Jump to content

కామకళానిధి/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

కామకళానిధి

తృతీయాశ్వాసము

క.

శ్రీశరభ మహాదేవకృ
పాశాలికటాక్షలబ్ధభాగ్యోదయయా
కాశీసేతుధరాసం
వేశితదాసప్రసంగ ధృతసప్తాంగా.


వ.

అవధరింపుము భద్రపాంచాలాదిభేదంబులైన పురుషులు క్రమంబున శశ వృష తురంగభేధంబులఁ బ్రసిద్ధు లగుదురు; తత్క్రమం బెట్టిదనిన.


సీ.

కోమలములు స్నిగ్ధకుంతలములు గొప్ప
                     కన్నులు గుండైన చిన్ననోరు
చిన్నకోనవయవశ్రేణులు కడురమ్య
                     ములు వర్తులములైన ముఖము దంత
పంక్తులు చేతులు పాదము ల్మోకాళ్ళు
                     గజ్జలు నూరువుల్ కంఠతలము
కడుచిన్నవై యుండు నున్ననై చెలువమై
                     యున్నమే న్వీతరోమోత్కరమయి

అరయ స్వల్పతరంబును నలఘువాస
నాభరితమైను దనవారి నయముఁ జెందు
పసిడిచాయ షడంగుళపరిమితమగు
లింగ మమరగ శశజాతి రేఖఁబూను.


సీ.

హితవాదిశిరమును నతిదృఢభుజములు
                     విస్తారమౌ ఱొమ్ము వెట్టప్రకృతి
తాఁబేటివీఁపుచందమున నుండెడి బొజ్జ
                     వెడఁదలై యెరజీర్లు వెలయుకొసలు
గలకన్నుఁగవ హస్తతల ముదరము లంఘ్రి
                     తలములు నెఱ్ఱనై తనరుమేను
బలిసి సత్వము గల్గి చెలువొందుదురు క్రూర
                     హృదయులు కఠినులు హీనమతులు
త్యాగరతులు భోగతత్పరుల్ చంచలుల్
చారువేషు లధికసౌఖ్యకాము
లై నవాంగుళప్రమాణకామాంకుశు
లర వృషభజాతినరులు తలఁప.


సీ.

నిడుదలై దళముకా నెఱికురు ల్చంచల
                     లోచనములు గడులోఁతునాభి
కంధరదంతము ల్కర్ణము ల్నాసిక
                     నోరును బాహువుల్ నుదురు కడుపు

వ్రేళ్ళును బాదముల్ వీనులు దీర్ఘముల్
                     గానుండువా రతిపీనవక్షు
అంగనాలోలు మహాశను ల్లోభులు
                     కృశదేహు లతిదీర్ఘదశనవసను
లతులనవనీతశీతలహారివీర్యు
లధికగంభీరభాషణుల్ పృథులమూర్తు
లగుచును దురగపురషులు ఖ్యాతి గనిరి
ద్వాదశాంగుళలింగప్రమాణు లగుచు.


వ.

ఇంక రతిభేదంబు వివరించెద నదియును సమరతం
బును, నుచ్చరతంబును, నీచరతంబును, నత్యుచ్చరతంబును, నతి
నీచరతంబును నొక్కొక్కటియు నిట్లు గూడ నవవిధంబులు.


క.

హరిణీశశజాతులకున్
దురగివృషజాతులకును దొరసినయెడలన్
కరిణీహయజాతులకును
ధర యోగము సమరతంబు త్రైవిధ్యమగున్.


సీ.

ఈమూడువిధముల నెసఁగును సమరతి
                     నీగతి భేదంబు లేర్పరింతు
హరిణీమహిషులకు నటవృషనరునకు
                     విదితంబుగా రతి వెలసెనేని

నీచరతంబగు నివి రెండు నియతిని
                     నత్యుచ్చరత మశ్వహరిణులకును
నెగడు కరిణీశశుల కతినీచరతము లెల్ల
                     నికృష్టము లెటుల నమరు నింట
ఋతుక్రమున బుట్టమిగణంబు
అడియు నుత్తమమధ్యమారూఢబలములై
గండూతిఁ గల్గించుఁ గ్రమముగాను


గీ.

గాన లింగంబు కొంచమై కదిసెనేని
యల్లకండూతి యణఁగక యధికమగును
కావునను నీచరతమున గలుగదు సుఖ
మంగనలకెల్ల నిది నిశ్చయము తలంప.


క.

