కామకళానిధి/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

కామకళానిధి

చతుర్థాశ్వాసము

క.

శ్రీరంజితగుణహారా
హారామలకీర్తికావిహారాధారా
ధారాదదానసారా
సారహితవంశదీప జయసింహనృపా.


వ.

అవధరింపుము. ఇక బంధభేదంబు లెఱింగించెద.
ఆ బంధంబులకు నుత్తానకరణంబులును తిర్యక్కరణబులును
స్థితకరణంబులును నుత్థితకరణంబులును వ్యానకరణంబులును నన
నైదువిధములు. నారీరత్నంబు పల్యంకికాతలంబున బన్నుండి
నప్పుడు తత్పాదంబులు కరంబులు పట్టి పట్టుబంధంబు లుత్తాన
కరంబులు. పువుబోడి ప్రక్కవాటుగనైన ప్రక్కగనైన గుడి
ప్రక్కగనైనఁ బవ్వళించియుండ బురుషుం డభిముఖంబుగ బవ
ళించి పట్టునవి తిర్యక్కరణంబులు. అంగనామణి కూర్చున్న
ప్పుడు పురుషుండు పైకొని పట్టుబంధంబులు స్థితకరణంబులు.
మగువ నిలుచున్నప్పుడు స్తంభకుడ్యాదు లానికగా నుంచి పురు
షుండు పట్టుబంధంబు లుత్థితకరణములు. కోమలాంగి కరం

బులు పాదంబులు పాన్పున నాని తిర్యగ్జంతువులరీతి వ్రాలిన
పురుషుండు వెనుకగ నిలిచి పట్టుబంధంబులు వ్యానకరణంబులు.
ఇవి యైదును బురుషకృత్యంబులు. ఇక బురుషుండు రతిశ్రాం
తుండై బవ్వళించినపుడు దనివి నొందక పురుషుని పైకొని
లతాంగి పట్టునవి విపరీతకరణంబు లన జను.


గీ.

గోణికాపుత్ర బాభ్రవ్యకూచిమార
నందికేశ్వర వాత్స్యాయ నాస్మదాదు
లుచ్చరించినబంధంబు లొనరనేర్చి
తేటపడ బల్కరించెద దెలిసికొనుఁడు.


వ.

అందు ప్రథమంబున నుత్తానకరణంబున గ్రామ్యం
బును నాగరకంబు నుత్ఫుల్లకంబును విజృంభితంబును నింద్
రాణికంబును నింద్రకంబును బార్శ్వసంపుటితంబును నురస్ఫుటం
బును నర్ధాంగనిపీడితంబును జృంభితంబును ప్రసాధితంబును
వేణువిదారితంబును శూలచితంబును గార్కటకంబును ప్రేంఖా
యితంబును పద్మాసనంబును నర్ధపద్మాసనంబును బరివర్తనం
బును నిడిడితంబును సమపాదంబును త్రివిక్రమంబును వ్యోమ
సదనంబును స్మరచక్రంబును నవిదారితంబును సౌమ్యంబు నన
ముప్పదినాల్గుభేదంబు లనబడెను.


చ.

చిలుకలకొల్కి పాన్పుపయి జెల్వమరన్ బవళించియుండగా
నలువుగ దానియూరువులు నందకుమారుఁడు నైజజానుసీ

మల దగ నిల్పి పల్మరును మారునికేళిని గూడ గావునన్
తెలియగ గ్రామ్యబంధమని తెల్పిరి దీని ముదంబు మీరగన్.


మ.

యమునాసైకతసీమయందు గడునొయ్యారంబుగా రాధికా
రమణిన్ బూవులసెజ్జ జేర్చి చెలు వారన్ తత్పరద్వంద్వము న్నం
దముగా గజ్జల జేర్చి యూరువుల దత్కాండోరువుల్వేది మో
దమునం గూడిన నాగరాఖ్య మగు బంధం బండ్రు ధాత్రీజనుల్.


మ.

కామిని కించిదున్నతముగా జఘనం బెగయెత్తి కటి తటా
నీతులక్రింద బాదములు చేరిచి కృష్ణ కటిద్వయం బొగిన్
బ్రేమను జేతులందు నిడ బ్రీతి విభుండు గుచంబు లాని యు
ద్దామగతిన్ రమించ నిది దానగు ఫుల్లకనామబంధమై.


వ.

ఇది బడబాజాతిస్త్రీ కయినది, దీనినే యుత్ఫల్లకం బ
నిన్ని యందురు.


మ.

.......................................................................
.......................................................................
సుదతీరత్నము జానువుల్ మది కింపునన్ రతిం దేల్చి
ఇది యింద్రాణికబంధమం చనిరి గాదే కామశాస్త్రంబునన్.


