Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/78వ మజిలీ

వికీసోర్స్ నుండి

రాజు శరీరములోనుండి ప్రాణములు లేచిబోయినవి. ఇదియే సమయమని తలఁచి శరభుఁడు తన శరీర మెక్కడనో పారవేసి యా రాజశరీరములోఁ బ్రవేశించెను.

అప్పుడు కరభుఁడు వాని శరీరము వెదకి పట్టుకొని జుట్టునకుఁ ద్రాళ్లుగట్టి యొక చెట్టునకు దలక్రిందులుగా వ్రేలఁగట్టెను. అ జాల యొక దివసముకన్న నిలువదు కావున నా పట్టణ మంతలో మాయమైపోయినది. ఉపాది నశించినతోడనే శరభుఁడు నిలువలేక తన దేహము వెదకికొని దేహములోఁ బ్రవేశించి తలక్రిందుగా నుండుటకు వగచుచు నేల కురికి యది కరభుఁడు పన్నిన జాలమని తెలిసికొని తన యవమానమును గురించి దుఃఖించుచు నౌరా! యిది నిజమైన పట్టణమనియు నతఁడు రాజనియుఁ తలంచి మోసపోతిని అన్నన్నా ! ఇంద్రజాలము సత్యములాగే తోచును. అబ్బిన విద్యను గోలుపోయితిని. ఇఁక వీని వెనువెంట దిరుగరాదు. జాలము తెలియదు, నిజము తెలియదు. దూరముగాఁ బోయి యే మహారాజై నను మృతిబొందిన నతని శరీరముఁ బ్రవేశించెద నింతకన్న నాకు వేరొక తెరవులేదు. అని నిశ్చయించి వానికిఁ దెలియకుండ నఁట గదిలి మరియొక దేశమున కరిగెను.

కరభుండును దనజాలము జూడఁదగిన రాజధాని నరయు తలంపుతోఁ దిరుగుచుండెను.

అని యెరింగించి మణిసిద్దుం డవ్వలికథ నవ్వలి మజిలీయం దిట్లు చెప్పుచుండెను.

డెబ్బది ఎనిమిదవ మజిలీ

శంతనుని కథ

అయ్యారే ! ఈ పట్టణ రామణీయకం బెంత వింతగా నున్నది. ఇందలి భవనంబు లన్నియు నింద్రభవనములవలె మెరయుచున్నవిగదా ! దీనిం బృధ్వీ స్వర్గమని చెప్పనోపు. ఇట్టి పట్టణమునకును మన దేశమునకును నధి నాయకుఁడైన మహారాజు పూర్వజన్మంబుననెట్టి తపంబుఁ గావించి యుండునో? నే నుత్తమమైన పరకాయప్రవేశవిద్య శరభునకిచ్చి యీ పాడు నింద్రజాల విద్య గ్రహించితిని అందుఁ బొడకట్టు వినోదములన్నియు నొరులకేగాని నా కొక్కటియు గనంబడదు. అందుఁ జూపించు చిత్ర వస్తుజాలమెల్ల నెండమావులవంటివే ? క్షణభంగురములు దీనివలన సంపాదించిన విత్తము క్షణభంగురమే యగుచున్నది. ఈ రాజధానిలో నా విద్యా వైచిత్రముఁజూపి ‌ కొంతధనము సంపాదించెదగాక. అని తలంచుచుఁ గరభుం డొకనాఁడు ప్రాతఃకాలమున రత్నాకరమను నగరమున బ్రవేశించి వీధింబడి నడచుచుండెను.

పోవంబోవ నొకచోట నొక గృహద్వారముపై రాజపురోహితుని గృహమని వ్రాయఁబడి యున్నది. ఆ విలాసముఁ జూచి కరభుఁడు సంతసించుచు లోనికిం బోయి తాను బరదేశుఁడననియు నా పూట భోజనము పెట్టుమనియు నడిగెను. పురోహితుం డప్పుడింట లేకపోవుటచే నతనితల్లి కడు నిల్లాలగుట నతిధిపూజ కంగీకరించినది. ఆమె కెనుబదియేండ్లున్నవి. కొడుకులును గోడండ్రును దేవతగానెంచి పూజించుచుందురు. కావున పనిపాటలులేక యొక తిన్నెమీద గూర్చుండి జపమాలను ద్రిప్పుచుఁ బంచాక్షరీ జపముఁ జేసికొనుచుండును.

ఆ యతిధి యామెయొద్దఁ గూర్చుండి అమ్మా ! నీవు కడు యోగ్యురాలవు. అదృష్టవంతురాలవు. అడిగినంతనే భోజనమునకు రమ్మంటివి. ఇప్పటి కాలములో నీపాటి‌ ధర్మపరిపాటిగలవా రుండిరా ? అని పొగడుచుఁ గొ‌డుకు లెందరు ? కోడండ్రు చెప్పినట్లు విందురా ? కూతుండ్రు గలరా ? పుత్రుల కేమిపని అని యడిగిన నామె యిట్లనియె. అయ్యా! నాకు మువ్వురు కొడుకులు. కూత్రుండ్రు లేరు మాకు రాజపౌరోహిత్యము కలిగియున్నది. దానంజేసి జీవికకు నేమియుఁ గొఱఁతలేదు. పెద్దవాఁడు సంతతము రాజసమక్షమున నిలిచి తిధి వార నక్షత్ర గ్రహచార విశేషంబులం దెలుపుచుండును. రెండవవాఁడు తన్మంత్రుల నాశ్రయించును. మూడవవాఁడు రాజపత్నియొద్ద బంచాంగముఁ జెప్పుచుండును. మువ్వురు రెండుపూటలయందును నగరున కరుగుచుందురు. వచ్చువేళయైనది. నా కే కొరంతయు లేదు అని తన వృత్తాంత మంతయుం జెప్పినది. అంతలోఁ గొడుకులు మువ్వురు కోటలోనుండి వచ్చి తల్లి కి నమస్కరించిరి. తల్లి దీవించుచు వత్సలారా! నగరు విశేషము లేమి? రాజు కుశలియై యున్నవాఁడా ? రాజపత్నికి భద్రమా అని యడిగిన పెద్దవాఁ డిట్ల నియె.

