కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/కాశీ మశీదులో శివలింగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కామన్సు సబలో సభ్యుడైనాడు. ఆర్కాటు నవాబుగారి పక్షమునవలంబించిన ఇంకా కొందరు దొరలుకూడా అక్కడ చేరారు. సిగట్టుగారి వ్యవహారాన్ని గురించి కామన్సు సభలో చర్చించబడి నప్పుడు వీరందరూ సిగట్టుగారి ప్రత్యర్ధుల చర్యలను సమర్ధించడానికి తంటాలు పడ్డారు గాని అందులోని నిజమంతా కామన్సు సభవారికి విశదమైంది. అంతట ఈస్ట్రాటసుగారున్ను, ఇతని తోడివారున్నూ చేసిన అక్రమానాని గుఱించి నేరాన్ని గుఱించీ విచారించిశిక్షించ డానికి వీపైన ఒక క్రిమినలు కెసు దాఖలు చేయడానికి వుత్తర్వు చేయవలసిన దని కామన్సుసభవారు ఇంగ్లీషు రాజుగారికి విన్నపం చేశారు. ఆప్రకారం స్ట్రాటసు మొదలైన వారిమీద కేసుదాఖలై విచారణ జరుగగా వారినేరం రుజువు అయింది. అయితే వీరు చేసిన ఘోరాన్యాయానికి తగిన సిక్షమాత్రం వీరికి విధించబడలేదు. ఒక్కొకరికి వెయ్యి నవరసలు జుల్మానా మాత్రం విధించి వదిలివేశారు. (History of British Empire - Edward Thornton Vol.11 pp.199-213)

                -----

9. కాశీ మశీదులో శివలింగం

  క్రీ.శ. 18923-26 మధ్య కలకత్తాలొ తూర్పు ఇండియావర్తక కంపెనీవారి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధికారిగ నుండి హిందూదేశా మంతా తిరిగి చూసిన బిషప్ హెబరుగారు (Bishop Heber) తమ గ్రంధములో ఒకచిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.
1659-1707 మధ్య హిందూదేశాన్ని పరిపాలించిన ఔరంగజెబుచక్రవర్తి చాలా హిందూదేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినా డని ప్రతీరి. దేవాలయ స్తంబాలతోటే రాళ్ల తోటీ దూలాలతోటీ నిర్మింపబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి.

కాశీమసీదులో శివలింగం

  ఒకశివాలయాన్ని పడగొట్టి మశీదుకట్టడంలో ఆదేవాలయంలో నుండిన అందమైన గొప్పశివలింగాన్ని అలాగే అట్టే వుండనిచ్చి మశీదు కట్టారు. ఈ శివలింగం నలభై అడుగుల ఎత్తు ఏకాండి శిల. దీనిమీద అందమైన చెక్కడపు పని వుండేది. ఇది పూర్వం రెండురెట్లు ఎత్తువుండేదనిన్ని, క్రమక్రమంగా బూమిలోకి దిగబడిపోతూ వున్నదనిన్నీ, అది బూమిమట్టానికి రాగానే అన్నికొలాలూ ఒక్కటైపోతాయనిన్నీ ప్రజలు అనుకుంటూ వుండేవారు.
  ఈ శివలింగం మశీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతిపవిత్రంగా ఎంచి, మశీదు అధికారులన్ మంచిచేసుకొని, లోపలికి వెళ్లి దీన్ని పూజిస్తూవుండే వారు. భక్తులు ఇచ్చేకానుకలలో సగంవంతు తమకు చెల్లేపద్దతిని మశీదువారు దీనికి వప్పుకున్నారు.
 ఈ శివలింగం చుట్టూవున్న చెక్కడపు పని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పైనచెప్పిన కారణంవల్ల దానిని ఏమీ చేయకుండా వుంచారు. ఇలాగ ఒక వందసంవత్సరాలు ఈ శివలింగానికి మశీదులోనే అర్చనలు జరిగాయి.
   ఇలా వుండగా ఒకమాటు మొహరంపండుగ ఊరేగింపుల సందర్బంలో హిందువులకూ, మహమ్మదీయులకూ తగాదాలు వచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మతకలహంగా పరిణమించింది. ముస్ల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతిపవిత్రంగా పూజించే యీశివలింగాన్ని పగులగొట్టారు. అంతట హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒకమశీదును తగులబెట్టారు. దానిమీద తురకలు వీరావేశంతో ఒక ఆవును చంపి, దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయందగ్గర గంగానదీజలంకన్నా అతిపవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానములు చేసే "ఇననకూప"మనే ఒక పురాతనమైన నూతిలో కలిపారు.
  అంతట కత్తి పట్టగల ప్రతి హిందువూ రోషవేశంతో కత్తులూ కఠరులూ పుచ్చుకుని కనబడిన తురకవాడిపైఅబడి దౌర్జన్యం చేయసాగారు. కాశీలో హిందువులె బహుసంఖ్యాకులైనందువల్ల తురలనురూపు మాపుతారేమో నన్నంత భయం కలిగింది.
  కుంపినీ అధికారులు శిపాయీలను బయటికితెఛ్ఛి నిలవకపోతే ఇటుసూర్యుడ టు పోయేలోపల ఊళ్ళో మశీదులనన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే. అయితే, హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి శిపాయీ లెంతవరకు తోడ్పడతారో అనేదికూడా అనుమానాస్పదమైన విషయంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే, అక్కడి శిపాయీలలో చాలామంది హిందువులు, సగంమంది బ్రాహ్మణులే. నిజంగా వాళ్ళమనసులో సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయుల రక్తాన్ని చూరగొనాలనే వుందని చెప్పాలి.
   ఈ తురకలపైకి పోతూవున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులూ, యోగొలూ, గోసాయీలూ, బైరారులూ, మొదలైన సనాతన ధర్మపరులే వీళ్ళు తమవంటినిండా విభూతి పూసికొని మొగాలపైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తలవెండ్ర్కలు విరబోసికొని జందములు చేతపట్టు కొని తమతోడి హిందువులతోనూ దేవుళ్ళతోనూ యుద్ధంచెయ్యబూనిన వారిని శాపనార్ధాలు పెడుతూ వీరంతా ముందువరుసలోనే వున్నారు. అయినప్పటికి శిపాయీలు చలించలేదు. తాము ఎవరి వుప్పు తింటున్నారో ఆ కంపెనీ వారి వుత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధువులు ఎదురైనాసరే తుపాకీ పేల్చడానికి ఒట్టుపెట్టుకొని సైన్య్హపు కొలువులో చేరిన ఈశిపాయీలు అవసరమైతే బ్రాహ్మడిపైనకూడా తుపాకీ పేల్చడానికి సంసిద్ధులైనారు.
పైన చెప్పిన శివలింగం వుండే మశీదు ద్రారందగ్గర కావలి కాస్తూవున్న శిపాయీలలో ఒకడు అక్కద కిందపడివున్న శివలింగాన్ని చూసి ఇలాగాన్నాడు. "అయ్యా! మనమెన్నడూ అనుకోనిసంగతిని చూశాము. శివలింగంశిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంక కొద్దికాలంలోనే మన మందరమూ ఒకేకులంవాళ్ళ మైపోతాము. అప్పుడు మనమతం