వ.

ఇది హరిణీతురంగుల కయినది.


చ.

సతి తనబాహుమూలములసందున గట్టిగ నాత్మజానువుల్
వెతికిలబెట్టి పాన్పుపయి వెల్లకిలన్ బవళించియుండ నా

మితిగ మురారిపాదములమీదను దత్కటియుగ్మ ముంచి యు
న్నతకుచయుగ్మ మాని రమణన్ రమియించిన నింద్రకం బగున్.


వ.

ఇది కరిణీజాతిస్త్రీకిని శశజాతిపురుషునికి నైనయది.


మ.

అలరుంబోడి నిజోరువుల్ పొడవుగా నడ్డమ్ముగా సాచి ని
శ్చలమై యుండగ నెత్తి కామిలు విస్తారంబుగాగన్ బిరుం
దులదోడ్తో నెదురొడ్డుచుండ హరిచేతోరాగ ముప్పొంగ చె
న్నలరం గూడ విజృంభితాఖ్యమను బంధంబయ్యె జిత్రంబుగన్.


వ.

ఇది బడబావృషభుల కైనది.


చ.

చెలి తన రెండుపిక్కలను శ్రీహరికౌను బిగించిపట్టి భూ
తలమున జేతు లానుకొని తల్గడమీదను జేరియుండగా
గులుగుమెరుంగుగుబ్బలను గోరుల నొక్కుచు మోవి యానుచున్
బలుమరు గూడ సంపుటితబంధమునా గణుతింపగాదగున్.


వ.

ఇది హరిణీశశుల కయినది.


క.

చిక్కన్ బిక్కల నాథుని
బక్కల బిగియించి పాన్పుపై బవళించున్
జక్కెరవిల్తునికేళిన్
జక్కగ మరిగూడ పార్శ్వసంపుటిత మగున్.


వ.

ఇది బడబాశశుల కైనది. ఇంక నుదర్శనాభుని మతంపు బంధంబులు సెప్పెదను.

చ.

జలజదళాక్షి పాదములు చక్కగ రెండును గూర్చి సాచి పూ
తలిమమునన్ బరుండి ప్రమదమ్మున బైకొని యమ్మురారి బో
ర్గిల బవళించియుండ మృదురీతిగ నూరువులం దదీయని
శ్చలమదనధ్వజంబు సరసన్ బిగియించిన బీడితం బగున్.


వ.

ఇది శశజాతిస్త్రీకిని తురంగజాతిపురుషునికి నైనది.


మ.

అలరుంబోడి నిజోరుకాండములపై యాత్మోరువు ల్చుట్టి ని
శ్చలతన్ మేన్ బిగియార గౌఁగిటను జేర్చున్ శౌరియున్ మోహ మ
గ్గల మైగ్రమ్మక మీద వ్రాలి ధర మోకా ళ్ళుంచి మో వానుచున్
గళలం బట్టుచు గూడ వేష్టితసమాఖ్యంబైన బంధం బగున్.


వ.

ఇది బడబావృషభుల కైనది.


మ.

తరుణాలోకశిఖావతంసముఖరద్వంద్వమ్ముచే నూరువుల్
సరిగా రెండును గూర్చి పట్టుకొని లీలాహసము ల్మీరగా
విరసెజ్జన్ బవళించియుండ హరి పృథ్విన్ గొంతుగూర్చుండి
వెన్కన్ రమియించగా నిదియు దా నుద్భగ్నబంధం బగున్.


వ.

ఇది కరిణీవృషభుల కైనది.


చ.

వనిత నిజోరుకాండములు వరుసుగ రెండును గూర్చి నా
ధునియురమందు నుంచిన మృదుక్రియ వానిపయిం బరుండి య
.............రెండుమూపులు కరాబ్జయుగమ్మున బట్టి లాఘవ
మ్మున మురవైరి గూడ నిది భూమి న్నుస్ఫుటబంధమై చనున్.

మ.

ఒకపాదాబ్జము నాథుపేరురమునందు న్నించి పైవంచి వే
రొకపాదంబు తదీయహస్తమునను ద్యత్క్రియ న్సాచి బా
లిక పూసెజ్జను బండియుండగను బాళిన్ శౌరి పైకొన్న యా
నకనర్ధాంగ నిపీడితాఖ్యమగు బంధం బయ్యె నిద్ధారుణిన్.


వ.

ఇది బడబాతురంగజాతులది. ఇక గోణికాపుత్ర
మతం బెఱింగించెదను.


మ.

