కాశీమజిలీకథలు/ఆరవ భాగము/69వ మజిలీ

వికీసోర్స్ నుండి

అరువది తొమ్మిదవ మజిలీ కథ

కృతవర్మ గుప్తవర్మల కథ

ఒకనాఁడు అర్ధయామా విశేషదివసకాలంబున మనోహరరూప సంపన్నులగు నిరువురు బ్రాహ్మణ కుమారులు బ్రహ్మస్థలమను నగ్రహార పరిసరంబున నడుచుచు నెదురుపడిన నొక బాటసారిం జూచి అయ్యా ! యిక్కడికిముందు గ్రామ మెంతదూరమున్నది. అందీ రాత్రి నివసింపఁదగిన తావుగలదా యని యడిగిన విని యా మార్గస్థుండు వారింజూచి వెరుఁగుపడుచు నిట్లనియె.

బాలులారా ! మీ రెందలివారలు ? మీ రూపములు కడు సుకుమారములుగా గనంబడుచున్నయవి. మీ ముఖలక్షణంబులు రాజ్య సుఖోపభోగ్యక్షమంబై యున్నవి. ఇట్టి మీరు పాదచారులై నడచివచ్చుట శోచనీయమై యున్నది. గమనాయాసమున స్రుక్కి నడువలేక నడచుచున్నమిమ్ము ప్రశ్నోత్తరములచేఁ క్లేశపరుపరాదుగాని దర్శనీయములైన మీ యాకారచిహ్నములే యీశంకావకాశముఁ గలుగఁ జేయుచున్నవి. మీ ప్రాయము కడుచిన్నది ! మీ వృత్తాంతముఁ గొంతకొంత వివరించి నాకు శ్రోత్రానంద మాపాదింపుడు ఇక్కడికిఁ గడుదవ్వులోనే బ్రహ్మస్థలమను నగ్రహారము కలదు. రవి గ్రుంగకమున్న పోగలరు. కొంచెము విశ్రమింపుఁడు. మీకు భోజనాది సత్కారములు చేయువారందుఁ బెక్కండ్రు కలరు. అని యక్కఁడికథ యంతయుంజెప్పి నిలువంబడియున్న యా తెరువరితో వారిట్లనిరి.

పుణ్యాత్మా ! గ్రామము దాపుననున్నదని మాకుఁ జల్లని మాటలఁ జెప్పితివి. అడుగామడగా నడచుచుంటిమి. మేము బ్రాహ్మణులము. విద్యార్థులమై కాశికరుగుచున్న వారము. మాకు రాజ్యములులేవు పేదపారులము. మృదువులగు మా రూపములే మాకు శత్రువు లగుచున్నవని యుత్తరము సెప్పిరి.

అప్పుడాపాధుండు మీరు నిక్కముగా విద్యార్థులలేని బ్రయాసవడి కాశీ కరుగ నవసరములేదు. ఆ బ్రహ్మస్థలమున సోమ భట్టారకుండను బ్రాహ్మణుడు గలడు. అతండు కాశీపండితుండు. విద్యార్థుల నింటఁబెట్టుకొని విద్యలు గరపు చుండును. వేగము పొండని పలికి యతం డవ్వలికిఁ బోయెను.

పిమ్మట నా కుమారు లిరువురు సూర్యాస్తమయ సమయమునకు నా యగ్రహారమున కరిగి వెదకికొనుచు సోమభట్టారకుని యింటికింబోయి తద్గృహ ---------- బరచిన తాళపత్రకటాసములఁ గూర్చుండిరి. ఇంతలో సురలతోఁ గూడికొనిన బృహస్పతి వడుపున నొప్పుచు సోమభట్టారకుండు శిష్యులతోఁగూడ దటాకమునుండి కాల్యకరణీయంబులఁ దీర్చికొని యింటికివచ్చెను. వారిజూచి యా విప్రకుమారు లిరువురులేచి నిలువంబడి నమస్కరించిరి. తదీయ రూపవిశేషముల కక్కజముఁ జెందుచు నావిపుఁడు మీ రెవ్వరు? ఎక్కడికిఁ బోవుచున్నారు? మీ యుదంత మెట్టిదని యడిగిన వా రిట్ల నిరి.