అమ్మా! మనరాజు నాటినుండియు విపరీత బుద్దియై యుండెను. మునుపటి ధర్మగుణ మొక్కటియును లేదు. పంచాంగము చెప్పనక్కరలేదఁట. తానే చూచుకొనునఁట. అరువదియేండ్లు దాటినవి. భార్య తనయొద్దకు వచ్చినది కాదని మిగులఁ గోపించుచు నిప్పు డొక పెండ్లి కూతుం జూడుమని నాకు నియమించెను. మాట కడ్డుఁ జెప్పినవారి శిక్షింపు చున్నాడు‌. ఈ రాజునొద్దఁ గొల్వుఁ‌జేయుట కష్టముగా నున్నదని పెద్దవాఁడు చెప్పెను.

అప్పుడు రెండవవాఁడు తల్లీ! మంత్రులు రాత్రింబవళ్ళు రాజు దుశ్చేష్టితముల గురించి విచారించుచున్నవారు. నాఁడు రాజు సమసినంత నతని దేహములోఁ బరకాయ ప్రవేశ విద్యానిపుణుఁ డగు నీచుఁ డెవ్వఁడో ప్రవేశించెనని యొకమంత్రి వాదించుచున్నవాఁడు. అని రెండవ కుమారుఁడు చెప్పుటయు విని తల్లి మూడవ కొడుకువంకఁ జూచి నాయనా! రాజపత్ని కడు ధర్మాత్మురాలు. పతి దుశ్చేష్టితముల గురించి యేమను చున్నదని యడిగిన నతం డిట్లనియె.

అంబా ! ఆమెకుఁ బతియొద్ద కరుగవలయునని లేదట. ఎన్నిసార్లు పిలిపించినను బోయినదికాదు. పతి నాఁడే మృతినొందె ననియు దాను విధవననియుం జెప్పుచున్నది. ఇప్పుడు రాజు మరలఁ బెండ్లి యాడునని సంతసించుచున్నది. భర్త కూఁతు పెండ్లి మాటఁ దలపెట్టక తన పెండ్లి మాటయే ముచ్చటించుచుండెనని విని పరితపించుచున్నది. అని‌ మువ్వురు కోటలోని విశేషముల నుడివిరి.

కరభుఁ డా మాటలన్నియును విని వారిం బలకరించి పరిచయముఁ గలుగ జేసికొని యిట్లనియె. అన్నలారా ! మీ రాజువిషయమై మీరు పరిపరి గతులఁ దలఁచుచున్నారు. అతని వృత్తాంతము నంతయు నే నెరుంగుదును. మీ రాజు నాఁడే మృతిబొందెను. శరభుఁడనువాఁడు పరకాయ ప్రవేశముఁ జేసి యిట్టి కృత్యముల గనబరచుచున్నవాఁడు. అని తన కథయు వాని కథయు నా మూలాగ్రముగా వక్కాణించెను.

అంతలో భోజనసమయ మగుటయు వారెల్ల నింటిలోనికింబోయి తృప్తిగా భుజించిరి. శరభుని చరిత్రమును విని పెద్దవాఁడు శంతనుఁడనువాఁడు రహస్య స్థలమునకు కరభుని తీసికొనిపోయి మిత్రమా ? నీవు కొన్ని దినములు మా యింటిలో నుండవలయును. ఈ రాజు తనకుఁ దగిన కన్యకం దీసికొని రమ్మనమని వేపుచున్నవాఁడు. దీని కెద్దియేని యుపాయముఁ జెప్పుము. అని అడిగిన సంతసించుచు గరభుం డిట్ల నియె. అన్నా! నీ విందులకు వెరవకుము. ఇంద్రజాల మహిమంబున నీ రాజును బరిభవింతము గాక. అని చేయదగిన కృత్యము లన్నియు బోధించెను.

అప్పుడు శంతనుండు మిక్కిలి సంతసించుచు నాల్గుదినములు జాగుచేసి మరల రాజునొద్దకరుగుటయు నా రత్నాకరుఁడు శంతనా ! పెండ్లి కూతుం దీసికొని వచ్చితివా ? లేదా అని యడిగెను. దేవా! దేవర సంకల్పము రిత్త పోవునదియా ? అది మనుష్యకాంత కాదు? అప్సరసగావలయు. ఒక చిన్నది మన నగరమునకు వచ్చియున్నది. స్వయంవరమున నా యువతి పతిని వరించునట. తగిన వరుడు దొర‌కొనమి దేశములు తిరుగుచు నిటకు వచ్చినది. ఇప్పురి బాహ్యోద్యానవనములో నున్నది. దేవరఁజూచి వరింపక మానదు అని యా మూఢుని మనస్సు రంజింపఁ జేసెను.

