Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/82వ మజిలీ

వికీసోర్స్ నుండి

జేయుదునని నమ్మించిన యాదాసీరండ మాయిద్దరిలోఁ గంతలు వెట్టి యారాచపట్టిం బెండ్లి చేయదునని‌ యేమేమో చెప్పి నమ్మించినది. మీ మాటలే యసత్యములని బోధించినది. కాంతిసేన తన తళ్కుచూపులు మాకెరవైచి మమ్మువలలో వై చికొని మా విద్యలు లాగికొని చెఱసాలం బెట్టించినది. ఎట్లోతప్పించుకొని వచ్చితిమి. రాజపుత్రా ! మీరన్నంతయు జరగినది. మాకూటిలో దుమ్ముపడినది. తరతరంబులనుండి యీ విద్యలు మావంగడమున నున్నవి. మాపేరు చెప్పిన నెంతెంతలేసి మవారాజు లైనను మాకు వెఱచుచుందురు. ఇప్పుడు వట్టి నిర్భాగ్యుల మైపోతిమి అని యా తస్కరు లిరువురు బిగ్గరగా నేడువఁ దొడంగిరి.

కరభ శరభ శంతనులు పక్కున నవ్వుచుండ రాజపుత్రుండు వారినూరడించుచు మీకు వచ్చిన భయములేదు. మీ కుటుంబముల మేము పోషించుచుందుము. యధేష్టముగాఁ దిరుఁగుడని జెప్పెను. వాండ్రు దుఃఖించుచు నిండ్లకుం బోయిరి.

రాజపుత్రుండు శంతనాదులతో నిఁక మన మాకాంతిసేనను వంచింపలేమా? పుడమి నెందైన మాయాబలవేత్తలులేరా? కర్తవ్య మేమి యని యడిగిన శంతనుఁడు రాజపుత్రా! విద్యలు నేర్చినవారు పెక్కండ్రు పుడమియం దుందురు. కాని కాంతిసేనను మాత్రము జయించలేరు. మనమిక దానిజోలికిఁ బోక సుఖముగా నిందుండ వలసినదే. లేనిచో ముప్పు రాకమానదని యుత్తరముఁ జెప్పెను. అందులకు సమ్మతింపక వీరసేనుఁడు కాంతిసేనం బరాభవించు తలంపుతో శాంబరీ విద్యాభిజ్ఞుల నరయుచు శంతనాదులతోఁ గూడికొని కొన్ని దినములు దేశాటనముఁ గావించెను.

అని యెరింగించి యవ్విరించి కులవతంసుఁ డప్పటికి సమయాతీతమగుటయు నవ్వలి కథ నవ్వలి మజిలీయందిట్లు చెప్పఁదొడంగెను.

ఎనుబది రెండవమజిలీ.

కామందకుని కథ

శంతనా ! ఈ యగ్రహారములో జలంధరుఁడను బ్రాహ్మణుడు గజరకర్ణ గోకర్ణములను మహామాయావిద్యల నెరింగియున్న వాఁడట. అతడు మహాతపశ్శాలి యగుట నెవ్వరిపైన నివి ప్రయోగించఁడట. మరియు నాయనకుఁ గామందకుఁడను గుమారుఁడు గలడఁట. వాడు సకల గుణాభిరాముఁడని చెప్పిరి. ఏవిద్య రాకున్నను తండ్రికొక్కరుఁడే కొడుకగుట వానియం దత్యంతప్రేమఁగలిగి యున్నవాడట. మన మా కామందకు నాశ్రయించి యా కాంతిసేన వృత్తాంతముఁ జెప్పి దాని వంచించు తెఱం గెరుంగుదము. కుమారుఁ డెట్టివాఁడైనను దండ్రి తనకు వచ్చిన విద్య నుపదేశింపక మానఁడు. ఆవిద్యలు మనకు స్వాధీనములైనచో నా రాజపుత్రికను దాదిగా నేలక పోవుదుమా?. అని చెప్పిన వీరసేనుని మాటలు విని శంతనుఁడు కానిమ్ము. నీకు‌ దోచినట్లు చేయుమని యుత్తరముఁ జెప్పెను. అప్పుడు కరభ శరభ శంతన వీర సేనులు నలువురు నయ్యగ్రహారములోఁ బ్రవేశించి మెల్లగాఁ గామందకునితో మైత్రిజేసి పది దినములు కలిసిమెలసి వర్తించిరి. ఒకనాఁడు రాజపుత్రుండు కామందకుంజూచి మిత్రమా ! నీతండ్రి మిగుల విద్వాంసుఁడు. గజగర్ణ గోకర్ణములను మహావిద్యల నెరింగిన ప్రోడ. అట్టివాని కొమరుండవు నీవింకనుం బెండ్లి యాడితివి కావేమి? నీకెవ్వరు కన్యనిచ్చిరి కారా? యేమియనియడిగినఁ గామందకుం డిట్లనియె.

