కాశీమజిలీకథలు/ఆరవ భాగము/72వ మజిలీ

వికీసోర్స్ నుండి

అందు మాయిచ్చు నాతిధ్యమంది మమ్మానంధింపఁ జేయవలయునని యెంతయో వినయ విశ్వాసములతోఁ బ్రార్థించిన నాలించి సంతసించుచు సత్వవంతుండందుల కనుమోదించెను. అని యెఱింగించువరకు వేళ యతిక్రమించినఁ గథ విరమించి పై మజిలీయం దిట్లని చెప్పందొండగెను.

డెబ్బది రెండవ మజిలీ.

కమలకథ

ప్రభావతీ పురంబున విశ్వేశ్వరునియాలయ మొకటికలదు. ఆ దేవళము నాలుగు దెసలను నొప్పుచున్న గోపురములు గోపురమునకు సోపానములోయన విరాజిల్లుచున్నవి. ప్రాకారమంటపాదుల యతిశయము వర్ణింపఁ బదిదినములు పట్టును. దాని గాశీక్షేత్రముగాఁజేయు తలంపుతో నాదేశపు రాజులలో నొకఁ డయ్యాలయాదులఁ గట్టించి యా లింగమునకు విశ్వేశ్వరుఁడను పేరు పెట్టెను. ఆ క్కో వెల యావరణములో గంగయను బేర నొక పెద్ద తటాకముఁద్రవ్వించెను అందలి జలంబు లగాధంబులై నిర్మలంబులై మధురంబులై యొప్పుచుండును కాశింగల తీర్థంబులును లింగంబులు నా యా చోటుల నా యలయాంగణములందు నిర్మింపఁబడి యున్నవి. అవి యట్లుండె వ్యాసమఠమను బేరుతో నొక మఠముఁ గట్టింపబడి యున్నది. సన్యాసులు, బైరాగులు, యోగులు, యోగినులు లోననుజ్ఞాన వాసనగల విరక్తులకొరకా మఠము గట్టింపఁబడినది. అట్టివారికి భోజన భాజన సత్కారములు సేయుటకై ప్రత్యేకము నందొక సత్రమును స్థాపించిరి. తనంబనియు యోగంబనియు హోమంబనియుఁ బేరులు పెట్టుకొని భార్యాపుత్రాదులఁ బోషించుకోలేక విరక్తులై పొట్టనిండఁ గాలక్షేపముఁ జేసికొను డాంబికు లందు బెక్కండ్రు గలరు. చౌర్యాది దుష్టక్రియలు గావించి రూపుమార గడ్డములు పెంచికొని యోగులవలె జపముసేయు వారు గొందరుందురు. మరియు -

సీ. ఒకమూలమ్రోలఁ బావకముంచికొని యర్ధ
              దృష్టి మాలికలను ద్రిప్పువారు
    ఒకవంక నూర్ద్వ ఔహుపులుగా యో
              గము ల్వెలయించి తపముఁ గావించువారు
    ఒకచెంత నిగమాంత యు క్తితత్వముల నం
              తేవాసితతికి బోధించువారు
    ఒకచక్కి గురుభక్తియుక్తిఁ బూజలు సేసి
              దేవతావళులఁ బూజించువారు

గీ. చెలఁగి వేదాంత వాదముల్సేయువారు
    ఒకదెస యోగి జనులకు మ్రొక్కువారు
    విమలగతి వహ్నిహోమము ల్వ్రేల్చువారు.
    అందుఁ గలవారలెల్ల మహావిరక్తి.

అందు నఖంబులు మెలికలువారి తోరముగా నెదుగ వ్రేలాడు గడ్డంబులును ఒడలును మహానుభావత సూచింప నొడలెల్ల భూతిఁబూసికొని తపం బొనరించుచున్న దిగంబరు లనేకులు గలరు.

అట్టి మఠంబున కొకనాఁడు త్రిజన్మోహన సౌందర్యంబునం బొలుపొందు కమలయను బాలయోగిని యొకతె యరుదెంచినది. ఆ యోగినింజూచి యందున్న విరక్తులెలఁ గందర్పభల్ల ములకెల్ల యగు నుల్లములతో నిట్లు దలంచిరి ఆహా ! యీమోహనాంగి తొలిప్రాయములో నిట్లు విరక్తిఁజెందుటకు గతం బగ్రహ్యంబుగదా? ఇత్తరుణీ రత్నమును జూచిన నే సార్వభౌముఁడు వరింప నుండెడిని. ఈ ముద్దుగుమ్మ యెవ్వరికి శుశ్రూషజేయునో యాతఁడే ధన్యుఁడుగదా? అని పలుభంగులఁ దలంచుచుండ నాచిన్నది యామఠం బంతయుఁ దిరిగి యందలి యోగులను విమర్శించి చిదంబరయోగి యుత్తముఁడని నిశ్చయించి యతనికి నమస్కరించిన నతండు కొంతవడికిఁ గన్నులఁ దెఱచి బాలా ! నీవెవ్వతవు? ఏమిటి కిట్లు వచ్చితివని యడిగిన నాయోగిని యిట్లనియె స్వామీ ! నే నాత్మభవఖేదంబు నిమిత్తముగా విరక్తిఁ జెంది మీ చరణము లాశ్రయింప వచ్చితిని. మనోహర వ్యాహారములు సెప్పి నన్నుద్ధరింపుఁడు. కొంతకాలము మీ శిశ్రూషఁ గావించి కృతార్దురాల నయ్యెదను. ఈ యోగులలో మీరు పరమోత్తములని యత్యంతభక్తి వినయ విశ్వాసములతోఁ బ్రార్థించిన సంతసింపుచు నతండు తత్సేవ కంగీకరించెను.