రత్నాకరుఁడు మిగుల నుప్పొంగుచు నయ్యంగనఁ జూపుమని కోరుకొనుటయు నాటి సాయంకాలమున నేకాంతముగా నా ధరాకాంతుని వెంటఁబెట్టుకొని శంతనుం డయ్యుపవనమున కరిగెను. శరభుం డంతకమున్న తన జాలమహిమంబున నద్భుత పుష్పవనాదులఁ గల్పించియున్న వాఁడు గావున నా భూవల్లభుం డా పూవుదోట విశేషములఁ గాంచి పులకాంకిత శరీరుండై శంతనా ! ఈ వింతవన మెవ్వరిది? అక్కాంత యెందున్నది? అని యడుగుచుండ నతండు నవ్వచు దేవర క్రొత్త వారలైతిరా యేమి? పెక్కుసారులీ తోటలోనికి మనము వచ్చియుంటిమే. ------------ అయ్యండజగమన యప్పొదరింటిలో నుండునని పలుకుచు నతని మరికొంతదూరము తీసికొని పోయెను. అప్పుడా రాజు ఓహో ? మనోహరములైన యీ వన విశేషములు చూచినవైనను గ్రొత్త వివలె మోహముఁ గల్పించు చున్నవి గదా. ఈ వింత జానకఁ జూడచవచ్చును. అక్కాంత జూపింపుము. ఊరక నీ వనమంతయు నేల దిప్పెదవని‌ యడిగిన శంతనుండు దేవా! నేనుమాత్రము చూచితినా ? అవ్వనిత యెందు విహరించుచున్నదో వెదకవలయునని పలికి మరికొన్ని పొదరిండ్లు తిరిగి చూచినంత లతాంతములు కోయుచు నొక పొదరింటిలో నా వాల్గంటి కనంబడినది. శంతనుఁడును నృపతియు దన్మనోహర లోకనసాయకపాతవివశ హృదయులై నేలబడిపోయిరి. మరికొంతసరికి లేచి చూడ నేమియుం గనంబడినది కాదు. అప్పుడు శంతనుఁడు రాజు చేయిపట్టుకొని నడిపించుచు దేవా! ఈ చిన్నదాని సౌందర్య మహిమఁ జూచితివా మనము మూర్ఛఁ బోయితిమి. దానిపరిచారికలు కాబోలు నీవలకుఁ దీసికొనివచ్చి పారవై చిరి. నేటి కింటికిం బోవుదము రండు అని పలుకుచు నతని నంతఃపురమునఁ బ్రవేశ పెట్టి శంతనుం డింటికివచ్చి కరభుం గౌఁగలించుకొనుచు మిత్రమా ! నీ సామర్ద్యమతీంద్రియముగదా ! అసత్యమన యెరింగియు నేనును మోహవివశుండనైతి. అని యప్పటికధ యంతయుం జెప్పెను.

కరభుండు మరునాఁడు చేయవలసిన కృత్యములన్నియు శంతనునకు బోధించెను. వాడుకప్రకారము మరునాడు శంతనుఁడు రాజాంతః పురమున కరుగుటయు నరపతి, విరహపరితాపముతో వేగుచు శంతనా ! మరల నయ్యుప వనాంతరమున కరుగవలయు ఆహా ! ఆ మోహనాంగి దేహము మెఱపుతీగవలెఁ గన్నులకు మిరిమిట్లు కొల్పినదికదా ? నేడేమి చేయునో తెలియదు. వేళయైనది. లెమ్ము లెమ్ము అని తొందర పెట్టుటయు శంతనుం డా రాజుతోఁగూడ మరల నా యుపవనమున కరిగెను. నాడు క్రొత్త వింత లందుఁ బెక్కులు కనంబడుటఁ జేసి జనపతి శంతనా? యిది మరియొక వనమాయేమి ? ఈ వింతలతాంతముల నిన్నఁ జూచి‌తిమా? అని యడుగుటయు దేవా! మీ మనస్సు వీనియందు బ్రసరింపపోవుటచే గురుతు తెలియకున్నది ఇది నిన్నటివనమే యని పలుకుచు మరికొంత దూరము నడిపించెను. అం దొకమేడ కనంబడినది.

దానింజూచి రాజు చెలికాఁడా ! నిన్న మన మీ మేడఁ జూచితిమా ? నాతో నిన్నటి వనమేయని బొంకెద వేమిటికి ? అనుడు నవ్వుచు శంతనుఁడు అయ్యయ్యో! మీ బుద్ధి మారినదా యేమి ? ఇది మన క్రీడాసౌధముకాదా ? దేవర యెన్ని పర్యాయములు దీనిలో వసించితిరి. అంతయు మరచిపోయితి రేమిపాపము? నిన్న నా మూలకుఁ బోయితిమి కావున నీ సౌధము కనంబడినదికాదు. అని యేమేమో చెప్పి యతని మనసు చీకాకుపరచెను. అతం డా మాటలనమ్మి అవును జ్ఞాపకము వచ్చినది దీనిలోఁదొల్లి విహరించితిమి. ఆ చిన్నది యా మేడలో వసించినదా యేమి ? చెప్పుము అని యడిగిన యిందే యా సుందరి యున్నదని చెప్పెను. శంతనుం డతని నా మేడలోనికిం దీసికొనికోయెను. ఆ చిన్నదియందొకగదిలో హంసతూలికా తల్పంబునం బండుకొనియున్నది. ఆ చిగురుబోణిం జూచి రాజు మరల మూర్చపోవుచుండ వీపు చరచుచు శంతనుడు దేవా ! నీవిట్లు మోహ మందెద వేమిటికి? నీ మతి చాంచల్య మెరింగెనేని యా కురంగనయన యనుమోదింపదు. అని పలికి ధైర్యము గరపెను. అంతలో నత్తలోదరిలేచి వినయముతో నొక‌ పుష్పమాలికఁదెచ్చి యా యొడయుని మెడలో వైచినది‌.