వయస్యా! పెండ్లి పెండ్లియని మావారు నిత్యము నిర్భధించుచున్నారు. పెక్కండ్రు పిల్లల నిత్తుమని‌ వచ్చిరి. నాకు నచ్చిన పిల్ల దొరకక పెండ్లి యాడితిని గాను. అదియునుంగాక మా బ్రాహ్మణులలో హావభావ విలాసములం దెలిసికొన కన్యక లుండరు

సీ. ప్రతిదివసంబు తప్పకఁ దానమాడుఁ జ
          న్నీళ్ళ నిష్ఠకు మేని నిగ్గు సెడఁగఁ
    ననుసోయగ వెండ్రుకల్‌ గొనబుమీరఁగ దువ్వి
          సిగఁజుట్టుకొనక వై చుకొను దురుము
    చెలువు మీరంగఁ గచ్చెళులు దీరిచి వల్వఁ
          గట్టదు మడియంచు జుట్టఁబెట్టు
    బొమలసందున నందముగఁ జిన్నితిలకంబు
         దిద్దక మరిబెట్టుఁ బెద్దబొట్టు

గీ. నగలు దాల్పఁగ నేర్వదు వగలు మీర
    బలుక నేరదు హావభావముల నెఱిఁగి
    వ్రతములకె కాని రతులకుఁ బనికిరాదు
    వేషముల నేమి యెఱుగని విప్రకాంత.

బ్రాహ్మణకన్యకలు శృంగార కళాచాతుర్య రహితలని పెండ్లి యాడుట మానితినని చెప్పగా విని రాజపుత్రుండు నవ్వుచు నిట్ల నియె.

చెలికాఁడా ? నీవు రసికశేఖరుఁడ వగుదువు నీకుఁ దగిన నెలఁతయున్నది. పెండ్లియాడగలవా! ఆ సొగసు, ఆ వగలు, ఆ యొయ్యారము, ఆ చాతుర్యము, ఆ విలాసములు ఆ మాయలు బ్రహ్మసృష్టిలో మరియొకయాడ దానికిఁ గలవనిచెప్పలేము. అది స్వతంత్రముగా రాజ్యుముఁ జేయుచున్నది. క్షత్రియకన్యక దానిపేరు కాంతిసేన ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమారీవిద్యలన్నియు నేర్చియున్నది. మీ తండ్రి యొద్ద నున్న గజకర్ణగోకర్ణ విద్యలుమాత్రమే దానికిఁ దెలియవు. వాని నీ వుపదేశముఁ బొందిపోయితివేని నిన్ను వరింపగలదు. దాని మాయకులోనై విద్యయిచ్చితివేని మావలెనే కష్టపడుదువని యా కాంతిసేన వృత్తాంతము తాము పొందినపరిభవము లోనగు కథ యంతయుం జెప్పెను. అప్పుడా కామందకుఁడు చంకలెగరవైచుచు తండ్రియొద్దకఱిగి నమస్కరించుచు జనకా ! మీరునాకుఁ బలుమారు బెండ్లి ప్రయత్నముఁ జేసితిరిగదా ? నే నుపేక్షించినందులకు ఫలమిప్పటికిఁ దొరికినది. నాకోరిక లక్షణంబు లన్నియుంగల చిన్నది నేటిఁకి గనఁబడినది. కాంతిసేన అను రాజపుత్రిక నాకుఁ దగియున్నది. మీ యొద్ద నున్న విద్దెలు రెండును నా కుపదేశింపుఁడు. తృటిలోఁ బెండ్లియాడి మీ యొద్దకు దీసికొని వచ్చెదనని దత్త్వృత్తాంత మంతయు నివేదించెను.