దేశికోత్తమా ! మాది దక్షిణదేశము. విద్యార్థులమై వచ్చితిమి. మేము ద్విజకుమారులము. మీరిందు విద్యాదానము సేయుచున్నారని విని యరుదెంచితిమి. మా కోరిక సఫలముఁ గావింపుడు మమ్ము మీ విద్యార్థికోటిలోఁ జేర్చుకొనుడని వినయముగా బ్రార్ధించిన సంతసించుచు నతండు మీ రింతకుముందేమి చదివితిరి. చదువవలసిన గ్రంథములెవ్వి ? మీ యిష్టంవచ్చినట్లు చదువుకొనవచ్చునని నాదరముగాఁ బలికెను. వారును వారుఁ జదివిన విద్యలం బేర్కొని చదువవలసిన వానిం జెప్పినంత విస్మయపడుచు నతండు వారినిఁ గొన్ని విద్యలలాఁ పరీక్షించి తద్విద్యా పరిశ్రమమునకు నమితముగా సంతసించుచు నంతకుముందు తనయొద్దఁ జదువు శిష్యులకు వారినే గురువుగాఁజేసి విద్యలు గరపించుచుండెను. విద్యారహస్యముల వారి కెరింగించుచుండెను. అట్లు శిష్యులు గురువులునై వారు సోమభట్టారకుని యింటఁ గొన్ని దినములు వసించిరి.

ఒకనాఁడు సోమభట్టారకు డక్కుమారుల నిరువురసు రహస్య స్థలమునకుఁ దీసికొనిపోయి వత్సరాలా ! మీరు మత్వామీప్యమునకువచ్చి యల్పకాలమైనను మీ యాశ్రమ నైపుణ్యము విద్యాగుణ గౌరవములు స్తవనీయములై యున్నయవి. మీ యెదుట ననరాదు. మీ రూపములు తేజములు చూచినవారు మీరు పారులని నమ్మఁ జాలరు. చక్రవర్తి కుమారులనియే తలంతురు. మీరు నాచెంత విద్యా విశేషములంతగా గ్రహింపకపోయినను నంతేవాసు లనిపించుకొను చున్నారు. కావున మీరు నాకొక యుపకారము సేయవలసియున్నది. అందులకు నే నుపేక్షించితినేని మీదు మిక్కిలి రాకమానదు. ఉపాయంబునం గాని సాధింపశక్యముకాదు. రహస్య భేద మయ్యెనేని ప్రమాదమువచ్చును. మీ రప్పని పూనికొని దీర్తుమంటిరేని వక్కాణింతునని పలుకుటయు వారువినమ్రులై యిట్లనిరి.

గురువరా ? నీవు తండ్రివోలె నాదరించుచు నింటఁ బెట్టుకొని విద్యలం గఱపుచుంటివి. ఇట్టి యకారణ బంధుండనగు నీయుపకృతి కెన్నడైనఁ బ్రతి జేయగలమా ? నీ యాజ్ఞఁగావించి కృతకృత్యుల మయ్యెదము. సంశయింపక కరణీయములకుఁ గింకరుల మమ్ము నియోగింపుము. ప్రాణప్రదానంబు నైనను గురు కార్యము సవరింతుమని యత్యంతాదరముతోఁ బలుకుచు నా విద్యార్థుల కతం డిట్లనియెను.

సత్యవతి కథ

వత్సలారా ! వినుండు. మదీయ పురాకృత సుకృత పరిపాక మెట్టిదియో కాని నాకు లేక లేక యొకయాఁడుపిల్ల పుట్టినది. అది మిక్కిలి కురూపిణి యగుటకు మిక్కిలి చింతించుచు దానికి సత్యవతియని పేరు పెట్టితిని. దానిమొగము మసి మంగళముకన్న వికృతముగా నున్నది. ఒడలిచాయకన్న బండికందెన చాయయే మెరుగని చెప్పవచ్చును. కన్న మోహంబున నా కన్నియం బెనుచుచుండ నెనిమిదవ యేట స్ఫోటకము పడినది. అప్పుడొక కన్ను గూడఁ బోయినది. మొగము మరియు వికృతమైనది. తలిదండ్రులకే దానిరూపు మసహ్యముగా నుండును. పెరవారి మాటఁ జెప్పనేల. ఆ సత్యవతి కిప్పుడు వివాహకాలము మించిపోవుచున్నది. రాఁబోవు ననర్థమునకు ముందే ప్రతీకారము సేయవలయునని యూహించి యా సత్యవతి నెన్నఁడును బైటికి రానీయక నితరులు చూడకుండఁ గాపాడుచుంటిని. మదీయ గౌరవము ననుసరించి విద్యాభాస్కరుండును బ్రాహ్మణ కుమారుండు దానిం బరిణయంబగుట కంగీకరించి యరిగెను. నిశ్చయ తాంబూలములు పుచ్చికొంటిమి ముందరి మాసములో వివాహ ముహుర్త ముంచితిమి. ఇట్లుండ నతనికెవ్వరు తెలియఁజేసిరో మీ కుమార్తెను నాఁడు సూచుట మరచితిని. చూచునిమిత్తము నెల్లి వచ్చుచున్నానని కమ్మవ్రాసి యంపెను. ఆ జాబిప్పుడే చూచుకొంటిని. అతండు సత్యవతిని జూచెనేని బెండ్లి యాడనిమాట నిశ్చయము. ఇందుల కెద్దియేని బ్రత్మికియ నాలోచించవలసియున్నదిగదా? నేనొక తెర వాలోచించితి వినుండు. మీ దేశాచార నియమంబులు నా కుపయుక్తములైనవి. స్త్రీలవలె మీరు తలయంతయు శిరోజము లుంచికొంటిని. మరియు మీ మొగములు స్త్రీ ముఖములవలె మనోహరంబులై యున్నవి. కావున మీలో నొకరు స్త్రీ వేషము వైచికొంటిరేని సత్యవతియనిచెప్పి యతనికిం జూపెదను. అతం డప్పుడు పరమ సంతోషముఁ జెందగలడు. పిమ్మట వేరొక తెరవునఁ గార్యంబు సాధించెదనని యావూహ మంతయు వారి కెరింగించిన నవ్వుచు గుప్తవర్మ యిట్ల నియె.