అతివల వరాంగమధ్యం
బతిమృదువయి యుండుఁగాన నతిపృథులింగ
క్షతి కోర్వక నొప్పి యగున్
మితమైన రతంబు సౌఖ్య మేదుర మవనిన్.


మ.

సమమై తారమునై దృఢంబునయి శశ్వన్మోహదంబైన లిం
గమునన్ రక్తభవక్రిమివ్రజములన్ నాశమ్మునుం జెంద మూ
లునన్ బ్రామి యణంగి కామజలజాలప్రాప్తి హర్షించి సం
గమసంజాతవిలీనతాప్తి నతివేడ్క లాంచదే నిచ్చలున్.

వ.

వీనిలోఁ జిరపాతంబు మధ్యమపాతంబు, శీఘ్రపా
తంబున నరేతఃపాతంబులు మూఁడువిధంబులు. చండవేగంబు,
మధ్యమవేగంబు, మందవేగంబు నన తద్వేగంబులు ముత్తెఱఁగు
లు. చిరక్రియయు, మధ్యమక్రియయు, లఘుక్రియయు నని యా
క్రియలును త్రివిధంబులు. నివి యొకటొకటి గూడ సప్తవింశతి
భేదంబు లయ్యెను.


గీ.

చండవేగమైనఁ జాలఁగా ద్రవియించు
మిగులనొడలు విరుచు తగుల మధిక
ముగ జనించు మందమగువేగమున విప
రీతమిదియు శాస్త్రరీతి తలప.


క.

మధ్యమవేగంబునఁ గా
మధ్యమముగఁ గామమోహమహిమలు గలుగున్
బుద్ధ్యాప్తి నెఱిగి సురతం
బధ్యాసింపంగవలయు నతిమోదమునన్.


వ.

కావునఁ బురుషనారీప్రమాణంబు లెఱింగి వాతపైత్య
శ్లేష్మప్రకృతులును, గంధర్వాది సత్వంబులును జాతులును
నభ్యాసకాది భేదంబులును ప్రీతులును దేశధర్మంబులును దేహ
సామ్యంబులును దత్తజ్జాతులకుఁ దత్తద్దివసంబులును గళ లుండు
జీవనరంబులును నెఱింగి కామాంకుశ కరికరాది గుహ్యోపచా

రంబుల లాలించి నఖక్షత దంతక్షత సీత్కారాది బాహ్యోప
చారంబులఁ దేలించిన మదవతులకు మదనసంబువదలి పదనొ
సంగి మృదుతరంబై యుండినపిమ్మట క్రీడింపదగు. చండాతి
చండవేగంబుల శుక్లపాతంబు వేగంబుగా నగు.


సీ.

అమరు వృషాధిరూఢము తిలతండు
                     లాఖ్యము జఘనము యిత్థకం బనంగ
ఊరూపగూఢంబు క్షీరనీరంబును
                     వల్లరీవేష్టితాహ్వయము లనఁగ
లాలాటికంబున బోలగా నెన్మిది
                     భేదంబు లగు నందు వేఱువేఱు
వీని లక్షణములు వివరింతు నెట్లన
                     బతిపదంబున తనపదము నుంచి
వరుస మఱియు నొక్కకురువుపై దనయూరు
వుంచి భుజముమీఁద యుంచి భుజము
వదన మొక్కచేతఁ వంచి ముద్దిడినఁ వృ
షాధిరూఢనామ మయ్యె జగతి.


గీ.

స్త్రీపురుషు లొక్కరొక్కరు సెజ్జమీఁద
వ్యత్యయమ్ముగఁ పన్నుండి బాహువులను
నొక్కరొక్కరి జఘనంబు జిక్కఁ గౌఁగ
లింపఁ దిలతండులాఖ్యమై పెంపుఁ జెందు.

గీ.

జఘనసీమ విభుఁడు సరసుఁడై కూర్చున్న
మమత యధికమగుట మగువ యపుడు
వదలకుండ విభుని వరకట బిగియించి
పట్టసాగి ఘనము ప్రౌఢిఁ గాంచు.


క.

వరుఁడు పరాకుగ నుండగ
తరుణీమణి వెనుకఁ నిలిచి దాగుచుఁ గన్నుల్
కరములను మూయఁ గుచకృత
పరిరంభము లధికమనఁగ బరగుం కృతులన్.


క.

సురతానందసుఖంబున
పరవశయగుఁ దరుణితొడలపైఁ దనతొడలన్
పరిరంభణం బొనర్చినఁ
పరయగనూ రూపగూఢ మనఁ జెలువొందున్.


