఁ బంపబడి కుముద్యతీనగరమునుండి కళానిలయయొద్దకు వచ్చి నమస్కరింపుచు దేవీ ? నేను భర్తృదారిక పరిచారిక మంజరికనుఁ ఆమె పుత్తెంచిన నరుదెంచితిని. కళావతియుఁ గౌముదియు క్షేమముగా నున్నారు. మీ కుశలముఁ దెలిసికొనిరమ్మని రని నుడివిన యవ్వనిత మొగమింతఁ జేసికొని కౌముది సేమ మెవ్వరికిఁ గావలయును కళావతి యెట్లున్నది ? మందారవల్లియందే యున్నదియా ? దానిచేఁ బనులు సేయించుకొనుచున్నదా ? అన్నన్నా ! మా యింటికడుపుకూటి పారునిం బెండ్లియాడిన బోగముదాని గర్వభంగముఁ గావింపలేకపోయితినిగదా ? అది నాఁడు నాకుఁ గావించిన యవమాన మేతన్మాత్రమే. నా ముద్దు పట్టిని దాని యింటికి దాదిగాఁ జేయవలసివచ్చినది. సీ. పాడువిధీ ? యీ మానవతీ శిరోమణి కెట్టి యవమానముఁ గలుగఁ జేసితివి. అయ్యో? నా బిడ్డ సవతి యింట నెట్లు కాపురముఁ జేయుచున్నది? మంజరికా ! నాతో నేమి చెప్పుమన్నది? రహస్య విశేషము లేమైనం జెప్పినదా? చెప్పుము. చెప్పుము అని యడిగిన మంజరిక యిట్లనియె. అమ్మా ! కళానిలయా ! కులశీలవిద్యారూపసంపన్నుండైన భర్తకుఁ బ్రావాణములలో బ్రాణమై యున్నది. మందారవల్లియు నా యిందీవరాక్షినిం గన్న బిడ్డవలెఁ జూచుకొనుచున్నది. కౌముది కామెపైఁ గల ప్రేమ యిట్టిదని చెప్పఁజాలను. వసుంధరునకుఁ బట్టమహిషియై యా రాజ్యమామెయేపాలించుచున్నది. ఆయన ఇరువుర భార్యలను సమాన ప్రతిపత్తితోఁ జూచుచున్నాఁడు. ఇప్పుడప్పూఁబోణు లిరువురు గర్భవతులైరి. మీకు మనుమఁడుం గలుగఁగలడు. ఆ శుభవార్త మీ కెరింగింప వచ్చితిని. కళావతి కేమియులోపములేదు. ఇంతకన్న మీతో నేమియుఁ జెప్పుమన లేదని యచ్చటికథ యంతయుం జెప్పినది. ఆవార్త విని కళానిలయ యరమురిపెముతో ఏమీ ? ఇరువురును గర్భవంతులైరా ? అట్లయిన నందు నా పట్టి వేడుక చూచువారెవ్వరు ? మందారవల్లి బిడ్డలఁగని యెరుఁగదా? నెల మసలిన పిల్లను బుట్టినింటి కనుపక తనయొద్ద నుంచుకొనునా ? నీకు గడుపునిండఁ గూడు పెట్టినంతనే యూరక దానిం బొగడుచుంటివి. చాలుఁ జాలు అయ్యగారియొద్ద కరిగి మందారవల్లి పెట్టుకష్టములన్నియు నుడువుము. పొమ్మని కొన్నిమాట లుపదేశించి యంపినది.

అది తొలుతఁ తనతల్లియగు పల్లవికయొద్ద కరిగి అమ్మా ! కళానిలయ విద్వాంసురాలైనను సహజమైన క్రూరగుణమును విడచినది కాదు. కళావతి యక్కడ మిక్కిలి సుఖపడుచుండ నయ్యగారితో లేనిపోని నేరములు చెప్పుమని బోధించినది. మరియు వసుంధరుని రెండవభార్య కౌముదికి గర్భస్రావ మగునట్లు చేయుమనుచున్నది. అప్పుడుగాని తనకూఁతు చూలునకు సంతసింపఁడఁట. యీ మాట లన్నియు నీకు జెప్పుమన్నది. నేనీద్రోహకృత్యములఁ జేయఁ జాల. పిమ్మట నీవే యోచించుకొమ్మని చెప్పిన విని పల్లవిక యిట్లనియె.