చెలిజానుద్వయమున్ భుజాగ్రములచే జిక్కంబట్టి యం
ఘ్రులమీదం గటియుగ్మ ముంచుకొని వక్షోజద్వయిన్ రెండచే
తుల బట్టి మోవిదరమందున్ దంతము ల్నిల్పుచున్
గలయన్ జృంభితనామబంధమని విఖ్యాతంబు లోకంబునన్.


చ.

చెలువునిఫాలభాగమున జేరిచి యొక్కపదాంబుజాతమున్
తలిమము మీర వేరొకపదం బొగిసాచి పరుండినన్ మదం
బలరగ దత్కుచద్వయమునైన భుజంబులనైన బార్శ్వసీ
మలనైనం గరంబుల నమర్చి రచింప బ్రసాదితం బగున్.


గీ.

అతిపద మొక్కటి భుజంబునందు జేర్చి
చేరి రెండవకురువుపై గూరుచుండి
మాటిమాటికి నీగతి మార్చిమార్చి
కలియ వేణువిదారితకరణ మయ్యె.


గీ.

ఒక్కపాదంబు శిరముపై నుంచి యొకటి
భుజముపై నుంచి క్రీడింప భామినీ వి

శూలచితబంధ మనగను సొంపు మీరు
ననుచు వచియించె మొదల వాత్స్యాయనుండు.


మ.

చలియన్ పానుపుమీద జంద్రముఖి దా బన్నుండి పాదాంభుజం
బుల నడ్డంబుగ నాధునాభిపయి సొంపు ల్దీర నానించినన్
జలజాతాక్షుఁడు వారిపై నదిమి మించన్ దత్కటిం బట్టి దా
నలువైయుండ......గర్కోటకబంధ మయ్యె చిత్రమ్ముగన్.


వ.

ఇది హరిణీశశుల కైనది.


మ.

చిగురుంబోడి పదద్వయీతలములన్ శ్రీకృష్ణుమధ్యంబునన్
దగగా నిల్పి కరద్వయిన్ గరములన్ పట్టీకయుయ్యాల లూ
గ గతిం బల్మరు చండవేగ మమరం గూడ స్మరారాతి చె
ల్వుగ బ్రేంఖాయితబంధ మండ్రుల జనముల్ పూవిల్తుశాస్త్రంబునన్.


వ.

ఇది హరిణీవృషభుల కైనది.


చ.

సరసిజనేత్రుదక్షిణభుజంబున దక్షిణపాద ముంచి యా
చరణముమీద నడ్డముగ సాచిన వామపదాంబుజాత మ
చ్చెరువుగ నామ....భుజము జేర్చి పరుండిన లేమ గూడినన్
హరువగు పద్మకాసనముగా నుతిగాంచిన బంధమై తగున్.


వ.

ఇది కరిణీశశుల కయినది.


గీ.

పతిభుజాశీర్షమున నొక్కపదము సాచి
దానిపై నడ్డముగను పదంబు దాచి

పడతి పవళింప శ్రీహరి పైకొన నిది
యర్ధపద్మాసనం బన నమరియుండు.


మ.

సది దా సాధన జేసినట్టి వగ హెచ్చ న్మోహ ముప్పొంగ సం
గతి మోచేతుల రెండుసందులను మోకాళ్ళం దగంగ్రుచ్చి హ
స్తతలంబు ల్వడిగూర్చిపట్టి మెడక్రిందం జేర్చి పన్నుండగా
జతురుం డప్పుడు గూడ బంధురితసంజ్ఞం బైనబంధం బగున్.


వ.

ఇది కరిణీశశుల కైనది.


మ.

చెలి మోకాళ్ళను పైకి సాచుకొని మోచేసందులం గ్రుచ్చి చే
తులు రెం డొక్కటి గాగగూర్చి మెడక్రిందం జేర్చి పన్నుండ నె
చ్చెలిముంజేతులు రెండు శౌరి తనమోచేసందులం గూర్చి చె
న్నలరం గూడిన నాగపాశమధుబంధం బయ్యె చిత్రంబుగన్..


ఉ.

ముద్దులగుమ్మ బానుపున ముందుగ దా బవళించి పాదముల్
ముందుగ జేతుల న్నిడిన మోదమునన్ హరి రెండుచేతులన్
ముద్దియజానుసందుల సముఖ్యలవైఖరి గ్రుచ్చి కంఠమున్
బద్దుగ గౌఁగలించ నిది బంధమ సంయమనాఖ్యమై తగున్.


చ.

మొగము మొగమ్ముమీద భుజముల్ భుజయుగ్మముమీద జంఘికా
యుగళము జంఘులందు నిడి యొక్కటిగాఁ దగగూర్చి యుంచి య

మ్మగువపయిన్ మురారి గరిమంబున గైకొన గూర్మబంధమై
నెగడు ధరిత్రిసాధనలు నేర్చినవా రొనరింతు రెంతయున్.