క.

నికలాంగంబులఁ దంపతు
లొకరొకరెడ లేక వదలఁనోపక బిగియన్
నికటముగఁ గౌఁగలించిన
నకలంక క్షీరనీర మనఁ జెలువొందున్.


గీ.

తీగె చుట్టుకొన్న తెఱఁగునఁ విభుమేను
గలయఁబ్రాకి బిగియఁ గౌఁగలించి
వనిత ముద్దుగొనిన వల్లరీవేష్టితఁ
సంజ్ఞఁ జెందు కామశాస్త్రసరణి.

గీ.

మోము మోమును ఫాలము ఫాలమును
నేత్రయుగము నేత్రయుగము నోష్ఠమోష్ఠ
ముర మురమ్ము గూర్చి బెనగగా యొకటి
లాలాటికం బనంగ లక్షితమగు.


వ.

నిహితంబును నిమీలితాస్యంబును దిర్యగాఖ్యం
బును నుత్తరోష్ఠంబును బీడితంబును సంపుటంబును నను వక్త్ర
కాఖ్యంబును ప్రతిమోదంబును సమోష్ఠంబును నర్ధచుంబనం
బును నన చుంబనంబులు పదివిధంబు లనఁ బఱఁగును.


గీ.

శిరము కన్నులు మోవియు జెక్కుటద్దములును
గుచయుగళంబును గళము నోరు
చుంబనమునకైనఁ చోటు లంచును సర్వ
దేశజనులవలన దెలియఁబడును.


గీ.

మరియు హీనదేశమానవు లతికామ
మోహితాత్ము లగుట బాహుమూల
నాభిమూల మదననగరంబులను చుంబ
నముల సేతురండ్రు క్రమముగాఁగ.


గీ.

నుదతి యలుకఁ జేసి చుంబించకుండిన
విభుఁడు పడతినోటఁ బెదవి యుంచి
బలిమి జేసి కదియబట్టి ముద్దిడ నది
విహిత మనఁగ జగతి నెగడునండ్రు.

గీ.

ప్రియుని వదనమందు పెదవి యుంచిన బతి
చుంబనంబు సేయ నుదతి తాను
వరుని మోవి గొనక పర్జించి.డిన
స్పురితమనెడిపేర బోల్చు నిదియు.


గీ.

కన్నుగవ మోసి విభుని వక్త్రంబునందు
పడతి తననాల్క నిడి ముద్దు నిడినయేని
అది నిమీలితాస్య మని కామశాస్త్రజ్ఞు
లనిరి భోగవేళలందు దెలియ.


గీ.

నెలతవెన్కప్రక్క నిలచి కుచమ్ముల
నొక్కచేత బిగియ నొక్కిపట్టి
యొక్కచేత మమోవి యొకటి చుంబించిన
తిర్యగాఖ్య మనుచుఁ దెలియఁబడియె.


క.

బలుమోహంబున కామిని
బలుమొనలన్ విభునిమోవి పట్టిన విభుఁడున్
చెలిమీర బెదవిఁ గైకొని
యలరించిన నుత్తరోష్ఠ మనఁ జెలువొందున్.


క.

వెలి తనకొనగోరుల వడి
పలుచేలన్ ముడిచిపట్టి ......................
..............................
......................................................

గీ.

మార్చిమార్చి పతియు మగువయు చుబుకంబు
పట్టి మోవి ముద్దు పెట్టుకొనిన
మోహ మగ్గలముగ బుట్టు గావునను
సువదన మనుచు దెలియ బలుకబడియె.


గీ.

అలసి నిదురబోవు నంగన మేల్కొన
తలచితలచి విభుఁడు తత్పరతను
గళము నాభి మోవి గన్నులు ముద్దిడ
నది ప్రబోధకాఖ్య మనఁగ బరగు.


గీ.

మగువ విభుఁడు గూడి మమత నన్యోన్యంబు
పెదవులందు పెదవు లదిమియుంచి
నాల్క నాల్క గూర్చి నయముగా జుంబించి
నది సమోష్ఠసంఖ్య నమరియుండు.


గీ.

కాంత తనకన్నముందుగా గరచదలచి
బాహుమూలమ్ములను పంచబాణునింట
మోహ మతిశమైయుండ ముద్దుగొనిన
నర్ధచుంబన మని పల్క నగును గృతుల.


వ.