ఆర్యా ! మీ కార్యంబు నెరవేర్చుటకు మేము పూటగాపులమై యుంటిమి. సందియము వలదు. వినుండు పెండ్లి చూపులకును, పీటలపై కూర్చుండుటకును నే నాఁడురూపుధరించి కార్యంబు సాధించెదను. అత్త వారియింట కరిగిన పిమ్మట నదియే నేనని వారిని నమ్మించుటకు యెట్లో తెలియకున్నది. అనుటయు నా విప్రుండు నడుగగా ! గడుసు ప్రశ్నయే వైచితివి. అందులకుకొక యుక్తి నాలోచించితిని వినుము. పెండ్లియైన కొన్నిమాసములకు నా పుత్రి స్పోటకము పడినదని బూటకముపన్ని యా --------------- నిట్టి వికృతరూపము వచ్చినదని ప్రకటించెను. దానంజేసి తలంపు కొనసాగునని చేయఁదలంచికొనిన కృత్యమంతయు బోధించెను. అందుల కనుమోదించుచు గుప్త వర్మ కృతవర్మతో నాలోచించి నాటిరాత్రియే యట్టి వేషము వైచికొనియెను.

చ. గొనబగుమోమునన్బొలయు కుంతలము ల్గలయంగదువ్వి చ
    క్కనిజడవైచి మేలి తేలికన్నులఁ గాటుకదిద్ది రత్నమం
    డనముల నెన్నియేనియు నొడల్మెఱయం ధరియించి లోకమో
    హనమగు కన్నెరూపు వెలయందగె దేశికుఁడిచ్చ మెచ్చగన్.

ఆ మరునాడే పెండ్లి కూతుఁ జూచుటకు విద్యాభాస్కరుండా యగ్రహారమున కరుదెంచి సోమభట్టారకుచే నర్చితుండై పెండ్లికూతుంజూచి మోహక్రాంత స్వాతుండై యిట్లు తలంచెను.

ఆహా ! యీ మోహనాంగి యంగములన్నియు లావణ్యపూరితము లై మొలచినట్లే యొప్పుచున్నవిగదా? అయ్యారే? చేరలకు మీరియున్న యీ తెలి కన్నులసోయగ మెన్నియేండ్లు చూచినను దనివితీరునా ? బాపురే? తళ్కుచెక్కుల యందు మొక్కటియే యొకగ్రంధముగా వ్రాయవచ్చును. ఇట్టి సర్వాంగసుందరిని నాకుఁ పత్నిగాఁజేయఁ బూనిన యీ పండితునిపై ద్వేషమువహించితినిగదా ? శత్రువు లెవ్వరో యీతని కూతురు కురూపిణియని నాకు వ్రాసిరి. దివ్యాంగలంబురడించు మించుబోణి పాణిగ్రహణము సేయుచున్నావాఁడ నా భాగ్యము కొనియాడఁ దగియున్నది. మదీయ పురాకృతము ఫలించినది. నా జన్మము సాద్గుణ్యము నొందినది. నా విద్య సార్ధకమైనది. అని మెచ్చుకొనుచు నుబ్బుచు మురియుచు బెద్దతడవు ప్రహర్ష జలధిలో మునిఁగి యుండెను. అప్పుడు సోమభట్టారకుండు పట్టీ ! సిగ్గేమిటికి ? నీ భర్తను మొగమెత్తి చూడుము. అని గడ్డము పట్టుకొని ముఖమును పైకెత్తి చూపెను.

