కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సత్యరాజా పూర్వదేశ యాత్రలు.


ప్రథమ భాగము

ఆడుమళయాళము

మొదటి ప్రకరణము


సత్యరాజాపూర్వదేశ యాత్రలు

కార 'యా' కారముల కభేదము. అందుచేతనే వంగము మొదలయిన యుత్తరదేశములయం దయెాధ్యకు అజోధ్యయని యకారమునకు మాఱుగా జకారమునువాడుదురు. ఈశాస్త్రచర్చ నింతట విడిచిపెట్టి కార్యాంశమునకు వత్తము. నాపేరుయొక్క యుచ్చారణక్రమ మెట్టిదయినను నాదిసార్ధకనామధేయమని నేనువేఱుగ చెప్పనక్కఱ లేకయే నేను వివరింపఁబోయెడి యీసత్యయాత్రాచరిత్రమే లోకము నకు వేయినోళ్ళ ఘోషింపవచ్చును. ఆత్మస్తుతి నింద్యమయినంగున నాసత్యసంధతనుగూర్చి నేనిఁక చెప్పను. నేనవలంబించియున్న సత్య మతముకూడ నాచరిత్రమూయొక్క పరమ సత్యత్వమును సాధింప వచ్చును. సత్యప్రియత్వముచేతనేకదా మామతకర్తలయిన శ్రిమధ్య రాయలవారుమిధ్యాభూతములయినపూర్వమతసిద్ధాంతములనన్నిటిని తిరస్కరించి, శ్రీమదాంజనేయసహయముచేతను ముఖ్యప్రాణదేవుని యనుగ్రహముచేతను ఖలములయిపోయిన యపూర్వశ్రుతిస్మృతి వాక్యరత్నములను బ్రహ్మలోకమునుండి తెప్పించి బ్రహ్మస్ంప్రదా యానుసారముగా సత్యమయినదైతమతసిద్దాంతమును లోకానుగ్రహా ర్ధముస్థాపించియున్నారు: అటువంటి సత్యమతమున జన్మించి సత్యవ్రత నొక్కదానినయినను చొరనిత్తునా ? ఓచదువరులారా ; నామాటను నమ్మి యిందలిప్రతివాక్యమును వేదవాక్యమునుగా విశ్యసింపుఁడు. నేనిందు తెలుపఁబోయిెడు సంగతు లీవఱకుమనుష్యుల కెవ్వఱికిని తెలి యనిదేవరహస్యములయినను స్వదేశస్తులయిన మియందు నాకుఁగల బ్రాతృన్నేహముచేత మర్మమువిడిచి చెప్పివేయుచున్నాను.

మాతండ్రిగారు కర్మిష్టులయి బాల్యమునుండి వైదికమయి పూజ్యమయిన యాచార్యవృత్తియందే కాలముగడసినవారయినను, వారిపుత్రుఁడనయిన నాకుమాత్రము పూర్యకర్మానుభవముచేత శిష్య