పుత్రీ ! యజమాను లెట్లు పంచిన నట్లు చేయుట మనకు విధియై యున్నది. అందులకు మంచిచెడ్డల విమర్శింప మనకుఁ బనిలేదు. అమె తండ్రి నన్నామెతో నరణమిచ్చి పంపెను. నిన్నామె కూఁతుతోఁ బంపిరి. తరతరంబుల నుండియు మనము వారి నాశ్రయించుకొనియుంటిమి. మనదేహములు వారి యన్నముతోఁ బెరిగినవి. కావున నామె చెస్పినట్లే‌ చేయవలయునని బోధించి మంజరిక నొప్పించినది. మంజరికయుఁ దరువాత రాయలవారియొద్ద కరిగిన నతం డిట్లనియె.

రాయలు -- మంజరికా ! మన గళావతిని గర్భబరాలసయైనను మందారవల్లి పనులకు నియోగించి నిర్భంధించు చున్నదని చెప్పితివఁట. సత్యమేనా ?

మంజ - చిత్తము. సత్యమే ? భర్తృదారిక రెండుపూటలయందు. నామెకుఁ బాదసంవాహనము గావి౦పక భుజింపదు.

రాయ - అట్లు చేయుట భయముననా? భక్తినా ? మంజ -- ఆమెకు నత్తగారియందు భయభక్తులు రెండునుం గలిగి యున్నవి.

రాయ - సీ ! మూఢురాలా ? నీమాటల నేదియుం దేలకున్నది.

మంజ --- దేవా ! ఎట్టివారికిని బుట్టినింట నున్నట్లత్తవారి యింట జరుగునా ? ఆమె వలదనుచున్నను దనకు నోపిక లేకున్నను భర్తృ దారిక యత్తకుఁ బాదసేవసేయక మానదు. అప్పని సుఖమో కష్టమో మీ రెరుఁగరా ? పెక్కులేల ? భర్తను నత్తయు నన్ని పనులకు నామెనే చీరుచుందురు.

రా - చాలుఁజాలు. నీ వాచాలత తెల్లమైనది. అసూయా వివశురాలగు మీ దేవి కిట్టి మాటలఁ జెప్పి రోస మెక్కించుచుంటివి‌ ? అధిక ప్రేమలేక యన్ని పనులకుఁ జేరుట యెట్లు ?

మంజ -- అడుగిడుటకే శ్ర మపడుచుండెడి నా సఖురాలిం బలుమారు పనులకు నియోగించుట నాకుఁ జాల కష్టముగా నున్నది అది ప్రీతినో భీతినో నాకుఁ దెలియదు.

రాయలు - నీవు ఓయి కళావతిం దీసికొని రమ్ము. అంతయు దానివలననే తెలిసికొనఁ గలను.

అని యందలముతోఁ గూడఁ దగినపరివారము నిచ్చి మంజరికను గుముద్వతీ నగరమున కనిపెను. మంజరికయుఁ గ్రమంబున నవ్వీటి కఱిగి యావార్త వసుంధరున కెరింగించినది. తల్లి యనుమతివడసి వసుంధరుఁడు కళావతినిఁ బుట్టినింట కరిగి రమ్మని నియమించెను. కౌముదీ. కళావతు అక్కచెల్లెండ్రకంటె నత్యంతప్రీతితో వర్తింపుచు నాహారశయ్యా విహారముల విడువక యన్యోన్యాధిక స్నేహలతాపాశ బద్దులైయున్న కతంబున నిరువురు నొకచోటనే పురుడు పోసికొనుటకు నిశ్చయించుకొని యుండిరి.

దానంజేసి కళావతి వచ్చిన పరివారమును బంపివేయుచు ముందెప్పుడో వత్తునని తండ్రికుత్తరమును వ్రాసినది. కౌముదీకళావతు లొకనాఁడు సఖులతోఁ గూడి తూగుటుయ్యలల నూగుచు నిష్టాలాపములఁ ‌ బ్రొద్దుపుచ్చుచున్న సమయంబున మంజరిక యరుదెంచి అక్కలారా ! ఎక్కడనుండియో మనయూరొక యెఱుకలసాని వచ్చినది. అది త్రికాల వృత్తాంతములు చూచినట్లే చెప్పఁగలదఁట. మహర్షుల కైన నట్టి సామర్ధ్యము లేదని జను‌ లూరక పొగడుచున్నారు. మనసానుల కెట్టి సంతానము కలుగునో చెప్పఁగలదు. తీసికొని వత్తునా? యనుటయు నందున్న సుందరులెల్లఁ ఆ పిలువుమని తొందర పెట్టిరి.

