కాశీమజిలీకథలు/ఆరవ భాగము/81వ మజిలీ
యెనుబది యొకటవ మజిలీ
టక్కరిటమారీ కథ
అన్నన్నా ! ఆమె వైరులకు మారిగాని రాజకుమారి కాదు ! ఔరా ! ఎంతెంతవారి నెట్లు చేసినది. వంచకుల వంచించు నేరుపా పూబోణికే కలదు శబాసు. బాపురే ! కాంతిసేనా ! టక్కురిటమారీల నిరువురఁబొందఁ బడవేసితివిగదా ? అమ్మయో ? వాండ్రముందర లోకములు నిలుచునా ? మారీచసుబాహులు కన్నను నిల్వలవాతాపుల కన్నను నాముచ్చలు హెచ్చుమాయ రెరింగినవారు. అట్టివారిం బుట్టలోఁ బెట్టిన యారాచపట్టి శ్రీరామునికన్నను నగస్త్యునికన్నను నెక్కుడు బలశాలిని యని చెప్పనోపును. అని పొగడుచున్న వైతాళికుని మాటలువిని జంబుకుఁడనువాడు అన్నా ! టక్కరిటమారీలన వారెవ్వరు ? మారాజపుత్రిక వారలనెట్లు వంచించినది. ఆ వృత్తాంతముఁ జెప్పుమని అడిగిన నతండిట్లనయె.
జంబుకా ! కరభ శరభ శంతనులు రాజపుత్రికచే నవమానింపఁబడి ద్వీపాంతరమున కఱిగి యందు మహేంద్రజాల విద్యాపారంగతుఁడైన వీరసేనుఁడను రాజపుత్రు నాశ్రయించి వాని నిచ్చటికిఁ దీసికొని వచ్చిరి. అతండు విద్యచే నధికుఁడైనను నక్కలికి వలపులకుఁ జిక్కి తన విధ్య ధారవోసి చెఱసాలలోఁ నెట్టఁబడెను. నాఁడు జరిగిన వృద్ధరాజుగారి సంవత్సరీకోత్సవమునకుఁ గొందరపరాధులు చెఱసాలనుండి విడువఁబడిరి. విమర్శింపక నప్పుడు కరభ శరభ శంతన వీరసేనుల నలువురను విడచి వైచిరి. ఆ రాజపుత్రుండు తమ దేశముపోయి తండ్రితోఁ దనయవమానముఁజెప్పి దుఃఖించుచు నింద్రజాల మహేంద్రజాల విద్యకన్న నెక్కుడు మాయ ఎఱింగిన టక్కరిటమారీలను నిరువుర దొంగలఁ దమమిత్రుల రప్పించి యిట్లు వాక్రుచ్చెను.
మిత్రులారా ! నన్నొక రాజపుత్రిక నమ్మించి మిక్కి.లి యవమానపరచినది. మీ మాయా బలపరాక్రమములు లోకాతీయములు గదా? గోపురములను, గోడలును, గవాటములును మీ గమనమున కాటంకముఁ గలుగఁ జేయనేరవు. మీరు తలంచితిరేని నెట్టి రహస్య స్థలమందలి వస్తువులనైనను దీసికొని రాఁగలరు. మీరు బోయి యారాజపుత్రిని బట్టుకొని రెక్కలుగట్టి నా యొద్దకుఁ దీసికొని రావలయును. ఇదియే మీరు నాకుఁజేయు నుపకారము. అది కడు మాయలమారి, పెండ్లి యాడెదనని వలపులు చూపి మగవారినెల్ల వలలో వైచుంజుడీ ? ఆ మాట లేమియు వినక యిక్కడికి లాగికొనివచ్చుటయే కర్జము అని తదీయ కుల శీల నామంబులన్నియు ---------------- వాండ్రు గాండ్రుమని యర్5అచుచు నిట్లనిరి.
మాకిది యెంతపని ? మీకీపాటి యుపకారము చేయనిచో మా విద్యాపాటవ మేమిటికి? మీరు మమ్మాదరించి మీ దేశములో జోటిచ్చితిరి. కృతజ్ఞులమై యిప్పుడే పోవుచున్నాము. అని మీసములు దువ్వుటయు రాజపుత్రుఁడు సంతసించుచు శంతనాదుల వారికి సహాయముగాఁ బొమ్మనెను.