           ఆడుమళయాళము

పరంపరలునేవింపఁగా ఆచార్యపదమునొంది పూజింపబఁడెడు భాగ్యము పట్టినదికాదు. మాతల్లి పుట్టినింటివారు మొదటినుండియు లౌక్యవ్యన హారములలో పుట్టిపెరిగినవారగుటచేత మా మేనమామగారగు కంచి శేషగిరిరావుపంతులుగారు నన్ను వేదపాఠశాలకు పంపక బడిచదువు కాఁగానే హూణపాఠశాలకుఁ బంపిరి. మాగ్రామములో నొక బ్రాహ్మణ బాలుఁ డింగ్లీషుచదివి క్రేస్తవమతములో కలిసినప్పుడు మాతండ్రిగారు నన్ను మాత్రమే గాక మావంశమునపుట్టినవారి నెవ్య రినికూడ హూణపాఠశాలకు పంపమని ప్రతిఙ్ఞను.నాకుబుద్దివచ్చు వఱకును జీవించియుండినపక్షమునవారుతమ ప్రతిఙను తప్పక చెల్లి చుకొనియుందురు. తానొకటితలఁచిన దైవమొకటి తలఁచునుగదా ? నేను చిన్నవాఁడనయినను పూర్వచారవిరుద్ధమయిన మాలచదువు చదువుట నాకిష్తము లేకపోయిెను.దానికీతోడు మాతడ్రింగారిప్పుడు జీవించియున్నపక్షమునవారునన్నుహూణపాఠశాలకుపంపుటకిష్తపడి యుండరుగదాయన్న విచారమొకటి నామనస్సును భాధింపజొఁచ్చెను. ఈరెండుకారణములచేతనునాకింగ్లీషుచదువెప్పుడునుసరిపడినదికాదు. అయినను నాకప్పుడింకొక బాధకూడతటస్తమయిెను.నామేనమామ మాటవిని నాతల్లి ప్రతిదినమును హూణపాఠశాలకు పొమ్మని నిన్ను నిర్బంధింప మొదలుపెట్టినది.అప్పుడునాకు పరస్పర విరుద్ధములయిన రెండుధర్మములు సంప్రాప్తములయినవి.నేనింగ్లీషు పాఠశాలకుపోవుట నాతడ్రింగారి యభిమతముగాదు; పోకుండుట తల్లిగారి యభిమతము కాదు.ఇందులోనేనెవ్వరి యభిమతమును చెల్లింపను? నామనస్సు తండ్రిగారి యాజనే చెల్లింపవలసినదని భోధించుచున్నను చచ్చిస్వర్గ మునందున్న తండ్రిగారి యాజనువలె బ్రతికి భూలోకమునందున్న తల్లిగారి యాజను మిఱుట నాకుసాధ్యముగా కనఁబడలేదు. మన వేదము పితృదేవోభవయని మాత్రమేకాక మాతృదేవోభవయనికూడ

           : : సత్యరాజాపూర్వదేశ యాత్రలు: :

చెప్పుచున్నది.అందుచేతపితృనియెాగమును మాతృనియెాగమును నాకుసమానముగానేయలంఘ్యములయినవి.నేనిపప్పుడు తండ్రియభిష్త మును తీర్చవలెను. తల్లిమనోరధమును తీర్చవలెను.కాఁబట్టి నేను బుద్ధిమంతుఁడనయినందున పితృవాక్య పరిపాలనను మాతృవాక్యపరి పాలనమును కూడచేసి యుభయఋణవిముక్తుఁడనయి కృతార్దతను పొందుటకొక్కయుపాయము నాలోచించితిని.ఆయుపాయమును విన్న పక్షమున నాబుద్ధికుశలతకు మిారును సంతోషింపకపోరుతల్లి యజ్నా నుసారముగా నేనింగ్లీషు పాఠశాలకు పోవుచుంటిని; పోవుచున్నను పాఠములను చదువక తండ్రిగారి యిష్తానుసారముగా పోనట్లేయుంటిని. ఈయుపాయముచేత నే నుభయవాక్య పరిపాలన దక్షుఁడనై ధన్యుఁ డనుకాఁగలిగితిని. ఈప్రకారముగా నేను దాదాపుగా పదిసంవసత్స రములు హూణపాఠశాలలో చదివినను, గొప్పపరిక్షలోదేనిలోను కృతా ర్ధుఁడను కాలేదు. కానియిెంతోకష్తముమిాఁద నేనుసామన్యపరీక్షలో మాత్రము తేరినాఁను.నేనింటికడ పాఠములు చదువకపోయినను, ఉపాధ్యాయులు కృషిచేత నాప్రయత్నములేకయే కొన్ని యింగ్లీషు ముక్కలునాకుక్షిలోదూరినవి.అటుతరువాత వానిని నాహృదయము నుండిపాఱఁదోలుటనాకు సాధ్యయులునేనుమనవేదశాస్త్రములకువిరు ద్ధముగా మాయుసాద్యాయులుభోదించినభూగోళవిషయములకుచరి త్రములను హూణశాస్త్రములనుసత్యములనినమ్మకుంటిని.ఈచరిత్ర మును చదివినకొలఁదినినామాటలయందలి సత్యముమిాకే భోధపడఁ గలదు. ఇఁగ్లీషుచదువువలన బుద్ధిహీనులైనయిప్పటిబాలురకువలె నాకు మనశాస్త్రములయందును పురాణములందును నమ్మక మావ గింజంతయుతగ్గినదికాదు.ఇంగ్లీషు తిన్నగాచదువన్నను నేను నిత్యమును

            ఆడుమళయాళము

స్నానసంధ్యా ద్యనుష్తానములను మాసక జపములను తపములను జేయుచు మంత్రతంత్రములను గురుముఖమున నేర్చుకొని నిష్తాగరి ష్తుఁడనయితిని.నాయాచారవ్యవహారములు చూచి నాతల్లియు మేన మామయుకూడ సంతోషపడుచుండిరి.