ఆ తపస్వి పక్కు ననవ్వుచు గామందకా! నీ బుద్ధికౌశల్యము, నేనెఱుఁగనిదిగాదు టక్కరి టమారీలనే మోసపుపుచ్చిన యారాజపుత్రికను నీ వెట్లు వంచింపఁ గలవు వలదు. వలదు. ఇంటికడ సుఖంబుండుమని యెంతయో బోధించెను గాని యాతండు సమ్మతింపక నావిద్య లుపదేశింపనిచో బలవంతముగా సమసెదనని పలుకుచుండెంర్.

ఒక్కడే కొడుకుగావున నేమనుటకు నోరు రాక జలంధరుఁడు పో పొమ్ము. నీకు గజకర్ణ విద్య మాత్రముపదేశించుచున్నాను. రెంటికిఁదగవు ప్రజ్ఞాగల వాడవైతే దానతోఁగార్యంబు సాధించు కొనవచ్చునని పలుకుచు నావిద్య నుపదేశించెను.

కామందకుఁ డాక్షణమే శంతనాదులకడ కఱిగి మిత్రులారా! నాతోరండు? ఆ రాజుపుత్రికను మీ యెదుటనే పెండ్లి యాడెదనని పలుకుటయు వారునలువురుఁ జుట్టుకొని వాని విద్యాలాభము విని పరమానంద భరితులై వానివెంట నరుగుచు నిట్లనిరి. కామందకా ! నిన్నుఁ బెండ్లి యాడెదనని చెప్పి నీవిద్య లాగికొనఁగలదు. దానిమెడలో మంగళ సూత్రముఁ గట్టువరకు దానిమాట లేమియు నమ్మవద్దు. పెక్కులు వలపులు జూపఁగలదు. దేనికిని వశము కాఁగూడదు. నీవు పెండ్లి యాడితివేని మాకిష్టమే. మావిద్యలు మాకిప్పింపవలయుంజుమీ ? అని పలుమారు వానికిఁ జెప్పవలసినమాట లన్నియుం జెప్పిరి. అతం డొహో ! నాకింతఁ జెప్పవలయునా? నే నెఱుఁగనివాడఁను కాను. కావలసిన వేన వేల మాయలు మీకుపదేశించెదనని సగర్వముగా నుడివెను. వాని మాటలు విని శంతనుఁడాక్షేపించుచు వీనిం దప్పక నప్పూబోణి విద్యలాగి బద్దుం జేయఁగలదని నుడివెను.

అట్లు కామందకునితో ముచ్చటించుచుఁ గొంతదూరము వచ్చి శంతనాదులు రాజపుత్రిక తమ్ముఁబట్టించునను వెరపునఁ బురిఁ జొరనొల్లక వేరొక గ్రామమునకుఁ బోయిరి. కామందకుడుమాత్ర మావీటికింజని తన విద్యాప్రభావంబు లూరంతయుఁ జాటం బంచి తనతోఁగలహమునకు రమ్మని రాజపుత్రికకుఁ బత్రిక నంపెను.

కాంతిసేన యయ్యుదంతము విని కేసరిణికిఁ గొన్ని మాటలుపదేశించి యాకామందకునొద్ద కనిపినది. కేసరిణి యల్లన నతనియొద్దకఱిగి నమస్కరించుచు ఆర్యా ! నేను రాజపు‌త్రిక దాదిని. ఆమె మీస్వాగత మశిగినది. మీ విద్యాపాటవమున కక్క జపడినది మీరు లోకపూజ్యమైన విప్రవంశమున జనించితిరి. త్రిలోక మోహజనకమైన విద్యల సంపాదించితిరి. మీకు మా రాజపుత్రిక --------------- దా? పూజించి యంతఃపురమునకు దీసికొని రమ్మన్నది. వీర సేనుఁడను రాజపుత్రుని ప్రోత్సాహమున మీ‌రిట్లు పోట్లాటకు వచ్చినట్లు తలంచుచున్నాము. ఆ రాజపుత్రుఁడు మా కాంతిసేనను బెండ్లి యాడెదనని చెప్పి చాల చిక్కులు పెట్టెను. అని వారిమీద నేరము మోపి యుక్తిగాఁ జెప్పినది.