గీ.

మొగము మొగము జేర్చి భుజముల బిగియించి
చాన రెండుతొడలు సాచి శౌరి
నడుము బిగియ నదిమి ముడివేయ బరివర్త
నాఖ్యబంధమై నయమ్ము గాంచు.


గీ.

ముదితయూరులు నిజపాదములను బార్శ్వ
ముల నొదుగద్రోసి యందుపై మోవి నుంచి
కూడెనేనియు నిదియు నిపీడితాఖ్య
బంధ మగు గామశాస్త్రప్రపంచసరణి.


వ.

ఇంక నందికేశ్వరమతం బెఱింగించెదను.


క.

తరుణి దనపాదయుగళము
హరియూరువులందు నిల్పి యట బవళింపన్
ఉరమురము జేర్చి పైకొన
బరువడి సమపాదనామబంధం బయ్యెన్.


గీ.

సతి పదం బొక్కటి ధరిత్రి సాచి
యొక్కపదము పురుషుఁడు తనతలపైని నిలిపి

రెండుచేతుల భువి నాని యుండ గూడ
నిది త్రివిక్రమకరణమై యింపుజెందు.


గీ.

కాంత తనరెండుపాదము ల్కాంతుశిరము
నందు నిల్పి పవళింపగా నతఁడు ప్రేమ
గుచయుగము రెండుచేతుల గూర్చి వెట్టి
కలియ నిది వ్యోమపదనామకలిత మయ్యె.


గీ.

నలినముఖి రెండుయూరులనడుమ నిల్చి
విభుఁడు చేతులు రెండు పృథ్వీతలంబు
నానుకొని క్రీడ నొనరించెనేని యిదియు
దనరు స్మరచక్రనామబంధంబు జాతి.


గీ.

తామరసనేత్ర తనదు పాదముల రెండు
నధిపు నుదరమ్ముపై చేర్చి నతనియూరు
వులను వంచి భుజద్వయి నొకటి గౌఁగ
లింపగ విదారితాఖ్యయై పెంపుజెందు.


గీ.

కాంత యనయూరువులు రెండు గగనమందు
నిల్పి పవళించిన విభుండు చెలువ రెండు
కురువులకు మధ్యమున నుండి కూడెనేని
సామ్యకరణంబుగా నిది సంజ్ఞ చెందు.

వ.

ఇంక గూచిమారుండు మరియు నాజృంభితంబును
సౌఖ్యంబును దనుబంధంబును కరపాదంబును సాచిర్ముఖంబును
నర్ధచంద్రంబును పాంగంబు నన సప్తవిధంబు లనియె నియ్యవి సర్వ
సాధారణంబులు గావని పలుకంబడియెను. అదిగూడ నేకచత్వా
రింశద్భేదము లయ్యె నా సప్తభేదంబు లెట్టులనిన.


గీ.

చిగురుబోడి యూరుయుగళంబు తనఫాల
భాగమందు జేర్చి పట్టియుండ
బ్రియుఁడు దానిబటువు పిఱుదులు గొనగను
జృంభితం బనంగ జెల్వు మీరు.


గీ.

ఒకరొకరి పండ్లుసందుల నొక్కరొకరు
వాదయుగళంబు గీలించి పవ్వళించి
ఒక్కరొక్కరి హస్తములు పట్టి యొప్పుమీర
గూడి నాగాఖ్యబంధమై రూఢి గాంచు.


చ.

తరుణియు మ్రొగ్గవాలినవిధంబున నుండి కరద్వయంబునన్
చరణము లానియుండ సరసన్ జఘనంబున తత్కటిద్వయిన్
హరువుగ గూర్చి మధ్యమకరాబ్జములన్ బిగబట్టి కూడినన్

ధరపయి చాపబంధమను నామము గాంచు మహాద్భుతంబుగన్.


గీ.

ఉవిద బారసాచి యూరులు నాగతి
పొడవు సాచి కాల్ళబొటనవేళ్ళ
నట్టికెళ్ళ పట్టి బవళింప గరసాద
నామబంధ మయ్యె సామువలన.


క.

పదముల గుదుర్ల బిరుదుల
గదియించి శిరంబు రెండుగరముల శయ్యన్
గదియించియున్న తరుణిన్
గదిసిన సాచీముఖంబునా నుతికెక్కున్.


గీ.

ఊరుయుగము మింట నున్నతంబుగ సాచి
కరయుగంబుచేత గటియుగంబు
బట్టి మీఁదికెత్తి బవలించి చెలి గూడఁ
నర్ధచంద్రబంధ మనఁగ నొప్పు.


ఉ.