శంతనుండు దేవా ! ఈ దొంగలామెనేమియుం జేయలేరు ఏదో కపటముపన్ని వీఇని వంచించును. నా మాటఁ జూడుడు. మేమెక్కడికిఁ బోజాలము. ఇందే యుండెదము అని బ్రతిమాలికొనిరి. అప్పుడా తస్కరులిరువురు పోనిండు. మాకెవ్వరు సహాయమక్కరలేదు. మేమే పోయి యా రాచపట్టింగట్టి తీసికొని వత్తుమని బీరములు పలుకుచు బయలువెడలి యోడయెక్కి కడలిదాటి యావీటి కరిగి యొక రేయిఁ దమ విద్యాపాటవంబున నిరాఘాటముగాఁ గోటలోనికింబోయి యంతఃపుర కాంతలెల్లఁ దద్దరిల్ల నల్లరిఁజేయుచుఁ గేకలు వైచుచు రాజపుత్రిక కాంతిసేన యెందున్నది ? మాయలు పెక్కులు నేర్చినదఁట ? ఏదీ యిటు రమ్మనుఁడు. టక్క_రిటమారీరము వచ్చితిమి. మా యేలికయైన వీర సేన రాజకుమారునిఁ బరిభవించిన ఫలం బిప్పుడే యనుభవింపగలదని పలుకుచు నలుమూలలు తిరుగుచున్నంతఁ గాంతిసేన యొకమూలడాగి పరిచారికకుఁ గొన్ని మాటలు జెప్పి యంపినది.
అది వారికెదురు వోయి మీరెవ్వరు ? ఈ యర్దరాత్రంబున నిచ్చటి కేమిటికి వచ్చితిరి? కాంతిసేనను నేనే మీకేమి కావలయునని యడిగిఁ బరాసిక నవ్వుచు నోహో ? నీవేనా రాజపుత్రికవు. నీ రూపమునకు వలచియే మా రాజపుత్రుండు మోసపోయెను. పద పద అతని పాదంబులఁబడి యపరాధముఁజెప్పి కొనుమని పలుకుచుఁ జెరియొక చేయింబట్టుకొని యాజవరాలి నవలీల నంతఃపురము దాటించి భుజములపై నిడికొని యతిజవంబున బారుచుఁ గతిపయ ప్రయాణంబుల జలదిదాటి కుశద్వీపముఁజేరి వీర సేనునొద్దకుఁ దీసికొనిపోయి యిదిగో కాంతిసేన? నీయిష్టము వచ్చినట్లు చేసికొనుమని పలుకుటయు శంతనుం డిట్లనియె.
బాపురే ! మీ సాహసము కొనియాడఁదగియున్నది. ఆబోటి మేకెట్లో ఇది. కాంరిసేన కాదు: ఇం దాది ఎంత చొసోవివు 1 బోగలదు. మకటఃవ్‌ం పెంపు వాపిట్ కతిగ చుం గాలించి చతకి కొంతెచేనః బట్టి”. బై ఇ కి గ్వీై, కల, స ల ఎరలిటి్ అం!గొ,, సాన్కంలండిం, “0౮3 పురకాంతలల్ల శభటులు చతుం9/ బలషులు యద్ధసన్న్య్థ గ నటుల తళ వాం నాటంవను సేయలేక ఫోయిని జక మస. సమ నేలంజదికిలంబడి [ప్రాణములు వదలినది. అప్పువ? టింగలు పేష చి తూపి అప్ప లశ" 4 చలం )"ఫసలడెరి శననస్పుడు వాం సేం అయ్యో ? మన రాజపుత్రుని యభిలాష తీరినది కాదు ఈ మచ్చకంటి చచ్చినది. దీనిం దీసికొనిపోయి యతని ముందరఁ బెట్టెదమా? అని యాలోచించుచుండఁ గేసరిణివచ్చి కన్నీరుఁగార్చుచు అయ్యా ! మరణాంతరములు వైరములని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ చిన్నది మృతినొందినది. శత్రువుల యభీష్టములు తీరినవి. ఇక నీ శవముపైఁ గోప మేమిటికి? మా కిచ్చివేయుఁడు. దహనాది సంస్కారములు చేసికొందుమని వారికి జాలి పొడమునట్లు ప్రార్దించినది. అప్పుడు వాండ్రు వితర్కించి తీసికొనిపొండు. ఈ శవముతో మాకుఁ బనిలేదు అక్కడికిఁ దీసికొని పోయితిమేని కుళ్ళిపోఁగలదు అని పలుకుచు నా శవము నందువిడిచి దీనవదనులై సముద్రముదాటి వీరసేను నొద్దకరిగి శంతనాదులువిన రాజపుత్రా ! ఆ కాంతిసేన పాపము మారాయిడికోడి దారిలోఁ జచ్చినది సుమీ అని జరిగిన కథయంతయుం జెప్పిరి.