ఆ మాటలు వని యావిప్రకుమారుండు ఓహో ? నీ మాటలు మిగుల వింతగా నున్నయవి. కాంతిసేన వారి నందరిని బెండ్లి యాడెదనని చెప్పి విద్యలు లాగి చెఱసాలం బెట్టించినదఁట కాదా? వారందరు కాంతిసేన చాల క్రూరురాలని చెప్పిరి. నీ మాటలచే నట్టిదోష మేమియు గనంబడదు. యెంతయో సన్నాహముతో నా మీదికి వచ్చునని తలంచితిని ఈ మాత్రమునకే యంతగాఁ జెప్పిరి అని యుబ్బుచుఁ బలికిన గేసరిణి యిట్ల నియె.

ఆర్యా ! నీటికొలఁది తామర యనినట్లు మా రాజపుత్రిక క్రూరులకుఁ గ్రౌర్యము జూపక మానదు. టక్కరి టమారీలువచ్చి చేసిన యల్లరికి మేరయున్నదా? వారిని వంచించుట తప్పా? చెప్పుడు. మీవంటివారు‌ యందేలోప మున్నదని కపటము జేసెడిని. అమె యవివాహితయై యింతకాల ముండుటకు మీచెట్టఁ బట్టుటయే ఫలమని యూరక స్తుతియించుటయుఁ గామందకుఁడు వారు చెప్పిన మాటలన్నియు మఱచి యాస్తవము సత్యమని నమ్మి యిట్ల నియె.

చేటీ ! నేను గాంతిసేనను బెండ్లి యాడుట కంగీకరించితిని. ఆమెముందుగా నావిద్య యిమ్మనిన నీయను సుమా ? తొలుతనే చెప్పుచుంటిని. మంగళసూత్రముఁ గట్టిన పిమ్మట నాలోచింతును. ఆ మాట యిష్టమేని చెప్పిరమ్ము లేనిచో నేనొడంబడనని పలికిన నవ్వుచు నది ఆర్యా? మీ కీసందియమేల కలుగవలయును. మీరు భర్తయైనఁ జాలునని మా రాజనందన యానందించుచున్నది. మీ విద్యలు మాకేమియు నవసరము లేదు. మంగళసూత్రముఁ గట్టిన తరువాతనే యీయవచ్చునని పలికి యతని వెంటఁ బెట్టుకుని నగరిలోనికిఁ దీసికొనిపోయి రాజోపచారములు జేయించినది. పెక్కు లేల? ఒకదాసి పుత్రిక నలంకరించియదియే రాజపుత్రికయని చెప్పి యతనికి వివాహముఁగావించిరి. దాని మెడలో మంగళసూత్రము గట్టినతరువాతఁ గాంతిసేన వశ్యురాలై నదని సంతోషించెను.

పిమ్మటఁ బెండ్లి కూతురిచేత గజకర్ణవిద్య తనకిమ్మని యడిగించిరి. పెండ్లి యైనదిగదా? ఇఁక యెక్కడికిఁ బోగలవని యా విద్య భార్యకు ధారవోసెను. అది వెంటనే రాజపుత్రిక కిచ్చినది. శాంబరీ విద్యాబలశూన్యుఁడైన యా కామందకుని బట్టికొని చెఱసాలం బెట్టించినది.

ఆ వార్త గూడచారులవలనఁ దెలిసికొని కరభ శరభ శంతనవీర సేనులు మిక్కిలి పరితపించుచు వానితండ్రి జలంధరునొద్ద కఱిగి నమస్కరించుచు నార్యా ! మీ కుమారునకు గాంతిసేన తగని యవమానముఁ జేసినది. దాసీపుత్రిం బెండ్లిఁజేసి యావిద్య లాగి చెఱసాలలోఁ బెట్టినది. మామాట లేమియును వినక తన యిష్టమువచ్చినట్లుచేసి యవమానితుఁడయ్యెను. ఉత్తమ బ్రాహ్మణపుత్రునకు దాసీపుత్రికను బెండ్లి చేయుట యుచితమా యని పలుకుచు జలంధరునికి రోస మెక్కించిరి.