నారి వరాంగమందు మదనధ్వజ ముంచి బిగించి యూరువుల్
చేరిచి చక్కగాఁ శయనసీమ బరుండిన దానిమీఁదుగా
శౌరియు బవ్వళించి నిజజానులు జానుల జేర్చి రొమ్మునం

జరిచి మోము మోముపయి జేర్చి రమింప నుపాంగకం బగున్.


వ.

సుముద్గక, పరివర్తిత, సమాంగిక, నభిత్రిక, సంపుటక, వేణుక,
కుక్కుట, మానిత భేదంబుల దిర్యగ్బంధంబు లష్టవిధంబులై యుండు.


చ.

కమలదళాక్షి దా నభిముఖంబుగ బార్శ్వము గాగ శయ్యపై
సమముగ బవ్వళింప హరి సంతసమందుచు గౌఁగలించి చి
త్రముగ దదూరుమధ్యమున దాను నిజోరుల నిల్పి కాంత చూచు
కముల బట్టి గూడగ రణంబు నుముద్గతనామమై తగున్.


క.

జగతి సముద్గకనామం
బగు కరుణము నట్ల పురుషనంకద్వయమ
ధ్యగయై తదూరువులపై
వగగా నూరువులను నుంప పరివర్తమగున్.


చ.

ఒకరక రంసభాగముల నొద్దికతో తలలుంచి గట్టిగా
నొకరొక రాభిముఖ్యగ నుండియు గౌఁగిట గ్రుచ్చిపట్టి తా

మొకరొక రూరుమధ్యముల నూరుల జొచ్చి రమింప గా
సమాంగకమను బంధమయ్యె హిమకాలములం దిది యోగ్యమై తగున్.


చ.

పొలయలుకన్ లతాంగి తనమోము నొసంగక పార్శ్వభాగసం
వళితముగా శయింప బహువారమృదూక్తుల గుస్తరింపుచున్
చెలువుఁడు వెన్కభాగమున చిన్నెలు చూపుచు బల్మి గూడినన్
జలగు నభిత్రికం బనగ జెల్వగు బంధము శాస్త్రవైఖరిన్.


చ.

చెలి పార్శ్వంబున బవ్వళించి కుదురై చెల్వుండనుం దత్తరం
బొలయం దానిపయిన్ శయించి యొకకా లూర్ధ్వంబుగా నైజజా
నులమీదన్ ఘటియిం తత్కటితటిన్ నూల్కొన్న మోదంబు రం
జిల పాణిద్వయ మంటి సంపుటకమై చెల్వొందు నిద్ధారుణిన్.

చ.

ఒకపార్శ్వంబున శయ్యమీఁద సతి పన్నుండినన్ విబుధామహీ
ళకు ముందై పవళించి యొక్కపదమున్ లాగించి స్వోరస్థలిన్
సుకరంబై తగసెజ్జ రెండవది యచ్చో నిల్పి క్రీడింప వే
ణుకసంజ్ఞంబగు ప్రౌఢకాంత కిది చెన్నొందున్ గళాధుర్యమై.


చ.

ఎదురెదురై సతీపతుల హీనముదంబున బవ్వళించి యా
నుదతి పదద్వయంబురము సోఁకగ నిల్పి కటీతటి న్ముదం
బొదవగ గౌఁగలించి యల యుగ్మలి నైజగళంబు గౌఁగిటన్
నదియ బిగించి గూడునది ఖ్యాతమగున్ ధర గుక్కుటాఖ్యమై.


చ.

సతి యొకప్రక్కవాటుగను శయ్యపయిన్ బవళించియుండగా
నతివ నిజోరుమధ్యమున నడ్డముగాఁ బవళించియుండగా
బొతికిలబెట్టి యొక్కటి మరొక్కటి మేనిపయిం ఘటించి స
మ్మతి రతి జేయ జెల్వుగను మానితబంధ మనన్ వసుంధరన్.


వ.

ఇంక స్థితబంధంబులు: అవియు నెట్లనిన యుగపదం
బును వితర్దితంబును మార్కటంబును ఘట్టితంబును సమ్ముఖీ
కరణంబును ప్రస్ఫుటంబును నుద్గ్రీవంబును జాఘనంబు నన నె
న్మిది భేదంబు లగు తల్లక్షణం బెట్లనిన.

చ.

ఒకపద మోరగా ముడిచి యొక్కటి సాచి లతాంగి శయ్యపై
ప్రకటము దాను రాగముల బల్మరు బల్మొన లూనజేయగా
నొక టవసింప తత్పదము లొయ్యన సాచిన దానిపైని జాం
ఘ్రికములు సాచి ముడ్వ నది క్రిందగ గా ముడుచున్ గవుంగిటన్
సకలవిలాసము ల్దెలియ సంగతిగా యుగపాదమై తగున్.