సమయమరసి యా సరసిజాక్షి యా పారికాంక్షియొద్దఁ దత్వవిశేషములు గ్రహింపుచుండెను. ఆ మఠమునందున్న యోగులా యోగిని వచ్చినది మొదలు జపములుమానిరి. తపములు విడచిరి యోగములు వదలిరి. ఏదియో మిషఁబూని యా మీననేత్రిఁ జూచుచుందురు. తత్వరహస్యములు సెప్పుమనియె దివ్యమంత్రోపదేశములు గావింపుమనియుఁ బెక్కండ్రు వచ్చి యా చిదంబరయోగి నాశ్రయించుచుందురు. అతండు సెప్పునప్పుడేమియును వినక యా యువతినే చూచుచుందురు.

వారి వికారము లరసి యత్తరుణి శాటీపగం బవకుంతనముఁ జేసికొని యెవ్వరివంకఁ జూడక జపముఁ జేసుకొనుచుండును.

ఇట్లుండ నొకనాడుఁ కిన్నరదత్తుని భార్య తారావళిం దీసికొని రహస్యముగా నామఠమున కరుదెంచి యందున్న యోగిబృందమునకు వందనములు సేయుచు వారిలోఁ జిదంబరయోగి మహానుభావుండని విని యతనివద్దకు బోయి నమస్కారములు గావించినది. ఆమె వృద్దరాజుగారి పత్నియని యెఱింగి చిదంబరయోగి మిక్కిలి గౌరవించుచుఁ గృష్ణానజిముపై వారిరువురం గూర్చుండ నియమించి విరక్తుండైనను బ్రస్తుతోపయోగముగాని నయ్యోగి నామె కిట్లనియె.

దేవీ ! నూరేండ్లక్రిందట నీ మామగారి తండ్రి యీమఠముఁ గట్టించెను. నాటంగోలె నింద విచ్ఛన్నముగా మహర్షులు తపము సేసికొనుచున్నారు. తత్సంతతివారును దీని కే యంతరాయము లేకుండ జరుపుచున్నారు నీ భర్త వారమున కొకసారి వచ్చి చూచి తాపసుల మంచిచెడ్డ లరసి పోవుడుండెడి వాఁడు. ఇప్పుడు నీ కుమారుఁడు చూడకపోయినను బ్రధానులనంపి విమర్శించుచున్నాడు. మా కే లోపములును లేవు. స్వర్గసౌఖ్యములు మాకందిచ్చి మీవారందు సుఖించుచున్నారని ప్రస్తావోచితముగా స్తుతించి నీ కేదియో యభిలాష యుండినం జెప్పుము. నా యోపినంతఁ గావింతునని పలికిన విని యామె యటునిటు చూచి యించుక జనాంతకముగా నిట్లనియె.

స్వామీ ! మీరు భగవంతుని వంటివారు మీ దర్శన మూరక పోవునా? నేనొక కోరికతో మీయొద్దకు వచ్చితిని. వినుండు. ఈ చిన్నది నాయన్న కూతురు. చిన్నతనములోఁ దల్లి చనిపోయిన నేను పెంచి పెద్ద దానింజేసితిని నా భర్త దారిబోయెడివాని నొకనిజేరఁదీసి రాజ్యంబిచ్చి నాకమున కరిగిరి. ఈతారావళిని బెండ్లిఁ జేసికొమ్మని పుత్రునితో వృద్ధరాజుగారు మొదటనే చెప్పియున్నారు. అతండు దానిం బరిణయం బాడుమని యెన్ని సారులు చెప్పినను గాలహరణము సేయుచున్నాఁడు. అక్కర లేదనియుం జెప్పఁడు. మీరు సర్వజ్ఞులుగదా. ఇందలి కారణ మేదియో చెప్పవలయును. మఱియు మీయొద్ద వశ్యౌషధములుండక మానవు. ఏదియైన దయచేసి మాకార్యసాఫల్యము సేయఁగోరుచున్నదాన. అని వినయముగాఁ బ్రార్ధించిన నయ్యోగి యొక్కింత ధ్యానించి అమ్మా ! రెండునాళ్ళు తిరిగిన వెనుక నాయొద్దకు నీపరిచారకు నొకని నంపుము మంత్రభస్మమునిచ్చెద. దాన నీయభీష్టముతీరునని చెప్పెను.

