ఉద్భటారాధ్యచరిత్రము/వ్రాతప్రతుల వివరము

వికీసోర్స్ నుండి

వ్రాతప్రతుల - వివరము

ప్రభాకరశాస్త్రిగారు ప్రథమముద్రణ పీఠికలో వ్రాతప్రతులను గూర్చి తెలుపలేదు- ప్రబంధరత్నావళిలో పై పీఠికలోని చల్లా సూర్యనారాయణగారు తమకు పంపిన ప్రతియని చెప్పిన దానిని గూర్చి కూడా నాకు తెలుపలేదు. అయినను ప్రథమముద్రణమున విజ్ఞప్తితో వీనిని గూర్చి యున్నది. ఆ విజ్ఞప్తి శ్రీ ముదిగొండ బసవయ్యశాస్త్రిగారిది. వారిటు తెలిపినారు.

ప్రప్రథమమున నీ చరిత్రము నైజాంమండలమునుండి సంపాదించి నా కొసగిన వారు మన్మిత్రులును వేములపల్ల్యగ్రహార వాస్తవ్యులును అగు ములుగు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. వీ రొసంగిన తాళపత్రగ్రంథము శిధిలావస్థనంది మఱియొక ప్రతియుండినఁగాని వ్రాయుటకు వలను పడని స్థితిలో బ్రత్యంతర మొసగిన వారు అస్మద్వంశ మౌక్తికాయమానులును, విద్వద్వరేణ్యులును తాడికొండ వాస్తవ్యులు నగు బ్ర॥ ముదిగొండ నాగలింగశాస్త్రిగారు. ఈ రెండవ ప్రతియందు ఆశ్వాసములో కొంత శిథిలమైయున్నవి. ద్వితీయాశ్వాస మసలే లేదు. ఈ 1, 2 ప్రతుల సంప్రతింపుతో గొఱతపడిన పద్యభాగములట్లనే యుంచి లభించినంతవఱ కున్నదున్నటుల నొకప్రతి యెత్తివ్రాసితిని. తదుపరినే నిద్దానిని సంస్కరణ మెట్లు సమకూరెడు నని విచారించుచున్నెడ నుభయశాస్త్రజ్ఞులును, భోగేశ్వర సత్యవత్యుపాఖ్యానాది గ్రంథరచయితలును పెడన వాస్తవ్యులు నగు బ్ర॥ మల్లంపల్లి మల్లికార్జునశాస్త్రిగారు లేఖక ప్రమాదముల సవరించి లుప్తభాగముల జాలవఱకుఁ బూరించి దయచేసిరి.

అనంతరము దీనిని ముద్రింపించు ప్రయత్నములో నేనున్నసంగతి విని, సరస్వతీపత్రికాధిపతులైన మహారాజరాజశ్రీ రాజా వాసిరెడ్డి శ్రీ దుర్గాసదాశివేశ్వరప్రసాద్ బహదర్, జయంతిపురం రాజాగారు గురువంశమువకు మూలకందమైన నీ యుద్భటారాధ్యచరిత్రము నత్యంతగౌరవభావముతోఁ దమ పత్రికయందుఁ బ్రకటింప నుద్యుక్తులై యుండ, నింతలో భాగ్యవశమున మా ముక్త్యాల పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/222 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/223 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/224 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/225 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/226 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/227 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/228 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/229 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/230 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/231 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/232 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/233