మరియు నింక ప్రాంత ప్రతివిషయక సంక్రాంత ప్ర
భృతి చుంబనంబులు గలవందురు. అవియు నిం దంతర్భూతంబు
లగుటచే రచియింపంబడవు. ఇంక నఖక్షతంబులు కంఠంబున,
గరంబుల, జఘనంబుల, స్తనంబుల, వీపున, దోర్మూలంబున,

హృదయంబున, పార్శ్వంబుల, గుహ్యంబుల, నితంబమ్ముల,
నాభిని, గడ్డంబుల నొనర్పవలయు నివియును ఛురితమండల,
అర్ధచంద్ర, మయూరపాద, శశప్లుత, ఉత్పలపత్ర భేదంబుల
నారుతెరగులుగా నొప్పియుండు.


క.

చెక్కుల గంఠతలంబున
బ్రక్కన మోవిని నురోజపాళిన్ గోరుల్
నొక్కగ నులువుగ నిల్చిన
నెక్కొను పులకలును మేన నిది ఛురిత మగున్.


క.

పిరుదుల నూరువులం కం
ధరను గుచంబులును గుహ్యతలమున గోరుల్
సరిగా నొక్కటి నిల్పిన
నరయగ నిది యర్ధచంద్ర మనఁగాఁ బఱగున్.


గీ.

ముఖమునందు కంఠమున నుదరంబున
కుచయుగంబునందు గోరు లెదురు
గలుగ వరుసగానుఁ గదియింప మండల
కం బనంగనగు నఖక్షతంబు.


గీ.

ఒక్కబొటనవ్రేలు తక్క దక్కినవేళ్ళ
గోళ్ళచూచుకమున గూర్చి నిలుప
నది మయూరపాద మని కామశాస్త్రజ్ఞు
లనిరి మోదరేతు వనుచు సతము.

గీ.

అయిదువ్రేళ్ళగోరు లగ్రముల్ మోపగా
గబ్బిగుబ్బజనుల గదియజేయ
నది శశప్లుతాఖ్య మగు నఖక్షతమని
పేరు నిడిరి శాస్త్రసారఫణితి.


క.

మరునింట వీపునం గుచ
భరమున రేఖాత్రయంబు భాసిల గోరుల్
సరిగల్వరీతి నిలిపిన
ధర నుత్పలచిత్ర మనఁగఁ దనరున్ గృతులన్.


గీ.

అలుక వొడమినప్పు డతిమోహభరమున
నొడలు గరగునప్పు డెడయునపుడు
మదము గల్గునపుడు మఱి నిద్రవేళల
నొగి నఖక్షతంబు లుంచవలయు.


వ.

ఇంక రదక్షతంబులు గూఢకంబులును నుచ్ఛున్న
కంబును బ్రవాళమణియు బంధకంబును ఖండాభ్రకంబును గోళ
చర్చకంబును అను షడ్విధంబులు, ఈ దంతక్షత నఖక్షతంబుల ను
చితస్థలంబులందు నుంచదగు. నయనంబులు దక్కఁ దక్కిన
యెడల సీత్కార హీంకారపూర్వకంబుగ నుంచిన చంచలాక్షు
లు ప్రియంబు నొందుదురు. నాయికానాయకులు సుస్నిగ్ధమ్ము
లును సమానంబులును కుంద ముకుళాకారంబులును శిఖరా
రోపితంబులు నగు ప్రశస్తదంతంబుల మృదుప్రయోగంబు సేయ

నగును. అవ్విధానంబున నతిఖర్వదంతంబులును కరాళదంతంబు
లును నైన వధ్యంబులు. తల్లక్షణంబుల నెఱింగించెద.


సీ.

అధరంబుపై మొన లంటఁ గమలిన దం
                     తంబులగూడ రదాళి నిచ్చు
..................................................
                     గూర్చి నొక్కిన యది గూఢకంబు
ఎడమచెక్కిలిమీఁద నిసుమంతపలుగంటి
                     నొనర నొక్కుటన యుచ్ఛూనకంబు
రదయుగ్మమున మోవి గదియించ నూగించు
                     యందంబుగానగు గందకంబు
గళకపోలవక్షముల రేఖ గీచ
ఖండాభ్రకం బనంగ నమరియుండు
బయనమపుడు వీపు పలుగుర్తుగా దంత
సమితి యుంచ గోలచర్చితంబు.


వ.