అని వారు మాటాడుకొనుచుండగనే కమల స్నానముఁజేసి యచ్చటికి వచ్చినది. రాజపత్ని కమలం జూచి నివ్వెరఁపడుచు స్వామీ! ఈ చిన్నది యెవ్వతె యని యడిగిన నతఁడు. దేవి! ఇది నాశిష్యురాలు. దీనిపేరు కమల తత్వోపదేశమైనదని చెప్పెను. ఆ మాట విని రాజపత్ని యత్యంత విస్మయముతోఁ గనులం జూచుచు బోఁటీ! నీ వేమిటికింత చిన్న తనములో విరక్తిఁ జెందితివి? నీ రూపము చాల వింతగా నున్నదే. నీతలిదండ్రు లెవ్వరు? పెండ్లియాడితివా? యని యడిగినఁ గమల నవ్వుచు నిట్లనియె.

అమ్మా! నా వెనుకటి వృత్తాంత మేమియుఁ జెప్పరాదు. తలఁపరాదు. నాకందరు గలిగియుండిరి. ఇప్పుడు నా కెవ్వరును లేరు. నేను లేనిదాననగుచున్నాను. దేహములు క్షణభంగురములు. విరక్తిఁజెందవలసిన సమయ మిదియని నిరూపింపఁబడి యున్నదా యేమి? అంతఁదనుక నిలుచుటకు మనయిష్టమా? మృత్యువు నెత్తిమీద నున్నదని యెరింగి యిప్పనికిఁ బూనుకొన్నదాననని సమాధానముఁజెప్పి యామెను నిరుత్తరం జేసినది రాజపత్ని కమలమాటలకును వైరాగ్యమునకును మిక్కిలి సంతసించుచు నయ్యోగియనుమతి వడసి యింటికిం జని పరిచయమునం గలిగిన ప్రీతిచే వారిరువురుకుఁ బండుకొన మంచములును బరుపులును లోనగు వస్తువులు కొన్ని యంపినది.

చిదంబరయోగి రాత్రులయం దగ్ని ప్రజ్వలిల్లుచుండ వ్యా ఘాజినముపైఁ బండుకొనుచుండును. గమలయు నతనిబాదముల మ్రోలఁ బవ్వళించునది. రాజపత్ని మంచములు పంపిన తరువాత యోగి కమలను మంచముపై శయనింపుమని యాజ్ఞాపించెను. గురుండు క్రిందఁ బరుండ శిష్యురాలెట్లు మంచ మెక్కునని యాక్షేపించినది. ఆ యోగివ్రతవిరుద్దమైనను శిష్యురాలియందుఁగల ప్రీతిచే నాటంగోలెఁ దల్పమునఁ బండుకొనుచుండెను.

స్థూలజంఘ తామ్రకేశుల కథ

స్థూలజంఘుఁడు తామ్రకేశుఁడను నిరువురు విటులు వేశ్యా విత్తములఁ దస్కరించుటచే రాజపురుషలచే నపరాధులుగా నిరూపింపఁబడి బారిపోయి యవధూత వేషములతో వచ్చి యామఠములోఁ జేరి యోగులకు శుశ్రూషఁ జేయుచుండిరి. వాండ్రు కమల వచ్చినదిమొద లామచ్చకంటిపై వలపుఁజెంది యాచిదంబరయోగి నాశ్రయించుచుఁ బాదములొత్తుచు విసరుచు ధోవతు లుతుకుచు నెడతెగక నవ్యాజభక్తి విశేషంబునంబోలె నాశ్రయింపుచుండిరి. వారి దుశ్చేష్టితముల గ్రహించి కమల వారిసమక్షమున నెప్పుడు నిలుచునది కాదు. ఒకనాడు వా రిరువురు నిట్లు సంభాషించుకొనిరి.

స్థూలజంఘుఁడు :- మిత్రమా ! తామ్రకేశా ! ఈ కమల మనమొగ మొకమాటైనం జూడదేమిపాపము? మనకోరిక యెట్లు తీరఁగలదు. అహా! ఈ మోహనాంగి యలంకారశూన్యమై శాటీపటంబుఁ గట్టినను వింతసోయగమునఁ బ్రకాశించుచున్నది గదా ! మన యనంగ చంద్రికకన్న నీ చిన్నదియే సొగసుగా నున్నది?

తామ్ర :- అబ్బా ! సొగసుగా నున్నదని మెల్లగాఁ జెప్పుచుంటివేల? అది యెక్కడ నిదియెక్కడ? హస్తిమశకాంతరము గలదు. దేవతా స్త్రీలైనను దీనిం బోలరని చెప్పఁగలను.

