ఏ నెరుంగుదు, చిర నూత నానురాగ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏ నెరుంగుదు, చిర నూత నానురాగ

బంధముల కట్టువడుట, స్వప్నములనేని,

యెన్నడునుగాని, యెచ్చోటనేని, నిముస

మేని, యెడబాటు మీరు సహింపలేరు.


ఏ నెరుంగుదు, రామభూజాని మీరు,

కరము కరమున కీలించి, కాంతిసీమ

లందు, స్వచ్ఛంద నిత్యవిహారపరత

మెలగుచుందురు కాబోలు -


మీ యమూల్య

జీవిత సుమాల నే నృపశేఖరునకు

నర్పణము చేసి, రట్టి సూర్యావనీంద్ర

చంద్రు నౌదల నాశి షాక్షతల మీరు

చల్లుచుందురు కాబోలు -