అప్పు డతండది రంభయనియు నా పూవుఁదోట స్వర్గమనియు దలంచుచు నే మాటయనిన నేమినేరమో యని వెఱచుచు నేమియు మాట్లాడక‌ రెప్ప వేయక నయ్యెల నాగసోయగము నిలువంబడి చూచుచుండెను. మరియు నా చిన్నది యనేక శృంగార శేష్టలు వెల్లడించుచుండ నా నృపతి మోహవివశుండై నేల కొరిగెను. అంతలో నింద్రజాలము ముగిసినది. శంతనుఁడానరపతి నంతఃపురమునకు దీసికొని పోయెను.

ఆరీతి పదిదినములజ్జనపతి కా వింతఁ జూపుచు శంతనుండు మరల నింటికిఁ దీసుకొని వచ్చుచుండెను. ఆ మాయావతి యా రాజుకొకనాడు తాంబూల మిచ్చుచు నొకనాఁడు గంధముఁ బూయుచు నొకనాఁడు సంగీతముఁ బాడుచు మోహ సముద్రములో ముంచి తేల్చుచుండెను.

ఒకనాడు రాజు మంత్రులం జీరి యీ వీటి కుత్తరమున నున్న యుద్యానవనము కావలివారలఁ గొందర రప్పింపుడని నియమించుటయు వారు నవ్వుచు దేవా! మనవీటి కాదెస నే తోటయు లేదుగదా. ఆ ప్రదేశమంతయు నెడారిగానున్నది. ఆకాశ కుసుమమువలె నందలి వనపాలకుల నెట్లు రప్పింపగలమని పలికిన నగుచు నతండు ఔరా ! నాతోఁ బరిహాసమాడెదరా ? నేసు ప్రతిదినము నత్తోటకుఁ పోవుచుండ లేదా ? నాతో రండు, చూపెదనని యప్పుడే బయలువెడలెను.

మంత్రులును వెఱగుపడుచు నతనితో నరిగిరి ఆ ప్రదేశమంతయు నెడారిగా నున్నది. చిన్న మొక్క_యైనను లేదు. తరువాత నా నగరము నలుమూలలు వెదకి చూచెనుగాని యా పూఁదోట కనంబడినదికాదు. అప్పుడు సిగ్గుపడుచు నొడయడు మరల నింటికివచ్చి తనకై వేచియున్న శంతనుం జూచి మిత్రమా! మనము చూచెడుతోట కనంబడినదికాదేమి ? మంత్రులతో బందెమువేసి యోడిపోయితిని గదా ? ఏ దిక్కుననున్నదో చెప్పుమని యడిగిన శంతనుం డిట్లనియె.

దేవా! దేవరహస్యమొక్కటి చెప్పుచున్నాను. మీరు పరకాయ ప్రవేశ విద్యాపైశారద్యంబున నృపకళేబరంబులోఁ బ్రవేశించిరని మంత్రులును బ్రజలును దలంచుచు మిమ్ము గొన్నివిషయములఁ బరీక్షించు చున్నారు. మనము చూచెడి యుద్యానవనము మీ తాతగారు దేవేంద్రుని మెప్పించి విశ్వకర్మచే నందు నిర్మించుకొనిరి. అది దివ్య ప్రభావ సంపన్నంబగుటఁ పగలందరకుం గనంబడదు. మీ వంశజులకు మాత్రము సర్వదా కనబడుచుండును. రాత్రులయం దందరికిఁ గనంబడును. అవ్వన విశేషములివియే సుడీ? నన్నుఁ బిలువక నకాలమున నత్తోట కేమిటికిఁ బోయితిరి ? మీ మాటలు వారి యనుమానమును దృఢపరచుచున్నవి అని పలికెను.

ఓహో! మీ రాజ్యములో నిన్ని చిత్రములున్నవియా ? ఎరుఁగక పోయితింగదా ! యనుటయు శంతనుండు నవ్వుచు దేవర యిది మీ రాజ్యమనుచున్నారేమి ? మీరు పరాయివారా? అని ప్రత్యుత్తర మిచ్చెను. రాజు నాలుకఁ గఱచుకొనుచు శంతనా ! మాటవరస కట్లంటి. పోనిమ్ము మంత్రులు నన్నుఁ బరీక్షించుచున్నారుగా ? ఏది యీ రాత్రి మరల నా వింతలం చూపుము. వారిపని రేపు జక్క జేసెదనని యాగ్రహ ముఖుండై పలికెను.

శంతనుఁడు మరల సాయంకాల మా తోటకు దీసికొనిపోయి వెనుకటి విశేషములన్నియుఁ జూపెను. ఆ యోషామణియుఁ గంఠాశ్లేషము జేసికొన్నది. అంతలో కాలాంత మగుటయు శంతనుఁడు వాని నింటికిం దీసికొని వచ్చెను. తనగుట్టు గ్రహించినవారని నప్పుడున్న మంత్రులనెల్ల నుద్యోగమునుండి తొలగించి క్రొత్త వారి నేర్పరచెను. ఆ మంత్రులందరు గమిఁగూడి యాలోచించి రాజు దుర్నీతి యంతయు శంతనుని తమ్ముడు కామందకుని ముఖముగా రాజపత్నికిఁ దెలియఁ జేసిరి. కామందకుఁడు రాజపత్నితో అమ్మా! మన ప్రభువుఁ నాఁడే స్వర్గస్తుఁ డయ్యెను. నీచుం డెవ్వఁడో యా బొందులోఁ బ్రవేశించెను. మిమ్ము గణింపక నొక చిన్నదానిం బెండ్లి యాడుటకు సిద్ధముగా నున్నవాఁడు. వానికిఁ గలిగిన సంతతికే రాజ్యము సంక్రమింప గలదు. ఇప్పుడు మీ‌ కూతురు కాంతిసేనకుఁ బెండ్లి చేయవలసియన్నదిగదా ? ఆ మాట దలపెట్టకఁ దన పెండ్లి కే తొందరపడుచున్నాఁడు. దీనీ కెద్దియేని ప్రతీకార మాలోచింపవలయును. మా యింట నొక బుద్ధిమంతుండు కాపురముండెను. వానితో నాలోచించిన నంతయు జెప్పఁగలడు. అని బోధించి రాజపత్ని నొప్పించి సాయంకాలమున గరభు నచ్చటకిఁ దీసికొని పోయెను,