ఆ కథ విని యాతపస్వి నామాట విననందులకు వాని కీపాటి ప్రాయశ్చిత్తము కావలసినదే బోనిండు. దుష్టుఁడుశిక్షింపఁబడెనని యుపేక్షించిన విని వానితల్లి మిక్కిలి పరితపించుచు అయ్యో ? చిన్నతనమునే నేదియో యనెనని వాఁడు చెఱసాలలో నుండ నూరకుందురా ? ఇఁక మన నియమంబు లేటికి ? చాలుఁజాలు. వాని వేగమ విడిపించుకొనిరండు. అంతదనుక నేను భుజింపనని పట్టు పట్టినది.

ఆ తపస్వి అక్కటా ! నేనేమి చేయుదును ? నా‌ విద్య యొరులపీడకై బ్రయోగింపను. ఆ జాణ నా మాటలు వినివాని విడుచునా? కర్తవ్యమేమియని‌ యాలోచించుచున్న సమయంబున నతని శిష్యుఁడు తిమ్మర్సు మనుమఁడు రత్న పాదుఁడనువాఁడు గురునకు నమస్కరింపుచు నార్యా! మీరీ కార్యమునకై యిట్లు చింతింప నేమిటికి? నాకా గోకర్ణ విద్య నుపదేశింపుఁడు. ఆ రాచపట్టిని శిక్షించి మీ కుమారుని విడిపించి తీసికొని వచ్చెదను. అట్లు చేయనేని దిమ్మర్సు మనుమఁడగానని సాటోపముగఁ బలికెను. వాని బుద్ధిబల మంతకుముం దెరిఁగియున్నవాఁడు కావున నగ్గురుండు సంతసించుచు వాని కప్పుడే యా మంత్ర ముపదేశించి వత్సా ! నీకు మేముపాయములు చెప్పనక్కరలేదు. పరులు నొవ్వకుండఁ గార్యమును సాధించుకొని రమ్ము. పొమ్ము. అని దీవించి యంపుటయు నా రత్నపాదుండు శంతనాదుల నడిగి యా రాజపుత్రిక చరిత్ర మంతయుఁ దెలిసికొని వారి వెంటఁబెట్టుకొని యా పట్టణంబున కరిగెను.

శంతనాదులు వాని రూపురేఖా విలాసములును సాహసధైర్య గుణంబులును బరీక్షించి తప్పక వీఁడు రాజపుత్రికను జయింపఁ గలడని తలంచిరి.

రత్నపాదుని కథ

ఇంద్రజాలాది మాయా విద్యలకెల్ల నధకమైనది గోకర్ణవిద్య దానికిమించి మాయలులేవు. రత్నపాదుఁ డట్టివిద్య సంగ్రహించుకొని యప్పురముకు నరిగి మాయా బలంబున ననేక సేనలం గల్పించి భేరీ భాంకారాది ధ్వనులచే భూమి ------నట్లుఁ జేయుచు వాహినులా పట్టణము ముట్టడించునట్లు గల్పించెను.

ఆ యుపద్రవమునకుఁ బౌరులెల్లరు శిశుబాల వృద్ధముగా

హోర నరుబెంచినవని తఈంంచి వను సనల నొాయితను. నముంచినచె. కాని (“మం బూచిన నవవ శనంబచుచుండుట భంకించుకొని ముర 26 మాయాబలములని తెలిసికొని తమ ప్రజలకెల్ల వెరవవలదని బోధించినది. కాని ధైర్యము నిలువక వారు పారిపోవ దొడంగిరి.

రత్నపాదుఁ డొరులకుఁ గనం బడకయే యొకసారి భూకంపముఁ గలుగఁ జేసి బొంగరమువలె నా ప్రోలంతయుం గిరగిరఁ ద్రిప్పివైచును. మరియొక మాటు మహావాతంబుతోఁగూడ జీమూత సంఘంబులు కల్పించి పిడుగులే వర్షముగాఁ గురిపించును. ఒకతేప లంకాపురంబువోలె విస్పులింగచ్చటారావములతో నా భీలజ్వాలా సముజ్వల౦బగు పావకంబుఁ గల్పించి గృహంబుల దహింపంజేయును. దేవదానవ క్షుభితమగు మందర నగరంబు చాడ్పున నప్పురంబు సంక్షోభించుటయు నది యకాల ప్రళయమని ప్రజలు తల్ల డించుచుండిరి. స్వప్నమందుఁ బొందు బాధలకు వెఱచుచు మేల్కొనినపిదప నేమియుందోపని భంగి జాలానంతర మావంత యావంతయైనఁ గానిపింపదు.