మ.

చెలి గూర్చుండగ గౌఁగిట న్నిలిచి పార్శ్వభూతదేహంబుతో
జెలువుం డున్నమితాంగుడై కటితటిన్ శీఘ్రంబుగా ద్రిప్పుచున్
బలుమారున్ గళ లంటుచున్ గలయుచో బ్రౌఢాంగనాకల్పితుం
డలరుం ధాత్రి వితర్దికాఖ్యకరణం బత్యంతసౌఖ్యార్థమై.


క.

పురుషుఁడు తనజఘనముపై
దరుణిం గూర్చుండనునిచి తంత్రజ్ఞుండై
సురత మొనరింప సతి వెన్
దిరిగిన మార్కట మనంగ దెల్లంబయ్యెన్.


క.

కరములు కరములచేతన్
వరుసన్ బట్టుకొని రెండుపదతలముల ద
చ్చరణతలమ్ముల నానుక
కరణం గూర్చుండి గూడ ఘట్టిత మయ్యెన్.


గీ.

తరుణిపాదయుగము దనభుజమ్ముల నుంచి
నడుము బిగియబట్టి పడతి కెదురై

గొంతికూరుచుండి కూడిన సన్ముఖీ
కరణ మనగ వినుతి గాంచి జగతి.


గీ.

ఉవిదపాదయుగళ మురముపై యుచక
కదలకుండ బిగియకౌఁగిలించి
జఘనసీమ తనదుచరణము ల్నిడి కూడ
బ్రస్ఫుటాఖ్యమైన బంధమయ్యె.


గీ.

గొంతుకూరుచుండి కోమలిచేతులు
వెన్కభాగమందు వేగనుంచి
ఊర్థ్వముఖము గాగ నుండి గూడంగ ను
ద్గ్రీవబంధ మనగ దెలియబడియె.


గీ.

నారితొడలమీద గూరుచుండి గళంబు
గౌఁగిలించి మేను గదియజేర్చి
శౌరి యుండ దరుణి జఘన మెత్తి రమింప
జాఘనం బనంగ సంజ్ఞ జెందు.


వ.

ఇంక నైధీతిబంధంబులు, కూర్పరజానుకంబు, హరి
విక్రమణంబు, ద్రువలంబుగీర్తీబంధంబు, బార్శ్వవేష్టితంబు, ధ్రు
వంబు, అవలంబితంబు, సంక్రామితంబు నన నయ్యవి యెన్మిది
తెరగులు నవియు స్తంభభిత్తిభాగంబుల నానుకొని నిలిచియు
న్న కామినిం గూర్చి పట్టుటంచేసి చిత్రబంధంబు లనం బరగు. నందు.

మ.

సతి భిత్తిస్థలి జేరియుండ విభుఁ డచ్ఛంబైన ప్రేమంబునన్
మతి నాహ్లాదము గూర్ప జువులపై నైజాంఘ్రులన్ నిల్పి కం
ఠతలంబున నయ్యంగన గౌఁగలించి యటుగూడన్ గామశాస్త్రజ్ఞుల
న్నతిగా గూర్పగ జానుకం బనతగున్ నవ్యప్రభామోదతన్.


మ.

తలిరుంబోడి మెరుంగ కంబముపయిం దా జేరియుండంగ గో
మలుఁడై నారశ సేయకుండు తనదిక్కున్మోపుబై యొక్కకా
ల్నిలువంజేరిచి ప్రక్కవాటుగ రతి న్నిర్మించి మోదించినన్
జెలు వొప్పున్ హరివిక్రమంబనగ సంభోగక్రియాధుర్యమై.


చ.

కలికి విలాసభంగి దనకంఠము గౌఁగిట బట్టియుండగా
నల జఘనప్రదేశమున నానగమారుల నిల్పి నేర్పుగా
సలలితలాఘవం బమర సాంద్రవనీతలసీమలందు బెం
పలరగ గూడ నికరనామాధ్యనుతం బగు కీర్తిబాధమై.


మ.

కలుకం బంగరుభిత్తిభాగము రమాకాంతుండు దా జేరి ని
శ్చలభంగిన్ గరయుగ్మమందు సరసీజతాక్షిపాదద్వయిన్

నిలువంబట్టిన నైజకంఠము బిగన్ నిండారుకౌఁగిళ్ళ దొ
య్యలి గూర్పన్ ద్వితలాఖ్యబంధమగు సాంద్రానందసంసాధ్యమై.


చ.