రాజపత్ని కరభుంబూచి నీ వెవ్వఁడవు? మా రాజుచర్యలు నీ వెట్టు గ్రహించితివి. నీ తెఱం గెరింగింపుమని యడిగినఁ గరభుండు శిరమించుక వంచి వినయము సూచించుచు తన వృత్తాంతమంతయుంజెప్పి యా శరభుఁడే నీ పతి బొందెలోఁ బ్రవేశించెనని నివేదించిన, అట్ల యిన నీవే‌ వాని నుపాయముఁజేసి రాజు బొందెలోనుండి తొలంగునట్టు చేయుము. అని చెప్పినది. అది మొదలు శరభునకు నంతఃపుర పరిచయము కలిగినది. నిత్యముపోయి రాజపుత్రింజూచుచు నుపాయములు సెప్పుచుండును. ఒకనాడు రాజపుత్రిక‌యగు కాంతిసేనను హట్టాత్తుగాఁజూచి కరభుండు పంచశర విద్దహృదయుండై శంతనుతో మిత్రమా! కాంతిసేన నా హృదయ మాకర్షించినది. నీ యెడ నా కేకాంతము లేదుగదా! నీవా తరుణీమణిని నాకు బరిణయముఁ గావింతువేని నా ఇంద్రజాలవిద్య నీకు ధారబోసెద. నీ వట్లు కావింప నాడు నాకు మరణమే శరణ్యము అని మిక్కిలి దీనుండై ప్రార్దించెను. కరభుని యింద్రజాల ప్రభావంబుఁ చూచినది మొదలు శంతనుని కావిద్య సంగ్రహింపవలయునని సంకల్పము కలిగియున్నది ఆమాట విననతోడనే శంతనుం డెంతేని సంతసించుచు మిత్రమా! మన కకారణముగా నిరుపమానమైన మైత్రి కలసినది గదా ! నీకుఁ దప్పక కాంతిసేనం బెండ్లిసేసెద. నీ జాలము నా కుపదేశింపుమని యడిగెను. అనినం గరభుఁడు మిత్రమా ! రాజపుత్రికను నా కిచ్చుటకు నిచ్చయమైనతోడనే నామంత్రము నీ కుపదేశించెద నట్టి ప్రయత్నము సత్వరముఁగాఁ జేయుమని వానిం దొందరఁ బెట్టుటయు నతం డట్టి యత్నము గావింపుమనెను.

రాజు సేయు కృత్యములవలన మంత్రులకును బ్రజలకును నసూయ వృద్దిఁ బొందజొచ్చినది. రహస్యముగా సభలుచేసి యతనిమ్ గూర్చి వితర్కించుచుండిరి. రాజున కాంతరంగిక హితుండు శంతనుం డొక్క.డే. ఒకనాఁడు శంతనుండు రాజుతో రహస్యముగా దేవా! నీ కీ యుద్యానవనము పగలు కనంబడలేదని మంత్రు లెఱింగిరి కదా ! నీవు పరకాయ ప్రవేశము చేసితివని జెప్పుకొనుచున్నారు. ఆ మాట సత్యమేని నాతోఁ జెప్పుము. ప్రతీకార మాలోచించెదనని యుక్తి యుక్తముగా నడుగుటయు లఘుమతియగు నతఁడు దాపునకుఁ బిలిచి చెవిలో యదార్థమేయని చెప్పుకొనియెను. అతండా మాటవిని అయ్యో! నా కింతకు ముందైనను జెప్పితివికావేమి? మంత్రుల కనుమానముఁ గలగకుండఁ జేసియుందును గదా. పోనిమ్ము. ఇప్పుడు మిగిలిన దేమియును లేదు. ఇఁకముందు నేను చెప్పినట్లు చేయుచుండుము. అని యొప్పించెను.

అది మొదలు జనపతి శంతనుండు చెప్పినట్లు జేయుచుండెను. మఱి యొకనాడు శంతనుఁడు రాజుంచూచి దేవా? కాంతిసేనకు వివాహము చేయవలసి యున్నది. వెనుకటిరాజు కొంత ప్రయత్నముఁ జేయుచు మృతినొందెను. మన మిప్పుడా చిన్న దానిని సామాన్యుని కిచ్చి వివాహాముఁ జేయుదము. అధికుండైనచో మన మర్మములన్నియును భేదించి రాజ్యము -------చేసికొనఁగలడు పెండ్లి‌కొడుకుపేరు పిమ్మటఁ దెలియపరుచుదము అని యేమేమో బోధంచుటయు నతం డిట్లుఁ గావించెను.

రాజపత్ని శంతనుం బిలిపించి మీ రాజు కూతునకు వివాహ సన్నాహముఁ గావింపుచున్నాఁడట పెండ్లిముహూర్త ము దగ్గిరయున్నదఁట. వరుం డెవ్వడో నీకుఁ దెలియునా ? అని యడిగిన నాకు దెలియదు. తెలిసికొని చెప్పెదనని చెప్పి యప్పటికిఁ బోయి మఱిరెండు దివసంబు లరిగిన వెనుక మరల రాజపత్నిం జూడ వచ్చెను.