అప్పుడు శంతనుఁడు పక్కున నవ్వుచు రాజపుత్రా ! నేను జెప్పలేదా ? అప్పడతిని జయించువాఁడు పుడమిలో లేఁడు. అది పరకాయ ప్రవేశ విద్య నేర్చినదగుటఁ దనప్రాణ మేశరీరములోనో ప్రవేశింపఁజేసి చచ్చినట్లు కనంబడినది. ఆ మర్మము మీరెఱుఁగక శరీరము వారికిచ్చివచ్చితిఁ కేసరిణి దీనికంటె మాయలమారి ఈపాటికి వీటి కఱిగియమ్మగువ యధాప్రకారము రాజ్యమేలు కొనుచుండును. అనినంత.
ఆ మాట విని వాండ్రు అయ్యో ? ఆ కపటము మాకేమి తెలియును. నిజముగాఁ జచ్చినదేయని తలంచితిమి. మీరు రమ్మనిన రారు. మేమేమి చేయుదుము ? రెండు తేపలకంటె మామాయ యొకరిపై బ్రయోగింపరాదు. ఆ రాజపుత్రికపై మామాయ యిఁక వ్యాపింపదు. మేము పోఁజాలము. మాకనుజ్ఞ యిండని వాండ్రు రాజపుత్రుని కోరికొనిరి. రాజపుత్రుఁడు మిక్కిలి పరితపించుచు అన్నన్నా !మీయట్టి దిట్టలు నాకు బాసటలు జేసినను నా కాంతిసేనను బరిభవింపలేక పోయితిని గదా ? మీ పేరు వినినంత నా కాంత భీతిల్లకమానదు. మొదట మీరు తీసికొనివచ్చిన పరిచారికతో మాట్లాడితిని. దాని నవ్వీడుఁ జేర్చితిమేని మనకు సహాయముఁ జేయుదునని యనేక ప్రమాణికములు చేయుచున్నది. దాని వెంటఁ బెట్టుకొని పోవుఁడు. దానివలన నెట్టొగుట్టుఁ దెలిసికొని యారాచపట్టిం దీసికొని రండు. ఈ మాత్రముపకారముఁజేయక తీరదని బలవంతపరచిన వాండ్రెట్టకేని సమ్మతించి, యాదాదితోఁగూడ మరల నావీటి కఱిగి దాని యింటిలోనే నివసించిరి.
అమ్మరునాఁడది రాజపుత్రియొద్ద కరిగి నమస్కరించుచు టక్కరిటమారీలు మరల యాపురమున కరుదెంచిరి. వారితో నేనువచ్చితినని చెప్పినతోడనే కాంతిసేన
అము సంసల తటతడు గొట్టకొనము. ఆము యటంపొటు జాచి యి+దొద 5
“అవపనిలల లితిఆంంటీి, ఆటమ్ సింటంంంంనో దేవీ! నీవింత తొందరపడవలసిన పనిలేదు. వాండ్ర మాయవిద్య లిఁకనీపై వినియోగింపవు. వారామాట జెప్పుకొనుచుండ వింటిని. ఊరక నిన్ను బెదరింపవచ్చిరి. మాయింటనేయున్నారని యా తెరంగంతయు నుడివినది.
