Jump to content

ఉద్భటారాధ్యచరిత్రము/పీఠిక (2)

వికీసోర్స్ నుండి

ఉధ్బటారాధ్యచరిత్ర

పీఠిక

ప్రథమఖండము

1. పరిచయము

1. మతమీమాంస

తెనాలి రామలింగకవి ఉద్భటారాధ్యచరిత్రము అను నీ ప్రబంధమును మొదట సాహిత్యలోకమున కెఱుకపఱచిన కీర్తి కీర్తిశేషులు వేటూరి ప్రభారకరశాస్త్రిగారిది. వా రీగ్రంథ మా కాలమున అనగా క్రీ. శ. 1926 లో ముక్త్యాలలో వెలువడుచుండిన సరస్వతి పత్రికలో పీఠికతో గూడ ప్రకటింపఁజేసిరి[1].

వేటూరి వారు దీనిని 1925 లో వెలువరించినను దీనిని గూర్చి అంత కేడేండ్లకు ముందే వారికి తెలియును. 1918 లో వారు ప్రకటించిన “ప్రబంధరత్నావళి" పీఠిక 24 పుటలో నిట్లు వ్రాసినారు. "రామలింగయ్య- తెనాలి-రామకృష్ణుడు వేఱు, రామలింగడు వేఱుగా మా. రా. కవిగారు వ్రాసినారు. (ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక) సత్యము కావచ్చును." అని తెలిపి ఉద్భటారాధ్యచరిత్రమునుండి-

  1. ఉ. గ్రాంథిక సన్నుత ప్రతిభ గాంచిన....
  2. సీ. మహితమూల స్థాన మల్లికార్జున....
  3. మ. పరగన్ వారిధి వేష్టితాఖిల...... అను పద్యములను

ఆశ్వాసాంత గద్యము నుదాహరించినారు. ఆపై నిట్లువ్రాసినారు. మన్మిత్రులు చల్లా సూర్యనారాయణరావు పంతులుగారు దీనిని బంపినారు. పాండురంగమాహాత్మ్యకర్తయు, నేతత్కృతి కర్తయు నొక్కరేయనిగాని వేఱనిగాని నిర్ధారింప దేలకున్నది. అతడు నీతడును రామయ పుత్రులే "శైవ వైష్ణవ పురాణావళీ నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతిని" కావున నాతఁడు గూడ నీ శైవ కథ రచియించియుండఁదగును. అక్కడ రామకృష్ణుఁడని యిక్కడ రామలింగఁడని యున్నది. ఇక్కడఁ దెనాలి ప్రశంస కానరాలేదు. ఈ యుద్భటారాధ్యచరిత్రము గూడ బయల్పడినఁ గాని యథార్థము తేలదు. ఇందూదాహరింపఁబడిన పద్యమందు, నాదెండ్ల గోప మంత్రి పేర్కోఁబడినాఁడు. ఈ రామలింగనికిఁ గుమార భారతి యని బిరుదు".

ప్రభాకరశాస్త్రిగారిట్లు 1918 లో వ్రాసినను 1925 నాటికి గ్రంథము సమగ్రముగా పరిశీలించి, ఉద్భటారాధ్యచరిత్ర కృతికర్త రామలింగడు, పాండురంగమాహాత్మ్య కృతికర్త రామకృష్ణుడును నొక్కరేయని నిర్వివాదముగా నిరూపించిరి. వారి ప్రథమ ముద్రణ పీఠిక యనుబంధముగా తిరిగి ముద్రితమైనది. ద్వితీయ ముద్రణమున గ్రంధపూరణ వివరములు సమబంధములో చూపబడినవి.

2. తెనాలి రామలింగ (కృష్ణ) కవి

2. వంశోత్కర్ష - వివరములు

ఈ గ్రంథమునకు రామలింగకవి కర్తయైనట్లుగా, ఆశ్వాసాంతగర్య వలన తెలియుచున్నది.

పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/24 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/25 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/26 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/27 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/28 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/29 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/30 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/31 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/32 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/33 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/34 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/35 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/36 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/37 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/38 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/39 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/40 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/41 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/42 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/43 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/44 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/45 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/46 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/47 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/48 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/49 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/50 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/51 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/52 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/53 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/54 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/55 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/56 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/57 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/58 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/59 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/60 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/61 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/62 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/63 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/64 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/65 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/66 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/67 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/68 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/69 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/70 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/71 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/72 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/73 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/74 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/75 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/76 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/77 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/78 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/79 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/80 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/81 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/82 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/83 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/84 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/85 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/86 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/87 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/88 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/89 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/90 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/91 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/92 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/93 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/94 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/95 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/96 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/97 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/98 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/99 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/100 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/101 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/102 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/103 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/104 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/105 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/106 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/107 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/108 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/109 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/110 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/111 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/112 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/113 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/114 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/115 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/116 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/117 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/118 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/119 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/120 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/121 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/122 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/123 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/124 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/125 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/126 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/127 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/128 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/129 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/130 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/131 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/132 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/133 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/134 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/135 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/136 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/137 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/138 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/139 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/140 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/141 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/142 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/143 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/144 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/145 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/146 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/147 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/148 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/149 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/150 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/151 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/152 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/153 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/154 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/155 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/156 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/157 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/158 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/159 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/160 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/161 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/162 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/163 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/164 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/165 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/166 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/167 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/168 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/169 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/170 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/171 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/172 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/173 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/174 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/175 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/176 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/177 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/178 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/179 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/180 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/181 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/182 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/183 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/184 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/185 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/186 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/187 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/188 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/189 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/190 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/191 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/192 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/193 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/194 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/195 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/196 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/197 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/198 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/199 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/200 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/201 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/202 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/203 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/204 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/205 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/206 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/207 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/208 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/209 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/210 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/211 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/212 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/213 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/214 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/215 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/216 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/217 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/218

గీ.