ఒకనాఁడు పౌరులెల్లరు రాజపుత్రిక యొద్దకుఁబోయి దేవీ! నీవిట్లుపేక్షించిన నిలువఁ గలమా? ఇట్టి యుపద్రవము లేనాఁడును మే మెరుఁగము. ఈ మాయలన్నియు నీ రాజ్యముననే పొడముచున్నవి. ఈ విపరీతములకు హోమములుగాని శాంతులుగాని జేయింపుమని యేకగ్రీవముగా మొఱవెట్టిరి.

అ చిన్నది యిదియొకవాలము. ఇందులకు వెఱవ నక్కరలేదు. ఈ బాధలేమియు. మిమ్ముఁ బొందవు. రెండు మూడు దినములలోఁ బ్రతిక్రియఁ గావించెదఁ జింతింపకుఁడని యూరడించుచు మన పట్టణమునకు వింతవా రెవ్వరేని వచ్చి రేమో చూచిరమ్మని నలుమూలలకు దూతలం బంపినది.

రత్నపాదు డొక్క దేవాలయములో వసియించెను. రాజభటు లతనిజూచి మీ దేయూరు? ఇందేమిటికి వచ్చిరి? మీ వృత్తాంతముఁ జెప్పుడని యడిగిన నతండు, పో పొండు. నాజోలి మీకేల? నే నెవ్వండనో ఏదోశస్థుఁడనో యని తిరస్కారముగా డుత్తరముఁ జెప్పుటయుఁ గింకరులరిగి యత్తెఱవ కెరింగించిరి. అప్పుడా రాజపుత్రిక కపటవిద్యా ప్రయోగసరిణియగు కేసరిణింజీరి యతనియొద్ద కనిపినది. అదివోయి దేవళమున బ్రహ్మతేజంబున విరాజిల్లుచున్న యా భూసుర కుమారుంజూచి తల యూచుచుఁ జేరి నమన్కరింపుచు నిట్లనియె.

మహాత్మా ! తమ వియోగమున కేదేశవాసులు చింతింపు చున్నారు? అభిఖ్యావర్ణంబు లెట్టివి? మీ వేషముచూడ భూసురువంశ పావనులని తోచుచుచున్నది. మరియు మా నగరప్రజలకు నాశ్చర్యకరమగు వింతలం గనబరచినవారు దేవరయే యని తలంచెదను. మా రాజపుత్రిక మీ సేమమరసి రమ్మన్నది. మీ వార్త దెలిసికొని అతిధికి స్వాగతము

ఎ అన్నలు... ఆతరి. త్యాగలయయుం. అతనతల్‌ నడిగని ఎని నవ్వుచు నరం

కః

మి సపిదు కేసరిటయా యేషు? సమిటలు చొల -ఎప్పునిచ్ళా న. మీ రాజపుత్రిక మాకుఁ గావించిన యాతిధ్యమునకు సంతసించితిమి మాది దక్షిణ దేశము. బ్రాహ్మణులము. దేశాటనముఁ జేయుచుంటిమి. మీ యేలికసాని మాయా విద్యలలో మిగుల బ్రౌడులనివిని యీయూరు వచ్చితిని. మీరు చూచిన వింత లన్నియు నేను గావించిన జాలములే. ప్రతిజాల మేమియుఁ బన్ని మీ రాజపుత్రిక వాని సహకరించినది కాదేమి ? అని యడిగిన వినయము సూచించుచు నా వగలాడి యిట్ల నియె.

అయ్యారే ! మీ సామర్థ్య మనన్య సామాన్నమైనదిగదా ? మీ ప్రభావములో సహశ్రాంశమైనను గాంతిసేనకు లేదు. మీ కెట్లెదురాడఁ గలదు ? ఇప్పు డామె వివాహమాడు తలంపుతో నున్నది. విద్యలలోఁ దన్నెవఁడోడించునో వానిని భర్తగా స్వీకరింతునని నియమముఁ జేసికొని యున్నది. మీ కిప్పుడామె యోడినది కావున నామెకు మీరే భర్తలు. రాజ్యలక్ష్మితోఁగూడ నా చేడియఁ బాణిగ్రహణముఁ జేసికొనుఁడని చాతుర్యముగాఁ బలికిన విని యతం డిట్లనియె.

