ఏ మనోహర సీమలం, దే పవిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏ మనోహర సీమలం, దే పవిత్ర

విమల తేజోమయ విశాల వీథులందు,

అక్ష రామోద సంభరి తాంతరంగు

లగుచు, విహరించుచున్నారొ, అమృతగాన

మధుర మందాకినీ భంగమాలి కాంబు

శీకర వితాన మోహన చిత్రనటన

మెన్ని యెన్ని రీతుల చూపుచున్నవారొ,

పూర్ణవికసిత జీవితపుష్ప కమ్ర

సౌరభమ్ముల చిమ్ముచున్నారొ, ఎల్ల

దెసల భవదీయ సుందర దివ్యరూప

నవ్యరోచిస్సు కురియుచున్నారొ మీరు!