స్థూల :- అవును. నీవు కొక్కోకముఁ జదివితివికావా? నీ కా లక్షణములు బాగుగాఁదెలియ గలవు. ఇది యేజాతియో చెప్పుము?

తామ్ర :- పద్మినీజాతిలో శ్రేష్టమైనది.

స్థూల :- మన ముంచుకొనిన యనంగ చంద్రికయో?

తామ్ర :- అది యేజాతిలోను చేరదు. సంకరజాతి స్థూల :- కొశ్కోకములో శ్రీవశ్య ప్రకరణముఁ జదివితిగదా. ఆ ప్రయోగ మీ యెలనాగపై నుపయోగించి స్వాధీనురాలిం జేసికొనరాదా ?

తామ్ర :- అందులకుఁ జాలతంత్రము కలదు. ప్రయత్నింతుము.

స్థూల :- ఆ తంత్రములేమియు ననంగచంద్రికపై నుపయోగించినవి కావేమి ?

తామ్ర :-- వేశ్యకాంతల వశ్యమునకు ధనయంత్రము తప్ప వేరొక తంత్ర ముపయోగింపదు గదా ?

స్థూల :- నీ మంత్రతంత్రములతో నిమిత్తములేకయే కమలను వశపరచెద నాకేమి కానుక నిచ్చెదవు?

తామ్ర :- (సంతోషముతో) నీ చెప్పులు మోసికొని యెల్లకాలము తిరిగెదను. ఆ యుపాయ మెరింగింపుము.

స్థూల :— వినుము. ఇది నిద్ర పోవుచుండ మెల్లగా మంచముతో నెత్తికొ'ని పోయి యా శూన్యాలయములో—

తామ్ర :- అవును. మంచియుపాయమే. ఆ చంచలాడి మంచముపైఁ బండుకొనుటయు మన కుపకారమే యైనది.

స్థూల :- నే నీ యుపాయంబుఁ జెప్పితినిగదా? ముందరిఫలము నాదిసుమా?

తామ్ర :- మనలో మనకు భేదమే మున్నది? ఎట్లయిననుసరే ఆ సరోజాక్షి యా సన్యాసిదాపుననే పండుకొనుచున్నది. కావున దాని మంచము గురుతుఁ జూచుకొనవలయును.

స్థూల :- సంతతము అగ్ని ప్రజ్వరిల్లుచుండును కావున దాని నారిపి మరియుం దీసికొని పోవలయుఁ జుమీ?

అని వారిరువురు నాలోచించుకొని సమయ మరసి కమలయు జిదంబర యోగియుఁ బండుకొను మంచములు ముందుగనే గురుతుఁజూచికొని పోయిరి. నాఁడు బైవిధంగాఁ గమల పరుండు చోట నాయోగి మంచము వైపించుకొని పండుకొనియెను.

ఆర్ధరాత్ర సమయంబున వారిరువురు మెల్లగా సచ్చటికి వచ్చి యగ్గి చల్లార్చి --- మార్పి యావిషయము తెలియమిం జేసి కాషాయాంబర ప్రచ్ఛన్నుండై యున్న యా చిదంబరయోగిని కమల యనుకొని మంచముతోఁగూడ నెత్తి కదలకుండ నా యావరణములో దూరము గానున్న యొక శూన్యశివాలయము లోనికిం దీసికొనిపోయి యందు ---------------------- వచ్చిరి.

అప్పుడు స్థూలజంఘుడు తామ్రకేశా ! నే నీ యుపాయముఁ జెప్పునప్పుడు ము చేసినదా? ఇప్పుడు నేను కిం తో నుంచి నించు గానియందుమని పలికిన నగండు చిన్న చనుగదా నా ముద్దె చెల్లించి నన్ను ముందే లోని కనుపుము, మరియు నీవు కళారహస్య వేదివగుట నీ క్రీడలఁజొక్కి యక్కుసుమ కోమలి యొరుల వలవదు అని పలికిన నతండిట్లనియె తమ్ముడా ! అందులకే నేనుఁ దొలుతఁ బోవుదునని చెప్పితిని. బాహ్యరతోపచారములచే నా జవ్వని కుద్రేకముఁ గలుగఁ జేయవలయును. మరియుం బురుషుఁడు స్త్రీలయొక్క జాతియు స్వభావము గుణము దేశాచారము ధర్మము చేష్టలు భావములు ఇంగితములు తెలిసికొని యనుభవింపఁడేని యువతి వానిరతి కనుమోదింపదు. అదియుంగాక యాకోక స్తని విరక్తిఁ జెందియున్నది. తత్తడియుఁ బడఁతియు నొక్కటని యెరుంగుము. నేనుఁ బోయి యా మచ్చకంటిని మచ్చికఁజేసి పచ్చవిల్తుగేళికిఁ బురికొల్పివచ్చెద ననుమతింపుమని ప్రార్థించిన స్థూలజంఘుఁ డిట్లనియె నీవు బాహాభ్యంతర సురతవిశేషములచే శాస్త్రోక్తప్రకార మాప్రోయాలిం గలియుచుండఁ దెల్లవారకమానదు అప్పుడు నేనేమి చేయువాఁడ? నాకీశాస్త్రము లేమియొ నక్కరలేదు. అక్కర దీరుచుకొని యొక్కముహూర్తములో నరుదెంచెద నన్నే పోనీయుమని ప్రార్థించెను. నే నర్ధమూహూర్తములోనే యరుదెంచద నాకే యనుజ్ఞయిమ్మని యతఁడడిగెను. నా కంతకాల మవసరములేదు ఆలింగన సుఖంబిచ్చినఁ జాలుననుటయు నతం డదియు నేమొల్ల. నా ముద్దుగుమ్మ మొగ మొకముద్దు పెట్టుకొని వచ్చెద నిష్టమే యన నతఁడౌను నీవెప్పుడు నిట్లే యడ్డుచెప్పుచుందువు. నీతో నేస్తముకన్నఁ బగయే లెస్సయని తోచుచున్నదని యెత్తిపొడిచెను ?