నేను నాలవతరగతిలో చదువుకొనుచుండఁగా నాకు వివహ కార్యము తటస్తమయిెను. ఈయాంధ్రదేశములో మాశాఖవారు మిక్కిలి తక్కువగా నున్నందున మాలో కన్యలుదొరుకుట మిక్కిలి కష్తము.అందుచేత సామాన్యస్తితిలోనున్నవారికి వేయిరూపాయలయి ననియక మూఁడేడ్లకన్య యయినను లభింపదు. మామేనమామగారి కృషిచేత నిప్పాణి నృసింహాచార్యులుగారు తొమ్మిది సంవత్యరముల ప్రాయముగల తమకొమా ర్తెను వేయిరూపాయలకే నాకిచ్చి వివాహము చేయుట కంగీకరించినారు. ఇటువంటి తరుణము మరల రాదనియెంచి నామేనమామగారును తల్లిగారునుజేరి నూటికి మూడురూపాయలవడ్దికి మాపిత్రార్జితమయిన మాన్యములమీఁద వేయిరూపాయలు ఋణము చేసి, వివాహవ్యయములకైయిన్నుఱు రూపాయలను మఱియొకరి యొద్ద అప్పుచేసి, శుక్లసంవత్సర వైశాఖమాశములో నొక మంచిము హూర్తమున నాకు వివాహముచేసిరి. నాకప్పటికి పదునెనిమిది సంవ త్సరములు దాటినవి. నాభార్య రూపవంతురాలు కాకపోయినను, గుణ వంతురాలుగా కానఁబడెను. కులకాంతలకు గుణముప్రధానముగాని చక్కఁదనము ప్రధానముకాదు. ఇట్లోకసంవత్సరము గడచిన తరువాత నాభార్యకు స్ఫోటకమువచ్చెను. అప్పుడాచెన్నది జీవించుటయే దుర్ఘట

మని యెల్లవారును భావించినను, నేను పునశ్చరణచేసిన వీరహనుమంత మంత్రప్రభావమువలన చిన్నదానికి ప్రాణబయముతప్పి కుడికను మాత్రము పోయెను. మొగమునిండ గోతులుపడి యాచిన్నది మఱింత కురూపిఱియయినందున "భార్యారూపవతీశత్రు" వనెడుబాధ నాకు

236 సత్యరాజాపూర్వదేశ యాత్రలు

లేకపోయెను. నేనొక్కపరీక్షయందుఁజేఱి పాఠశాలను విడుచునప్పటికి నాభార్యయెడిగి కాపురమునకువచ్చెను. మామాన్యములమీదవచ్చెడి యాదాయము మేముచేసిన ఋణములనడ్డికే చాలనందున నాకుటుంబభారముకూడ మామేనమామగారిమీదనే పడెను. అందుచేత రెండుకుటుంబములను పోషించుట దుర్భరమయినందున మామేనమామగారు నన్ను చదువుమానిపించి, విశాఖపట్టణముపోయి యెవ్వరెవ్వరినో యాశ్రయించి విశేషకృషిచేసి దొరతనమువారి కార్యస్ధానములో నొకచోట నాకు నెలకు పదునేనురూపాయల జీతముగల యద్యోగమును చెప్పించిరి. ఆపనిలోనుండఁగానే యప్పులవారు నామీద వ్యాజ్యములువేసి ధనద్విగుణమునకు తీర్పులను పొంది నామాన్యముల నమ్మించిరి. నామాన్యముల విక్రయమువలన వచ్చినసొమ్ముతో నాఋణము సగముతీరినది. మిగిలినది తీఱుటకు సాధనముకనఁబడలేదు. అప్పులవారు ప్రతిదినమునువచ్చి నాయిల్లుచుట్టుకొని ఋణముతీర్పుమని నను నానావిధముల చిక్కులుపెట్ట మొదలుపెట్టిరి. ఈచిక్కులలో నుండగా నాకుగ్రామముల వెంటతిరిగెడి మఱియొకపనియైనది. ఈక్రొత్తపనిలో జీతమిరువది రూపాయలయినను, ఆయెక్కువజీతము ప్రయాణవ్యయములకే చాలకుండెను.ఇప్పుడింకొక విధమయిన క్రొత్తవ్యయముకూడ నామీఁదపడెను. నాకెప్పుడును గుప్తదానము చేయుటయందేయిష్టము. ఇప్పుడట్టిదానములు చేయవలసిన నిర్భంధముకూడ నాకుతటస్ధమయ్యెను. అట్టిదానములు చేయకపోయినయెడల నాపనికికూడ భంగమువచ్చునట్లు కానఁబడెను. మామండలమునందప్పు డుద్యోగస్ధులలో లంచగొండులధికముగా
నుండురి. అప్పుడు మాపై అధికారులు పూర్వపువారుమాఱి క్రొత్తవారు వచ్చుట తటస్ధించెను. అందరికంటెను కష్టపడి యెక్కువ పని చేయుచున్నను నేను పనితిన్నగా చేయుచుండలేదని కోపపడుచు వచ్చినందున నాహితుల యుపదేశముచేత శిరష్తాదారుగారికిమూఁడు