సన్న తాటియాకులతో నల్లి న పొరలబుట్టఁ జంక నిడుకొని పూసలపేరు -------------------------- ‌ధరించి పెద్దనత్తుగదల దీవెనలం బాడుచు ---------------- నయ్యెఱుకలసానిని వెంట బెట్టికొని మంజిరిక యచ్చటికి వచ్చి నది. దానిని జూచి యచ్చెరు వందుచుఁ గౌముదీకళావతులు విద్వాంసు రాండ్రయ్యు లోకాచారమనుసరించి యెరుకఁ జెప్పించుకొనిరి. అయ్యెరుకతయు దేవతల నగ్గించుచు మంజరిక యడుగుచుండ జరిగినచర్య లన్నియు నిదర్శనముగాఁ బూసఁ గ్రుచ్చినట్లు వక్కాణించి వారినెల్ల నాశ్చర్యవశంవద హృదయులంజేసినది. అప్పుడందఱకు దానియం దధికవిశ్వాసము కలిగినది.

మంజరిక మరలఁ జేటలో బియ్యమువోయుచు మా దొరసానుల కెట్టిసంతానము కలుగునో యెరింగింపుమని సూచించుచు నెరుక నడుగుటయు నది గళావతికి వంశధురంధరుండగు కొమరుం డుదయించునని చెప్పి కౌముది గర్భమున భూతావేశమైయున్న కతంబునఁగొన్ని దినములలోఁ జెడిపోవునని నుడివినది.

అ మాట విని సఖులతోఁ గూడ గళావతి మిక్కిలి పరితపించుచు నోసీ! నీకు మంచి పారితోషిక మిప్పించెద నట్టి విపరీతము జరుగకుండఁ గాపాడగలవా ? యని యడిగిన యయ్యెరుకత నవ్వుచు అమ్మా! ఆమాత్రమెరుక లేక మేమింతదూర మెరుకఁ జెప్పవత్తుమా ? యని పలుకుచు నా పొలఁతి నొసట బసుపుతిలక మిడుచు బుట్టలోని నుండి యొక వేరు దీసి యిది గుర్విణులకు సిద్దౌషదము. రేపు రాఁబోవు గ్రహణదివసంబు రాత్రిఁ దీనిం గలితో నఱగఁదీసి లోనికిం బుచ్చుకొని పండుకొనునది. అయ్యుపద్రవ మెప్పటికిని జరగదని చెప్పి దీవించి యావేరిచ్చినది.

కళావతి యయ్యోషధిం గైకొని కౌముది పెద్దపరిచారిక పాటలిక యనుదాని చేతికిచ్చి దీనిభద్రముగాఁ గాపాడుచు నిది చెప్పినట్లు గ్రహణమునాఁడు కౌముది కిమ్ము. మరతువుసుమీ? అని బోధింది మయ్యెరుకతకుఁ గానుకలిచ్చి యంపుమని మంజరికను నియమించినది.

మంజరికయు నేదియో బహుమాన మీయఁబోయిన నయ్యెరుకత యందుకొనక తల్లీ ! మీ‌రు చల్ల గఁ బ్రసవమైన తరువాత మరల వత్తు. బిడ్డలనెత్తుకొని మంచి కానుక లిత్తురుగాక నిప్పుడేమియు‌ నొల్ల నని చెప్పి వారినెల్ల దీవించుచు నెందేనిం బోయినది. అప్పుడది యేమియుంగై కొనమి దానిమాటలయందు వారికెల్ల నెక్కుడు నమ్మకము కలిగినది. ధన మాసింపనివారిని భగవంతుఁడు మెచ్చుకొనుగాక.