అవును. నీ స్నేహమునంగాక నాకీసన్యాసి యోగమెట్లువచ్చును? అనంగ చంద్రికవస్తువు లెత్తికొని రమ్మనిచెప్పిన వాఁ డెవ్వఁడో జ్ఞాపకముండిన నీ మాటయేలఁ బలికెదవు ? చాలుఁజాలు. కొసరులు పలుకకుము నాకలుక వచ్చుచున్నదని తామ్రకేశుఁడు ప్రత్యుత్తరమిచ్చెను.

నీయలుక నాకు వెరపుఁ గలుగఁ జేయంజాలదు. నా చెప్పినట్లెల్ల నీవు పడతువా యేమిఁ నీ కప్పని యనుమతియేకావున నాచరించితివి. ఇప్ప డేమాట --- విననైతివి? నాకు సమయము దొరకక పోవదు. తెల్ల వారినీ అని స్థూలజంఘుఁడు బెదరించె

ఛీ ! రండాపుత్రుడా ? నీ వేమిచేయం గలవన గొత్తుకొన జూడుమని ముష్టియెత్తును. ఈ రీతి వారిద్దరు గొంతతడపు తగపుదాడి మరల సమాధాన ప చామ్రకే.(డే ముందు వోయినచ్చుటకు నిశ్చయంచుకొనిసరి. H తామకేఁడు లోనికిఁ బోయి తలుపు వైచికొనియెదను. స్థూలజం.. పిల సుబడి తలుపులు గొట్లము పెట్టి యిట్లుఁ జింతించెను. అన్నన్నా? వినవచినదాని దానికంటె నే నేమిటిఁ దక్కు వందనం నెరచి చొన్నకొంటి గుట్టు బయట పెట్టినచో నిరువురను చెరసాలకు లేవువ ఉత్తని ను పెట్టి.చీ వాణి బ్లెగిరిపడియెను. అక్కటా: డమ్మోహనాంగితో సుఫింపు చుండ నే ననద నై యీవాకిటఁ బడియుందునా? దుగ్దగటంబు బిల్లియందోలె వాఁడా చేడియను వీడి యీవలకు వచ్చునా? ఎంతమోసపోయితిని. ఎంత వెంగలినైతిని పశ్చాత్తాపముఁ జెందుచు మరలఁ దలుపురంద్రములో మొగముపెట్టి మిత్రమా ! తామ్రకేశా ! తలుపులొకసారి తీయుము. మాటఁ జెప్పవలసి యున్నదని పిలిచెను కాని యతండు వినంబడినను మాటాడక తొందరపడుచు నామంచముపైఁ గూర్చుండి చీకటిలో నేమియుం గనఁబడమి నిట్టూర్పుసవంబట్టి తలయంపి గురుతుపట్టి శాటీపటంబుఁ దొంగించి అతివేగమునఁ దాటాలున వంగి మోముపై దంతక్షతములు నాటించెను.

అప్పు డాయోగి యదరిపడి లేచి యెవడురా? యెవఁడురా నా మొగము గరచుచున్నవాఁడని యరచుటయు నాతఁడు యోగియని గ్రహించి వెరచుచు మాటాడిన గురుతుపట్టునని స్థూలజుంఘుని బిలువక మంచముక్రింద దూరెను. అత్తెరంగెరుంగక స్థూలజంఘుడు ఓరి ! తామ్రకేశా ! తలుపుతీయవేమిఁ తీయకుము. తీయకుము తలాతులం దీసికొనివచ్చి పట్టియిచ్చెదఁ జూడుము అని యరచెను.

ఆ రొద వినిన యా యోగి మంచముపైఁ గూర్చుండి యేమియుం దెలియక దిగ్బ్రమఁ జెంది ఆ మాట్లాడు వారెవ్వరు ? దీపముదీసికొని రండు ఏమియుం గనఁబడదేమి యని పలికిన స్థూలజంఘుడు కంఠధ్వని గ్రహించి గురువనియెరిఁగి గొలుసుబిగియించి యవ్వలికిఁ బారిపోయెను.