సతిజఘనప్రదేశమున జాతురిమీరగ గూరుచుండి సం
స్తుతగతి బార్శ్వభాగమున సొంపులు గుల్కగ రెండుచేతులన్
సతముగ గంఠ నద్ధములుగా గదియించి గడంగికూడినన్
జతురిమ పార్శ్వవేష్టితమునా వచియింతురు దీని నెంతయున్.


క.

కంబము గట్టినవితమున
నింబలముగ దోవిదాననిపుణత్వమునన్
కంబుగ్రీవం గూడ ము
దంబుగ నవటీవిధాఖ్య దగుబంధ మగున్.


గీ.

అబలజఘనదేశమందు బాదము లుంచి
గరయుగమున గళము గౌఁగలించి
డోల యూచినట్లు లీలగా గూడిన
బ్రౌఢిగా ధృతాఖ్యబంధ మయ్యె.

చ.

తరుణిపదాంతరమ్మున పదద్వయ మానిచి వెన్కముళ్ళుగా
హరువుగ బాహుమూలములయందుల నిల్పి కుచద్వయంబు గా
గరముల బట్టి మోవి కొని కామిని తన్ను గరద్వయంబునన్
సారెకు పాంచకూడ నిది సంక్రమితంబను బంధమై చనున్.


వ.

ఇంక వ్యానతబంధంబున జెప్పెద. నివీటితంబును,
నిఘాతకంబును, జటకవిలసితంబును, జుష్టంబును, ముదనంబును,
విపరీతంబును, వరాహఘాతుకంబును, వృషాభిఘాతుకంబును,
ధైనుకంబును, వైభవంబును, మార్జారీబంధంబును, నైణం
బును, పారావతంబును, మాయూరంబును నన నయ్యవి పదు
నాల్గుతెరంగులు. తల్లక్షణం బెట్లనిన.


చ.

పొలతుక పాణిపాదముల భూమిపయిన్ దగనిల్పియుండగా
జెలువుఁడు వెన్కభాగమున జిన్నెలు జూపిన వ్యానతంబు లౌ
నలఘుబహుప్రకారముల నాద్యులు పల్కి రదెట్టులన్న నే
నెలమిని నారభూతముల నేరి రచింతు రుచింప నెంతయున్.


క.

తరుణీమణి వెనుచక్కిన్
బిరుదులు కరయుగముచేత బిగబట్టి రహిన్
హరి యానుక క్రీడించిన
హరు నమర నివీటికాఖ్యమను బంధ మగున్.

గీ.

సాధనల నేర్పు జూపుచు జలజనేత్ర
వెనుకభాగంబులకు నీడ్చి వేగగతుల
గదిసి రమియించిన నిఘాతకం బనంగ
కరణమగు శాస్త్రసరణి విఖ్యాతి మీర.


క.

తరుణీమణి తనపదముల
గరముల గూడంగ జేర్చి కడువంగినచో
మురవైరి నిలిచినిలిచియు
బిరుదన్ రమియింప చకటవిలసిత మయ్యెన్.


క.

పడతిపిరుందులపై దన
కడు పానిచి చంద్రవదన కడుపున గరముల్
కడుబిగియ గూర్చి గదులక
నడరన్ రమియింప బుష్ప మన జెలువొందున్.


క.

చెలువుం డూరక వెనుకన్
నిలుచుండగ బడతి దాను నెమ్మేని న్ముం
గలికి న్వెన్కకు ద్రిప్పుచు
గలసిన విపరీత మనగ గరణం బయ్యెన్.


క.

వనితపిరుందుల గృష్ణుఁడు
తనచేతుల బిగియబట్టి తద్దయు వేగం
బొనరగ గ్రిందుగ దాకున్
గనకుండ వరాహఘాతుకం బనబరగున్.

క.

ఇరుపార్శ్వంబుల పదముల
పరిపరిగతి మార్చిమార్చి పైభాగమునన్
గురిగా దాకులు తాకుచు
గరము రమింపన్ వృషాభిఘాతుక మయ్యెన్.


ఉ.

చందనగంధి భూమిపయి సంగతిగా గరపాదపద్మముల్
పొందుపడంగ నిల్పి కనుబొమ్మల జూపుచు కాళ్ళసందునన్
క్రిందుగ జూడ నాయకుడు.........లన్ పైనిల్చి చేత లిం
పొంద దదీయహస్తముల నూని రమించిన ధేనుకం బగున్.


చ.

స్తనములు మోముదమ్మియును ధారుణిపై దగచేర్చి యానుచున్
వెనుకటిభాగ మూర్ధ్వముగ నిల్పి వధూమణి శ్రోత్రదేశమం
దున వసియించి యొక్కచెయితో మదనధ్వజము నిల్పుచున్
దనియగ గూడ నైభకరణంబున నొప్పు విచిత్రవైఖరిన్.