ఆడుమళయాళము 247

సారులు హిరణ్యదానములుచేసితిని; ఎన్నిసారులో యిప్పుడు సరిగా జ్ఞప్తికిరాలేదుగాని పెక్కుసారులు వస్త్రదానములు చేసితిని; పిల్లకుపాలు కావలసివచ్చినందున రెండుసారులు సవత్సక గోదానములు సహితమాయనకే చేసినాఁడను. చేసినదానములు చెప్పుకోరాదు. ఇటువంటి గుప్తదానములు మఱియెన్నెన్నో నేను చేసితిని.ఈహేతువుచేత దానములు చేయఁగా మిగిలిన సొమ్ము నాకును నాభార్యకును నిత్యైకాదశీవ్రతములతో భుక్తికయినను చాలకుండెను.ఇట్లుండగా నాభార్య జ్వరబాధితురాలై, మాగ్రామములో రెండవ ధనవంతరియని ప్రసిద్ది కెక్కిన వైద్యశిఖామణిచేత ఇరువదియొక్క లంకణము కట్టించఁబడి ఆకస్మికముగా స్వర్గస్ధురాలయ్యెను.ఆచిన్న దాని చావుతో నాకీలోకముమీద విరక్తికలిగినది. ఈసమయములోనే ఋణప్రదాతలు కటినులై నన్ను తమ యప్పలకై చెరసాలకు సహితము పంప యత్నించుచుండిరి.ఈయన్ని కారణములచేతను నాకు సంసారము మహారణ్యమువలె తోచఁగా నాకప్పడు సర్వసంగములును పరిత్యజించి ముముక్షడై యెగిని కావలెనన్న బుద్ధిపుట్టినది.అందుచేత నేను నాతల్లిని మామేనమమగారి ఇంటికిపంపివేసి,ముందుగా అప్పలవారి బాధను తప్పించుకొనుటకై దేశత్యాగముచేసి దక్షిణదేశయాత్రలు సేవింవలెనన్న యుఇద్దేశముతో విశాఖపట్టణమువచ్చి చేరితిని.అప్పడాపట్టణములోనున్న నాబాల్యమిత్రుడొకడు నన్ను చూచి నాదురవస్ధివిని జాలిపడి నాకు నూరురూపాయలిచ్చిను.మరునాటి యుదయకాలమున నేను సముద్రతీరమునకు పోగా ధూమనైక యికటి యప్పడు రేవునకు వచ్చెను.అదియెక్కడకు పోవునని విచారింపగా చెన్ంపురికి పోవునని యక్కడివారొకరు చెప్పినందున శీఘ్రముగా పోవలెనన్న యభిలాషచేత,దుస్సహమైన ఋణప్రదాతల బాధ తప్పించుకోవలెనన్న యుద్దేశముచేతను,సముద్రయానము శాస్త్రనిషిద్దమని తెలిసినవాడ