విద్యాభాస్కరుండు ఆర్యా ? సకలవిద్యచ్చిరోమణులగు మీ పాపకు లోప ముండునా ? బుద్ధులు బోధింపవలయునా? చేష్టలు గరుపవలయునా? లోపలికిఁ దీసికొనివెళ్ళుడు. పాపము సిగ్గుపడు చున్నదని పలికినంత నక్కపటయువతి దిగ్గున లోపలికిఁ బోయినది. విద్యాభాస్కరుండు కాలవ్యవధి సహింపక మామతో ముచ్చటించి ముహూర్తము నిశ్చయించి యింటికి జనియెను.

పిమ్మట సోమభట్టారకుండు లోపలికిఁబోయి గుప్తవర్మఁ గౌగలించుకొని పుత్రా ! మొదటిగండము దాటించితివి నీ వెంతకైనం దగినవాఁడ వగుదువే. కొదువపనిగూడఁ దీర్చితివేని ధన్యుండనగుదు. నీ వేషము మాకే ముచ్చటగలుగఁ జేసినదిగదా? ఈ రహస్యము మనకుఁగాక యెవ్వరికిం దెలియగూడదు సుమీ ? యని పలుకుచు నాటంగోలెఁ బెండ్లి పనులు చేయ మొదలు పెట్టెను.

సోమభట్టారకుండు భాగ్యవంతుఁడగుట నా వివాహ సన్నాహ మాశ్చర్య కరముగాఁ జేయించెను. దూరదేశమందలి బంధువులను సందోహముగాఁ రాఁ దొడంగిరి. సోమభట్టారకునికిఁ బుత్రిక గలిగిన దనుటయే కాని చూచినవా రెవ్వరును లేరు. బంధువులు నా కపటవధూరత్నమును జూచి ఆహా ! భట్టారకునికి లేకలేక మణి పుట్టినదిగదా ! అతని యదృష్టము మక్కజముగదాయని స్తోత్రములు సేయుచుండిరి. విద్యాభాస్కరుండును వివాహా దివసమున కత్యుత్సాహ ముద్దీపిత మానసుండై సకలబంధు పరివార సహితుండై యయ్య గ్రహారమున కరుదెంచి స్నాతకవ్రతముఁ దీర్చుకొని మహుర్త మున కెదురుచూచుచుండెను.

అంతలో బాస్కరుండు దనవేడిమిం బుడమిపైఁ దప్పించి మందేహాసురలపైఁ బ్రసరింపజేయుటయు విద్యాభాస్కరుఁడు సుముహూర్తమునకుఁ దూర్య నాదములు రోదసీకుహరము నిండ మెండు వైభవముతో నూరేగుచు భట్టారకుని యింటి కరిగెను

కన్యాదాత సత్యవతిఁ బెండ్లి కూతుంజేసి యొక చీకటి గదిలో వియ్యపు గంపలో గూర్చుండఁబెట్టి యెల్లరు చూచునట్లు కపట సత్యవతిని గౌరీతపం బొనరింప నియోగించెను. పెండ్లి కుమారుని బీటలపైఁ గూర్చుండఁబెట్టి పురోహితుండు వివాహ తంత్రమంతయు సమంత్రముగా విధ్యుక్తక్రమంబునఁ గావించి కన్యాదాన కాలమందుఁ బెండ్లి కూతుం దీసికొని వచ్చుటకు గన్యాదాతతోఁగూడ లోపలికిఁ బోయెను. అప్పుడు పరబంధువులందరు లోపలికిఁబోయి గౌరీతపఁ బొనరింపుచున్న యా బాలికారత్నమును జూచి వెరఁగపడుచు నిట్టి చిన్నది విప్రకులంబునఁ బుట్టఁ దగినది కాదనియుఁ జక్రవర్తికి భార్య కాఁదగినదనియు విద్యాభాస్కరుఁ డదృష్టవంతుడనియు బొగడఁ దొడంగిరి.