క.

పదములు పిక్కలయం దిడి
వదలక చెలివీపుమీద వ్రాలి కుచంబుల్
ముద మొదవ గరపుటంబున
నదిమికదియ నైణబంధ మననుతి గాంచున్.

వ.

మరియు వీనియందు మందురమును, మార్జాలంబును, గార్ద
భంబును, నౌష్ట్రంబును, పౌండరీకంబును, మౌషికంబును,
ఏడాజంబును, భేరుండంబును, గారుడంబును మున్నగునవి గలవు.
ఇవి యన్నియును భావదూషితంబులు గాన బలుకంబడవు.
ఇంక విపరీతకరణంబు లెఱింగించెద నవి పురుషాయిత భ్రమద
ఉద్గత ఉత్కర్మ ప్రేంఖాపదంబులన నమరియుండు.


చ.

పురుషుఁడు భ్రాంతి జెంద పువుఁబోడి బిరానన లేచి యూరువుల్
విరళము జేసి పైకొని చలింప గుచద్వయముల్ బిరుందులున్
ఉరమురమున్ మొగంబు మొగ మూని విభుం డెదురాన నీయగా
హరువమరంగ గూడ బురుషాయితబంధమనన్ నుతిం గొనున్.


చ.

నిదురతమిన్ మురారి యిక నేరుపు జూపక పవ్వళింపగా
ముదిత వరాంగమధ్యమున మోహమునన్ బ్రియలింగ ముంచి
సమ్మదమున జక్రమట్ల దనమధ్యమమున్ గరసీమ ద్రిప్పుచున్
గదలుట భ్రామరాఖ్య మనగా దగు బంధ మగున్ జగమ్మునన్.


మ.

చనుదోయి గుడిరొమ్మున న్నదిమి మించం గౌఁగిటం బట్టి మా

రునియింటన్ ధ్వజమూని నిల్పి పలుమారున్ ధూర్తసామీధవా
యనుచున్ మోవి జురుక్కుమన్న గురు లాయాసంబుగా నీడ్చినన్
దనికిం దిట్టుచు గొట్టుచున్ గలియ బంధం బుద్గతంబై తగన్.


చ.

కురులు నటింప జన్నుగవ గుచ్ఛము లల్లలనాడ గన్నులున్
వరముకుళద్రుతంబులును గరంబులు మేను చమర్ప గంఠమున్
దొరయుచు గూడి పల్కులు సముద్గతమై తగమేను జుమ్మనన్
హరిమరుదండమందు గునిపాడ సముత్కవితాఖ్యమై తగున్.


గీ.

శౌరిమీగాళ్ళపై దనచరణయుగము
నిల్పి కరముల భుజములు నిక్కబట్టి
కలికి యుయ్యెల యూగినగతిని గూడ
వసుధ ప్రేంఖాపదంబను బంధమయ్యె.


వ.

ఈవిపరీతబంధములలో హరిణియు, గర్భిణియు, గర
పసూతియు, ఋతువుగాగలకాంతలును, కృశాంగియు, జ్వలి

తాంగియు, కుమారికయును వర్జింపబడుదురని వాత్స్యాయానా
దులు సెప్పిరి. కాన నెరింగి సమయోచితంబుగ గ్రీడింపవలయును.


క.

కాముకులకు బ్రీతికరం
బై మురువై భోగయోగ్యమై యీకృతి
............చంద్రదారక
మై మెరయు త్రిలింగకవులు నభిమతి సేయన్.


?.

పయోజనేత్రాజనపంచబాణా
నయాదివిద్యాకలనప్రదీపా
భయార్తరక్షాంతకృపాధురీణా
శయా బుజాతోద్ధృతసత్కృపాణా.


పంచచామరము.

కరాకరాజవృత్తవైరి కాండభిన్నభాస్కరా
ధరాధరాధరోపమాన ధైర్యధుర్యమానసా
సురాసురాదిలోకవంద్య సూరిగేయసద్యశా
చరాచరానుకూలధర్మ సారభృత్ప్రచారణా.


మాలిని.

సలలితగుణజాలా సత్కృతానందలోలా
విలసితబహులీలా నినస్ఫురద్దానశీలా
అలఘుమతవిశాలా హారికీర్తయాలవాలా
చలితవిమతసాలా సత్యవాక్యానుకూలా.

గద్య. ఇది శ్రీ గురుచరణారవిందమిళిందాయమానమానస
నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ సూరమాంబాకుమార
సంస్కృతాంధ్రసాహిత్యలక్షణసార్వభౌమ శివరామనామ
ప్రణీతంబైన కామకళానిధియను కామశాస్త్రంబునందు
సర్వంబును చతుర్థాశ్వాసము.