ఏను మీ వలెనే కంఠ మెత్తి పాడ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏను మీ వలెనే కంఠ మెత్తి పాడ

నెంతో యుబలాటపడి సవరింతు గొంతు;

ఏను మీ వలెనే న వానూన గాన

విస్తృత వ్యోమ యానాల వెడలి వెడలి

భావలో కాంచలమ్ముల వాల వలతు!


ఐన నే మాయె! ఆపుకోలేని పాట

యెడద రొదసేయునో లేదొ యింకిపోవు

నంతలోననే కటకటా! యంతులేని

దారిలేని శోకంపు టెడారు లందు!


అంత లజ్జా విషాద దురంత భార

వహనమున కోర్వ లేని యీ పాడు బ్రతుకు

వంగిపోవును మరిమరి క్రుంగిపోవు

లో తెరుంగని పాతాళ లోకములకు!


మూగవోయిన నాగళమ్మునను గూడ

నిదురవోయిన సెలయేటి రొదలు కలవు-

ఐన నే మాయె -