కన్యాకా పురోహితుం డుచ్చస్వరంబున భట్టారకుని ప్రవరంజదివి యచ్చటి తంత్రంబుదీర్చి వివాహవేదికకుఁ గన్యందీసికొని పోవచ్చునని చెప్పెను. అప్పుడచ్చటివారెల్లఁ బెండ్లి చావడిలోనికిం బోదొడంగిరి. అప్పుడు సోమభట్టారకుండు గంపతోఁగూడఁ బెండ్లి కూతుం జేతులతో నెత్తుకొని యిటునటుచూచి యా చీకటిగదిలోనికిం దీసికొని పోయెను.

వరపురోహితుం డదిచూచి అయ్యా ! అట్లు లోపలికిఁ దీసికొని పోయెదరేల? ఇచ్చటికిఁ దీసికొనిరండని కేకలు వైచెను. కన్యాదాత తొందరపడి యా గంప నచ్చటదింపి యావలకువచ్చి మాలో వివాహమునకు ముందుఁ బెండ్లికూతుం దాచుట యాచారమై యున్నది. అందులకై యిట్లు చేసితినని చెప్పగా ఒక పురోహితుండు యిది వివాహక్రమముగాదు. సుముహూర్తము మిగిలిపోవున్నది. పెండ్లి కొడుకు లేచి రాగూడదు. ఆ వేడుక మరియొకప్పుడు దీర్చుకొనవచ్చునని చెప్పుటయు నొప్పుకొని భట్టారకుండు. అంతకుముందు బోధించియుంచిన యొక యాప్తునితోఁ గన్నెరకం దీసికొనిరమ్మని కనుసన్నఁజేసి తాను వివాహవేదిక యొద్ద కరిగెను. ఆ యాప్తుం డా జీకటిగదిలోనికిఁ బోయి తడిమికొనుచు నలుమూలలు దిరిగి దిగ్భ్రమఁజెంది సత్యవతియున్న గంప యెందున్నదో తెలిసికొనలేక గుప్తవర్మయున్న గంపయేయని యనుకొని యా గంప యెత్తికొనివచ్చి పెండ్లి పీటలయొద్ద దింపెను. పెండ్లి కూతురు తలవాల్చికొని యుండుటచే నేది యెవ్వతియో నిరూపింప నవసరము లేకపోయినది.

పిమ్మట బురోహితుండు విధి ప్రయుక్తముగా భట్టారకునిచేఁ గన్యాదానము గావింపఁజేసెను. విద్యాభాస్కరుండు పరమ సంతోషముతో బెండ్లి కూతురి మెడలో మంగళసూత్రమును గట్టెను. వధూవరు లొండొరులపైఁ దలంబ్రాలు పోసికొనిరి. అట్టి సమయమున సోమభట్టారకుఁడు గుప్త వర్మ ముఖముచూచి అయ్యో ! ఇదియేమి మోసము సత్యవతిని దీసికొనిరమ్మని చెప్పిన దీనినే తీసికొని వచ్చెనేమి. అని తల్ల డమందుచు లేచి యా చీకటి గదిలోనికిం బోయి తడిమి సత్యవతిఁ జూచి నీవిందే యుంటివా? తల్లీ యని పలికిన నక్క లికి నన్నెవ్వరు తీసికొని పోలేదని యుత్తరము చెప్పినది.

ఆహా ! దై వయత్నముగాక మనుష్యయత్న మొక యత్నమా? ఇట్లెరిగియు విద్వాంసులును మోహమందుచున్నారు. సత్యవతికింకను వివాహయోగ్యదశ రాలేదు కాఁబోలు. ఈ ముహూర్తమున సత్యవతి మెడలో భాస్కరునిచేత మంగళసూత్రముఁ గట్టించలేకపోతినిగదా ! అయ్యో ! పాపము గుప్త వర్మ కన్యాకృత్యము లన్నియు నేరుపుగా నభినయించుచున్నాడు. నా కేమియు ముపయోగించినది కాదు అని పెక్కు గతులఁ తలపోయుచు విధిలేక చేయవలసిన కార్యములు సేయుచు నాలుగు దివసములు గడిపెను. అతనికి మనసు మనసుగా లేదు ఉత్సవము లాపత్సమయములైనవి. అతడు మాటాడుటయు, నవ్వుటయు, బిల్చుటయు నెరుంగడు. విద్యార్థులే యన్నిపనులు సవరించుచుండిరి. ప్రాణసమమైన పుత్రిక యన్యాధీన యయ్యెనని చింతించుచున్నాడని బంధువులు తలంచిరి. గుప్తవర్మకుఁ గృతవర్మకుఁ గన్యాదాతలకుదప్ప నా రహస్య మెవ్వరికిం దెలియదు. నాకబలియైన తరువాత సోమభట్టారకుఁ డొకచోటఁ గూర్చుండి ఏదియో ధ్యానించుచుండ నొక శిష్యుడువచ్చి స్వామీ ! యజ్ఞదత్తుండను బ్రాహ్మణుండు భార్యతోఁగూడఁ గాశికిఁ బోవుచు నిచ్చటికి వచ్చి యున్నవాఁడు ఆయన మీకు సహాధ్యాయుడట. మిమ్ముఁజూచి పోవలయునని చెప్పుచున్నాడు. వాకిటఁ నున్నాడని చెప్పుటయు దుఃఖము మరచి సంతోషముతో లేచి వాకిటకుఁబోయి యజ్ఞదత్తుంగాంచి యోహోహో !ప్రాణమిత్రుఁడేయని పలుకుచు గాఢాలింగనముఁ జేసికొనియెను.