కేసరిణీ ! మీ రాజపుత్రిక చరిత్ర మంతయు మేము వినియున్నారము. పెక్కండ్ర నిదివరకే పెండ్లియాడి యున్నదఁట. న న్నెన్నవ మగనిగా భావింతువు ? నా విద్య యోలిగా నుపదేశింపపలయునా ? తరువాత నన్నుఁ జెఱసాలం బెట్టింతురా ? మీ మాయలలోఁ బడుట కేను కరభ శరభ శంతనుల గాను. టక్కరి టమారీలగాను మీ టక్కులు నాకడ సాగవు మా గురుపుత్రునిఁ జెఱసాలలో బెట్టించిర. ఇప్పు డతని విడువరేని మదీయ మా యా విద్యాపాటవంబున మీ పట్టణమంతయు నేటం గలిపెదను. చూడుమని పలికిన నులుకుచు నక్కలికి యిట్లనియె.

ఆర్యా ! మీ వద్ద నిజము దాచనేల ? మేము పెక్కండ్ర వంచకుల వంచించినమాట సత్యమే ? మా మాయకు లోఁబడక మిగిలిన వానిచే మా రాజపుత్రిక పెండ్లియాడఁ గలరు. మీ రతీతులు కావునఁ దగినవారని చెప్పితిని. దీనం దప్పేమి‌ యున్నదో? రండు. మా రాజపుత్రికం బెండ్లి యాడుడు. మా కపటంబుల గ్రహించితిరేని మాకుఁ బరివృధులే యగుదురు. అని పలికిన నతం డిట్లనియె.

బోటీ ! మేము మీ రాజపుత్రికను బెండ్లి యాడఁ దలంచుకొన్నప్పుడుగదా వారి పరిభవించుట ? మా కట్టి యనురాగములేదు. మా గురుపుత్రుని రప్పింపుమని చెప్పెను. అని గంభీర వాగ్గుంభనలచే దాని మరల మాటాడ నీయఁడయ్యె.

కేసరిణి వోయి రాజపుత్రిక కంతయు నెరింగించినది. అప్పుడామె యతం

శ తటపలైలని చింపంచుచు వన కూయోపా;సం:. అంహిలించి యనని స గాని తం చన్మాయు ల చది చంటతక పత్మికియ అం బళిన సవమానపసరపసు, అప్పుడు కేసరిణివోయి మా రాజపుత్రికను బెండ్లి యాడుదు కాని రమ్మని కోరిననామె వారివలన సంగ్రహించిన విద్యలన్నియు నా కిచ్చె నేని నేను బెండ్లి యాడెదను. లేకున్న నాకవసరములేదని యుత్తరముఁ జెప్పెను.

ఆ మాటఁ గాంతిసేన నభిముఖముగా విని యతం డనన్య సామాన్యుఁడని నిశ్చయించి సఖీపరివృతయై యక్కోవెల కరిగి యతని పాదములకు నమస్కరింపుచు నిట్లనియెను.

ఆర్యా! మీరు సర్వజనపూజ్యమైన బ్రాహ్మణవంశంబున జనియించితిరి. మీరెరుఁగని ధర్మంబులుండవు. కరభ శరభులు బ్రాహ్మణవంశజులయ్యుఁ జెడుగులగుట నా విద్యల కర్హులుకారు. టక్కరిటమారీలుకడ నట్టిమాయ లుండినచో లోకములకెట్టి యపకారమో యూహింపుఁడు. వీరసేనుఁడు రాజపుత్రుండైనను పూర్వ పదజ్ఞుండు కామింజేసి యతనికడ నా విద్య యుండతగినది కాదు. మీ‌ గురుపుత్రుని చాపల్యము మీకుఁ దెలియకపోదు. నా కీ మాయవిద్యలతో నొక్క ప్రయోజనము లేకపోయినను దుర్జనులకడ నట్టివిద్య లుండఁగూడదను తలంపుతో వారినెల్ల వంచించి యవి లాగికొంటి. మీ రుత్తములగట నీ విద్యలన్నియు మీ యొద్దనుండవచ్చును. మీ కిప్పుడే ధారవోయుచుంటిని. గైకొనుడు మీ గురుపుత్రుం దీసికోనిపొండు అని యతండు నమ్మునట్లు నుడివినది.