సత్యరాజా పూర్వదేశయాత్రలు

నయినను తరువాత ప్రాయశ్చిత్తము చేసుకోవచ్చునని పూటకూటియింటికిపోయి శీఘ్రముగా భోజనము చేసివచ్చి, వ సంత్సరము మార్గశిరమాసంలో భానువారము నాడొక చిన్నపడవలోపోయి పొగయెడలో నెక్కితని.ఇరువదియేడవ యేట నాకు చేశాంతరయాత్ర నాజాతకములోనే వ్రాయబడినది.ఎక్కినజాములో పొగయెడకదలి నాలవనాటి ప్రాత:కాలమున నన్ను చెన్నపురికి గొనిపోయి విడిచినది.పొగయెడలోని యవస్ధ యీకాలమునందు సముద్రయాత్రలు చేయువారి కందరికిని తేలిసినదే యగుటచేత నేనిక్కడ వివరింనక్కరలేదు.ఒకవేళ సముద్రయాత్రలుచేయని సిష్టుల లాభామునిమిత్తము వివరింత మన్నను పొగయెడలో నెక్కిన తరువాత మరల దిగువరకును నాకు దేస్మృతయేలేదు. నేనెరిగినదంతయు నాకడుపులో నేదో వెర్రి వికారమారంభమయి నాటిదినము తిన్న యన్నముమాత్రమేకాక చిన్నప్పటినుండియు కడుపులోనున్న పసరంతయు వాంతులగుటయు,దేహముతూల లేవశక్తుడనుగాక కన్నులుమూసుకోని శవమువలె నొకమూల పడియుండుటయు, మాత్రమే.ఇప్పడింకొకసంగతికూడ స్మరణకు వచ్చున్నది.నేను చిన్నతనములో నుయ్యెలలోనంతగానూగలేదు.ఓడలోనున్న మూడుదినములలోను నాకు యావజ్జీవమును సరిపోవునంత యుయ్యాలలూగుటసంభవించినది.ఆసాఖ్యమనుభవైక వేద్యమేకాని చెప్ప నలవియైనది కాదు.నేను పడవదిగి మెట్టకుపొయిన తరవాతకూడ కొన్నిదినములవరకును నేనుయ్యాలలో నూగుచున్నట్టే భ్రమ పడుచుంటిని.నా కీడోలికాక్రీడ మొదలయిన వైభవములు కలిగించిన వాడు మాముఖ్యప్రాణదేవుడే.భక్తవత్సలు డగుటచేత వాయుదేవుడు భక్తుడనయిన నేనొంటిగా పోవుటచూచి సహించలేక తన మహాబలత్వము సార్ధకమగునట్లుగా సముద్రము పొడుగునను నాకుతోడుగా వేంటవచ్చి నాకీ

క్రీడాసాఖ్యములను ప్రసాదించెను.వాయు మహిమచేత గలిగిన వికారమును వాంతులును నాకసాఖ్యమును కలిగించినట్లు మీరెంచు కొందురేమేకాని నిజము విచారింపక నాకవి మంచివైద్యులవలె లోని కల్మషమును పోగొట్టి యారోగ్యమునే కలిగించి నన్ను మహబలుని వంటి సత్వసంపన్నునిగా జేసినని.నేనోడలోనున్న మూడుదినములును ఉపవాసవ్రతము పూనియుండిన సంగతి బుద్ధిమంతులైన మీరివరకే యూహించి యుందురు.నాభాగ్యము నేమనిచెప్పను? అందులో కపటిదినము ఏకాదశికూడ నయ్యెను.అకడపటినాటి నిరాహారపుణ్యమున కెందైన సాటికలదా? తక్కిన రెండుదినముల యుపవాసఫలమును పొగయెడనెక్కిన పాపమునకు సరిపోయినను హరివాసరమునాటి శుష్కోపవాస పుణ్యఫలము నాకు మిగిలియుండక మానదు. శ్రీహరి కరుణాకటాక్షము గలవారి కెక్కడకు పోయినను పుణ్యమునకులోపముండదు. అటుతరువాతి చరిత్రము వినుడు.


రెండవ ప్రకరణము

నాలవనాడు ద్వాదశిపారమున కనుకూలమిగా ప్రాత:కాలముననే పొగయెడ చెన్నపురి రేవు చేరెను.ఓడ లంగరు వేసిన తరువాత చిన్నపడవ లనేకము లక్కడకు రాగా నేనొకపడవలో నొక్కి యొడ్డునకు పోతిని.ఒడ్డునుండినూరగజముల దూరము నడచునప్పటికి గుఱ్రపు బండియొకటి కనబడెను.

         వూళ్లోకి బండి అద్దెకు తీసుకువస్తావా ?అని నేనాబండివాని నడిగితిని.వాడేమొ అరవముతో మాట్లాడగా నేను తెలిసికోలేక నీకు తెలుగు తెలుసునా అని వాని నడిగితిని.అప్పడు మాయిద్దరికిని యీక్రింది సంభాషణము జరిగినది.</poem>