అతండును నుపళ్లేషపూర్వకంగా సంప్రీతిని వెల్లడించెను. ఒండొరుల సంతోషములు దెలుపుకొనిన పిమ్మట సోమభట్టారకుండు మిత్రమా? కాశినుండి నేను నీకంటె మందుగనే యింటికి వచ్చితినిగదా ? తరువాత నీకథ యేమియుఁ దెలియుట లేదు. ఎందువసించితివి ? పిల్ల లెందరు? ఏమిచేయుచుంటివి. మన సహాధ్యాయుండు విద్యత్కేసరికథ యేమైనం దెలిసికొంటివా ? అన్ననా నిన్నుఁజూచినంత మనము గాశిలోఁ జేసిన యల్లరులు జ్ఞాపకము వచ్చుచున్నవిగదా ఆహా యౌవనమునకుఁ జాలిన సంతోషసమయము మరియొకటిలేదని పూర్వోదంతములు గొన్ని ముచ్చటించుటయు నతండు నిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె.

వయస్యా ! నీ వనినట్లు బాలభావంగల సంతసమెప్పుడును గలుగదు. ఇప్పటి నాస్థిని మనుష్యమాత్రుని కెవ్వరికిఁ గలుగదని చెప్పగలను. నేను గడు పాపాత్ముండ. నా యుదంతమును వినిన నీవును జింతింతువు. పోనిమ్ము. నీకుఁ బిల్ల లెందరు? ఇప్పుడీపిల్ల నెవ్వరికిచ్చితివి ? నీ వదృష్టవంతుఁడవు. నీ వృత్తాంతముఁ జెప్పుము. విని నా శోక ముపసంహరించు కొనియెదనని పలికిన నతండిట్లనియె.

మిత్రమా ! నా వృత్తాంతము బాగుగానే యున్నది. పిమ్మటఁ జెప్పెదను. నీ వేదియో యిక్కట్టుఁ జెందినట్లు తోచుచున్నది. నీ కధ వినుఁదనుక నా మనసు పరితపించుచున్నది. నీ వార్త కన్న నాకీ యుత్సవము పెద్దదికాదు. వేగ నుడువుమని నిర్బంధించుటయు నతండు తాను గాశినుండివచ్చి ధర్మపాలనృపాలు నాశ్రయించుటయుఁ బెండ్లియాడుటయుఁ బుత్రిక జనించుటయు వివాహసమయంబున నది నదిలోఁబడి మృతినొందుటయు లోనగుకథ యంతయుం జెప్పి యప్పండితుని శోక జలరాశిలో ముంచివై చెను.

ఔరా ! విధి చలపట్టి యెట్టి యిక్కట్టుఁ గలుగఁ జేసెను. అన్నన్నా ఎట్టిసంతోషము చింతలపాలయ్యెను. అని సోమభట్టారకుండు విచారింపుచుండ వారించుచు యజ్ఞదత్తుండు పోనిమ్ము? ఆ తగవు తలఁపవలదు. పెండ్లియింటఁ గంటఁ దడిపెట్టరాదు. నీ యుత్సవము నా యుత్సవము కాదా ! ఎక్కడి సంతానము ఎక్కడి సుభము వీరవలన మనమానందింపఁ దలంచుకొనుట -------------- జలంబుఁగ్రోలఁ దలచినట్లే. చాలు. జాలు. అని పలుకుచు ఏమీ ! పెండ్లికూతు రెందున్నది: రప్పింపుముఁ చూచి యానందించెదంగాక యని పలకగా నతండు దిగులుతో నందున్న శిష్యునింజీరీ పెండ్లికూతుం దీసికొనిరమ్మని సంజ్ఞజేసెను.