ఆమె వానింజూచి శంతనా ! కాంతిసేనను గరభునకే యిప్పించుటకుఁ బ్రయత్నము సేయుచున్నా వటగాదా? నాకుఁ దెలియనిచ్చితివి కావేమి? నేను మాత్రము సమ్మతింపకఁ బోవుదునా ? అని యడిగిన నతండు చిత్తము చిత్తము అయ్యగారు నాతో నా మాట నిన్ననే చెప్పిరి. వ్యాధి వచ్చినప్పుడు మొన్న తన కూఁతును బ్రాహ్మణునకుఁ బెండ్లి చేయుదునని మ్రొక్కుకొనె నఁట సగము రాజ్య మతనికిచ్చునఁట. అని యత్తె ఱం గెరింగించెను.

అప్పుడు రాజపత్ని విహ్వలమతియై యా బ్రాహ్మణపుత్రులు కావించు కపటకృత్యము లన్నియుఁ దనకూఁతు కాంతిసేనం బిలిచి యెరింగించినది. కాంతి సేన కడు చక్కనిది. విద్యావతి బుద్ధిమతి ఇంచుకయు విచారింపక ధైర్యము విడువక అమ్మా! ఉపాయంబున నెట్టి యపాయంబు నైనను దప్పించుకొనవచ్చును ఇందుకు బుద్ధిమతిక కధయే నిదర్శనము.

బుద్ధిమతిక కథ

వినుము. తొల్లి బుద్దిమతిక యను బ్రాహ్మణ స్త్రీ యిరువురు పిల్లలతో భర్తతో బండి యెక్కి యొక యరణ్యమార్గంబున నఱుగుచుండెను. అందొకచోట నెద్దియోసన గ్రహించి బండి ఎద్దులు రెండును త్రాళ్ళు ద్రెంచుకొని రివ్వున పారిపోయినవి. వానింబట్టుకొనుటకు బండివాడును భర్తయు నరిగిరి. అప్పుడు బుద్దిమతిక చింతింపుచుఁ బిల్లల బండిదింపి తొడలపై నిడుకొని యొక చెట్టుకింద గూర్చుండి భర్తరాక నరయుచుండెను.

అప్పు డప్పొంతనున్న పొదరింటిలో నుండి యొకపులి యక్కలికిం జూచి యాహా! ఆహారము నేడు దైవము నోటికందిచ్చెంగదా ? మనుష్యమాసంముఁదిని పెద్దకాలమైనది అని యుబ్బుచు అన్నన్నా యిన్నెలతుఁక కెన్ని గుండెలున్నవియోకదా? నిర్భయముగావచ్చి నాపొదదాపుననే కూర్చున్నది ఇందులకే యేని కారణమున్నదనియా? తొందరపడి మీదకురుకరాదు. కొంత యోచనచేయవలయును అయ్యో? కార్యాకార్య విధిజ్ఞుండు నామంత్రి జంబుకరాజు సమయమునకు సమక్షమున లేకపోయెంగదా ? అతనితో నీ తెఱం గెరింగింతునా ? పోని అంతయేల వచ్చినది జఠరాగ్ని రక్తమాంసములఁ బీల్చుచున్నది. దీనిం గమచిపట్టి భుజెందఁగాక యని నిశ్చయించి కన్నులు నిప్పులు తాలం దోకనాడించి నేలం గొట్టుచుఁ దత్క----------- గురిజూచుచు నాలుక యప్పగించి యుఱుకబోవు సమయంబున బుద్దిమతిక యాశార్దూలమును జూచినది.

అప్పు డదరిపడి చెదరిన హృదయముఁ గుదురుపరచుకొనుచు నమ్మదవతి తమ్ము మృత్యుముఖంబునం బడినవారిగాఁ దలంచియు నొక యుపాయమాలోచించి నిదురించుచున్న పిల్లల నిద్దరం గిల్లినది. నాశిశువులు కేవురమని రోదనము సేయం దొడంగిరి. వారిం జోకొట్టుచు బిడ్డలారా ! నేనేమి సేయుదును, ఏమియుం దినక --- నిత్యము పులిమాంసముం దెమ్మని యేడ్చుచుందురు. అందులకేకద్స నేనీ యడవికి వచ్చితిని. యెందును బులులు కనంబడకున్నవి. ఒక పులిదొరికినేని జంపి యిరువురకుం బంచియిచ్చెద. రెండు దొరికినం జెరియొకటి యిచ్చెద. నూరు ఢిల్లుండని జోలపాడినది. ఆపులి యప్పలుకులు విని జళుకు వొడమ నొడలు ముడిచికొనుచుఁ జప్పుడు కాకుండ మెల్లన నప్పొదరిల్లు దాటి చెంగుచెంగున నెగసి యడ్డమైన లతాపాదపాదులం ద్రెంచివైచుచు నితివేగముగాఁ బెద్దదూరము పరువెత్తి యొకపాషాణమెక్కి గుండెలదరఁ గంపముతో నిక్కి దిక్కులు సూచుచుండెను.