అప్పుడు కాంతి సేన కొంతధైర్యముఁ దెచ్చుకొని ఎట్టెట్టూ ? ఆ మాట నీవు స్పష్టముగా వింటివా? కానిమ్ము. ఈ మాత్ర మవకాశమున్నదిగదా? కాకున్న వాండ్ర ముందర లోకములు నిలుచునా? యని పలికి దానికిఁ గొన్ని మాటలు బోధించి యంపినది. ఆ దాది వారియొద్దకువచ్చి వినయముతో మనోహరులారా ? మీరు నన్నుఁ బుత్రిక వోలెలాలించుచుఁ దలపూవువాడకుండ నీయూరు తీసికొనివచ్చి బంధువులలో గలిపితిరి. మీ కెద్దియేని యుపకారము చేయవలయునని తలంపుగలిగినది. నేడంతఃపురమునకుఁబోయి వచ్చితిని. ఆమె పెండ్లియాడవలయునని యూరకఁగుతూహలపడు చున్నది. తగినవరుఁడు దొరకలేదు. వీర సేనుఁడనుకూలుఁడనియే యెంచినదికాని తనతో నాద్వీపము రమ్మనుటచే నంగీకరించినది కాదు. ఎట్టివారికిని బుట్టినింటిసిరియందభిలాష యుండక పోవదు. ఇప్పుడా రాజకుమారునే పెండ్లియాడెద వార్త నంపుమని నాతోఁ జెప్పినది. నాకు వేరొక బుద్ధి పుట్టుటచే నతనియందు దోషారోపణముఁ జేసితిని. మీకు గల మాయా బలపరాక్రమములు వానికిలేవు. మీ ఖ్యాతి యంతయు నా దీవియందున్నప్పుడు విన్నాను. మిమ్మే పెండ్లియాడుమని చెప్పఁ దలచు కొన్నాను. దీనికి మీ యభిప్రాయమేమని యడిగిన నాదస్యులు సంతసించుచు నిట్లనిరి.
ఇంతీ! కాంతిసేన పెండ్లియాడెదననిచెప్పి మగవారినిఁ బెక్కండ్ర వంచించినదట కాదా? ఆమాట నమ్మవద్దని మా రాజపుత్రుడు పలుమారు నాతో జెప్పి యుండెను. నీ మాటలు సూడ వేరొక తెరుఁగుగానున్నవి. అవును ఆఁడుది యెన్ని నాళ్ళు పెండ్లి యాడక బిగబట్టుకొని యుండగలదు. నీ యిష్టము. వంచనగాక యదార్దముగా నీకట్టి యభిప్రాయమున్న సంతోషమేకాదా యని పలికిన నక్కలికి యిట్లనియె.
అన్నలారా! ఆ రాజపుత్రుఁడు మీతో నట్లేమిటికిఁ జెప్పెనో గ్రహించుకొనరాదా ? తాను వలచియున్నవాఁడు. మీ పౌరుషమునకు మెచ్చికొని యమ్మచ్చకంటి మిమ్ము వరించిన మీరు పెండ్లియాడి పోదురేమో యని యట్టి వ్యూహము బన్నెను. మంచి వస్తువు యందెవ్వరికిష్ట ముండదు? ఆమెకు వివాహమునందలి మిక్కిలి వేడుకగా నున్నది. కనుక నింత చెప్పవలసి వచ్చినది. రేపు పోయి మాట్లాడివచ్చెద. మాట లేమిటికి? నిశ్చయమే యని తలంచుడు. అని చెప్పి వారి సంతోష వారిధిలో ముంచినది.
అది మొదలు వాండ్రు దానితో నీవుపోయి వచ్చితివా? పెండ్లి నిశ్చయించితివా? రాజపుత్రిక యేమన్నది? అని ముచ్చటించని గడియలేదు. ఆ దాదియు నిదిగో యదిగోయని నాలుగుదినములు గడిపి యొకనాఁడు టక్కరితో రహస్యముగా నిట్లనియె.