అయ్యోగి మంచముదిగి నలుమూలలు దడిమికొని గోడలు తగులుటయు నది యొక చెరసాలగాఁ దలంచి యోహో ? నే నిచ్చటి కెట్లువచ్చితిని ? నా బుగ్గం గరచిన వారెవ్వరు? ఇందు భూతములు లేవుగదా? యని యనుకొనుచుండ విని తామ్రకేశుఁడు మంచముక్రిందనుండి, హూం, హాం అని యవ్యక్త ధ్వనిగా మూలుగు చుండెను.

ఎట్టి వేదాంతులకైనను మరణమన్న వెఱపుగలుగక మానదు. పిశాచ భీతి భ్రాంతివలనం గలుగునని యెరింగియు నా తపసి జడియుచు మంచముపైకెక్కి యో పిశాచమా ! నన్నేమిటి కీ యంధకార రూపమునకుఁ దీసికొని వచ్చితివి ? మా వలన నీకేమి ప్రయోజనము గలదు ? మేము సన్యాసులము. సంసారులఁ బీడింపుము. నీ కామితములు తీరుపఁగలరు. అని ప్రార్ధించుచుండ యతి భీతితోఁగూడ మంచము క్రింది హుంకారము లెక్కువ యగుచుండెను.

ఆ యోగీంద్రుఁడు హస్తాస్ఫాలనముఁ గావింపుచు నాంజనేయ దండకము శివస్తుతి, భగవస్తవము పఠింపుచుండెను. అంతలోఁ దెల్ల వారినది కాని యందున్న --- భేదమేమియుఁ దెలిసినదికాదు. మఠంబునఁ జిదంబరయోగి కనంబడమిఁ Oy: ఈ మహానుభావుందు ఆ ప్రాయముగల అగ్నికాలవిడిచి యిచ్చటికిఁ బోవ వాఁడు. నే డెందు వోయెనో తెలియదు. సిచిత్రమని తలఁచుచు నందుఁ కనబడినవారి తెల్ల నడుగుచుఁ దిరుగుమండ స్థూలజంఘుఁడు దాపునకు వచ్చి కమలా ! చిదంబరయోగి గోపురము దాపుననున్న శూన్య శివాలయములో నున్నట్లు నాకుఁ గలవచ్చినదిసుమీ ? యని చెప్పిన నప్పడఁతి వానితో నేమియు మాటాడినది కాదు. వాఁ డరిగిన వెనుక యా కనకగాత్రి యాలయ ప్రాకారములోని భూమియంతయు వెదకుచు దక్షిణగోపురము దాపుననున్న శూన్యాలయము నొద్దకుఁజని స్వామీ ! చిదంబరయోగింద్రా? యెందున్నావని పిలుచుటయు నా చప్పుడువిని అమ్మా ! కమలా ! యిందున్నాను. తలుపులు తీయుము అని యరచెను. అప్పుడా పడఁతి గొణ్ణెముతీసి తలుపులు తెరచి యందు మంచము నడుమం గూరుచున్న యా యోగిం గాంచి దాపునకుఁ బోయి స్వామీ! మీ రిక్కడి కెట్లువచ్చితిరి? చిత్ర మయ్యెఁడు చెప్పుఁడని యడిగిన నతం డమ్మా ! ఇది దైవ మాయ. మంచముక్రింద నేదియో యున్నది. ఊరక యరచుచు నన్ను వెఱపించుచున్నది. అని సంజ్ఞజేయుచుండగనే తామ్రకేశుఁడు తటాలునఁ బ్రాకి గుడి బైటికి వచ్చి తలుపులు బిగించి యవ్వలికిఁ బారిపోయి స్థూలజంఘుం గలసికొనియెను.

వానింజూచి వాఁడు నవ్వుచు నోరీ ! యెట్లు వచ్చితివిరా ? యని యడిగిన ఛీ ! ఛీ ! నీవు మిత్రద్రోహుఁవు నీతో మాటాడరాదు. నే నందుఁ జిక్కి పడియుండఁ దలుపులు బిగించి వచ్చెదవా ? పాప మా కమలవచ్చి తీయకున్న నే నెంత చిక్కుపడిపోవుదును. అని నిందించిన వాఁ డిట్లనియె.

నీ కుపకారము చేసినను నిట్లే పలుకుచుందువు. కమలతోఁజెప్పి యచ్చటికిఁ బంపినవారెవ్వరో తెలిసికొనలేవు. అది వచ్చి తలుపులు తీసినతోడనే యా ముసలివాని నీవలకుఁ ద్రోసి దాని లోపలకు లాగికొనియుందువని యప్పని చేసితిని. అట్లు చేయక దొరకిన యర్ధము పారఁజిమ్ముకొనివచ్చి నన్నేమో దూరెదవు చాలులే. ఏమిజరిగినదని యడిగిన నవ్వుచు నిట్లనియె.

