ఏను గాటంపు నిద్దురలోన మేను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏను గాటంపు నిద్దురలోన మేను

మరచువేళల భవదీయ మధురవేణు

మృదులగాన పక్షముల పై మెల్ల మెల్ల

నేగుదెంచి మామక శుష్క హృదయ పాత్రి

నింపివైతువు ప్రణ యార్ద్ర నిస్వనముల!


అంత మేల్కాంచి యెంతొ దాహమ్ముగొన్న

శ్రవణముల విచ్చి నీ గీతరవము కొరకు

కడల పరికించి శూన్యలోకమ్ము కాంచి

హోరు హోరు మటం చేడ్తు నోయి స్వామి!