అయ్యంతేవాసి లోనికిఁబోయి వచ్చి స్వామీ ! పెండ్లికూఁతు రెంతఁజెప్పినను సిగ్గుచే నిక్కడికి రాకున్నది. గడియ తాళవలయునని చెప్పిన ధరణ మరి యెవ్వరు కారు. నా మిత్రుఁడు చూదవలయు. రావచ్చునని ఇప్పుము. అని మకల నతని లోపలికని పెను. ఆ శిష్యుఁడు పోయి కొంత సేపటికి వచ్చి గురుసితో రహస్యముగా స్వామి: పెండ్లి కూతు రెండో కాగినది. ఒకదనను గనంబడినదికాదని చెప్పెను. అప్పుడు సోమధట్టారకుఁడు లానే లోనికి Dod లు వెదకెను. ఎందును గుప్త వర్మయుఁ గృతవర్మయుంగూడ? గనఁబడలేదు. భార్య నడిగిన నామె నాకేమియుం దెలియదని చెప్పినది. అతం డొక్కింతతడవు విచారించి భార్యచెవిలో నేదియోచెప్పి మరల యజ్ఞదత్తు నొద్దకువచ్చి య మాటలే ముచ్చటించుచున్నంతలో నింటిలో కేకలు వినంబడినవి. ఆరొదయేమియో తెలిసికొని రమ్మని శిష్యునొకని నంపుటయు నతండు లోపలికివెళ్ళివచ్చి తొట్రుపడుచు నిట్లనియె.

పెండ్లిఁగూతురురూపు మారిపోయినది. చాల వికృతాకృతితో నొప్పుచున్నది. ఇసిరో ! చూచుటకే యసహ్యముగ నున్నది. మీరు సుముహుర్త మునకు ముందుఁ గులదేవత నారాధించినారు కారఁట. అద్దేవి కోపించి యిట్లు కావించితినని అమ్మగారి నా వహించి చెప్పుచున్నది. వేగరండని చెప్పెను.

అప్పు డదరిపడుచు సోమభట్టారకుఁడు యజ్ఞదత్తునితోఁ గూడ గృహాంతరమున కరిగెను. భట్టారకునిభార్య పరుషములాడుచుఁ దల విరియఁబోసికొని శివమాడుచు భట్టారకుఁజూచి కన్నులెర్రఁజేయుచు నోరీ ! మూర్ఖుడా ! చిరకాలము నుండి నీ కులము నాశ్రయించికొని నున్న దేవతను మరచితివిగదా? కానిమ్ము. ఇందులకుఁ బ్రాయశ్చిత్తము చేసితిలే చూచికొమ్మని పలుకుచు సత్యవతిని ముందరకుఁ ద్రోసినది.

ఆ సత్యవతింజూచి సోమభట్టారకుండు అయ్యో ! ఇది యెవ్వతే ? ఇది యెవ్వతే? అని వెఱగుపడుచుండ నిదియే నీ కూఁతురు. కోపమున నిట్లు కావించితినని పలికెను.