అట్టి ముదిగొండ వంశ మహాంబునిధి హీ
మాంశుడై నట్టి శ్రీ సుబ్రహ్మణ్యశర్మ
ప్రథితమైనట్టి యుద్భటారాధ్యచరిత
మచ్చు వేయించె బుధ మనోహరముగాగ
ఆంధ్రశైవవాఙ్మయము విఖ్యాతిఁ జెంద.


మ.

సుకవిస్తుత్యరసైకనవ్యకవితాశ్లోకుండు నౌ రామలిం
గ కవీశుండు, కుమార భారతి, లసత్కావ్యక్రియారీతిమా
తృక గాఁగన్ రచియించినట్టి కృతియే శ్రీ యుద్భటారాధ్యదే
శికచారిత్రము వాంధ్రసాహితికి సంసేవ్యంబు గాకుండునే.

ఆంధ్రసాహిత్యచరిత్ర నవలోకించిన ముదిగొండ వంశీయులగు గురువులు మనకు చాలమంది ప్రస్తుతు లగుదురు - ఆధునికయుగమున కైలాసవాసులు శైవాగమపారావారపారీణులు మహోపాధ్యాయ ముదిగొండ నాగలింగ శివయోగి, శైవవాఙ్మయవిశారదులు ముదిగొండ వీరేశలింగ శాస్త్రిగారు మొదలగువారు గలరు. నేడు, శివయోగ, శైవసర్వస్వ గ్రంథకర్తలు పండిత ముదిగొండ కోటయ్యశాస్త్రిగారు, విద్వత్కవులు ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రిగారు, మధురకవి, ముదిగొండ వీరభద్రమూర్తిగారు ఉద్భటారాధ్యసంప్రదాయప్రవర్తకులై విలసిల్లుచున్నారు. ఇంకను వైద్యరాజులగు శ్రీ ముదిగొండ మల్లికార్జునరావుగారు మున్నగువారు, ఈ వంశమునకు కీర్తి దెచ్చుచున్నారు,

ముదిగొండ వంశీయుల చరిత్ర అను గ్రంథమున, నీ వంశీయుల సమగ్రవృత్తాంతము– ఆంధ్రదేశ రాజకీయ, సాహిత్య, సాంఘికరంగములలో వారు ప్రదర్శించిన విశేషములు - వివరముగా దెలుపనెంచితిని ఉద్భటారాధ్య వంశీయులైన మహినీయులందఱును నాయుద్యమమును సఫలీకృత మొనర్తురుగాక.

స్వాతంత్య్ర్యావతరణమైన వెనుక, నిట్టి శైవశాఖాచరిత్రము మనకున్నగాని, ఆంధ్రుల సంపూర్ణ సాంఘిక చరిత్ర మన కవగతము గాదు. ఈ దృష్టితో చూచిన పై గ్రంథమావశ్యకము.

ఈ ఉద్భటారాధ్యచరిత్రమున మొదటినుండియు ఆకరగ్రంథములను సమకూర్చి నాకు చేదోడు వాదోడుగామన్న నా పెద్దకుమారుడు చిరంజీవి శివసుందరేశ్వరునకు నా యాశీస్సులు.

సీ.

వీరశైవాచార విపుల ధర్మపథాను
                       వర్తి వీరన్న నూవంశగురుఁడు
ప్రథితమల్లమపల్లి వంశజి పార్వతీ
                       తరుణీమతల్లి నాతండ్రితల్లి
పార్ధివేశ్వర దివ్యపాదసేవకుఁడు సుతి
                       దర నామధేయుఁడు నాదుతండ్రి
సహజైకలింగనిష్ఠాపరతంత్రుండు
                       నాగయ్యయోగి దీక్షాగురుండు


గీ.

జననమే యా నియోగివంశమునగాని
బాల్యముననుండి శికభక్తిపరతచేత
అమలతర శైవసంప్రదాయములు దక్క
వేఱెఱుంగను పండితులార నేను.


23-8-73ఇట్లు
లక్ష్మీకాంతనిలయమునిడదవోలు వెంకటరావు
2-2-1187/5
క్రొత్తనల్లగుంట
హైదరాబాదు.44

  1. మాహిష్మతీ ముద్రాక్షరశాల-ముక్త్యాల - 1926. సరస్వతి-అను నీ పత్రికాధిపతులు శ్రీ రాజా వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాదు బహద్దరు - జయంతిపురం రాజావారు. ఇది 1923 - 1928 మధ్యనడచినది. ఇందే దగ్గుబల్లి దుగ్గన నాచికేతూపాఖ్యానము, అప్పన చారుచర్య మొదలగు ప్రాచీనకావ్యములు ప్రథమముగా ప్రకటితమైనవి. శ్రీ వేటూరివారి, తెలుగుదేశపు సంస్కృతకవులు అన్న వ్యాసములిందే ప్రకటితములై నవి. అవి తరువాత పునర్ముద్రితము కాలేదు. See diterary Journalism by N. Venkatarao, V.R. Narla Shashtyabdapurti Commemoration Volume History of Telugu Journalism (1968)