టక్కరీ? రాజపుత్రికతో మీ మాట సెప్పితిని. ఇరువురను నెట్లు పెండ్లి యాడుదును. వారిలో నీకిష్టమైన వాఁడెవ్వఁడో చెప్పుమని యడిగిన నీమాటయే పెద్దగాఁ జెప్పినది. నిన్నుఁ బెండ్లియాడుట కంగీకరించినది. మరివాఁ డిందుల కేమనునో యూహింపుమని చెప్పినవాఁడు నలుదిక్కులుచూచుచు నిట్లనియె. అవును. నీవన్న మాట సత్యమే ఒక్క పడుచు నిద్ద రెట్లు పెండ్లియాడుదురు. ఈ మాట మేము విమర్శించు కొనలేదు. అతం డేమనగలఁడు? రాజపుత్రిక కెవ్వరి యదిష్టమో వానినే పెండ్లియాడ మని చెప్పుము అని బోధించెను ఆ దాది టమారితోఁగూడ నిట్లే చెప్పిన వాఁడును టక్కరి చెప్పినట్లే చెప్పెను
అదియొకనాఁడు వారి నిరువురను నొకరికిఁ దెలియకుండ నొకరి నా రాజపుత్రిక యున్న ప్రాసాదమనకుఁ దీసికొనిపోయి చెరియొక చోటం గూర్చుండఁబెట్టినది. టక్కరికి దెలియలేదని టమారియు టమారికిఁ దెలియలేదని టక్కరియు సంతసించుచుం దా నొక్కరుఁడే అక్కడికి వచ్చితిననియుఁ దానే రాజపుత్రికను బెండ్లి యాడుచున్నాననియు నుబ్బుచుండిరి.
అప్పుడు తొలుత గాంతిసేన జగన్నోహనరూపముతో టక్కరియొద్ద కరుదెంచి యా దాదింజూచి యోసీ ? నీవు పొగడిన పురుషుఁ డితండేనా? నాకు వీనీవలన నోలి యేమి యిప్పించుచున్నావు. నా విద్య వీని కిచ్చుచున్నాను. వీని విద్య నాకిమ్మని చెప్పితివా? అని తళ్కు చూపులు వానిపైఁ బరగించుటయు మోహపరవశుండై యొడలెరుగకయే మాటయాడుటకును నోరురాక యాకన్యకామణికిఁ దనటక్కరి విద్యధారవోసి యింద్రజాలము తనకిమ్మని కోరికొనియెను.
ఇదిగో ? ఇప్పుడే వచ్చుచున్నాము. వివాహమునకు సర్వసిద్ధము చేయింపుమని నుడువుచు టమారియొద్ద కఱిగి వానితోఁగూడ నట్లే పలికి వలపున నొడ లెరుంగకుండఁ జేసి వానివిద్యసైతము ధారవోయించుకొన్నది.
అప్పుడు వాండ్రు పెండ్లి కూతురు మరల దమదెసకు వచ్చునని యాసతో నెదురు చూచుచున్నంతలోఁ గొందరు రాజభటులువచ్చి వారి పాదంబులకు సంకెళులు తగిలించి రెక్కలువిరిచికట్టి చెరసాలలోఁ బెట్టిరి. టక్కరిటమారీలు మాయాబల శూన్యులై బట్టుపడి బందీగృహంబునఁ బెట్టబడిరని విని రావణకుంభకర్ణులవధ విని వేల్పులు సంతసీంచునట్లు భూలోకప్రజ లందరు సంతసించిరి.