గ్రహణ సమయంబునఁ బండుకొనుట గర్భిణీస్త్రీల కాచార్యముగా యున్నది. మరికొన్ని దినంబులకు వచ్చిన యపరాదదివసంబునఁబండు కొనక పూర్వమే కౌముది జ్ఞాపక ముంచుకొని నాఁటి యెరుకసాని యిచ్చిన మందిమ్మని న్యా నంత, పటిక లమూవేరునం దేడెియా విశేషము సున్నదనే. శలంచి గధ్భవట న దాని రాముల మరగం ఓసి పుచ్చుకొమ్మని చె మ్‌ గ నది కిన్చిన నడి. కౌముది యామందు?: డినసుదపుంలత." 114





వూదిటిల్‌ వొయు-షట దినిన వెంటనే కడుపుల మనవిని మటు నటు( గొట్టుకొనుచుండ రెండుగడియలలో గర్భస్రావమైనది. ఆ వార్త విని పాటలిక యార్తిఁ జెందుచు నొరుల కెవ్వరికిం జెప్పక మంజరిక యొద్దకుఁబోయి యోసీ? నేనెంత చెడుపని చేసితినో చూచితివా ? నాఁడయ్యెరుకత దొరసాని కిచ్చిన వేరు దివ్యౌషధమని తలంచి కపటముఁ జేసి కౌముది కియ్యక నీ మఱదల కిచ్చితిని. అది తినిన రెండు గడియలలోఁ గడుపు చెడినది. కౌముదికిఁ గొట్టవలసిన ముప్పు మనలం గొట్టినది. వింటివా? యని చెప్పుటయు నా మంజరిక మిక్కిలి దుఃఖించుచు అయ్యో ? నా తమ్మునికిఁ గొమరుఁ డుదయించునని గంపెడాశఁ బెట్టికొని యుంటిమి. నాతోఁ జెప్పక యప్పని యేమిటికిఁ జేసితివి ? సోది జెప్పెడివాండ్రు పెక్కుమాయలతో వత్తురు. వాండ్రిచ్చునవి యమృతములని నమ్మి గర్భవతుల కీయవచ్చునా ? అని‌ పెక్కుగతుల నిందించుచు నా రహస్యము వెల్లడిచేయవద్దని బోధించినది. మరి రెండు నాళ్ళకుఁ బల్ల విక యరుదెంచి మంజరికతోఁ బట్టీ ? ఇచ్చట విశేషము లేమి? కౌముదికి గర్భస్రావ మైనదా కళానిలయ తెలిసికొని రమ్మన్నదని యడిగిన నది యడలుచుఁ దల్లీఁ పరులం జెరుపఁ దలఁకొనిన వారు తామే చెడుదురు. నీవు పన్నిన కత్తెర నీ సిరమే నరికినది. కౌముదికేమియు లోపములేదు. నీ కోడలిగర్భమే చెడినదని యా వృత్తాంతమంతయు జెప్పినది.

పల్లవిక యురముఁ బాదుకొనుచు అయ్యో ! ముద్దుల మనమఁడు కలుగునని యెంతయో యాసతో నెదురుచూచుచుంటిని. ఆ ముసలి ముండ యీ పని యేమిటికిఁ జేయవలయును ? మనకు దొరకు లాభము కూడఁ జెడిపోయినది గదా? అని పొరటిల్లుటయు మంజరిక అమ్మా ! ఎవ్వరి నిందించినను బ్రయోజనము లేదు. దైవమే యీ కార్యముఁ జేసి మనకు బుద్దిఁజెప్పెను. ఇఁక నిటువంటి పనులెన్నఁడును జేయబూనకుమని బోధిందిన విని పల్లవిక పుత్రీ ! నీ వేదాంతవచనము శాంతించు దాననుగాను. నేను గళానిలయకు బ్రధానదాసిని‌. చేయవలసిన పని తుదముట్టఁజేసి తీరుదనని యేమేమో యసూయాపరవశురాలై పలికినది. ‌ పిమ్మట నిరువురు గళావతియొద్ద కరిగిరి. కళావతి పల్లవికం జూచి పుట్టినింటివిశేషము లేమని యడుగుటయు రాయల వారిచ్చిన కమ్మ యాకొమ్మ కిచ్చినది. దాని నామె చదివికొని భర్త కిచ్చినది. వసుంధరుఁ దాచీటిం జదువుకొని మందహాసము గావించుచు బోటీ ! నీ తండ్రి నిన్నుఁ బంప నందులకు మా తప్పుగా గణించి యేమెమో వ్రాసిరి. పెద్దల నలిగింపరాదు. నీవుపోయి రమ్ము. వారికిం జెప్పియే పురిటికి రావచ్చునని చెప్పుటయు ననుమోదించి యమ్మించుబోణి యమ్మరునాఁడే తగుపరివారముతోఁ పుట్టినింటి కరిగి తల్లిం గౌగలించుకొని వయస్యుల మన్నించుచుఁ బరిచరులనాదేశించు