తల్లీ ! రక్షింపుము. రక్షింపుము. అపరాధులమైతిమి. బిడ్డపై దల్లి కోపించునా? నా చక్కనికూఁతు నాకిమ్ము. నీ చెప్పినయట్లు చేయువారము అని యనేక ప్రకారముల బ్రతిమాలఁ దొడంగెను. అంతలో బెండ్లికొడుకు ----------- యార్తిం జెందుచు నచ్చటికివచ్చి సత్యవతి వికృత రూపముఁ జూచి దుఃఖించుచుఁ గులదేవతను బెక్కురీతులఁ బ్రార్ధించెను. వారి ప్రార్ధనల మన్నించు నట్లభినయించుచు నాయిల్లాలు ----? మూర్ఖులారా! మీరు పండితులయ్యుఁ బామరులభంగి నన్ను మరచితిరి. ఇది మొదటి తప్పుగా మన్నించితిని రెండవ తప్పు మన్నించుదాననుగాను వినుండు. ముందుగా నన్నుఁ బూజించి సత్యవతికిఁ దిరుగాఁ బాణిగ్రహణవిధి యంతయుఁ జరుపవలయు. వివాహ దీక్షావసానమున నీ పుత్రిక యెప్పటిరూపుఁ జెందగలదు. ఇందెంత మాత్రము దురాచారము సోకినను మన్నించుదాననుగానని పలికిన విని విద్యాభాస్కరుండుబ్బుచు మామా ! ఇఁక లెండు. చింత యుడుగుఁడు. అమ్మవారికి దయ వచ్చినది. మరల నుత్సవములు సేసికొందము. దీన మనకు వచ్చిన కొఱంతలేదని చెప్పిన సంతసించించు సోమభట్టారకుండు తొలుత గృహదేవత నారాధించి తరువాత మరలఁ బాణిగ్రహణ మహోత్సవముఁ గావించెను. విద్యాభాస్కరుండు సత్యవతి మెడలో మంగళాసూత్రముఁగట్టి తలంబ్రాలు బోసి భార్యగా స్వీకరించెను. సోమభట్టారకుఁడు అయిదుదినములు వెనుకటికన్నఁ బెద్దగా నుత్సవములు కావించెను. దీక్షావసానంబున సత్యవతిరూప మెట్లుమారునో చూడవలయునను తలంపుతో బంధువులందరు వేచియుండిరి విద్యాభాస్కరుఁడును సోమభట్టారకుడును గులదేవతను బ్రార్ధించుచు సత్యవతిరూప మిమ్మని గోరికొనిరి. అప్పుడు మరల భట్టారకుని భార్య యావేశముఁ దెచ్చుకొని బాలిశుఁడా ! నీవు పండితుండవయ్యు దేవతా మహిమ యించుకయు దెలిసికొనలేక పోయితివి. నన్ను క్షుద్ర దేవతవలెఁ బూజించితివి. అనాచారములు చాలఁ గావించితివి. ఇఁక నాకు నీ యందుఁ గనికరము రాదు. నీ కూఁతురీ జన్మమునందిట్లే యుండును. పో పొమ్ము అని పలికి నిందింప దొడంగినది. భట్టారకుఁడనేకముగా నపరాధములు సెప్పు కొనియెంగాని ప్రత్యుత్తర మిచ్చినది కాదు అప్పుడతండు గోలు గోలున నేడ్చుచు అయ్యో ! నా పుత్రిక యిట్లువికృతాంగియైన నెవ్వరు భరింతురు. దీనికాల మెట్లు గడచును? దిక్కెవ్వరు? అని యూరక పలవరించుచుండ నల్లుడతని చేతులు పట్టుకొని మామా? దుఃఖింపకుఁడు. కట్టికొనినందులకు దీని కష్టము లన్నియు నావికాక మీకేమి భారతము, భారమంతయు నామీదఁ బడినది. స్వతంత్ర ప్రేమతోఁ జూచుచుండెదను దైవికమునకు మన మేమిచేయఁగలము. అని ప్రమాణికము చేయుదనుక నతండేడ్పు మానలేదు. యజ్ఞదత్తుండును అతని దుఃఖముఁ జూచి అయ్యో ! నే నెక్కడికి వచ్చిన నక్కడనే కష్టములు గలుగుచున్నవి. ఇందుండనని భట్టారకునోదార్చి తానచ్చటఁ గదలి భార్యతోఁగూడ నెందేనిం జనియెను.

అని యెఱింగించువరకుఁ గాలము మిగులుటయుఁ గథఁజెప్పుట మానివైచి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంత మవ్వలి యవసధంబునఁ జెప్ప దొడంగెను.

డెబ్బదియవ మజిలీ.

శశాంకమకరాంకుల కథ

సఖీ ! రూపవతీ ! మన మిల్లు వెడలి మూడుదినములయినది. యంత్రయానమునఁ బెద్దదూరము వచ్చితిమి. ఆ బ్రాహ్మణదంపతు లెందును గనబడలేదు. ----------- దోవంబోయి యుందురు మనమిఁక నీదారింబోవుటమాని తూరుపుగా బోవుదము . మనసఖురాండ్రు మనకై వేచియుందురు. అయ్యో ! మనము వత్తుమన్న దినమునకుఁ బోలేక పోయితిమిగదా ? వారేమి చేయుదురో తెలియదు మన మొండొరులముఁ గలసి కొనక చిక్కులు పడియెదవేమో ? ఆహా ! బుద్ధిః కర్మానుసారిణి యను వచనము సత్యమగును. వారిరువురు పెండ్లి యాడుచుండ వారించి యద్భుత కల్పనలఁ జేయుటకు మన మిట్టి సంకల్పము పట్టుటకుఁ గారణమేమియో తెలియకున్నది. తలంచికొన నాకే విస్మయముగానున్నదిగదా? పుత్రికకై శోకవార్ధిలో మునిఁగిన గురునోదార్చలేక పోతిమేల? ఆ దంపతుల గర్భశోక మూరక చూచుచుంటిమిగదా ? పోనిమ్ము. పిమ్మటనైన మా