కాశీమశీదులో శివలింగం

ఏమవుతుంది?" అన్నాడు. "బహుశ: కిరస్తానీమతం అవుతుందేమో!" అని రెండవవాడన్నాడు.

  కంపనీవారు ఇలాగ బందోబస్తు చేసినందువల్ల అల్లరి సద్దు అణగింది.
 ఈ కల్లొలం అణగినతరువాత మళ్లీ ఆసంగతి తలుచుకునే టప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైనవి. వారికి తీవ్రమైన విషాదం కలిగింది. "పవిత్రమైన కాశీక్షేత్రం అపవిత్రమైపోయినది. అతి పవిత్రమైన గంగాజలములో రక్తం కలిసింది. ఈకాశీమహాత్య్మం పోయింది. ఇంక ఇక్కడమోక్షం దొరకదు" అనే ఆలోచనలతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విబూతిరేఖలతో పైమీద బట్టలుకూడా లేకుండా దు:ఖసూచకంగా గంగానదీ తారాన్నివున్న ముఖ్యఘట్టా లకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్తుకుని తలలు వంచుకొని కూచుని మళ్లీ ఇళ్లకు పొకుండా అక్కడనే పడివుండి ఒక మెతుకైనా తినకుండా ప్రాణంపై ఆశ విడిచి ప్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు.
  ఇలాగ రెండుమూడు రోజులు గడిచినవి. ఇది చూసేటప్పటికి చాలామంది మనస్సులు కరిగినవి. వీళ్లను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్లకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికితొచింది. ఈ సంగతినీ వీరు కాశీలోని మేస్ట్రీటుల చెవిని వేశారు. అంతట కంపనీవారి అంగ్లేయోద్యోగులందరూ గంగా నదీతీరానికి వెళ్ళి అక్కడ ఘటాలలో ఇలాగ వుపవాసంచేస్తూవున్న బ్రాహ్మనులను చూచి వగచి, తాము నివారించడానికి ఎంతోకష్టపడి ప్రయత్నించినా లాభంలేక తమవశం తప్పి జరిగినదానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడము బాగా లేదనిన్ని జరిగిన అక్రమాలను కొంత ప్రతిక్రియ జరిగించేవున్నరుకదా అందుకోసం మళ్ళీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి, వాళ్ళను బుజ్జగించిగా, వారందరూ చాలా దు:ఖించి తరువాత కొంత ఊరట చెందారు.   ఇంతటి అకృత్యంజరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్త కర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగావారు చెప్పిన సలహాబాగానే వున్నదని ఆఖరికివారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.
 ఆసమయంలో ఈరాయబారం నడిచిన దొరలలో ఒకరైన 'బర్డు ' గారు అదృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకట్టినట్టు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1884 లో బిషప్ హెబరుగారికి ఈసంగతులన్నీ చెప్పాడు. 

Bishop Heber's journal - Vol.1 pp.428-32

10. వాకిటికావలి తిమ్మన

(కృష్ణదేవరాయలవారి సన్నిహిత భృత్యులు)

"ప్రాకృత సంస్కృత ఘర్ఘర, మూకీకృత, గుకవితుంగ ముస్తాతతికిన్,
  వాకిటి కావలి తిమ్మన, వాకిట కవికి "టి మాధవా కిటికోటే!"

 శ్రీకృష్ణదేవరాయలవారి అనుగ్రహానికి పాత్రుడైన ఒక భట్టు రాయలవారి ఆస్థానములోని అష్టదిగ్గజాలనే కవులమీద నీర్ష్యవహించి వారి నెలాగైనా అవమానించాలని ఒక కుట్ర పన్నాడు. ఒక్కరోజున తాను చెప్పినట్లు చేస్తానని రాయలవారిచేత వాగ్ధానం చేయించుకొని, ఆ మరునాడు రాజసభలో అందరూ కూర్చుని వుండగా తాను లేచి కొందరెఉ కవులపేర్లను చదివి "వీరు రాయల వారి సెలవు అయ్యేవరకూ రాజసభలోనికి రాకూడదని రాయలవారి యాజ్ఞ"యైనదని ప్రకటించాడు. ఈ విపతీరపు ప్రకటనను విని