తల ఆ తలో పం సొంశయననురల్సి పె పంలకుం గలుగదు. నెను నీ నిమిం ల షై ఉప. ఉట ఆ మనేక బాధలు పడుచుండ నీ మందారవల్లి మాయలకు లోనై నన్ను స్మరింపకుంటివి. నిన్నే మనవచ్చునని నిందించిన విని కళావతి యిట్లనియె.

అమ్మాఁ నేనక్కడ సర్వసౌఖ్యము లందుచుండ నీకు దుఃఖ మేమిటికి ? అత్త యత్తమగుణ విద్యాయత్త. భర్త సద్వర్తన చక్రవర్తి. సవతి భూలో మానవతి, ఇఁకనాకు గొదవ యేమునది? ఇరువురు మొకతావుననే పురుఁడు పోసికొన నియమము జేసికొంటిమి. దీనం దప్పేమి యున్నది? కౌముది నన్ను విడచి గడియ తాళలేదని తనయభిప్రాయము వివరించిన విని యాక్షేపించుచుఁ గళానిలయ యిట్లనియె.

ఆహా ! యేమీఁ నీ మోహము ? సవతి కావించు కపట మరయక దానిం గొనియాడుచుంటివా? బాపురే? నీ వైదుష్యమింత దూష్యమైన దేమి? కౌముది నిన్నిందు రాకుండ నందే పురుడు వోసికొమ్మని చెప్పిన కారణమె యెరుగనై తివిగదా? నాకప్పుడే తెలిసినది. వినుము. నీసంతానము నెట్లో చంపింపక మానదు. తా నొక్కరితయ మగని కెక్కుడు ప్రీతిస్థానమగు తలంపుఁ జెందియున్నది. నీవదియెరుంగక కౌముది యనసూయయని పొగడుచుంటివని పలికిన విని కళావతి మేను ఝల్లుమనఁ జెవులు మూసికొని అమ్మా ! యిట్టిమాట నీ నోటినుండి యెట్లువచ్చినదో తెలియకున్నదిగదా. సీ ? తమ చిత్తము ననుసరించి యెదిరి నిందింపరాదు కౌముదిగుణ మేమి తెలిసి నీ వట్లంటివి ? అది భూలోకమాతకాదా ? నా బిడ్డం గడ తేర్చిన దాని కేమి లాభమున్నది ? అసూయ యెట్టిదో యెరుఁగని యా యిల్లాలు కలలోనైన నిట్టి మాటతలఁచి యుండదు. ఇది యంతయు నీ కల్చనమనిగౌముదిం బెద్దగాఁబొగడుచుఁ దల్లిని నిందించినది.

అప్పుడు కళానిలయ యించుక సిగ్గుపడి యాహా ? దీనికి సవతియం దతిశయప్రీతి కలిగి యున్నది. ఇప్పుడు నా యభిప్రాయము దీనికిం జెప్పరాదు. ముందు వివరించెదగాక యని తలంచుచుఁ దల్లీ! నీకుఁ జెప్పువారము కాము. తోచినట్లే చేయుదువు. పోనిమ్ము. కౌముదికిఁ బుత్రోదయమైనంత జనులు తమకుఁ జక్రవర్తి పుట్టెనని సంతసింతురు. నీ పుత్రునట్లు మన్నింతురా ? అది నీకు లాఘవము కాదా ? లోకమున నెంత పేదవారైనను బ్రధమ ప్రసవము పుట్టినింట జరుపరా ? నీకు మాత్రముఁ దెలియదా ? నీవందుఁ బోరాదు. ఇందే యుండమని బోధించియు మందలించియుఁ గర్జించియుం జెప్పినది. కాని యా మానవతి యంగీకరింపక అమ్మా ! స్త్రీలకు గౌరవము భర్త మూలమున వచ్చును ? నా భర్త మహా వైభవ మనుభవింపుచుండ నాకే కొదవయును లేదు. నా పిల్లల గౌరవము గురించి పిమ్మట విమర్శింపవచ్చును. అని తల్లి మాటలకాన్నిఁటికిని సమాధానముఁజెప్పి ------------------- వెండియు భర్తవారింటికి కరిగినది. దృఢసంకల్పముగల మానవతులు తల్లి మాటలు విని పుట్టినింటనుండి మగని నిరసింతురా ?

