ఏటి పని యిది లోకమా! హృదయ దళన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏటి పని యిది లోకమా! హృదయ దళన

దారుణ మహోగ్ర కార్యంబు తలచినావు;

ప్రణయ మధురిమ మెరుగవు, పాప మనవు,

పక్షములు దూల్తు, బంధింతు పంజరాన;

వెర్రి లోకమ! హృదయంపు స్వేచ్ఛ నెటులు

పంజరంబున బంధింతె? పాదపమున

కూడియుందు మెల్లప్పుడు కొమ్మమీద

ప్రవిమల ప్రేమ విహగ దంపతుల మగుచు!