కొన్నిదినములైన వెనుక కారాగృహరక్షకుల నెట్లో వంచించి టక్కరిటమారీలు చెఱఁదప్పించుకొని పారిపోయి కుశద్వీపమున కఱిగి రాజపుత్రుంగాంచిరి. వీరసేనుండు వారింజూచి, చోరులారా ! కాంతిసేనం దీసికొని వచ్చితిరా? ఇంతజాగు చేసితిరేల? మిమ్ముఁ జూచి మాచిగురుబోణి వెఱచినదియా? అచ్చటి విశేషములు చెప్పుడని అడిగినవాండ్రు కన్నీరుఁ గార్చుచు నిట్లనిరి. చేత నాయుధములేక శత్రువుల మీదకేగిన బరాభవము రాకపోవునా? మాయాబలశూన్యుల మైతిమి. పోఁజాలమని యెంతఁజెప్పినను వినక బలవంతమున మమ్ముఁ ద్రోచితివిగదా? మనకుపకారముఁ జేయుదునని నమ్మించిన యాదాసీరండ మాయిద్దరిలోఁ గంతలు వెట్టి యారాచపట్టిం బెండ్లి చేయదునని యేమేమో చెప్పి నమ్మించినది. మీ మాటలే యసత్యములని బోధించినది. కాంతిసేన తన తళ్కుచూపులు మాకెరవైచి మమ్మువలలో వై చికొని మా విద్యలు లాగికొని చెఱసాలం బెట్టించినది. ఎట్లోతప్పించుకొని వచ్చితిమి. రాజపుత్రా ! మీరన్నంతయు జరగినది. మాకూటిలో దుమ్ముపడినది. తరతరంబులనుండి యీ విద్యలు మావంగడమున నున్నవి. మాపేరు చెప్పిన నెంతెంతలేసి మవారాజు లైనను మాకు వెఱచుచుందురు. ఇప్పుడు వట్టి నిర్భాగ్యుల మైపోతిమి అని యా తస్కరు లిరువురు బిగ్గరగా నేడువఁ దొడంగిరి.
కరభ శరభ శంతనులు పక్కున నవ్వుచుండ రాజపుత్రుండు వారినూరడించుచు మీకు వచ్చిన భయములేదు. మీ కుటుంబముల మేము పోషించుచుందుము. యధేష్టముగాఁ దిరుఁగుడని జెప్పెను. వాండ్రు దుఃఖించుచు నిండ్లకుం బోయిరి.
రాజపుత్రుండు శంతనాదులతో నిఁక మన మాకాంతిసేనను వంచింపలేమా? పుడమి నెందైన మాయాబలవేత్తలులేరా? కర్తవ్య మేమి యని యడిగిన శంతనుఁడు రాజపుత్రా! విద్యలు నేర్చినవారు పెక్కండ్రు పుడమియం దుందురు. కాని కాంతిసేనను మాత్రము జయించలేరు. మనమిక దానిజోలికిఁ బోక సుఖముగా నిందుండ వలసినదే. లేనిచో ముప్పు రాకమానదని యుత్తరముఁ జెప్పెను. అందులకు సమ్మతింపక వీరసేనుఁడు కాంతిసేనం బరాభవించు తలంపుతో శాంబరీ విద్యాభిజ్ఞుల నరయుచు శంతనాదులతోఁ గూడికొని కొన్ని దినములు దేశాటనముఁ గావించెను.
అని యెరింగించి యవ్విరించి కులవతంసుఁ డప్పటికి సమయాతీతమగుటయు నవ్వలి కథ నవ్వలి మజిలీయందిట్లు చెప్పఁదొడంగెను.
ఎనుబది రెండవమజిలీ.
కామందకుని కథ
శంతనా ! ఈ యగ్రహారములో జలంధరుఁడను బ్రాహ్మణుడు గజరకర్ణ గోకర్ణములను మహామాయావిద్యల నెరింగియున్న వాఁడట. అతడు మహాతపశ్శాలి యగుట నెవ్వరిపైన నివి ప్రయోగించఁడట. మరియు నాయనకుఁ గామందకుఁడను గుమారుఁడు గలడఁట. వాడు సకల గుణాభిరాముఁడని చెప్పిరి. ఏవిద్య రాకున్నను తండ్రికొక్కరుఁడే కొడుకగుట వానియం దత్యంతప్రేమఁగలిగి యున్నవాడట. మన మా కామందకు నాశ్రయించి యా కాంతిసేన వృత్తాంతముఁ జెప్పి దాని వంచించు తెఱం గెరుంగుదము. కుమారుఁ డెట్టివాఁడైనను దండ్రి తనకు వచ్చిన విద్య నుపదేశింపక మానఁడు. ఆవిద్యలు మనకు స్వాధీనములైనచో నా రాజపుత్రికను దాదిగా నేలక పోవుదుమా?. అని చెప్పిన వీరసేనుని మాటలు విని శంతనుఁడు కానిమ్ము. నీకు దోచినట్లు చేయుమని యుత్తరముఁ జెప్పెను.