ఇంక గచాకర్షంబు లెఱింగించెద నవియును భుజం
గవల్లికంబును, సమహస్తంబును, దురంగరంగకంబును, గామా
వతంసంబును నన నాల్గువిధంబులు. అవి యెట్లనిన.


క.

నెఱి కురులు చుట్టి కరమున
గఱమును మదనార్తుఁ డగుచు గదిసిన యది దా
సురతోపయోగియై సుఖ

కర మగుట భుజంగవల్లికం బనబరగున్.


గీ.

రెండుచేతుల నెఱికురుల్ రెమ్మిపట్టి
కలియుగాంతుఁడు సమహస్తకం బనంగ
నటుల బలుమారు విడుచుచు నలమిపట్టి
ధారుణి దురంగరంగమై తనరుచుండు.


గీ.

వర్ణదేశంబున గల కచభారంబు నూని
ముద్దిడ దంపతు లొక్కరొక్కరు
నధికమోహంబునను సురతాంతమందు
ధర జనులు దీని గామావతంస మండ్రు.


వ.

సంతాడితంబును, బతాకంబును, బిందుమూలంబును,
గుండలంబు నన తాడనభేదంబులు తల్లక్షణంబు సెప్పెదను.


గీ.

ఉపరిరతమందు ప్రియునురము ముష్టి
తాడనము సేయ నదియ సంతాడనంబు
విభుఁడు రమియింప నరచేత బ్రియునితోడ
నం బది పతాకసంజ్ఞయై నయము గాంచు.


గీ.

పిడికిలించి బొటనవ్రేలు సోకగ విభు
వీపునందు దెబ్బ వైచెనేని
యదియు బిందుమూల యని కామతంత్రజ్ఞు
లనిరి సురతవేళలందు దలప.

గీ.

పురుషశిరమునందు బొట్టనవ్రేలితో
నడిమివ్రేలు గూర్చి యదిమెనేని
విటుఁడు సురతమునకు వేగ నారంభించుఁ
గాన కుండలాఖ్య ఘనత గాంచు.


వ.

మఱియు జపేటంబును జబుకఘాతంబును బంచాం
గుళంబును మొదలైనవి కొందఱచేత నెన్నబడియె. నవి నీచ
నాయికానాయకంబు లగుట హేయంబులు. హుంకృతంబు
స్తనితంబు ఫూత్కారంబు హూత్కృతంబు నన సీత్కారంబు
లేనువిధములు. ముఖనాసికాసహితంబుగా నుచ్ఛ్వాసం బొన
ర్చుట హుంకృతంబు, మేఘరవాకారంబున మ్రోయ స్తనితంబు
భుజంగోచ్ఛ్వాసరీతి నొనర్చుట ఫూత్కృతంబు, జలంబుల వర్ష
ధారలట్లు మ్రోయుట హూత్కృతంబు, దంతక్షతాది సమయం
బుల రసనాగ్రంబున నూర్ప నది సీత్కృతంబు నగు. ఇంక మణిత
భేదంబు లెఱింగించెద. కోకిలరవంబును శుకరవంబును లావు
కరవంబును హంసరవంబును జక్రవాకరవంబును బారావతరవం
బును బికరవంబును నన నెన్మిది తెరఁగులు. కంఠంబున నవ్యక్త
మధురంబుగ సురతంబు కొనగోరు లొల్చి చందంబున లయ
బంధంబుగా నుచ్చరించిన మణితంబు లన నొప్పు. నివియన్నియు
బాహ్యోపచారంబులు. ఇంక చతురసీతిబంధంబులకు లక్షణంబు
లెఱింగించెద. నెట్టులనిన.

క.

తేజఃప్ర....తదినరాజా
రాజమహారాజభీమ రవికులరాజా
రాజద్గుణకవిభోజా
భోజనుతా రమణనమనపూజితతేజా.


శాలిని.

జేతృత్వాత్తాశేషదేవేంద్రభోగా
ఖ్యాతిస్థాయద్గర్వదుర్వారవీరా
రాతిస్త్రీదుర్గాభీర్ణ...భ్రూణహాఖ్యాజాత
శ్రేయా జైత్రయాత్రాపటాహా.

గద్యము. ఇది శ్రీ గురుచరణారవిందమిళిందాయమాన
మానస నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ
సూరమాంబాకుమార సంస్కృతాంధ్ర
సాహిత్యలక్షణసార్వభౌమ శివరామ
నామప్రణీతంబైన కామకళానిధి
యను కామశాస్త్రంబునందు
తృతీయాశ్వాసము.