తెలిసినది తెలిసినది. అదియా ! నిన్ను నిందించినందులకు క్షమింపుము. మనము లేచినవేళ మంచిది. ఇంతపొరపాటు చేసితిమేల? నాకా ! రాత్రి నేను పడిన పాట్లు దయ్యమెరుంగు నేను దయ్యమని యతండూరక వెరచినకొలఁది యరచు చుంటిని. ఆ కమలవచ్చి తలుపుఁదెరచి యతని బరామర్శింపుచుండఁగ లేడివలె నెగిరి యీవలఁబడి తలపులు బిగించి వచ్చితిని. వింటివా యని చెప్పిన వాఁడుజూచి వీపు చరచుచు నిట్లనియె. బళి బళి. బాగుబాగు. మంచిపని చేసితివిగదా ? మరల రాత్రిపడనిమ్ము అని వారు మాటాడుకొనుచుండగా రాజదూత వేత్రహస్తుఁ డొకడు వచ్చి మంత్రులతోఁగూడి శశాంక మహారాజుగారిందు వచ్చుచున్నవారు. సద్దు చేయ వలదని యాజ్ఞాపించెను. ఆ మాటనిని యందుఁ గల సన్యాసులెల్ల యెక్కడివారక్కడ గూర్చుండి జపమాలికలు త్రిప్ప మొదలుపెట్టిరి.

అప్పుడు ప్రధానులతోఁ గూడికొని యా భూభర్త యుచ్చటికి వచ్చి యోగి బృందమునెల్లఁ బరామర్శింపుచు భోజనభాజనాది సత్కారములన్నియు మీ కనుకూల ముగా జరుగుచున్నవియా యని యడిగిన వారందరు నేకకంఠముగా మహాప్రభూ ! మా కేమియు లోపములేదు. ఉపచారములన్నియు బూర్ణముగా జరుగుచున్నవని చెప్పిరి.

పిమ్మట నతండు మంత్రులతో ముచ్చటింపుచు మఠవిశేషములఁ జూచుచు దిరుగుచుండ నొకదండ నంతఃపురంబునఁ గావలి యుండెడు సౌవిదల్లుఁడు కనంబడి నమస్కరించుటయు రాజు గురుతుపట్టి నీ వమ్మగారి ప్రతీహారివికావా? ఇందేమిటికి వచ్చితివనిన నతం డిట్లనియె.

దేవా ! నేను పరిచారకుండ నట్టివాఁడనే. అమ్మగారు ఇందున్న చితంబర యోగిగారివద్ద కరిగి మంత్రభస్మముఁ దెమ్మని యంపగా వచ్చితిని. అ య్యోగీంద్రుండు ప్రొద్దుటినుండియుఁ గనంబడుటలేదు. ఎందుఁబోయినది తెలియదు. ఎవ్వరి నడిగినను జెప్పకున్నారని చెప్పిన నన్నరేందుఁ డందు నిలువంబడి చిదంబరయోగి యెం దున్నవాఁడని కింకరులచేఁ గేకలు వేయించెను. ఆ యోగి బ్రతివచనము వినంబడలేదు. ఆ దాపుననున్న సన్యాసు లాయన నేటి యుదయమునుండియు గనంబడుటలేదు. ఎందుఁ బోయెనో తెలియదని చెప్పిరి.

అట్టి సమయమరసి స్థూలజంఘుఁడు దేవా ! నేనా యోగి శిష్యుండనే తమరు మన్నింతురేని వక్కాణించెదమని సంశయాకులిత మతియుంబోలె పలికిన విని రాజూ మన్నింతుము. సత్యముఁ జెప్పుము అని చెప్పెను. అప్పుడా మాయావి వారినెల్ల వెంటఁబెట్టుకొని యా గుడియొద్దకుఁ బోయి తలుపుతీసి వారిం జూపుచు వీరే మా గురువులు. శిష్యురాలికి రహస్య మంత్రోపదేశముఁ జేయుచున్నారని పలికెను.

చిదంబరయోగి మంచముపైఁ గూర్చుండెను. కమల ప్రక్కను నిలువంబడి యున్నది. వారింజూచి రాజు ముక్కుపై వ్రేలు వైచుకొని భళిరా ! మకరాంకా ! నీ చేష్టలు కడు విపరీతములుకదా ! ఈ వృద్ధతాపసుఁ డేడ? ఈ బాలయోగిని యేడ ? ఎట్లు సంఘటించితివి. అని విస్మమయముఁ జెందుచు మహాత్మా ! యోగింద్రా ! మీరిందుఁ జిక్కితిరేల యని పరిహాసపూర్వకముగా నడిగెను.