మంజరికను బల్లవికను రహస్యముగాఁ జేరి కళానిలయ మన కళావతి వట్టిగోల ఏకర్మము నెరుఁగదు. చెప్పినం దెలిసికొనఁ జాలదు. మందారవల్లి గట్టి మందు పెట్టినది. దాని వలలోఁ జిక్కినది. మనమేమి చేయుదుము పోనిండు ప్రసవ‌ మక్కడనే కానిండు. మే యిరువురు కూడ నుందురు గదా? మీకంటె నాప్తులెవ్వరు ? లోపమేమియుఁ గలుగదు. కాని మరియొక లాఘవము మనకుఁ గలుగఁ గలదు. అది మీరు లెస్సగా నాలోచింపుడని కొన్ని రహస్య వచనంబు లుపదేశించుటయు మంజరిక యించుక వితర్కించి అమ్మా ? మొదటినుండియు మనము ప్రయోగించు కపట క్రియలన్నియు మనకే తగులుచున్నవి. ఊరకఁ యొరుల కపకారము సేయుట నీతి కాదని పలికిన మంజరికను వారించుచుఁ బల్లవిక యిట్ల నియె.

పుత్రీ ! పిల్లదానవు. దివాణపు చర్యలు నీవేమి యెరుంగుదువు. అంతఃపురకాంతలు సంత తికై యెంతెంత లేసి పనులఁ గావింతురో పలుక శక్యమా ? పుణ్యపాప వివక్షతతోఁ బనిలేదు. సాగునది యాలోచింపవలయును. ఇప్పుడమ్మగారు సెప్పిన మాట గూఢముగా మనకు జేయకతీరదు. మన భర్తృదారిక పుత్రునే చక్రవర్తిగా నాచరింపవలయును. ఇందులకుఁ బ్రతికూలము సెప్పక యుపాయ మాలోచింపుమని పలుకుచుఁ గళానిలయకుఁ సంతోషముఁ గలుగఁ జేసినది. మంజరికయు వారి మాటల కెదురాడ వెరిచి యట్లుచేయుట కొడంబడినది. పిమ్మట నిరువురు గళావతితోఁ గూడఁ గుముద్వతీ నగరమున కరిగిరి.

అని యెరిగించి మణిసిద్దుండు ప్రొద్దు మిగలుటయు నవ్వలి వృత్తాంతము తరువాతి మజిలీయందుఁ జెప్పఁ దొడంగెను.

ఎనుబది నాలుగవ మజిలీ.

ఘటదత్తుని కథ

అన్నన్నా ! భగవంతుడు సర్వసముండని వాడుకయేకాని యంత పక్షపాతి యెవ్వడును లేడు. నా తోడికోఁడలికి గడుపునిండఁ బిల్ల లనిచ్చి నాకొక్క బిడ్డనైన నీయకపోయెనే. నే నేమి యపకారముఁ జేసితిని. కావలసినంత భాగ్యమిచ్చినవాఁడీ యుపకార మేమిటికి జేయఁగూడదు? అన్నిప్రక్రియలు కావించితిని దేనివలనం బ్రయోజనము లేక పోయినది. యోగిని చెప్పినపని కడమగా నున్నయది. అప్పని యాడువాండ్రు చేయుట కష్టము. అర్దరాత్రమున శ్మశానభూమి కేగి స్నానముఁజేసి కాలుచున్న కుణపము నారిపి తత్కపాలచూర్ణమును దానిచ్చిన మంత్ర భస్మముతో గలిపి తినమని చెప్పినది. రాత్రి కాటిమాఁట దలపెట్టినంతనే మేను ఝల్లుమనును. పీనుగను జూచినఁ బ్రాణములు నిలుచునా> పోనిమ్ము. నావంటిది బ్రతికియున్న నేమిలాభము? గుండెరాయిఁ జేసికొని యిప్పనియుం గావించి చూచెదం గాక నేఁడు పర్వదినంబుగదా? మృతయైనం గావలయు నక్షిమతమైనం దీరవలయును.