ఆ మాటలు విని యతఁడు మిగులసంతసించుచుఁ తరుణీ నీ యాశయము సకలజనసమ్మతమై యున్నది. ఈ విద్యలన్నియు నీ యొద్దనుండఁదగినవి. మా గురుండు మిగుల తపశ్శాలి. సకలవిద్యా పారంగతుఁడు. ఆయనకు లేక లేక యొక్కరుఁడే కొమరుండుదయించెను. వానిం బట్టికొని నీవు చఱసాలం బెట్టించితివి. వీనికొర కమ్మహానుభావుండు మిక్కిలి పరితపించుచున్నవాఁడు. నాకు సమ్మతముగా నీ వాతనిం బెండ్లియాడుము. ఇదియే నా కోరిక యని పలికిన యిట్లనియె.

సర్వజ్ఞులైన మీ రట్లనుట శోచనీయముగా నున్నది. అధమునకు నాలి నగుటకంటె నుత్తమునియింట దాదిగానుండుట లెస్పయని పెద్దలు చెప్పుదురు. మీ గురుపుత్రుని మతిప్రాగల్బ్యమెట్టిదో ప్రఖ్యాతమేకదా ? అదియునుంగాక నన్నీ విద్యలో నోడించినవానిని బెండ్లియాడెదనని నియమముఁ జేసికొంటి. అన్నిటికంటె వ్రతభంగ మెక్కుడుగదా ? మతిమంతులు మీకుఁ బదివేలు సెప్పనక్కరలేదు. అప్పుఁడురత్నపాదుం డిట్లనియె.

కాంతా ! నీవన్నదంతయు సత్యమే. మద్గురుండు పుత్రుని విజయము కొరకు నాకా మంత్ర ముపదేశించెను. ఇప్పుడు నేను మరియొక తెఱవుఁ దొక్కిన నతండేమనుకొనును. ఇప్పని నాకు సమంజసము కాదు. వేరొక తెరువుఁ జూచుకొనుమని బోధించెను. మీ గురుని యానతి వడసియే నేను మిమ్ముఁ బెండ్లి యాడెదను. వ్రతభంగమున కాయనమాత్రము సమ్మతించునా ? శివధనుర్భంగము ఎక్కువగాఁ జేసికొనిన సీత విష్ణుండు కోరినను నప్పని కొఱంతగాఁ బెండ్లి యాడునా ? అని యనేక దృష్టాంతరములు సెప్పి యతని నిరుత్తరుంజేసినది.

కాంతిసేన యప్పుడే తగు దూతలం బంపి జలంధరు నచ్చటికి రప్పించి వినయముతోఁ దనవ్రత పవృత్తియు రత్నపాదునిచిత్తవైముఖ్యతయు నెరిఁగించి ఆర్యా ! మీరే నాకుఁ దండ్రులు. తగినవరునికిచ్చి పెండ్లిఁగావింపుఁడని ప్రార్థించుటయు నా తపస్వి యా రాజపుత్రికా మతి కౌశల్యమునకు సంతసించుచు రత్నపాదునే వివాహముఁ జేసికొమ్మని యాజ్ఞాపించెను.

గురుననుమతి వడసి రత్నపాదుండు శుభ ముహూర్తంబునఁ గాంతిసేనం బెండ్లియాడి కామందకుండు ప్రధానియుఁ గరభ శరభ శంతనులు పరిహాస సఖులుగాను వీర సేనుండు సహాయుండుగా నొప్పుచుండ నా రాజ్యంబుఁ బెద్దకాలంబుఁ బాలించెను.

కష్టపడి యొకరు సంపాదించిన ద్రవ్యము వేరొకరు సుఖముగా ననుభవింతురను వాడుక యీ కథవలనఁ దెల్ల మగుచున్నది.

గోపా ! ఇంద్రజాలాది విద్యల ప్రభావం బిదియేసుమీ ? యని యెరిఁగించి మణిసిద్ధుండు శిష్యునితో నవ్వలి మజిలీ చేరెను.