అప్పుడు తదమాత్యుఁడు నృగాలం బెక్కడనుండియో యరుదెంచుచు నాశార్దూలము గాంచి చేర నరగి నమస్కరించి మించిన భక్తితో మృగేంద్రమా ! నీ వొంటిమై నీవీదేశమునకేమిటికి వచ్చితివి ? దొరలకెద్దియేని పని కలిగినబరిచరులతో రావలయుంగదా ? ఇది కడు ప్రమాదమైన పని, ఇక నిందుండరాదు. మన వసతి కరుగుదము రమ్మనుటయు నా పులి నలుదిక్కులు పాఱఁజూచుచు, యా నక్కపో తక్కలికి వాక్కులు వినలేదు. కావున నిట్లనుచున్నది. కానిమ్ము. అంతయుం జెప్పుదంగాక యని తలంచుచు నిట్లనియె.

సృగాల సత్తమా ! నన్ను నాతల్లి కడుపున వెండియుం బుట్టిన దానినిగాఁ దలంపుము. నేను నీతో నిట్లు మరల మాట్లాడుట పూర్వపుణ్యపరిపాకముననే సుమీ ; అబ్బా ; ఆపాటు నీతోఁ జెప్పుటకు సిగ్గగు చున్నది. దగ్గరఁ బెరవారెవ్వరూ లేరుకదా ? అని భయం బభినయించుచు నామించుబోఁణి వచించిన మాటనన్నియుం జెప్పినది.

అక్కథవిని యానక్క_ నవ్వుచు నక్కటా ? నీ మాటలు వినం గడు చోద్యముగా నున్నవి. సింహంబు కొఱంతగా మృగ సంతానంబులకెల్ల నధి నాయకంభై యొప్పు శార్దూల కులంబునం బొడమి యిట్టి పిరికి మాటలం జెప్పు---- వేమి ? నీ బలంబు నీ వెరుంగవు. సింగంబు తరువాత సింగం బంతదానవు. ఇట్టి నీవొక్క యాడుదానికి వెఱచి పారివచ్చితినని జెప్పుట నిక్కువ

నపభ్యాతి నీ కఠయినం గలిగినది. నాన్నా కయి -ఎగ్గిపడినడి. అన్నన్నా : మొుబ్బు 1 . ఆ మాటలువిని పరువెత్తికొని వచ్చితివా? ఎొరుష సు పారినిప్రే యున్నద. న్‌ “లు, నా పెంటరమ్ము. ఆ గయ్యాళిం జుపుము, షిల్లలతొంహాన దాసిరీ సీసం గొనుకగా సమర్చించెద తద్గళరక్తంబు. జూనకముగాం _గోలుదువుగాని. అని సలికిన ములి యిట్ల నియె.

అగనగు సీ బల పర్మాకమములు నే నెపంగనిప్‌ కావు. ఇక్కడ న్ని

లత నాగనచ్చును, రానిం జ్టాగ వూనాచు... సగిరించిన పిమ్మట

(. ౮. పై గెలింబచవు. పో పొమ్ము. నే సప్పుతుకాను. అ వ్య్యాఘహం్శతి యరిగిన ప్‌మ్మ్యు [ వచ్శెచనని గద్దించి పలికిన విని గోమాయువు మరల నిబ్జ నియె, తి సింగం బంచదాసప్ప. ఐటి ప్రామచయుని . ఏలరి.- . కానాయున్నా సీ భి ను సంజన పిల అప ఎకి చూంసనుు "వయం ఆహా! నీ పౌరుషము ! నీ దేహంబిట్లు దాచికొని యెన్నినాళ్ళు బ్రతికెదవు ? నీ బలముఁ దలంచియు నా బుద్దిబలముఁ దలంచియు నీమాటలు విననొల్లక చింతిల్లు చున్నదాన. ఒరుల తెఱంగున మనల బెదరించిన యమ్మించుబోణి రక్త మాంసములు పీల్చకున్న వంచకుఁడననగు దాని టక్కరి జిత్తులు నక్క యొద్ద సాగునా? లెమ్ము. లెమ్ము. నా నా మాట నమ్మవేని యీ లతాపాశముల నాకును నీకును బంధింపుము. అని బోధించుచు దాని నొడంబడఁజేసి తీగెలచే నిరువురి యంగంబులకు లంకెలు వై చి బలవంతమున నా పులిని నా పడఁతియున్న పొదదాపునకు లాగికొని వచ్చినది. పులి వెనుకకు లాగుచుండ నక్క ముందరికి లాగుచున్నది.

బుద్ధిమతిక యా రాకఁజూచి యౌరా ! మొదటిగండము దాటినది. పులి నెట్లో బెదరించితిని. కాని యీ నక్క మరల లాగికొని వచ్చినది. ఈ మాటు దీని‌ నోటికిఁ గబళములగుదుము. నా జిత్తులు నక్కయొద్ద సాగవు. ఏమిచేయుదు దై వమా? యని యాలోచించుచు నొక యుపాయము తోచి‌ యహో! సృగాలమా! న‌న్నెంత మోసముఁ జేసితివి. నీ వంచకనామము సార్థకమైనది. ఇద్దర పిల్లలకు జెరి యొక పులినిదెచ్చి యిచ్చెదనని లంచముఁగొని యింతదనుక వచ్చితివికాదు. రెండవ పులి యేదీ ? ఒక్కదానినే తెచ్చితివేల? పిల్ల లాఁకట మలమల మాడుచున్నారు. వీరి కిది యేమూలకు వచ్చెడిది నీ పనిఁ బట్టక‌ విడువ. నిలునిలుమని యదలించినది