కమల వారింజూచి తలుపుచాటునకుం బోయినది. చిదంబరయోగి రాజుగా నెరిఁగి మెల్లన మంచముదిగి యీవలకు వచ్చి దేవా ! మా కిదియొక ప్రారబ్ధము. దీనిలోనికి నే నెట్లు వచ్చితినో చెప్పఁజాలను ? రాత్రియెల్ల నే నిందుఁ బడినబాధ దైవమెరుఁగును. నా శిష్యురాలు నన్నుఁ జూడవచ్చినఁ దలుపులువైచి యెవ్వఁడో పారిపోయెనని యా కథ యంతయుం జెప్పెను.

నమ్మకము చెడినపిమ్మట నెంత సత్యముఁ జెప్పినను విశ్వాసము గలుగదు గదా ! శశాంకుఁ డయ్యతి వచనములయం దాదరము వహింపక మంత్రుల మొగముఁ జూచుటయు వారు దేవా ! ఇందున్న యోగులందరు నిట్టివారే ? ప్రతిసన్యాసికిని శిష్యురాలు గలిగియన్నది. ళాల్యన్నములు భుజించి పనిపాటలులేక వీరందరు నాఁబోతులవలె బలిసియున్నారు. వీరి నందరిని పొమ్మని యీ సత్ర మెత్తివేయించుట లెస్సయని పలికిన నతం డంగీకరింపక నిది మొదలు యోగిను లీ మంఠపములో నుండరాదు. పది దినములలో నందరును లేచిపోవలయునని యాజ్జయిచ్చి ప్రధానులతోఁగూడ నా ఱేడు నగరికిం బోయెను.

కమల యావార్త విని యార్తిఁజెందు డెందముతో నౌరా! నాచరిత్ర యెంత చిత్రముగానున్నది. నా కతంబున యోగినులకెల్ల నపకారమైనదిగా ? పాప మీ చిదంబరయోగి నూరేండ్లవాఁడు. ఇట్టి వారినింగూడ స్త్రీ సాన్నిధ్యంబునం జేసి లోకులు శంకించుచున్నారు. ఇంతకన్న నవివేకమున్నదియా । నా నిమిత్తమై యా కపట శిష్యులే యీ పనిఁ గావించిరి. అన్నన్నా ! నా మంచమందే యుంచినచో నన్ను వీండ్రు మోసము చేయుదురుగదా ? సీ ! ఆఁడురూపమునఁ జనించుటకంటెఁ గ౦టకము మరియొండు లేదు. నేను సత్వవంతుని నిమిత్తము మగరూపు విడచి యీ యాడురూపుఁ దాల్చితిని. ఇందు రసాభాసమైనది. సత్వవంతుండిఁక రాడు. నే నన్నింటికిం జెడితిని. ఈ యాడురూపము వానియెదుటనే ప్రకటించితినయేని యెంత యొప్పిదముగా నుండును. ఇఁక వానిం జూచుభాగ్యము నా కన్నులకుఁ గలుగదు. పోనిమ్ము. చిదంబరయోగి నా వృత్తాంతమువిని నిన్నుఁ గాశికిఁ బొమ్మని శెలవిచ్చియున్నాడు గదా! ఆయన మిగుల వృద్దుఁడు. జ్ఞానవంతుఁడు. ఆయనమాట వడువుననే కావించెదనని నిశ్చయించి కమలయను పేరుతో నున్న రూపవతి మరలఁ బురుషవేషము వైచికొని యటఁగదలి కతిపయ [పయాణంబులఁ గాశీపురంబున కరిగినది.

అని యెరింగించి అవ్వలికథ మణిసిద్ధుండు తదనంతరావ సథంబున నిట్లు జెప్పం దొడంగెను.

డెబ్బది మూడవ మజిలీ కథ

ఆహా ? లోకమెంత మోహక్రాంతమై యున్నది. అన్నియుం దాను జేయుచున్నట్లు తోచును. నిక్కమరయ జనుడు రవ్వంతయు! దాను జేయుటకుఁ గర్త కాడు. భ్రమపడి కర్తృత్వము తనపైఁ బెట్టుకొనును. తాను జేయఁ బూనిన పనులే పిమ్మట విమర్శింప విపరీతములుగాఁ దనకే తోచును. ఆచరింపబడినది మార్చుటెట్లో శక్యముకాదో జరుగఁబోవునదియుఁ దెలిసినను మార్చుటకు శక్యముకాదు. ఆ రహస్య మెరుఁగక ప్రమాదము జేసితిమనియుం ముందు జాగరూకతగాఁ జేయుదు మనియు సంకల్పించు చుందురు. అది వట్టిదబ్బర. కాకున్నది కాకమానదను నార్యోక్తి శిలాశాసనమువంటిది. అందులకు మా చరిత్రమే దృష్టాంతము. మేము గొప్ప సంపదలు కలవారియింటఁ బుట్టియు సుఖపడనేరక కన్నవారి దుఃఖముల పాలుఁజేసి యిల్లువిడిచి దేశముల పాలైతిమి. మే మిట్లు చేయుటకుఁ గారణమేమియుఁ