ఆ మాటలువిని యా బెబ్బులి గొబ్బున మరలి అన్నన్నా ! ఆప్తుండవని నమ్మినందులకు మంచి యుపకారముఁ జేయఁబూనితివి. ఇదియా నీ సంకల్పము ? తెలిసినది. అక్కటా ? ఎంత గండము గడిచినది. అని పలుకుచు నా నక్క మెడయందు గుదెకర్రవలె నేల వ్రేలాడుచుండ నిమ్మోన్నత విభాగముఁ దెలియక తరులతాగుల్మినీ ప్రభృతులఁ బడనేయుచు నతిరయంబున బరుగెత్తఁ దొడంగెను. అట్లు పెద్ద దూరము పఱచి ధా వనాయానమున నోరెండ నొక చెట్టునీడ నిలువంబడి గుండెలు తటతటఁ గొట్టుకొనఁ బెచ్చు పెరుగు కోపముతో జంబుకముం జూచి వంచకా! యిప్పుడు నీ యంత్రముల విదళించి రక్తముఁ ద్రావెదను. నీవు కావించిన మిత్ర ద్రోహమున కిది చాలునా ? అని యడిగిన నా నక్క వినయం నభినయించుచు స్వామీ ? నా నేరము సైరింపుఁడుఁ తప్పుచేసితి. అధి యట్లుండ మీ రిందు నిలిచితిరేని యా వ్యాఘ్రహంత్రి మదీయ చరమాంగరక్త ధార ననుసరించి రాగలదు. ఈసారి చూచిన పోనీయదు. అది రాకమున్న మీ దారి మీరు పొండు. నా తప్పు వేరొకప్పుడు విమర్శింతురు గాని యని పలికిన నదియు యుక్తి యని తలంచి యాచారముల మెకంబు వేరొక అడవికిఁ బారిపోయినది. క్రూరులకడ నిజముఁ జెప్పినను మోసమే చేయుదురు గదా.

తల్లీ! అ బుద్దిమతికయా గోమాయువును బెబ్బులిబాధ నెట్లుఁ దప్పించికొనిరో యుపాయంబున నేనును నీ బ్రాహ్మణ ప్రభువుల మాయలనట్లే తప్పించు కొనియెద నిందులకు నీవు చింతిల్ల వద్దని కాంతిసేన తల్లికి బోధించినది. అని యెరింగించి కాలాతీతమైనంత నవ్వలి వృత్తాంత మ య్యతిపతి తదనంతరావ సంథంబున నిట్లుజెప్పఁ దొడంగెను.

డెబ్బది తొమ్మిదవ మజిలీ

కాంతి సేన కథ

శంతనా ! నీ వింత మతిహీనుఁడ వై తివేమిఁ కాంతిసేనను గరభునకుఁ నిశ్చయింప నీ వేల యూరకుంటివి? నీవు బ్రాహ్మణుండవుగావా ? బానపాత్రుండవుగావా ? ఈ ఫలము చిరకాలమునుండి యాశ్రయించుకొనియున్న నీ వనుభవింపక మొన్న వచ్చిన కరభున కేలఁ గట్టిపెట్టు చుంటివి. అతఁ డెవ్వఁడు ? నీకంటె విద్వాంసుడాఁ సొగసుకాఁడా ? మీ‌ యిరువురకు నేమైన సాంకేతికమున్నదా ? రాజ పుత్రికకు వానియందిష్టములేదఁట. నిన్నీ విషయమడిగి రమ్మన్నదని కేసరిణి యను పరివారిక యొకనాడు నడి తెఱవులో నిలువంబెట్టి శంతను నడిగినది.

ఆ మాటవిని శంతనుండు కేసరిణీ ! నీ వన్నమాట సత్యమే ? రాజునకు నాయం దాదరము కలిగియున్నది. నా మాట నే నతనియొద్ద నుడువుటలెస్సగాదు గదా? కరభుం డింద్రజాలవిద్య నెరింగిన కతంబునఁ దత్ప్రభావంబున రాజును వంచించుచున్నాము. నీవు నా కాప్తురాలవు కావున జెప్పుచుంటి. ఎవ్వరితో ననవద్దు. ఆ యింద్రజాలము నా కిచ్చునట్లును వానికిఁ గాంతిసేనను బెండ్లిఁ జేయునట్లును మే మిరువురము శపధములు చేసికొంటిమి. దానంజేసి వానికిచ్చునట్లు నిశ్చయించితి నని యా రహస్యము లన్నియుఁ దెలియపరచెను.

అప్పడతి అయ్యో ? వెఱ్ఱిపారుఁడా ? రాజవైభవముకన్న నింద్రజాల మెక్కువదియా ? తొందరపడి వారికిఁ బెండ్లి చేయింపకుము. మరి రెండు దినములు గడుపుము. నీవే పెండ్లియాడునట్లు చేసెదనని యేమేమో బోధించి యతని దన చుట్టును దిరుగునట్లు చేసినది.

మఱియొకప్పుడు కరభుఁ డంతఃపురమున కరుగుచుండఁ జూచి కేసరిణి అడ్డముగా నిలువంబడి నమస్కరింపుచు దేవా ! నీవు నన్నెరఁగవు. రాజపుత్రిక సఖురాలను. కేసరిణి యండ్రు. నీవు భర్తృదారికను పాణిగ్రహణముఁ జేయ నిశ్చయించినట్లు తెలిసినది. ఆమె నీతోఁ గొన్ని రహస్య వచనములు చెప్పి రమ్మన్నది. వినుము. మీ యొద్ద నద్భుతమైన యింద్రజాలవిద్య యున్నదట. ఆ వి‌ద్య శంతనున కీయ నిశ్చయించితివని తెలిసినది. ఎవ్వరికి నీయ వద్దన్నది. నీ కంత మొగమాటమేనిఁ దనయొద్ద దాచమన్నది. అని యుక్తి యుక్తముగాఁ జెప్పి వాని వలలోఁ బడవేసినది. అతండా మాటవిని యుప్పొంగుచు నోహో ? నా కింతకన్న